Jump to content

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/I

Wikibooks నుండి

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

I

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • I, pron. నేను;
  • iamb, n. పద్యంలో వచ్చే లగం అనే గణం; ఒక లఘువు, తరువాత ఒక గురువు ఉన్న గణం; (rel.) foot అంటే గణం; iamb అంటే లగం; line అంటే పాదం;
  • iambic pentameter, n. లఘువు, గురువు చొప్పున ఐదు వరుసగా వచ్చే పద్య పాదం; అయిదు లగాలు ఉన్న పద్య పాదం; (note) iambic pentameter is a metrical speech rhythm that is natural to the English language, and one that Shakespeare made use of; ex: EVery TIME we TALK, we STRING toGETHer ACCented and UNACCented SYLLables withOUT even THINKing aBOUT it;
  • iambus, n. లగం; ఛందస్సులో లఘువు వెంబడి గురువు ఉన్న గణం;
  • iatrogenic, adj. చికిత్సాజనిత;
    • iatrogenic disease, ph. వైద్యుడి వల్ల కాని, వైద్య సిబ్బంది వల్ల కాని కలుగజేయబడ్డ రుగ్మత; వైద్యం చెయ్యడం వల్ల వచ్చిన వ్యాధి;
  • ibex, n. స్కీను; మేషం; కాప్రా; హిమాలయాలలో ఉండే మేకని పోలిన జంతువు;
  • ibis, n. కంకణపు కొంగ; ఒక జాతి కొంగ; పొడవాటి ముక్కు చివర కిందికి తిరిగి ఉండడం ఐబిస్ ల ప్రత్యేకత; సైబీరియా ప్రాంతాలలోని విపరీతమైన చలికి తట్టుకోలేక ఈ పక్షులు చలికాలంలో దక్షిణభారత దేశానికి వలస వస్తుంటాయి;
    • American White Ibis, ph. అమెరికన్ తెల్ల కంకణపు కొంగ; [bio.] Eudocimus albus of the Threskiornithidae family;
    • black-headed ibis, ph. నల్ల తల కొంగ;
    • white ibis, ph. తెల్ల కంకణము; తెల్ల కంకణపు కొంగ; ఎర్ర కాళ్ళ కొంగ;
  • ice, n. మంచు; మంచుగడ్డ; హిమం; గడ్డమంచు;
    • ice age, ph. మంచు యుగం; హిమనీ యుగం;
    • ice apple, ph. తాటిముంజె;
    • ice cube, ph. మంచుముక్క; మంచుగడ్డ;
    • ice water, ph చల్లటి నీరు;
  • iceberg, n. సముద్రంలో తేలియాడు మంచుకొండ;
  • ichnology, n. జీవుల ఆనవాళ్లయిన బొరియలు, ఆవాసాలు, కాలి గుర్తులు, మలం లాంటివి కూడా శిలాజాలుగా మారతాయి. వీటిని ఇక్నో ఫాసిల్స్(Ichno fossils) లేదా Trace Fossils అంటారు. జాడ శిలాజాల శాస్త్రాన్ని ఇంగ్లీషులో ఇక్నోలజీ (Ichnology) అంటారు;
  • ichthyology, n. మత్స్య శాస్త్రం; మీను శాస్త్రం; మీన విజ్ఞానం; చేపల శాస్త్రం;
  • icicle, n. మంచుకాడ; పొడుగ్గా కాడ రూపంలో పేరుకున్న నీరు; సాధారణంగా చూరుల వెంబడి కారే నీరు గడ్డ కట్టి ఇలా తయారవుతుంది;
  • icon, n. (1) ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి; చిత్రకం; (2) గురుతు;
  • iconoclast, n. (1) విగ్రహాలని ధ్వంసం చేసే వ్యక్తి; (2) సంప్రదాయపు ఆచారాలని, సంస్థలని వ్యతిరేకించే వ్యక్తి; (ety.) Iconoclast came from two Greek words "eikon" and "klastes." In Greek, 'eikon' means 'image' and 'klastes' means 'breaker';
  • icosahedron, n. [math.] వింశతిముఖి; ఇరవై ముఖములు ఉన్న ఘన బహుముఖి;
  • idea, n. ఊహ; భావం; భావన; ఆలోచన; ఉద్దేశం; వెరవు; సాధనం; తలపు; స్ఫురితం; ఉపాయం; అవపారిక;
    • central idea, ph. ముఖ్యాంశం;
  • ideal, adj. ఆదర్శ;
    • ideal gas, ph. ఆదర్శ వాయువు; a hypothetical gas whose molecules occupy negligible space and have no interactions, and which consequently obeys the gas laws exactly;
  • ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం;
  • idealism, n. (1) ఆదర్శవాదం; భావవాదం; (2) ఒక తత్త్వం; మౌలికంగా “స్వయానుభవ ఆధ్యాత్మిక వాదం.” ఇది జ్ఞానానికి సంబంధించినది; అనగా, వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు (consciousness) మీదనే ఆధారపడి ఉంటుంది. అనగా, తన అనుభవంతో మేళవించినదే ప్రపంచం (సృష్టి) అని చెప్పేది. అనగా, స్థూల ప్రపంచం కల్ల, ఒక మాయ అని చెప్పేది. అనగా, బల్ల మీద పండు అక్కడ ఉందా, లేదా అనేది చూసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు కూలినప్పుడు పుట్టిన శబ్ద తరంగాలు ఒక చెవి లోని కర్ణభేరికి తగిలి అది ప్రకంపించి ఆ ప్రకంపనలు ఒక మెదడులోని శ్రవణ నాడీ కేంద్రాలని ఉత్తేజపరచినప్పుడు ఆ మెదడు చెప్పిన భాష్యమే శబ్దం. అనగా మెదడులోని చేతన (consciousness) ఏది చెబితే అదే మనకి ద్యోతకమవుతుంది కాని నిజంగా ప్రపంచం ఎలా ఉందో అన్నది "అజ్ఞేయం" (unknowable). జీవితం గానీ, లోకం గానీ ఆదర్శప్రాయంగా ఉండటం ఎలాగో చిత్రించి చెప్పే నిర్వచనం ఆదర్శవాదం; తన అనుభవంతో మేళవించినదే ప్రపంచమని చెప్పే సిద్ధాంతం కనుక స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదమని అనవచ్చు; స్థూల ప్రపంచము కల్ల యను వాదము; see also realism;
    • absolute idealism, ph. అఖండ ఆదర్శవాదం; అఖండ భావవాదం;
    • subjective idealism, ph. స్వీయాత్మక ఆదర్శవాదం; స్వీయాత్మక భావవాదం;
  • idealist, n. ఆదర్శవాది;
  • idealistic, adj. ఆదర్శ ప్రాయమైన; ఆదర్శవంత;
  • identical, adj. సర్వసమం; సర్వసమానం;
  • identification, n. (1) గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం; (2) తాదాత్మ్యం; సాయుజ్యం;
  • identify, v. t. (1) గుర్తుపట్టు; గుర్తించు; పోలిక పట్టు; పోల్తి పట్టు; (2) తాదాత్మ్యం చెందు;
  • identify, n. (1) సర్వసమానత్వం; తాదాత్మ్యం; ఏకత్వం; సర్వసమానత్వం; (2) తత్సమరాశి; (3) గుర్తు; (4) వైయక్తికత;
  • identity, n. గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం;
  • idiocy, n. (1) మూఢత్వం; వెర్రిబాగులతనం; (2) పిచ్చితనం; బుద్ధిమాంద్యం;
  • ideogram, n. చిత్రలిపి; భావలిపి; భాషతో నిమిత్తం లేకుండా ఒక భావాన్ని తెలిపే బొమ్మ;
ఈ బొమ్మలో కుక్క ముట్టె పిక్టోగ్రాము, ఎర్రటి వృత్తము, అడ్డు గీత ఇడియోగ్రాము
  • idiopathic, adj. తెలియని కారణం వల్ల; కారణరహితంగా;
  • idolatry, n. విగ్రహారాధన;
  • idiolect, n. వైయక్తిక వ్యావహారికం; వ్యక్తిపరమైన శైలీ భేదాల సంపుటి; (rel.) dialect;
  • idiom, n. జాతీయం; నుడికారం; పలుకుబడి; భాషీయం; భాషాసంప్రదాయం;
  • idiot, n. ఒక రకమైన బుద్ధిమాంద్యతతో పుట్టిన వ్యక్తి; mentally defective person with a mental age of not more than 35 months; imbecile and moron were more porous categories; see also stupid;
    • idiot savant, n. బుద్ధిమాంద్యతతో పుట్టినా ఒకే ఒక శాఖలో (ఉ. సంగీతంలో కాని, చిత్రకళలో కాని, గణితంలో కాని) విశేషమైన ప్రతిభ చూపించే వ్యక్తి;
  • idiosyncrasy, n. విలక్షణం; విలక్షణ స్వభావం; తిక్క; ఉలిపికట్టెతనం; చమత్కార స్వభావం;
  • idle, adj. సోమరి; అక్రియ; ఏ పనీ చెయ్యకుండా ఉన్న స్థితి;
  • idleness, n. సోమరితనం;
  • idler, n. సోమరి;
  • idol, n. ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి;
  • idolator, n. విగ్రహారాధకుడు;
  • if, conj. అయినచో; అయితే; ఇలా అయితే;
  • ifs and buts, ph. అయతే గియితేలు;
  • igneous, adj. అగ్నిక; అగ్నిజ; అగ్ని;
    • igneous rock, ph. అగ్నికశిల; అగ్నిశిల;
  • ignite, v. i. రాజుకొను; రగులుకొను; అంటుకొను;
  • ignite, v. t. రగుల్చు; రగిలించు; అంటించు; ముట్టించు; వెలిగించు; మండించుట;
  • ignition, n. రగుల్పాటు; రగుల్చుట; జ్వలనం; ప్రజ్వలనం;
    • ignition point, ph. జ్వలన స్థానం; జ్వలన బిందువు;
  • ignoble, adj. నీచమైన;
  • ignominy, n. అపకీర్తి; అప్రతిష్ఠ;
  • ignorance, n. అజ్ఞానం; అగ్రహణం; అవజ్ఞాతం; ఎరుకమి; తమస్సు; అవిద్య; అరయమి; తెలియమి; మరకువ; see also nescience;
    • ignorance is bliss, ph. అజ్ఞానమే ఆనందం;
  • ignore, v. i. విస్మరించు; ఉపేక్షించు; నిర్లక్ష్యం చేయు; ఆధారం లేదని ఒదిలిపెట్టు;
బెంగాలీ ఉడుం
  • iguana, n. పెద్ద ఉడుం; గోధిక; see also guana;
  • ileum, n. తుంటి ఎముక; కుండలిని; శేషాంత్రం;
  • ill-bred, adj. వెకిలి; మోటైన; సరి అయిన పెంపకం లేని;
  • illegal, adj. అక్రమమైన; చట్టవిరుద్ధమైన; వికర్మ; దొంగ;
    • illegal act, ph. అక్రమం; చట్టవిరుద్ధం; వికర్మం; అడ్డగోలు;
    • illegal construction, ph. అక్రమ నిర్మాణం; అడ్డగోలు కట్టడం;
    • illegal encroachment, ph. అక్రమ ఆక్రమణ; అడ్డగోలు ఆక్రమణ;
  • illegible, adj. అస్పష్టమైన; చదవడానికి స్పష్టత లేని; కొక్కిరి బిక్కిరి;
  • illegitimate, adj. చట్టవిరుద్ధమైన; జారజ;
    • illegitimate child, ph. చట్టవిరుద్ధమైన వివాహం వల్ల పుట్టిన బిడ్డ; జారజుడు;
  • Illiad, n. (ఇలియాడ్) ట్రాయ్ నగరపు యుద్ధం గురించి గ్రీకు మహాకవి హోమర్ రాసిన గ్రంథం;
  • ill-fated, adj. దుర్గతికీ పాలైన; అదృష్టం వక్రించిన; దైవోపహతులైన;
  • ill-health, n. అనారోగ్యం; నలత;
  • illicit, adj. నిషిద్ధమైన; చట్టవిరుద్ధమైన; దొంగ; దొంగచాటు;
    • illicit liquor, ph. దొంగ సారా;
  • illiteracy, n. నిరక్షరాస్యత; చదువనేర్చని;
  • illiterate, n. నిరక్షరాస్యుడు; చదవడం రాయడం తెలియని వాడు;
  • illness, n. నలత; సుస్తీ; అనారోగ్యం; అస్వస్థత; జబ్బు; రోగం; రుగ్మత; జాడ్యం; see also disease and sickness;
    • terminal illness, ph. అవసాన అస్వస్థత; ప్రాణం తీసే జబ్బు;
  • illogic, n. కుతర్కం;
  • illogical, adj. కుతర్కమైన; తర్కాభాసమైన;
  • ill-repute, n. అప్రతిష్ఠ;
  • ill-tempered, adj. కోపిష్టి; కోపదారి;
  • illuminate, v. t. ద్యోతించు; కాంతివంతం చేయు;
  • illuminated, adj. ద్యోతితం; జ్వలితం; కాంతివంతం చేయబడ్డ;
  • illuminating, adj. ఉద్దీపక;
    • illuminating power, ph. దీప్తి; ద్యోతక శక్తి; ఉద్దీపక శక్తి;
  • illumination, n. ఉద్దీపనం; వెలుగు; వెలుతురు; ప్రకాశం; ఉద్భాసం; ద్యోతకం; ద్యూతి; పొద్దు;
  • illusion, n. భ్రమ; భ్రాంతి; ఆరోపం; కనికట్టు; మాయ; మోళీ; ఇంద్రజాలం; illusions pertain to the mind and delusions pertain to a belief;
  • illustrated, adj. (1) సచిత్ర; (2) సోదాహరణ;
  • illustrative, adj. నిదర్శనాత్మక;
  • illustration, n. (1) బొమ్మ; చిత్రం; చిత్తరువు; (2) ఉదాహరణ; దృష్టాంతం; ఆఖ్యాయికం;
  • illustrious, adj. ఘనతకెక్కిన; ప్రఖ్యాత; ప్రముఖ; ప్రసిద్ధ;
  • ill-will, n. వైమనస్యం; వైరస్యం;
  • image, n. ప్రతిరూపం; ప్రతిబింబం; ప్రతిమ; ప్రతీక; బింబం; చిత్రం;
    • virtual image, ph. మిధ్యాబింబం; కాల్పనిక బింబం;
  • imagery, n. (1) బొమ్మకట్టుడు; పదచిత్రం; ప్రతీకాత్మకం; (2) ఉత్ప్రేక్ష; ఉత్ప్రేక్షాలంకారం;
    • concrete imagery, ph. మూర్త పదచిత్రం;
  • imaginary, adj. కాల్పనిక; కల్పిత; అసత్య; ఊహ్య; భావుక; భావకల్పిత; ఊహాత్మక;
    • imaginary axis, ph. కాల్పనిక అక్షం; భావుకాక్షం; ఊహాత్మక అక్షం; కల్పన అక్షం;
    • imaginary number, ph. కాల్పనిక అంకం; భావుకాంకం; ఊహాత్మక సంఖ్య; కల్పన సంఖ్య;
    • imaginary line, ph. ఊహాత్మక రేఖ; భావుక రేఖ; కల్పన రేఖ;
    • imaginary part, ph. కాల్పనిక భాగం;
  • imagination, n. ఊహ; ఊహాశక్తి; భావన; కల్పన; భావుకత్వం; కల్పనాశక్తి; ఊహాశీలత; ఉత్ప్రేక్ష;
  • imagine, v. i. భావించు; ఊహించు; అనుకో;
  • imagism, n. a type of poetic philosophy popularized by poets like Ezra Pound;
  • imbecile, n. బుద్ధిహీనుడు; మూఢుడు;
  • imbibe, v. t. తాగు; పీల్చు; సేవించు; ఆస్వాదించు;
  • imbue, v. t. నానబెట్టు; నాటు; మనస్సులో ఉంచుకొను;
  • imitate, v. t. అనుకరించు; పోలునట్లు చేయు; ప్రతిరూపం నిర్మించు;
  • imitation, adj. నకిలీ; దొంగ;
  • imitation, n. అనుకరణ; అనుకారం; అనుకృతి; నకిలీ; అనుసృజన;
  • immanent, adj. అంతర్భూతమైన; లోనున్న; అంతర్వ్యాప్తమైన; స్వాభావికమైన;
  • immanent, n. అంతర్యామి; అంతర్భూతుడు;
    • God is immanent, ph. దేవుడు సర్వాంతర్యామి; దేవుడు అన్నిటిలోను ఉన్నాడు;
  • immeasurable, adj. అప్రమేయ; అపరిగణనీయ; కొలవలేనంత; కొలతకు రాని;
  • immediate, adj. తక్షణ; వెంటనే; అవశ్య; సద్యో;
    • immediate address, ph. [comp.] తక్షణ విలాసం; సద్యో విలాసం;
  • immediately, adv. వెంటనే; తక్షణం; ఎకాయెకీ; సత్వరం; అవశ్యం: అప్పటికప్పుడు; అవ్యవధానంగా;
  • immense, adj. అపార;
  • immerse, v. i. మునుగు;
  • immerse, v. t. ముంచు;
  • immersion, n. ముంపు; నిమజ్జనం; పరిప్లుతం;
  • immigration, n. రావలస;
  • immobile, adj. స్థిరమైన; స్థావర; నిశ్చలమైన; అచల; అచర; కదలని; కదల్చలేని; ప్రచలిత;
    • immobile object, ph. స్థాణువు;
  • immodest, adj. సిగ్గులేని;
  • immolate, v. t. త్యాగం చేయు; అగ్ని ప్రవేశం చేయు;
  • immorality, n. దుర్నీతి; అవినీతి; వ్యభిచర్యం;
  • immortal, adj. అమర; అమర్త్య; చావులేని; నిత్య;
  • immortality, n. అమరత్వం; అమర్త్యం; నిత్యత్వం; చావులేకపోవడం;
  • immovable, adj. కదలని; కదల్చలేని; స్థావర; స్థిర; అచల;
    • immune response, ph. రక్షక ప్రతిస్పందన; రోగనిరోధక స్పందన;
    • immune system, ph. రక్షక వ్యవస్థ;
  • immunity, n. రోగ నిరోధక శక్తి; అసంక్రామ్యత; రక్షణ; రక్షకశక్తి; రక్షరేకు; అభయప్రదానం; శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే శక్తి;
    • herd immunity, ph. మంద రక్షణ; మంద రక్షకశక్తి; మంద రక్షరేకు; చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల మన శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే రోగ నిరోధక శక్తి;
  • immunization, n. అసంక్రమకరణం; అభయప్రదానం; రోగం సంక్రమించకుండా శరీరాన్ని పదిలపరచడం;
  • immutable, adj. మార్పుచెందని; మార్పులేని; స్థిరమైన;
  • impact, n. తాకిడి; ప్రభావం; అభిఘాతం;
    • impacted tooth, ph. అంతర్ఘటన దంతం; పూరిగా ఎదగకుండా ఇగుళ్లలోనే ఉండిపోయిన పన్ను;
  • impair, v. t. బలహీనపరచు; పాడుచేయు; చెడగొట్టు; విలువ తగ్గించు;
  • impart, v. t. ఇచ్చు; ఒసగు; అబ్బించు;
  • impartial, adj. సమశీల; నిష్పాక్షిక; పక్షపాత రహిత;
    • impartial person, ph. సమశీల వ్రతయుతుడు; పక్షపాత రహితుడు; నిష్పాక్షికుడు;
  • impassable, n. దుస్తరం; దాటరానిది; చొరరానిది;
  • impasse, n. (ఇంపేస్) కఠిన పరిస్థితి; విషమ స్థితి; దిగ్బంధ స్థితి; తప్పించుకోలేని పరిస్థితి;
  • impassioned, adj. ఉద్రేకముతోఁ గూడిన, మనస్సునకు తగులునట్లు చెప్పిన,
    • impassioned plea, ph. మనస్సునకు తగులునట్లు చెప్పిన విజ్ఞప్తి;
  • impatient, adj. ఓర్పులేని; సహనం లేని; ఆతురత;
  • impatience, n. ఆతురత; ఓరిమి లేకపోవడం; విసుగు; చిరాకు;
  • impatiens, n. సోకుడుముడుగు; రంగురంగుల పూలు పూసే ఒక రకం మొక్క; see touch-me-not; ok
  • impeach, v. t. అభిశంసించు; దోషారోపణ చేయు;
  • impeachment, n. అభిశంసన; దోషారోపణ;
  • impeccable, adj. మచ్చలేని; నిష్కళంకమైన; దోషం లేని; తప్పులెన్నరాని;
  • impede, v. t. అడ్డగించు; నిరోధించు; అవరోధించు;
  • impedance, n. (1) అవరోధకం; అవరోధం; అంకిలం; అర్గళం; క్లేశకం; స్తోభకం; స్తోభం; Impedance is the opposition by a system to the flow of energy from a source. For constant signals, this impedance can also be constant. For varying signals, it usually changes with frequency; (2) ప్రత్యావర్తక విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలిగించేది; In general, impedance (symbol: Z) has a complex value; this means that loads generally have a resistance component (symbol: R) which forms the real part and a reactance component (symbol: X) which forms the imaginary part;
  • impediment, n. ప్రతిబంధకం; ఆటంకం; అంకిలి; విఘాతం; అర్గళం; పురోగతికి పెద్ద దెబ్బ;
  • impel, v. t. ప్రేరేపించు; ముందుకు తోయు;
  • impeller, n. ప్రేరేపకి; ముందుకు తోసేది;
  • impending, adj. కాగల; జరగబోయే;
  • impenetrable, adj. చొరరాని; దుర్గమ; గహన;
  • imperative, adj. విధివాచక; ఆజ్ఞారూపక;
    • imperative language, ph. [comp.] విధాయక భాష; Any programming language that specifies explicit manipulation of the state of the computer system e.g. SQL ; Not to be confused with a procedural language, which specifies an explicit sequence of steps;
    • imperative mood, ph. [gram.] విద్యర్ధకం; విధివాచకం; ప్రార్థనార్ధకం; ఉభయ ప్రార్థనార్ధకం;
  • imperative, n. విధివాచకం; విధాయకం;
  • imperceptible, adj. ఇంద్రియగోచరం కాని;
  • imperfect, adj. అసంపూర్ణమైన; అసమాప్త; అసమగ్ర; లోపం ఉన్న; కొరత ఉన్న; లోపభూయిష్టమైన;
  • imperfection, n. లోపం; లోటు; తయారీలో వచ్చిన లోపం;
  • imperial, adj. సార్వభౌమత్వ; సామ్రాజ్యవాద;
  • imperialism, n. సామ్రాజ్యవాదం;
  • imperil, v. t. ఆపద కలిగించు;
  • imperishable, adj. నాశనం లేని; కుళ్ళని; పాడుకాని; నిల్వ చేసినా పాడు కాని;
  • impersonal, adj. అవ్యక్త; వ్యక్తి సంబంధం లేకుండా;
  • impervious, adj. అప్రవేశ్య; అభేద్యమైన; లోనికి చొరజాలని;
  • impetuousness, n. దురుసుతనం;
  • impish, adj. చిలిపి; తమాశాకి అల్లరి చేసే తత్త్వం;
  • implant, v. t. రోగి శరీరాన్ని వైద్యుడు కోసి లోపల మరొక వస్తువుని పెట్టడం;
  • implant, v. t. నాటు; విత్తు నాటు;
  • implement, n. పనిముట్టు; సరంజాము; సరకు;
  • implement, v. t. ఉపయోగించు; వాడు; వాడుకలో పెట్టు; అమలు చేయు; అమలు పరచు; ఆచరించు;
  • implementation, n. కార్యాచరణ; ఆచరణ; అమలు;
  • implication, n. అన్యాపదేశం: అంతస్సూచన; ధ్వనింపు;
  • implicit, adj. అవ్యక్త; అంతర్లీన; అంతర్గత; గర్భితమైన;
  • implore, v. t. ప్రార్థించు; బ్రతిమాలు; బుజ్జగించు; విన్నపం చేసుకొను; విన్నవించుకొను;
  • implosion, n. అంతస్పోటనం;
  • imply, v. t. భావమునిచ్చు; ధ్వనించు;
  • import, n. (1) దిగుమతి; (2) అంతర్భావం;
    • import of a sentence, ph. వాక్యం యొక్క అంతర్భావం;
  • importance, n. ప్రాముఖ్యం; ప్రాధాన్యం;
  • important, adj. ముఖ్యమైన; ప్రధానమైన; మేటైన;
    • important person, ph. ముఖ్యుడు; మేటరి; ప్రెగడ;
  • imported, adj. సీమ; కిరానా; దిగుమతి చేసికొన్న;
    • imported stuff, ph. సీమ సరుకు; కిరానా సామాను;
  • impose, v. t. ఇబ్బంది కలిగించు; పిలవని పేరంటం వలె వచ్చు; శిక్షించు;
  • imposition, n. ఇబ్బంది; పిలవని పేరంటం; శిక్ష;
  • impossible, adj. అసంభవమైన; అసాధ్యమైన; దుస్సాధ్యమైన; వల్లమాలిన;
  • impossible, n. అసంభవం; అసాధ్యం; దుస్సాధ్యం; మృగ్యం;
  • impostor, n. మరొకరివలె నటించేవాడు; దొంగ; మోసగాడు; దగుల్బాజీ;
  • impotence, n. నపుంసకత్వం; నిర్వీర్యత్వం; పుంసత్వలోపం; ధ్వజభంగం; పిరికితనం; క్లెబ్యం;
  • impotency, n. ధ్వజభంగం; నపుంసకత్వం; నిర్వీర్యత్వం; క్లీబ్యం;
  • impotent, adj. నిర్వీర్యం; శక్తిహీనం; బలహీనం;
    • impotent person, ph. నిర్వీర్యుడు; ఖొజ్జా; పేడి;
  • impound, v. t. దాచిపెట్టు; బంధించు; సామానులని అటకాయించి బంధించు;
  • impoverish, v. t. దారిద్య్రం కలిగించు; శక్తిహీనం చేయు; క్షీణింపజేయు;
  • impractical, adj. అఘటిత;
  • imprecate, v. t. శపించు;
  • impregnate, v. t. సిక్తం చేయు; నింపు; గర్భం కలిగించు; గర్భాదారణ చేయు;
  • impress, v. i. నచ్చుకొను;
  • impress, v. t. ముద్ర వేయు; మనస్సుకి హత్తుకునేటట్లు చేయు; మంచి అభిప్రాయం కలుగజేయు;
  • impressed, adj. ముద్ర వేయు; ముద్రాంకిత; నిహిత; నచ్చు; మంచి అభిప్రాయం కలుగు;
    • impressed force, ph. నిహిత బలం;
  • impression, n. (1) ముద్ర; ముద్రణ; గురుతు; (2) ముద్రాంకితం; వాసన; సంస్కారం; (3) అభిప్రాయం; భావముద్ర; భావం;
    • positive impression, ph. ఆదరణ భావం;
  • impressionistic, adj. అనుభూతాత్మక;
    • impressionistic painting, ph. అనుభూతాత్మక వర్ణచిత్రం;
  • imprint, n. ముద్ర; గుర్తు; అచ్చు; చిహ్నం;
  • imprinting, n. మనోముద్రణ; జంతువులలో పిల్ల మనోఫలకం మీద తల్లిదండ్రుల ముద్ర పడటం;
  • imprisonment, n. నిర్భంధం; కారాగార శిక్ష; ఖైదులో పెట్టడం;
  • improbable, adj. అసంభవమైన; అసంభావ్యమైన; సత్యదూరమైన;
  • improper, adj. అనుచిత; అపసవ్య; తగని; అక్రమ; అపక్రమ; విషమ;
    • improper fraction, ph. అపక్రమ భిన్నం;
  • improper, n. అనుచితం; తగనిది; అక్రమమైనది;
  • improve, v. t. బాగుపరచు; అభివృద్ధి చేయు; పురడించు;
  • improved, adj. మెరుగుపరచబడ్డ; పురడించిన;
  • improvement, n. అభివృద్ధి; మెరుగుదల; బాగుపడడం;
  • improvisation, n. మనోధర్మం; ఆశువుగా ప్రామాణికమైన సంగీతానికి చిలవలు, పలవలు చెక్కడం; ముందుగా తయారవకుండా అక్కడికక్కడ కల్పించి ప్రదర్శించడం; అభివృద్దీకరణ;
  • improvise, v. t. మనోధర్మం చేయు; ఆశువుగా విద్యని ప్రదర్శించు; ముందుగా తయారవకుండా అక్కడిక్కడ కల్పించి ప్రదర్శించు;
  • impudence, n. (1) నీలుగడం; అమర్యాదకరమైన ప్రవర్తన; (2) సిగ్గు లేకపోవడం;
  • impulse, n. ప్రచోదనం; సంవేగం;
  • impulsive, adj. సంవేగ;
    • impulsive force, ph. సంవేగ బలం;
    • impulsive pressure, ph. సంవేగ పీడనం;
  • impure, adj. కల్తీ; అశుద్ధ; అవిశుద్ధి; స్వచ్ఛం కాని; ములుకువ;
  • impurity, n. అశౌచం; కల్మషం; అపరిశుద్ధం; కల్తీ పదార్థం;
  • imputation, n. అపవాదు; ఆరోపణ;
  • inability, n. అశక్తత; సమర్ధత లేకపోవడం;
  • in absentia, adv. పరోక్షంగా; గైరుహాజరులో;
  • inaccurate, adj. సరికాని; ఖరారు కాని; తప్పు అయిన;
  • inadequacy, n. చాలమి; కొరత; అసమగ్రత;
  • inadequate, adj. సరిపోని; చాలని; కొరవడిన; అసమగ్ర;
  • inadvertently, adv. ఏమరుపాటున; పరాకుగా; అనుకోకుండా; అనవధానంగా;
  • inanimate, adj. అచర; స్థిర; చలనం లేని; ప్రాణం లేని;
  • inapplicable, n. అవర్తితం; వర్తించనిది; పొసగనిది; ఉపయోగించనిది;
  • inappropriate, adj. సరికాని; అసందర్భ; అసమంజస; అక్రమమైన; తగని; అయుక్త; యుక్తముకాని;
  • inappropriate expenditure, ph. అక్రమ వ్యయం; యుక్తముకాని ఖర్చు;
  • inappropriate income, ph. అక్రమ ఆర్జన;
  • inattention, n. ఏమరుపాటు; అనవధానం; పరధ్యానం;
  • inauguration, n. ప్రారంభోత్సవం; అంకురార్పణం; స్నాతకం; స్నాతకోత్సవం;
  • inauspicious, adj. అమంగళ; అశుభ;
  • inborn, adj. సహజమైన; జన్మసిద్ధ; పుట్టుకతో వచ్చిన; స్వాభావిక;
  • in-camera, adv. [legal] చాటుగా; రహస్యంగా; గదిలో
  • incandescence, n. తాపదీప్తి;
  • incandescent, adj. తాపదీప్త; వేడి చేత వెలుగు పుట్టించే;
  • incantation, n. అభిచారం; మంత్రం;
  • incarcerate, v. t. ఖైదులో పెట్టు; బంధించు;
  • incapability, n. అసమర్ధత;
  • incarnation, n. అవతారం;
  • incendiary, adj. ఇళ్ళని కాల్చే స్తోమత గల;
  • incense, v. i. కోపోద్దీపమగు;
  • incense, n. సుగంధ ద్రవ్యం; ధూపం;
    • incense stick, n. అగరువత్తి;
  • incentive, n. ప్రచోదనం; ప్రోత్సాహకం; ఉసి కోల్పేది; ప్రేరేపకం; ప్రేరకం;
  • inception, n. ప్రారంభం;
  • incessant, adj. ఎడతెగని; నిరాఘాటంగా; అనవతరంగా;
  • incest, n. వావిడికము; వావివరసతప్పడము; అగమ్యాగమనము; ఒకే కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధం; వివాహము కూడని వరుస (వావి) గలవారితోడి వ్యభిచారము;
  • inch, n. అంగుళం;
  • inch, v. i. నెమ్మదిగా జరుగు;
  • incident, adj. పతన;
    • incident angle, ph. పతన కోణం;
    • incident light, ph. పతన కాంతి;
    • incident ray, ph. పతన కిరణం;
  • incident, n. సంఘటన;
  • incidental, n. ఆగంతుకం; అప్రధానం; అనుషంగికం;
  • incidental, adj. అనుషంగిక; అప్రధాన; ప్రధాన కార్యక్రమంతోపాటు, అప్రయత్నంగా జరిగిన; (అనగా, ప్రమాదవశాత్తూ కాదు);
  • incidentally, adv. అనుషంగికంగా; (see also) accidentally;
  • incineration, n. భస్మీకరణం;
  • incinerator, n. భస్మి; భస్మం చేసే ఉపకరణం;
  • incipit, n. ప్రారంభ వాక్యం; కథన ప్రారంభం;
  • incision, n. కోత; గంటు; నాటు;
  • incisors, n. కుంతలాలు; కొరకడానికి వాడే పళ్ళు; the front teeth present in most mammals;
  • incite, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రేరేపించు; ఉసికొలుపు; ఉత్తేజపరచు;
  • inclement, adj. పాడుగా ఉన్న; జడివాన, తుపాను మొదలైన పరిస్థితుల వల్ల పాడుపడిన;
  • inclination, n. (1) అభిమతం; అభిరుచి; చిత్తవృత్తి; (2) అభిలాష; ఉబలాటం; (3) వాలు; మొగ్గు; నతి;
  • incline, n. వాలు; ఆస్థ; తటం;
  • inclined, adj. వాలు; వాలిన; మొగ్గిన; దోర; తొంగలి; నత;
    • inclined plane, ph. వాలు తలం; దోర తలం; మొగ్గుబల్ల; తొంగలి బల్ల; ఆస్థ ఫలకం;
  • incognito, n. ఇతరులకి దొరకకుండా తప్పించుకోగల జ్ఞానం; మారువేషం;
  • incoherent, adj. అసంబద్ధమైన; పొంతనలేని; అకటవికటమైన; అసంగతమైన;
  • income, n. ఆదాయం; ఆయము; రాబడి; వచ్చుబడి; వరుమానం; సంపాదన; (rel.) earnings;
    • low-income, ph. అల్పాదాయం;
    • net income, ph. నికరాదాయం;
    • income tax, ph. ఆదాయపు పన్ను; రాబడి పన్ను;
  • incomparable, adj. సాటిలేని; అనన్య సామాన్యమైన; అసదృశమైన; అసమానమైన; నిరుపమాన;
  • incompatible, adj. సామరస్యం లేని; అసంగతమైన; పొసగని;
  • incompetence, n. అప్రయోజకత్వం; అసమర్ధత;
  • incomplete, adj. అర్ధాంతర; అసంపూర్ణ; అరకొర; అసమగ్ర;
  • incomplete, n. అసంపూర్ణం; అర్ధాంతరం;
  • incomprehensible, n. అప్రమేయం; దుర్‌గ్రాహ్యం; అవిజ్ఞేయం;
  • inconceivable, n. అచింత్యం; ఊహించడానికి కూడా వీలు లేని;
  • incongruity, n. అసంగతత్త్వం;
  • inconsequential, adj. ఆషామాషీ;
  • inconsiderate person, ph. అసమీక్ష్యకారి;
  • inconsistency, n. వైరుధ్యం; పరస్పర వైరుధ్యం;
  • inconsistent, adj. అసంగతమైన; అసంబద్ధమైన; పరస్పర విరుద్ధమైన;
  • incontinent, n. మల మూత్ర విసర్జనలపై పట్టు తప్పటం;
  • incontrovertible, adj. తిరుగులేని; నిరాక్షేపమైన; నిర్వివాదమైన; రూఢియైన; నిస్సందేహ; చర్చకు అవకాశంలేని;
  • inconvenience, n. ఇబ్బంది;
  • inconvenient, n. ప్రతికూలం; (ant.) అనుకూలం;
  • incorporate, v. t. సంస్థీకరించు; వ్యవస్థీకరించు;
  • incorporation, n. సంస్థ; వ్యవస్థాపన;
  • incorporation, v. t. సంస్థాపన;
  • incorrigible, adj. మూర్ఖ; మొండి;
  • increase, v. i. ఎసరు; ఎసరేగు; ఎసలారు;
  • increase, v. t. పెంచు; ఎక్కువ చేయు; ఎక్కించు;
  • incredible, adj. నమ్మశక్యంకాని; వింతైన; విడ్డూరమైన; అపురూపమైన;
  • incredulous, adj. నమ్మతగని; నమ్మరాని;
  • increment, n. (1) పెరుగుదల; (2) జీతంలో పెరుగుదల;
  • incriminate, v. t. నేరారోపణ చేయు; అభియోగించు;
  • incrimination, n. నేరారోపణ; అభియోగం;
  • incubation, n. పొదుగుట; ఉద్భూతం; డింభోషణం;
    • incubation period, ph. ఉద్భూత కాలం; డింభోషణ కాలం;
    • incubation period of a disease, ph. రోగం యొక్క ఉద్భూత కాలం; రోగోద్భూత కాలం;
  • incubator, n. పొదుగుపెట్టె; డింభోషణి;
  • incubus, n. ఆడదానితో రతిని కాంక్షించే మగ దయ్యం; (ant.) succubus;
  • incur, v. t. పొందు; పడు;
  • incus, n. రదనికాస్తి; మధ్య చెవిలో ఉన్న ఒక చిన్న ఎముక;
  • indebted, adj. రుణపడియుండు; రుణగ్రస్తమైయుండు; అప్పుపడి ఉండు;
  • indeed, inter. అలాగా;
  • indefinite, adj. అస్పష్టమైన; అపారమైన; అనిర్దిష్ట;
  • indefinable, adj. అనిర్వచనీయ;
  • indelible, adj. చెరగని;
  • indemnity, n. (1) నష్టపరిహారం; (2) a contractual agreement between two parties;
  • indentation, n. (1) లోత్త; (2) గంటు; పేరా మొదటి వరసని మార్జిన్ నుండి దూరంగా జరిపి రాయడం;
  • indenture, n. ఒడంబడిక; ఒప్పందం; ఖరారునామా; ముచ్చిలికా;
    • indentured labor, ph. ఒప్పందపు కూలి; ముచ్చిలకా దాస్యం;
  • independent, adj. స్వతంత్ర; నిరాలంబ;
  • independence, n. స్వతంత్రం; నిరాలంబం;
  • indestructible, adj. అవ్యయ;
  • indestructible, n. అవ్యయం;
  • indeterminate, adj. అనిర్దిష్ట;
  • index, n. సూచిక; పదపట్టిక; అనుక్రమణిక; పదసూచి; చింతామణి; ఒక పుస్తకంలోని ముఖ్యమైన మాటలు ఏయే పుటలలో కనిపిస్తాయో చెప్పే సూచిక; సాధారణంగా ఈ సూచిక పుస్తకం చివర ఉంటుంది;
    • index finger, ph. తర్జని; చూపుడువేలు;
    • index register, ph. [comp.] సూచిక పల్టీపేరు; తర్జని పల్టీపేరు;
  • India, n. భారతదేశం; ఇండియా;
    • India ink, ph. త్వరగా ఆరే (నల్ల) సిరా; భారతీయులలా నల్లగా ఉంటుందని మొదట్లో ఈ సిరాకి ఈ పేరు పెట్టారు, బ్రిటీష్‌వారు. దరిమిలా ఈ రకం సిరాని అన్ని రకాల రంగులలోనూ చేస్తున్నారు. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు ఈ పేరు మాత్రం మిగిలింది.
    • India rubber, ph. సందర్షిణి; same as natural rubber; [bot.] Hevea brasiliensis;
  • Indian, adj. భారత్; భారతీయ; భారతదేశానికి సంబంధించిన; ఇండియా ఉపఖండానికి సంబంధించిన;
    • Indian aconite, ph. నాభి;
    • Indian airspace, ph. భారతీయ గగనతలం;
    • Indian aloe, n. ph. కలబంద;
    • Indian beech, n. ph. కానుగ; [bot.] Millettia pinnata, Pongamia pinnata;
    • Indian birthwort, ph. ఈశ్వర వేరు;
    • Indian butter tree, ph. ఇప్పచెట్టు;
    • Indian coral, ph. పారిజాతం;
    • Indian gum arabic, ph. తుమ్మ;
    • Indian jalap, ph. తెగడ చెట్టు;
    • Indian kino, ph. వేగిస చెట్టు;
    • Indian lilac, ph. తురక వేప చెట్టు;
    • Indian mulberry, ph. మద్ది;
    • Indian olibanum, ph. పరంగి సాంబ్రాణి;
    • Indian pennywort, ph. బ్రహ్మీ మొక్క;
    • Indian spikenard, n. జటామాంసి; [bot.] Nardostachys jatamansi of the Valerian family;
    • Indian spinach, ph. బచ్చలి;
    • Indian Subcontinent, ph. ఇండియా ఉపఖంఢం; ఈ ఉపఖండంలో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక; భూటాన్, పాకిస్తాన్, మయాన్‌మార్, హిందూ మహాసముద్రంలోని చిల్లర దీవులు ఉన్నాయి;
  • Indian, n. m. భారతీయుడు;
  • Indian-ness, n. భారతాత్మ;
  • indicate, v. t. సూచించు;
  • indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం;
    • indicator function, ph. స్పోరక ప్రమేయం;
    • indicator of depth, ph. దఘ్నార్థకం; లోతుసూచిక;
    • indicator of direction, ph. దిక్సూచి;
    • indicator of meaning, ph. భావార్థకం; భావసూచిక;
    • indicator of plural, ph. బహువచన స్పోరకం;
    • indicator of size, ph. పరిమాణార్థకం;
  • indictment, n. నేరారోపణం;
  • indifference, n. ఉపేక్ష; ముభావం; ఉదాసీనత;
  • indigenous, adj. దేశవాళీ; స్వదేశీ; దేశీయ;
  • indigestion, n. అజీర్ణం; అగ్నిమాంద్యం; అజీర్తి;
  • indignation, n. రోషం; ఆగ్రహం; కోపం;
  • indigo, n. నీలిమందు; ಅవిరి;
    • indigo plant, ph. నీలిమొక్క; రంజని; నీలిగోరింట; మధుపర్ణిక; అవిరి;
  • indirect, adj. పరోక్ష; అపసవ్య;
  • indirectly, adv. చూచావాచాయగా; పరభారిగా;
  • indiscreet, adj. విచక్షణారహిత; ఆలోచనలేని; అనాలోచిత;
  • indiscriminately, adv. విచక్షణా రహితంగా;
  • indispensable, adj. అనివార్య; ఆవశ్యక; అపరిహార్య; తప్పనిసరి అయిన;
  • indisposed, adj. అస్వస్థ; విముఖ;
  • indisputable, n. నిర్వివాదాంశం;
  • indistinct, adj. అస్వచ్ఛం;
  • Indium, n. ఇండియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 99, సంక్షిప్త నామం, In); (ety.) from the indigo blue spectral line; has nothing to do with India;
  • individual, adj. వ్యష్టి; వైయక్తిక; ప్రత్యక్‍;
  • individual, n. (1) వ్యక్తి; ఆసామీ; నఫరు; (2) వైయక్తికం;
    • individual incidents, ph. వ్యష్టి సంఘటనలు; వైయక్తిక సంఘటనలు;
    • individual souls, ph. ప్రత్యగాత్మలు;
  • individualistic, adj. వ్యక్తివాద;
  • individuality, n. వ్యక్తిత్వం; వైయుక్తికత;
  • individualization, n. వ్యష్టీకరించడం;
  • individually, adv. నఫరుగతిగా;
  • Indo-Aryan, adj. హిందార్వ; ఔత్తరాహ;
  • indoctrinate, v. t. బోధించు; బోధచేయు; బలాత్కారంగా సమ్మతింపజేయు;
  • indoctrination, n. బోధ;
  • indolent, n. మొండి;
  • indolence, n. సోమరితనం; బద్ధకం;
  • induce, v. t. ప్రేరేపించు; ప్రోత్సహించు; ఉన్ముఖుని చేయు; ప్రలోభపెట్టు;
  • induced, adj. ప్రేరిత; ప్రలోభిత;
    • induced current, ph. ప్రేరిత ప్రవాహం;
  • inducement, n. ప్రేరణ; ప్రోత్సాహం;
  • induction, n. (1) అర్థాపత్తి; ఆగమనం; నిగమనం; వ్యష్టి సంఘటనల పరంపర నుండి సాధారణ సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతే ఆగమనం; (ant.) deduction; (2) ప్రేరేపణ; ప్రేరణ; ప్రలోభం;
    • induction coil, ph. ప్రేరణ తీగచుట్ట;
    • induction cooking, ph. Induction cooking uses an electromagnetic field that transfers currents directly to the cookware placed on a glass surface. The heat is created from within the cookware itself; as soon as you remove it from a burner, the heating stops.
    • induction method, ph. ఆగమన పద్ధతి; a mathematical technique used to prove a statement is true for all positive integers by showing it holds for the first case (base case) and then demonstrating that if it's true for any given number, it must also be true for the next number (inductive step), essentially proving it for all;
    • induction motor, ph. ప్రేరక చాలకం; ప్రేరక చాలక యంత్రం; an electric motor that uses alternating current (AC), propelled by a magnetic field that rotates. They comprise a rotor, a stator, and coils that convert electrical energy into mechanical energy using electromagnetic induction.
  • indulge, v. i. అనుభవించు;
  • industrial, adj. పారిశ్రామిక;
    • industrial chemistry, ph. పారిశ్రామిక రసాయనం;
    • industrial estate, ph. పారిశ్రామిక వాడ;
    • industrial revolution, ph. పారిశ్రామిక విప్లవం;
    • industrial wastes, ph. పారిశ్రామిక వ్యర్ధాలు;
  • industrialist, n. పారిశ్రామికుడు; పారిశ్రామికవేత్త;
  • industrialization, n. పారిశ్రామికీకరణం; పరిశ్రమల విస్తరణ;
  • industrious, adj. శ్రమించెడు;
  • industry, n. శ్రమ; పరిశ్రమ;
  • inedible, adj. అఖాదీ; తినడానికి పనికిరాని;
    • inedible oil, ph. అఖాదీ తైలం;
    • ineffable, adj. వర్ణనకి లొంగని; వర్ణింఫశక్యముకాని; వాచామగోచరమైన; అనిర్వచనీయమైన; చెప్పనలవికాని;
  • ineffectual, n. వ్యర్థం;
  • inelastic, adj. అస్థితిస్థాపక; స్థితిస్థాపక రహిత; స్థితిస్థాపకత లేని;
  • inept, adj. అప్రయోజక; చతురత లేని; నైపుణ్యం లేని;
  • inert, adj. జడ; స్తబ్ధ; మంద; అచేతన; తామసిక;
    • inert gas, ph. జడ వాయువు; మందవాయువు; స్తబ్దవాయువు;
  • inequality, n. వైషమ్యం;
  • inertia, n. జడత్వం; జడత; జడిమ; స్తబ్ధత; తమస్సు;
  • inertial, adj. జడత్వ;
    • inertial frame, ph. జడత్వ చట్రం;
    • inertial frame of reference, ph. ప్రమాణ జడత్వ చట్రం;
    • inertial mass, ph. జడత్వ గురుత్వం; తామస గురుత్వం;
  • inestimable, adj. అగణ్య;
  • inequality, n. అసమానత్వం; విసమీకరణం; వైషమం; న్యూనాధిక్యత;
  • inequity, n. అసమానత; ప్రతిసమం;
  • inevitable, n. నియతం; అనివార్యం; విధాయకం;
  • inexhaustible, adj. అవ్యయ; అవ్యయమైన;
  • inexhaustible, n. అవ్యయం;
  • inexpensive, n. అగ్గువ; చవుక;
  • infallible, n. అచ్యుతం; తప్పుకి అతీతం;
  • infamy, n. అపకీర్తి; అప్రతిష్ఠ; దుర్యశం;
  • infancy, n. శైశవం; శైశవావస్థ; పసితనం;
  • infant, adj. శిశు; శైశవ;
  • infant, n. శిశువు; పసిబిడ్డ; పసికందు; నెత్తురుకందు; నెలకూన; చిరుత; బుడుత; బొట్టె; కిశోరం;కందు; పసివాడు; ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శైశవ దశ;
  • infanticide, n. శిశుమేధం; శిశుహత్య;
  • infantry, n. కాల్బలం; పదాతిబలం;
  • infarct, n. ప్రాణరహిత కణజాలం; శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోయిన భాగం;
  • infarction, n. కణజాల మరణం; శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం;
    • coronary infarction, ph. గుండెలోని కండరాలకి రక్తపు సరఫరా లేక కొద్ది మేర కణజాలం చచ్చిపోవడం;
  • infatuation, n. మోహం; చిత్తమోహం; వ్యామోహం; మూఢ ప్రేమ; అభినివేశం; తేలగింపు;
  • infect, v. t. సూక్ష్మజీవులని శరీరంలో చొరబడేట్టు చేసి రోగం కలిగించడం;
  • infection, n. తిష్ట; తిష్ట రోగం; లాతికణావేశం; అన్యకణావేశం; సోకుడు; అంటునలత; జాడ్యం; సూక్ష్మజీవులు శరీరంలో చొరబడి ఒక చోట స్థావరం ఏర్పరచుకోవడం; see also infestation;
    • vaginal infection, ph. యోని తిష్ట;
  • infectious, adj. తిష్ట; సంక్రామిక;,
    • infectious disease, ph. తిష్ట రోగం; సంక్రామిక రోగం; అంటునలత;
  • inference, n. అనుమాన ప్రమాణం; అనుమితి; అనుభావనము; అర్థాపత్తి; ఉత్తరపక్షం; గ్రాహ్యం; ఒక అంశం నుండి గ్రహించే సారాంశం, ఆకళింపు,
    • inference engine, ph. అనుమితి సాధకం;
    • inference rule, ph. అనుమితి నియమం;
  • inferior, adj. చవకబారు; తీసికట్టు; తక్కువైన; నీచ; నీచమైన; కింది; బీడు; అల్కా; హీన; అధో; కీత; న్యూన; అవాచీ; అవద్య;
    • inferior land, ph. కీతనేల;
    • inferior vena cava. ph. అధోబృహత్సిర; the large vein that returns blood from the legs and abdomen to the heart;
  • inferiority, n. న్యూనత; లోకువ; హీనత; అప్రధాన్యత;
    • inferiority complex, ph. ఆత్మన్యూనతా శంక; ఆత్మన్యూనతా భావం;
  • infertile, adj. నిస్సారమైన; పండని; గొడ్డు;
  • infestation, n. సూక్ష్మజీవులు, పరభుక్కులు జీవి ఉపరితలం మీద స్థావరం ఏర్పరచుకోవడం; see also infection;36.
  • infidelity, n. అవిశ్వాసం;
    • conjugal infidelity, ph. వ్యభిచారం;
  • infinite, adj. అనంతమైన; అనంత; అపరిమిత; అంతూ దరీ లేని;
    • infinite regress, ph. అనవస్థా దోషం; ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట.
    • infinite series, ph. అనంత శ్రేణి;
  • infinitesimal, adj. అత్యంత;
    • infinitesimal calculus, ph. అత్యంత కలనం;
  • infinitive, n. తుమర్థం; తుమున్నర్థకం; క్రియ యొక్క సామాన్య రూపం; క్రియ యొక్క దాత్వర్ధక రూపం; ఇంగ్లీషులో సాధారణంగా ఏ క్రియకైనా ముందు to చేర్చితే అది infinitive రూపం అవుతుంది; ఉదా: to love, to eat, to run, to believe, to follow, to laugh, to stare, to wonder.
  • infinity, n. అనంతం; దిగంతం; మహత్తు; అంతులేనిది;
  • infirmary, n. ఆసుపత్రి;
  • infirmity, n. అశక్తి; నిస్త్రాణ; నలత; సుస్తీ;
  • infix, adj. మధ్యలో వేసిన; మధ్యలో వచ్చే;
  • inflammable, adj. జ్వలనశీలమైన; మండే గుణం కల; మండే;
  • inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
  • inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
  • inflate, v. t. ఊదు; గాలితో నింపు;
  • inflation, n. ద్రవ్యోల్బణం; దివాలేషం; డబ్బు సరఫరా ఎక్కువవడం వల్ల వస్తువుల ధరలు, చాకిరీల ధరలు అదేపనిగా పెరుగుతూ పోవడం; దివాలేషం అంటే కరువు కాదు. కరువు రోజులలో ధరలు పెరగడానికి కారణం వస్తువులు దొరకక పోవడం;
  • inflection, n. [gram.] రూపభేదం; (note) his is an inflection of he; ఇంటి is an inflection of ఇల్లు;
  • inflow, n. ఆన;
  • influence, n. ప్రభావం; ప్రభ; ప్రాబల్యం; పలుకుబడి; మాట చెల్లుబడి;
  • influence, v. t. ప్రభావితం చేయు;
  • influenza, n. ఫ్లూ; విషపడిశం;
  • inform, v. t. తెలియజేయు; (rel.) tell;
  • informal, adj. అనియత;
    • informal education, ph. అనియత విద్య;
  • information, n. సమాచారం; వార్త; విశేషం; వక్కాణం; తెలిమానం;
    • information highway, n. సరదా; సమాచార రహదారి; సమాపథం; సమాచార మహాపథం;
    • information theory, n. సమాచార సిద్ధాంతం;
    • informed sources, ph. అభిజ్ఞ వర్గాలు;
  • informer, n. వేగులవాడు; ఆచూకీదారు;
  • infra, adj. అధో; నీచ; తక్కువ; కింద;
  • infraction, n. అతిక్రమణ;
  • infrared, adj. అథోలోహిత; అత్యారుణ; పరారుణ;
    • far infrared, ph. దూర పరారుణ;
  • infrastructural, adj. ఉపనిర్మాణ;
  • infrastructure, n. అవస్థాపన సౌకర్యాలు; ఉపనిర్మాణం; ఉపకరణ సౌకర్యాలు;
  • infringement, n. అతిక్రమణం; ఉల్లంఘనం;
  • in good faith, ph. విశ్వాసంతో; నమ్మకంతో;
  • ingenious, adj., అబిరుచి చూపించు; తెలివయిన; ఊహాశక్తితో నిండిన;
  • ingenuous, adj., అమాయకమయిన; నిగర్వమయిన; దర్పములేని;
  • ingot, n. పాళా; లోహపు కడ్డీ;
  • ingrained, adj. అస్థిగతమైన; గట్టిగా పట్టిన;
  • ingredients, n. pl. అంశములు; ఘటకద్రవ్యములు; ఘటకాంశాలు; అంగములు; సంబారాలు; సరంజామా; ఒక అంశాన్ని తయారు చెయ్యడానికి కావలసిన వస్తువులు;
  • ingress, n. లోనికి పోయే దారి;
  • inhabit, v. i. నివసించు; అధివసించు;
  • inhabitant, n. నివాసి; వాస్తవ్యుడు; సాకీను;
  • inhabited, adj. జనసంకీర్ణ;
  • inhalation, n. ఉచ్ఛ్వాసం; పూరకం;
  • inhalation and exhalation, ph. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు; పూరక రేచకాలు;
  • inhale, v. i. ఎగపీల్చు;
  • inherent, adj. స్వతస్సిద్ధమైన; స్వాభావికమైన; ప్రాకృతిక; స్వయంసిద్ధ; సిద్ధం;
  • inheritance, n. వారసత్వం; వంశానుగతం; పారంపర్యం; ఉత్తరాధికారం; మిరాసి; దాయభాగం; దాయం; తల్లిదండ్రులనుండి పిల్లలకి సంక్రమించే సొత్తు;
  • inhibitory, adj. నియామక;
  • inhospitable, adj. నిరాదరణ;
  • inhuman, adj. అమానుష;
  • inhumane, n. అమానుషం;
  • inhumanely, adv. అమానుషంగా;
  • inimitable, adj. సాటిలేని;
  • initial, adj. ఆరంభ; ప్రథమ; మొదటి; ముక్తాయి;
    • initial condition, ph. ప్రారంభ పరిస్థితి;
  • initials, n. pl. పొడి అక్షరాలు; ఆద్యక్షరాలు;
  • initiation, n. ప్రారంభ ఉపదేశం; దీక్ష; ప్రారంభ కార్యక్రమం;
  • initiative, n. చొరవ; ఉపక్రమం; ప్రథమయత్నం;
  • injunction, n. నిషేధాజ్ఞ; ఉత్తర్వు;
  • injure, v. i. గాయపడు; దెబ్బ తగిలించుకొను;
  • injure, v. t. గాయపరచు; దెబ్బ తగిలించు;
  • injured, n.m. గాయపడ్డవాడు; క్షతగాత్రుడు; దెబ్బతగిలినవాడు;
    • injured person, ph. క్షతగాత్రుడు;
  • injurious, adj. క్షతకరం; హానికరం;
  • injury, n. దెబ్బ; గాయం; క్షతం;
  • injustice, n. అక్రమం; అన్యాయం;
  • ink, n. సిరా; మషి; మసి;
  • ink bottle, n. సిరాబుడ్డి; మషీమణి;
  • inkblot, n. సిరామరక;
  • inlaid, adj. ఖచిత; ఆఖచిత;
    • inlaid with precious stones, ph. రత్నఖచిత;
  • inland, adj. దేశాంతర్గత; అంతర్దేశీయ;
  • in-laws, n. pl. అత్తవారు; వియ్యాలవారు;
  • inlay, v.t. పొదుగు; తాపడం చేయు; చెక్కు;
  • inlet, n. (1) సముద్రం భూమి లోనికి చొచ్చుకు వచ్చిన చోటు; (2) యంత్రం లోనికి వాయువుని గాని ద్రవాన్ని గాని పంపే గొట్టం;
  • in lieu of, ph. బదులుగా; స్థానంలో;
  • inmate, n. బందీ; ఖైదులోగాని, పిచ్చాసుపత్రిలోగాని బందీ అయిన వ్యక్తి;
  • inn, n. (1) సత్రవ; (2) హొటేలు;
  • innate, adj. సహజమైన; అంతర్జనిత; అంతర్లీన;
  • inner, adj. అంతర్గత; అంతర్గతమైన; అంతర్భూత; అంతరంగ;
    • inner planets, ph. అంతర్ గ్రహాలు;
    • inner voice, ph. అంతర్వాణి;
  • innocent, adj. దోషము లేని; నేరములేని; అపకారము చెయ్యని; తప్పులేని; నిరుపద్రవమైన; అమాయక; సాధువైన;
    • innocent person, ph. నిర్దోషి; నిరపరాధి; అమాయకుడు;
    • innocuous, adj. అపకారము చేసే సమర్ధత లేని; అపాయకరంగాని; హాని చేయని; అమాయకపు;
  • innovation, n. నవకల్పన; నవసృజన; అవిశ్య;
  • innuendo, n. వ్యాజ్యోక్తి; చాటూక్తి; అన్యాపదేశం; ఉపాలంభం; ఆక్షేపణ; అసలు అనుభూతిని మనస్సులో దాచిపెట్టి పైపైన మరొక విధంగా ప్రవర్తించడం;
  • innumerable, adj. అసంఖ్యాక; అసంఖ్యేయ; హేరాళము; లెక్కలేనన్ని; లెక్కపెట్టలేనన్ని;
    • inoculate, v. t. (1) రోగకారక పదార్థాన్ని కానీ ప్రతిజనిని కాని శరీరం లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ; వైద్య రంగంలో ఈ "రోగకారక" పదార్థం సర్వసాధారణంగా "వేక్సీను" అవుతుంది. ఆ పరిష్తితులలో inoculation ని vaccination అంటారు; (2) ఒక సూక్ష్మజీవిని లాతి పర్యావరణంలోకి ప్రవేశపెట్టడం;
  • inorganic, adj. అనాంగిక; వికర్బన; అసేంద్రియ;
    • inorganic chemistry, ph. అనాంగిక రసాయనం; వికర్బన రసాయనం; అసేంద్రియ రసాయనం;
  • input, adj. అంతర్‌హిత; అంతర్యాన; అంతర్యాగ; ఆగత; నివిష్ట; నివేశ్య;
    • input data, ph. దాపతాంశాలు; ప్రవేశాంశాలు; ఆగతాంశాలు; ప్రవేశిక దత్తాంశాలు; అంతర్యానాంశాలు; అంతర్యాగాంశాలు;
    • input device, ph. నివేశ్యన సాధనం; నివేశ్యనోపకరణం;
  • input, n. దాపలం; ఆదానం; ప్రవేశాంశం; ప్రవేశికం; నివేశ్యనం; ఆగతం; ఆన; అంతర్యానం; అంతర్యాగం; లోరవానా (లోనికి రవానా); మేత; పెట్టు; అంతర్హితం; యాతం;
  • inquest, n. పంచాయతీ; అపమృత్యు విచారణ;
  • inquiry, n. భోగట్టా;
  • inquisition, n. ధర్మపరీక్ష;
  • inquisitiveness, n. జిజ్ఞాస; ఆదిత్స;
  • inradius, n. [math.] అంతర్ వ్యాసార్ధం; the radius of a circle (sphere) inscribed in a polygon (polyhedron); see also circumradius;
  • insanity, n. వెర్రి; పిచ్చి; ఉన్మాదం; చిత్తవిభ్రమం; చిత్తచాంచల్యం;
  • inscription, n. రాత; అభిలేఖనం;
    • inscription on copper plate, ph. తామ్ర పత్రాల మీద రాత;
    • inscription on stone, ph. రాతి మీద రాత; శిలాభిలేఖనం; శిలాశేసనం;
  • insect, n. కీటకం; క్రిమి; పురుగు;
    • insect pest, ph. చీడ; చీడపురుగు;
  • insecticide, n. కీటక సంహారి; కీటకారి;
  • insecurity, n. భద్రతారాహిత్యం; అభద్రత;
    • insecure feeling, ph. అభద్రతా భావం;
  • inseparable, adj. అవినాభావ;
  • insemination, n. వీర్యదానం;
    • artificial insemination, ph. కృత్రిమ వీర్యదానం; కృత్రిమ గర్భాదానం;
  • insert, v. t. దోపు; దూర్చు; జొప్పించు; జొనుపు; ఆగమించు;
  • insert, n. జొప్పించబడ్డది; దోపినది; ప్రక్షిప్తం;
  • insertion, n. దోపడం; దూర్చడం; జొప్పించడం; జొనుపడం; ఆగమనం;
  • inside, n. లోపల;
  • insiders, n. pl. అస్మదీయులు;
  • insight, n. సూక్ష్మాక్షిక; లోచూపు; దివ్యచక్షువు;
  • insignificant, n. అల్పం; స్వల్పం;
  • insinuation, n. నిందారోపణ; వ్యంగ్యోక్తి;
  • insipid, adj. చప్ప; చప్పని; చప్పనైన; చప్పిడి; నిస్సారమైన; రుచిలేని; పేలవమైన;
  • insist, v. t. పట్టుబట్టు; బలవంతం చేయు; హఠం చేయు;
  • insistent, adj. హఠ; బలవంతపు;
  • insolence, n. తృణీకారం; నిర్లక్ష్యం;
  • insolent, adj. మర్యాద లేని; తృణీకార భావంతో;
  • insolvency, n. దీవాలా;
  • insolvent, n. దీవాలా తీసిన వ్యక్తి;
  • insomnia, n. నిద్రలేమి; నిద్ర పట్టకపోవటం;
  • inspection, n. విలోకనం; తనిఖీ; పరీక్ష;
  • inspector, n. తనిఖీదారు;
  • inspiration, n. (1) ప్రేరణ; ఉత్తేజం; స్ఫూర్తి; ఉద్దీపనం; దైవావేశం; (2) ఉచ్ఛ్వాసం; గాలి పీల్చడం;
  • install, v. t. తురుము; కూర్చు; కీల్కొల్పు; సంఘటించు; సిద్ధపరచు;
  • installment, instalment (Br.), n. విడత; వాయిదా; కంతు; దాటు; దఫా; కిస్తు; కిస్తీ;
    • installment payment, ph. కిస్తీ; వాయిదా వాయి;
  • installments, n. విడతలు; వాయిదాలు; దఫాలు; కిస్తీలు; కంతులు;
    • by installments, ph. వాయిదాల మీద; కిస్తీ బందీ; కంతులవారీగా;
    • first installment, ph. మొదటి వాయిదా; మొదటి దఫా; మొదటి కంతు;
  • instance, n. (1) ఉదాహరణం; (2) మారు; సారి; మచ్చు;
  • instant, n. క్షణం;
  • instantaneous, adj. క్షణిక; యుగపత్తు; సద్య; సద్యో;
    • instantaneous acceleration, ph. సద్య త్వరణం;
    • instantaneous position, ph. సద్య స్థానం; యుగపత్ స్థానం;
    • instantaneous velocity, ph. సద్య ధృతిగతి; సద్య వేగం;
  • instead, prep. బదులుగా; మారుగా; ప్రతిగా; ప్రత్యామ్నాయంగా;
  • instigate, v. t. ప్రేరేపించు; ప్రోద్బలం చేయు; పురికొలుపు; ఉసిగొలుపు;
  • instigation, n. ప్రేరేపణ; ప్రోద్బలం; దుర్బోధ చేసేవ్యక్తి; పుల్లలు పెట్టే వ్యక్తి;
  • instill, v. t. (1) బొట్లు బొట్లుగా దిగజార్చు; (2) బోధ చేయు;
  • instinct, n. ఉపజ్ఞ; సహజేచ్ఛ; సహజజ్ఞానం; సహజాతం; సహజ స్ఫురణ; వాసన; ప్రవృత్తి; అంతఃప్రవృత్తి; ఇంగిత జ్ఞానం; జంతుజ్ఞానం;
    • killer instinct, ph. జిఘాంస; యుయుత్స; గెలిచే వరకు పోరాడాలనే కోరిక;
    • person with a killer instinct, ph. జిఘాంసువు;
  • instinctive, adj. సహజాత;
  • institute, n. సంస్థ; పీఠం;
  • institution, n. సంస్థ; పీఠం;
  • institutional, adj. సంస్థాగత;
  • instruction, n. (1) ఉపదేశం; బోధన; అధ్యాపన; (2) ఆదేశం; సమాదేశం; నిర్దేశం;
    • instruction set, ph. ఆదేశ గణం;
  • instructional, adj. ఉపదేశాత్మక; బోధనాత్మక;
  • instrument, n. (1) సాధకం; సాధనం; ఉపకరణం; పనిముట్టు; కొరముట్టు; పరికరం; ఎత్తళి; జంత్రం; ఆతోద్యం; (2) దస్తావేజు;
    • musical instrument, ph. ఆతోద్యం; ఉ. జంత్రవాద్యం;
    • percussion instrument, ph. అవనాధం; ఉ. డప్పు; మృదంగం; తబలా, వాయులీనం, వీణ;
    • wind instrument, ph. సుషిరం, ఉ. వేణువు;
    • instrument of accession, ph. విలీన పత్రం;
  • instrumental, adj. (1) కరణార్థక; (2) జంత్ర;
    • instrumental music, ph. జంత్ర వాద్యము;
  • insubordination, n. అవిధేయత; ఆజ్ఞాధిక్కారం;
  • insulator, n. బంధకి; బంధకం; అవాహకం; నిరోధకం;
  • insult, n. అవమానం; పరాభవం; తిరస్కారం; న్యక్కారం;
  • insurgence, n. తిరుగుబాటు; విద్రోహం;
  • insurance, n. బీమా;
    • life insurance, ph. జీవిత బీమా;
    • permanent insurance, ph. అతైంతిక బీమా; శాశ్వత బీమా;
    • temporary insurance, ph. తైంతిక బీమా; అశాశ్వత బీమా;
    • insurance policy, ph. బీమా పట్టా; బీమా పట్టా పత్రం;
    • insurance premium, ph. బీమా అడితి; బీమా ప్రీమియం;
  • insurrection, n. ఉపప్లవం; తిరుగుబాటు; విప్లవం;
  • intact, adv. చెక్కుచెదరకుండా;
  • intake, n. ఆన;
  • integer, n. పూర్ణాంకం; పూర్ణసంఖ్య; అభిన్న సంఖ్య; అభిన్నాంకం;
    • integer data type, ph. పూర్ణాంక దత్తాంశ ప్రకారం;
  • integrability, adj. సమాకలనీయత;
  • integral, adj. సమాకలన; అవినాభావ;
    • integral calculus, ph. సమాకలన కలనం;
    • integral connection, ph. అవినాభావ సంబంధం;
  • integrable, adj. సమాకలనీయ; సమాకలన ప్రక్రియకి లొంగే;
  • integrand, n. సమాకల్యం; సమాకలన ప్రక్రియకి లొంగబడ్డది;
  • integrated, adj. సమాకలిత;
    • integrated circuit, ph. సమాకలిత విద్యుద్వలయం
  • integration, n. (1) సమాకలనం; చయనకలనం; (2) కలపడం; వీలీనత; ఏకీకరణ; సమన్వయం;
  • integrity, n. చిత్తశుద్ధి; న్యాయవర్తన; పెద్దమనిషితనం;
  • intellect, n. (1) బుద్ధి; జ్ఞానశక్తి; ధిషణ; చిత్తం; (2)బుద్ధజీవి;
    • sharp intellect, ph. కుశాగ్ర బుద్ధి;
  • intellectual, adj. వివేచనాత్మక; శేముష్య; బౌద్ధిక; మేథో;
    • intellectual evolution, ph. బౌద్ధిక పరిణామం;
    • intellectual mirage, ph. జ్ఞానమరీచిక;
    • intellectual property, ph. మేథో సంపత్తి; మేథో సంపద; శేముషీ సంపద;
  • intellectual, n. మేధావి; శేముషీవంతుడు; మనీషి;
  • intelligence, n. (1) వివేకం; తెలివి; తెలివితేటలు; ప్రజ్ఞానం; (2) గూఢసమాచారం; వర్తమానం; అపసర్పము; వేగు;
    • artificial intelligence, ph. విశ్వామిత్ర వివేకం; కృత్రిమ మేధ;
    • intelligence gatherer, ph. వేగరి; అపసర్పుడు
    • intelligence quotient, ph. బుద్ధిబలం; బుద్ధలబ్దం;
  • intelligentsia, n. pl. విజ్ఞులు; మేధావర్గం; వివేకవంతులు;
  • intend, v.i. ఉద్దేశించు; తలపెట్టు;
  • intended, adv. ఉద్దేశించిన;
  • intended, n. ఉద్దిష్టం; అభిలషణీయం; వాంఛనీయం;
  • intense, adj. తీవ్ర; తీక్షణ; ఉద్ధృత;
  • intensely, adv. ముమ్మరంగా; తీవ్రంగా; ఉధృతంగా;
  • intensity, n. తీవ్రత; తీక్షణత; ఉద్ధృతి;
  • intent, n. ఉద్దేశం; తలపోత;
  • intention, n. ఉద్దేశం; సంకల్పం; తలపోత; వివక్షత; మనోగతం;
  • intentionally, adv. ఉద్దేశపూర్వకంగా; సంకల్పశుద్ధితో; బుద్ధిపూర్వకంగా; చెయ్యాలని చేసిన;
  • inter, adj. అంతర్; పరస్పర; ఒండొంటి; అన్యోన్య;
  • inter, v. t. పాతు; పాతిపెట్టు; భూస్థాపితం చేయు;
  • interaction, n. సంకర్షణ;
    • short-range interaction, ph. లఘు సంకర్షణ;
  • intercalary month, n. అధిక మాసం; లుప్త మాసం; పురుషోత్తమ మాసం; మల మాసం; మలిమ్లుచం; సూర్యసంక్రమణం లేని చంద్ర మాసం;
  • intercede, v. t. అటకాయించు;
  • intercept, v. t. అడ్డగించు; ఆపు; నిలుపు;
  • inter-cellular, adj. కణాంతర;
  • interchangeability, n. పరస్పర పరివర్తకత;
  • interchangeable, n. పరస్పర పరివర్తకం;
  • intercontinental, adj. ఖండాంతర;
  • intercourse, n. సంభోగం; రతిక్రీడ;
  • inter-crop, n. అంతర పంట; ఒక పొలంలో ఒక జాతి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మరొక పంట వెయ్యడం; ఉదాహరణకి అల్లం, పసుపు, జొన్న పొలాలలో పెండలం వేసి పండించడం;
  • interdependence, n. పరస్పరావలంబనం; అన్యోన్యాశ్రయం; పరస్పరాధీనత;
  • interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; వినిమయసీమ;
    • graphical interface, ph. చిత్రాంతరాననం;
    • command-line interface, ph. అక్షరాంతాననం;
  • interest, n. (1) వడ్డీ; మిత్తి; తేమానం; ఫాయిదా; (2) శ్రద్ధ; మొగ్గు; (3) అభిరుచి; ఆసక్తి;
    • compound interest, ph. చక్ర వడ్డీ;
    • simple interest, ph. బారు వడ్డీ;
    • vested interest interest, ph. స్వార్ధం; స్వకార్యం;
  • interesting, adj. ఆసక్తికరమైన; ఆసక్తివంతమైన;
  • interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; అంతర్ముఖం; పరస్పర ఫలకం; ప్రతిముఖం; కలనయంత్రా నికి బాహ్య ప్రపంచానికి మధ్య సంభాషణలు జరగడానికి మధ్యవర్తిగా పనిచేసే శాల్తీ;
    • graphical interface, ph. చిత్రాంతరాననం; చిత్రాంతరవర్తనం;
    • command line interface, ph. అక్షరాంతాననం;
  • interference, n. జోక్యం;
  • interim, adj. అందాకా; తాత్కాలిక; మధ్యంతర;
    • in the interim, ph. ఈ మధ్యలో;
  • interior, adj. అభ్యంతర; లో; లోపలి;
    • interior room, ph. అభ్యంతర మందిరం; లోపలి గది;
  • interjection, n. సాధువాదార్థకం; ఆశ్చర్యార్థకం;
  • interlude, n. విష్కంభం; విరామ సమయం;
  • intermediate, adj. మధ్యంతర; మాధ్యమిక; అంతస్థ; నడుమంతరపు;
  • intermediate, n. మధ్యంతరం; మాధ్యమికం; అంతస్థం; నడుమంతరం; మధ్యస్థం;
  • interment, n. పాతిపెట్టడం; శవాన్ని భూస్థాపితం చేయడం;
  • intermission, n. విరామం; విరామ సమయం;
  • intermittent, adj. విడచి విడచి వచ్చే; అడపా తడపా వచ్చే; అంతరాయిక;
    • intermittent catastrophe theory, ph. అంతరాయిక వినిపాత వాదం;
  • intermittently, adv. అంతరాయికంగా; అప్పుడప్పుడు; ఒక్కోసారి;
  • internal, adj. ఆంతరంగిక; అంతరంగ; అంతర్గత; అంతర్ గర్భిత; అంతర్; అంతర; అంతర్భూత; లోపలి;
    • internal combustion, ph. అంతర్ దహన;
    • internal forces, ph. అంతర్గత శక్తులు;
    • internal planets, ph. అంతర్ గ్రహాలు; సౌరకుటుంబంలో సూర్యుడికి, గురుడికి మధ్యనున్న గ్రహాలని అంతర్‌గ్రహాలు అంటారు;
  • International, adj. అంతర్జాతీయ;
  • International Monetary Fund, n. అంతర్జాతీయ ద్రవ్య నిధి;
  • internationalist, n. అంతర్జాతీయతా వాది;
  • Internet, n. అంతర్జాలం; లీవల; (ఇక్కడ మధ్య అనడానికి "నడి- లీ- కౌన్- / కౌ- " అనే మూడింటిలో ఏదైనా పనికొస్తుంది); ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలన యంత్రాలు ఒకదానికొకటి సమాచారం పంపుకుందుకి వీలుగా ఉండే ప్రసారక సదుపాయం; మనుష్యులు మాట్లాడుకుందికి టెలిఫోను సౌకర్యం ఎలాగో అలాగే అంతర్జాలం కలనయంత్రాలు మాట్లాడుకుందికి ఉపయోగపడుతోంది;

---Usage Note: Internet

  • ---The Internet is a system that facilitates communication among many interconnected computers and devices throughout the world. You can use the Internet to send e-mails or access the World Wide Web (WWW) information. The Internet is the highway and the WWW is the repository of information;
  • internode, n. కణుపుల మధ్యనున్న కాండం;
  • interpolation, n. అంతర్వేశనం; ప్రక్షేపణ;
  • interpret, v. t. వివరించు; వ్యాఖ్యానించు; అనువదించు;
    • interpreted programming language, ph. అనువదిత విధిభాష; అనుదిత విధిభాష; A programming language, such as JavaScript, that is designed to be translated into executable code on the fly as the program is executed line by line;
  • interpreter, n. ద్విభాషి; దుబాసీ; ఒకరి నోటి మాటని తన నోటితో అనువాదం చేసే వ్యక్తి; see also translator;
  • interrogate, v. t. ప్రశ్నించు; అడుగు;
  • interrogation, n. ప్రశ్న;
    • interrogation mark, ph. ప్రశ్నార్థక చిహ్నం; క్వొశ్చెన్ మార్కు;
  • interrogative, adj. ప్రశ్నార్థక; ప్రశ్నవాచక;
  • interruption, n. అంతరాయం; ఆటంకం;
  • intersection, n. ఖండన; మిళితం;
    • point of intersection, ph. ఖండన బిందువు; మిళిత బిందువు;
  • interstellar, adj. తారాంతర;
  • interstitial, adj. మధ్యంతర;
  • intertwine, v. i. ముడిపడు;
  • intertwined, adj. జమిలి;
  • interval, n. అంతరం; వ్యవధి; వ్యవధానం; మధ్యకాలం; ఎడతెరిపి;
    • time interval, ph. కాల వ్యవధి;
  • intervene, v. t. కలుగజేసుకొను;
  • interview, n. అభిముఖ సమావేశం; పరిపృచ్ఛట; భేటీ; ముఖాముఖీ; అడబల్కు; అడబల్కరం; see also rendezvous;
  • intestate, n. మరణశాసనం లేని పరిస్థితి;
  • intestinal, adj. ఆంత్ర; పేగుకి సంబంధించిన;
  • intestine, adj. పేగు; ఆంత్రం;
    • large intestine, ph. పెద్ద పేగు;
    • small intestine, ph. చిన్న పేగు;
  • intimacy, n. స్నేహం; లీయత; చనువు; ఆత్మీయత;
  • intimate, v. t. తెలియజేయు;
  • intimidate, v. t. బెదిరించు; బెదరగొట్టు;
  • intimidation, n. బెదిరింపు;
  • intolerable, adj. సహించరాని; భరించరాని; దుస్సహ;
  • intolerable, n. దుర్భరం; వెక్కసం;
  • intolerance, n. అసహనం;
  • intonate, v. t. స్వరభేదాలని పాటిస్తూ మాట్లాడు; నొక్కవలసిన చోట నొక్కుతూ మాట్లాడు;
  • intonation, n. వాక్యస్వరం;
  • intone, v. i. వంతపాడు;
  • intoxicant, n. మత్తుపదార్థం; నిషాపదార్థం; మద్యం;
  • intoxication, n. ముయికం; మత్తు; మత్తా; కైపు; నిషా; దిమ్ము; లాహిరి;
    • intoxicating drink, ph. మత్తు ఎక్కించే పానీయాలు; మద్యం; కల్లు; సారా మొదలయినవి;
  • intracranial, adj. కరోట్యంతర;
    • intra-syllabic symbols, ph. గుణింతాలకి వాడే గుర్తులు;
  • intricacy, n. చిక్కు; తికమక; జటిలత;
    • intricate procedure, ph. [idiom] ద్రావిడ ప్రాణాయామం; క్లిష్టమైన పద్ధతి;
  • intrigue, n. తంత్రం; కుతంత్రం; గూడుపుఠానీ;
  • intrinsic, adj. సహజమైన; స్వాభావిక; నిజ;
    • intrinsic value, ph. సహజమైన విలువ; సహజసిద్ధమైన విలువ; యదార్థమైన విలువ; నిజం విలువ;
  • introduction, n. (1) ఉపోద్ఘాతం; ఉపక్రమణం; ప్రస్తావన; ప్రవేశిక; see also preface; prologue; prelude; foreword; (2) పరిచయం;
  • introspection, n. ఆత్మపరిశోధన; ఆత్మశోధన; ఆత్మచింతన; ఆత్మావలోకనం; అంతర్లోకన;
  • introvert, n. అంతర్ముఖత్వం; m. అంతర్ముఖుడు; f. అంతర్ముఖి;
  • intrude, v. t. చొరబడు;
  • intruders, n. pl. చొరబాటుదారులు;
  • intruders, n. pl. చొరబాటుదారులు;
  • intrusion, n. చొరబాటు;
  • intuition, n. ఉపజ్ఞ; ఉపజ్ఞాతం; అంతర్బుద్ధి; అంతఃప్రబోధం; అంతఃస్పురణ; అర్ధాపత్త; కారణ కార్య సమీక్ష లేకుండా సూక్ష్మగ్రాహ్యత ప్రదర్శించడం; knowledge acquired without instruction;
  • intuitive, adj. అతీంద్రియ; సూక్ష్మగ్రాహ్య; ఉపజ్ఞామూలక;
  • inundate, v. t. ముంచు; ముంచెత్తు;
  • invade, v. t. దండెత్తు; దాడి చేయు; ముట్టడించు;
  • invalid, adj. (ఇన్ వేలిడ్) చట్టపరంగా ఆమోదయోగ్యం కాని;
  • invalid, n. (ఇన్ వెలిడ్) అనారోగ్యం వల్ల కాని, ముసలితనం వల్ల కాని తన పని తాను చేసుకోలేని వ్యక్తి;
  • invariant, adj. కూటస్థ; మార్పు చెందని; గణిత ప్రక్రియల వల్ల మార్పు చెందని;
    • invariant embedding, ph. [math.] కూటస్థ తాపడం;
  • invasion, n. దండయాత్ర; దాడి; ముట్టడి;
    • invasive plant, ph. బెడద మొక్క;
  • invective, n. దూషణ; సాధించు; తిట్టు; కించపరచేలా విమర్శ;
  • invent, v. i. కనిపెట్టు; సృజించు; see also discover;
  • invention, n. సంజనితం; అభిసర్గం; సృజనం; పరికథ; పరికల్పనం; ఉపేతం; ఒనరిక; ఆవిష్కరణ; ఆవిష్కారం;
  • inventiveness, n. సృజనాత్మకం; ఒనరిక;
  • inventor, n. స్రష్ట; ప్రణేత; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త; ఉపేత; ఆవిష్కర్త;
  • inverse, adj. విలోమ; విపర్య; (ant.) అనులోమ;
    • inverse square law, ph. విలోమ వర్గ సూత్రం;
    • inversely proportional, ph. విలోమానుపాతం;
  • inversion, n. విపర్యాసం;
    • thermal inversion, ph. తాప విపర్యాసం;
    • invert sugar, ph. త్రిశంకు చక్కెర; Sucrose = Glucose-Fructose (attached together), Invert Sugar = Free Glucose + Free Fructose (apart);
  • inverted, adj. అధోముఖ; తలకిందులయిన;
  • inverted, n. వ్యత్యాస్తం; తలకిందులు;
  • invertebrate, n. అకశేరుకం; అపృష్ట వంశి; వెన్నుపూస లేని జంతువులు;
  • invest, v. t. మదుపు పెట్టు; పెట్టుబడి పెట్టు;
  • investors, n. pl. మదుపర్లు; పెట్టుబడిదారులు;
  • investigative, v. t. విచారించు; అన్వేషించు; పరిశోధించు;
  • investigative, adj. అన్వేషణాత్మక; పరిశోధనాత్మక;
  • investigation, n. పరిశోధన; దర్యాప్తు; విచారణ; అరయిక; అన్వేషణ;
  • investigator, n. m. పరిశోధకుడు; శోధకుడు; అన్వేషకుడు; విచారకుడు;
  • investment, n. పెట్టుబడి;
  • invincible, adj. అజేయ;
  • invisible, adj. అదృశ్య; అశరీర; అసదృశ; కనపడని; అగుపడని; ప్రచ్ఛన్న;
    • invisible hand, ph. అసదృశ్య హస్తం;
    • invisible ink, ph. అశరీర సిరా;
    • invisible spectrum, ph. ప్రచ్ఛన్న వర్ణమాల;
    • invisible universe, ph. అదృశ్య విశ్వం;
    • invisible voice, ph. అశరీర వాణి; ఆకాశవాణి;
  • invitation, n. ఆహ్వానం; పిలుపు; ఆమంత్రణం;
  • invite, v.t. ఆహ్వానించు; పిలుచు;
    • invited guests, ph. ఆహూతులు; ఆహ్వానితులు;
  • invocation, n. ఆవాహన; ప్రార్థన; నాందీశ్లోకం;
  • invoice, n. ఉల్లాకు; కొన్న సరకుల పేర్లు, ధరలు చూపించే జాబితా;
  • invoke, v. t. ఆమంత్రించు;
  • involuntary, adj. అసంకల్పిత; అసంకల్ప; అప్రయత్న; అనైచ్ఛిక; అనియంత్రిక; ఐచ్ఛికం కాని;
    • involuntary action, ph. అనియంత్రిక చర్య; అసంకల్ప చర్య;
    • involuntary muscles, ph. అనైచ్ఛిక కండరములు; అనియంత్రిక కండరములు;
    • involuntary reflex, ph. అసంకల్ప ప్రతీకారం;
  • involvement, n. తాదాత్మ్యం;
  • inward, adj. అంతర్గత;
  • inundation, n. వరద; ముంపు; జలప్లుతం;
  • ion, n. అణుశకలం; అణువులో భాగం; అణువులోని ఎలక్ట్రానులని కొన్నింటిని విడగొట్టినప్పుడు మిగిలిన శకలాలు;
  • ionization, n. శకలీకరణం; అణువులు విద్యుదావేశం పొందడం;
  • ionized, adj. ప్రోద్ధుత; (Br.) ionised;
  • ionizing, adj. ప్రోద్ధుత; (Br.) ionising;
    • ionizing radiation, ph. ప్రోద్ధుత వికీర్ణం; ప్రోద్ధుత వికిరణం;
  • ionosphere, n. అణుశకలావరణం; శకలావరణం; అయనోవరణం;
  • iota, n. (1) గ్రీకు భాషలో ఒక అక్షరం; (2) పల్లెత్తు; కించిత్తు; ఈషత్తు; ఇంచుక; ఇసుమంత; రవంత; లవలేశం;
  • IOU, n. రిణపణ్ణా; రుణపత్రం;
  • ipso facto, n. దానంతగా అది; అంతటితోనే;
  • irascibility, n. చిరాకు; చికాకు;
  • ire, n. ఆగ్రహం;
  • Iridium, n. ఇరిడియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 77, సంక్షిప్త నామం, Ir); [Lat.]. iris = rainbow;
  • iris, n. (1) కానీనికా పటలం; నేత్ర విభాజకం; కంటిపాప చుట్టూ ఉండే గుండ్రని పొర; ఈ పొరకి ఉండే రంగే కంటి రంగు; (2) ఇంద్ర ధనుస్సు; హరివిల్లు; (3) శీతల దేశాలలో పూసే ఒక రకం పువ్వు;
  • iridescent, adj. బహువర్ణదీప్తి; ఇంద్రధనుస్సు వలె; (ety.) iris = rainbow, escence = becoming;
  • iron, adj. ఇనప; అయో;
    • iron filings, ph. ఇనప రజను; అయోచూర్ణం;
    • iron tip, ph. అయోముఖి;
  • Iron, n. (1) ఇనుము; అశ్మసారం; ఆయసం; ఒక రసాయన మూలం; (అణుసంఖ్య 26, సంక్షిప్త నామం; Fe); [Lat.] ferrum; (2) ఇస్థిరి; (3) ఇస్థిరి పెట్టి;
    • cast iron, ph. పోత ఇనుము; దుక్క ఇనుముని కరిగించి, అందులో తుక్కు ఇనుముని, తదితర లోహాలని కలిపి, దానిని రకరకాల ఆకారాలు ఉన్న అచ్చులతో పోసి చల్లార్చగా వచ్చినది;
    • pig iron, ph. దుక్క ఇనుము; దంప ఇనుము; blast furnace నుండి వచ్చిన కచ్చా ఇనుముని పోత పోసినప్పుడు వచ్చే దుక్కలు పందిపిల్ల ఆకారంలో ఉండేవిట; అందుకని pig iron అన్న పేరు వచ్చింది.
    • scrap iron, ph. తుక్కు ఇనుము; పాత ఇనప సరుకు;
    • wrought iron, ph. చేత ఇనుము; దుక్క ఇనుముని బొగ్గుల కొలిమిలో వేడి చేసి, సుత్తితో బాది, మలినములను పోగొట్టగా మిగిలిన ఇనుము;
  • iron, v. t. ఇస్థిరి చేయు;
    • Iron Age, ph. ఆశ్మయుగం; ఇనప యుగం; క్రీ.పూ.1000 నుండి క్రీ.శ. 100 వరకు; కంచుయుగం తరువాత వచ్చిన కాలం;
    • iron horse, ph. ఆశ్మాశ్వం; రైలింజను;
    • ironing box, ph. ఇస్త్రీపెట్టి;
  • ironical, adv. ఇత్సితంగా;
  • irony, n. వ్యాజస్తుతి; వక్రోక్తి; వ్యంగ్యం; ఇత్సితం; అన్నది ఒకటి, దానివల్ల స్పురించే అర్ధం మరొకటి అవడం;
  • irradiation, n. ఉద్యోతనం; (lit.) to expose to light;
  • irrational, adj. (1) అకారణమైన; హేతుబద్ధం కాని; తర్కబద్ధం కాని; (2) అనిష్ప; నిష్పత్తిలా రాయడానికి వీలు పడని;
    • irrational fear, ph. కారణం లేని భయం; అకారణమైన భయం;
    • irrational number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం; కరణీయ సంఖ్య; a number that cannot be expressed as a ratio;
  • irregular, adj. వ్యతిక్రమ; క్రమభంగ; క్రమవిపర్య; అవకతవక; అపవాద; ఉచ్చావచ;
    • irregular form, ph. అపవాద రూపం; వ్యతిక్రమ రూపం; క్రమభంగ రూపం;
    • irregular number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం;
    • irregular prime, ph. వ్యతిక్రమ ప్రధాన సంఖ్య;
  • irregularity, n. వ్యతిక్రమం; క్రమభంగం; క్రమవిపర్యం; అవకతవకతనం;
  • irregularly, adv. అడ్డగోలుగా; వరసావావీ లేకుండా; తర్కరహితంగా;
  • irrelevant, adj. అప్రస్తుత;
  • irresponsibility, n. బాధ్యతారాహిత్యం;
  • irreversible, adj. అప్రత్యావర్తక; అనుత్క్రమణీయ;
  • irreversible, n. అప్రత్యావర్తకం;
  • irrigated, adj. సాగు; సాగు చెయ్యడానికి సమకూర్చే నీటి పారుదల;
    • irrigated land, ph. నదీమాతృకం; సాగుభూమి; ఆయకట్టు; పారకం;
    • irrigated water, ph. సాగు నీరు;
  • irrigation, n. సాగు; సేద్యం; నీటి పారుదల; నీటికట్టు;
    • drip irrigation, ph. బిందు వ్యవసాయం; బిందు సాగు;
    • lift irrigation, ph. కపిలె సాగు; ఎత్తిపోతల సేద్యం; ఎత్తిపోతల సాగు;
  • irritability, n. చికాకు;
  • irritation, n. బాధ; వ్యధ; చికాకు;
  • ischium, n. తుంటి ఎముక;
  • isinglass, n. అభ్రకం; గిరిజం;
  • island, n. (ఐలెండ్) దీవి; ద్వీపం; లంక;
    • offshore island, ph. తీరస్థ దీవి;
  • islet, n. చిన్న దీవి; దీవిక;
  • ism, suff. ఇజం; ప్రపంచాన్ని ఒక మూస పోసిన దృష్టితో చూసే తత్త్వం;
  • iso, pref. సమ;
  • isobar, n. సమవాయి; సమభార రేఖ; సమపీడన రేఖ;
  • isogamy, n. [bio.] సమ సంయోగం; ఒక రకం లైంగిక పునరోత్పత్తి; (ant.) anisogamy;
  • isogloss, n. [ling.] భేదకరేఖ; ఒక భాషలో గమనించదగ్గ మార్పులని విడదీసే భౌగోళిక రేఖ; గోదావరి దాటితే భాషలో మార్పు వినిపిస్తుంది కనుక గోదావరిని ఒక భేదక రేఖగా పరిగణించవచ్చ;
  • isolated, adj. వియుక్త; వివిక్త; వ్యష్ఠి; విడిగా ఉంచిన;
    • isolated double bond, ph. వియుక్త జంటబంధం;
    • isolated system, ph. వివిక్త వ్యవస్థ; వియుక్త వ్యవస్థ; వ్యష్ఠిగా ఉంచిన వ్యవస్థ;
  • isomer, n. సమభాగి; సమాంగి; రెండు బణువులలోని వివిధ అణువులు సమానంగానే ఉండి, వాటి నిర్మాణ క్రమాలు తేడాగా ఉంటే ఆ రెండింటిని సమభాగులు అంటారు.
  • isomerism, n. సమభాగత్వం; సమాంగత; సమాంగత్వం; సాదృశ్యం; అనేక భాగములతో రకరకాల విన్యాసాలు కలిగిన నిర్మాణ క్రమాలతో ఒప్పారే రసాయనాలు;
    • chain isomerism, ph. శృంఖల సమాభాగత్వం; శృంఖల సమాంగత; శృంఖల సమాంగత్వం; శృంఖల సాదృశత్వం;
    • conformational isomerism, ph. అనురూపాత్మక సమభాగత్వం; అ. సమాంగత్వం; అ. సాదృశ్యం;
    • group isomerism, ph. సామూహిక సమభాగత్వం; సా. సమాంగత; సా. సమాంగత్వం; సా. సాదృశ్యం;
    • optical isomerism, ph. దృక్ సమభాగత్వం; దృక్ సమాంగత; దృక్ సమాంగత్వం; దృక్ సాదృశ్యం;
    • positional isomerism, ph. స్థాన సమభాగత్వం; స్థాన సమాంగత; స్థాన సమాంగత్వం; స్థాన సాదృశ్యం;
    • stereo isomerism, ph. ప్రాదేశిక సమభాగత్వం; ప్రా. సమాంగత్వం;
    • structural isomerism, ph. నిర్మాణాత్మక సమభాగత్వం; ని. సమాంగత; ని. సమాంగత్వం;
  • isometric, adj. సమపరిమాణ; సమానమైన కొలతలుగల;
    • isometric exercise, ph. సమపరిమాణ వ్యాయామం; కండరాలలో కదలిక రాకుండా తన్యత పుట్టించే వ్యాయామ పద్ధతి;
  • isomorphism, n. సమరూపత;
  • isopropyl alcohol, n. రబ్బింగ్ ఆల్కహాలు; ఉద్వర్తన ఒలంతం; జ్వరం వచ్చినప్పుడు దీనిని శరీరం మీద వేసి రుద్దితే ఉష్ణం తగ్గుతుంది కనుక ఈ పేరు వచ్చింది; C3H7OH;
  • isosceles, adj. సమద్విబాహు;
  • isotherm, n. సమతాపి; సమతాపరేఖ; ఒక మేపులో ఒకే తాపోగ్రత ఉన్న బిందువలని కలుపుతూ గీసే గీత;
  • isothermal, adj. సమతాప;
  • isotope, n. ఏకస్థాని; ఆవర్తన పట్టికలో ఒకే గదిలో ఉంచవలసిన రసాయన మూలకాలు;
    • radio-isotopes, వికీర్ణ ఏకస్థానులు;
  • isotropic, adj. సమదైశిక; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోయే;
  • isotropy, n. సమదైశికత; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోవడం;
  • issue, n. (1) సంచిక; (2) సంతతి; (3)సమస్య; (4) విషయం; అంశం;
    • life and death issue, ph. జీవన్మరణ సమస్య;
    • issue at hand, ph. ప్రస్తుతపు సమస్య;
  • issue, v. t. జారీ చేయు;
  • isthmus, n. భూసంధి;
  • it, pron. proximate. ఇది;
  • it, pron. remote. అది;
  • italics, n. pl. వాలు అక్షరాలు;
  • itch, n. దురద; గుల; జిల; దూల; తీట; కండూతి; కసిమిరి;
  • item, n. మూర్తి; శాల్తీ; అంశం; ఉరువు;
  • iterate, v. t. ఆమ్రేడించు; పదే పదే చేయు;
  • iterative, adj. ఆమ్రేడిత; పునరుత్థాన;
    • iterative method, ph. పునరుత్థాన పద్ధతి; చేసిన లెక్కనే చిన్న చిన్న మార్పులతో పదే పదే చేయడం;
  • itinerary, n. కార్యక్రమం;
  • itis, suff. వాపు; శోఫ; ఆర్తి;
  • its, pron. proximate. దీని;
  • its, pron. remote. దాని;
  • ivory, n. దంతం;
    • ivory tower, ph. [idiom] దంతపు మేడ; ఒంటి స్తంభపు మేడ; విశ్వవిద్యాలయం;
  • ivy gourd, n. దొండ; దొండ పాదు;

మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2