- enact, v.t. అనుశాసించు; శాసనం అమలులలో పెట్టు;
- enamel, n. (1) పింగాణి; (2) దంతిక; పంటిపై నిగనిగలాడే తెల్లటి పదార్థం;
- en bloc, n. (ఆన్ బ్లాక్) మూకుమ్మడిగా;
- encampment, n. శిబిరం;
- encephalitis, n. [med.] మెదడు వాపు; మస్తిష్క శోఫ;
- enchanted, adj. అభిమంత్రించబడ్డ; మంత్రానికి కట్టుబడ్డ; మంత్రముగ్ధుడైన; ఉల్లసించిన; ఆనందభరితుడైన;
- encircle, v. t. చుట్టుముట్టు; చుట్టుకొను; పరివేష్టించు;
- enclosure, n. (1) ప్రావృతం; ప్రావృత పత్రం; కవరులో పెట్టిన ఉత్తరం; (2) ప్రాంగణం; ప్రావృత ప్రదేశం;
- encode, v. t. సంకేతించు;
- encomium, n. పొగడ్త; స్తుతి; ప్రశంస;
- encompass, v. t. ఆవరించు; చుట్టుకొను; పరివేష్టించు;
- en core, n. (ఆన్ కోర్) మరొక్క సారి; once more;
- encounter, n. (1) తారసం; తటస్థపాటు; అనుకోని సమావేశం; (2) సంఘర్షణ; కొట్లాట;
- encounter, v. i. తారసపడు; కలుసుకొను; తటస్థపడు; దాపరించు;
- encounter, v. t. ఢీకొను; ఎదుర్కొను; కలహించు;
- encourage, v. t. ప్రోత్సహించు; పురికొలుపు; ప్రేరేపించు;
- encouragement, n. ప్రోత్సాహం; ప్రోద్బలం; ప్రేరణ;
- encouraging, adj. ఆశాజనక; ప్రోత్సాహకారక;
- encroach, v. t. ఆక్రమించు; అతిక్రమించు;
- encroachment, n. కబ్జా; ఇతరుల లేదా ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఆక్రమించటం;
- encrust, v. i. పెచ్చు కట్టు;
- encrypt, v. t. గుప్తీకరించు; రహశ్యలిపిలో రాయు;
- encumbrances, n. బాధ్యతలు; బరువులు;
- encyclopedia, n. విజ్ఞాన సర్వస్వం; సర్వశాస్త్ర సముచ్చయం;
- end, v. t. పూర్తిచేయు; కోసముట్టించు; ముగించు;
- end, n. (1) అంతు; చివర; కొస; కొన; తుద; ముగింపు; (2) మరణం; చావు;
- the very end, ph. చిట్టచివర; కొట్టకొన; తుట్టతుద;
- endearingly, adv. గోముగా;
- endeavor, n. ప్రయత్నం; ఎత్తికోలు;
- endemic, adj. ప్రాంతీయ; స్థానీయ; see also epidemic and pandemic;
- endemic disease, ph. ప్రాంతీయ వ్యాధి; స్థానీయ వ్యాధి; ఒక ప్రాంతంలో పాతుకుపోయిన వ్యాధి; ఏజెంసీ ప్రాంతాలలో మలేరియా ఒక "ప్రాంతీయ వ్యాధి;"
- ending, n. ముగింపు; అంతం;
- endless, adj. అనంత; దురంత; నిరంతర; అంతులేని;
- endless misery, ph. దురంత తాపం;
- endo, pref. అంతర్; లోపలి;
- endocarp, n. టెంక;
- endocrine glands, ph. వినాళ గ్రంథులు; అంతరస్రావ గ్రంథులు;
- endodermis, n. [anat.] అంతశ్చర్మం;
- endogamy, n. అంతర్వివాహం; సజాతిలోనే పెళ్ళి చేసుకొనుట;
- endogenous, adj. అంతర్జనిత;
- endorse, v. t. (1) సమర్ధించు; బలపరచు; (2) బేంకు కాగితం మీద సంతకం పెట్టు;
- endospores, n. అంతస్సిద్ధ బీజాలు;
- endothermic, adj. తాపక్షేపక; ఉష్ణగ్రాహక;
- endow, v. t. ఇచ్చు; దానమిచ్చు; వరమిచ్చు;
- endowment, n. ధర్మాదాయం; మాన్యం; శాశ్వత నిధి; శాశ్వతంగా ఆదాయాన్ని ఇచ్చే నిధి;
- endurance, n. తాలిమి; దమ్ము; సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; ఓరిమి; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత;
- endure, v. i. మన్ను;
- endure, v. t. భరించు; సహించు; ఓర్చుకొను;
- enduring, adj. శాశ్వతమైన;
- enema, n. వస్తికర్మ; గుద ద్వారం ద్వారా పిచికారీతో లోనికి మందు ఎక్కించడం; (lit.) treatment to the hypogastric part of the body;
- enemy, n. శత్రువు; వైరి; విరోధి; పగవాడు; పగతుడు; మిత్తి; అరి; పరిపంధి; అరాతి; విపక్ష; జిఘాంసువు; అహితుడు;
- energetic, adj. శక్తిమంత; ఓజోమయ, OjOmaya
- energy, n. ఊర్జితం; శక్తి; సత్తువ; ఓజస్సు; (rel.) power; strength;
- electrical energy, ph. విద్యుత్ శక్తి;
- heat energy, ph. తాప శక్తి;
- kinetic energy, ph. గతిజ శక్తి; గతి శక్తి; కదలిక వల్ల సంక్రమించే శక్తి;
- potential energy, ph. స్థితిజ శక్తి; స్థితి శక్తి; స్థాన శక్తి; గుప్త శక్తి; బీజరూప శక్తి; స్థానం వల్ల సంక్రమించే శక్తి;
- conservation of energy, ph. శక్తి నిత్యత్వము;
- Law of conservation of energy, ph. శక్తి నిత్యత్వ సూత్రము;
- enforce, v. t. జారీ చేయు; అమలులో పెట్టు;
- engagement, n. (1) యుద్ధం; (2) ప్రధానం; పెళ్ళి చేసుకుందామనే ఒడంబడిక; (note) ఒకే మాటకి రెండు వ్యతిరేకార్ధాలు ఉన్న సందర్భం ఇది;
- engagement ring, ph. ప్రధానపుటుంగరం; ఉంకుటుంగరం;
- engine, n. యంత్రం;
- engineer, n. స్థపతి; యంత్రధారి; యంత్రధారకుడు; యంత్రకారుడు; మరకాను; మరగారి; బిసగారి;
- engineer, v. t. యంత్రించు;
- engineering, n. స్థాపత్యం; స్థాపత్యశాస్త్రం; తంత్రం; బిసగారం; బిసకానికం; కీల్కానికం; మరకానకం;
- electrical engineer, ph. విద్యుత్ స్థపతి;
- mechanical engineer, ph. యంత్ర స్థపతి;
- sound engineer, ph. ధ్వని స్థపతి; ధ్వని తంత్రవేత్త; ధ్వని తాంత్రికుడు;
- sound engineering, ph. శబ్ద స్థాపత్యం; ధ్వని తంత్రం;
- English, n. (1) ఆంగ్లం; ఇంగ్లీషు; (2) ఇంగిలీసులు; ఆంగ్లేయులు;
- Englishman, n. ఆంగ్లేయుడు; ఇంగ్లీషువాడు; ఇంగ్లండుకి చెందినవాడు; (note) బ్రిటిష్ వాళ్లు అంతా ఇంగ్లీషు వాళ్లు కాదు;
- English translation, ph. ఆంగ్లానువాదం;
- engrave, v.t. చెక్కు; చిత్తరువులు చెక్కు;
- engraver, n. పోగర; కంసాలి చెక్కడానికి వాడే పరికరం;
- engulf, v. t. ముంచెత్తు;
- enigma, n. ప్రహేళిక; పజిలు; పజిల్; తలబీకరకాయ; కైపదం; చిక్కు సమస్య; కుమ్ముసుద్దు; బురక్రి బుద్ధిచెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య;
- enhance, v. t. అతిశయింపచేయు; పొడిగించు; పెంచు; అభివృద్ధి చేయు; మెరుగు పరచు;
- enjambment, n. ఒక వాక్యం కాని, సమాసం కాని, పద్యంలో ఒక పాదం నుండి తరువాతి పాదంలోనికి పదాంతంలో విరగకుండా ప్రవహించడం;
- enjoyment, n. అనుభుక్తి; అనుభూతి; అనుభోగం; ఆహ్లాదం; సంతోషం;
- enlargement, n. ప్రస్ఫుటం; వికసించినది;
- enlightenment, n. జ్ఙానోదయం;
- enlist, v.i. చేరు; v. t. చేర్చు;
- en mass, adv. (ఆన్ మాస్) మూకుమ్మడిగా; ఓహరిసాహరిగా; ఆలండవలత్తు; ఒక్కుమ్మడి;
- enmity, n. వైరం; విరోధత్వం; శత్రుత్వం; వైషమ్యం; కంటు; పగ; పోరు; మచ్చరం; విప్రతిపత్తి;
- enormous, adj. బృహత్తరమైన; పేద్ద;
- enough, adj. చాలినంత; తగినంత;
- enough, n. చాలు;
- not enough, ph. చాలదు; చాలలేదు; సరిపోలేదు; చాలవు;
- enqueue, v. t. వరుసలో చేర్చు;
---Usage Note: inquiry and enquiry
- The words inquiry and enquiry are interchangeable. However, it is becoming preferable to use inquiry to denote an investigation, and enquiry to denote a question.
|
- enquire, v. i. విచారణ చేయు; దర్యాప్తు చేయు; వాకబు చేయు; అడుగు; కనుక్కొను;
- enquiry, n. ప్రశ్నించడం; విచారణ; పృచ్ఛ; వాకబు; చర్చిక; దర్యాప్తు; ఆనుయోగం; ప్రశ్నించడం;
- enraged, adj. క్షుభితం;
- enroll, v. i. చేరు; లావణములో చేరు;
- enroll, v. t. చేర్చు; జాబితాలో వేయు; నమోదు చేయు; లావణములో చేర్చు;
- en route, adv. [Latin] (ఆన్ రూట్) దారిలో; మార్గమధ్యములో;
- entangle, v. i. చిక్కుకొను;
- entanglement, n. చిక్కు; మెలిక; సమస్య;
- quantum entanglement, ph. గుళిక మెలిక; Quantum entanglement is a bizarre, counterintuitive phenomenon that explains how two subatomic particles can be intimately linked to each other even if separated by billions of light-years of space. Despite their vast separation, a change induced in one will affect the other.
- enter, v. i. ప్రవేశించు; చొరబడు; చొచ్చు; చొచ్చుకొనిపోవు; తూకొను; దూరు; లోనికి వెళ్లు;
- enter, v. t. దఖలు పరచు; దఖలు చేయు;
- enteritis, n. ఆంత్రశోఫ; ఆంత్రప్రకోపం; పేగుల వాపు;
- entertainment, n. వినోదం;
- entertainment program, ph. వినోద కార్యక్రమం;
- enthusiasm, n. ఆసక్తి; ఉత్సాహం; ఉత్సుకత; ఔత్సుక్యం; అభినివేశం; వీరావేశం;
- entice, v. i. వలలో వేసికొను; ఆశ చూపి వంచించు; పుసలాయించు; నయనవంచన చేయు;
- entire, adj. యావత్తూ; అంతా; సాంతం; పూర్తి; సాకల్య; అఖిల; అశేష;
- entirely, adv. సాంగోపాంగంగా; సాంతంగా; పూర్తిగా; సాకల్యంగా; అశేషంగా;
- entitled, n. హక్కుదారు;
- entitlement, n. హక్కు; అధికారం; లాంఛనంగా రావలసినది; లాంఛనం; ముట్టవలసినది;
- entomology, n. కీటకశాస్త్రం; [Gr. entoma = insect];
- entourage, n. పరివారం; బలగం;
- entrance, n. ప్రవేశం; ద్వారం; గుమ్మం;
- front entrance, ph. వీధి గుమ్మం; ముఖ ద్వారం;
- main entrance, ph. సింహ ద్వారం;
- rear entrance, ph. దొడ్డి గుమ్మం; పెరటి గుమ్మం;
- entrance fee, ph. ప్రవేశ రుసుం;
- entrance frame, ph. ద్వారబంధం;
- entree, n. (ఆంట్రే) ప్రధాన వంటకం;
- entrepreneur, n. పెట్టుబడిదారు;
- entropy, n. [phy.] యంతరపి; విస్తరణతత్త్వం; సంకరత; అబందరం; అబందరమాత్రం, అబంత్రం; కల్లోలకం; గత్తర; a measure of disorder; (ety.) en tropos means 'in chaos' or 'turning into,' అబందరం means disorder; కల్లోలం means chaos; entropy can be viewed as the amount of heat flowing into (or out of) a body divided by the temperature of that body;
- entrust, v.t. అప్పగించు; బెత్తాయించు;
- entry, n. (1) ప్రవేశం; (2) దఖలు; పుస్తకంలో రాసుకునే పద్దు; (3) ఆరోపం; ఓలెము; జాబితాలో వేసుకునేది;
- main entry words, ph. ప్రధాన ఆరోపములు;
- sub entry words, ph. ఉప ఆరోపములు;
- entry in a ledger, ph. దఖలు;
- entry in a list, ph. ఆరోపములు;
- entry words, ph. ఆరోపములు; పదారోపములు;
- entwine, v. i.. చుట్టుకొను; పెనవే్సుకొను; మెలివేసుకొను;
- enumerate, v. t. లెక్కించు; లెక్కపెట్టు;
- enunciate, v. t. ప్రవచించు; ప్రకటించు; ప్రచురించు;
- envelope, n. (ఆన్‌వొలోప్) సంచి; ఉత్తరాన్ని పెట్టడానికి వాడే సంచి; కవరు; లిఫాఫా;
- envelope, v. i. చుట్టుకొను;
- envelope, v. t. చుట్టుముట్టు; కప్పు; మరుగు పరచు;
- enviable, adj. ఈర్ష్యపడదగ్గ; ఈర్ష్య పొందదగిన;
- envious, adj. ఈర్ష్యగల;
- environment, n. పర్యావరణం; పరిసరప్రాంతాలు;
- envoy, n. దూత; రాయబారి;
- envy, n. ఈర్ష్య; అసూయ; మత్సరం; కడుపుమంట; active expression of jealousy;
- envy, v. i.. ఈర్ష్య చెందు; అసూయ పడు;
- enzyme, n. అజము; ఫేనక ప్రాణ్యం; [en zyme = in yeast];
- eon, aeon [Br.], n. మహాయుగం;
---Usage note: eon, era, period, age,
- ---In geology, eon is the largest unit of time. An era is a unit of time shorter than an eon but longer than a period. Period refers to a unit of time shorter than an era but longer than an epoch. An epoch is a unit of time shorter than a period but longer than an age.
\}
- ephemeral, adj. బుద్బుదప్రాయమైన; అల్పాయుష్షుతో; తాత్కాలికమైన; క్షణికమైన; అశాశ్వతమైన, నశ్వరమైన; క్షణిక; క్షణభంగుర;
- ephemeral fever, ph. లఘుజ్వరం;
- ephemeral stream, ph. దొంగేరు;
- ephemeris, n. పంచాంగం; గంటల పంచాగం; నభోమూర్తులు ఆకాశంలో ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయో సూచించే పంచాంగం;
- epic, n. ఇతిహాసం; పురాణం; మహాకావ్యం; వీరగాథ;
- epicenter, n. కేంద్రం; నాభి; అధికేంద్రం;
- epicurean, adj. భోగపరాయణ; విలాసభరిత; భోగలాలస; భోజనప్రియ;
- epicycle, n. ఉపచక్రం; ఉపవృత్తం;
- epidemic, n. తెవులు; ప్రజామారి; ఏక కాలమందు ప్రజలమీద విరుచుకుపడి ఎక్కువగా మనుషులని చంపే వ్యాధి; [Gr. epi = మీద; demos = ప్రజలు]; an increase, often sudden, in the number of cases of a disease above what is normally expected; an outbreak becomes an epidemic when it becomes quite widespread in a particular country, sometimes in one specific region; See also endemic and pandemic;
- epidermis, n. ప్రభాసిని; బహిస్తరం;; చర్మం యొక్క పైపొర;
- epiglottis, n. పలక; తిన్న తిండి శ్వాస నాళికలోకి వెళ్లకుండా అడ్డుకునే చిన్న పలక; (ety.) epi = మీద; glottis = నాలుక కనుక epiglottis = నాలుక మీద ఉన్నది అని అర్థం వస్తుంది. నోరు తెరిస్తే నాలుక మీద కనిపించేది కొండనాలుక (uvula); కనుక కొందరు epiglottis అన్న మాటని కొండనాలుక అని అనువదించేరు, కాని అలా అనువదించడం తప్పు; uvula = ఘంటిక; చిరునాలుక; కొండనాలుక; అంగిటిముల్లు; ఉపజిహ్విక;
- epigram, n. (1) ఛలోక్తి; see also aphorism; (2) చాటుపద్యం;
- epilepsy, n. అపస్మారం; మూర్ఛ; సొలిమిడి; సొమ్మ; కాకిసొమ్మ;
- epilepsy of childhood, n. చేష్ట; బాలపాపచిన్నె;
- epilogue, n. భరతవాక్యం; తుదిపలుకు; ఆఖరి మాట;
- episode, n. ఉదంతం; ఉపాఖ్యానం; ఉప కథ; కథాంగం; సంఘటన;
- epistemology, n. జ్ఞానాన్వేషణ; జ్ఞానాన్వేషణ పద్ధతి; జ్ఞాన సాధన సామగ్రి శాస్త్రము; జ్ఞానమీమాంస;
- epitaph, n. స్మృత్యంజలి; చరమశ్లోకం;
- epithelium, n. శరీరంలో తారసపడే నాలుగు రకాల కణరాశులలో ఇది ఒకటి; శరీరపు అంగాలని కప్పిపుచ్చే పలచటి పొరలా ఉంటుంది; మిగిలిన మూడు నాడీ తంతులలోను, కండరాలలోను, నరాల లోను కనిపిస్తాయి;
- epithet, n. మారుపేరు; వర్ణనాత్మకమైన మరోపేరు;
- epitome, n. (ఎపిటమీ) సారాంశం; సంగ్రహం;
- e pluribus unum, ph. భిన్నత్వంలో ఏకత్వం;
- epoch, n. దశ; దీర్ఘకాలం;
- Epsom salt, ph. భేది ఉప్పు; magnesium sulfate; MgSO4,7H2O; దీనిని మోతాదుగా నీటిలో కలుపుకు తాగితే విరేచనం అవుతుంది; ఇంగ్లండ్ లో సర్రే (Surrey) సమీపంలోని ఎప్సమ్ (Epsom)అనే చోట భూగర్భ జలాలను మరగించి చేసే మెగ్నీసియం సల్ఫేట్ ని ఎప్సమ్ సాల్ట్ అంటారు;
- equal, n. సమానం; సమం; సరి సమానం; సాటి; సదృశం; సరి; ఈడు; జోడు; జత; ప్రాయం;
- equality, n. సమానత; సమానత్వం; సమత; సామ్యం; సదృశం; సమీకరణం; తౌల్యం;
- equalize, v. t. సమం చేయు; సమపరచు;
- equalizer, n. సమవర్తి;
- equally, adv. సరి సమానంగా; సమంగా;
- equanimity, n. స్థితప్రజ్ఞ; సమభావం; కష్టసుఖాలని సమభావంతో ఎదుర్కొన గలిగే నిబ్బరం;
- equate, v. t. సమీకరించు;
- equation, n. [math.] సమీకరణం;
- algebraic equation, ph. బీజీయ సమీకరణం; బీజ సమీకరణం;
- binomial equation, ph. ద్విపద సమీకరణం;
- cubic equation, ph. ఘన సమీకరణం; త్రిఘాత సమీకరణం; ఉ. ax3+bx2+cx+d = 0
- homogeneous equation, ph. సజాతీయ సమీకరణం;
- linear equation, ph. సరళ సమీకరణం; ఉదా: ax+b = 0
- polynomial equation, ph. బహుపద సమీకరణం; బహుపది;
- quadratic equation, ph. వర్గ సమీకరణం; ద్విఘాత సమీకరణం; ఉదా. ax2+bx+c = 0
- quartic equation, ph. చతుర్ ఘాత సమీకరణం; ఉ. ax4+bx3+cx2+dx+e = 0
- quintic equation, ph. పంచ ఘాత సమీకరణం; ఉదా: ax5+bx4+cx3+dx2+ex+f = 0
- equator, n. మధ్యరేఖ; గ్రహమధ్యరేఖ;
- celestial equator, ph. ఖగోళ మధ్యరేఖ; విషువద్ వృత్తం;
- Jovian equator, ph. గురు మధ్యరేఖ;
- lunar equator, ph. ఐందవ మధ్యరేఖ; చాంద్రయ మధ్యరేఖ;
- terrestrial equator, ph. భూమధ్యరేఖ;
- equatorial, adj. మధ్య; గ్రహమధ్య; భూమధ్య;
- equatorial plane, ph. గ్రహమధ్య తలం;
- equilateral, adj. సమబాహు;
- equilateral triangle, ph. సమబాహు త్రిభుజం;
- equilibrium, n. నిశ్చలత; సమతౌల్యత; సమస్థితి; సమతాస్థితి; సరితూకం;
- hydrostatic equilibrium, ph. జలస్థితిక సమత్వం;
- equipment, n. pl. సరంజామా; సంభారాలు; సంపత్తి; పరికరావళి; సాధనసామగ్రి; సామగ్రి;
- equinox, n. విషువత్తు; విషువం; సూర్యుడు భూమధ్య తలాన్ని దాటే సమయం; (lit.) equi = సమానమైన, nox = రాత్రులు; ఈ రోజున రాత్రి, పగలు సమానమైన పొడుగు ఉంటాయి;
- autumnal equinox, ph. శరద్ విషువత్తు; సూర్యుడు కన్యా రాసి నుండి తుల లోకి జరిగే సమయం; సెప్టెంబరు 23వ తేదీ; దక్షిణాయనం మొదలు;
- spring equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
- vernal equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
- equinox points, ph. విషువత్ బిందువులు;
- equipartition, n. సమపంపకం;
- equisetum, n. అశ్వవాలం; ఒక రకం మొక్క; గాలికీ, నీటికీ మట్టి కోరుకు పోకుండా ఉండడానికి ఈ మొక్కలని రక్షణగా వాడతారు; horse tails; scouring rush; a flowerless bush useful in preventing erosion;
- equable, adj. సరిసమానంగా; సమతుల్యంగా;
- equable climates, ph. సమతుల్యంగా ఉన్న వాతావరణాలు;
- equipartition, n. సమపంపకం;
- equipartition principle, ph. సమపంపక సూత్రం;
- equitable, adj. న్యాయమైన; నిష్పక్షపాతమైన;
- equitable distribution of wealth, ph. న్యాయంగా పంపిణీ జరిగిన ఆస్తి; అందరికీ సమానంగా ఇచ్చినది కాదు, ఎవ్వరికి డబ్బు ఎక్కువ అవసరం ఉందో వారికి ఎక్కువ ఇవ్వడం న్యాయం కదా!
- equity, n. (1) న్యాయం; నిష్పక్షపాతం; (2) నికరమైన రొక్కపు విలువ; ఒక ఆస్తి యొక్క బజారు విలువలో అప్పులు పోను నికరంగా చేతికి వచ్చే డబ్బు విలువ;
- equivalence, n. సమతుల్యత; తత్తుల్యం; ప్రాయం;
- equivalent, adj. తుల్యమైన; తత్తుల్యం; సమతుల్యమైన; తత్సమమైన; సమానార్థక; ప్రాయం;
- equivalent weight, ph. తుల్యభారం;
- equivalent, n. తుల్యాంశం; తత్సమం; ప్రాయం; సవతు;
- chemical equivalent, ph. రసాయన తుల్యాంశం;
- mathematical equivalent, ph. గణిత తుల్యాంశం;
- physical equivalent, ph. భౌతిక తుల్యాంశం;
- equivalent to an animal, ph. పశుప్రాయుడు;
- equivalent to a dead person, ph. మృతప్రాయుడు;
- equivalent to a straw, ph. తృణప్రాయం;
- equivocal, adj. సంధిగ్ధ; అనిశ్చిత; అస్పష్ట; రెండు పక్కలా పలకడం;
- equivocate, n. సంధిగ్ధంగా మాట్లాడడం; గోడమీద పిల్లిలా మాట్లాడడం; తుని తగవు తీర్చినట్లు మాట్లాడడం;
- er, suff. అరి; "doer"; maker; ఇంగ్లీషులోని క్రియావాచకాన్ని నామవాచకంగా మార్చే ఉత్తర ప్రత్యయం;
- lie + er = liar = కల్లరి; one who tells a lie;
- pot + er = potter = కుమ్మరి;
- forge + er = forger = కమ్మరి;
- idea + maker = వెరవు + అరి = వెరవరి;
- era, n. యుగం; శకం;
- Archaeozoic era, ph. ఆదిజీవ యుగం;
- Christian era, ph. క్రీస్తు శకం;
- Cenozoic era, ph. ఆధునికజీవ యుగం;
- Common era, ph. సాధారణ శకం; క్రీస్తు శకానికే మరోపేరు;
- Mesozoic era, ph. మధ్యజీవ యుగం;
- Paleozoic era, ph. పురాజీవ యుగం; (Br.) Palaeozoic;
- Proterozoic era, ph. ప్రథమజీవ యుగం;
- eradicate, v. t. నిర్మూలించు; రూపుమాపు; ఉత్పాటించు;
- eradicated, n. నిర్మూలించబడినది; ఉత్పాటితం; రూపుమాపబడినది;
- eradication, n. నిర్మూలన; ఉత్పాటనం; రూపుమాపడం; పెరికివేయడం; సమూలంగా నాశనం చేయడం;
- erect, adj. నిట్రం;
- erect pole, ph. నిట్రాట;
- erect stone, ph. నిట్రాయి;
- erection, n. (1) కట్టడం; నిర్మాణం; (2) అంగస్తంభన; రిక్కింపు; పురుషుని లింగం గట్టిపడి నిటారుగా నిలబడడం;
- erected, adj. రిక్కించిన;
- erected ears, ph. రిక్కించిన చెవులు;
- erosion, n. కోత; కృశింపు; నశింపు; క్రమక్షయం;
- eroticism, n. శృంగారం;
- errand, n. ప్రాతివేశం; చిన్న చిన్న పనులు చెయ్యడానికి వెళ్లే తిరుగుడు;
- errand boy, ph. పనులు చెయ్యడానికి తిరిగే కుర్రాడు;
- errands, n. చిల్లర పనులు;
- errata, n.pl. ముద్రారాక్షసాలు; తప్పొప్పుల పట్టిక;
- erroneous, adj. తప్పు; తప్పుడు;
- error, n. (1) తప్పు; పొరపాటు; తప్పిదం; స్ఖాలిత్యం; (2) లోపం; లొసుగు; దోషం;
- basic error, ph. పూర్తిగా తప్పు;
- error checking, ph. దోష పరీక్ష;
- error condition, ph. దోషావస్థ;
- error of commission, ph. అతిరిక్త దోషం;
- error control, ph. దోష నియంత్రణ;
- error correction, ph. దోష పరిహరణం; దోష పరిహారం; లోపమును సవరించుట; దోషమును దిద్దుట; ప్రాయశ్చిత్తం;
- error of omission, ph. న్యూన దోషం;
Usage Note: error, mistake, bug
- ---A mistake is something you do by accident, or that is a result of bad judgment. An error is something that you do not realize you are making, that can cause problems. Errors made during the writing of a computer program are called bugs.
|
- eructation, n. త్రేనుపు; ఉద్గారం;
- sour eructation, ph. పులి త్రేనుపు;
- erudition, n. పాండిత్యం;
- eruption, n. (1) పేలుడు; (2) దద్దురు; బొబ్బ; పొక్కు;
- eruption of a rash, ph. పేత పేలడం;
- eruption of a volcano, ph. అగ్నిపర్వతం పేలడం;
- eruptions, n. pl. (1) దద్దుర్లు; బొబ్బలు; (2) తట్టు; ఒక చర్మరోగం;
- erysipelas, n. సర్పి; చప్పి; ఒక రకం చర్మ రోగం;
- erythema, n. కందడం; చలితం; ఎలర్జీ వంటి ఒక చర్మ వ్యాధి;
- erythrocytes, n. ఎరక్రణాలు; రక్తంలో ఉండే ఒక రకం కణాలు;
- erythroblast, n. రుధిరాధి కణం; an immature erythrocyte, containing a nucleus.
- escape, n. పలాయనం; పరారీ;
- escape velocity, ph. పలాయన వేగం; ఒక ఖగోళం యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకుని వెళ్ళడానికి కావలసిన వేగం;
- escape, v. i. తప్పించుకొను; పారిపోవు;
- eschew, v. i. వర్జించు; మానుకొను;
- escort, n. తోడు; సాయం; పరివారం; పరిజనం;
- escort, v. t. దిగబెట్టు; తోడు వెళ్లు; సాయం వెళ్లు;
- esophagus, aesophagus; (Br.) n. అన్నవాహిక; ఆహారనాళం; ఆహారవాహిక; కృకం;
- especially, adv. విశేషించి;
- espionage, n. గూఢచర్యం; వేగు; బాతిమ; చారచక్షుత;
- espionage agent, ph. బాతిమదారు; బాతి; వేగులవాడు; గూఢచారి;
- essay, n. వ్యాసం; సంగ్రహం;
- essence, n. సారం; సారాంశం; పస; పసరు; అంతస్సారం;
- essential, adj. ముఖ్యమైన; ఆవశ్యక; సారభూత;
- essential amino acids, ph. ఆవశ్యక నవామ్లాలు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
- essential fatty acids, ph. ఆవశ్యక ఘృతికామ్లములు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
- essential oils, ph. పుష్పసారములు; సారభూత తైలాలు; సుగంధ తైలాలు; అత్తరులు; ధృతులు; స్థిర తైలాలు; ఒక మొక్కకి తనదంటూ ఒక ప్రత్యేకమైన శీలాన్ని ఇచ్చే తైలం; ఇక్కడ essential అనే మాట essence నుండి వచ్చింది; ఈ తైలాలు తీయడానికి సాధారణంగా వేడి ఆవిరిని ఉపయోగిస్తారు; see also cold pressed oils;
- establish, v. i. నెలకొను; స్థిరపడు;
- establish, v. t. (1) నిర్ణయించు; నిర్ధారించు; నిర్ధారణ చేయు; (2) స్థాపించు; నెలకొల్పు; నిర్మించు;
- established, adj. నిర్ణయించబడ్డ; స్థాపించబడ్డ; నెలకొన్న; సుస్థాపిత; పరినిష్టితమైన; పాతుకుపోయిన;
- establishment, n. సంస్థ; వ్యవస్థాపనం; ఉట్టంకణం;
- establishment, v. t. స్థాపన;
- estate, n. ఆస్థి; జమీ; భూస్థితి;
- ester, n. విస్పరి; ఆల్కహాలు; ఆమ్లము సంయోగం చెందగా వచ్చిన లవణం వంటి పదార్థం;
- esterification, n. విస్పరీకరణం;
- esthetic, aesthetic (Br.), adj. అలంకార; సౌందర్య;
- esthetics, aesthetics (Br.), n. అలంకార తత్త్వశాస్త్రం; సౌందర్య తత్త్వశాస్త్రం;
- estimable, adj. గౌరవించదగ్గ; గౌరవప్రదమైన;
- estimate, v. t. అంచనా వేయు; మదింపు చేయు; లెక్కకట్టు; ఉజ్జాయించు;
- estimate, n. అంచనా; మదింపు; ఉజ్జ; ఉజ్జాయింపు; అందాజు; అడసట్టా; ఎస్టిమేటు;
- estrangement, n. వైమనస్యం; అభిప్రాయభేదం; విమనోభావం; దుఃఖమనస్కుని భావము;
- estrogen, n. స్త్రీ శరీరంలో తయారయే ఉత్తేజితపు జాతికి చెందిన ఒక రసాయనం;
- estrus, n. రుతుకాలం; పశుపక్ష్యాదులు ఈ కాలంలోనే లైంగిక వాంఛ చూపుతాయి; (rel.) rut;
- estuary, n. విశాలసంగమం; సంగమస్థానం; సాగర సంగమం; నదీ ముఖ ద్వారం; నది సముద్రంలో కలిసే చోట విశాలమైన సంగమ స్థలం; (rel.) backwater; fjord; sound;
- et al, n. ప్రభృతులు; తదితరులు; ఆదులు; (ety.) short for et alii;
- etc., n. వగైరా; ఇత్యాదులు; మొదలగునవి; మున్నగునవి; (ety.) short for et cetera;
- eternal, adj. అభంగురమైన; శాశ్వతమైన; నిత్య; అనశ్వర; సనాతన;
- eternal, n. అభంగురం; శాశ్వతం; అనశ్వరం;
- ethics, n. (1) నీతిశాస్త్రం; (2) pl. నడవడిని, ప్రవర్తనని నియంత్రించే ధర్మ పన్నాలు;
- ethane, n. ద్వియీను; రంగు, వాసన లేని ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH3CH3; same as ethylene;
- ethene, n. ద్వియీను; కంపుతో, రంగు లేని, భగ్గుమని మండే ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH2CH2; ఈ వాయువు సమక్షంలో పండబెట్టిన కాయలకి మంచి రంగు వస్తుంది;
- ethic, n. నీతి, నియమం, నడవడి, ప్రవర్తన, మొదలైనవాటిని నియంత్రించే కట్టుబాటు;
- ethnic, adj. జాతికి సంబంధించిన; తెగకి సంబంధించిన; of or belonging to a population group or subgroup made up of people who share a common cultural background or descent.
- ethnic cleansing, ph. the mass expulsion or killing of members of an unwanted ethnic or religious group in a society;
- ethos, n. యుగధర్మం; జాతిశీలత; నైతిక, సామాజిక విలువల సముదాయం;
- etiology, n. కారణశాస్త్రం; ఏ జబ్బు ఎందువల్ల వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
- etiquette, n. మర్యాద; ఒకరినొకరు గౌరవించుకోడానికి పాటించే నియమావళి;
- -ette, suff. (1) స్త్రీ వాచకం; ఉ. bachelorette; (2) అల్ఫార్థకం; ఉ. statuette; briquette;
- etymon, n. [ling.] ధాతువు; అనేక భాషలలోని సజాతీయ మాటలకి మూలం;
- etymology, n. పదప్రవర; పదప్రవర శాస్త్రం; నిరుక్తం; శబ్దవ్యుత్పత్తి శాస్త్రం; ఏ మాట ఎక్కడనుండి వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
- etymologists, n. పదప్రవరులు; పదవ్యుత్పత్తి తెలిసిన పండితులు;
- eucalyptus oil, n. యూకలిప్టస్ తైలం; నీలగిరి తైలం;
- eugenics, n. the science of the betterment of the human race via artificial selection of genetic traits and directed breeding of human carriers;
- eukaryotic, eucaryotic, adj. కణిక సంహిత; కణికతో కూడిన; కణిక ఉన్న; నిజకేంద్రక; (ety.) eu + caryo + ote; (ant.) prokaryotic;
- eulogy, n. ప్రశంస; పొగడ్త; కీర్తిగానం;
- eunuch, n. నపుంసకుడు; కొజ్జా;
- euphemism, n. సభ్యోక్తి; శిష్టోక్తి; తీపిమాట; చెవికింపుమాట; చెప్పదలుచుకున్న మాటని డొంకతిరుగుడుగా చెప్పడం; నాజూకుగా చెప్పిన మాట : "చచ్చిపోయాడు" అనడానికి "స్వర్గస్తుడయాడు" అనడం, ‘లేవు’ అనడానికి ‘నిండుకున్నాయి’ అనడం, "క్షయరోగం" అనడానికి బదులు ఇంగ్లీషులో "టి.బి." అనడం ఉదాహరణలు :
- euphonic, adj. శ్రావ్యమైన; చెవికి ఇంపైన;
- euphony, n. శ్రావ్యత; ఇంపు; చెవులకు ఇంపైన స్వరం; స్వరసమత;
- Eurasia, n. Europe + Asia;
- European, adj. పరంగి; ఐరోపా ఖండానికి చెందిన; పరదేశాలకి చెందిన;
- European quarters, ph. పరంగి పురం;
- Eustachian tube, n. కంఠకర్ణ నాళం; గొంతుకకి, చెవికి మధ్యనున్న గొట్టం;
- euthanasia, n. విపరీతంగా బాధ పడుతూన్న రోగి అవస్థ చూడలేక, జాలితో రోగికి సునాయాసంగా మరణం కలిగేటట్లు చూడడం;
- evacuate, v. i. ఖాళీ చేయు;
- evade, v. i. తప్పించుకొను; ఠలాయించు;
- evaluate, v. i. వెలకట్టు; విలువ కట్టు; నాణ్యం కట్టు;
- evaluation, n. మూల్యాంకనం; వెల కట్టడం; విలువ కట్టడం;
- evangelist, n. క్రైస్తవ మత ప్రచారకుడు; క్రైస్తవ మతంలో చేరమని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసే వ్యక్తి;
- evaporate, v. t. ఇగుర్చు; పరిశోషించు;
- evaporation, n. (1) ఇగురు; ఇగర్చడం; పరిశోషణం; (2) బాష్పీభవనం;
- eve, n. (1) ముందు రోజు; ఒక పర్వదినానికి ముందు రోజు; (2) సాయంకాలం;
- even, adv. సయితం; సైతం;
- even, adj. సరి; సమ మట్టంగా;
- even-handed, adj. బలపక్షం లేకుండా; న్యాయపరంగా;
- even number, ph. సరి సంఖ్య;
- evening, n. సాయంకాలం; సాయంత్రం; ప్రదోషం; ప్రదోషకాలం; మునిమాపు; మాపు; మునిచీకటి; అసురసంధ్య;
- evening star, ph. శుక్రగ్రహం;
- event, n. సంఘటన; ఘటన; ఘట్టం; నడితి; సన్నివేశం;
- event handling, ph. [comp.] ఘటనా పరామర్శ;
- event handler, ph. [comp.] ఘటనా పరామర్శిక; In an event-driven environment, a block of code designed to handle the messages generated when a specific kind of event occurs;
- event horizon, ph. [phy.] సంఘటన దిగ్మండలం; సంఘటన దిక్‌చక్రం;
- eventful, adj. సంఘటనాత్మక; చరిత్రాత్మక;
- eventually, adv. ఎట్టకేలకు; ఆఖరికి; చివరికి; ఎప్పుడో ఒకప్పుడు; నిలకడమీద;
- ever, adj. సతతం; కలకాలం; ఎల్లవేళల;
- evergreen, n. సతత హరితం; నిత్యశ్యామలం;
- every, adj. అను; ప్రతి; పరి;
- every day, ph. అనుదినం; ప్రతి దినం;
- every moment, ph. అనుక్షణం; ప్రతి నిముషం;
- everybody, pron. అందరూ; అంతా; సర్వులూ;
- everyday, adj. ప్రతిరోజు; నిత్యం;
- everyone, pron. అందరూ; అంతా; సర్వులూ;
---Usage Note: every one, everyone
- ---Use every one to talk about every single person or item in a group. Use everyone to mean all people in a group.
|
- everything, adj. సర్వస్వం; సర్వం; అన్నీ; అంతా;
- everywhere, adj. ప్రతిచోట;
- evict, v. t. గెంటు; బయటకి తగులు; చట్టం ప్రకారం బయటకు వెళ్ళగొట్టు;
- eviction, n. గెంటడం; బయటకి తగిలెయ్యడం; జప్తు చెయ్యడం;
- evidence, n. నిదర్శనం; తార్కాణం; రుజువు; ప్రమాణం; సాక్ష్యం; దాఖలా;
- direct evidence, ph. ప్రత్యక్ష ప్రమాణం;
- circumstantial evidence, ph. ప్రాసంగిక సాక్ష్యం; సందర్భ ప్రమాణం; అప్రత్యక్షసాక్ష్యము; పరిస్థితిసంబంధసాక్ష్యము; సంభవాత్మకసాక్ష్యము.
- indirect evidence, ph. అనుమాన ప్రమాణం; అప్రత్యక్ష ప్రమాణం;
- evident, n. విదితం;
- self evident, ph. స్వయం విదితం;
- evil, n. (1) అభం; చెడు; (2) దౌష్ట్యం; దుష్కృత్యం; కంటకం;
- evil, adj. చెడు; దుర్మార్గమైన; అవినీతికరమైన;
- evolution, n. పరిణామం; ఊర్ధ్వముఖ పరిణామం; క్రమ పరిణామం; వికాశం; పరిణామ సృష్టి;
- theory of evolution, ph. పరిణామ సృష్టి వాదం; పరిణామ సృష్టి సిద్ధాంతం;
- evolution of language, ph. భాషా వికాశం;
- evolution by natural selection, ph. సహజ ఎంపిక వల్ల జరిగే జీవపరిణామం;
- evolutionary, adj. పరిణామాత్మక;
- ex, adj. మాజీ;
- exacerbation, n. ప్రకోపం; ఉద్రేకం; రోగ ఉద్రేకం;
- exact, adj. నిర్దిష్టంగా; సమంగా; సరిగ్గా; నిర్ధారణగా;
- exactly, adv. సమంగా; సరిగ్గా; కచ్చితంగా; అచ్చంగా;
- exaggeration, n. అతిశయోక్తి; కోత; కోతలు కోయడం; గోరంతని కొండంత చెయ్యడం;
- examination, n. పరీక్ష; పరిశీలన;
- in depth examination, ph. శలాక పరీక్ష; శల్య పరీక్ష; సూక్ష్మ పరిశీలన; పరామరిక;
- final examination, ph. సంవత్సరాంతపు పరీక్ష; చివరి పరీక్ష;
- examine, v. t. పరీక్షించు; పరికించు; పరిశీలించు; పరకాయించు;
- example, n. ఉదాహరణ; దృష్టాంతం; నిదర్శనం; తార్కాణం; మచ్చు; ఉదాహారం; ఉదాహృతం;
- counter example, ph. ప్రత్యుదాహరణ;
- exasperate, v. i. విసుగెత్తిపోవు;
- excavate, v. t. తవ్వు;
- excavation, n. తవ్వకం;
- exceed, v. i. మించు; మీరు; మితిమీరు; అతిక్రమించు; అధిగమించు; పెచ్చుపెరుగు; పురివిచ్చు; విజృంభించు;
- excellence, n. ప్రకర్ష; ప్రాశస్త్యం; ఉత్కర్ష, utkarsha
- excellent, adj. ప్రకృష్టమైన; బ్రహ్మాండమైన; లోకోత్తర; నెర;
- excellent, n. ప్రకృష్టము; బ్రహ్మాండము; లోకోత్తరము;
- except, adv. తప్ప; మినహా; వినా;
- exception, n. మినహాయింపు; వినాయింపు; అపవాదం; భిన్నవాదం; కారణాంతరం;
- exceptional, adj. అనూహ్యమైన;
- excerpt, n. ఖండిక; రచనాభాగం;
- excess, n. అధికం; అదనం; ఉరవు; ఉల్బణం; ఉత్కటం;
- excess tax, ph. అదనపు పన్ను; జాస్తి పన్ను;
- excessive, adj. అధికం; అదనం; అతి;
- excessively, adv. అత్యధికంగా; హేరాళంగా; మస్తుగా;
- exchange, n. మారకం; వినిమయం; ఫిరాయింపు; వర్గావర్గీ; అదలుబదలు; ఇచ్చిపుచ్చుకోలు; సాటా:
- exchange of ideas, ph. భావ వినిమయం;
- exchange rate, ph. మారకం రేటు; సాటా రేటు;
- exchange trade, ph. సాటా వ్యాపారం;
- foreign exchange, ph. విదేశీ మారకం;
- exchange energy, ph. వినిమయ శక్తి; సాటా శక్తి;
- exchange forces, ph. వినిమయ బలాలు; సాటా బలాలు;
- exchange, v. t. మార్చు; ఫిరాయించు; తారుమారు చేయు;
- exchange the order, ph. తారుమారు చేయు;
- exchequer, n. ఖజానా; ప్రభుత్వపు ఖజానా;
- excise, adj. వ్యాపారపు; ప్రత్యేక; ఉత్పత్తి; అబ్కారి;
- excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను;
- excitation, n. ప్రేరేపణ; ప్రేరణ; స్ఫూర్తి; ఉద్విగ్నత;
- excite, v. t. ప్రేరేపించు; ఉద్రేకపరచు; ఉత్తేజపరచు;
- excited, adj. ఉద్రేకం చెందిన; ఉద్విగ్న; ప్రోద్ధుత;
- excitement, n. ఉత్సాహం; ఉత్తేజం; ఉద్విగ్నం; ఉద్వేగం; ఉద్విగ్నత;
- exciting, n. ఉద్వేగభరితం;
- exclamation, n. రాగం; ప్రశంసార్థకం; ఆశ్చర్యార్ధకం;
- exclamation mark, ph. రాగ చిహ్నం; ప్రశంసార్థకం;
- exclude, v. t. మినహాయించు; పరిహరించు; నిరవసించు; వర్జించు;
- excluded, n. pl. నిరవాసులు;
- exclusion, n. పరిహరణ; వర్జనం; మినహాయింపు;
- excommunicate, v. t. బహిష్కరించు; వెలివేయు;
- excrement, n. అశుద్ధం; అమేధ్యం; పియ్యి; విరేచనం;
- animal excrement, ph. పేడ; పెంటిక; లద్ది;
- human excrement, ph. పియ్యి; విరేచనం;
- excrete, v. i. (1) విసర్జించు (2) ఏరుగు;
- excretion, v. i. విసర్జన;
- excretions, n. విసర్జించబడినవి; మొక్కలనుండి కారే రసాదులు;
- bodily excretions, ph. మల మూత్రాదులు; శారీరక విసర్జనాలు;
- excretory, adj. విసర్జక;
- excretory organs, ph. విసర్జక అవయవాలు;
- excruciate, adj. భౌతికంగా కానీ, మానసికంగా కానీ తీవ్రమైన; భరించనలవి కాని;
- excruciate pain, ph. తీవ్రమైన బాధ; తీవ్రమైన నొప్పి;
- excursion, n. విహారం;
- excusable, n. క్షంతవ్యం;
- excuse, n. (1) నెపం; సాకు; మిష; వంక; సందు; అపదేశం; (2) క్షమార్పణ; మన్నింపు; మాపు;
- lame excuse, ph. కుంటి సాకు;
- excuse, v. t. క్షమించు; మన్నించు;
- excuse me, ph. క్షమించండి; మన్నించండి; ఏమీ ఆనుకోకండి;
- execute, v. t. (1) అమలుజరుపు; నెరవేర్చు; నిర్వహించు; (2) ఉరితీయు;
- executive power, ph. నిర్వహణాధికారం;
- execution, n. (1) నిర్వహణ; (2) ఉరితీత; ఉజ్జాసనము;
- exegesis, n. భాష్యం; ఒక పుస్తకం మీద చేసే వ్యాఖ్య; see also hermeneutics;
- exemplar, n. మేలుబంతి; ఒజ్జబంతి, ojjabaMti; ఒరవడి; తలకట్టు; నమూనా; మాదిరి; ప్రతిరూపం; మోస్తరు; మచ్చుతునక; ఆదర్శవంతమైనది; అనుకరించడానికి వీలయినది; ప్రశస్తమయినది; శ్రేష్ఠం;
- exemption, n. మినహాయింపు; వినాయింపు; విముక్తత;
- exercise, n. (1) అభ్యాసం; సాధకం; (2) వ్యాయామం; కసరత్తు;
- aerobic exercise, ph. వ్యాయామం; ఊపిరితీతకి ప్రాధాన్యం ఇచ్చే వ్యాయామం;
- mental exercise, ph. మెదడుకి మేత;
- physical exercise, ph. కసరత్తు;
- exercise, v. i. వ్యాయామం చేయు; కసరత్తు చేయు;
- exercise, v. t. చెలాయించు; వ్యవహరించు;
- futile exercise, ph. కాకదంత పరీక్ష; కంచిగరుడసేవ;
- exercise notebook, ph. రూళ్ళు గీసిన కాగితాలతో కుట్టిన పుస్తకం;
- exertion, n.ప్రయాస;
- exhalation, n. రేచకం;
- exhale, v. i. నిశ్వసించు; ఊపిరి వదలు;
- exhaust, n. రేచకం; రేచకధూమం; బయటకి పోయేది;
- exhaust fumes, ph. రేచకం; రేచకధూమం; బయటకి పోయే వాయువులు;
- exhaustion, n. శోష; శోషణం; బడలిక; ఆయాసం; అలుపు; సేద;
- exhaustively, adv. కూలంకషంగా;
- exhibit, v. t. ప్రదర్శించు;
- exhibition, n. ప్రదర్శన;
- exhibitor, n. m. ప్రదర్శకుడు; f. ప్రదర్శకి;
- exhort, v. t. ఉద్బోధించు; ప్రోత్సాహ పరచు;
- exhume, v. t. పాతిపెట్టిన శరీరాన్ని తిరిగి వెలికి తీయు;
- existence, n. అస్థిత్వం; ఉనికి; మనుగడ;
- doubtful existence, ph. అస్థినాస్తి;
- independent existence, ph. స్వతంత్ర మనుగడ;
- existence theorem, ph. అస్థిత్వ సిద్ధాంతం;
- existing, adj. ఇప్పటి; సజీవ;
- existentialism, n. అస్థిత్వవాదం; "ఈ జీవితానికి అర్ధం/ప్రయోజనం లేవు. ఎవరో సృష్టికర్త మీ జీవితానికి ఒక లక్ష్యం/ప్రయోజనం నిర్దేశించి మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు." ఇదే అస్తిత్వవాదం యొక్క కీలకాంశం, సారం. దీనిని ఒక తత్వంగా కాకుండా జీవితం పట్ల ఒక దృక్పథం లాగ చూడాలి. ఇది నాస్తిక ఆలోచన కాదు; ఈ ఆలోచనకి చెందిన ప్రముఖ తత్వవేత్తలు - సొరేన్ కీర్కిగార్డ్(Søren Kierkegaard), మార్టిన్ హెడిగర్(Martin Heidegger), ఫ్రీడ్రిక్ నీచె(Friedrich Nietzsche), జీన్-పాల్ సార్ట్(Jean-Paul Sartre), ఆల్బర్ట్ కాము(Albert Camus) మొదలైనవారు;
- exit, n. నిర్గమం; నిర్గతి; నిష్‌క్రమణం; నిష్క్రాంతి; బయటకు పోయే దారి;
- exo, pref. బాహ్య; బహిర్;
- exogamy, n. బహిర్వివాహం; కులాంతర, మతాంతర వివాహం;
- exogenous, adj. బహిర్జాత; బహిర్జనిత;
- exorbitant, adj. అత్యధికమైన; అమితమైన;
- exorcism, n. భూతవైద్యం; ఉచ్చాటణ; extracting a demon out of a person's body;
- exorcist, n. భూతవైద్యుడు; దయ్యములను బయటకు వెడలగొట్టేవాడు;
- exosphere, n. బాహ్యావరణం;
- exothermic, adj. తాపచూషక; బాహ్యతప్త; ఉష్ణమోచక; వేడిని వెలిగక్కే;
- expand, v. i. వ్యాకోచించు; విస్తరించు; వికసించు;
- expansion, n. వ్యాకోచం; వికాసం; విక్షేపం; విస్తరణ; పొలయిక;
- ex parte, adj. [legal] ఏక పక్షంగా; ఒక వైపు నుండి మాత్రం;
- expect, v. i. ఆశించు; నమ్ము; నిరీక్షించు; ఎదురుచూచు;
- expected value, ph. సగటు విలువ; సరాసరి విలువ; ఊహించిన విలువ;
- expectation, n. (1) ఆశ; ఆకాంక్ష; నమ్మకం; అవుతుందని అనుకున్నది; (2) సగటు; సరాసరి;
- expectorant, n. కఫహరి; కళ్లెని వెడలగొట్టేది;
- expediency, n. సులభాశ్రయత;
- expedition, n. (1) యాత్ర; ప్రయాణం; సాహస యాత్ర; పరిశోధక యాత్ర; (2) దండయాత్ర;
- expeditiously, adv. సత్వరంగా;
- expel, v. t. బహిష్కరించు; తరిమివేయు; తొలగించు;
- expenditure, n. ఖర్చు; వ్యయం; వినియోగం; వెచ్చం; పోబడి; యాపన;
- bad expenditure, ph. దుర్‌వ్యయం;
- good expenditure, ph. మంచి ఖర్చు; సద్‌వ్యయం;
- expenditure of time, ph. కాలయాపన;
- expense, n. ఖర్చు; వ్యయము; వెచ్చము;
- expense and exertion, ph. వ్యయ ప్రయాసలు;
- production expense, ph. ఉత్పాదక వ్యయం;
- expensive, adj. ఖరీదయిన;
- expensive, n. ఖరీదయినది; బహుకం; బాగా డబ్బు పోసి కొన్నది;
- experience, v. t. అనుభవించు; ఆస్వాదించు;
- experience, n. అనుభవం; అనుభూతి; ఔపొందం;
- transcendental experience, ph. ఆధిభౌతికానుభవం, అశరీరానుభూతి. దేహాతీత అనుభవం, దేహాతీత అనుభూతి; నిధిధ్యాసము; మేవెలి;
- experience table, ph. అనుభవ సారణి;
- experienced person, ph. అనుభవశాలి; అనుభవజ్ఞుడు;
- experiment, n. ప్రయోగం; శోధన; ప్రయత్నం;
- experiment, v. t. ప్రయోగించు; శోధించు;
- experimental, adj. ప్రాయోగిక; ప్రయోగాత్మక;
- experimental evidence, ph. ప్రయోగాత్మక ప్రమాణం;
- experimental proof, ph. ప్రాయోగిక నిదర్శనం;
- experimentalist, n. ప్రయోక్త; శోధకుడు;
- experimented, n. ప్రయుక్తము;
- experimenter, n. ప్రయోక్త; శోధకుడు;
- expert, adj. ఫామేదా; చెయ్యితిరిగిన;
- expert, n. దిట్ట; నేర్పరి; శిఖామణి; ప్రోడ; ఘనాపాఠీ; చెయ్యి తిరిగిన మనిషి; ఆరిందా; ఫామేదా; నిపుణుడు; ప్రవీణుడు; నిష్ణాతుడు; విశారదుడు; కోవిదుడు; చాతురి, cAturi
- expertise, n. నిపుణత; నైపుణ్యత; ప్రావీణ్యత; వైదగ్ధ్యత; శేముషి; నేర్పరితనం;
- expiation, n. ప్రాయశ్చిత్తం; పాప పరిహారం;
- expiration, n. (1) నిశ్వాసం; ఊపిరిని బయటకు వదలుట; (2) మరణం; (3) కాలదోషం పట్టడం;
- expire, v. i. (1) మురిగిపోవు; కాలదోషం పట్టు; lapse; (2) మరణించు; చచ్చిపోవు;
- explain, v. t. వివరించు; విశదీకరించు;
- explanation, n. వివరణ; స్పష్టీకరణ; విపులీకరణ; వివేచన;
- explicit, adj. సువ్యక్త; స్పష్టమైన; బహిర్గత;
- exploration, n. అన్వేషణ;
- explore, v. t. అన్వేషించు;
- explorer, n. అన్వేషకి; అన్వేషకుడు;
- explosion, n. పేలుడు; పెట్లు; విస్పోటనం; స్పోటనం;
- exponent, n. (1) భాష్యకారుడు; (2) ఘాతాంకం; ఘాతం; ధ్వజాంకం; చక్రవృధ్యాంకం;
- exponential, adj. ఘాతీయ; ఘాత; చక్రవృద్ధీయ; విశేష;
- exponential growth, ph. ఘాతీయవృద్ధి; చక్రవృద్ధి; విశేష వృద్ధి;
- export, n. ఎగుమతి; నిర్యాపనం;
- expose, v. t. బయట పెట్టు; చూపించు; బట్టబయలు చేయు; బయలుపరచు; వెలార్చు;
- exposition, n. వివరణ; భాష్యం; వ్యాఖ్యానం; ఉపన్యాసం; ప్రవచనం; ఆవిష్కరణ:
- expounder, n. వ్యాఖ్యాత; వక్త;
- express, v. i. వెలిబుచ్చు; వ్యక్తపరచు; వెల్లడి చేయు; అభివ్యక్తీకరించు;
- express your opinion, ph. మీ అభిప్రాయమును వెలిబుచ్చునది;
- expression, n. (1) సమాసం; ఉక్తి; ఉక్తిసమాసం; సముచ్ఛయం; సంహతి; పలుకుబడి; (2) హావం; (3) వ్యక్తీకరణం; అభివ్యక్తీకరణ; అభివ్యక్తం;
- colloquial expression, ph. వాడుకలో ఉన్న పలుకుబడి;
- facial expression, ph. హావం; ముఖకళవళిక;
- mathematical expression, ph. గణిత సమాసం; గణిత అభివ్యక్తం;
- expressionism, n. Expressionism అనేది ఒక కళా రీతి. ఉదాహరణకు ఒక అందమైన సాయంత్రాన, చల్లగాలిలో, పచ్చటి గడ్డిలో నలుగురు స్నేహితులు సరదాగా నడుస్తున్నారు. ఇంతలో ఒకడికి panic attack వచ్చింది. అంటే మానసిక అనారోగ్యము కారణముగా - ఏ కారణము లేకుండా - విపరీతమైన కంగారు పుట్టడము. వాడికి వాడి పరిసరాలు కనబడే దానికీ, ఇతరులకు కనబడే దానికి తేడా ఉంటుందనేది ఇక్కడ లెక్క. దూరాన నడుస్తున్న ఇద్దరికీ ఏ panic attack లేదు కనుక, ప్రకృతిలో ఉన్న ఆ తరంగాలు వారినేమీ ఇబ్బంది పెట్టట్లేదు. వారు మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కల్లోలము ప్రకృతిలో లేదు. అతని మనస్సులో ఉంది.
- expulsion, n. బహిష్కారం; ఉద్వాసన; see also send off;
- expunge, v. t. తీసివేయు; కొట్టివేయు; రద్దుచేయు;
- extant, adj. సజీవ; ఇంకా ఉన్న
- extant cultures, ph. సజీవ సంస్కృతులు;
- extempore, adj. ఆశువుగా; ముందుగా తయారవకుండా;
- extend, v. i. చాపు; బారచాపు;
- extend, v. t. పొడిగించు;
- extension, n. అధివ్యాపకం; విరివిడి;
- extensive, adj. pref. పరి; సమగ్ర;
- extensive search, ph. పరిశోధన;
- extensively, adv. విరివిగా; విస్తారంగా; విస్తృతంగా; సమగ్రంగా; ముమ్మరంగా; అపరిమితంగా; సువిశాలంగా; సుదీర్ఘంగా; అధివ్యాపకంగా; విరివిడిగా;
- extent, n. మేర; పరిణాహం;
- to that extent, ph. అంత మేరకి;
- exterminate, v. t. సమూలంగా నాశనం చేయు; నిర్మూలించు;
- extermination, n. విచ్ఛిత్తి; సర్వనాశనం;
- external, adj. బాహ్య; బహిరంగ; బాహిర; బహిర్గత;
- external joint, ph. బాహిర సంధి;
- externalization, n. బాహ్యీకరణ;
- extinct, adj. చ్యుత; పరిచ్యుత; నిరాస్థులైన; అస్తిత్వం లేని; విలుప్తమైన; హరించిపోయిన; పరిమృత; సమూలంగా నాశనం అయిపోయిన;
- extinct life forms, ph. నిరాస్థులైన జీవకోటి; హరించిపోయిన జీవకోటి;
- extinct organisms, ph. పరిమృత జీవులు; పరిమృత ప్రాణులు;
- extinct, n. విలుప్తం;
- extinction, n. పరాసత్వం;
- extinguish, v. i. ఆరు; కొండెక్కు;
- extinguish, v. t. ఆర్పు;
- extol, v. t. మెచ్చుకొను; కీర్తించు;
- extortion, n. ఘరానా దోపిడీ;
- extra, adj. (1) అదనపు; ఇతర; బాహిర; బయట; (2) అసమానమైన; మహామానమైన;
- extra corporeal, ph. శారీరకేతర;
- extra expenditure, ph. అదనపు వ్యయం;
- extrasolar, adj. సూర్యకుటుంబానికి బయట;
- extra, n. అదనం;
- extract, n. సారం; అర్కం; ధృతి; కషాయం; సత్తు; అరఖు; సారభూతం;
- extract, v. t. గుంజు; పీకు; పిండు; రాబట్టు; వెలికి తీయు; నిష్కర్షించు;
- extracted, adj. సాధ్య;
- extracted oil, ph. సాధ్య తైలం;
- extraction, n. గుంజడం; పీకడం; పిండడం; రాబట్టడం; వెలికి తీయడం; నిష్కర్షణ;
- extracurricular, adj. పాఠ్యాంశేతర;
- extradition, n. ప్రత్యర్పణం; విదేశాలలో దాగున్న నేరస్తుని పీకి స్వదేశానికి రాబట్టడం;
- extraneous, adj. ఇతరేతర;
- extraordinary, adj. అసమాన్యమైన; అసాధారణమైన; మహామాన్యమైన;
- extraordinary person, ph. అసమాన్యుడు; మహామాన్యుడు; అసమాన్యురాలు; మహామాన్యురాలు;
- extrapolate, v. t. బహిర్వేశం చేయు;
- extrapolated, adj. బహిర్వేశిత;
- extrapolation, n. బహిర్వేశం;
- extrasensory, adj. అతీంద్రియ; ఇంద్రియాతీతమైన;
- extrasensory perception, ph. అతీంద్రియ శక్తి; ఇంద్రియాతీతమైన గ్రహణ శక్తి; దివ్యదృష్టి;
- extreme, adj. పరమ; అతి; చరమ; మహా;
- extremely, adv. అధి; తెగ; పరమ; మహా;
- extremely friendly, ph. అధిమిత్ర; పరమ స్నేహశీలమైన;
- extremist, n. తీవ్రవాది; విపరీతవాది; the person holding extreme political or religious views; fanaticism; (see also) terrorist;
- extremities, n. pl. (1) చివరి భాగాలు; (2) కాలి వేళ్ళు, చేతి వేళ్ళు;
- extremity, n. కొస; కొన; పరమావధి;
- extrovert, n. m. బహిర్ముఖుడు; f. బహిర్ముఖి;
- extrude, v. t. బహిస్సరించు;
- exude, v. i. ఊరు; కారు;
- exudation, n. (1) ఊట; రసం; (2) ఊరుట; చెమర్చుట;
- exultation, n. ప్రహర్షం;
- ex wife, ph. మాజీ భార్య;
- eye, v. i. చూచు;
- eye, n. (1) కన్ను; నేత్రం; నయనం; అక్షి; చక్షువు; లోచనం; కక్ష; దేహదీపం; (2) సూది బెజ్జం; (3) తుపాను కేంద్రం;
- compound eye, ph. సంయుక్త నేత్రం;
- eyeball, n. కంటి గుడ్డు; నేత్ర గోళం; తెల్లగుడ్డు;
- eyebrow, n. కనుబొమ;
- eyelash, n. కనువెంట్రుక; కనురెప్పల చివర ఉండే రోమ విశేషం;
- eyelet, n. కంటికంత;
- eyelid, n. కనురెప్ప; రెప్ప;
- eyeglasses, n. కంటద్దాలు; కళ్లజోడు; సులోచనాలు;
- eyes, n. pl. కళ్లు, కండ్లు; నయనములు; నేత్రములు; చక్షువులు; లోచనములు;
- eyesore, n. కంటికి ఇంపుగా లేని దృశ్యం; చూడ్డానికి అసహ్యంగా ఉన్నది;
- eyewitness, n. సాక్షి; (ety.) స + అక్షి.= కళ్లతో చూసినది;
|
|
మూలం
- V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
|