This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: Ga-Gl
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
gad, n. చీల;
gadfly, n. (1) జోరీగ; పశువులని చికాకు పెట్టే ఈగ; (2) అప్రస్తుత ప్రసంగి; చొప్పదంటు ప్రశ్నలతో చిరాకు పెట్టే వ్యక్తి;
gadget, n. సదుపాయమైన పనిముట్టు;
gadwall, n. కేకబాతు; అరుపుల బాతు; ఒక రకమైన బాతు;
gaffe, n. (గ్యాఫ్) పొరపాటు; అనాలోచిత చర్య;
gag, n. వాకట్టు; మాట్లాడడానికి వీలు లేకుండా నోటికి వేసే గుడ్డ కట్టు;
gag order, ph. న్యాయస్థానంలో జరిగిన విషయాలు బయట మాట్లాడ కూడదని న్యాయమూర్తి వేసే ఆంక్ష;
gage, n. కొలత; see also gauge;
gaiety, n. ఉల్లాసము; ఉషారు;
gaily, adv. ఉషారుగా;
gain, n. లాభం; లబ్ధి; ఫలం; ప్రయోజనం; పెరుగుదల; వృద్ధి; గెలుపు; నఫా;
gain, v. i. (1) సాధించు; పొందు; (2) పుంజుకొను;
gainsay, v. t. కాదను; తిరస్కరించు; ఖండించు;
gainsayer, n. కాదనేవాడు; అడ్డుపెట్టేవాడు; అడ్డుపుల్ల వేసే వ్యక్తి; ఆక్షేపించే ఆసామీ;
gait, n. నడక; నడిచే తీరు;
Gala, n. ఉత్సవం;
galaxy, n. గేలక్సీ; క్షీరసాగరం; ఆకాశగంగ; నక్షత్రవీధి; నక్షత్రసముదాయం;
gateway, n. (1) సింహద్వారం; ముఖద్వారం; (2) రెండు విభిన్నమైన కంప్యూటరు వలయాల మధ్య సంభాషణకి అనుకూలంగా అమర్చబడ్డ మరొక కంప్యూటరు;
gather, v. i. (1) గుమికూడు; (2) పుంజుకొను;
gather, v. t. (1) పోగుచేయు; సంతరించు; సేకరించు; కూడగట్టుకొను; సంగ్రహించు; (2) దండు;
gathering, n. సమావేశం; సమ్మేళనం;
gathering of poets, ph. కవి సమ్మేళనం;
gauge, n. (గేజ్) కొలమాపకం; కొలమానం; మాపకం;
rain gauge, ph. వర్షమాపకం; వాన ఎంత పడ్డదో కొలిచే సాధనం;
gauze, n. (గాజ్) గాజు గుడ్డ; దోమతెర గుడ్డ వంటి గుడ్డ; గాయాల మీద కట్టు కట్టడానికి వాడే ప్రత్యేకమైన గుడ్డ;
gay, n. m. మరొక పురుషుని యెడల లైంగికమైన ఆకర్షణ పొందే పురుషుడు; see homosexual;
gazebo, n. మండపం; చదరం లేక అష్టభుజి ఆకారంలో ఉంది, పైన కప్పు ఉన్న కట్టడం;
gazelle, n. హరిణం; దుప్పి; కణుచు; ఏణ; పెద్ద పెద్ద కళ్లు, ఒంకీలు తిరిగిన నిటారైన కొమ్ములు ఉండే ఒక జాతి లేడి;
gazette, n. ప్రభుత్వ వార్తాపత్రిక; ప్రభుత్వం వారు వారి సమాచారాలని ప్రకటించే పత్రిక;
gazetted officer, ph. భారత ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నత శ్రేణి ఉద్యోగులు;
gear, adj. దంతదారు; పళ్ళ చక్రం; ఉదా. కారులో ఇంజను నుండి బండికి శక్తిని అందించే యంత్రాంగంలో ఉండే పళ్ళ చక్రం;
gear wheel, ph. దంతదారు చక్రం;
gedanken, n. [Ger.] స్పురణ ప్రయోగం; thought experiment;
gel, adj. అర్ధఘన; జల్లి;
gel, v. i. గడ్డకట్టు; పేరుకొను; కరడు కట్టు; ముద్దకట్టు; ఘనీభవించు; తుట్టెకట్టు;
gel, n. అర్ధఘనం; జల్లి; a colloid in which the suspended particles assume a systematic pattern; see also sol;
gelatin, n. జాంతవం; రంగు, రుచి లేని జంతు సంబంధమైన జిగార్థం; తిక్తరసం;
gelling agent, ph. జల్లీకరణ కారకం;
gem, n. (1) రత్నం; మణి; మాణిక్యం; (2) విలువైనది;
Geminorum, n. పునర్వసు నక్షత్రం; పునర్వసు నక్షత్రాల గుంపు; ఇందులో ఆల్ఫా జెమినోరం ని Castor అంటారు;
geminate, n. ద్విత్వాక్షరం; ద్విత్వం;
geminated, adj. ద్విరుక్త;
gemination, n. ద్విరుక్తం; ఒక హల్లుని రెండు మాత్రల కాలం పలకడం; ఉదాహరణకి baggage బేగ్ గేజ్ అని పలకం, బేగేజ్ అంటాం. కాని cattail ని కేట్ టైల్ అని ట శబ్దాన్ని రెండు సార్లు పలుకుతాం;
Gemini, n. మిథునరాశి; ౙంట;
gender, n. వాచకం; లింగం; the psychic, social, and cultural roles that an individual assumes;
gender identity, ph. An individual’s sense of self (as female versus male, as neither, or as something in between);
feminine gender, ph. మహతీ వాచకం; స్త్రీలింగం;
grammatical gender, ph. వ్యాకరణ లింగం;
masculine gender, ph. మహద్వాచకం; పుంలింగం;
neuter gender, ph. అమహద్వాచకం; నపుంసక లింగం;
non-human gender, ph. అమనుష్య వాచకం;
semantic gender, ph. ఆర్థిక లింగం; అర్థం ద్వారా లింగ నిర్ణయం;
---USAGE NOTE: masculine and non-masculine genders
---తెలుగులో వ్యాకరణపరంగా మహత్, అమహత్ (masculine person, non-masculine) వాచకాలు మాత్రమే ఉన్నాయి. కనుక తెలుగు క్రియలు రెండు రకాలుగా మాత్రమే మారుతాయి. ఉదా: అతడు వచ్చాడు, ఆమె వచ్చింది, అది వచ్చింది; రాముడు వచ్చాడు, సీత వచ్చింది, ఎద్దు వచ్చింది, ఆవు వచ్చింది. లింగాలు రెండు రకాలు: వ్యాకరణ లింగాలు, ఆర్థిక లింగాలు అని (grammatical genders, semantic genders). తెలుగు భాషలో ఇవి రెండూ వేరు వేరు. పదం యొక్క అర్థాన్ని బట్టి అది పుల్లింగమా, స్త్రీ లింగమా లేక నపుంసక లింగమా అన్నది మనం నిర్ణయించుకొంటాము. కానీ వ్యాకరణ పరంగా క్రియా పదాలను వాడేటప్పుడు మహత్, అమహత్ అనే రెండు లింగాలనే ప్రయోగిస్తాము. బహువచన ప్రయోగంలో మళ్లీ మహద్మహతీ వాచకాలు ఒకలాగా వాడతాం. 'ఆ స్త్రీలు వచ్చారు' అంటాము గానీ 'ఆ ఎద్దులు వచ్చారు' అనం కదా.
gene, n. జన్యువు; జీను; వారసవాహికలలో ఒక భాగం; వంశపారంపర్యంగా సంక్రమించే లక్షణాలని నిర్ణయించే అంశం;
dominant gene, ph. బహిర్గత జన్యువు;
recessive gene, ph. అంతర్గత జన్యువు;
genealogist, n. అన్వయజ్ఞుడు;
genealogy, n. ప్రవర; అన్వయం; వంశచరిత్ర; వంశవృక్షం; వంశ పరంపర; వంశావళి;
general, adj. (1) సాధారణమైన; ప్రాయికమైన; సార్వత్రిక; ఏకోను; అందరికీ సంబంధించిన; సర్వ; (2) శారీరిక;
general body meeting, ph. సర్వ సభ్య సమావేశం;
general election, ph. సార్వత్రిక ఎన్నికలు;
general knowledge, ph. ప్రాయికమైన జ్ఞానం;
general public, ph. జనబాహుళ్యం;
general theory of relativity, ph. సాధారణ సాపేక్ష వాదం; సాధారణ సాపేక్ష సిద్ధాంతం;
generalization, n. సర్వసమన్వయం; సాధారణీకరణం; అజహరణ;
generalize, v. t. అజహరించు; అజహర్లక్షణాన్నివాడు; అర్ధాంతరన్యాసాన్ని వాడు;
generate, v. i. ఉత్పత్తి చేయు; ఉత్పన్నించు; పుట్టించు;
generating, adj. జనక; ఉత్పాదక;
generation, n. (1) తరం; పురుషాంతరం; అంకెసం; (2) ఉత్పత్తి; పుట్టుక; తయారీ;
new generation, ph. కొత్త తరం;
generation gap, ph. తరాంతరం;
generations, n. pl. తరాలు; పురుషాంతరాలు;
for generations, ph. తరతరాలుగా; అనుశృతంగా;
---USAGE NOTE: Generation X, Y, Millennials
---Children born between 1944 and 1964 (Post WW II) are often referred to as "baby boomers." Children born between 1965 and 1979 did not have any cultural identifier; so they are called Generation X. Then Generation Y for children born between 1980-1994, and Generation Z for children born between mid-2000 - the present day. Generation Y is also referred to as "millennials." This division is used extensively to market products to specific age groups.
generation X, n. జనాభాలో సా. శ. 1965 - 1980 మధ్య పుట్టిన తరం;
generation Z, n. జనాభాలో సా. శ. 1995 - 2015 మధ్య పుట్టిన తరం;
generative, adj. వికాసక; ఉత్పాదక;
generative model, ph. ఉత్పాదక నమూనా; A Generative Model is a powerful way of learning any kind of data distribution using unsupervised learning. Generative models aim at learning the true data distribution of the training set so as to generate new data points with some variations;
generator, n. జాతకరి; (exp.) జాత అంటే పుట్టిన అని అర్థం కనుక పుట్టించేది జాతకరి; జనకి; ఉత్పాదిని; ఉత్పాదకి; (exp.) ఉత్పాదకి అంటే ఉత్పత్తి చేసేది అని అర్థం వస్తుంది;
generic, adj. సాధారణమైన; సముదాయమైన;
generic drug, ph. సముదాయ ఔషధము; పేటెంటు లేని ఔషధము;
genesis, n. జన్మ; పుట్టుక; ఆది; మొదలు; ఆవిర్భావం; ప్రాదుర్భావం; ప్రభవం; ప్రజననం;
parthenogenesis, n. అనుషిక్త జననం; ఫలదీకరణం అవసరం లేకుండా పిండొత్పత్తి, వృద్ధి జరుగుట;
genetic, adj. జన్యు; అనువంశిక; అభిజన;
genetic defect, ph. జన్యు లోపం; జన్యు దోషం; అనువంశిక దోషం;
genetic disease, ph. జన్యు రోగం; జన్యు సంబంధ వ్యాధులు కొన్ని పుట్టుకతోనే కనిపించినా, కొన్ని పుట్టుకతో పొడచూపక ఆ తరువాత ఎప్పుడో కనిపించవచ్చును.
genetic engineering, ph. జన్యు స్థాపత్యం; ప్రాణుల వారసవాహికలలోని జన్యుపదార్థాన్ని మార్పుచేసి వాటిని ఆరోగ్యవంతంగానూ, బలవర్ధకంగానూ తయారుచేసే సాంకేతిక శాస్త్రం;
genetics, n. జన్యుశాస్త్రం;
genitals, n. జననేంద్రియాలు; జననాంగాలు; ఉపస్థ;
genitive, adj. [gram] a grammatical case indicating possession or close association;
genitive case, ph. షష్ఠీ విభక్తి; ఉ. సీత పొడుగు = సీత యొక్క పొడుగు; సీత ఆభరణం = సీత యొక్క ఆభరణం; also called possessive case; one noun possessing another noun;
genius, n. మేధావి; మహా మేధావి; ప్రతిభాశాలి;
genocide, n. జన్యుమేధం; జాతిమేధం; జాతిసంహారం; జాతివిధ్వంసం; Genocide is the deliberate and systematic destruction of a group of people based on their race, ethnicity, nationality, or religion; (see also) ethnic cleansing;
genome, n. జన్యు సంగ్రహం; జన్యు సముదాయం; జన్యుపదార్థం; ఒక జీవిలో ఉన్న మొత్తం జన్యు పదార్ధ సమాచారం; The entire set of genetic instructions carried by an organism is termed a genome (think of the genome as the encyclopedia of all genes, with footnotes, annotations, instructions, and references).
Human genome, ph. The human genome contains about between twenty-one and twenty-three thousand genes that provide the master instructions to build, repair, and maintain humans;
genotype, n. the set of genetic instructions carried by a gene; see also phenotype;
genre, n. (జాన్‌రా) ఫణితి; వన్నువ; ఉదా. సాహిత్యంలో శతకాలు ఒక వన్నువ, దండకాలు మరొక వన్నువ; a category of artistic, musical, or literary composition characterized by a particular style, form, or content;
gentleman, n. (1) పెద్దమనిషి; యోగ్యుడు; భద్రలోక్; (2) మగవాడు;
gently, adv. సుతారంగా;
gentry, n. pl. పెద్దమనుష్యులు; పెద్దలు; మర్యాదస్తులు;
genuflection, n. మోకరిల్లడం; మోకాలు వంచి దండం పెట్టడం;
genuine, adj. సిసలైన; అసలైన; నికార్సు అయిన;
genuine, n. సిసలైనది; అచ్చమైన; వాస్తవమైన;
genus, n. (1)ప్రజాతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు ఆరవ వర్గానికి పెట్టిన పేరు; [see also] Kingdom, phylum, class, order, family, genus, species;
Homo genus, ph. మానవ ప్రజాతి;
geocentric, adj. భూకేంద్రక;
geographical, adj. భూగోళ; భౌగోళిక;
geography, n. భూగోళ శాస్త్రం;
geological, adj. భూగర్భశాస్త్రానికి సంబంధించిన;
geological calendar, ph. జీవ పరిణామ కాల విభజన; ఈ కాలెండర్ కాలాన్ని "దశ" (ERA) లుగా, దశలను "ఘట్టాలు" (PERIODS) గా, ఘట్టాలను "మహాయుగాలు" (EPOCHS) గా, మహాయుగాలను తిరిగి "యుగాలు" (AGES) లుగా విభజించారు;
(1) Ezoic era = నిర్జీవ దశ; భూ ఆవిర్భావం నుంచి 260 కోట్ల సంవత్సరాలకు వరకు గల కాలాన్ని నిర్జీవ దశ అంటారు; ఈ దశలో జీవం గానీ జీవ పదార్ధం కానీ ఆవిర్భవించలేదు.
(2) Archeozoic Era = ప్రథమజీవ దశ; ఈ దశ 260-200 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ దశలోనే జీవ పదార్ధం ఆవిర్భవించి ఉంటుదని శిలాజాల ద్వారా చెప్పగలిగారు;
(3) Proterozoic Era = పూర్వజీవ దశ; సుమారు 200-50 కోట్ల సంవత్సరాల మద్య సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏక కణ జీవులు ప్రారంభ దశలో వెన్నుముక లేని సముద్రజీవులు అంతిమ దశలో ఏర్పడ్డాయి;
(4) Paleolithic Era = పురాజీవ దశ; ఈ దశ 50-20.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది. దీనిని ఏడు ఘట్టాలుగా విభజించారు;
(i) కేంబ్రియన్ పీరియడ్ (ఘట్టం): 50-42.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది; వెన్నుముక లేని జీవులు వృక్షజాతులలో జంతుజాతిలలో ఆర్ద్రోపోడ వర్గ జీవులు ఆవిర్భవించాయి;
(ii) ఆర్దోవిసియన్ పీరియడ్ (ఘట్టం): 42.5-36 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది; వెన్నుముక గల జీవులు జీవులు చేపలు భూమి పై వృక్షజాతులు అవతరించాయి;
(iii) సైలూరియన్ పీరియడ్ (ఘట్టం): 36-32.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది; మంచి నీటి చేపలు రెక్కలు లేని కీటకాలు ఆవిర్బవించాయి;
(iv) డివోనియన్ పిరియడ్ (ఘట్టం): 32.5-28 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది; భూమిపై అరణ్యాలు ఏర్పడ్డాయి ఉభయచరాలు సముద్రాలలో షార్క్ జాతులు ఏర్పడ్డాయి;
( v) మిసిసిపియన్ (కార్బోనిఫెరస్) పీరియడ్ (ఘట్టం): 28-26.5 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది. ఉభయచరాలు బాగా అబివృద్ది చెందాయి;
(vi) పెన్సిల్వేనియన్ (కార్బోనిఫెరస్) పీరియడ్ (ఘట్టం): 26.5-23 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది; సరీసృపాలు అభివృద్ది చెందాయి;
(vii) పెర్మీయన్ పీరియడ్ (ఘట్టం): 23-20.5 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది. ఈ యుగంలో ఖండాల ఆవిర్బావం ప్రారంభమయింది; వాతవరణ పరిస్తితులు తట్టుకోలేక కొన్ని ప్రాచీన జీవులు అంతరించాయి; సరీసృపాలు స్తన్య జీవులు అభివృద్ది చెందాయి;
(5) Mesozoic Era = మధ్యజీవ దశ: 20.5 -7.5 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది; దీనిని తిరిగి మూడు పీరియడ్ లుగా విభజించారు;
(i) ట్రయాసిక్ పీరియడ్ (ఘట్టం): ఈ యుగం 20.5 16.5 కోట్ల సంవత్సరాల మధ్య కొనసాగింది; ఈ యుగంలో ఎడారులు వ్యాపించాయి; డైనోసార్లు, గుడ్లు పెట్టే క్షీరదాలు అవతరించాయి;
(ii) జురాసిక్ పిరియడ్ (ఘట్టం): 16.5 - 13.5 కోట్ల సంవత్సరాల మధ్య ఈ యుగం కొనసాగింది; ఈ యుగంలో డైనోసార్లు బాగా అభివృద్ది చెందాయి; పక్షులు, మార్సూపియల్స్ (కంగారు లాంటి జీవులు) అవతరించాయి; ఖండాల ఎత్తు బాగా పెరిగాయి;
( iii) క్రిటేసియన్ పీరియడ్ (ఘట్టం): 13.5 - 7.5 కోట్ల సంవత్సరాల క్రితం కొనసాగిన ఈ యుగంలో డైనోసార్లు అంతరించిపోయాయి; వివిధ ఖండాలలో ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి; క్షీరదాలు బాగా అభివృద్ది చెందాయి;
( 6) Cenozoic Era: నవ్యజీవ దశ: ఈ దశ 7.5 కోట్ల సంవత్సరాల నుంచి 10 లక్షల సంవత్సరాల మధ్య కొనసాగింది; ఈ యుగాన్ని స్తన్య జీవుల యుగంగా చెప్పోచ్చు; ఈ దశను తిరిగి రెండు పీరియడ్ లుగా విభజించవచ్చు;
( i) టెర్షీయరీ పీరియడ్ (ఘట్టం): 7.5 కోట్ల సంవత్సరాల నుంచి కోటి పది లక్షల సంవత్సరాల మధ్య యుగంగా చెప్పుకోవచ్చు; దీనిని మళ్లి 5 మహాయుగాలు (ఎపాక్) లుగా విభజించవచ్చు;
(a) పేలియోసీన్ ఎపాక్ (మహాయుగం)
(b) ఇనోసీన్ ఎపాక్ (మహాయుగం)
(c) అలిగో సీన్ ఎపాక్ (మహాయుగం)
(d) మయోసీన్ ఎపాక్ (మహాయుగం)
(e) ప్లియోసీన్ ఎపాక్ (మహాయుగం)
ఈ టెర్షీయరీ కాలంలోనే ఆధునిక మానవుడిని పోలిన ఆంత్రోపాయిడ్ వానరాలు పరిణామం చెందాయి; ఈ కాలం చివరికొచ్చేసరికి పచ్చిక మైదనాలు అడవులు అవతరించి ఆధునిక జంతువులైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఇతర జీవులు ఈనాటి రూపాన్ని సంతరించుకున్నాయి;
(ii) క్వేటర్నరీ పీరియడ్ (ఘట్టం): నవ్య జీవదశలో రెండవ ఘట్టాన్ని క్వేటర్నరీ పీరియడ్ అంటారు; ఈ కాలం 10 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తున్నది; దీనిని రెండు ఎపాక్ లుగా విభజించవచ్చు .
(a) స్లీస్టోసీన్ ఎపాక్: ఇది 10 లక్షల సంవత్సరాల నుంచి 25 వేల సంవత్సరాల వరకు కొనసాగింది; ఈ కాలంలోనే మానవ సాంఘిక జీవనచ్ఛాయలు కనిపించాయి; హిమయుగాలు అవతరించి అంతరించిపోవటం జరిగింది;
(b) రీసెంట్ ఎపాక్: దీనినే ఆధునిక మహా యుగంగా చెప్పుకోవచ్చు; సుమారు 25 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తుంది; హిమయుగాలు అంతరించి వెచ్చని శీతోష్ణ వాతావరణం ఏర్పడి మానవ మహా యుగం ప్రారంభమైంది;
ఇలా 450 కోట్ల సంత్సరాల క్రితం ఏర్పడిన భూ గ్రహం మీద వానరుడు నరునిగా పరిణామం చెందటం అనే ప్రకృియ 3 కోట్ల 90 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై సుమారు 25 వేల సంవత్సరాల క్రితమే, ఆధునిక మానవుడిగా మార్పు చెందాడని చెప్పవచ్చు;
geology, n. భూగర్భశాస్త్రం; గ్రహగర్భశాస్త్రం; భూవిజ్ఞానం; మృత్‍పాషాణ శాస్త్రం;
geometry, n. క్షేత్రగణితం; రేఖాగణితం; జ్యామితి; (lit.) భూమిని కొలిచే శాస్త్రం;
analytical geometry, ph. వైశ్లేషిక జ్యామితి;
projective geometry, ph. ప్రలంబీయ జ్యామితి;
germ, n. (1) క్రిమి; సూక్ష్మజీవి; (2) బీజం; అంకురం;
germanium, n. శార్మణ్యం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 32, సంక్షిప్త నామం, Ge);
germicide, n. క్రిమిసంహారి; క్రిమినాశకి;
germinate, v. t. అంకురించు; మొలకెత్తు;
geriatrics, n. వయోవృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్యశాస్త్రం;
German, n. (1) జెర్మనీ దేశపు భాష; (2) జెర్మనీ దేశపు నివాసి;
germination, n. అంకురోత్పత్తి;
gerontocracy, n. వృద్ధులచే పరిపాలన;
gerontology, n. వయోశాస్త్రం; వృద్ధాప్య వైద్యశాస్త్రం;
gerund, n. భావార్థకం; నామవాచకంగా మారిన క్రియావాచకం; ఉదా. వెళ్ళడం; చెప్పడం, చెయ్యడం, మొ.; ఇంగ్లీషులో ఇవి సాధారణంగా -ing తో అంతం ఆయే మాటలు; Present participle కూడా -ing తో అంతం అవుతుంది;
gestation, n. గర్భావధి;
gestation period, ph. గర్భావధి; గర్భావధి కాలం;
gesticulate, v. i. చేతులతో అభినయిస్తూ మాట్లాడు;
gesture, n. ముద్ర; సైగ; సన్న; అభినయం; ఆంగికం; ముఖ కళవళిక; విచేష్టితం; చేష్ట; అంగవిక్షేపం; తల పంకించడం, చేతులతో చూపడం వంటి అభినయాలు; భావమును తెలుపుటకు శరీరాంగాలని కదలించడం;
eye gesture, ph. కనుసన్న;
fear-not gesture, ph. అభయ ముద్ర;
hand gesture, ph. హస్త ముద్ర; కైసన్న; హస్త ఆంగికం; హస్త చలనం వల్ల భావ వ్యక్తీకరణ;
get, v. t. పొందు; తెచ్చు; సంపాదించు;
ghat, ghaut, n. (1) కొండలోయ; పర్వతసరణి; కనుమ; (2) ఘట్టము; నదిలోకి దిగి స్నానము చెయ్యడానికి వీలుగా కట్టిన మెట్లు;
ghat road, n. లోయలోంచి వెళ్ళే రోడ్డు;
ghee, n. నెయ్యి; ఘృతం; ఆజ్యం; హవిస్; (Sans.) ఘ్హృ = to melt;
gherao, n. [Ind. Engl.] (ఘెరావ్) a lock-in where the workers lock the management in;
ghetto, n. మురికివాడ;
ghost, n. దయ్యం; పిశాచం; (rel.) poltergeist;
ghoul, n. (ఘూల్) పిశాచం; స్మశానాలలో తిరుగుతూ పాతిపెట్టిన శవాలని తినేది;
ghoulish, n. పైశాచికం;
giant, n. (1) దైత్యుడు; చాలా భారీగా, పొడుగ్గా ఉండే వ్యక్తి; (2) ఒక రంగంలో చాల పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి;
giant, adj. రాక్షసి; భీమ; బండ; పొడుగైన; పెద్ద;
giant molecules, ph. బండ బణువులు; బృహత్ బణువులు;
gibberish, n. (జిబ్బరిష్), కొక్కిరిబిక్కిరి రాత; కొక్కిరింపు; గాసట బీసట; అర్ధం పర్ధం లేని మాటలు, రాతలు, కూతలు;
gibbon, n. తోకలేని కోతి; హైలోబాటిడే (Hylobatidae) కుటుంబానికి చెందిన ఈ గిబ్బన్ లలో 4 ప్రజాతులు, 18 జాతులు ఉన్నాయి. కొమ్మలనుంచి చేతులతో ఊగుతూ వేళ్ళాడటం (Brachiation) గిబ్బన్ ల ప్రత్యేక లక్షణం; జీవ పరిణామ క్రమంలో కోతులనుంచి తోకలేని కోతులు ( Apes) విడివడినప్పుడు ముందుగా గిబ్బన్లు రూపొందాయి. అందుకే వీటిని సాంకేతికంగా Lesser Apes లేక Small Apes అంటారు. తోకలేని కోతుల సముదాయానికి చెందిన చింపాంజీలు, ఒరాంగుటాన్ లు, గొరిల్లాలు, మానవులలో పరిమాణంలో ఇవే అత్యంత చిన్నవి;
glare, n. జిగులు; వెదజల్లబడ్డ వెలుగు; సెగ; సెగవెలుగు;
glass, adj. గాజు;
glass rod, ph. గాజు కడ్డీ;
glass, n. (1) గాజు; కాచము; (2) గ్లాసు; గళాసు;
glasses, n. pl. అద్దాలు; కళ్లద్దాలు; కళ్లజోడు; కండ్లజోడు; సులోచనాలు; ముక్కద్దాలు;
glassonyms, n. pl. భాషపేరుమీద ఏర్పడే స్థలనామాలు; see also demonyms, toponyms;
glaucoma, n. నీరుకాసులు; నీటికాసులు; ఒక కంటిజబ్బు; పైకి కనబడని లక్షణాలతో, చాప కింది నీరులా వచ్చి, ముదిరితే దృష్టిని పూర్తిగా పోగొట్టి, అంధత్వం వచ్చేలా చేసే జబ్బు; జబ్బు లేతగా ఉన్న సమయంలో పసికట్టి వైద్యం చేసి దీనిని అదుపులో పెట్టవచ్చు; Glaucoma is a complex disease in which damage to the optic nerve leads to progressive, irreversible vision loss. Glaucoma is the second leading cause of blindness;
gleaming, adj. విలసితం;
gleaming with ignorance, ph. అజ్ఞాన విలసితం;
glee, n. ఆనందం; ఆహ్లాదం; సంతోషం;
glen, n. కోన; ఇరుకైన లోయ;
glide, v. i. జారు; జరుగు;
glitch, n. రూపకల్పనలో దొర్లిన పొరపాటు; అనుకున్నట్లు పని చెయ్యకపోవడం;
glitter, n. జిగి; మెరుపు; తళుకు;
glitter, v. i. అలరు; అలరారు; మెరియు; తళుక్‍మను; జిగేల్‍మను;
glittering, adj. విలసితం;
glittering with ignorance, ph. అజ్ఞాన విలసితం;
global, adj. ప్రపంచ; వసుధైక; సార్వత్రిక;
global viewpoint, ph. వసుధైక దృక్పథం;
globe, n. (1) గోళం; (2) భూగోళం; అవనీమండలం;
globular, adj. ఆణి; గోళాకార; వట్రువ;
globular clusters, ph. [astro.] ఆణి గుచ్ఛములు;
glomerulous, n. మూత్రాంగ కేశనాళికా గుచ్ఛము;
gloom, n. చీకటి; దైన్యం; నిరుత్సాహం;
glorious, adj. దేదీప్యమాన; ఉజ్వల; దివ్యమైన;
glory, n. వైభవం; ప్రభ; ప్రకాశం; కీర్తి;
gloss, n. పైమెరుపు; వ్యాఖ్య; టీక; టిప్పణి; భాష్యం;
glowworm, n. మిణుగురు పురుగు; ధ్వాంతమణి; ఖద్యోతం; జ్యోతిరింగణం;
glucose, n. మధోజు; గ్లూకోజు; రక్తంలో ఉండే చక్కెర;
glue, n. జిగురు; బంక; సర్వీసు;
glum, adj. విచారవదనంతో ఉండు; ముసురుమూతితో ఉండు;
glut, n. అపరిమితం; కూరుడు; కావలసిన దానికంటె అత్యధికం;
glutinous, adj. జిగురుగా ఉండే; జిగట;
gluttons, n. pl. తిండిపోతులు; బోరెంపోతులు; కుక్షింబరులు; ఉదరంభరులు; అద్మరులు; ఆబూతికాళ్లు;
glycemia, n. రక్తంలో కనిపించే గ్లూకోజు మట్టం; రక్తంలో గ్లూకోజు అనే చక్కర కనిపించడం; Glycemia refers to the concentration of sugar or glucose in the blood. In the United States and in many other countries, it is expressed as milligrams per deciliter (mg/dl);
glycemic index, ph. ఒక పదార్ధాన్ని మనం తిన్న తరువాత ఎంత త్వరగా మన రక్తంలో గ్లూకోజు స్థాయిని పెంచుతుందో ఆ సూచీని glycemic index అంటారు. అయితే ఆ సూచీ మనం ఆ పదార్ధాన్ని ఎంత తింటున్నామన్నది పరిగణనలోకి తీసుకోదు;
glycemic load, ph. ఆహారపదార్ధం ఎంత తింటే ఎంత గ్లూకోజు పెరుగుతుంది అని తెలుసుకోవడానికి glycemic load (GL) అనే మరొక సూచీ వాడతారు; GL విలువ 10 లోపు ఉంటే తక్కువ, 11 - 19 ఉంటే మధ్యస్థం, 20 పైన ఉంటే అధిక glycemic load;
glycerin, glycerine (Br.), n. మధురిక; గ్లిసరిన్;
glycogen, n. మధుజని; జంతువుల కండలలో ఉండే చక్కెర వంటి పిండిపదార్థం;
glyphs, n. pl. మూలరూపాలు; మూలాకారాలు; ఒక వర్ణమాలలోని అక్షరాలని రాసే బాణీలో ఉన్న మౌలికమైన ఆకారాలు;
glyptography, n. నగిషీపని;
Part 2: Gm-Gz
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
gnat, n. (నేట్) జోరీగ; మశకం;
gnaw, v.t. (నా) కొరుకు; నములు;
gnomon, n. నిట్రాట; విష్కంభం; గుంజ; శంకు; ఈ నిట్రాట నీడ పొడుగుని కొలిచి వేళ ఎంత అయిందో చెప్పవచ్చు. మిట్ట మధ్యాహ్నం ఈ నిట్రాట కింద పడే నీడ (విషువచ్ఛాయ) పొడుగుని కొలిచి ఆ ప్రదేశం యొక్క అక్షాంశం కనుక్కోవచ్చు. (ety.) ఈ మాటకీ జ్ఞానంకీ సంబంధం ఉంది. కాలజ్ఞానం ఇచ్చే రాట;
shadow cast by a gnomon, ph. విషువచ్ఛాయ;
gnu, n. ఆఫ్రికా దేశపు దుప్పి;
go, inter. వెళ్లు; వెళ్లండి; పో, పొండి;
go, v. i. వెళ్లు; చనుదెంచు; పోవు; పయనించు; ఏగు; ఏగుదెంచు; ఏతెంచు;
---Usage Note: go, gone, been
---Use gone as the usual past participle of go: Kamala has gone to Delhi (= she is there now); Raghu has been to Mumbai (= He has visited Mumbai before, but is not there now).
goad, n. ములుకోల; ముల్లుకర్ర;
goad, v. t. (1) రెచ్చగొట్టు; కిర్రు ఎక్కించు; ఉసి కొలుపు; పురి ఎక్కించు; (2) పొడుచు;
goal, n. గమ్యం; గంతవ్యం; ఆశయం; ధ్యేయం; లక్ష్యం;
lofty goal, ph. ఉన్నతాశయం;
goat, n. మేక; మేషం;
billy goat, ph. చీంబోతు; మగ మేక;
she-goat, ph. మేక;
goatee, n. గడ్డం; పిల్లి గడ్డం;
gobble, v. t. బుక్కు;
goblet, n. పానభాజనం; పానీయాలు తాగే గుండ్రని చిన్న గిన్నె;
goblin, n. అల్లరి దయ్యం; పిల్ల దయ్యం;
god, n. m. దేవుడు; వేలుపు; దైవం; భగవంతుడు; ఈశ్వరుడు; పరమేశ్వరుడు; దేవర, కడవలి; అప్పడు;
goddess, n. f. దేవత; అమ్మవారు; దేవేరి; జేజి;
godfather, n. m. జ్ఞానపిత;
God-given, n. దైవదత్తం; దేవిడిచ్చినది;
godman, n. దైవత్వం నిండిన గురువు;
god-sent, adj. ఆధిదైవిక; దైవానుగ్రహం వల్ల కలిగిన;
godhead, n. దైవత్వం;
godown, n. గిడ్డంగి; కొటారు; కోష్ఠం; కొట్టడి; గోదాం; గోడౌను; మండీ;
godspeed, n. శుభం!; క్షేమంగా వెళ్లి లాభంగా రా!; ప్రయాణం అయే ముందు ఇచ్చే శుభాకాంక్షలు;
goiter, n. గళగండం; గండమాల; మెడ దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంధి పెద్దదగుట;
gold, n. బంగారం; సువర్ణం; స్వర్ణం; కాంచనం; కనకం; పసిడి; పైడి; పుత్తడి; కుందనం; అపరంజి; హాటకం; భృంగారం; పారణ్యం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 79, సంక్షిప్త నామం, Au); [Sans.] jval, shining like a flame, [Lat.] aurum, shining dawn;
gold coating ph. జలపోసనం;
gold fiber, ph. జలతారు; బంగారుతీగ;
gold lace, ph. జలతారు; సరిగ;
gold standard, ph. సువర్ణ ప్రమాణం; బంగారం ధరని బట్టి, చలామణీలో ఉన్న డబ్బు విలువని నిర్ణయించే పద్ధతి;
golden jubilee, ph. స్వర్ణోత్సవం; సువర్ణోత్సవం; ఏభయి ఏళ్ల వార్షికోత్సవం;
golden little children, ph. [idiom] చిన్నారి, పొన్నారి బాలలు;
golden ratio, ph. [math.] స్వర్ణనిష్పత్తి; సువర్ణ నిష్పత్తి; సమబాహు పంచభుజములో స్వర్ణ నిష్పత్తి, దాని ద్వారా హేమచంద్ర-ఫిబొనాచ్చి (Hemachandra-Fibonacci numbers) సంఖ్యలు అంతర్గతమై ఉన్నాయి; ఈ స్వర్ణ నిష్పత్తి, హేమచంద్ర-ఫిబనాచ్చి సంఖ్యలు ఎన్నో రంగాలలో పదే పదే దర్శనమును ఇస్తాయి; శిల్పములలో, పూలలో, పండ్లలో, సంగీతములో, అలలలో, సర్పిలములో (spiral), ఛందస్సులో, ఇలా ఎన్నో రంగాలలో ఇవి గోచరిస్తాయి;
goldfinch, n. బంగారు పిచ్చుక; పయిడికంటి పిట్ట;
goldsmith, n. కంసాలి; నగసాలి; అగసాలి; స్వర్ణకారుడు; కమ్మటీడు;
gonad, n. [bio.] బీజాండం; సంతానాంగం;
Gondwanaland, n. గొంద్వానా ఖండం; కొన్ని మిలియన్ల సంవత్సరాల కిందట భారతదేశం, ఆస్ట్రేలియా, మొదలైన భూభాగాలన్నీ కలిసి ఉండిన రోజులలో ఒక భాగం పేరు;
gonorrhea, n. సెగ; సవాయి; పూయ మేహం; సుఖరోగం; గనేరియా;
good morning, ph. శుభోదయం; సుప్రభాతం; మేలుపొద్దులు;
good night, ph. శుభరాత్రి;
good order, ph. బరాబరు;
is it good? ph. బాగుందా?
it is not good, ph. బాగు లేదు; బాగా లేదు;
they are not good, ph. బాగు లేవు; బాగా లేవు;
good-bye, n. స్వస్తి; God be with you అన్న మాటలని క్లుప్తపరచగా వచ్చినది;
goodness, n. మంచితనం;
goods, n. దినుసులు; వస్తువులు; సామాను; సరకులు; సరంజామా;
goods train, n. మాల్‍గాడీ;
goodwill, n. సౌజన్యం; సౌహార్దం; ఆదరాభిమానాలు;
goondas, n. pl. [Ind. Engl.] గూండాలు; ruffians and toughs; enforcers typically used by political parties;
goose, n. s. (1) చక్రవాకం; బాతు రూపంలో, బాతుకంటె పెద్దది, ఈ పక్షులు వలస వెళుతూ వందల కిలోమీటర్లు ఎగర గలవు; (ety.) cognate of హంస; In Indo-European languages "ga" ==> "ha"; pl. geese; (2) దేబె; దేభ్యం; వెర్రి ముఖం;
goosebumps, ph. గగురుపాటు; రోమాంచం; రోమోద్గమం;
gore, n. నెత్తురు; కారి, గడ్డకట్టిన రక్తం;
gore, v. t. కుమ్ము; పొడుచు;
gorge, n. లోయ; గండి; కంధరం; రెండు ఎత్తయిన కొండల మధ్య ఉన్న ఇరుకైన ప్రదేశం;
gorge, v. t. బొక్కు; మింగు; కబళించు;
gorilla, n. (1) గొరిల్లా; మహావానరం; మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని, ఆఫ్రికా ఆదవులలో నివసించే పెద్ద జంతువు; [bio.] Gorilla gorilla of the Pongidae family; (2) ప్రచ్ఛన్న యుద్ధం చేసే సైనికుడు;
gory, adj. రక్తసిక్తమయిన;
gosling, n. పిల్ల చక్రవాకం; బాతు పిల్ల;
gospel, n. దైవ వాక్యం; సువార్త; బైబిల్ లోని కొత్త నిబంధనలలో నాలుగు సువార్తలు ఉన్నాయి: మత్తయ్ (Matthew), మార్క్ (Mark), లూకా (Luke), జాన్ (John); ఈ నాలుగు సువార్తలూ చెప్పేది ఒకే కథ, నాలుగు భిన్న కోణాల నుండి;
gossamer, n. సన్నటి తంతువు; సాలెపట్టు లోని దారము వంటి దారం;
gossip, n. పిచ్చాపాటి; గుసగుసలు; పనికిరాని సుద్దులు;
gourd, n. గుమ్మడికాయ;
bitter gourd, ph. చేదు పుచ్చకాయ;
bottle gourd, ph. ఆనపకాయ; సొరకాయ;
snake gourd, ph. పొట్లకాయ;
gourmand, n. m. భోజనప్రియుడు;
gout, n. ఆమవాతం;
govern, v. t. పరిపాలించు; పాలించు; ఏలు; చెలాయించు;
grace, n. (1) ఒయ్యారం; సొంపు; సోయగం; హొయలు; నయగారం; (2) కటాక్షం; అనుగ్రహం; (3) భోజనం చేసే ముందు చేసే ప్రార్థన;
graceful, adj. కమనీయ;
grackle, n. కొండ గోరింక; మాట్లాడే మైనా; talking mynah; hill mynah; this is different from the Common mynah; [bio.] Gracula religiosa of the Sturnidae family;
gradation, n. స్తరీకరణ; ఒక వరుస క్రమంలో అమరేలా చెయ్యడం;
grade, n. (1) తరగతి; (2) స్థాయి; (3) వాలు;
graded, adj. స్తరీకృత;
graded vocabulary list, ph. స్తరీకృత పదపట్టిక;
gradient, n. గండీ; వాలు; ప్రవణత; నతిక్రమం; [see also] slope; ramp;
density gradient, ph. సాంద్రతా ప్రవణత; సాంద్రతా నతిక్రమం;
grasshopper, n. గొల్లభామ; మిడత; when ordinary grasshoppers band together into a flock we call them locusts; When food supplies are scarce, they interact with other solitary grasshoppers and turn into a locust – changing color from green to yellow and black. The locusts which are called 'gregarious' locusts form a swarm and attack crops;
grate, n. గ్రాది; ఇనుప చువ్వల వరుస;
grate, v. t. కోరు; తురుము;
grater, n. కోరాం; తురుమిక; తురుముడు పీట;
grating, n. (1) కటకటాలు; (2) రూళ్లపలక; జాలకం; కటకటాల ఆకారంలో సన్నటి గీతలుతో ఉన్న గాజు పలక;
group, n. (1) గుంపు; గణం; కులం; రాసి; తతి; దండు; మేళం; బృందం; సమూహం; సందోహం; కురుంబం; పటలి; నికాయం; నిచయం; నివహం; కూటువ; [2] [Math.] ఒక సమితిలో ఏ రెండు సభ్యులని తీసుకుని ఒక ప్రక్రియ ద్వారా పుట్టించిన మూడవ సభ్యుడు కూడ ఆ సమితికే చెందితే ఆ ప్రక్రియతో కలసిన సమితిని గుంపు అంటారు. ఉదాహరణకి పూర్ణాంకములు, సంకలన ప్రక్రియ ఒక గుంపు అవుతుంది;
grout, n. బిళ్లసున్నం;
grove, n. తోట; తోపు; వనం; ఆరామం; వాటిక; వృక్షవాటిక;
sacred grove, ph. దేవాలయాలకి సంబంధించిన వనాలు;
grow, v. i. పెరుగు; ఎదుగు; పెంపుచెందు; ప్రబలు; బలియు; తామర తంపరగు; కొనసాగు;
grow, v. t. పెంచు;
growth, n. పెరుగుదల; పెరుగుడు; ఎదుగుదల; వృద్ధి; అభ్యుదయం;
arithmetic growth, ph. అంక వృద్ధి;
exponential growth, ph. ఘాతీయ వృద్ధి;
geometric growth, ph. గుణ వృద్ధి;
grudge, n. పగ; దీర్ఘకోపం;
hold a grudge, ph. పగపట్టు;
gruel, n. అంబలి; గంజి; జావ;
grunt, n. పంది చేసే గుర్రు శబ్దం;
grunter, n. పంది;
guarantee, n. జామీను; జామీను పత్రం; హామీ; పూచీ; జవాబుదారీ; భరోసా; పూటవాటు;
guana, n. ఉడుం; see also iguana;
guard, n. కాపలాదారు; కాపలా వాడు; కాపరి; కావలి వాడు;
guard, v. t. కాపలా కాయు; సంరక్షించు; కాపాడు;
guardian, n. పెద్దదిక్కు; సంరక్షకుడు;
guava, n. (గ్వువా, గ్వావా) జామ;
guava fruit, ph. జామపండు;
guess, n. అంచనా; ఊహ; బద్దింపు; ఉజ్జాయింపు;
guess, v. i. అంచనావేయు; ఊహించు;
guest, n. అతిధి; భోజనానికి వచ్చిన వ్యక్తి;
unannounced guest, ph. అభ్యాగతి; చెప్పకుండా భోజనానికి వచ్చిన వ్యక్తి;
guide, n. (1) చింతామణి; దారి చూపేది; దారి చూపే పుస్తకం; (2) దారి చూపే వ్యక్తి;
guide to medicine, ph. వైద్య చింతామణి;
guided, adj. మార్గణ: వెతుక్కుంటూ వెళ్లే;
guided missile, ph. మార్గణ క్షిపణి;
guidelines, n. మార్గదర్శకాలు; సూచనలు;
guile, n. మాయోపాయం;
guilt, n. అపరాధ భావన; దోషం; తప్పు;
guild, n. సంఘం; వణిజుల సమాజం;
guilty, n. దోషి; దోషులు;
---Usage Note: guilty, ashamed, embarrassed
---Use guilty to say that someone is unhappy because s/he has done something that has harmed someone else: He felt guilty for always coming late to work. Use ashamed to say that someone feels disappointed with himself /herself for doing things that are wrong or unacceptable. Use embarrassed when someone is upset because s/he has done something that makes her/him feel silly.
Guineafowl, n. గిన్ని కోడి; గినీ కోడి;
Guinea pig, n. గినీ పంది; బొచ్చు, చిన్న చెవులు ఉండి, తోక లేని, ఎలకని పోలిన చిన్న జంతువు; కొత్త మందులని ముందస్తుగా ఈ జంతువుల మీద ప్రయోగించి చూస్తూ ఉంటారు;
gulf, n. (1) సింధుశాఖ; సముద్రపు పాయ; దూసేరు; (2) ఖేదం; వ్యత్యాసం;
gull, n. గౌరు కాకి;
gullet, n. కుత్తుక;
gullibility, n. అమాయకత్వం; సత్తికాలపుతనం;
gulp, n. గుక్కెడు;
gulp, v. t. మింగు; దిగమింగు;
gum, n.(1) బంక; చెట్ల నుండి కారే జిగురైన పదార్థం; (2) ఇగురు; చిగురు; పంటి చిగురు;
gum arabic, ph. తుమ్మబంక; [bot.] Acacia senegal of the Mimosaceae family; తుమ్మ జాతికి చెందిన చెట్ల నుండి స్రవించే జిగురుని గమ్ అరబిక్ అంటారు. సుడాన్ లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి; భారతదేశంలోని రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాలలోను, పంజాబ్, హర్యానాలలో కూడా పెరుగుతాయి; వీటిని స్థానికంగా ఖేర్ అని పిలుస్తారు; ఈ చెట్ల కాయలు పక్వానికి వచ్చే దశలో వాటి కాండానికి గాట్లు పెట్టి వాటినుండి స్రవించే జిగురుని సేకరిస్తారు క్రీ. పూ. 2000 సంవత్సరం ప్రాంతాలనుండి ఈజిప్టులో గమ్ అరబిక్ ను ఉపయోగించినట్లు, సూడాన్ తదితర ఆఫ్రికన్ దేశాల నుంచి ఈ జిగురు అరేబియాకు, అక్కడి నుంచి అరబ్ వర్తకుల ఓడలలో యూరప్ కు రవాణా అయ్యేదనీ తెలుస్తున్నది. వాణిజ్యపరంగా మూడు ముఖ్యమైన జిగుర్లు మనం ఉపయోగిస్తాం. అవి తుమ్మ జిగురు (Arabic Gum or Gum Arabic), Gum Tragacanth, కరాయా గమ్ (Karaya Gum). ఈ జిగుర్లు రకరకాల పరిశ్రమలలో (అద్దకాలు, కాగితాలు, గోడలకి వేసే రంగులు, చాకోలెట్లు, వగైరా) వాడతారు; ఆహార పరిశ్రమలలో (సాస్ లు, సిరప్ లు, చల్లని పానీయాలు, వగైరా), ఔషధ పరిశ్రమలలో గుండలని బిళ్ళలుగా రూపొందించడంలో కూడా జిగుర్లు ఉపయోగిస్తారు.
gumbo, n. బెండ;
gumption, n. చొరవ; ప్రపంచ జ్ఞానం; లోక జ్ఞానం; ధైర్యం; దమ్ములు;
gun, n. తుపాకి; తోపు;
fire a gun, ph. తుపాకి కాల్చు;
load a gun, ph. తుపాకి దట్టించు;
gunner, n. తోపుదారు; ఫిరంగి పేల్చే వ్యక్తి;
gunpowder, n. అగ్నిచూర్ణం; తుపాకిమందు;
guru, n. (1) గురువు; (2) ప్రవీణుడు; సర్వజ్ఞుడు;
gush, v. i. చిప్పిలు;
gust, n. గాలితెర; తటాలున వీచే గాలి;
gut, n. పేగు; అంత్రం;
gutter, n. (1) కాలువ; జలదారి; ఒప్పరం; తూము; (2) ఇంటి కప్పుపై పడ్డ నీటిని కిందకి పారించే గొట్టం; (3) మురికి వాడ;
guts, n. [idiom] దమ్ములు; ధైర్యం; చొరవ; ప్రపంచ జ్ఞానం; లోక జ్ఞానం;
gutturals, n. కంఠ్యములు; కంఠం లోంచి పుట్టిన హల్లులు;
guzzle, v. t. గటగట తాగు;
guzzler, n. పెట్రోలుని గటగట తాగే కారు; పెట్రోలు పొదుపు లేని కారు;
gymkhana, n. [Indian English], జింఖానా; a British-Indian equivalent of an American country club; [ety.] derived from Urdu "gend-khana" meaning "ball-house"; probably the English word gymnasium was derived from this;
Gymnema sylvestre, n. [bot.] పొడ పత్రి; %t2e
gymnasium, n. మల్లశాల; వ్యాయామం చెయ్యడానికీ, ఆటలు ఆడుకోడానికి సదుపాయాలు ఉన్న స్థలం; జింఖానా;
gynecology, n. స్త్రీరోగశాస్త్రం;
gynecomastia, n. మగవారికి వక్షోజాలు రావడం;
gypsum, n. గోదంతి; హరశోఠం; ఒక రకం సున్నపురాయి; CaSO4·2H2O;
gyration, n. విఘూర్ణనం; బొంగరంలా తిరగడం; వర్తుల భ్రమణం;
gyrator, n. బొంగరం; విఘూర్ణి;
gyroscope, n. విఘార్ణిక; ఒక చట్రంలో గిరగిర తిరిగే బరువైన చక్రం; చక్రం ఉన్నా లేక పోయినా ఒక వేదికని నిలకడగా నిలపడానికి వాడే పనిముట్టు;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2