Jump to content

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/D

Wikibooks నుండి

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added), published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there.

Part 1: da-dh

Pennidi |- ! నిర్వచనములు ! ఆసక్తికర చిత్రములు |- |width="895"|

  • D, d, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో నాలుగవ అక్షరం; (2) పరీక్షలలో బొటాబొటీగా మార్కులు వచ్చిన వారికి వచ్చే గురుతు; (3) ఒక విటమిన్ పేరు;
  • dab, v. t. ఒత్తు; అద్దు; పులుము; రాయు; అలుకు;
  • dabble, v. i. (1) ఉన్నాననిపించు; వేలు పెట్టు; కెలుకు; (2) జలకాలాడు;
  • dactyl, n. [prosody.] (1) ఛందస్సులో ఒక గురువు తర్వాత రెండు లఘువులు వచ్చే పద్ధతి; భగణం;(2) వేలు;
  • dad, n. నాన్న; అప్ప; అయ్య;
  • daemon, n. (1) ప్రేతాత్మ. (2) దయ్యం; (3) [comp.] ప్రచ్ఛన్నవిధి; నేపథ్యంలో, వినియోగదారుని ఆధిపత్యం లేకుండా, నడిచే క్రమణిక; A computer program that is not invoked explicitly by the user, but lies dormant waiting for some condition(s) to occur; (ety.) The term was coined by the programmers at MIT's Project MAC. They took the name from Maxwell's demon, an imaginary being from a thought experiment that constantly works in the background, sorting molecules. Alternative terms for daemon are service (used in Windows, from Windows NT onwards — and later also in Linux) and and ghost job;
  • dagger, n. బాకు; కటారి; మొలకత్తి; రెండు వైపుల పదునయిన కత్తి;
    • dagger mark, ph. హంసపాదుకి వేసే శూలం గుర్తు; అచ్చు పుస్తకాలలో పేజీ దిగువ ఉన్న వివరణకి వేసే గుర్తు;
  • dalits, n. pl. [Ind. Engl.] దళితులు; హరిజనులు; (note) a preferred term for India's casteless class;
  • daily, adj. ప్రతిరోజు; దైనందినం; నిత్యం; రోజువారీ; అహరహం;
    • daily wages, ph. కైకిలి; కైకూలి; రోజు కూలి;
  • daily, n. దినపత్రిక;
  • daintiness, n. నాజూకుతనం; సుకుమారం; స్వారస్యం;
  • dairy, adj. పాడి; గవ్య; పయస్య;
    • dairy products, ph. పాడి దినుసులు; పయస్యములు; గవ్యములు;
  • dairy, n. (డెయిరీ) పాడి; పాడి పరిశ్రమ; పయస్య పరిశ్రమ;
  • dais, n. (డేస్) వేదిక; తిన్నె; గద్దె; అరుగు; జగిల;
  • dale, n. లోయ; లోవ; కనుమ;
  • dam, n. డేమ్; అడ్డకట్టు; ఆనకట్ట; (note) A dam is a high impervious barrier constructed across a river valley to form a deep storage reservoir; The surplus water is not allowed to flow over the dam, but it flows through the spillways provided at some level built into the dam; (see also) barrage and weir;
  • damage, n. హాని; చేటు; కీడు; అర; అపకారం; నష్టం;
  • dame. n. స్త్రీ; పెద్దింటి స్త్రీ; దొరసాని; అమ్మగారు;
  • damp, adj. (1) చిత్తడి; తేమగానున్న; తడిగానున్న; (2) నిరుత్సాహ మయిన;
  • damped, adj. [phys.] అవరుద్ధ; మందగింపు చేసే;
    • damped vibration, ph. అవరుద్ధ స్పందనం;
  • damper, n. ఉత్సాహాన్ని చల్లార్చేది;
  • dampness, n. తేమ; తడి; చెమ్మ; పదను; ఒరపదను; ఆర్ర్ధత; ఈకువ; ఇవుకు; ఈమిరి; చిత్తడి;
  • damsel, n. ఎలనాగ; కన్య; పడుచు; యువతి;
  • dance, n. నృత్యం; నాట్యం; లాస్యం; తాండవం;
  • dancer, n. m. నర్తకుడు; f. నర్తకి;
  • dandelion, n. సింహదంష్ట్రిక; అమెరికా గడ్డి మైదానలలో పచ్చని చామంతి పువ్వు లాంటి పువ్వుని పూసే ఒక రకం కలుపు మొక్క; [bot.] Taraxacum officinale; commonly viewed in the United States as a weed. But dandelions are traditional herbal medicine, used to stimulate the liver, promote the body’s natural detoxification processes and support healthy digestion. The botanical wellness company Traditional Medicinals turns the wild-collected roots into a variety of medicinal-grade formulations. Its Roasted Dandelion Root tea is robust and coffee-like, while EveryDay Detox Dandelion, Dandelion Chai Probiotic and Dandelion Leaf & Root are more mild and herbaceous.
  • dandruff, n. చుండు; తలమీఁద పొరలు పొరలుగా లేచెడు చర్మపు కణాలు;
  • danger, n. అపాయం; కీడు; విపత్తు; హాని; ఆపద; ముప్పు; సేగి; గండం; ఉపహతి; ప్రమాదం కలుగజేసే పరిస్థితి; see also accident;
  • dangerous, adj. అపాయకరమైన, ప్రమాదకరమైన;
  • dangle, v. i. వేలాడు; వెంట తిరుగు;
  • dank, adj. మెతక;
  • dank smell, ph. మెతక వాసన;
  • dare, n. దమ్ము; ధైర్యం;
  • dare, v. i. తెగించు; సాహసించు; ధైర్యం చేయు;
  • daredevil, n. సాహసి; గడుగ్గాయి;
  • dark, n. చీకటి;
    • extremely dark, ph. కారునలుపు;
    • pitch dark, ph. చిట్ట చీకటి; చీకటి గుయ్యారం; చిమ్మచీకటి; కటిక చీకటి; అంధకార బంధురం;
  • dark, adj. (1) చీకటి; (2) అంధకార; నల్లనైన; నలుపు; కారు; (3) ముదర;
    • dark age, ph. అంధకార యుగం;
    • dark color, ph. ముదర రంగు; కర్రి;
    • dark forest, ph. కారడవి;
    • dark matter, ph. కృష్ణ పదార్థం; విశ్వంలో కండ్లకి, పనిముట్లకి కూడ కనిపించని పదార్థం;
  • darkness, n. చీకటి; చీకువాలు; తిమిరం; అంధకారం; తామసం; తమస్సు; తామిస్రం; నిశీథం;
    • utter darkness, ph. చిట్టచీకటి; చిమ్మచీకటి; కటిక చీకటి;
  • darling, n. ముద్దులబిడ్డ; బంగారు కొండ; బాచాల కొండ;
  • dart, n. దూసి; భిండివాలం; చిన్న ఈటె; చిరుశూలం; వేసుడుబరచి;
  • dart, v. i. దూసికొని పోవు;
  • dash, n. (1) పరుగు; (2) చిటికెడు; (3) చిన్న గీత;
    • dash of salt, ph. చిటికెడు ఉప్పు;
  • dash, v.i. జోరుగా పరుగెత్తు;
  • data, n. pl. దత్తాంశలు; దత్తాలు; నిర్ధిష్టాంశలు; see also datum;
    • data dictionary, ph. దత్తాంశ కోశం; దత్తాంశ నిఘంటువు;
    • data store, ph. [comp.] దత్తాఖానా;
    • data structure, n. [comp.] దత్తాంశ ప్రత్యయం; దత్తాంశ కట్టడం;
  • database, n. [comp.] దత్తాంశనిధి; దత్తనిధి; దత్తాకరం; దత్తాంశాలను తిరిగి వెతుక్కుని వెలికి తియ్యటానికి అనుకూలంగా ఒక క్రమ పద్ధతిలో నిల్వ చేసే స్థలం;
    • database administrator, ph. దత్తనిధి ప్రశాసకుడు; దత్తనిధి వ్యవస్థాపకి;
    • database compression, ph. దత్తాంశ సంకోచనం;
  • date, n. (1) తారీఖు; తేదీ; రోజు; తిథి; (2) ఒక వేళప్పుడు కలుసుకొందామనే ఒప్పందం; (3) నియమితమైన సమయంలో కలుసుకోడానికి ఒప్పుకున్న స్నేహితురాలు, లేదా స్నేహితుడు; (4) ఖర్జూరం;
    • date palm, ph. ఖర్జూరం చెట్టు; [bot.] Phoenix dactylifera;
  • dated, adj. పాతబడ్డ; తేదీ వేయబడ్డ;
    • dative case, ph. కి, కు, కై, కొరకు; చతుర్థీ విభక్తి;
  • datum, n. s. దత్తం; దత్తాంశం; (ety.) దత్త + అంశం;
  • datura, n. ఉమ్మెత్త; ధుత్తూరం;
  • daub, v. t. పూయు; పులుము; రాయు;
  • daughter, n. పిల్ల; కూతురు; కుమార్తె; అమ్మాయి; పుత్రిక; తనూజ; నందన; బిడ్డ; పట్టి;
    • daughter cell, n. పిల్ల కణం;
  • daughter-in-law, n. కోడలు;
  • daughters-in-law, n. pl. కోడళ్లు;
  • daunted, adj. భయపడ్డ; బెదిరిన; దిగులుపడ్డ;
  • dawn, n. ఉషస్సు; ఉషోదయం; ప్రభాతం; ప్రత్యూషం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం; తెల్లవారుజాము;
  • day, n. (1) రోజు; దినం; దివసము; దివస్సు; వాసరము; అహము; అహస్సు; తేదీ; తారీఖు; వేళ; (2) పగలు; పగటివేళ; పట్టపగలు;
    • all day, ph. రోజంతా; రోజల్లా;
    • anomalous day, ph. ??
    • day and night, ph. అహర్నిశలు; అహోరాత్రం; పగలనక, రాత్రనక;
    • day by day, ph. రోజు రోజూ; దిన దిన;
    • every day, ph. ప్రతిదినం; అనుదినం;
    • holy day, ph. పుణ్యాహం;
    • sidereal day, ph. 23 hours 56 minutes 4.091 seconds; The time between successive passages of the same star through the meridian.
    • solar day, ph. 24 hours; The time between successive noons on Earth;
    • tropical day, ph. ??
  • daybook, n. దినవహి; కడితం; కవిలె; రోజు చిఠా; చిట్టా;
  • daybreak, n. ఉషోదయం; ప్రభాతం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం;
  • daylight, n. పగలు;
    • broad daylight, ph. పట్టపగలు;
  • days, n. pl. రోజులు;
    • for several days, ph. రోజుల కొద్దీ; రోజుల తరబడి;
    • in those days, ph. ఆ రోజులలో; అప్పట్లో;
  • daytime, n. పగటివేళ;
  • deacon, n. క్రైస్తవ చర్చిలో పని చేసే వ్యక్తి; పరిచారకుడు; సేవకుడు;
  • dead, adj. చచ్చిపోయిన; ప్రాణం లేని; మృత;
  • dead, n. కీర్తిశేషుడు; మృతుడు; స్వర్గస్థుడు; చచ్చిపోయినవాడు;
  • deadbolt, n. అడ్డుగడియ;
  • deadline, n. గడువు;
  • deadlock, n. ప్రతిష్టంభన;
  • deadpan, adj. ఉద్వేగరహితంగా; ఆవేశం లేకుండా; తాను ఉద్వేగం చూపించకుండా ఇతరులని నవ్వించే పద్ధతి;
  • dead-reckoning, n. ఎంతదూరం ప్రయాణం చేసేమో,ఎక్కడ ఉన్నామో, ఉజ్జాయింపుగా లెక్క కట్టడం;
  • deaf, n. చెవిటితం; చెవిటివాడు;
    • stone deaf, ph. బ్రహ్మ చెవుడు;
  • deafness, n. చెవిటితనం; బధిరత్వం;
  • deal, n. బేరం; ఒడంబడిక; ఒప్పుకోలు;
    • package deal, ph. బంగీ బేరం;
  • deal, v. t. (1) పంచు; పేక ముక్కలని పంచడం; (2) లావాదేవీలు జరుపు;
  • dealer, n. బేరగాడు; కమిషన్ వ్యాపారస్థుడు; వ్యాపారి;
  • dealings, n. లావాదేవీలు; వ్యవహారాలు; ఆదానప్రతిదానాలు; ఇచ్చిపుచ్చుకోడాలు;
  • dear, adj. (1) ప్రియమయిన; ఖరీదయిన; అరుదయిన; (2) ఆప్త; ప్రియమయిన; అపురూపమయిన; (note) one of the words in English whose two meanings match the two meanings of the corresponding Telugu word, namely, ప్రియమయిన;
    • dear friend, ph. ఆప్తమిత్రుడు; ప్రియ మిత్రుడు;
  • dearness, adj. ప్రియం; అధిక ఖరీదులు; కరువు; వస్తువులు దొరకక పోవడం;
    • dearness allowance, ph. కరువు భత్యం;
  • death, n. చావు; నిలుగు; మిత్తి; మరణం; మృత్యువు; పరాసత్వం; నిర్యాణం; నిర్గమం; మహాప్రస్థానం;
    • fast unto death, ph. ప్రాయోపవేశం; నిరాహార దీక్ష;
    • sudden death, ph. కాకిచావు; ఆకస్మిక మరణం; హఠాన్మరణం; అపమృత్యువు;
    • death penalty, ph.. మరణశిక్ష;
  • deathbed, n. మరణశయ్య;
  • dearth, n. కరువు; లోటు; కొరత; అధిక గిరాకీ;
  • debar, v. t. అడ్డగించు; నిషేధించు;
  • debarkation, n. పడవ మీద నుండి దిగడం;
  • debatable, adj. వివాదాస్పదమయిన; చర్చనీయ;
  • debate, n. వివాదం; చర్చ; తర్జనభర్జన;
  • debauchery, n. రంకుతనం; జారత్వం; వేశ్యాలోలత్వం;
  • debenture, n. రుణ పత్రం; అప్పు పత్రం;
  • debilitate, v. t. నీరసపరచు; బలహీనపరచు;
  • debility, n. బలహీనత; నీరసం; దౌర్బల్యం;
    • mental debility, ph. మానసిక దౌర్బల్యం; కశ్మలం;
  • debit, n. ఖర్చు; బాకీ; వ్యయం;
  • debit, v. t. ఖర్చువ్రాయు;
  • debonair, adj. నాగరిక; సభ్య; మర్యాదతో కూడిన; సరస;
  • debris, n. (డెబ్రీ) శిథిలాలు;
    • tissue debris, ph. కణజాల శిథిలాలు;
  • debt, n. (డెట్) అప్పు; రుణం; బాకీ;
    • bad debt, ph. చెల్లించని బాకీ; రాని అప్పు;
    • consolidation debt, ph. రుణార్ణ; రుణ + రుణ; చిన్న చిన్న అప్పులని తీర్చడానికి చేసే పెద్ద అప్పు;
    • national debt, ph. ప్రార్ణం; ప్రభుత్వం చేసిన అప్పు; (ety.) ప్రవత్సతర + రుణ = ప్రార్ణ, లేక పెద్ద అప్పు; సంస్కృతంలో ఈ సంధి కార్యం ఒక ప్రత్యేక నియమానికి లోబడి ఉంది. సర్వసాధారణంగా అకారాంత పదాల తర్వాత రు శబ్దం వస్తే, రు శబ్దమే మారుతుంది. ఉదా : బ్రహ్మ + రుషి = బ్రహ్మర్షి. కాని అకారం తర్వాత రుణ అన్న మాట వచ్చినప్పుడు మాత్రం అకారానికి దీర్ఘం వస్తుంది. ఉదా : ప్రవత్సతర + రుణ = ప్రార్ణ.
    • small debt, ph. వత్సరార్ణం; వత్సతర + రుణ ; ఏడాదిలోగా తీర్చేసే చిన్న అప్పు;
  • debtor, n. (డెటర్) బాకీదారు; రుణి; రుణికుడు; రుణగ్రస్తుడు; అరువరి; అప్పారావు; అప్పులపోతు; అధమర్ణ = అధమ + రుణ;
  • debug, v. t. తప్పులేరు; దోషాలు వెతుకు; దోషనిరూపణం;
  • debugger, n. దోషనిరూపకి;
  • debugging, n. తప్పుతీత; (కలుపుతీత లా); తప్పులేరడం; క్రమణికలలో తప్పులు ఏరడం; దోషనిరూపణం;
  • debunk, v. t. ఒక నమ్మకాన్ని వమ్ము చెయ్యడం;
  • debut, n. (డెబ్యూ) రంగప్రవేశం; అరంగేట్రం;
  • debutante, n. f. (డెబ్యుటాంట్‍) రంగప్రవేశం చేసిన అమ్మాయి; వయసొచ్చిన పిల్ల; పశ్చిమ దేశాలలో, సంపన్నుల సంసారాల్లో, ఇల్లు వదలి పార్టీల వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టిన పిల్ల;
  • decade, n. దశాబ్దం; దశకం; పదంగి;
  • decadence, n. క్షీణదశ;
  • decadent, adj. క్షీణదశలో ఉన్న;
  • decagon, n. దశభుజి; దశకోణి; పది భుజాలు ఉన్న రేఖా చిత్రం;
  • decane, n. దశేను; పది కర్బనపు టణువులు ఉన్న ఉదకర్బన రసాయనం; C10H22;
  • decant, v. t. తేర్చు; పైన ఉన్న తేటను విడతీయు;
  • decantation, n. తేర్చుట; మడ్డి కిందకి దిగగా పైనున్న ద్రవాన్ని వేరు చేయుట; [rel.] filtration;
  • decapitation, n. శిరచ్ఛేదన; తల నరికెయ్యడం;
  • decay, n. క్షయం; కుళ్లు; తగ్గుదల;
    • linguistic decay, ph. భాషా క్షయం;
  • decay, v. i. క్షీణించు; కుళ్లు; కృశించు; తగ్గు;
    • allow to decay, ph. మురగబెట్టు; కుళ్ళబెట్టు;
  • decayed, n. జర్జరం; శిధిలం;
  • Deccan, n. దక్షిణాపథం; దక్కను పీఠభూమి;
    • Deccan Traps, ph. దక్కను పీఠభూమిలో కనబడే శిలాద్రవపు రాళ్లు;
  • deceased, adj. చచ్చిపోయిన; మరణించిన;
  • deceased, n. పరాసు; మరణించిన వ్యక్తి;
  • deceit, n. దగా; వంచన; మోసం; కుయుక్తి; కపటం; కైతవం; ప్రలంభం; శఠత్వం;
  • deceitful, adj. దగా; శఠత్వ;
    • deceitful person, ph. దగాకోరు;
  • deceitfulness, n. కపటం; కాపట్యం;
  • deceive, v. t. దగా చేయు; వంచన చేయు; మోసం చేయు; మోసగించు; మభ్యపరచు;
  • deceleration, n. ఋణత్వరణం; త్వరణం ఎంత జోరుగా తగ్గుతోందో చెప్పే సూచిక;
  • decent, adj. పరవాలేని; బాగానే ఉన్న; మంచి; మర్యాద అయిన;
  • decentralization, n. వికేంద్రీకరణ;
  • decency, n. పరవాలేని ప్రవర్తన; మర్యాద;
  • decentralization, n. వికేంద్రీకరణ;
  • deception, n. మతకం; మోసం; మాయ; వంచన; దగా;
  • decibel, n. డెసిబెల్‍; శబ్దం ఎంత బిగ్గరగా ఉందో చెప్పే కొలమానం;
  • decide, v. t. నిర్ణయించు; v. i. నిర్ధారణ చేయు;
  • deciduous, adj. [bot.] పతయాళు; ఆకు రాల్చే స్వభావము గల;
    • deciduous tree, ph. పతయాళువు;
  • decimal, adj. [math.] దశాంశ;
    • decimal arithmetic, ph. దశాంశ అంకగణితం;
    • decimal complement, ph. దశాంశ పూరకం;
    • decimal notation, ph. దశాంశ పద్ధతి;
    • decimal number system, ph. దశాంశ పద్ధతి;
    • decimal place, ph. దశాంశ స్థానం;
    • decimal point, ph. దశాంశ బిందువు;
    • decimal system, ph. దశాంశ పద్ధతి;
  • decimate, v. t. (1) నిర్మూలించు; ఓడగొట్టు; (2) పదవ వంతు నాశనం చేయు;
  • decimation, n. నిర్మూలన; పెద్ద ఎత్తున నిర్మూలన; [lit.] దశాంశ నిర్మూలన; పదవ భాగాన్ని నిర్మూలించడం;
  • decision, n. తీర్మానం; తీర్పు; నిర్ణయం; పరిష్కారం; నిర్ధారణ; నిశ్చయం;
  • decisive, adj. నిష్కర్ష;
  • decipher, v. t. గుప్త సంకేతంలోని అసలు సమాచారాన్ని విడదీయడం;
  • deck, n. (1) గట్టు; తీనె; (2) దస్తా; (3) మంచె; (4) ఓడలో బయలు ప్రదేశం;
    • deck of cards, ph. పేక దస్తా;
  • deck, v. i. అలంకరించుకొను;
  • deck, v. t. అలంకరించు;
  • declaration, n. ప్రకటన; నివేదన; ఆఖ్యానం; ప్రపచనం;
  • declarative, adj. నివేదిక; ఆవేదక; ప్రవచార్ధక;
  • declare, v. t. ప్రకటించు; ప్రవచించు; నివేదించు; సమాఖ్యించు;
  • declension, n. [gram.] విభక్తి ప్రత్యయాన్ని చేర్చడం;
  • declination, n. [astron.] (1) దిక్పాతం; ఖగోళ రేఖాంశం; వక్ర ప్రసరణ కోణం; the angular distance north or south from the celestial equator measured along a Great Circle passing through the celestial poles; analog to latitude on the surface of the globe; [see also] Right ascension; (2) నిరాకరణ; the formal refusal of an invitation;
  • decline, n. తిరోగతి; అవనతి; చ్యుతి; క్షీణదశ; క్షీణావస్థ;
  • decoction, n. కషాయం; క్వాథం;
    • pepper decoction, ph. మిరియాల కషాయం;
  • decompose, v. i. శిధిలమగు; కుళ్లు;
  • decompose, v. t. (1) వియోగపరచు; విడదీయు; (2) కుళ్లబెట్టు;
  • decomposition, n. వియోగం; కుళ్ళడం; శిధిలమవడం; పర్యూషితం;
    • chemical decomposition, ph. రసాయన వియోగం;
300px-Decanoic_acid
    • decanoic acid, ph. దశనోయిక్‍ ఆమ్లం; మేషిక్‍ ఆమ్లం; కేప్రిక్‍ ఆమ్లం; పది కర్బనపు అణువుల గొలుసు ఉన్న గోరోజనామ్లం; CH3(CH2)8COOH
  • deconstruction, n. వినిర్ణతి; వినిర్మాణం; ఉచ్ఛేదన;
  • decorate, v. t. అలంకరించు; ముస్తాబు చేయు; సింగారించు;
  • decorated, adj. సాలంకృత; అలంకారాలతో ఉన్న;
  • decoration, n. అలంకరణ; అలంకారం; అలంకృతి; సింగారింపు; కైసేత; ముస్తాబు;
  • decorticated, adj. పొట్టుతీసిన; without the outer skin (of cereal grains);
  • decoy, n. పరులని తప్పుదారి పట్టించడానికి వాడే వస్తువు;
  • decree, n. తీర్పు; నిర్ణయం; శాసనం; జారీ; ఫర్మానా;
  • decrease, v. i. తగ్గు; సన్నగిల్లు;
  • decrease, v. t. తగ్గించు; కుదించు; సడలించు;
  • decrement, n. తగ్గింపు; కోత;
  • dedicated, adj. అంకిత; అంకితభావంతో;
  • dedication, n. (1) అంకితం; (2) కార్యదీక్ష; నిధిధ్యాసనం; నిరతి; పరాయణత్వం;
    • dedication to service, ph. సేవా నిరతి;
    • dedication to oppressing others, ph. పరపీడన పరాయణత్వం;
  • deduce, v. t. [math.] సామాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని తార్కికంగా నిర్ణయించడం;
  • deduct, v. t. మినహాయించు; తగ్గించు;
  • deduction, n. (1) మినహాయింపు; తగ్గింపు; (2) తీసివేత; తగ్గింపు; వ్యవకలనం; (3) [logic] నిగమనం; సామాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని నిర్ణయించే తర్కం; (ant.) induction;
  • deed, n. (1) చేష్ట; చేసిన పని; కృత్యం; కార్యం; (2) పత్రం; కాగితం; దస్తావేజు;
    • good deed, ph. మంచి పని; సత్కార్యం;
    • sinful deed, ph. పాపకృత్యం;
  • deep, adj. (1) లోతైన; గాఢమైన; గహన; గంభీరమైన; (2) ముదురు;
    • deep space, ph. గహన గగనం;
    • deep blue, ph. ముదురు నీలం;
    • deep seated, ph. పాతుకుపోయిన; సుస్థిర; అంతస్థిత;
  • deep-fry, v. t. వేయించు; నూనెలో వేయించు;
    • deep-frying pan, ph. మూకుడు; బాణలి;
  • deer, n. జింక; ఇర్రి; మృగం; హరిణం; కురంగం; (rel.) buck; doe;
    • baby deer, ph. శాబకం;
    • female deer, ph. లేడి; doe;
    • spotted deer, ph. దుప్పి;
  • de facto, adj. [Latin] నిజానికి; నిజం చెప్పాలంటే; అసలైన; యదార్థ; వాస్తవిక;
  • defamation, n. పరువు నష్టం; నగుబాటు; అపనింద; అపవాదు;
  • default, n. గుజస్తు; అపక్రమం; తనంతి; చెయ్యవలసిన పనిని వేళకి చెయ్యలేక పోవడం;
    • default font, ph. తనంతి ఖతి;
    • default setting, ph. ఎలా ఉన్నదానిని అలాగే వాడుకోవడానికి వీలైన అమరిక;
  • defeat, n. ఓటమి; అపజయం; పరాజయం;
  • defecate, v. t. మలవిసర్జన చేయు;
  • defecation, n. మలవిసర్జన చెయ్యడం;
    • public defecation, ph. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చెయ్యడం;
  • defect, n. లోపం; లోటు; పొచ్చెం; అచ్చిక; వికలం; ఓడు; మొర్రి; అరకొర; ఢోకా; తఫావతు;
  • defective, adj. లోపం ఉన్న; ఓటి; లోపభూయిష్టమయిన; కోరా; వికల;
    • defective organ, ph. వికలాంగం;
    • defective pot, ph. ఓటి కుండ;
  • defend, v. t. (1) రక్షించు; కాపాడు; కాయు; (2) సమర్ధించు;
  • defendant, n. ప్రతివాది; ప్రత్యర్థి; ముద్దాయి; In Anglo-Saxon jurisprudence, the government is always the plaintiff in criminal cases and must prove its case against the defendant beyond a reasonable doubt (అనుమానానికి తావు లేకుండా). In civil cases, it is sufficient to show a preponderance of the evidence.
  • defense, defence (Br.), n. (1) రక్షణ; కాపు; (2) సమర్ధన; మద్దత్తు; ప్రతివాదం; (3) ముద్దాయి పక్షం;
    • defense ministry, ph. రక్షణ మంత్రివర్గం;
  • defensive, adj. రక్షక;
    • defensive mechanism, ph. రక్షక సంవిధానం;
  • defiance, n. ధిక్కారం;
  • deficiency, n. లోటు; కొరత; వెలితి; అచ్చిక; అరకొర;
  • deficit, n. లోటు; లోపము; వెలితి; కొరత; కొదవ; కొరవ; కొర; న్యూనత;
    • budget deficit, ph. బడ్జెట్ లోటు; ఆదాయం కంటె ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో లోటు వస్తుంది. ఆలోటుని భర్తీ చెయ్యడానికి అప్పు చెయ్యవచ్చు.
  • defile, v. t. అపవిత్రం చేయు; ఎంగిలి చేయు; మలినం చేయు; భ్రష్టం చేయు;
  • define, v. t. నిర్వచించు; విశదీకరించు; లక్షణములు చెప్పు;
  • definite, n. నిర్దిష్టం; ఇదమిత్థం;
  • definitely, adv. కచ్చితంగా; ఇదమిత్థంగా;
  • definition, n. నిర్వచనం; నిరువల్కు;
  • definitively, n. ఇదమిత్థంగా; నిశ్చితంగా; ఖరాఖండిగా;
  • deflation, n. తుస్సుమనడం; గాలి తీసెయ్యడం; Deflation is a general decline in prices for goods and services, typically associated with a contraction in the supply of money and credit in the economy; see also inflation;
  • deformity, n. అవలక్షణం; అవిటితనం; అంగవైకల్యం;
  • defraud, v. t. మోసపుచ్చు; దగాచేయు;
  • deft, adj. చురుకయిన;
  • defunct, adj. చచ్చిపోయిన; మృత;
  • defy, v. i. ధిక్కరించు; ఎదిరించు; తిరస్కరించు;
  • degenerate, adj. అపభ్రష్ట; పతిత; భ్రష్ట; శిధిల; తిరోగమన;
  • degeneration, n. అధఃపతనం; శైథిల్యం; అరుగుదల; క్షీణత;
  • degradation, n. అధోకరణం; అధఃపతనం; శైథిల్యం; అరుగుదల;
  • degreaser, n. అటకలి; జిడ్డుని వదలగొట్టేది;
  • degree, n. (1) అంశ; (2) భాగ; డిగ్రీ; కోణ పరిమాణం; (3) డిగ్రీ; పరిమాణం;
    • degree of an angle, ph. కోణభాగం;
    • degree of latitude, ph. అక్షభాగం;
    • degree of longitude, ph. రేఖాభాగం;
  • dehydrated, adj. ఎండిన; ఎండబెట్టిన; నీరు తీయబడిన;
  • dehydration, n. నిర్జలీకరణం; ఎండబెట్టడం;
  • deification, n. దైవత్వాన్ని ఆపాదించడం; అవతారమెత్తిన వ్యక్తి అని కొనియాడడం;
  • deism, n. ఈశ్వరజగద్భేదవాదము; ఈ వాదంలో ప్రపంచం, దేవుడు నడుమ స్పష్టమైన గీత గీయబడింది. దేవుడు సృష్టించేసి, ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయి, ఎక్కడో స్వర్గం వంటి చోట నివసిస్తున్నాడు. దేవుడు పరోక్ష భూస్వామి వంటి వాడు. సృష్టికి దేవుడు నిమిత్తకారణం (Efficient Cause) మాత్రమే. ఇక్కడ జరిగే విషయాల ఆయనకు ఏమాత్రం పట్టవు. ఇసాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ వంటి వారు ఈ వాదాన్నే సమర్ధించారు;
  • deity, n. దేవుడు; దేవత; దైవం;
    • presiding deity, ph. అధిదేవత; అధిష్టాన దేవత;
  • dejected, adj. విషణ్ణ; ఖిన్న విచార;
    • dejected face, ph. విషణ్ణ వదనం; ఖిన్న వదనం;
  • dejection, n. విషణ్ణం; నిరుత్సాహం; చింత; వ్యాకులపాటు;
  • de jure, adj. [Latin] న్యాయానికి; చట్టరీత్యా; పేరుకి మాత్రం;
  • delay, n. ఆలస్యం; విలంబన; జాగు; జాప్యం; కాలయాపనం; కాలవిలంబన; కాలాతీతం; తామసం;
    • time delay, ph. కాలయాపనం; కాలవిలంబన;
  • delay, v. i. ఆలస్యం చేయు; జాప్యం చేయు; జాగు చేయు;
    • delay line, ph. [elec.] విలంబన మార్గం; విలంబన తంతువు; తామస తంతువు;
  • delegate, n. ప్రతినిధి; సభ్యుడు; నియుక్తుడు; నియోగి;
  • delegate, v. t. నియోగించు; పని మరొకరికి అప్పగించు;
  • delegation, n. నియుక్త బృందం; సభ్య బృందం; రాయబార వర్గం;
  • delerium, n. సంధి; స్మృతి భ్రంశం;
  • delete, v. t. కత్తిరించు; కొట్టివేయు; జాబితా నుండి తొలగించు; మినహాయించు; పాటాకొట్టు; పరిహరించు;
  • deli, n, తినడానికి తయారుగా ఉన్న రొట్టె, చీజు, ఊరబెట్టిన మాసం; చేపలు, వగైరా అమ్మే స్థలం; short for delicatessen;
  • deliberate, adj. బుద్ధిపూర్వకంగా చేసిన;
    • deliberate act, ph. బుద్ధిపూర్వకంగా చేసిన పని;
  • deliberate, v. t. ఆలోచించు; సమాలోచన చేయు;
  • deliberately, adv. బుద్ధిపూర్వకంగా;
  • delicacy, n. అపురూపమైన విలువ గలది; నాజూకైనది;
  • delicate, adj. సున్నితమైన; నాజూకైన; సుకుమారమైన; కోమలమైన; మార్దవమైన; సుతారమైన;
  • delicious, adj. కమ్మని; మంచి రుచిగల; హితవైన; స్వాదువైన;
  • delight, n. ఉల్లాసం; సంతోషం; ప్రమోదం;
  • delinquency, n. (1) నేరం; (2) వేళకి అప్పు తీర్చలేకపోవడం;
    • juvenile delinquency, ph. చిన్న పిల్లలు చేసిన నేరం;
  • delirious, adj. (1) సన్నిపాత జ్వరానికి సంబంధించిన; సన్నిపాతజ్వర రోగివలె; (2) మితిమించిన సంతోషంతో;
  • delirium, n. సన్నిపాతం; సంధి; సన్నిపాతజ్వరం; సంధిలో పేలాపన; జ్వరంచే గాని, నాడీ మండలం అదరడం వల్ల కాని ఒంటి మీద స్మారకం వస్తూ, పోతూ ఉండే రోగస్థితి;
  • deliver, v. t. (1) ప్రసవించు; ఈను; కను; (2) ఇచ్చు; పలుకు; వచించు; (3) విడుదల చేయు; బట్వాడా చేయు; (4) పట్టుకొచ్చి ఇచ్చు; అందించు; చేర్చు; (5) విడచిపెట్టు; విముక్తి చేయు;
  • delivery, n. (1) పురుడు; ప్రసవం; ప్రసూతి; కాన్పు; (2) అప్పగింత; (3) విడుదల; బట్వాడా;
    • breech delivery, ph. పాదదర్శన ప్రసవం;
  • dell, n. కోన; కొండలలో ఇరుకైన చోటు; లోయ;
  • Delphinus, n. ధనిష్ట; ధనిష్టా నక్షత్రం; గోలోకం;
  • delta, n. డెల్టా; నదులు సముద్రంలో కలిసే చోట త్రిభుజాకారంగా ఏర్పడ్డ ద్వీపం;
  • deluge, n. వరద; జలప్రళయం; ముంపు; వెల్లువ;
  • delusion, n. తర్కబద్ధమైన విశ్లేషణకి లొంగని ఒక రకం మానసిక భ్రమ; వ్యాధి తీవ్రతలో ఏర్పడు ఒక భ్రాంతి; a false idea or belief that is caused by mental illness; In this form, the affected person fears they are being stalked, spied upon, obstructed, poisoned, conspired against or harassed by other individuals or an organization;
  • demand, n. గిరాకి; జరూరు; అవసరం; కొనుబడి; దాతవ్యం;
    • demand draft, ph. జరూరు హుండీ; డబ్బు ముందు పుచ్చుకుని బేంకు ఇచ్చే చెక్కు;
    • demand price, ph. గిరాకీ ధర;
    • supply and demand, ph. సరఫరా గిరాకిలు;
  • demand, v. t. అడుగు; (హక్కుగా) కోరు;
  • demeanor, n. వాటం; వైఖరి; తీరు; హావభావాలు; చందం;
  • demented, adj. పిచ్చిపట్టిన;
  • dementia, n. బుద్ధిమాంద్యత; ముసలితనంతో వచ్చే బుద్ధిమాంద్యత; మెదడులోని కణజాలం పాడవడం వల్ల తర్కబద్ధమైన వీశ్లేషణ, జ్ఙాపక శక్తి విపరీతంగా తగ్గిపోయిన కారణంగా పొడచూపే ప్రవర్తన; బుద్ధిమాంద్యత అన్నా ఆల్జైమర్శ్ రోగం అన్నా ఒకటి కాదు; జ్ఞఆపకశక్తిని, భాషాపాటవాన్ని, అహం అనే భావాన్నీ నాశనం చేసే బుద్ధిమాంద్యతని ఆల్జైమర్శ్ రోగం అనొచ్చు;
  • demi, adj. అర్ధ; అర; సగము;
  • demigods, n. pl. ఉపదేవతలు; ఖేచరులు; దైవము వంటివారు;
    • demilitarized zone, ph. నిసైన్య మండలం;
  • demise, n. చావు;
  • democracy, n.ప్రజాస్వామ్యం; ప్రజాస్వామికం; ప్రజాతంత్రం; ప్రజల ప్రభుత్వం;
  • demographics, n. జనసంఖ్యా వివరాలు;
  • demography, n. జనాభాశాస్త్రం; జనసంఖ్యాశాస్త్రం;
  • demolish, v. t. పడగొట్టు; నిర్మూలించు; నాశనం చేయు; ధ్వంసం చేయు; నేలమట్టం చేయు;
  • demon, n. (1) సైతాను; క్రైస్తవులు నమ్మే కొమ్ములు, తోక ఉన్న ఒక (దుర్మార్గపు) అత్యంత శక్తిమంతమైన శాల్తీ; (2) భూతం; బ్రహ్మ రాక్షసి; దయ్యం; పిశాచం;(3) f. డాకిని; శాకిని;
  • demonstrate, v. t. తార్కాణించు; ప్రత్యక్ష ప్రమాణంతో రుజువు చేయు; చేసి చూపించు;
  • demonstration, n. తార్కాణం; చేసి చూపించడం; రుజువు చేయడం; నిరూపించడం; ప్రదర్శించడం;
  • demonyms, n. pl. ప్రజల పేర్లమీద ఏర్పడిన స్థలనామాలు;
  • demur, v. i. (డిమర్). సందేహించు, సంశయించు; ముందు వెనుక లాలోచించు; తటపటాయించు;
  • demure, adj. (డిమ్యర్). పుట్టముంగి వలె; నంగనాచిలా; సిగ్గుతో; (ఒక స్త్రీ ప్రవర్తనని వర్ణించేటప్పుడు)
  • den, n. (1) గుహ; (2) ఇంట్లో ఒక చిన్న గది;
  • denatured, adj. కల్తీ అయిన; సహజసిద్ధము కాని;
  • dendritic, adv. శాఖోపశాఖలుగా;
  • Denebola, n. ఉత్తరఫల్గుణి; సింహరాసిలో ఒక నక్షత్రం; రాశిచక్రంలో కనిపించే నక్షత్రాలలో రెండవ స్థానంలో ఉన్న తార; భూమికి 36 జ్యోతిర్‍ వర్షాల దూరంలో ఉంది;
  • dengue fever, n. డింగీ జ్వరం; దుమ్ములనొప్పి జ్వరం; విషాణువు వల్ల ఒళ్లంతా నొప్పులతో వచ్చే జ్వరం;
  • denizens, n. pl. నివాసస్తులు; కాపురస్తులు;
    • denizens of the dark, ph. చీకటిలో నివసించేవి;
  • denominate, v. t. పేరు పెట్టు;
  • denominator, n. [math.] హారం; భిన్నంలో గీతకి దిగువ ఉన్న అంశం;
  • denotation, n. యధార్థార్థం; అసలు అర్థం; see also connotation;
  • denote, v. t. సూచించు; పేరు పెట్టు;
  • denounce, v. t. బహిరంగంగా నిందించు;
  • dense, adj. దట్టమైన; సాంద్రమైన; కీక; సాంద్ర; ఆకీర్ణ; ఈరము; అవిరళ; నిబిడ;
    • dense darkness, ph. నిబిడాంధకారం;
    • dense forest, ph. కీకారణ్యం;
  • density, n. సాంద్రత; చిక్కతనం; ఈరమి;
    • probability density, ph. సంభావ్యతా సాంద్రత;
  • dent, n. లొత్త; నొక్కు; సొట్ట; నత;
  • dental, adj. దంత; దంత్య; పంటికి సంబంధించిన;
  • dentals, n. [ling.] దంత్యములు; దంత్యాక్షరాలు; పళ్ళ సహాయంతో పలికే వర్ణాలు; త, థ, ద, ధ, న, ల, స;
  • dentist, n. దంతవైద్యుడు; దంత విశారద;
  • dentition, n. దంతములు (పళ్ళు) మొలుచుట;
  • dentures, n. (డెంచర్స్) కట్టుడుపళ్లు;
  • deny, v. t. నిరాకరించు; లేదను; కాదను; ఒప్పుకొనకపోవు;
  • deodorant, n. దుర్గంధనాశని; నిర్గంధి; కంపుని పోగొట్టడానికి వాడే వస్తువు;
  • deodorization, n. నిర్గంధీకరణం; కంపుని పోగొట్టడం;
  • deoxyribonucleic acid, n. అరైకామ్లం; DNA;
  • depart, v. i. వదలిపెట్టు; వెళ్ళిపోవు; బయలుదేరు;
  • departed, adj. (1) వెళ్ళిపోయిన; (2) చనిపోయిన;
  • departures, n. pl. పోకలు;
  • department, n. శాఖ; విభాగం;
  • departure, n. పోక; వెళ్లడం; యాతం; అపగమం; బయలుదేరడం; నిష్ర్కమణం;
    • departure time, ph. పోయే వేళ; బయలుదేరే వేళ;
  • depend, v. i. ఆధారపడు; నమ్ముకొనియుండు;
  • dependence, n. పరతంత్రత; పరాధీనత; పరాయత్తత;
  • dependent, adj. పరతంత్ర; ఆయత్త; పరాయత్త; పరాధీన; ఆధారపడ్డ; శ్రీత; ఆశ్రిత; సమాశ్రిత;
    • dependent variable, ph. పరతంత్ర చలనరాసి; శ్రిత రాసి; ఆశ్రిత రాసి;
  • dependent, n. పరతంత్రుడు; పరతంత్రి; శ్రీతుడు; ఉపజీవకుడు; ఆశ్రీతుడు;
  • dependents, n. pl. పోషవర్గం; ఆశ్రీతులు;
  • depict, v. i. చిత్రీకరించు; చిత్రించు; వర్ణించు;
  • depiction, n. చిత్రణ; వర్ణన; చిత్రీకరణ;
  • deplete, v. i. తగ్గు; ఖర్చగు; ఖాళీ అగు;
  • deplore, v. i. వాపోవు; విచారించు; చింతించు; విలపించు;
  • deplorable, adj. శోచనీయం; దీనం; విషాదవంతం; వ్యధితం; ఆధ్వాన్నం;
  • deponent, n. వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి;
  • deposit, n. (1) ధరావతు; సంచకరం; పగిడీ; (2) నిక్షేపం; (3) పూత;
  • deposit, v. t. ధరావతు చేయు; నిక్షేపించు;
  • depository, n. సరకులు దాచే స్థలం; కొట్టు;
  • deposition, n. వాంగ్మూలం;
  • depot, n. (డిపో) (1) గోదాం; సరుకు నిలవచేసే చోటు, (2) నెలవు; కొఠారు; స్టేషను; రైలు స్టేషను; బస్సు స్టేషను; వాహనాలను నిలిపే చోటు;
  • depreciation, n. అపకర్షణం; తరుగు; తగ్గుదల; వాడుక వల్ల విలువ తగ్గడం;
  • depress, v. t. నొక్కు; అణగదొక్కు;
  • depressants, n. నిరుత్సాహకారకులు; ఆల్కహాలు, నిద్రమాత్రలు వగైరా;
  • depressed, adj. దళిత; వెనకబడ్డ; అణగదొక్కబడ్డ;
  • depression, n. (1) గొయ్యి; నత; (2) గుండం; పీడనగుండం; అవనతి; తుపాను; (3) మాంద్యత; స్తబ్ధత; (4) వ్యాకులత; వైరాగ్య వ్యాకులత; మానసిక దిగులు; చింత; కుంగుబాటు; కృంగుదల;
    • major depression, ph. భారీ వ్యాకులత;
    • mental depression, ph. మనో వ్యాకులత; మనోస్తబ్ధత; కుంగుబాటు; ఈ మానసిక రోగానికి ఉండే లక్షణాలు: మనసు ఖాళీగా ఉన్నట్లు విచారంగా ఉండటం (empty mood); నిరాశ, నిస్పృహ, ఎందుకూ పనికిరాననే భావం; దేనిమీదా అభిరుచి (interest) లేకపోవటం; నిస్సత్తువ, అలసట, నీరసం; ఏకాగ్రత లేకపోవటం; ఏదయినా నేర్చుకోవాలంటే కష్టమైపోవటం; చికాకుగా ఉండటం (irritability); అతినిద్ర లేదా నిద్ర లేమి; అర్ధరాత్రి లేదా తెల్లవారు ఝామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక పోవటం; ఆకలి పెరగటం లేదా తగ్గిపోవటం; ఇక్కడా అక్కడా నెప్పులు, చెప్పుకోలేని బాధలు; భవిష్యత్తు గురించి ఆలోచించ లేకపోవటం; ఆశలు ఆశయాలు లోపించడం; నిర్ణయాలు తీసికోలేకపోవటం; చనిపోవాలని అనిపించటం; see also "anxiety;"
    • postnatal depression, ph. ప్రసూతి వైరాగ్యం;
    • postpartum depression, ph. ప్రసూతి వైరాగ్యం;
  • depth, n. లోతు; దఘ్నత; దఘ్నం;
    • depth gauge, ph. దఘ్నమాపకం; లోతుని కొలిచే ఉపకరణం;
    • depth indicator, ph. దఘ్నార్థకం; లోతుని చూపించే సూచిక;
  • deputy, n. నియోగి;
  • dequeue, v. t. (కంప్యూటరు పరిభాషలో) ఒక వరుసలోఉన్న శాల్తీలలో ముందున్న శాల్తీని బయటకి తియ్యడం;
  • derail, v. i. పట్టాలు తప్పు;
  • derail, v. t. పట్టాలు తప్పించు;
  • dereliction, n. ఉపేక్ష; శ్రద్ధ చూపకపోవడం; పరిత్యాగం;
  • deride, v. t. గేలి చేయు; పరిహసించు; ఎద్దేవాచేయు; ఎగతాళిచేయు;
  • derision, n. పరిహాసం; హేళన; ఎగతాళి;
  • derivation, n. వ్యుత్పత్తి; నిష్పాదన;
  • derivative, n. (1) పుట్టినది; ఉత్పన్నం; వ్యుత్పన్నం; నిష్పాదకం; నిష్పన్నం; జన్యం; తద్ధితం; (2) వాలుదల; ఒక ప్రమేయం విలువ ఏ దిశలో, ఎంత జోరుగా మారుతూందో (పెరుగుతోందో, తరుగుతోందో) తెలియజేసే సంఖ్య; ఒక ప్రమేయం కి ఒక బిందువు దగ్గర ఒక స్పర్శ రేఖ గీసినప్పుడు, ఆ రేఖ ఎంత వాలుగా ఉందో చెప్పే సంఖ్య; (3) స్టాక్ మార్కెట్లో షేర్లు మూలాధారాలు (underlyings) అయితే, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) వాటి వ్యుత్పన్నములు; షేర్ల గురించి అవగాహన ఉన్న ట్రేడర్లు తక్కువ మూలధనంతో ఎక్కువ లాభం ఆర్జించే సాధనాలు డెరివేటివ్స్;
    • dervative of a function, ph. ఒక ప్రమేయం ఒక బిందువు వద్ద ఎంత జోరుగా కదులుతొందో (పెరుగుతొందో, తరుగుతొందో) తెలిపే సంఖ్య;
    • derivative mortgage, ph. రెండవ తనఖా;
    • derivative suffix, ph. నిష్పాదక ప్రత్యయం; తద్ధిత ప్రత్యయం;
  • derive, v. t. సాధించు; వ్యుత్పన్నించు; నిష్పన్నం చేయు;
  • derived, adj. ఉత్పన్న; వ్యుత్పన్న; సాధ్య; జన్య;
    • derived pause, ph. [gram.] సాధ్య బిందువు;
    • derived raga, ph. [mus.] జన్య రాగం;
  • derived, n. ఉత్పన్నం; నిష్పన్నం; సాధించినది;
  • dermatitis, n. చర్మశోథ; చర్మతాపము;
    • atopic dermatitis, ph. అసహన చర్మశోథ; అసహన చర్మతాపము; గజ్జి (eczema) ఒక రకమైన అసహన చర్మశోథ;
  • desalination, n. నిర్లవణీకరణ;
  • deserving, adj. అర్హత గల;
  • derogatory, adj. మర్యాద తక్కువైన; గౌరవలోపమైన;
  • derrick, n. బకయంత్రం; బరువులని పైకెత్తే యంత్రం; (ety.) కొంగ మెడ వలె పొడుగాటి మెడ ఉన్న యంత్రం;
  • descending, adj. అవరోహణ; దిగువకి దిగే;
    • descending order, ph. [math.] అవరోహణ క్రమం;
  • descent, n. అవరోహణ; దిగుట; తగ్గుట;
  • describe, v. t. వర్ణించు; అభివర్ణించు;
  • description, n. వర్ణన; అభివర్ణన;
  • descriptive, adj. వర్ణనాత్మక; అన్వర్ధక; (ant.) prescriptive;
  • descriptive, n. వర్ణనాత్మకం; అన్వర్ధకం;
  • desecrate, v. t. చెరుచు; అపవిత్రం చేయు; మైల చేయు;
  • desert, v. t. వదలివేయు;
  • desert, n. ఎడారి; నిర్జనం; see also dessert;
  • desertion, n. వదలిపెట్టడం; త్యజనం;
  • deserving, adj. అర్హత గల;
  • desiccate, v. t. ఇగుర్చు; ఎండబెట్టు; శోషించు;
  • desiccator, n. శోషణపాత్ర;
  • design, n. (1) పన్నుగడ; (2) విన్యాసం; రూపం; రూపకల్పన; కూర్పు;
    • cover design, ph. ముఖపత్ర విన్యాసం;
  • designer, n. రూపశిల్పి; కూర్పరి;
  • designated, adj. అభిదాయక; లక్షిత;
  • designing, n. రూపకల్పన; రూపశిల్పం;
  • desirable, adj. అభిలషణీయ; వాంఛనీయ;
  • desirable, n. అభిలషణీయం; వాంఛనీయం; ఉద్దిష్టం;
  • desire, n. కోరిక; కాంక్ష; ఆకాంక్ష; వాంఛ; అభిలాష; అభిమతం; ఈషణము; ఇషణము; మనోరధం; ఇచ్ఛ; ఆసక్తి; ఆశ;
    • desire to learn, ph. జిజ్ఞాస;
    • desire to win, ph. జిగీష;
    • a person with a desire, ph. జిగీషువు;
    • strong desire, ph. ఉబలాటం;
    • vain desire, ph. అడియాస;

---Usage Note: desire, want; wish

  • ---Use want when you talk about things you would like to do or have: He wants to talk to you. Use desire and wish only in formal writing.
  • desired, n. అభిలషణీయం; వాంఛనీయం; ఉద్దిష్టం;
  • desirelessness, n. నిరాసక్తత;
  • desk, n. మేజా; రాతబల్ల; బల్ల;
  • desolate, adj. నిర్మానుష్యమైన; నిర్జన; మానవ సంచారం లేని;
  • despair, n. నిస్పృహ; నిరాశ; నిరుత్సాహం;
  • desperate, adj. నిరాశాపూర్వక; హతాశమైన; అసాధ్య; భీషణ;
  • desperation, n. నైరాశ్యం; నిరాశ వల్ల కలిగిన తెగింపు;
  • despicable, n. అసహ్యమైన;
  • despondence, n. నిరాశ; నిస్పృహ; అధైర్యం; విషాదం;
  • despot, n. నిరంకుశ ప్రభువు;
  • dessert, n. (డెజర్ట్) భోజనానంతరం తినే తీపి పదార్థం; మోదకం;
  • destination, n. అడంగు; గమ్యం; గంతవ్యం;
  • destiny, n. దైవగతి; విధి; రాత; తలరాత; అదృష్టం; నసీబు;
  • destitute, n. బుక్కాపకీరు; ఇల్లు, వాకిలి లేని వాడు;
  • destroy, v. t. నాశనం చేయు; లయించు; తెగటార్చు; నిర్మూలించు; ధ్వంసం చేయు; రూపుమాపు;
  • destroyer, n. లయకారకుడు; నాశనం చేసేవాడు;
  • destructible, adj. వ్యయమైన;
  • destruction, n. నిర్మూలన; విధ్వంసన; లయ; వినాశం; క్షపణం; హననం;
  • destructive, adj. భంజక; నిర్మూలాత్మకమైన; విధ్వంసక; క్షపణ; హనన;
    • destructive distillation, ph. భంజక శ్వేదనం; హనన స్వేదనం; నిర్వాత స్వేదనం;
  • detach, v. t. వేరుచేయు; వేరుపరచు; పీకు;
  • detached, adj. వేరుగా; విడిగా; నిర్విణ్ణ; అసంహిత; నిస్సంగ;
  • detachment, n. నిస్సంగత్వం;
  • detailed, adj. వివరంగా; సవిస్తరంగా;
  • details, n. వివరాలు;
  • detection, n. ఆచూకీ; ఆరా; శోధన;
  • detective, n. పత్తేదారు; ఆచూకీదారు; అరీందం; అపరాధ పరిశోధకుడు; నిరూపకుడు;
    • detective novel, ph. నిరూపక నవల; అపరాధ పరిశోధక నవల;
  • detector, n. శోధకం; శోధకి; పత్తాసు; (ety.) detective = పత్తేదారు
    • smoke detector, ph. పొగ పత్తాసు;
  • detention, n. నిర్బంధం;
  • deter, v. t. భయపెట్టి మాన్పించు; ఆపు; అడ్డగించు; నివారించు; నిలుపు;
  • determinant, n. (1) [math.] నిశ్చితార్థం; లెక్కలలో ఒక వ్యూహం (మాత్రుక) రీతిలో వేసిన అంకెల అమరిక యొక్క విలువ; (2) నిశ్చయించేది;
  • determination, n. (1) నిర్ధారణ; నిర్ణయం; (2) సంకల్పం; (3) అభినివేశం;
    • fierce determination, ph. వజ్ర సంకల్పం;
    • process of determination, ph. నిర్ధారణ ప్రక్రియ;
  • determine, v. i. నిర్ణయించు; నిశ్చయించు;
  • determinism, n. నిర్ణయవాదం; నియతవాదం; ప్రతి సంఘటనకూ, కార్యానికీ ఏదో ఒక కారణం ఉంటుందనీ, సృష్టి సమస్తం కార్యకారణ సంబంధాల మూలంగానే జరుగు తుంటుందనీ తెలియజేసే సిద్ధాంతం;
  • deterministic, adj. నిర్ణయాత్మక;
  • detergent, n. అపక్షాలకం; కల్మషహారి;
  • deteriorate, v. i. దిగజారు; శిధిలమగు;
  • deterioration, n. దిగజారడం; శిధిలమవడం; విపరిణామం;
  • determination of meaning, ph. అర్థవిపరిమాణం;
  • detonate, v. i. పేలు; v. t. పేల్చు;
  • detonation, n. పేలుడు; విస్ఫోటనం;
  • deuce, n. దువ;
  • devaluation, n.అవమూల్యనం; న్యూనీకరణం; విలువ తగ్గించడం;
  • development, n. వికాసం; సంవర్ధనం; అభివృద్ధి;
    • child development, ph. శిశు వికాసం; శిశు సంవర్ధనం;
    • community development, ph. సమాజ వికాసం; సమాజ సంవర్ధనం;
  • deviate, v. i. దారి తప్పు; మరొకదారి తొక్కు;
  • deviation, n. విచలనం; విపథం;
  • device, n. (1) తంత్రం; పన్నుగడ; (2) సాధనం; ఉపకరణం; కందువ; దీవసం; (3) జంత్రం;
  • devil, n. సైతాను; క్రైస్తవ మతంలో దేవుడికి చుక్కెదురు అయిన శక్తి;
  • devise, v. t. పన్ను; ఊహించు; కనిపెట్టు;
  • devote, v. t. లగ్నపరచు; కేటాయించు; వినియోగించు;
  • devotee, n. ఉపాసి; m. ఉపాసకుడు, భక్తుడు; f. ఉపాసకురాలు; భక్తురాలు;
  • devotion, n. భక్తి; నిరతి;
    • devotion to service, ph. సేవానిరతి;
  • devour, v. t. కబళించు; మింగివేయు; భక్షించు; మెక్కు; బుక్కు; అత్యాసతో, ఆత్రుతతో గబగబా తిను;
  • dew, n. తుహినం; మిహిక; ధూమిక; నీటి బిందువులుగా మారిన గాలిలోని చెమ్మ; (rel.) తుషారం;
    • dew drop, ph. తుహిన బిందువు;
    • dew point, ph. తుహిన అంకం; తుహిన స్థానం; గాలిలోని చెమ్మ నీటి బిందువులుగా మారడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత;
  • dewlap, n. (1) గంగడోలు; ఆవులకి ఎద్దులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; (2) జోలుమెడ; ఇతర జంతువులకి, పక్షులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; see also wattle;
  • dew-worm, n. వానపాము; ఎర్ర;
  • dexterity, n. హస్తకౌశలం; చాతుర్యం; నిపుణత్వం; నైపుణ్యం; వైదగ్ధ్యం;
  • dextral, adj. (1) కుడిచేతివైపు; దక్షిణ; (2) కుడిచేతి వాటం; (3) అనుశంఖ; శంఖం యొక్క మట్టం నుండి శిఖరానికీ వెళ్లేటప్పటి సర్పిలాకృతి; (ant.) sinistral;
  • dextro, adj. దక్షిణ; కుడిచేతివైపు; కుడిచేతివాటపు;
  • dextrose, n. [chem.] దక్షిణోజు; కుడిచేతివాటపు చక్కెర; గ్లూకోజు; C6H12O6;
  • Dhaba, n. [Ind. Engl.] ధాబా; (note) India's version of cash-n-carry fast food restaurant;
  • dharma, n. [Ind. Engl.] ధర్మం; (note) Hindu/Buddhist moral code of conduct
  • dhobi, n. [Ind. Engl.] చాకలి; రజకుడు; బట్టలు ఉతికే మనిషి; (note) launderer; washerman; a person who washes and irons clothes;

|width="65"|

|- |- |}

Part 2: di-dz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • diabetes, n. మధుమేహం; ప్రమేహం; అతిమూత్ర వ్యాధి; ౘక్కెర జబ్బు; నిజానికి అతిమూత్రం, అతిదాహం, అత్యాకలి, మొదలయిన లక్షణాలెన్నింటినో కలిపి డయబెటీస్ అంటారు; The word ‘diabetes’ is derived from the Greek word that means ‘siphon’ or ‘go through’, referring to the production of lots of urine, that occurs in both diabetes mellitus and insipidus, when uncontrolled.
    • diabetes indicator, ph. మధుమేహ సూచకి;
  • diabetes insipidus, n. అతిమేహం; అతిమూత్రం; [Gr. Diabetes = siphon, insipidus = tasteless]; People with diabetes insipidus have normal blood glucose levels; however, their kidneys cannot balance fluid in the body;
  • diabetes mellitus, n. మధుమూత్రం; మధుమేహం; మధుప్రమేహం; ఈ దశలో మూత్రంలోనూ, రక్తంలోనూ కూడ చక్కెర మోతాదు మించి కనిపిస్తుంది; Diabetes mellitus causes high blood glucose, or blood sugar, resulting from the body's inability to use blood glucose for energy;
  • diabetic, n. ప్రమేహం ఉన్న వ్యక్తి;
  • diachronic, adj. చారిత్రాత్మక; చారిత్రక;
  • diacritical marks, n. లేఖన చిహ్నాలు; అక్షరాలు ఎలా ఉచ్చరించాలో సూచించడానికి వాడే గుర్తులు;
  • diagonal, adj. వికర్ణ;
    • diagonal matrix, ph. [math.] వికర్ణ మాత్రిక;
  • diagonal, n. వికర్ణం; కర్ణం; ఐమూలరేఖ;
  • diagonalization, n. వికర్ణీకరణం; ఒక మాత్రుకలో శూనం కాని అంశాలన్నీ కర్ణం మీద వచ్చేలా చెయ్యడం;
  • diagonally, adv. అయిమూలగా; ఐమూలగా;
  • diagnosis, n. రోగనిర్ణయం; సముత్థానం; కారణ నిర్ణయం;
  • diagnostic, adj. రోగాన్ని నిర్ణయించే; కారణాన్ని కనిపెట్టే;
  • diagram, n. బొమ్మ; పటం; రేఖాచిత్రం;
  • dial, n. ఫలకం; ముఖఫలకం; బింబాననం;
  • dial, v. t. ఫలికించు; (ఫలకమును వినియోగించు);
    • dial the telephone, ph. టెలిఫోనుని ఫలికించు;
  • dialect, n. మాండలికం; ప్రాంతీయ భాష; విభాష; ఉపభాష; భాషలోని ప్రాంతీయ భేదాలనే మాండలికాలు అంటారు; వ్యక్తిపరమయిన శైలీ భేదాలకి అతీతమయిన భాష; ప్రధాన భాషలో భాగమై, కొన్ని స్థానిక విశిష్టతలతో కూడి వుండే భాషభేదాన్ని మాండలికం అంటారు. (rel.) idiolect;
    • class dialect, ph. వర్గ మాండలికం;
    • regional dialect, ph. ప్రాంతీయ మాండలికం;
    • specialized dialect, ph. విశిష్ట మాండలికం;
  • dialectic materialism, ph. గతి తార్కిక భౌతిక వాదం; హెగెల్ వాడిన తర్క శాస్త్రాన్ని భౌతిక తత్త్వశాస్త్రానికి అన్వయించగా లభించినది; ఇదే కమ్యూనిష్టు సిద్ధాంతాలకి మూలాధారం;
  • dialecticism, n. విరోధవికాసం; విరోధోక్తి; విరోధభావంతో వికాసం కలిగించడం; గతి తర్కం; ప్రశ్నోత్తర విచారణ; ప్రశ్నోత్తరాల ద్వారా సత్యాన్వేషణ చేసే తర్కం; పరస్పరాత్మక తర్కశాస్త్రం; హెగెల్ వాడిన తర్క శాస్త్రం;
  • dialog, n. సంభాషణ; ఇద్దరి మధ్య సంభాషణ; నాటకం, సినిమా వగయిరాలలో చెప్పే సంభాషణ; see also aside, soliloquy;
  • dialysis, n. రక్త శుద్ధి; రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతి;
  • diameter, n. వ్యాసం; కైవారం; అడ్డుకొలత;
    • diametrically opposite, ph. ప్రతిస్పర్ధి; చుక్కెదురు; ఎదురెదురుగా;
  • diamond, n. (1) వజ్రం; రవ్వ; నవ రత్నములలో నొకటి; (2) చీట్లపేకలోని నాలుగు రంగులలో ఒక రంగు;
    • diamond anniversary, ph. వజ్రోత్సవం; అరవైయ్యవ వార్షికోత్సవం; షష్టిపూర్తి;
  • diamond jubilee, n. వజ్రోత్సవం; అరవైయ్యవ వార్షికోత్సవం; షష్టిపూర్తి;
  • diaper, n. నాపి; అధోంగవం; పిల్లగోచీ; చంటి పిల్లలు మలమూత్రాదులు వదలినప్పుడు మలినం బయట పడకుండా గోచీలా కట్టే బట్ట;
  • diaphanous, adj. అర్ధ పారదర్శక; పారభాసక; అతిమృదువైన; translucent;
  • diaphoretic, n. ఘర్మజనని; చెమట పట్టించే గుణం కలది; ఉదా: అల్లం;
  • diaphragm, n. [anat.] వప; విభాజకం; హృదయవితానం; హృదయకుహరాన్నీ గర్భకుహరాన్నీ విడదీస్తూ మధ్యలో ఉండే ఒక కణజాలపు పొర;
  • diary, n. దినచర్య; దైనందిని; దినచర్య రాసిన పుస్తకం;
  • diarrhea, n. నీళ్ల విరేచనాలు; ప్రవాహిక;
  • diaspora, n. ప్రవాసులు; ప్రవాస గణాలు; మాతృభూమి వదలి వివిధ దేశాలలో చెల్లాచెదరిన ప్రజానీకం;
  • diastole, n. వ్యాకోచం; వికాసం; (ant.) systole;
  • diastolic, adj. వ్యాకోచ; వికాస; స్పురణ;
    • diastolic pressure, ph. వికాస పీడనం; హృదయ స్పందనలో గుండె పూర్తిగా వికసించినప్పుడు నమోదు అయిన పీడనం;
  • diatom, n. (డయటామ్); ద్వంద్వకణం; అతి సూక్ష్మమైన నాచువంటి పదార్థం; ఈ కణాలలో ఉన్న జంట సంచులలో ఇసక లాంటి పదార్థం ఉంటుంది;
  • diatribe, n. ఉతికెయ్యడం; తిట్లు లంకించుకోవడం;
  • dice, n. pl. పాచికలు; నామరులు; అడ్డసారెలు;
  • dice, v. t. చిన్న ముక్కలుగా కోయు;
  • dichotomy, n. ద్వైధీభావం; ద్వయితం; ద్వైవిధ్యం; ద్విభాజనం; తర్కశాస్త్రంలో ఒక వర్గాన్ని రెండు పరస్పర విరుద్ధమైన వర్గాలుగా విడగొట్టడం; ఉదాహరణకి : ఆత్మ, పరమాత్మ; పూర్వం; పరం;
  • dictator, n. నియంత; సర్వాధికారి;
  • dictatorial, adj. నిరంకుశ; నియంతృత్వ;
    • dictatorial monarchy, ph. నిరంకుశ రాజరిక వ్యవస్థ;
  • dictatorship, n. నిరంకుశత్వం; నియంతృత్వం;
  • diction, n. శైలి; శబ్దసంపద; ఉచ్చారణ;
  • dictionary, n. నిఘంటువు; కోశం; పదార్థకోశం; పదకోశం; పదనిధి; శబ్దకోశం; శబ్దసంగ్రహం; శబ్దసాగరం; శబ్దమంజరి; తెల్లడి;
    • abridged dictionary, ph. సంగ్రహ నిఘంటువు;
    • etymological dictionary, ph. వ్యుత్పత్తి నిఘంటువు;
    • reverse dictionary, ph. విలోమ నిఘంటువు;
  • didactic, adj. ఉపదేశాత్మక; ఉపదేశానికి అనుకూలమైన; నేర్పడానికి వీలయిన; నీతిబోధకమైన;
  • die, n. s. (1) పాచిక; అక్షం; see also dice; (2) మూస; అచ్చుదిమ్మ; కొలిమిలో కరిగించిన దానిని పోత పొయ్యడానికి వాడే సాధనం; (3) కౌలుదిమ్మ; పడి అచ్చు;
  • die, v. i. (1) చచ్చు; చచ్చిపోవు; చనిపోవు; మరణించు; కడతేరు; నీలుగు; ఈలుగు; పరమపదించు; తనువు చాలించు; అసుమలు బాయు; గుటుక్కుమను; టింగుమను; f. గౌరీసాయుజ్యం చెందు; (2) ఆగిపోవు; పనిచెయ్యడం మానివేయు;
  • diehard, adj. (1) మొండి; (2) పరమ ఛాందసమైన; (3) ఒకంతట ఒదిలిపెట్టని; చాలాకాలం మన్నే;
  • dies, n. pl. మూసలు; అచ్చుదిమ్మలు;
  • diet, n. (1) ఆహారం; (2) పథ్యం; ఆరోగ్యం బాగులేనప్పుడు తినదగిన ఆహారం; (3) ధారకం; ఆరోగ్యం బాగుకొరకు నియమితమైన రీతిలో తిండి తినడం;
    • restriction in diet, ph. పథ్యం;
    • starvation diet, ph. లంఖణాల తిండి;
  • dietetics, n. ఆహారవిధులు; ధారక శాస్త్రం;
  • dieting, n. ధారక వ్రతం; ఆహార నియమం;
  • difference, n. వ్యత్యాసం; వ్యత్యయం; భేదం; చయం; అంతరం; తేడా; తారతమ్యం; తరతమభావం; న్యూనాధిక్యం;
    • difference of opinion, ph. భిన్నాభిప్రాయం; అభిప్రాయభేదం;
  • different, adj. భిన్న; వేరొక; మరొక;
    • different style, ph. భిన్న ధోరణి; వేరొక పద్ధతి;
  • differential, adj. [math.] అవకలన; రెండు రాశులకి మధ్యనున్న తేడాకి సంబంధించిన;
    • differential calculus, ph. అవకలన కలనం; కలన గణితంలో ఒక భాగం;
    • differential equation, ph. అవకలన సమీకరణం;
    • non-linear differential equation, ph. అసరళ అవకలన సమీకరణం;
  • differentiate, v. t. (1) రెండింటి మధ్య తేడాని గుర్తించు; (2) [math.] అవకలించు;
  • differentiation, n. (1) విభేదనం; (2) [math.] అవకలనం; అంతర కలనం; ఒక విధమైన అవధి క్రియ;
  • difficult, adj. కష్టమైన; ప్రయాసతో కూడిన; దుర్లభమైన;
  • difficult to accomplish, ph. కష్టసాధ్యం;
  • difficulties, n. pl. కష్టాలు; ఇబ్బందులు; కడగండ్లు; ఇక్కట్లు;
    • overwhelming difficulties, ph. అష్టకష్టాలు;
  • difficulty, n. కష్టం; ప్రయాస; ఇబ్బంది; శ్రమ; ఒరకాటం; ఇక్కట్టు; ఇడుము; అవస్థ; దుస్తరం; తంటా; ప్రతిబంధకం; రాయిడి;
  • diffidence, n. అధైర్యం; సంకోచం; న్యూనతశంక; తన సామర్థ్యం మీద నమ్మకం లేకపోవడం;
  • diffraction, n. వివర్తన;
  • diffuse, adj. విసరిత;
  • diffusion, n. విసరణ; వ్యాపకం; విష్యందం;
  • diffusive, adj. వ్యాపకత; వ్యాపించే;
  • dig, v. t. తవ్వు;
  • digest, n. స్మృతిసంహిత; ఎగ్గుర్తు; ఎగ్గురుతు; మరొక ప్రచురణలోని విషయాన్ని సంగ్రహపరచిన పుస్తకం;
  • digest, v. i. జీర్ణించుకొను;
  • digest, v. t. సంగ్రహించు; సంక్షేపించు;
  • digestion, n. జీర్ణం; అరుగుట;
    • digestive process, ph. జీర్ణ క్రియ;
    • digestive system, ph. జీర్ణ మండలం;
  • digit, n. (1) వేలు; (2) అంకె; అంకం;
    • least significant digit, ph. చరమాంకం; చరమ అన్వర్థక అంకం;
    • most significant digit, ph. ప్రథమాంకం; ప్రథమ అన్వర్థక అంకం;
    • significant digit, ph. అన్వర్థక అంకం;
  • digital, adj. అంక;
    • digital book, ph. అంక పొత్తం;
    • digital calculating machine, ph. అంక కలనయంత్రం;
    • digital computer, ph. అంక కలనయంత్రం; అంక గణన యంత్రం; కలన యంత్రం;
  • digitalis, n. (1) తిలపుష్టి; the foxglove plant; (2) గుండె జబ్బుకి వాడే ఒక మందు పేరు;
  • digitization, n. అంకీకరణ;
  • digitized, adj. సాంఖ్యీకృత; అంకీకరించిన; అంకెల రూపంలోకి మార్చబడ్డ;
  • dignity, n. హుందా; హుందాతనం; దర్జా; ఘనత;
  • dike, n. చెలియలికట్ట; కట్ట; సముద్రపుటొడ్డున నీళ్ళు పల్లపు భూముల లోపలికి రాకుండా కట్టే కట్ట;
  • dilapidated, adj. పాడుపడిన; శిధిలమైన; ఖిలీభూత;
  • dilation, n. (1) శరీరంలోని రంధ్రం కాని, నాళం కాని సాధారణ స్థితి కంటె ఎక్కువగా వ్యాకోచం చెందడం; (2) వ్యాకోచం చెందడం;
  • dilatometer, n. వ్యాకోచమాపకం; వ్యాకోచాన్ని కొలిచే శాస్త్రీయ పరికరం;
  • dilemma, n. సందిగ్ధావస్థ; సందిగ్ధం; చిక్కు; ఇబ్బంది; ఇరకాటం; అన్యోన్యాశ్రయం; ఉభయ సంకటం; అభిశంకితం;
  • diligence, n. శ్రద్ధ; జాగరూకత;
  • dill, n. శతపుష్పం; సోయికూర; పాశ్చాత్యుల వంటకాలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Aniethum graveolens of the Apiaceae family;
  • dilute, v. t. పలచబరుచు; బలహీనపరుచు;
  • diluted, adj. సజల; నీళ్ళు కలపబడ్డ; పలచన చేయబడ్డ; (ant.) undiluted;
  • dilly-dally, v. i. తాత్సారం చేయు;
  • dim, adj. నిస్తేజ; కాంతి లేని; మకమకలాడెడు; మసకగా ఉన్న;
  • dimension, n. మాత్ర; కొలత; కొలమానం; పరిమాణం; మితి;
  • dimensional, adj. మాత్రకం; మితీయ;
    • three dimensional, ph. త్రిమాత్రకం; త్రిమితీయ;
    • two dimensional, ph. ద్విమాత్రకం; ద్విమితీయ;
    • multi dimensional, ph. బహుమాత్రకం; బహుమితీయ;
  • dimensionless, adj. కొలమానం లేని
    • dimensionless measurement, ph. కొలమానం లేని కొలత;
  • dimer, n. ద్విభాగి;
  • diminish, v. i. సన్నగిల్లు; తగ్గు;
  • dimorphic, adj. ద్విరూప;
  • dimples, n. pl. బుగ్గల మీద పడే సోట్టలు; ఇది ఒక జన్యు లోపం వల్ల కలిగే కండరాల దోషం కాని ఇది కొందరి ముఖానికి అందం చేకూరుస్తుంది;
  • din, n. రొద; ధ్వని; అల్లరి;
  • dine, v. i. తిను; భుజించు;
    • dining room, ph. భోజనశాల; భోజనాల గది;
    • dinner table, ph. ఎడ్డెస; భోజనాల బల్ల;
  • dinosaur, n. భూతబ్బల్లి; పెనుబల్లి; భీకరబల్లి; జురాసిక్ యుగంలో ఈ భూమి మీద వర్ధిల్లిన పెద్ద బల్లిజాతి జంతువులు;
  • dinghy, n. డింగీ; తెప్ప; తెడ్డు వేసుకొని నడిపే చిన్న నావ;
  • dinosaurs, n. pl. భూతబ్బల్లులు; రాకాసి బల్లులు; పెనుబల్లులు;
  • diode, n. ద్విమూర్తి; ద్వియోడు; ఎలక్ట్రానిక్స్‌లో వాడే ఒక పరికరం;
  • dip, v. t. ముంచు; నిమజ్జించు;
  • dip, v. i. మునుగు; క్రుంకు;
    • take a dip, ph. మునుగు; క్రుంకు;
  • dip, n. (1) అవపాతం; నతి; అయస్కాంతపు సూది ప్రదర్శించే ఒక లక్షణం; (2) ముంచుకొని తినడానికి వీలయిన పచ్చడి లాంటి పదార్థం;
    • magnetic dip, ph. అయస్కాంత అవపాతం;
    • dip of a magnetic needle, ph. అయస్కాంతపు సూది యొక్క అవపాతం;
  • diphtheria, n. గళగండం; కంఠసర్పి; కండమాల; ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి; (note) a disease caused by the bacterium Corynebacterium diphtheriae; this bacterium causes a large, painful membrane on the back of the throat that can suffocate the victim; it also makes diphtheria toxin, which harms the brain, heart, and kidneys; protection against diphtheria is afforded by immunity to this single toxin; so diphtheria vaccine contains one single protein;
  • diphthong, n. సంధ్యాక్షరం; జంటక్షరం; రెండక్షరాలని కలిపి ఒకటిగా రాయడం; ఇంగ్లీషులో f i లని కలిపి అచ్చుకొట్టినప్పుడు ఈ రకం జంటక్షరం వస్తుంది;
  • diploid, adj. [biol.] ద్వయస్థితిక;
  • diploma, n. పట్టా;
  • diplomacy, n. దౌత్యం; దౌత్యనీతి; రాజతంత్రం; కూటనీతి; రాజనీతి; కార్యదక్షత; చతురత;
  • diplomat, n. దూత; m. రాజ్యతంత్రజ్ఞుడు; వ్యవహారదక్షుడు;
    • diplomatic corps, ph. దౌత్యవర్గం;
  • diplopia, n. ద్విదృష్టి; double vision; Diplopia is defined as seeing two images of a single object when you’re looking at it;
  • dipole, n. ధ్రువపుజంట; ద్విధ్రువం;
  • dipper, n. గరిటె; ముంచేది; మునిగేది;
  • Dipper, n. సప్తర్షి మండలం; గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు;
    • Big Dipper, ph. బృహదృక్షం; పెద్ద ఎలుగు; సప్తర్షి మండలం; పెద్ద గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు;
    • Little Dipper, ph. లఘదృక్షం; చిన్న ఎలుగు; చిన్న గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు;
  • dipping, n. ముంచడం; నిమజ్జనం;
  • dire, adj. భయంకరమైన; భరించలేని;
  • direct, adj. అజస్ర; అనులోమ; తిన్నగా; తిన్ననైన; నేరుగా; సరాసరి; ప్రత్యక్ష; ముఖాముఖీ; సురసూటి;
    • direct appointment, ph. సరాసరి నియామకం;
    • direct current, ph. అజస్ర ప్రవాహం; సురసూటి ప్రవాహం;
    • direct evidence, ph. ప్రత్యక్ష ప్రమాణం;
    • direct method, ph. ప్రత్యక్ష పద్ధతి;
    • direct proportion, ph. అనులోమ అనుపాతం;
  • direct, v. t . (1) దర్శకత్వం వహించు; (2) దారి చూపు;
    • directed line, ph. విహిత రేఖ; సాయక రేఖ;
  • direction, n. (1) దిశ; దిక్కు; చెరగు; (2) దర్శకత్వం; (4) పద్ధతి; మార్గం; (5) దారి; తోవ;
    • direction indicator, ph. దిగ్వాచకం;
    • direction of a compass, ph. దిశ; దిక్కు; ఉపదిశ;
  • directive, n. ఆజ్ఞ; ఏ విధంగా చెయ్యాలో చెబుతూ పై అధికారి ఉత్తర్వు చేసే ఆజ్ఞ;
  • directly, adv. నేరుగా; తిన్నగా;
  • director, n.సూత్రధారి; దర్శకుడు; మార్గదర్శకుడు; నిర్దేశకుడు;
  • directory, n. దర్శని; మార్గదర్శిని; పేరు, ఉనికిపట్టు తెలియజేసే పట్టిక; సూచి;
  • directorate, n. నిర్దేశక శాఖ; నిర్దేశకాలయం;
  • dirt, n. (1) మురికి; మలినం; మాలిన్యం; చిలుము; కసటు; (2) మట్టి; మన్ను;
  • dirty, adj. మురికి; మురికి పట్టిన; మట్టి; మట్టి పట్టిన; ఖరాబైన;
  • dis, pref. బే; కానిది; లేనిది;
  • disabled, n. pl. అంగహీనులు; అవిటివారు; వికలాంగులు;
  • disaccharide, n. జంటచక్కెర; ద్విచక్కెర; మాల్టోజు, సుక్రోజు, లేక్టోజు వంటి చక్కెరలు; వీటిని రసాయన విశ్లేషణ చేస్తే రెండు ఏకచక్కెరలు (గ్లూకోజు లాంటివి) వస్తాయి; ఉదా. రెండు గ్లూకోజు బణువులు కలిస్తే ఒక మాల్టోజు బణువు వస్తుంది; ఒక గ్లూకోజు, ఒక గేలక్టోజు కలిస్తే లేక్టోజు వస్తుంది; ఒక గ్లూకోజు, ఒక ప్రుక్టోజు కలిస్తే సుక్రోజు వస్తుంది;
  • disadvantage, n. ప్రతికూలత; ప్రతికూల పరిస్థితి; అప్రయోజనం; హాని’ చెరుపు; నష్టం;
  • disagreement, n. అసమ్మతి; స్పర్ధ; అభిప్రాయభేదం; భేదాభిప్రాయం; పొరపొచ్చెం;
  • disappear, v. i. మాయమగు; మరుగుపడు; అంతర్ధానమగు; తిరోధానమగు; ఉడుగు, uDugu;
  • disappearance, n. కనబడకపోవడం; మరుగైపోవడం; మాయమైపోవడం; అంతర్ధానం; పారిపోవడం; తిరోధానం;
  • disapproval, n. తిరస్కారం; అనంగీకారం;
  • disappointment, n. ఆశాభంగం; అడియాస; నైరాశ్యం;
  • disapprobation, n. అసమ్మతి; అనంగీకారం;
  • disarmament, n. అస్త్ర సన్యాసం; నిరాయుధీకరణ; నిరస్త్రీకరణం;
  • disaster, n. అభాసు; వైపరీత్యం; ఉపద్రవం; విపత్తు; ఆపద; దుర్ఘటన; అనర్థం;
    • natural disaster, ph. ప్రకృతి వైపరీత్యం;
  • disavow, v. i. నిరసించు;
  • disavowal, n. నిరస్కారం;
  • disbursement, n. బట్వాడా;
  • disc, disk, n. (1) పళ్లెం; (2) బింబం; (3) కంప్యూటరు రంగంలో డిస్కు; దత్తాంశాలని నిల్వ చెయ్యడానికి వాడే చదునుగా ఉండే పళ్లెం;
  • discard, v. t. వదలిపెట్టు; విసర్జించు; విస్మరించు; పారవేయు;
  • discharge, v. t. (1) వదలు; విసర్జించు; విడుదల చేయు; విముక్తం చేయు; కొట్టివేయు; నెరవేర్చు; ఆచరించు; అనుష్టించు; (2) స్రవించు;
  • discharge, n. స్రావం; రజస్సు; వదలబడినది; విసర్జించబడినది; ఉత్సర్గం; విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము;
    • electrical discharge, ph. విద్యుత్ ఉత్సర్గం;
    • menstrual discharge, ph. రుతు స్రావం; రుతు రజస్సు;
  • disciple, n. శిష్యుడు; అంతేవాసి; ఛాత్రుడు; ఛాత్రి;
  • disciplinarian, n. m. క్రమశిక్షణా దక్షకుడు; శాసనీకుడు;
  • discipline, n. క్రమశిక్షణ; నియమపాలన; నిబద్ధత; క్రమబద్ధత; కాయిదా; (2) శాస్త్రం; శిక్ష; ఉపదేశం;
  • disclaim, v. t. పరిత్యజించు; తెంచుకొను; హక్కు వదలుకొను;
  • disclose, v. t. చెప్పు; బయట పెట్టు;
  • discography, n. గాన చింతామణి; గానావళి; a selective or complete list of phonograph recordings, typically of one composer, performer, or conductor. ... the methods of analyzing or classifying phonograph recordings.
  • discomfort, n. అసౌకర్యం; ఇబ్బంది;
  • disconnect, v. t. లంకెని విడదీయు; బొతుకు;
  • discord, n. విరసం; అసమ్మతి; వైమనస్యం;
  • discordance, n. (1) విజ్జోడు; (2) అపశృతి;
  • discontinuous, adj. అసంతత; విరుపు ఉన్న;
  • discount, n. అడితి; కోత; ముదరా; ముజరా; వట్టం; తోపుడు; తగ్గింపు;
  • discourse, n. ప్రసంగం; ఉపన్యాసం; సంభాషణ;
  • discover, v. i. కనుగొను; కనుక్కొను; కనిపెట్టు; ఆవిష్కరించు; ఉన్న విషయాన్నే తెలుసుకొను; see also invent;
  • discoverer, n. ఆవిష్కర్త;
  • discovery, n. ఆవిష్కరణ; ఆవిష్కారం; కనుగోలు; ఉన్న విషయాన్నే తెలుసుకొనడం; (rel.) invention;
  • discreet, adj. బుద్ధి ఉపయోగించి; తెలివితో; వివేక;
    • discreet person, ph. వివేకశాలి; బుద్ధిశాలి; లౌక్యుడు;
  • discrepancy, n. విప్రతిపత్తి; తేడా; వ్యత్యాసం;
  • discrete, adj. వివిక్త; విడివిడిగా ఉన్నటువంటి; (ant.) continuous; see also discreet;
  • discretion, n. (1) వివేచన; బుద్ధి;
  • discretionary, adj. విచక్షణాయుతంగా; తోచినవిధంగా; ఇష్టం వచ్చినట్లు; యధేచ్ఛగా; స్వేచ్ఛగా;
  • discriminant, n. [math.] విచక్షకం; విచక్షక గుణకం;
    • discriminant function, ph. [math.] విచక్షక ప్రమేయం;
  • discriminate, v. t. విచక్షణ చూపు; పక్షపాతం చూపు; అంతరం చూపు;
    • discriminative person, ph. వివేచనా శాలి;
    • discriminative power, ph. వివేచనా శక్తి; సదసద్వివేచన; వివేకం;
  • discrimination, n. (1) వివక్ష; విచక్షణ; విచక్షత; తేడా చూపడం; విచక్షణ ప్రేరితమైన జుగుప్స; (2) బుద్ధి; తెలివి; వివేకం; తేడా తెలుసుకోగలిగే శక్తి;
    • caste discrimination, ph. కుల విచక్షణ;
    • gender discrimination, ph. లింగ విచక్షణ;
    • discriminating power, ph. విచక్షణా జ్ఞానం; సదసద్వివేచన; వివేకం;
  • discrepancy, n. తేడా; వ్యత్యాసం; విప్రతిపత్తి;
  • discuss, n. (1) విష్ణుచక్రం; (2) చిమ్ముబిళ్ల; ఆటలలో విసరడానికి వీలుగా ఉండే గుండ్రటి లోహపు బీళ్ల;
  • discuss, v. i. చర్చించు; ముచ్చటించు; మంతనాలాడు; ప్రస్తావించు; ప్రసక్తం చేయు; విచారించు;
  • discussion, n. చర్చ; గోష్ఠి; మంతనం; సంవాదం; ప్రసంగం; ప్రస్తావన; తర్జనభర్జన; సమాలోచన;
    • informal discussion, ph. ఇష్టాగోష్ఠి; యథేష్ట గోష్ఠి;
    • point of discussion, ph. చర్చనీయాంశం;
  • disdain, n. తూష్ణీంభావం; చిన్నచూపు; అలక్ష్యం; ఉపేక్ష; తిరస్కారం;
  • disease, n. వ్యాధి; రోగం; రుగ్మత; రుజ; సంకటం; జాడ్యం; జబ్బు; తెగులు; ఆంతకం; ఉపతాపం; ఆమయం; సుస్తీ; అస్వస్థత; నలతగా ఉండడం;
    • communicable disease, ph. సాంక్రమిక వ్యాధి; సంక్రామిక వ్యాధి;
    • congenital disease, ph. పుట్టు వ్యాధి; ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి సంక్రమించిన రోగం; పుట్టుకతో శరీరనిర్మాణ లోపాల వలన వచ్చే

రుగ్మతలు పుట్టువ్యాధులు. ఈ రుగ్మతలు అవయవ నిర్మాణ లోపాలు, అవయవ కార్యనిర్వహణ లోపాలు, జీవ రసాయనాల ఉత్పత్తి లోపాలు, లేక జీవప్రక్రియ లోపాలు వలన కలుగుతాయి; ఇది తల్లిదండ్రులనుండి వంశపారంపర్యంగా సంక్రమించేది కాదు;

    • contagious disease, ph. అంటురోగం; పొంగు, క్షయ, మశూచికం మొదలయినవి ఒకరినుండి మరొకరికి అంటుకుంటాయి, కనుక అవి అంటు రోగాలు;
    • degenerative diseases, ph. శిధిల వ్యాధులు; శరీరములో అవయవాల శైథిల్యమువలన వచ్చేవి శిథిల వ్యాధులు; వృద్ధాప్యములో అవయవాల క్షీణత ఒక ఉదాహరణ;
    • fatal disease, ph. మారకం; మరణాంతకమగు రోగం;
    • genetic disease, ph. జన్యు రోగం; ఇది తల్లిదండ్రులనుండి వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బు; జన్యు సంబంధ వ్యాధులు కొన్ని పుట్టుకతోనే కనిపించినా, కొన్ని పుట్టుకతో

పొడచూపక ఆ తరువాత ఎప్పుడో కనిపించవచ్చును;

    • infectious disease, ph. తిష్ట; తిష్టరోగం; సూక్ష్మజీవుల వల్ల కలిగే జబ్బు; ఒక ప్రియాను వల్ల కాని, వైరస్ వల్ల కాని, బేక్టీరియా వల్ల కాని, ఫంగస్ వల్ల కాని, పేరసైట్ వల్ల కాని ఆక్రమణ వల్ల వచ్చే రోగం;
    • metabolic disease, ph. జీవవ్యాపార లోపాల వలన కలిగే రుగ్మతలు; ఇన్సులిన్ సమతూకంలో లేకపోవుట (మధుమేహం లేదా Diabetes), గళగ్రంథి స్రావకము (Thyroxine) సమతూకంలో లేకపోవుట (Hypo or Hyperthyroidism), అడ్రినల్ హార్మోనులు సమతూకంలో లేకపోవుట, క్రొవ్వు పదార్ధాలు ఎక్కువ అవుట ఇట్టి వ్యాధులకు ఉదాహరణలు;
    • non-communicable disease, ph. అసాంక్రమిక వ్యాధి;
    • puerperal disease, ph. సూతికా వ్యాధి;
    • rust disease, ph. కుంకుమ తెగులు; మొక్కలకి వచ్చే ఒక రకమైన వ్యాధి;
    • smut disease, ph. కాటుక తెగులు; మొక్కలకి వచ్చే ఒక రకమైన వ్యాధి;
    • venereal disease, ph. సుఖరోగం; ఉపదాంశ; సవాయి;

---Usage Note: disease, illness, sickness

  • ---It is disease that actually makes you sick: He suffers from heart disease. Illness is the state of being sick. Sickness is a particular type of illness: motion sickness.
  • disease-free, n. నిరామయం; జబ్బులేని స్థితి; రోగరహితం; అనామయం;
  • disease-ridden, adj. రుజాగ్రస్త; వ్యాధిగ్రస్త;
  • disembark, v. i. దిగు; బండి దిగు; వాహనం దిగు;
  • disembark, v. t. దించు;
  • disembodied, adj. ముక్తదేహి అయున; శరీరమును విడచిన;
    • disembodied spirit, ph. ముక్తదేహి అయిన ఆత్మ; అశరీరి;
  • disembowel, v. t. కడుపుని చీల్చి పేగులు తీయుట;
  • disenchantment, n. భ్రమనివారణం;
  • disfigure, v. t. అందవికారముగా చేయు; అనాకారిగా చేయు; కురూపము చేయు; విరూపము చేయు;
  • disgorged, adj. కక్కించిన;
  • disgrace, n. పరాభవం; నామర్దా; ఆరడి; అవమానం;
  • disgruntled, adj. అసంతృప్తి చెందిన;
  • disguise, n. మారువేషం; ప్రచ్ఛన్న వేషం;
  • disgust, n. రోత; ఘృణ; జుగుప్స; అసహ్యం; బీభత్సం;
  • disgusting, adj. అసహ్య; అసహ్య పడే విధంగా; బీభత్స;
  • dish, n. (1) గిన్నె; పాత్ర; పళ్లెం; లొసన; (2) వంటకం;
    • side dish, ph. ఉపదంశము;
  • dishes, n. pl. (1) కంచాలు, పళ్లాలు, కప్పులు, చెమ్చాలు, మొదలైన సామగ్రి; (2) అంట్ల కంచాలు, పళ్లాలు, కప్పులు, చెమ్చాలు, మొదలైన సామగ్రి; (3) వంటకాలు;
  • dishearten, v. i. అధైర్యపడు; నిరుత్సాహపడు;
  • disheveled, adj. చింపిరిగా ఉన్న; సంస్కారం లేని;
    • disheveled hair, ph. చింపిరిగా ఉన్న జుత్తు; సంస్కారం లేని జుత్తు;
  • dishonest, adj. వంచక;
    • dishonest fellow, ph. వంచకుడు; మోసగాడు;
    • dishonest woman, ph. వంచకి; మోసకత్తె;
  • dishwasher, n. అంట్లపెట్టె; అంట్లయంత్రం;
  • disinfectant, n. శుచికరి; శుద్ధకారిణి; క్రిమి సంహారిణి; సంక్రమణ నిరోధిని;
  • disinfection, n. సంక్రమణ నిరోధము;
  • disintegrate, v.i. విచ్ఛిన్నమగు; తునాతునకలగు; శిధిలమగు;
  • disintegration, n. విచ్ఛిన్నత;
  • disinterested, adj. నిరపేక్ష;
  • disjunctive, adj. నిరనుబంధ;
  • disjunction, n. నిరనుబంధం;
  • disk, disc (Br.), n. (1) బిళ్ళ; బింబము; (2) కంప్యూటరులో వాడే డిస్కు; see also disc;
  • dislike, n. ఏవగింపు; అయిష్టం; విప్రియం;
  • dislike, v. t. పీకు; పెళ్ళగించు; కుదుట్లోంచి పీకు;
  • dismal, adj. నిరాశాజనక; అంధకారబంధుర; శోకమగ్న;
  • disorder, n. (1) క్రమరాహిత్యం; అల్లకల్లోలం; అబందరం; అవ్యవస్థ; అశాంతి; కలవరం; అనృతం; లొగ్గడి; (2) జబ్బు; రుగ్మత; (3) ఈరతార;
  • disparity, n. తారతమ్యం; ఎరవు, eravu
  • dispassionate, adj. నిష్పక్షపాత; నిరపేక్ష; అనాసక్త; తటస్థ; నిర్వికార;
  • dispatch, v. t. (1) పంపు; పంపించు; బట్వాడా చేయు; (2) చంపు;
    • dispatch clerk, ph. బట్వాడా గుమస్తా;
  • dispatcher, n. ప్రేషకుడు;
  • dispel, v. t. చెదరగొట్టు; పోగొట్టు; నివృత్తి చేయు; నివారించు; బాపు;
  • dispensary, n. ఔషధాలయం; దవాఖానా;
  • dispensation, n. విధి; దైవఘటన; దైవసంకల్పం;
  • dispense, v. t. ఇచ్చు; పంచిపెట్టు;
  • disperse, v. t. చిమ్ము; విరజిమ్ము; చెదరగొట్టు; విసరి చల్లు;
  • dispersion, n. విక్షేపణం; అపకిరణం;
  • displaced, adj. (1) స్థలం తప్పించబడ్డ; కదల్చబడ్డ; (2) నిర్వాసితులయిన; నిరాశ్రయులైన;
    • displaced people, ph. నిర్వాసితులు;
  • displacement, n. (1) కదలిక; చలనం; (2) స్థానభ్రంశ దూరం; స్థానభ్రంశత; ఉద్వాసన; తొలఁగించుట;
    • cultural displacement, ph. సాంస్కృతిక స్థానభ్రంశత;
  • display, n. విన్యాసం; జంభం; ఆడంబరం;
  • display, v. t. ప్రదర్శించు; విన్యాసించు; చూపించు; ఆడంబరంగా చూపించు; జంభముగా చూపించు; అగుపరచు;
  • displeasure, n. కినుక; అసమ్మతి;
  • disposable, adj. (1) అవసరానికి మించి ఎక్కువగా ఉన్న; (2) వాడి పారెయ్యడానికి వీలయిన;
  • disproportionate, adj. అననుపాత; అంగుగా లేని; అనుపాతంలో లేని; తీరుగా లేని; ఎబ్బెట్టుగా ఉన్న;
  • dispute, n. జట్టీ; తగువు; తగాదా; తగువులాట; వివాదం; తకరారు; పొరపొచ్చెం; పోట్లాట; పోరు;
    • oral dispute, ph. వాగ్వివాదం;
  • disputed, adj. ఆనవాటి;
    • disputed boundary, ph. ఆనవాటి ప్రహరి; ఆనవాటి సరిహద్దు;
  • disputed territory, ph. ఆనవాటి ప్రదేశం;
  • disqualified, adj. అనర్హ; అయోగ్య; అపాత్ర;
  • disregard, n. ఉల్లంఘన; అవజ్ఞ; అలక్ష్యం; లెక్కలేకపోవడం; ఉపేక్ష; అనాదరణ;
  • disregard, v. t. ఉల్లంఘించు; తోసిపుచ్చు;
  • disrepair, adj. బేమరామతు; మరమ్మతులు లేకుండా ఉన్న; పాడుపడి ఉన్న; చెడిపోయిన; దురస్తు;
  • disrepute, n. అప్రతిష్ట; అపకీర్తి; చెడ్డపేరు;
  • disruptive, adj. భంగకారక;
  • dissatisfaction, n. అసంతృప్తి;
  • dissection, n. ఛేదన; ఛేదించి పరిశీలించడం;
  • dissemination, n. వ్యాప్తి; ప్రచారం; విస్తరణ;
  • dissent, n. భిన్నాభిప్రాయం; అసమ్మతి;
  • dissent, v. t. భిన్నాభిప్రాయం చూపు; అభిప్రాయభేదం ప్రకటించు;
  • dissertation, n. పరిశోధనా గ్రంథం; నెమకాంకం;
  • disservice, n. అపచారం;
  • dissipate, v. t. పారద్రోలు; వెదజల్లు;
  • dissipation, n. వ్యాపనం; విసరణ; దుర్వ్రయము; దూపరదిండితనము; వ్యర్థపఱచుట; వృథావ్యయము;
  • dissolution, v. t. విలయనం; విరమింపు; ఎత్తివేయు;
  • dissolve, v. t. కరగించు; విలీనము చేయు;
  • dissociation, n. వియోగం; విడిపోవడం;
  • distance, n. దూరం; దవ్వు; ఎడ; కెళవు;
    • shouting distance, ph. కూతవేటు దూరం;
    • walking distance, ph. నడవగలిగే దూరం;
    • distance and difficulty, ph. దూరాభారం;
  • distant, adj. దూరపు; సుదూర;
    • distant future, ph. సుదూర భవిష్యత్తు;
    • distant relationship, ph. దూరపు బంధుత్వం;
    • distant relative, ph. దూరపు బంధువు;
  • distended, adj. ఉబ్బిన; పెద్దదైన; వాచిన;
  • distill, distil (Br.), v. t. (1) బట్టీపట్టు; ధృతించు; (2) కార్చు; బొట్లు బొట్లుగా కార్చు;
  • distillation, n. అభిషవం; ఆస్రవనం; మరగించి చల్లార్చడం; బట్టీపట్టుట; స్వేదనం; చుక్కలు చుక్కలుగా కారేటట్లు చెయ్యడం;
    • destructive distillation, ph. భంజక స్వేదనం; నిర్వాత స్వేదనం; గాలి తగలకుండా ఉడికించడం;
    • fractional distillation, ph. అరమరగించుట; ఆంశిక స్వేదనం;
  • distilled, adj. బట్టీపట్టిన; ధృతించిన; అభిషవించిన; స్విన్న;
    • distilled water, ph. బట్టీపట్టిన నీరు; స్విన్న జలం; ధృతి జలం;
    • distilled liquor, ph. అభిషవోల్; బట్టీపట్టిన సారా; ఇలా బట్టీపట్టగా వచ్చినవే బ్రాందీ, విస్కీ వగైరాలు;
  • distiller, n. (1) బట్టీ; బట్టీ పట్టే పరికరం; (2) కలాలి; బట్టీపట్టే వ్యక్తి;
  • distinct, adj. ప్రత్యేకమైన; స్పష్టమైన; వేరైన; భిన్నమైన;
  • distinction, n. (1) ప్రత్యేకత; విలక్షణత; (2) విభేదం; వివక్ష; (3) ఘనత; ప్రసిద్ధ; ప్రముఖ; విశిష్ట;
  • distinguished, adj. (1) ప్రత్యేకమైన; విలక్షణమైన; (2) ఘనతకెక్కిన;
  • distort, v. t. విరూపించు; వికరించు; వికారముగా చేయు; వంకర చేయు;
  • distortion, n. వంకర; విరూపం; వైకల్యం;
  • distraction, n. (1) పరధ్యాన్నం; పరాకు; వ్యగ్రత; అన్యమనస్కత; ధ్యానభంగం; (2) వికర్షణ.
  • distrain, v. t. జప్తు చేయు; చరాస్తిని స్వాధీనపరచుకొను;
  • distress, n. వ్యాకులం; వ్యాకులత; దుస్థితి; మనస్తాపం; క్షోభ; వ్యధ; వెత; ఉత్తలపాటు; కలత; అదవద;
    • functional distress, ph. ఇంద్రియ వ్యాపార వ్యాకులత;
  • distribute, v. t. పంచు; పంపిణీ చేయు; సర్దు;
  • distribution, n. పంపిణీ; పంపకం; వంతులవారీ విభజన; బట్వాడా; వ్యాపన; వ్యాప్తి; వితరణ;
    • probability distribution, ph. సంభావ్యతా వితరణ;
  • distributor, n. పంపిణీదారు; వితరణి;
  • distributary, n. పాయ; నది యొక్క పాయ; (ant.) tributary;
  • district, n. పరగణా; జిల్లా; సర్కారు; మండలం;
    • ceded district, ph. దత్త మండలం; ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికి మరొక పేరు;
    • northern district, ph. ఉత్తర సర్కారు; ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకోస్తా ప్రాంతానికి మరొక పేరు;
    • district board, ph. జిల్లాబోర్డు;
    • district officer, ph. మండలాధికారి;
  • disturb, v. t. కలత పెట్టు; భంగ పరచు; అంతరాయం కలిగించు; ఆటంక పరచు; విఘ్నపరచు; వ్యాఘాత పరచు;
  • disturbance, n. కలత; సంక్షోభం; కలవరం; గల్లంతు; గలాటా; వ్యాఘాతం; భంగం; విఘ్నం;
  • disturbed, adj. కలత చెందిన; కలత;
    • disturbed sleep, ph. కలత నిద్ర;
  • ditch, n. కందకం; గొయ్యి; అగడ్త; పరిఘ; కాలువ;
  • ditto, n. సదరు; పైన చెప్పిన;
  • diuretic, n. మూత్రవర్థకం; మూత్రప్రేరకం;
  • diurnal, adj. (1) అహోరాత్ర; (2) పగలుఁదిరిగే; పగలుఁదిరిగెడి; దివాచర; దైనిక;
  • diurnal, n. అహోరాత్రములు; రాత్రి, పగలు; ఇరవై నాలుగు గంటలు;
    • diurnal cycle, ph. అహోరాత్ర చక్రం;
  • dive, v. i. నీటిలో మునుఁగు;
Divergence of a vector field
  • divergence, n. విపరిణామం; విక్రియ; కేంద్రావసరణం; అపసరణం; వ్యాప్తి; ప్రసరణ; (phy.) In physics, the divergence of a vector field is the extent to which the vector field flux behaves like a source at a given point. It is a local measure of its "outgoingness"
    • semantic divergence, ph. [ling.] అర్థ విపరిణామం;
  • diverse, adj. విభిన్న; వివిధ; బహువిధములైన; నానావిధ; పలురకాల;
  • diversification, n. వివిధీకరణ;
  • diversion, n. (1) భిన్నమైన పద్ధతి; మరొక ప్రవృత్తి; మరొక దారి; (2) వేడుక; లీలావినోదం; కేళీవినోదం;
  • diversity, n. భిన్నత్వం; వైవిధ్యం; వైచిత్రి;
    • biodiversity, n. జీవవైవిధ్యం; జీవవైచిత్రి;
    • unity in diversity, ph. భిన్నత్వంలో ఏకత్వం;
  • divert, v. t. మరల్చు; మరలించు; మళ్ళించు; తిప్పు; క్రమ్మరించు; పెడదారి పట్టించు; నివర్తించు;
  • divide, v. t. విభజించు; భాగించు;
    • divide and conquer, ph. దమననీతి;
    • divide and rule, ph. విభజించి పాలించు;
  • divided, adj. విభక్త; విభాజిత;
    • divided difference, ph. [math.] విభక్త వ్యత్యాసం; విభాజిత వ్యత్యాసం;
  • dividend, n. (1) విభాజ్యం; భాజ్యం; భాగింపబడవలసిన రాశి; భిన్నములోని లవం; (2) లాభాంశం; లాభాగం; వ్యాపారంలో వచ్చే లాభంలో వాటాదారులకి వచ్చే కొంత భాగం;
    • annual dividend, ph. సాలుసరి వృద్ధి; సాలుసరి లాభాగం; (2) వృద్ధి; లాభవిభాగం; లాభాంశం; లాభాగం; దామాషా; పంచేది; పంచబడేది; డివిడెండు; వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాటాదారుల మధ్య విభజించబడే లాభాన్ని డివిడెండు అంటారు; periodic return on investment as opposed to capital gains which refers to the growth in value of an investment; బేంకులో డబ్బు దాచుకుంటే మనకి వచ్చే ఆదాయం వడ్డీ అవుతుంది; (ety.) సంస్కృతంలో వృద్ధి అన్న మాట లోంచే వడ్డీ అన్న మాట వచ్చిందని అంటారు. కనుక dividend అన్న మాటని వృద్ధి అనీ, interest అన్న మాటని వడ్డీ అనీ తెలిగించేను;
  • divination, n. భవిష్యత్కథనం; భావి విషయ వ్యక్తీకరణం; సోది చెప్పడం;
  • divider, n. భిత్తి; అడ్డుగోడ;
  • divine, adj. భగవత్; దివ్య; దేవుడికి సంబంధించిన;
  • divine, v. t. జోశ్యం చెప్పుట; శకునం చెప్పుట;
  • diviner, n. జోశ్యం చెప్పే వ్యక్తి; జోశ్యుడు; సోది చెప్పే వ్యక్తి; శకున ఫలితం చెప్పే వ్యక్తి;
  • divisibility, adj. భాజనీయత; విభజనీయత;
  • division, n.(1) అంగం; భాగం; విభాగం; ఫిర్కా; డివిౙను; (2) భాగారం; భాగహారం; విభజన;
    • long division, ph. పొడుగు భాగారం; దీర్ఘ భాగారం;
    • short division, ph. పొట్టి భాగారం; హ్రస్వ భాగారం;
  • divisor, n. విభాజకం; భాజకం; భాగారించెడు సంఖ్య; హరించెడు సంఖ్య; భిన్నములోని హారం;
    • proper divisor, ph. క్రమ విభాజకం; For example, 1, 2, and 3 are positive proper divisors of 6, but 6 itself is not;
  • divorce, n. విడాకులు; భార్యాభర్తలు ఒకరినొకరు విడచి పెట్టడం; ఘట శ్రాద్ధం చేయుట;
  • divulge, v. t. వెల్లడిచేయు; రహశ్యం బయట పెట్టు;
  • dizziness, n. (1) కళ్లు చీకట్లు కమ్మడం; lightheadedness; (2) తల తిరగడం; vertigo;
  • do, v. t. చేయు; ఒనరించు; ఒనర్చు; కావించు; సలుపు; ఆచరించు; చక్కబెట్టు; నడుపు; పాటించు; నిర్వహించు;
  • docent, n. చిత్రవస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శించిన వస్తువుల గురించి ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి; మ్యూజియంలో గైడు;
  • docile, adj. విధేయమైన; చెప్పిన మాట వినే; నమ్రత కలిగిన; ధిక్కారం చూపని;
  • dock, n. (1) నావల దొడ్డి; నౌకా కేంద్రం; (2) రేవు; నావలు నిలచే స్థలం; (3) బోను; న్యాయస్థానంలో సాక్షి నిలబడే స్థలం;
  • dock, v. i. (1) లంగరు వేయు; (2) ఒక నిర్ధిష్ట స్థానంలో అమర్చు;
  • dockyard, n. నావల దొడ్డి; నౌకా నిర్మాణ కేంద్రం;
  • doctor, n. (1) భిషక్కు; ఆయుర్వేది; రోగహారి; డాక్టరు; m. వైద్యుడు; చికిత్సకుడు; ఓషధీధరుడు; f. డాక్టరమ్మ; (2) పట్టపు పేరు; పాండిత్యానికి గుర్తుగా పేరు చివర శాస్త్రి అని తగిలించినట్లే ఇంగ్లీషు సంప్రదాయంలో పేరు మొదట డాక్టర్‍ అంటారు;
  • doctrine, n. వాదం; సిద్ధాంతం;
  • document, n. పత్రం; దాస్తు; లేఖ్యం; లిఖితం; లిఖిత పత్రం; దస్తావేజు; నామా;
    • petition document, ph. అర్జీదాస్తు;
    • memorandum document, ph. యాదాస్తు;
    • supporting document, ph. ఆకరం;
    • warranty document, ph. కరారునామా;
    • document form, ph. పత్రరూపం;
    • documentary evidence, ph. లిఖిత సాక్ష్యం; పత్రరూపంలో సాక్ష్యం;
  • dodecagon, n. [math.] ద్వాదశ భుజి; ఇరాఱఱకి(ఇరు + ఆఱు + అఱకి = పన్నెండు అఱకలు (అనగా భుజాలు) కలిగినది);
  • dodecahedron, n. [math.] ద్వాదశముఖి; ద్వాదశపీఠి; ఇరాఱుమోమి(ఇరు + ఆఱు = పన్నెండు మోములు కలది);
  • dodecane, n. [chem.] ద్వాదశేను; ఇరాఱేను; పన్నెండు కర్బనపుటణువులు గల ఒక ఉదకర్బనం; C12H26;
  • dodge, v. i. తప్పించుకొను; పక్కకి ఒరుగు;
  • doe, n. f. ఆడ జింక; లేడి; మృగి; (ant.) buck;
  • doer, n. కర్త; కార్యవాది; పనిచేసేవాడు;
  • dog, n. కుక్క; శునకం; శ్వానం; వేపి; జాగిలం; గ్రామసింహం;
    • coprophagic dog, ph. పీతి కుక్క; అశుద్ధం తినే కుక్క;
    • Indian wild dog, ph. రేచు కుక్క;
    • pet dog, ph. పెంపుడు కుక్క; సాకుడు కుక్క;
    • stray dog, ph. ఊరకుక్క; గ్రామసింహం; వీధి కుక్క;
    • dog days, ph. జూలై, ఆగష్టు నెలలలో వచ్చే వేడి రోజులు; ఈ రోజులలో సూర్యుడు, సిరియస్ (శ్వాన) నక్షత్రం ఒకేసారి ఉదయించి, ఒకే సారి అస్తమిస్తాయి; సిరియస్ నక్షత్రాన్ని "డాగ్ స్టార్" అని అంటారు కనుక ఈ పేరు వచ్చింది;
    • dog star, n. శ్వాన నక్షత్రం; యుధిష్టురుని కుక్క; see also Sirius;
  • dogma, n. సహేతుకం కాని సిద్ధాంతం; మూర్ఖవాదం; నమ్మకం; పట్టుదల; అంధవిశ్వాసం; పిడివాదం; నిశ్చితాభిప్రాయం;
  • dog’s cane, n. కాశీగన్నేరు; ఒక మొక్క;
  • dogged, adj. మొండి;
  • dogma, n. సిద్ధాంతం; నిబంధన; కట్టుబడ్డ సిద్ధాంతం; పిడి వాదం;
  • doldrums, n. (1) నిర్వాతమండలాలు; ఇవి భూమధ్యరేఖ ప్రాంతపు సముద్రాలలో గాలి వీచని ప్రదేశాలు; (2) [idiom] స్తంభించి పోయిన పరిస్థితులు; ఎటూ కదలని అయోమయ స్థితి;
  • doll, n. బొమ్మ; సాలభంజిక; పుత్తళి; పుత్తడి; పుత్రిక; పాంచాలిక;
    • doll house, ph. బొమ్మరిల్లు;
  • dolphin, n. గండుమీను; బెడిస చేఁప;
  • domain, n. అధికార పరిధి; ఇలాకా; వ్యాప్తి;
    • domain name, ph. [comp.] ఇలాకా పేరు;
  • dome, n. డిప్ప; కప్పు; గోపురం;
  • domestic, adj. దేశీయ; స్వదేశీయ; సొన్నాటి (సొంత నాటి; నాడు = దేశం); గృహస్థ; ఇంటి; గృహ;
    • domestic chores, ph. ఇంటి పనులు;
    • domestic industry, ph. దేశీయ పరిశ్రమ; ఇంటలవు (ఇంటి + అలవు, అలవు = పరిశ్రమ);
    • domestic troubles, ph. గృహచ్చిద్రాలు; సంసారపు సమస్యలు; ఇంటి సమస్యలు;
  • domesticate, v.t. మచ్చికచేయు;
  • domicile, n. నివాసస్థానం;
  • dominant, adj. ప్రబల; ప్రకాశపు; ప్రస్ఫుట;
    • dominant caste, ph. ప్రబల కులం; భారత రాజ్యాంగం దేశంలో ఉన్న కులాలని అగ్ర కులాలు (forward castes), వెనకబడ్డ కులాలు (backward castes) అని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టి, వెనకబడ్డ కులాలని మళ్లా దళితులు (scheduled castes), గిరిజనులు (scheduled tribes) అని వర్గాలుగా విడగొట్టి వెనకబడ్డ కులాలకి ప్రత్యేక అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలని అందుకోడానికి అగ్ర కులాలలో కొందరు అలజడి చెయ్యగా వారిని మెప్పించడానికి ఇతర వెనకబడ్డ కులాలు (other backward castes) అని మరొక వర్గం సృష్టించి, వారికి కూడ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇటీవల అగ్రకులాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్లు తమని కూడ ఇతర వెనకబడ్డ కులాలు జాబితాలో వేసి తమకి కూడ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆరాటం చెయ్యడం మొదలు పెట్టేయి. వీరిని ప్రబల కులాలు అని సంబోధించడం మొదలు పెట్టేరు.
    • dominant gene, ph. ప్రబల జీను; ప్రకాశపు జీను;
    • dominant mutation, ప్రబల ఉత్పరివర్తన;
    • domineering attitude, ph. ధాష్టీకం;
  • dominion, n. అధినివేశం;
  • donation, n. విరాళం; ఈగి;
  • donee, n. ప్రతిగ్రహీత; దానం పుచ్చుకొనేవాడు;
  • donkey, n. గాడిద; గార్ధభం; ఖరం;
  • donor, adj. ప్రదాతృ;
    • donor language, ph. ప్రదాతృ భాష;
  • donor, n. దాత; దాయకుడు; ప్రదాత; ఈవరి; ఉదారుడు; వదాన్యుడు; దానమిచ్చువాడు; త్యాగి; విరాళం ఇచ్చే వ్యక్తి;
  • doom, n. (1) చెడ్డ తలరాత; దుష్కర్మ; (2) చేసిన పాప ఫలితం అనుభవించవలసిన సమయం;
  • doomsday, n. కల్పావసానం; మహాప్రళయ కాలం;
  • door, n. తలుపు; కవాటం; అరళం; ద్వారం; ప్రతిహారం;
    • back door, ph. పెరటి గుమ్మం; దొడ్డి దారి;
    • front door, ph. వీధి గుమ్మం; సింహ ద్వారం;
  • doorkeeper, n. ప్రతిహారి; ద్వారపాలకుడు; వేత్రహస్తుడు;
  • doping, n. [phy.] మాదీకరణం; అర్థవాహక పదార్థాల ప్రవర్తనను మలినాలు కలిపి మార్చవచ్చు; ఈ పద్ధతిని మాదీకరణం అంటారు;
  • dork, n. మూర్ఖుడు;
  • dormancy, n. నిద్రాణం; సుప్తి;
  • dormant, adj. నిద్రాణమైన; సుప్తమైన;
  • dormitory, n. ఆవసధం; పలువురు ఎవరి గదులలో వారు నిద్రించడానికీ, నివసించడానికి వీలయిన వసతి గృహం;
  • dorsal, adj. వెన్నుకి సంబంధించిన; వీపువైపు;
    • dorsal fin, ph. వెన్ను రెక్క;
    • dorsal vertebrae, ph. వెన్ను పూసలు;
  • dose, n. మోతాదు;
  • dote, v. t. గారాబం చేయు; ముద్దుచేసి పాడు చేయు;
  • double, n. ఒక మనిషిని ముమ్మూర్తులా పోలిన మరొక మనిషి;
  • double, adj. జంట; రెండింతల; రెండంతల; జవులి; ఇను; ఇనుమడి; ఇబ్బడి; రెట్టింపు;
    • double bond, ph. జంట బంధం;
    • double entendre, ph. శ్లేష; మాట విరుపులో రెండో అర్థం ధ్వనించడం; శ్లేషాలంకారంలో రెండవ అర్థం అశ్లీలంగా ఉండేది; ఉ. మీరు మాలా? President wins budget; mote lies ahead!
    • double helix, ph. జంట పెన;
    • double meaning, ph. శ్లేష; శ్లేషాలంకారం;
    • double star, ph. జంటతార;
    • double weave, ph. జవుళి నేత;
  • double, n. రెండింతలు; రెట్టింపు; ఇబ్బడి; జమిలి;
  • double, v. t. రెండింతలు చేయు; ఇనుమడించు; ఇమ్మడించు; ఇబ్బడించు; ద్విగుణీకృతం చేయు; రెట్టింపు చేయు; రెట్టించు; ఆమ్రేడించు;
  • doublet, n. జంట; ద్వయం; ద్వికం;
  • doubt, n. అనుమానం; సందేహం; సంశయం; శంక; విచికిత్స; వికల్పం; అరగలి; ఢోకా;
    • benefit of doubt, ph. సంశయ లబ్ది;
  • doubtful, n. సందేహాస్పదం; సంశయాత్మకం; నిర్వికల్పం; అస్తినాస్తి;
  • douche, n. పిచికారీ;
  • douche, v. t. పిచికారీతో కడుగు;
  • dough, n. గట్టిగా తడిపిపెట్టిన పిండి; (డో అని ఉచ్చరించాలి); (rel.) batter;
  • doughnut, n. (డోనట్); ౘక్కెరయుబ్బి; ౘక్కెరగారి; గారె ఆకారంలో, మధ్యలో చిల్లు ఉన్న ఒక తియ్యటి వంటకం;
  • doughnut-shaped, adj. (చిల్లు)గారె ఆకారం ఉన్న; వడాకారం ఉన్న; see also toroidal;
  • douse, v. t. తడుపు; వరదచేయు; దిమ్మరించు; మంటలని నీళ్ళు పోసి ఆర్పు;
  • dove, (డవ్) n. గువ్వ; కపోతం; పావురం; పావురాయి;
    • mourning dove, ph. సణుగుడు గువ్వ;
  • dove, (డోవ్‍) v. i. past tense of dive; (1) మునుగు; మునక వేయు; ఎత్తయిన చపటా మీదనుండి నీటిలోనికి దూసుకుపోతూ మునక వేయు; (2) దూసుకు వచ్చు;
  • down, n. అంగరుహము; మెత్తనైన పిల్లపక్షి ఈకలు;
  • down, adj. దిగువ; కింద; అడుగున; దిగుడు;
  • downfall, n. పతనం;
  • downhill, n. and adv. దిగుడు; దిగుబోటు;
  • download, v. t. దింపు; తెప్పించు; సమాచారాన్ని మన కంప్యూటర్‍ లోనికి దింపు; (ant.) upload;
  • down payment, n. మొదటి వాయిదా; విలువైన వస్తువులని వాయిదాల పద్ధతి మీద కొన్నప్పుడు మొట్టమొదటి వాయిదాగా చెల్లించే సొమ్ము;
  • downpour, n. జడివాన;
  • Down's syndrome, ph. జన్యు లోపం వల్ల మానసికమైన ఎదుగుదల లేకుండా ఉండే రోగ లక్షణ సముదాయం;
  • downstream, n. దిగు-పఱవడి;
  • downtown, n. ఊరి నడిబొడ్డు; బజారు వీథులు; పెద్ద బజారు; (ant.) uptown;
  • downtrodden, adj. దళిత; తాడిత; పీడిత; అణగదొక్కబడ్డ;
  • downward, adj. దిగువ దిశలో; అధోముఖ; కిందకి; దింపుడు; అవాచీన;
    • downward arrow, ph. అధోముఖ సాయకం;
    • downward movement, ph. అధోముఖ చలనం;
  • downwind, ph. వాలుగాలి;
  • dowry, n. కట్నం; శుల్కం; ఓలి;
  • doze, n. కునికిపాటు; ముచ్చిలిపాటు;
  • dozen, n. ఇరాఱు; డౙను; (ety.) [Lat.] duodecim, [San.] ద్వాదశి;
  • draft, n. (1) చిత్తు; చిత్తు ప్రతి; ముసాయిదా; (2) గాలిసెగ; (3) దుక్కి; (4) బ్యాంకు పత్రం; బ్యాంకు హుండీ;
    • draft animal, ph. దుక్కిటెద్దు;
    • draft copy, ph. చిత్తు ప్రతి; చిత్తు; ముసాయిదా; మసోదా; ఆకృతి రచన;
  • drag, n. కర్పణం; కర్పణ శక్తి; ఈడ్పుదల; ప్రతిబంధం;
    • aerodynamic drag, ph. చలద్వాయు కర్పణం;"
    • atmospheric drag, ph. వాతావరణ కర్పణం;
  • drag, v. t. ఈడ్చు; లాగు;
  • dragnet, n. (1) లాగువల; జలాశయాలలో చేపలు తప్పించుకుందికి వీలు లేకుండా అడుగంటే వరకు విసరి లాగడానికి వీలయిన వల; (2) నేల మీద చిన్న చిన్న జంతువులని పట్టడానికి వాడే వల; (3) తప్పించుకు పారిపోయే నేరస్తులని పట్టడానికి పోలీసులు పోలీసులు పన్నే పన్నాగం;
  • dragon, n. నిప్పుబల్లి; కాళ్లు, కొమ్ములు కలిగి నిప్పును క్రక్కే ఒక ఊహాలోకపు చెడ్డ బల్లి;
  • dragonfly, n. తూనీగ; తూరీగ;
dragon fruit
  • Dragon Fruit, n. కమలం; Pitaya; Strawberry Pear; [bot.] Selenicereus undatus; Selenicereus costaricensis; Selenicereus megalanthus of the Cactaceae family;
  • drain, n. మోరీ; జలదారి;
  • drainage, n. విమోచనం; తూపరాణ;
    • underground drainage, ph. భూగర్భ విమోచనం;
  • drake, n. మగబాతు;
  • drama, n. నాటకీయత; నాటకం;
  • dramatic, adj. నాటకీయ; ఆకస్మిక; విచిత్ర;
    • dramatic style, ph. నాటకీయత; శైలి;
  • dramatist, n. నాటక కర్త;
  • dramatization, n. నాటకీకరణ; కథ రూపంలో ఉన్న దానిని నాటక రూపంలోకి మార్చడం;
  • drapery, n. పరదాలు; జాలరులు; తలుపులకి, కిటికీలకి వేసే తెరలు;
  • Dravidian, adj. ద్రావిడ;
  • Dravidian, n. ద్రవిడం;
    • proto Dravidian, ph. మూల ద్రవిడం; మూల ద్రావిడ;
  • draw, v. t. (1) గీయు; (2) తోడు; చేదు; బయటకు తీయు; (3) పితుకు; (4) ఈడ్చు; (5) సాగదీయు;
  • draw, n. తట్టు; ఇటో, అటో తేలకుండా ఆగిపోయిన ఆట;
    • draw milk, ph. పాలు పితుకు;
    • draw water, ph. నీళ్లు తోడు;
  • draw well, n. చేదు బావి;
  • drawbacks, n. pl. నిరోధకాంశాలు; లోపాలు; లోటుపాట్లు; ప్రతిబంధకాలు;
  • drawer, n. (1) సొరుగు; (2) లాగు; చల్లడం;
  • drawing, n. రేఖాచిత్రం; చిత్రలేఖనం; see also painting;
    • drawing room, ph. కచేరీ సావడి;
  • dread, v. i. భయపడు;
  • dreadful, adj. భయంకరమైన;
  • dream, n. కల; స్వప్నం;
  • dreamlike, adj. స్వాప్నిక;
  • dredge, v. t. త్రవ్వు;
  • dredger, n. త్రవ్వోడ;
  • dredging, n. అడుసు త్రవ్వుట; మేట త్రవ్వు;
  • drench, v. i. తడిసి ముద్దగుట;
  • drench, v. t. తడిపి ముద్దచేయు;
  • dress, n. (1) ఆడవారి దుస్తులు; (2) దుస్తులు; అంబరములు;
  • dress, v. t. దుస్తులు ధరించు; దుస్తులు తొడుగు;

---Usage Note: dress, put on, wear

  • ---Use dress to mean "put on clothes or "wear a particular type of clothes: She always dresses fashionably. If you put on a piece of clothing, you dress yourself in that thing. Use wear to mean you have something on your body: Is that a new blouse you are wearing? Are you wearing a perfume?
  • dressed, n. సాంబరమైన; దుస్తులతోనున్న; సాంబరుఁడు; దిగంబరుఁడు కానివాఁడు;
  • dressing, n. (1) శోధనం; కట్టు కట్టడం; (2) బట్టలు తొడుక్కోవడం; వస్త్రాలంకరణ; (3) సంరక్షణ; (4) అలంకరణ; కొన్ని తినుభండారాలపై అలంకరణ కోసం వాడే పదార్థం;
    • hair dressing, ph. కేశ సంరక్షణ; కేశ అలంకరణ;
    • salad dressing, ph. పచ్చి కాయగూరల మీద రుచి కొరకు పోసే నూనె, సిరకా మిశ్రమం;
    • dressing a wound, ph. వ్రణ శోధనం; పుండుకు కట్టు కట్టడం;
  • dried, adj. వరుగు; శుష్క;
    • dried brinjal, ph. వంగ వరుగు;
    • dried fish, ph. వరుగు చేపలు; ఎండు చేపలు;
    • dried food stuff, ph. వరుగులు;
  • drift, n. (1) గాలికి ఎగిరి మేటలుగా పడ్డ ఇసక కాని, పొడిమంచు కాని; (2) తాత్పర్యం;
  • drift, v.t. (1) కదులు; నెమ్మదిగా తేలియాడుతూ కదులు; కొట్టుకొని పోవు; (2) ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా నడుచు; (3) ఒక స్థితినుండి మరొక స్థితికి జారుకొను;
  • drill, n. (1) కవాతు; డ్రిల్లు; (2) బరమ; బెజ్జం పెట్టే సాధనం; (3) మూడు పేటలు వేసిన దారంతో నేసిన గుడ్డ; see also twill;
  • drink, adj. త్రాఁగు;
  • drink, n. పానీయం; త్రావెం;
    • alcoholic drink, ph. పానం; మద్యం; మద్యపానీయం;
    • soft drink, ph. పానీయం; సాధారణంగా సోడా వంటి బుడగలతో ఉన్న పానీయం;
  • drip, v. i. కారు; బొట్టు బొట్టుగా కారు;
    • drip irrigation, ph. కారుసాగు;
  • drive, n. (1) ప్రవణము; చొరవ; స్వయంచోదితంగా పూనుకుని పని చేసే స్వభావం; అభినివేశం; (2) వాహనాలు నడపడానికి అనువైన మార్గం; ఉ. Marine drive; (3) చోది; నడపడానికి వాడే సాధనం;
    • disk drive, ph. డిస్కు చోది; గ్రామఫోను రికార్డు ఆకారంలో ఉండే పళ్లేనిని ఉంచడానికి వాడే సాధనం; ఇది కలనయంత్రాలలో, కఠినాంగాలలో ఉండే భాగం;
    • printer drive, ph. ముద్రణ చోది; ఇది కలనయంత్రాలలో, కఠినాంగాలలో ఉండే భాగం;
  • drive, v. t. (1) తోలు; నడపు; చోదించు; చోపు; (2) తరుము;
  • driver, n. చాలకుడు; చాలకి; యంత; నడపరి; చోదకుడు; చోదరి; చోపరి; చోదాళువు; తోలేవాడు; గమికాడు; ఈరణి; సారధి; డ్రైవరు;
  • driver, n. [comp.] కంప్యూటర్ రంగంలో అనువర్తనానికీ, కఠినాంగానికీ పొంత కలుపుతూ మధ్యవర్తిగా పనిచేసే మృదులాంగ క్రమణిక;
    • printer driver, ph. [comp.] కంప్యూటర్ రంగంలో అనువర్తనానికీ, ముద్రణ కఠినాంగానికీ పొంత కలుపుతూ మధ్యవర్తిగా పనిచేసే మృదులాంగ క్రమణిక;
  • drizzle, n. తుంపఱ; చినుకు; జల్లు; శీకరం;
  • drone, n. మగ తేనెటీగ;
  • dromedary, n. ఒంటె; ఒకే ఒక మూపురం ఉన్న ఒంటె;
  • drool, n. చొంగ ; చొల్లు;
  • drool, v. i. చొంగ కార్చు; నోరు ఊరు;
  • drop, n. బిందువు; బొట్టు; చుక్క; బిళ్ల;
    • cough drop, ph. దగ్గు బిళ్ల;
    • dew drop, ph. తుషార బిందువు;
    • tear drop, ph. కన్నీటి బిందువు; కన్నీటిబొట్టు; కన్నీటి చుక్క; అశ్రు బిందువు; అశ్రు కణం;
    • water drop, ph. నీటిబిందువు; నీటిబొట్టు; నీటిచుక్క;
  • drop, v. i. దిగు; పడు; ౙారు;
  • drop, v. t. (1) దిగబెట్టు; వదలిపెట్టు; దిగవిడుచు; దించు; దింపు; (2) వదలివేయు; జారవిడచు; జార్చు; పడవేయు;
  • dropdown, adj. దిగజారే;
    • dropdown list, ph. దిగజారే జాబితా; కంప్యూటర్‍ తెర మీద ఎప్పుడు ఏయే పనులు చెయ్యగలమో చూపించే జాబితా;
    • dropdown menu, ph. దిగజారే ఎంపిక జాబితా; కంప్యూటర్‍ తెర మీద ఒక మాట మీద ఒత్తినప్పుడు ఎప్పుడు ఏయే పనులు చెయ్యగలమో చూపించడానికి కిందకి దిగజారే అంశాల జాబితా;
  • dropper, n. ద్రవ పదార్థాలని చుక్కలు చుక్కలుగా రాల్చే గొట్టం;
  • droppings, n. (1) పేడ; పెంటిక; లద్దె; (2) రెట్ట;
Plasmodium_falciparum_nephrosis_edema
  • dropsy, n. నంజు; ఒళ్లు వాచడం; ఉబ్బుసంకటం; నీరుకట్టు; [note] edema is the modern name for dropsy; Anasarca, or extreme generalized edema, is a medical condition characterized by widespread swelling of the skin due to effusion of fluid into the extracellular space;
  • drought, n. కరవు; కరువు; అనావృష్టి; వర్షాభావం; దుర్భిక్షం; కాటకం;
  • drove, n. మంద; తొంబ;
  • drown, v. t. నీళ్ళల్లో మునిగి చచ్చిపోవు;
  • drudgery, n. గొడ్డుచాకిరీ; యమచాకిరీ; అరవచాకిరీ;
  • drug, n. మందు; ఔషధం; ఊషణం;
    • generic drug, ph. సాధారణ ఔషధం;
    • orphan drug, ph. అనాధ ఔషధం; అరుదుగా వచ్చే జబ్బులకి కావలసిన మందులు; బడుగు దేశాలలో వచ్చే రోగాలకి కావలసిన మందులు;
    • patented drug, ఏకస్వ ఔషధం; తయారీకి విశిష్టాధికారం ఉన్న ఔషధం;
    • drug store, ph. మందులంగడి; మందులాపణి; మందులకొట్టు; మందులషాపు;
  • drum, n. (1) డప్పు; డోలు; దుందుభి; భేరి; నగారా; (2) డబ్బా; పీపా; తొట్టి;
    • rattling musical drum, ph. డబుడక్క;
    • small musical drum, ph. డిండిమం; గిడిగిడి;
  • drumstick, n. (1) ములగ కాడ; మునఁగ కాడ; (2) కోడి తొడ;
  • drunk, adj. ఉన్మత్త; త్రాఁగివున్న;
  • drunkard, n. త్రాఁగుబోతు; ఉన్మత్తుఁడు;
  • drupe, n. అష్టిఫలం; తొక్క; పీచు; టెంక; జీడి కల పండ్లు; కొబ్బరి కాయలు; మామిడి పండ్లు ఈ జాతికి చెందినవి;
  • dry, adj. (1) ఎండు; ఎండిన; వాడు; వాడిన; నంజ; (2) నిస్సారమయిన; (3) మెరక; పుంజ; (4) పొడి; పొడిగానున్న; (5) రుచి లేని; తీపిలేని;
    • dry cough, ph. పొడి దగ్గు;
    • dry ginger, ph. శొంఠి; అల్లాన్ని సున్నపు నీళ్లలో నాన్చి, పిమ్మట ఎండబెట్టగా వచ్చినది;
    • dry ice, ph. గడ్డకట్టిన బొగ్గుపులుసు గాలి;
    • dry land, ph. బీడు; నంజ నేల;
    • dry wine, ph. తీపిలేని ద్రాక్ష సారా;
  • dry, v. i. ఎండు;
  • dry, v. t. ఎండబెట్టు;
  • dry up, v.t. ఇంకు; అడుగంటు; ఇవురు; ఇగురు;
  • dual, adj. రెంౘ; ద్వైత; ద్వంద్వ; ద్వైదీ;
    • dual nature, ph. ద్వంద్వ ప్రవృత్తి; ద్వైదీభావం;
  • duality, n. ద్వైదీభావం; ద్వైవిధ్యత; రెంౘతనం;
  • dub, v. t. సినిమా ఫిల్ము మీద అసలు శబ్దాన్ని చెరిపేసి దాని స్థానంలో మరొక శబ్దాన్ని ప్రతిక్షేపించడం;
  • dubious, adj. అనుమానాస్పదమైన; సందేహాస్పదమైన; నమ్మకం లేని;
  • ductile, n. తాండవం;
  • duel, n. ద్వంద్వ యుద్ధం; రెంబోరు (రెంౘ + పోరు);
  • duet, n. యుగళ గీతం; ఇద్దరు కలసి పాడే పాట;
  • duck, v. i. మునుగు; జోరుగా కిందికి వంగు;
  • duck, v. t. ముంచు;
  • duck, n. బాతు; ఆడ బాతు;
  • duckling, n. బాతు పిల్ల;
  • duct, n. వాహిక; గొట్టం; నాళం;
  • ductility, n. [phy.] తంతవ్యత; సాధుత్వం;
  • dues, n. రుసుం; సభ్యత్వ రుసుం; (rel.) fee;
  • membership dues, ph. సభ్యత్వ రుసుం;
  • duke, n. m. రాజు; బ్రిటిష్ రాచవ్యవస్థలో ఒక ఉన్నత స్థానాన్ని సూచించే పదవి; Emperor (చక్రవర్తి), King (మహరాజు), Duke (రాజు), Marquiss, Earl (ప్రభువు), Viscount (దివాను), Barron (జమీందారు) are the ranks in descending order;
  • dull, adj. (1) మందకొడి; మొండి; (2) కోరా;
    • dull knife, ph. మొండి కత్తి;
    • dull person, ph. మందకొడి మనిషి;
    • dull wit, n. శుంఠ; మందమతి; తమందం;
  • dullard, n. జడుఁడు; జడ్డి;
  • dumb, adj. (డమ్) (1) మూఁగ; మాటలాడని; (2) తెలివి తక్కువ; పస లేని;
    • dumb idea, ph. తెలివి తక్కువ ఊహ; పస లేని ఊహ;
TwoDumbbells
  • dumbbells, n. pl. లోడీలు; ఇటూ, అటూ బరువుగా ఉండి, మధ్య సన్నంగా కడ్డీలా ఉన్న కసరత్తు చేసే సాధనం;
  • dumbfound, v. t. నిశ్చేష్టమగు;
  • dummy, adj. ఉదూత;
    • dummy variable, ph. ఉదూత చలరాశి;
  • dump, v. t. గుమ్మరించు;
  • dumplings, n. pl. కుడుములు; ఉండ్రాళ్లు; పూర్ణం; ఆవిరి మీద ఉడకబెట్టిన పిండి ముద్దలు;
  • dunce, n. మందమతి; తమందము;
  • dune, n. తిన్నె; సైకతం; ఇసుక దిబ్బ; సముద్రపుటొడ్డున ఇసుక తిన్నె;
  • dung, n. పేడ; లద్ది; పెంటిక; మయం;
  • dung beetle, ph. పేడ పురుగు; లద్ది పురుగు;
    • buffalo dung, ph. పేడ; గేదె పేడ; మహిషీమయం;
    • cow dung, ph. పేడ; ఆవు పేడ; గోమయం;
    • horse dung, ph. గుఱ్ఱపు లద్ది;
  • dungeon, n. చీకటి కొట్టు; కొట్టు; ఖైదు;
  • duodecimal system, ph. ద్వాదశాంశ పద్ధతి;
  • duodenum, n. ఆంత్రమూలం; ద్వాదశాంగుళం; చిన్నప్రేగు మొదటి భాగం; ఉరమరగా పన్నెండు అంగుళాల పొడుగుంటుంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది;
  • duopoly, n. ద్వంద్వాధిపత్యం; ఇద్దరు వ్యాపారుల మధ్య ఒడంబడిక ద్వారా ఏర్పడ్డ గుత్తాధిపత్యం;
  • dupe, n. తక్కిడి; మోసకారి;
  • duplex, n. [engr.] ద్వంద్వం; రెంౘం;
    • duplex process, ph. ద్వంద్వ యోగం; ద్వంద్వ ప్రక్రియ; రెంచాడ్పు (రెంౘ + చాడ్పు, చాడ్పు = విధానము, process);
    • full-duplex, పూర్ణద్వంద్వం; ఒకే సమయంలో ఇరువైపుల నుండీ సంభాషించ గలగడం;
    • half-duplex, అర్ధద్వంద్వం; ఒకే సమయంలో ఒకవైపు నుండీ మాత్రమే సంభాషించ గలగడం;
  • duplicate, n. నకలు; మారుప్రతి; జతప్రతి;
  • dura, n. [anat.] డూరా; పుర్రెకి; మెదడుకి మధ్యనుండే కణజాలం;
  • durability, n. మన్నిక; ఉఱిది; ఆనిక; దార్ఢ్యం; దృఢత్వం;
  • duration, n. తడవు; సేపు; వ్యవధి; కాలపరిమితి; అవస్థితి; వ్యవధానం; కాలావధి;
  • Durian, n. ముండ్లపనస; మలయా మొదలయిన ఆగ్నేయ ఆసియా దేశాలలో దొరికే పనసపండుని పోలిన పండు; ఈ పండు వెగటు పుట్టించే అంత తియ్యగా ఉండడం వల్ల అలవాటు లేని వారికి కంపుకొడుతూన్నట్లు అనిపిస్తుంది.
  • during, prep. ఒక సమయంలో.

---Usage Note: during, for

  • ---During answers the question "when?. She learned Hindi during her stay in Delhi. For answers the question "how long?. He studied in the US for four years.
  • dusk, n. సంజ చీకటి; సంధ్యాసమయం; కప్పిరి; మునిచీకటి; మునిచీకటి అంటే చీకటిపడడానికి ముందు అని అర్థం;
  • dust, n. (1) దుమ్ము; ధూళి; దూసరం; రజను; రజస్సు; పరాగం; మలోమలికితం; (2) చెత్త; పాంశువు;
    • cosmic dust, ph. విశ్వ పరాగం; విశ్వపాంశువు; విశ్వ దూసరం
  • dust, v. t. (1) జల్లు; సముద్ధూళించు; పూయు; (2) దుమ్ముని దులుపు; (note) వ్యతిరేకార్థములతో ఉన్న మాట;
    • dust cover, ph. అట్ట; అట్ట కాగితం; పుస్తకానికి వేసే అట్ట;
    • dust devil, ph. గాలి దుమారం; సుడిగాలి;
    • dust storm, ph. దుమారం;
  • dustbin, n. చెత్తకుండీ;
  • duster, n. తుడుపు గుడ్డ; అలుగ్గుడ్డ;
  • Dutch, adj. ఒళంద; పోర్చుగల్ దేశానికి చెందిన;
    • Dutch treat, ph. ఎవరి ఖర్చులు వారే పెట్టుకుంటూ కలసి భోజనానికి వెళ్లడం;
  • duty, n. (1) ధర్మం; విధి; విధాయకం; కర్తవ్యం; (2) సుంకం; శుల్కం; సరుకుల మీద వేసే పన్ను; ఇది సరుకు విలువలో ఫలానా శాతం అని ఉంటుంది; ఆదాయపు పన్ను బీదవారి మీద తక్కువ శాతంలోనూ, ధనవంతుల మీద ఎక్కువ శాతం లోనూ ఉంటుంది;
    • civic duty, ph. విధ్యుక్త ధర్మం; విధి చెప్పినట్లు చెయ్యవలసిన పని;
    • import duty, ph. దిగుమతి సుంకం;
    • duty and responsibility, ph. విధి; బాధ్యత;
  • dwarf, adj. బుడ్డ; చిన్న; పొట్టి; కురచయిన; కుబ్జ; గిడప; గున్న; బొంద; గిరక;
    • dwarf coconut tree, ph. గున్న కొబ్బరి; చెన్నంగి;
    • dwarf mango tree, ph. గున్న మామిడి;
    • dwarf plantain, ph. బొంద అరటి;
    • dwarf orange tree, ph. గున్న నారింజ;
    • dwarf palm, ph. గిరక తాడి; బొంద తాడి;
  • dwarf, n. పొట్టి; గిడస; మరుగుజ్జు;
    • white dwarf, ph. శ్వేతకుబ్జం; శ్వేతకుబ్జ తార; ఒక రకం నక్షత్రం;
  • dwelling, n. నివాసం; ఇల్లు; అవస్థానము; నెలవు;
  • dwindling, adj. క్షీణిస్తూ ఉన్న;
  • dye, n. రంజనం; రంగు; అద్దకపు రంగు; ఛాయ; వన్నెక; (rel) pigment;
  • dye stuff, n. రంజన ద్రవ్యం; వన్నె ముద్ద;
  • dyeing, n. అద్దకం; వన్నెకం;
  • dynamic, adj. చైతన్యవంతమైన; పరిణామశీలమైన; శక్తికి సంబంధించిన;
  • dynamics, n. (1) చలనం; చైతన్యం; (2) చలనశీలశాస్త్రం; గతిశాస్త్రం; ధృతిశాస్త్రం; చలనాలకు సంబంధించిన అధ్యయనం; వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి చలనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విచారించే శాస్త్రం;
  • dynamism, n. చైతన్యత; చైతన్యం;
  • dynamo, n. విద్యుచ్ఛక్తిని పుట్టించే యంత్రం యొక్క పాతబడ్డ పేరు; ఇప్పుడు ఎక్కువ వాడుకలో లేదు;
  • dynasty, n. రాజవంశం; వంశం; రాజవంశ పరంపర; ఱేఁటివంగడం (రాజు(ప్రకృతి) = ఱేఁడు(వికృతి), (వంశం(ప్రకృతి) = వంగడం(వికృతి));
  • dysentery, n. (డిసెంటరీ) గ్రహణి; రక్త విరేచనాలు; జిగట విరేచనాలు; బంక విరేచనాలు; అతిసారం; పాచనాలు;
    • bacillary dysentery, ph. దండాణుజ గ్రహణి;
  • dyspepsia, n. అజీర్ణం; మందాగ్ని; అగ్నిమాంద్యం;
  • dysphoria, n. మనస్సులో చెప్పుకోలేని బాధ;
  • dyspnea, n. ఎగఊపిరి; shortness of breath;
  • dystopia, n. ఊహానరకం; an imagined state or society in which there is great suffering or injustice, typically one that is totalitarian or post-apocalyptic. (ant.) utopia;

మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2