వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/C

Wikibooks నుండి


Part 1: ca

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • C, c, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో మూడవ అక్షరం; (2) పరీక్షలలో బొటాబొటీగా ఉత్తీర్ణులైన వారికి వచ్చే గురుతు; (3) ఒక విటమిన్ పేరు; (4) కర్బనం అనే ఒక రసాయన మూలకం గుర్తు;
 • cab, n. బాడుగబండి; టేక్సీ; (ety.) shortened version of taxicab;
 • cabal, n. బందుకట్టు; కుట్రదారులు;
 • cabalistic, adj. అతి మర్మమైన; గోప్యమైన;
 • cabbage, n. కేబేజీ; గోబిగడ్డ; గోబీ; ఆకుగోబి; ముట్టకూర;

---Usage Note: Cabbage, cauliflower, broccoli, Brussels sprouts

 • ---Cabbage is an edible plant ([bot.] Brassica oleracea var capitata ) having a head of green leaves while cauliflower is an annual variety of cabbage, of which the cluster of young flower stalks and buds is eaten as a vegetable. Both broccoli and cauliflower belong to the family Brassicaceae, which also includes cabbage and Brussels sprouts. However, broccoli is a member of the Italica cultivar group, while cauliflower is part of the Botrytis cultivar group.
 • cabin, n. గది; కొట్టు; గుడిసె;
 • cabinet, n. (1) మంత్రి మండలి; అమాత్య వర్గం; (2) బీరువా; పెట్టె;
  • medicine cabinet, ph. మందుల బీరువా; మందుల పెట్టె;
 • cable, n. (1) మోకు; తాడు; రజ్జువు; (2) తీగ; తంతి; తంతిమోకు;
 • caboose, n. (1) కుంపటి; వంట గది; (2) పూర్వపు రైలు బండ్లలో (ప్రత్యేకించి సామానులు మోసే బండ్లలో) చిట్టచివర వచ్చే పెట్టె;
కాకౌ చెట్టు, కోకో కాయలు
 • cacao, n. కకావ్; ఈ కకావ్ చెట్టు ([bot.] Theobroma cacao) నుండి లభించే గింజలే కకావ్ గింజలు, లేదా కోకో (cocoa) గింజలు; ఈ గింజలలోని కొవ్వు పదార్థమే కోకో వెన్న; కోకో వెన్నతో పంచదార కలిపితే తెల్ల ఛాకొలేటు వస్తుంది; వెన్న తీసేసిన తర్వాత గింజలని వేయించి, పొడి చేస్తే వచ్చేదే కోకో. ఈ కోకోకి పంచదార, వెన్న కలిపితే వచ్చేదే బూడిద రంగులో ఉండే ఛాకొలేటు; ఈ చెట్టుకీ coca తుప్పకీ పేరులో పోలిక తప్ప మరే సంబంధమూ లేదు;
 • cache, n. (కేష్) (1) ఉపనిధి; చిన్న కొట్టు; కోశం; (2) an auxiliary storage from which high-speed retrieval is possible;
 • cackle, n. కూత; అరుపు;
 • cacography, n. పిచ్చిగీతలు; కెక్కిరిబిక్కిరి గీతలు;
 • cacophony, n. కర్కశ ధ్వని; గోల; అపశ్రుతి; కర్ణకఠోరం; కాకిగోల;
 • cactus, n. జెముడు; కంటాలం; బొమ్మజెముడు;
  • large cactus, ph. బొమ్మజెముడు; బొంతజెముడు; బ్రహ్మజెముడు;
 • cad, n. నీతిమాలన వ్యక్తి; తుచ్ఛుడు;
 • cadaver, n. కళేబరం; శవం; ప్రేతం; పీనుగు; కొయ్యడానికి సిద్ధపరచిన కళేబరం;
 • cadaverous, adj. ప్రేతకళతోనున్న; ప్రేతసదృశం; పీనుగువంటి; మృతప్రాయం;
 • cadence, n. లయ; స్వరం యొక్క అవరోహణ;
 • cadjan, n. తాటాకు; తాటి ఆకు; తాళపత్రం;
 • Cadmium, n. కాద్మము; వెండిలా తెల్లగా, తగరంలా మెత్తగా ఉండే లోహ లక్షణాలు కల రసాయన మూలకం; (సంక్షిప్త నామం, Cd; అణు సంఖ్య 48);
 • cadre, n. (కాడ్రే) బాపతు; ఉద్యోగులలో తరం; స్థాయి;
 • Caesium, n. సీజియం; పసుపు డౌలుతో ఉన్న వెండిలా మెరిసే రసాయన మూలకం; సంక్షిప్త నామం, Cs; అణు సంఖ్య 55); గది తాపోగ్రత వద్ద ద్రవంగా ఉండే అయిదు లోహపు మూలకాలలో ఇది ఒకటి;
 • cafeteria, n. కాఫీ కొట్టు; కాఫీ దొరకు స్థలం; కాఫ్యాగారం; స్వయంగా వడ్డన చేసికొనడానికి అమరిక ఉండే భోజన, ఫలహారశాల; [Spanish: cafe = coffee; teria = place];
 • caffeine, n. కెఫీన్; కాఫీలో ఉత్తేజాన్ని కలిగించే రసాయన పదార్థం; తెల్లగా, చేదుగా ఉండే ఒక క్షారార్థం; కాఫీ, టీ వగైరాలలో ఉండే ఉత్తేజితం; C8H10N4O2;
 • cage, n. పంజరం; బోను;
  • animal cage, ph. బోను;
  • birdcage, ph. పంజరం;
 • cajole, v. t. బెల్లించు; లాలించు; సముదాయించు; బుజ్జగించు; కుస్తరించు; మోసగించు;
 • cake, n. (1) శష్కులి; కేకు; తీపి రొట్టె; కేకు; (2) ఉండకట్టిన పిండి పదార్థం;
  • cake of oil seed, ph. తెలక పిండి; పిణ్యాకము; ఖలి;
 • caking, n. ఉండకట్టడం;
 • calamine, n, జింక్ ఆక్సైడులో 0.5 శాతం ఫెర్రిక్ ఆక్సైడుని కలిపి నీళ్లల్లో రంగరించగా వచ్చిన ముద్ద; Also known as calamine lotion, is a medication used to treat mild itchiness caused by insect bites, poison ivy, poison oak, or other mild skin conditions like sunburn. It is applied on the skin as a cream or lotion;
 • calamitous, adj. విపత్కరమయిన;
 • calamity, n. ఆపద; ఉపద్రవం; అరిష్టం; విపత్తు; ముప్పు; పెద్ద ఆపద; అనర్ధం; ఉత్పాతం; ఉపహతి;
 • calamus, n. వస; వానీరం; వేతసం; the sweet flag [bot. Acorus calamus];
 • calcaneus, n. [anat.] మడమ ఎముక;
 • calciferol, n. ఖటికథరాల్; విటమిన్ డి; స్పటికాకారి అయిన ఒక అలంతం; C28H43OH;
 • calcification, n. ఖటీకరణం;
 • calcination, n. భస్మీకరణం; బుగ్గి చెయ్యడం; నిస్తాపనం;
 • calcined, adj. భస్మము చేయబడిన; బుగ్గి చేయబడ్డ;
  • calcined mercury, ph. రసభస్మం;
 • Calcium, n. ఖటికం; ఒక రసాయన మూలకం; (సంక్షిప్త నామం, Ca; అణు సంఖ్య 20, అణు భారం 40.08); [Lat. calx = lime];
  • Calcium arsenate, ph. ఖటిక పాషాణం; డి.డి. టి. రాక పూర్వం క్రిమి సంహారిణిగా వాడేవారు; Ca3 (AsO4)2
  • Calcium carbide, ph. ఖటిక కర్బనిదం; CaC2;
  • Calcium carbonate, ph. ఖటిక కర్బనితం; సున్నపురాయి; CaCO3;
  • Calcium chloride, ph. ఖటిక హరిదం; CaCl2;
  • Calcium hydroxide, ph. సున్నం; ఖటిక జలక్షారం;
  • Calcium oxide, ph. ఖటిక భస్మం;
 • calculate, v. i. లెక్కించు; లెక్కకట్టు; గణించు;
  • calculating machine, ph. కలన యంత్రం; గణన సాధని;
  • analog calculating machine, ph. సారూప్య కలన యంత్రం;
  • digital calculating machine, ph. అంక కలన యంత్రం;
 • calculation, n. లెక్క; కలనం; గణనం;
 • calculator, n. (1) లెక్కిణి; కలని; గణక్; లెక్కలు చేసే యంత్రం; (2) లెక్కలు కట్టే మనిషి;
 • calculus, n. (1) కలనం; కలన గణితం; (2) మూత్రకృచ్ఛం; అశ్మరి;
  • differential calculus, ph. [math.] చలన కలనం;
  • integral calculus, ph. [math.] సమా కలనం; కలన గణితం;
  • renal calculus, ph. మూత్రపిండాశ్మరి; మూత్రపిండాలలోని రాయి;
  • urinary calculus, ph. మూత్రాశయాశ్మరి; మూత్రాశయంలోని రాయి;
 • caldron, n. కాగు; డెగిసా; చరువు; బాన; ద్రవములని మరిగించడానికి వాడే లోహపు పాత్ర;
 • Caledonian, adj. స్కాట్‍లండ్‍ దేశానికి సంబంధించిన;
 • calendar, n. (1) పంచాంగం; తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో హిందూ సాంప్రదాయ సిద్ధంగా వుండే పుస్తకం; (2) ఇంగ్లీషు సంప్రదాయంతో, నెల, వారం, సెలవురోజులు, వగయిరాలతో వుండేది కేలండరు; (3) రోజులు, వారాలు, నెలలు, ఋతువులు మొదలయిన కాలచక్ర విశేషాలని చూపే పుస్తకం;
  • calendar day, ph. పంచాంగ దినం; ఒక అర్ధరాత్రి నుండి తర్వాత అర్ధరాత్రి వరకు; ఒక రోజు;
  • calendar month, ph. పంచాంగ మాసం; నెల మొదటి రోజు నుండి, ఆఖరు రోజు వరకు;
  • calendar year, ph. పంచాంగ సంవత్సరం; జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు; (rel.) fiscal year అంటే 365 (లీపు సంవత్సరంలో అయితే 366) రోజుల వ్యవధి; దేశాచారాన్ని బట్టి ఎప్పుడేనా మొదలవవచ్చు; అమెరికాలో అక్టోబరు 1న fiscal year మొదలవుతుంది;
 • calf, n. (1) f. పెయ్య; ఆవుపెయ్య; తువ్వాయి; ఏనుగు పిల్ల; m. దూడ; క్రేపు; వత్సం; (2) కాలిపిక్క; పిక్క; జంఘ;
 • caliber, n. కొలత; ప్రమాణం; అధికారం;
 • calibrated, adj. క్రమాంకిత;
 • calibration, n. క్రమాంకనం; స్పుటీకరణం; ప్రమాణీకరణం;
 • calipers, n. వ్యాసమితి; వ్యాసాన్ని కాని మందాన్ని కాని కొలవడానికి వాడే సాధనం; రెండు స్థానాల మధ్య దూరాన్ని కొలిచే సాధనం;
 • calisthenics, n. కసరత్తు; కండబలం పెరగడానికి చేసే కసరత్తు; వ్యాయామం; see also aerobic exercise;
 • call, n. పిలుపు; కేక;
  • bird -, ph. కూత; పిట్టకూత; అభిక్రందం;
 • calligraphy, n. నగీషీరాత; సొగసైన రాత;
 • callus, callous, n. కాయ; కిణకము; కఠిన వస్తువుల స్పర్శ వల్ల ఏర్పడే కాయ; అరికాలులో కాని, అరిచేతిలో కాని పెరిగే కాయ; గాయమును కప్పుతూ ఏర్పడిన కణజాలం;
 • callous, adj. కఠినమైన; దయ లేని;
 • calm, adj. నిశ్చలమైన; నెమ్మదైన; ప్రశాంతమైన; గాలిలో కదలిక లేని; నీటిలో కెరటాలు లేని;
 • calm, n. నిశ్చలత; ప్రశాంతత;
 • calmness, n. ప్రశాంతత;
  • calm down, n. తగ్గు; నెమ్మదించు; నిమ్మళించు; ప్రశాంతపడు;
 • calomel, n. రసభస్మం; బస్తం; క్రిమి సంహారిణిగాను, శిలీంధ్ర సంహారిణిగాను వాడేవారు; Hg2Cl2; (rel.) corrosive sublimate;
 • calorie, n. కేలోరీ; వేడిని కొలిచే కొలమానం; (note) రెండు రకాల కేలరీలు ఉన్నాయి. వెయ్యి కేలరీలని పెద్ద కేలరీ (Calorie) అనీ కిలో కేలరీ (kilo calorie) అనీ అంటారు. ఆహారంలో పోషక శక్తిని కొలిచేటప్పుడు ఈ పెద్ద కేలరీలనే వాడతారు కానీ నిర్లక్ష్యంగా కేలరీ అనేస్తూ ఉంటారు;
 • calorimeter, n. ఉష్ణతామాపకం; వేడిని కొలిచే సాధనం; (rel.) ఉష్ణోగ్రతని కొలిచేది తాపమాపకం (లేదా ఉష్ణమాపకం, థర్మోమీటర్);
 • caltrop, n. (1) పల్లేరు కాయ; [bot.] Tribulus terrestris (Zygophyllaceae); (2) ఆకారంలోనూ, పరిమాణంలోనూ పల్లేరు కాయ లా ఉండే ఉక్కుతో చేసిన ఒక ఆయుధం;
 • calve, v. i. ఈనుట; పశువులు పిల్లలని కనడం;
 • calx, n. భస్మం;
 • calyx, n. పుష్పకోశం; ప్రమిద వలె ఉన్న పుష్పకోశం; రక్షక పత్రావళి;
 • came, n. రెండు గాజు పలకలని పట్టి బంధించే సీసపు బందు;
 • came, v. i. వచ్చెను; అరుదెంచెను; వేంచేసెను; విచ్చేసెను; ఏగుదెంచెను;
 • camel, n. ఒంటె; లొట్టపిట; లొట్టియ; క్రమేలకం; m. ఉష్ట్రము; f. ఉష్ట్రిక;
 • camera, n. (1) కేమెరా; ఛాయాచిత్రములు తీసే పరికరం; (2) గది;
 • camp, n. మకాం; మజిలీ; విడిది; శిబిరం;
  • computer camp, ph. a program offering access to recreational or educational facilities for a limited period of time
  • military camp, ph. స్కంధావారం; శిబిరం;
  • summer camp, ph. a place usually in the country for recreation or instruction often during the summer;
 • campaign, n. (1) ఉద్యమం; పరికర్మ; ఎసవు; (2) ప్రచారం; (3) దండయాత్ర;
 • campaigners, n. ప్రచారకులు;
 • camphor, n. కర్పూరం; సితాభం; ఘనసారం; [bot.] Cinnamomum camphora; C10H16O;
  • religeous camphor, ph. హారతి కర్పూరం; ఇది తినడానికి పనికిరాదు;
  • edible camphor, ph. పచ్చ కర్పూరం;
  • raw camphor, ph. పచ్చ కర్పూరం; ఘనసారం; శశాంకం;
 • campus, n. ప్రాంగణం; పాఠశాల యొక్క ప్రాంగణం;
 • can, v. i. (కెన్) శక్త్యర్ధకమైన క్రియావాచకం; కలను; కలడు; కలుగు; మొ.;
 • can, n. (కేన్) డబ్బా; డబ్బీ; డిబ్బీ; డొక్కు;
 • canal, n. (1) కాలువ; కాల్వ; క్రోడు; కుల్యం; కుల్లె; (2) నాళం;
  • ear canal, ph. చెవి కాలువ; కర్ణ నాళం;
  • alimentary canal, ph. ఆహారనాళం;
  • irrigation canal, ph. సేద్యకుల్యం; సాగుకుల్లె; సాగుకాల్వ;
 • canard, n. పుకారు; అసత్యవార్త;
 • cancel, v. i. రద్దగు;
 • cancel, v. t. రద్దుచేయు; కొట్టివేయు;
 • Cancer, n. (1) కర్కాటక రాశి; కర్కాటకం; (2) పీత; (3) పుట్టకురుపు; రాచపుండు; కేన్సరు; a malignant and invasive growth or tumor, esp. one originating in epithelium, tending to recur after excision and to metastasize to other parts of the body; (3) పీత; ఎండ్రకాయ;
 • candela, n. The standard unit for measuring the intensity of light. The candela is defined to be the luminous intensity of a light source producing single-frequency light at a frequency of 540 terahertz (THz) with a power of 1/683 watt per steradian, or 18.3988 milliwatts over a complete sphere centered at the light source;
 • candid, adj. నిష్కపటమైన; దాపరికం లేని; నిజమైన;
 • candidacy, n. అభ్యర్థిత్వం;
 • candidate, n. అభ్యర్థి; దరఖాస్తు పెట్టిన వ్యక్తి;
  • opposing candidate, ph. ప్రత్యర్థి;
 • candle, n. కొవ్వొత్తి; మైనపు వత్తి;
  • fat candle, ph. కొవ్వొత్తి;
  • wax candle, ph. మైనపు వత్తి;
  • candle power, ph. ఒక వస్తువు ఎంత వెలుగుని విరజిమ్ముతోందో చెప్పడానికి ఒక ప్రమాణాత్మకమైన కొవ్వొత్తి వెలుగుతో పోల్చి చెబుతారు. ఆ ప్రమాణాత్మకమైన కొవ్వొత్తి వెలుగు = 0.981 కేండెల్లాలు;
 • candor, n. నిష్కాపట్యం; నిజం; యదార్థం;
 • candy, n. కలకండ; ఖండీ; మిఠాయి;
  • rock candy, ph. కలకండ; పటికబెల్లము; కండచక్కెర; కండ; కలకండ; ఖండశర్కర; పులకండము; మత్స్యందిక;
 • cane, n. (1) బెత్తు; బెత్తం; (2) చేతి కర్ర;
  • rattan cane, ph. బెత్తం;
  • cane chair, ph. బెత్తు కుర్చీ;
 • canine, adj. కుక్కజాతి;
 • canines, n. కోరపళ్లు; రదనికలు;
 • Canis Major, n. శ్వానం; పెద్ద కుక్క; బృహత్ లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్ర రాశి; మృగశిరకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే సిరియస్ నక్షత్రం ఉంది;
 • Canis Minor, n. పూర్వ శ్వానం; చిన్న కుక్క; లఘు లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్రరాశి; మృగశిరకి తూర్పుదిశగాను; మిధునరాశికి దగ్గరగాను ఉన్న ఈ రాశిలోనే ప్రోకియాన్ నక్షత్రం ఉంది;
 • canister, n. డిబ్బీ; చిన్న డబ్బా;
 • canker, n. (1) పుండు; కురుపు; నోటిలో పుండు; (2) జంతువులలో కాని, చెట్లలో కాని గజ్జి కురుపుని పోలిన వాపు;
  • citrus canker, ph. నిమ్మ గజ్జి;
 • canna, n. మెట్టతామర;
 • canned, adj. డబ్బాలో నిల్వ చేసిన; డబ్బా; డబ్బీ;
  • canned food, ph. డబ్బా ఆహారం; డబ్బా ఆహార పదార్థం;
  • canned juice, ph. డబ్బా రసం;
  • canned milk, ph. డబ్బా పాలు;
  • canned vegetables, ph. డబ్బా కూరగాయలు; డబ్బా సబ్‌జీ;
 • cannibal, n. నరమాంస బక్షకుడు; పొలదిండి; పొలసుదిండి;
 • cannibalism, n. నరమాంస భక్షణ; పంచజనచర్వణం; పొలదిండిత్వం;
 • cannon, n. ఫిరంగి; శతఘ్ని; [see also] canon;
 • cannot, aux. v. చెయ్యలేను; (అధికార రీత్యా చెయ్యలేకపోవడం); చేయ వల్ల కాదు; (జరిగే పని కాదు); చేతకాదు (చేసే సమర్ధత లేదు);
 • canoe, n. దోనె; మువ్వ దోనె; సంగడి;
 • canola, n. కనోలా; రేపుమొక్క; [bot.] Brassica napus; B. campestris; a hybrid variety of rape plant, related to mustard, bred to produce oil low in saturated fatty acids;
  • canola oil, ph. రేపు మొక్క విత్తనాలనుండి పిండిన నూనెకి కెనడాలో వాడే వ్యాపారనామం; can అంటే Canada, o అంటే oil, la అంటే low acid అని అర్థం;
 • canon, n. సూత్రం; సూత్రవాక్యం;
 • canonical, adj. శాస్త్రీయ; శౌత్ర; ధర్మశాస్త్ర ప్రకారం; ధార్మిక;
 • Canopus, n. అగస్త్య నక్షత్రం; ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో సిరియస్ ప్రథమ స్థానంలో ఉంటే దక్షిణాకాశంలోని దైవనావ రాసిలో ఉన్న అగస్త్య నక్షత్రం రెండవ స్థానంలో ఉంది;
 • canopy, n. చందువా; చాందినీ; పందిరి; మేల్కట్టు; ఉల్లడ; కురాళము; పందిరి; వితానం:
  • mobile canopy, ph. ఉల్లడ; మేల్కట్టు; శుభకార్యాలకు, సంబరాలకు, పూజ కోసం సామగ్రిని తీసుకువెళ్ళి నప్పుడు ఆ సామగ్రి పై ఎటువంటి దుమ్ము ధూళీపడకుండా, ముఖ్యంగా పక్షులు, కీటకాలు వాలకుండా, వాటి వ్యర్థాలు పడకుండా వుండటానికి ఒక వెడల్పాటి వస్త్రాన్ని నలుగరూ నాలుగంచులు పట్టుకొని ఆయా సామగ్రి పై రక్షణగా ఏర్పాటు చేస్తారు. అందులో వుండే వ్యక్తులకు, సామగ్రీకి వస్త్రం తగలకుండా మధ్యలో ఒక కర్రను ఎత్తిపట్టి గొడుగులా చేస్తారు. దీనినే ఉల్లెడ అంటారు;
  • tree canopy, ph. వృక్షప్రస్తారం; శాఖాఛాదితం; కురాళము కట్టినది; కొమ్మలచే కప్పబడ్డది;
  • canopy bed, ph. పందిరి మంచం;
 • canteen, n. ఫలహారశాల;
 • canthus, n. కనుకొలికి; కంటి ఎగువ రెప్పలు, దిగువ రెప్పలు కలిసే చోటు;
 • canto, n. కాండం; సర్గం; అధ్యాయం; స్కంధం; ఆశ్వాసం;
 • cantonment, n. సైనిక శిబిరం; ప్రత్యేకించి భారతదేశంలో బ్రిటిష్ పాలనలో వారి సైనిక స్థావరం; a military garrison or camp; a permanent military station in British India;
 • canvas, n. కిత్తనార గుడ్డ; కట్లంక; కేన్వాసు గుడ్డ;
 • canvass, v. t. ప్రచారం చేయు;
 • canyon, n. పెను లోయ; ప్రవహించే నీటితో దొలచబడి నిట్టనిలువుగా అటూ, ఇటూ కొండలు ఉన్న లోయ;
 • cap, n. టోపీ; మకుటం;
 • capability, n. స్తోమత; సమర్ధత; సామర్ధ్యం; యోగ్యత; శక్తి;
 • capacitor, n. [elec.] కెపేసిటర్ ధారణి; ఆభూతికం; A capacitor is a device that stores electrical energy in an electric field. It is a passive electronic component with two terminals. The effect of a capacitor is known as capacitance;
345px-Capacitors_%287189597135%29.jpg
 • capacity, n. ఉరవ; స్తోమత; సత్తా; పరిమాణం; ధారణశక్తి; గ్రహణశక్తి; తాహతు; శక్తి; సామర్థ్యం; ఆభూతి;
  • heat capacity, ph. ఉష్ణ ధారణశక్తి; ఉష్ణ గ్రహణశక్తి;
 • cape, n. (1) అగ్రం; త్రిభుజాకారపు భూభాగపు చివరి భాగం; (3) భుజాలమీదుగా వీపు వైపు కిందకి దిగజారే ఒక వ విశేషం;
 • capers, n. pl. (1) చిలిపి చేష్టలు; (2) చెంగనాలు
 • capillary, n. కేశనాళిక; రక్తనాళములలో అతి సూక్ష్మమైన నాళిక;
 • capital, adj. (1) పెట్టుబడి; (2) ముఖ్య; (3) ఉత్పాదక;
  • capital appreciation, ph. మూలధనపు వృద్ధి; వృద్ధి చెందిన పెట్టుబడి;
  • capital gains, ph. మూలధనపు వృద్ధి;
  • capital goods, ph. ఉత్పాదక వస్తువులు; ఉత్పాదక సరంజామా;
  • capital market, ph. పెట్టుబడి బజారు;
  • capital offense, ph. ఘోరాపరాధం;
  • capital outlay, ph. పెట్టుబడిగా వినియోగించిన మూలధనం;
  • capital punishment, ph. మరణ దండన; (rel.) ఉరిశిక్ష;
  • capital investment, ph. మూలధనం; పెట్టుబడి;
  • capital offense, ph. ఘోరాపరాధం;
  • capital gains, ph. పెట్టుబడిలో లాభం; మూలధనం విలువలో పెరుగుదల; ఒక ఇల్లు ఆరు లక్షలకి కొని, పదిలక్షలకి అమ్మితే వచ్చిన నాలుగు లక్షల లాభం capital gains. ఈ ఇంటిని నెలకి వెయ్యి చొప్పున అద్దెకి ఇచ్చి ఉంటే, నెలనెలా వచ్చే అద్దె పెట్టుబడి మీద వచ్చే ఆదాయం మాత్రమే. ఈ అద్దె పెట్టుబడి మీద లాభం కాదు;
 • capital, n. (1) పెట్టుబడి; మూలధనం; మూలం; మదుపు; పరిపణం; (2) ముఖ్యపట్టణం; రాప్రోలు;
  • fixed capital, ph. స్థిరమూలం; స్థిర మూలధనం;
  • floating capital, ph. చరమూలం; చర మూలధనం;
  • issued capital, ph. జారీ చేసిన మూలధనం;
  • market capitalization, ph. మూలధనీకరణం;
  • paid-up capital, ph. చెల్లించిన మూలధనం;
  • reserve capital, ph. నిల్వ మూలధనం;
 • capitalism, n. పెట్టుబడిదారీ వ్యవస్థ; ధనస్వామ్యం; షాహుకారీ;
 • capitalist, n. పెట్టుబడిదారు; ధనస్వామి; షాహుకారు;
 • capitation, n. తలసరి రుసుం; విద్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ అయే ఖర్చుని తలవారీ పంచి పన్నులా విధించడం;
  • capitation fee, ph. ప్రవేశ నిమిత్త రుసుం; తలపన్ను; తల ఒక్కంటికి అని విధించే రుసుం;
 • capitulation, n. అంగీకారం; ఓటమి ఒప్పేసుకోవడం; రాజీపడడం;
 • capric, adj. మేష; మేకకి సంబంధించిన;
  • capric acid, ph. మేషిక్ ఆమ్లం; దశనోయిక్ ఆమ్లం; Decanoic acid; CH3 (CH2)8COOH;
 • Capricorn, n. మకరరాశి; (lit. మేషరాశి); దక్షిణాకాశంలో ధనుస్సుకీ, కుంభానికీ మధ్య కనిపించే రాశి; ఉరమరగా డిసెంబరు 22న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు; మకరం అంటే మొసలి. కేప్రికారన్ అంటే మేక. ఇక్కడ భాషాంతరీకరణంలో భావం దెబ్బ తింది; (see Aries);
  • Tropic of Capricorn, ph. మకరరేఖ; మేకరేఖ;
 • caproic acid, n. మేషోయిక్ ఆమ్లం; షష్టనోయిక్ ఆమ్లం; Hexanoic acid; C6H12O2;
 • caprice, n. చాపల్యం; చాపల్యత; నిలకడ లేనితనం;
Caprylic-acid=మేషిలిక్ ఆమ్లం
 • caprylic acid, n. మేషిలిక్ ఆమ్లం; అష్టనోయిక్ ఆమ్లం; Octanoic acid; C8H16O2;
 • capsicum, n. మిరప; మిరప శాస్త్రీయ నామం;
ఎర్ర బెంగుళూరు మిరప
  • capsicum peppers, ph. బుట్ట మిరప; బెంగుళూరు మిరప;
 • capsize, v. i. తలక్రిందులగు; పల్టీకొట్టు; మునుగు;
 • capsule, n. గుళిక; కోశం; గొట్టం;
 • captain, n. (1) దండనాయకుడు; కపితాను; (2) నౌకనేత;
 • caption, n. వ్యాఖ్య; వ్యాఖ్యావాక్యం; శీర్షిక;
 • capture, v. t. పట్టుకొను; హస్తగతం చేసుకొను;
 • car, n. బండి; పెట్టె; రథం; శతాంగం; అరదం; వయాళి; కారు;
  • rail car, ph. రైలు పెట్టె;
 • carafe, n. గాజు కూజా; సారాని వడ్డించే గాజు కూజా;
 • caramel, n. (1) వన్నె; కల్తీలేని జీళ్లపాకం; ముదర పాకం; (2) దోరగా మాడిన పంచదార;
 • carat, n. (1) వన్నె; బంగారం స్వచ్ఛతని తెలిపే కొలమానం; కల్తీలేని బంగారానికి 24 వన్నెలు; పదహారో వన్నె బంగారం అంటే 16 పాళ్లు బంగారం, 8 పాళ్లు మరొక లోహం; సాధారణంగా ఈ రెండవ లోహానికి రాగి కాని, ప్లేటినంకాని, పెల్లేడియం కాని వాడతారు; "22 వన్నె బంగారం" అంటే 22 పాళ్లు బంగారం, 2 పాళ్లు మరొక లోహం; (2) వజ్రాలు, మొదలయిన వాటిని తూచడానికి వాడే కొలత; దరిదాపు 0.2 గ్రాముల బరువు, లేదా 4 వడ్లగింజల ఎత్తు;
 • caravan, n. (1) బిడారు; బిడారము; ఒంటెల వరస; (2) ఊరేగింపులో ఒకదాని వెనక ఒకటిగా వెళ్లే వాహనాల సమూహం; (3) పధికులు; తండా;
  • serial caravan, ph. కాలంబ్యం;
 • caraway seed, n. షాజీరా; సీమసోపు; సీమసోపు విత్తులు; [bot.] Carum carvi;
 • carbide, n. కర్బనిదం;
 • carbo, pref. కర్బన;
 • carbohydrate, n. కర్బనోదకం; కర్బనోదజం; పిండి పదార్థం; (lit.) చెమర్చిన కర్బనం;
 • carbolic acid, n. కార్బాలిక్ ఆమ్లం; ఆంగిక రసాయనంలో తరచుగా తారసపడే ఆమ్లం;
 • Carbon, n. కర్బనం; అంగారం; బొగ్గు; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 12, సంక్షిప్త నామం, C); [Lat. carbo = charcoal];
  • carbon chain, ph. కర్బనపు గొలుసు;
  • carbon chemistry, ph. కర్బన రసాయనం;
  • carbon tetrachloride, ph. కర్బన చతుర్ హరితం; చతుర్ హరిత పాడేను; CCl4;
 • carbonate, n. కర్బనితం;
 • carbonization, n. కర్బనీకరణం;
 • carbuncle, n. వ్రణం; రాచకురుపు; రాచపుండు; ప్రమేహపిటకం;
 • carburetor, carburettor (Br.), n. అంతర్‍దహన యంత్రాలలో ఇంధనాన్ని, గాలిని సరియైన పాళ్లల్లో కలిపి సిలిండర్‍లోకి పంపే ఉపకరణం;
 • carcass, n. కళేబరం; డొక్కి; తినడం కోసం చంపిన జంతువుల మృత దేహం;
 • carcinogen, n. కేన్సరుజని; కేన్సరు వ్యాధిని కలుగజేసే పదార్థం;
 • card, n. కార్డు; అట్టముక్క; ముక్క;
  • credit card, ph. అరువు కార్డు; క్రెడిట్ కార్డు;
  • playing card, ph. పేక ముక్క; చీట్ల పేక;
  • post card, ph. కార్డు ముక్క; ఉత్తరం;
 • cardamom, n. ఏలకి; ఏలకి కాయ; చిట్టేలకి; కోరంగి;
 • cardboard, n. అట్ట;
 • cardiac, adj. హృదయ; హృద్; గుండెకి సంబంధించిన;
  • cardiac arrest, ph. గుండె ఆగిపోవడం;
  • cardiac murmur, ph. గుండెలో గురగుర;
  • cardiac edema, ph. గుండె వాపు;
 • cardigan, n. కార్డిగన్; ముందుభాగం తెరచివున్న స్వెట్టరు;
 • cardinal, adj. ఉత్తమ; ఉత్కృష్ట; ముఖ్య; ప్రధాన;
  • cardinal counting, ph. ఉత్తమ గణనం;
  • cardinal numbers, ph. ఉత్తమ సంఖ్యలు; వేదాంకములు; ఒకటి, రెండు, మూడు వగైరా అంకెలు;
  • cardinal rule, ph. ఉత్తమ నియమం; వేదవాక్కు;
 • carding, n. దూదిని ఏకడం;
 • cardio, adj. హృదయ; హృద్; గుండెకు సంబంధించిన;
 • cardioid, n. హృదయాభం; ఒక రకం వక్ర రేఖ; epicycloid;
 • cardiology, n. హృదయ వైద్యశాస్త్రం; గుండెకి సంబంధించిన వైద్య శాస్త్రం;
 • care, n. (1) జాగ్రత్త; లక్ష్యం; (2) సంరక్షణ; చింత;
 • care, v. i. ఖాతరు చేయు; లక్ష్యపెట్టు;
 • career, n. వృత్తి;
 • carefree, adj. చీకు చింత లేకుండా;
 • careful, adj. జాగ్రత్త; అప్రమత్తత;
  • be careful, ph. జాగ్రత్తగా ఉండు; అప్రమత్తతతో ఉండు; ఒళ్లు దగ్గర పెట్టుకో;
 • carefully, adv. జాగ్రత్తగా; అప్రమత్తంగా; ఊజ్జితంగా;
 • careless, adj. అజాగ్రత్త; ప్రమత్తత;
 • carelessly, adv. అజాగ్రత్తగా; అలవోకగా ; నిర్లక్ష్యముగా; అసడ్డగా;
 • carelessness, n. నిర్లక్ష్యం; అజాగ్రత్త; ప్రమత్తత; ఏమరుపాటు; పరాకు; హెచ్చరలేమి; ప్రామాదికము;
 • caress, v. t. నిమురు; దువ్వు; లాలించు; ముద్దాడు;
 • caret, n. హంసపాదుకి గుర్తు; హంసపాదు; అంచపదం;
 • caretaker, n. మాలి; సంరక్షకుడు;
  • caretaker government, ph. ఆపద్ధర్మ ప్రభుత్వం;
 • cargo, n. సరుకులు, ఓడలలోనూ, విమానాలలోనూ, తదితర వాహనాలలోనూ వేసే సరుకులు;
  • cargo ship, ph. కప్పలి;
 • caricature, n. తూలికాచిత్రం; వ్యంగ్య చిత్రం; వికట వర్ణన;
 • caries, n. పుచ్చిపోయిన (దవడ) ఎముక;
  • dental caries, ph. పుచ్చిపోయిన పన్ను; పుప్పి పన్ను;
 • carminative, n. వాతహరి; a medicine that subdues any gas in the stomach;
 • carnage, n. మారణహోమం; విధ్వంసకాండ; ఎంతోమందిని చంపడం, గాయపరచడం;
 • carnivore, n. మాంసాహారి; శాష్కలి; క్రవ్యాదం;
 • carol, n. ఏలపాట; ఏలపదం;
 • carotid artery, n. గళధమని; మన్యధమని; గ్రీవధమని;
 • carotene, n, అనేక కాయగూరలలో ఉండే ఒక రసాయనం; C40H56; విటమిన్ A తయారీకి కావలసిన ముడి పదార్థం;
 • carousel, n. (1) గుండ్రటి ఆకారం ఉండి గుండ్రంగా తిరిగేది; రాట్నం; (2) రంగులరాట్నం;
 • carp, n. గండుచేప; బెడిసమీను; శఫరం;
 • carpal, adj. మణికట్టుకి సంబంధించిన; మణిబంధిక;
  • carpal tunnel syndrome, ph. ఎక్కువగా టైపు కొట్టడం వంటి పనులు పదే పదే చెయ్యడం వల్ల కీళ్లల్లో నొప్పి మొదలగు లక్షణాలు పొడచూపుతూ వచ్చే సందర్భం;
 • carpenter, n. వడ్రంగి; త్వష్ట్ర; సూత్రధారుడు;
 • carpenter's planer, ph. చిత్రిక;
 • carpentry, n. వడ్రంగం;
 • carpet, n. తివాసీ; కంబళీ;
 • carpus, n. మనికట్టు;
 • carriage, n. కంచరం; బండి; వాహనం; పెట్టె;
 • carrier, n. (1) భారవాహుడు; రవాణాదారు; (2) భారవాహిక; రవాణా సాధనం; (3) మోపరి; రోగాన్ని మోసే వ్యక్తి; ఒక రోగంతో బాధ పడకుండా ఆ రోగాన్ని ఇతరులకి అంటించే స్తోమత ఉన్న జీవి; ఉదా. మలేరియా వ్యాధికి దోమ మోపరి; (4) వాహకం; వాహకి;
  • carrier wave, ph. [phys.] వాహక తరంగం;
 • carrot, n, ఎర్ర ముల్లంగి; పచ్చ ముల్లంగి; గాజర; గాదెర; కేరట్‍;
 • carry, n. బదిలీ; మిగులు; బదులు; కూడకంలో స్థానమందు వేసికొనే అంకె; (ant.) borrow;
 • carry, v. t. మోయు; ఎత్తుకొను;
 • carrot, n. ఎర్రముల్లంగి; పచ్చముల్లంగి; కేరట్;
 • cart, n. బండి; శకటం; బగ్గీ; రెండు చక్రాల బండి; కంచరం;
 • cartel, n. ఉత్పత్తిదారుల ఉమ్మడి సంఘం;
 • cartilage, n. తరుణాస్థి; ఉపాస్థి; మృదులాస్థి; కోమలాస్థి; కేకసం;
 • cartridge, n. తూటా; తూటాలో మందుగుండు సామాను, సీసపు గుండ్లు ఉంటాయి;
 • carton, n, డబ్బా; అట్టతో కాని, ప్లాస్టిక్‍తో కాని చేసిన డబ్బా;
 • cartoon, n. కొంటెబొమ్మ; పరిహాసచిత్రం; వ్యంగ్యచిత్రం;
 • carve, v. t. దొలుచు; చెక్కు; కోరు;
 • cascade, n. నిర్‌ఝరం; సెలయేరు; సోన;
 • case, n. (1) బడి; (2) పెట్టి; గలీబు; తొడుగు; (3) వ్యాజ్యం; అభియోగం; వివైనం;(4) దృష్టాంతం; సందర్భం; ఉదాహరణ; వైనం; (5) విభక్తి; grammatical function of a noun or pronoun in a sentence; (6) రోగి; ఉపతాపి; (7) పాత్ర;
  • ablative case, ph. [gram.] పంచమీ విభక్తి; వలన; కంటె; పట్టి;
  • accusative case, ph. [gram.] ద్వితీయా విభక్తి; ని; ను; కూర్చి; గురించి; కర్మకారకం; generally indicates the direct object of a verb;
  • conjunctive case, ph. [gram.] సహార్థక విభక్తి; తో, తోడ, మొదలగునవి;
  • dative case, ph. [gram.] చతుర్థీ విభక్తి; కొరకు; కై; generally used for a noun which receives something, something which moves toward that noun;
  • genitive case, ph. [gram.] షష్ఠీ విభక్తి; కి, కు, యొక్క, లో, లోపల; generally indicates that one noun is being modified by another noun;
  • in case, ph. ఒకవేళ; అయితే గియితే;
  • in any case, ph. ఏది ఏమైనప్పటికి;
  • instrumental case, ph. [gram.] కరణార్థక విభక్తి; తృతీయా విభక్తి; చే, చేత, మొదలగునవి; a noun usually used as a tool to complete action;
  • locative case, ph. [gram.] సప్తమీ విభక్తి; అందు; ఇందు; న; used to indicate location;
  • lower case, ph. చిన్నబడి; ఇంగ్లీషులో రాత అక్షరాలు;
  • nominative case, ph. [gram.] ప్రథమా విభక్తి; కర్తృకారకం;
  • pillowcase, n. తలగడ గలీబు;
  • special case, ph. పరిమితిగల సందర్భం; ప్రత్యేక సందర్భం;
  • upper case, ph. పెద్దబడి; ఇంగ్లీషులో అచ్చు అక్షరాలు;
  • vocative case, ph. [gram.] సంబోధనా ప్రథమా విభక్తి;
 • cash, n. నగదు; రొక్కం; పైకం; సొమ్ము;
  • petty cash, ph. దినవెచ్చం; చిన్న చిన్న ఖర్చులకు కేటాయించిన డబ్బు;
  • cash box, ph. గల్లాపెట్టి;
  • cash cow, ph. నగదు ధేనువు; వ్యాపారంలో ఎల్లప్పుడు లాభాన్ని తెచ్చే వస్తువు;
 • cashew, n. జీడిమామిడి; ముంతమామిడి; ఎర్ర జీడి; [bot.] Anacardium occidentale;
 • cashews, n. జీడిపప్పు; ముంతమామిడి పప్పు;
  • cashew nuts, ph. pl. జీడిపిక్కలు;
  • cashew apple, ph. జీడిమామిడి పండు;
 • cashier, n. షరాబు; నగదు అధికారి; కేషియరు;
 • casino, n. జూదశాల;
 • cask, n. పీపా;
 • casket, n, (1) కరండం; పేటిక; (2) శవపేటిక;
 • Caspian sea, n. తురక కడలి;
 • cassava, n. ఒక రకం కర్ర పెండలం; సగ్గుబియ్యం చెయ్యడానికి వాడే దుంప; ఈ దుంప స్వస్థలం దక్షిణ అమెరికా; ఈ దుంపలలో సయనైడ్‍ అనే విష పదార్థం ఉంటుంది కనుక వీటిని నానబెట్టి, ఉడకబెట్టి, పిండి చేసిన తరువాతనే తినాలి; [bot.] Manihot esculenta;
 • cassette, n. కరండం; పెట్టె;
 • cassia, n. రేల చెట్టు; [bot.] Cassia fistula of the Fabaceae family;
 • Cassiopeiae, n. [astro.] కాశ్యపీయులు; కశ్యప ప్రజాపతి సంతానం; అప్సరసలు; శర్మిష్ఠ నక్షత్రం;
 • cast, n. (1) నటీనటులు; తారాగణం; నటీనటవర్గం; (2) అచ్చు; ముద్ర;
 • cast, v. t. పోత పోయు;
  • cast iron, ph. పోత ఇనుము;
 • castanet, n. చిడత;
 • castigate, v. t. దుయ్యబట్టు;
 • caste, n. కులం; వర్గం; తెగ; జాతి;
  • higher caste, ph. అగ్రకులం;
  • scheduled caste, ph. దళిత వర్గం; ఉపేక్షత వర్గం;
  • untouchable caste, ph. అంటరాని కులం; దళిత వర్గం;
 • castle, n. కోట; దుర్గం;
 • Castor and Pollux, n. మిథునరాశి;
 • Castor, Pollux and Procyon, n. పునర్వసు నక్షత్రం;
 • castor oil, n. ఆముదం; చిట్టాముదం;
 • castoreum, n. సీమ కస్తూరి; కెనడా, రష్యా దేశాలలో తిరిగే బీవర్ జాతి జంతువుల పొట్ట దగ్గర ఉండే తిత్తులనుండి స్రవించే పదార్థం; దీన్ని సెంట్ల తయారీలో వాడతారు;
 • castration, n. శస్త్ర చికిత్స ద్వారా వృషణాలని తీసివెయ్యడం లేదా పనిచెయ్యకుండా చెయ్యడం;
 • cause, n. కారణం; హేతువు; నిమిత్తము; వ్యాజము;
  • efficient cause, ph. నిమిత్త కారణం; కారకుడు; కారకి; కర్త; an efficient cause consists of things apart from the thing being changed, which interact so as to be an agency of the change. For example, the efficient cause of a table is a carpenter acting on wood. In the natural world, the efficient cause of a child is a father;
  • material cause, ph. సమవాయ కారణం; This is the aspect of the change or movement that is determined by the material that composes the moving or changing things. For a table, this might be wood; for a statue, it might be bronze or marble;
 • cause, v. t. కలుగఁజేయ; చేయించు;
 • casual, adj. దైవాధీనమైన; ఆకస్మికమైన; అచింతితమైన; యాదృచ్ఛికమైన; తాత్కాలిక; ప్రాసంగిక;
  • casual guest, ph. అనుకోకుండా వచ్చిన అతిథి; అభ్యాగతి;
  • casual leave, ph. ఆకస్మికంగా కావలసి వచ్చిన శెలవు;
 • casually, adj. ఆనుషంగికంగా; ఆషామాషీగా; యథాజ్లాపంగా;
 • casualties, n. pl. హతక్షతాలు; హతక్షతులు;
 • casualty, n. (1) నష్టం; (2) యుద్ధంలో కాని, ప్రమాదంలో కాని దెబ్బలు తగిలినవారు, చనిపోయినవారు;
 • casuarina, n. సరుగుడు చెట్టు; సర్వీ చెట్టు;
 • cat, n. (1) పిల్లి, మార్జాలం; బిడాలం; ఓతువు; (2) పులి; సింహం;
 • cat's eye, n. వైడూర్యం; నవరత్నాలలో ఒకటి;
 • catabolism, n. విచ్ఛిన్న ప్రక్రియ; జీవకోటి శరీరాలలో సజీవ కణజాలాన్ని రద్దు సామగ్రిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ; same as destructive metabolism; (ant.) anabolism;
 • cataclysm, n. మహాప్రళయం; ఉత్పాతం;
  • cognitive cataclysms, ph. అభిజ్ఞాత ఉత్పాతాలు;
 • catalog, catalogue (Br.), n. (1) జాబితా; పట్టిక; చలానా; (2) పట్టీ పుస్తకం; సూచీ గ్రంథం;
 • catalysis, n. ఉత్ప్రేరణం; రసాయన సంయోగాన్ని త్వరితపరిచే ప్రక్రియ;
 • catalyst, n. ఉత్ప్రేరకం; తోపు; రసాయన సంయోగాన్ని త్వరితపరచే పదార్థం;
 • cataract, n. (1) జలపాతం; పెద్ద జలపాతం; (2) శుక్లం; కంటిలో పువ్వు; మోతిబిందు; మసక కమ్మిన కంటికటకం;
 • catarrh, n. (కేటరా) శైత్యం; చలువ; జలుబు; పడిశం; పీనస; గొంతు, ముక్కులలో పొర వాపు;
 • catastrophe, n. వినిపాతం; గొప్ప విపత్తు; ఆశనిపాతం; ఉత్పాతం;
  • catastrophe theory, ph. ఉత్పాత వాదం; అకస్మాత్తుగా జరిగే ప్రక్రియల ప్రభావాన్ని గణిత సమీకరణాలతో వర్ణించే పద్ధతి;
 • catch, v. t. అంటుకొను; పట్టుకొను; చేయు;
  • catch a thief, ph. దొంగని పట్టుకొను;
  • catching a cold, ph. జలుబు చేయు; పడిశం పట్టు;
  • catching fire, ph. అంటుకొను; రాజుకొను;
  • catch-22, n. పీటముడి;
 • catchment, n. ఆరగాణి; ఏటిదండి; పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతం;
  • catchment area, ph. పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతపు వైశాల్యం;
 • catchword, n. ఊతపదం;
 • catechu, n. కాచు;
 • categorical, adj. సంవర్గ; నిరపేక్ష, నిశ్చిత, స్పష్ట; రూఢియైన; నిశ్చయమైన; పరిష్కారమైన; నిస్సంశయమైన;
 • categorically, adv. స్పష్టంగా; విపులంగా; వివరంగా; తేటతెల్లంగా; ఖండితంగా;
 • categorization, n. వర్గీకరణ; కోవీకరణ; ఒక కోవలో పెట్టడం;
 • category, n. కోవ; వర్గం; తెగ;
 • catenary, n. రజ్జువక్రం; మాలావక్రం; రెండు రాటల మధ్య వేలాడే తాడు ఆకారపు వక్ర రేఖ;
 • caterer, n. మోదీ; వండిన భోజన పదార్థాలని సరఫరా చేసే వ్యక్తి లేదా సంస్థ;
 • caterpillar, n. ఆకుపురుగు;చత్చ్
  • hairy caterpillar, ph. గొంగళిపురుగు;
 • catfish, n, వాలుగ; ఒక జాతి చేప;
 • cathartic, n. విరేచనకారి; విరేచనాలు అవడానికి వాడే మందు; భేదిమందు;
 • catheter, n, సన్నని రబ్బరు గొట్టం; శరీరపు నాళాలలోనికి జొప్పించడానికి వాడే గొట్టం;
 • cathode, n. రునోడు; రుణధ్రువం;
 • catnap, n. కునుకు; కోడికునుకు;
 • cattle, n. పశువులు; గొడ్లు; పసరములు;
 • caucus, n. సమాలోచన;
 • caudal, adj. పుచ్ఛక; తోకకి సంబంధించిన;
 • cauldron, n. బాన; కొప్పెర; కాగు; ఆండా; గాబు; మరిగించడానికి వాడే అండా;
  • metallic cauldron, ph. కొప్పెర; డేగిసా;
 • cauliflower, n. కోసుకూర; కోసుపువ్వు; పోట్లాపువ్వు; ముట్టకోసు; పువ్వుబుట్టకూర; కాలీఫ్లవర్;
 • causal, adj. (కాజల్) కారణ; కారకమైన; నైమిత్తిక;
 • causal body, ph. కారణ శరీరం; అంగ శరీరం; సూక్ష్మశరీరం;
 • causal, n. (కాజల్) నైమిత్తికం; కారణభూతం;
 • causative, adj. కారకం; హేతు;
  • causative agent, ph. కారకి; హేతు కర్త;
 • cause, n. కారణం; నిమిత్తం; హేతువు; హేతు కర్త; కతం; శకునం; ప్రేరణ; కారకం;
  • efficient cause, ph. నిమిత్త కారణం;
  • material cause, ph. ఉపాదాన కారణం;
  • cause and effect, ph. కారణ కార్యములు; ప్రేరణ స్పందనలు; జనక జన్యములు;
  • cause and effect relationship, ph. కారణ కార్య సంబంధం; పౌర్వాపర్యం; జనక జన్య సంబంధం;
  • with cause, ph. సహేతుకంగా, సకారణంగా;
  • without cause, ph. ఊరికే; ఊరక; నిష్కారణంగా; అకారణంగా;
సింగపూర్ ని మలేసియాతో కలిపే సేతువు
 • causeway, n. సేతువు; ఇది వంతెన కాదు కాని నీటిని దాటడానికి కట్టిన రహదారి; A causeway is a track, road, or railway on the upper part of an embankment across "a low, or wet place, or a piece of water"; సముద్రం దాటి లంకకి వెళ్ళడానికి రాముడు కట్టినది సేతువు;
 • caustic, adj. దాహక; దహించేది; కాల్చునట్టిది; తాకిడి వలన శరీరాన్ని పొక్కించేది; గాఢ; తీక్షణ;
  • caustic alkali, ph. దాహక క్షారం;
  • caustic potash, ph. దాహక పొటాష్, potassium hydroxide;
  • caustic soda, ph. దాహక సోడా; sodium hydroxide;
 • cauter, n. వాతలు పెట్టే పుల్ల;
 • cauter, v. t. (1) వాతలు పెట్టు; (2) శస్త్ర చికిత్సలో శరీరాన్ని చిన్నగా కాల్చు; చిరిగిన చర్మాన్ని అతకడానికి చిన్నగా చురకలు పెట్టు;
 • caution, n. మందలింపు; హెచ్చరిక;
 • caution, v. t. మందలించు; హెచ్చరించు; జాగ్రత్త; భద్రత;
 • cavalry, n. ఆశ్వికసేన; ఆశ్వికదళం; గుర్రపు దండు; సాహిణి;
 • cave, n. గుహ; కుహరం; గహ్వరం; బిలం; కందరం;
  • interior of a cause, ph. గుహాంతరం;
 • caveat, n. (కేవియాట్‍) షరతు; వివరణ; హెచ్చరిక; మెలి; మెలిక; ఆక్షేపణ; ఆటంకం;
  • caveat lector, ph. చదువరీ, జాగ్రత్త!; చదివిన అంశం లోని నిజానిజాలు నిర్ణయించే బాధ్యత చదువరిదే!
  • caveat emptor, ph. కొనుగోలుదారుడా, జాగ్రత్త!; కొన్న వస్తువు యొక్క మంచి చెడులు నిర్ణయించే బాధ్యత కొనుగోలుదారిదే!
 • caviar, n, (కేవియార్) ఉప్పులో ఊరవేసిన కొన్ని రకాల చేప గుడ్లు; ఒకొక్క జాతి చేప కడుపులోంచి తీసిన గుడ్లతో చేసిన కేవియార్‍ లక్ష డాలర్ల వరకు పలకవచ్చు;
 • cavity, n. (1) కుహరం; గది; గహ్వరం; కోటరం; వివరం; బిలం; రంధ్రం; (2) డొల్ల; పుచ్చు; పుప్పి పన్ను; నోటిలోని పన్ను పుచ్చడం;
  • abdominal cavity, ph. ఉదర కుహరం;
  • chest cavity, ph. హృదయ కుహరం;
  • thoracic cavity, ph. హృదయ కుహరం;
 • cayenne, n. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయల పొడి;
  • cayenne peppers, ph. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయలు

Part 2: cb-cl

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • cease, v. i. ఆగు;
 • cease, v. t. ఆపు; ఉడుగు;
 • cease and desist letter, ph. "చేసూన్న పని ఆపు, మళ్లా చెయ్యకు" అని ఆజ్ఞ ఇస్తూ రాసిన ఉత్తరం; పేటెంటు హక్కులని ఉల్లంఘించిన సందర్భాలలో ఇటువంటి ఉత్తరాలు ఎక్కువ వాడతారు;
 • cease-fire, n. ధర్మదార; కాల్పుల విరమణ;
 • ceaseless, n. నిరంతరం;
 • ceaselessly, adv. ఆపకుండా; అదేపనిగా; ఎడతెగకుండా; నిరంతరంగా; హోరాహోరీగా;
 • cedar, n. దేవదారు; దేవదారు చెట్టు;
 • ceiling, n. సరంబీ; లోకప్పు; (rel.) roof;
 • ceiling brush, n. పట్లకర్ర;
 • celebrated, adj. ఖ్యాతివడసిన; వినుతికెక్కిన; కీర్తికెక్కిన; ప్రసిద్ధ; పేరున్న; విఖ్యాత; ఘనమైన; జేగీయమాన;
 • celebrity, n. m.చాంచవుఁడు; f.చాంచవి; ఖ్యాతివడసిన వ్యక్తి; కీర్తికెక్కిన వ్యక్తి; వినుతికెక్కిన వ్యక్తి; పేరుపొందిన వ్యక్తి;
 • celestial, adj. నభో; ఖగోళ; ఖ; అంతరిక్ష;
  • celestial body, ph. నభోమూర్తి; మింటిమేను; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు;
  • celestial equator, ph. ఖగోళమధ్యరేఖ; ఖమధ్యరేఖ; విషువద్ వృత్తం; నాడీవలయం; the great circle on the celestial sphere halfway between the celestial poles;
  • celestial horizon, ph. ఖగోళీయ క్షితిజం;
  • celestial meridian, ph. మధ్యాహ్నరేఖ;
  • celestial poles, ph. ఖగోళీయ ధ్రువములు; భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళాన్ని తాకే ఉత్తర, దక్షిణ బిందువులు;
  • celestial ship, ph. నభోతరణి; రోదసీనౌక;
  • celestial sphere, ph. ఖగోళం; ఆకాశం లోకి చూసినప్పుడు, వీక్షకుడు కేంద్రంగా కనిపించే మహాగోళపు లోపలి ఉపరితలం; ఈ ఉపరితలం మీదనే నక్షత్రాలు, గ్రహాలు, తాపడం పెట్టినట్లు కనబడతాయి;
 • celibacy, n. బ్రహ్మచర్యం; (lit.) the divine act;
  • celibate student, ph. బ్రహ్మచారి; (coll.) గోచిపాతరాయుడు;
 • cell, n. (1) కణము; జీవకణం; (2) చిన్నగది; అర; అర్ర; కోషికం; కోష్టం; (3) బందీగది; (4) ఘటం;
  • apical cell, ph. అగ్ర కణం;
  • blood cell, ph. రక్త కణం;
  • daughter cell, ph. పిల్ల కణం;
  • eukaryotic cell, ph. కణికసంహిత కణం; నిజకేంద్రక కణం;
  • fuel cell, ph. ఇంధన కోషికం; ఇంధన కోష్టం;
  • mother cell, ph. తల్లి కణం; మాతృ కణం;
  • prokaryotic cell, ph. కణికరహిత కణం; పూర్వకేంద్రక కణం; Prokaryotes are cells that do not contain a nucleus; (ety.) pro: before; Karyo: nucleus;
  • prothallial cell, ph. ప్రథమాంకుర కణం;
  • red blood cell, ph. ఎర్ర కణం;
  • sex cell, ph. లైంగిక కణం; లింగ కణం;
  • sheath cell, ph. తొడుగు కణం;
  • shield cell, ph. డాలు కణం;
  • white blood cell, ph. తెల్ల కణం;
  • cell division, ph. కణ విభజన;
  • cell membrane, ph. కణత్వచం; కణ పొర; కణ పటలం;
  • cell phone, ph. చరవాణి; (note) here the word is translated from mobile phone; A mobile phone is a better descriptor because "cell phone" has been derived from "cellular technology" and a mobile phone need nor rely on cellular technology;
  • cell nucleus, ph. కేంద్రకం; కణిక;
  • cell sap, ph. కణసారం;
  • cell theory, ph. కణ సిద్ధాంతం;
  • cell wall, ph. కణ కవచం;
 • cellar, n. భూగృహం; నేలమాళిగ; భూమట్టానికి దిగువగా ఉన్న గది; (rel.) basement;
 • cellophane, n. కణపత్రం; కణోజుతో చేసిన పల్చటి, పారభాసకమైన, కాగితం వంటి రేకు;
 • cellulose, n. కణోజు; పేశిమయం; మొక్కల కణాలలో ఉండే ఒక పీచు పదార్థం కనుక కణోజు అన్నారు;
 • cement, n. సిమెంటు; సీమసున్నం; సంధిబంధం;
 • cement, v. t. అతుకు; కలుపు; సంధించు;
 • cemetery, n. క్రైస్తవ శ్మశానం; క్రైస్తవుల ఖనన భూములు; రుద్రభూమి; (same as graveyard);
 • cenotaph, n. ఒక వ్యక్తి స్మారకార్థం నిర్మించబడే ఒట్టి ఖాళీ సమాధి; శత్రువుల చేతులలో మరణించిన సైనికుల శవాలు, విమాన, ఓడ ప్రమాదాలలో మృతుల దేహాలు ఒక్కోసారి కుటుంబ సభ్యులకు లభించవు.అలాంటి సందర్భాలలో ఖననం చేసేందుకు శవం లేకపోవడం చేత ఖాళీ సమాధి నిర్మిస్తారు. అలా ఒక వ్యక్తి స్మారకార్థం నిర్మించబడే ఖాళీ సమాధిని ‘సెనోటాఫ్' లేక 'కెనోటాఫ్' అంటారు;
 • Cenozoic era, n. నవ్యజీవ యుగం; నవజీవ యుగం; The Cenozoic is also known as the Age of Mammals because the extinction of many groups allowed mammals to greatly diversify; the current and most recent of the three Phanerozoic geological eras, following the Mesozoic Era and covering the period from 66 million years ago to present day.
 • censer, n. ధూపపు పాత్ర; ధూపం వెయ్యడానికి వాడే పాత్ర; చిన్న ఆనపకాయ ఆకారంలో ఉండి వేలాడదీయడానికి వీలుగా ఒక గొలుసు ఉన్న పాత్ర:
 • censor, v. t. కత్తిరించు; సెన్సారు; నిషిద్ధ దృశ్యాలని, రాతలని కత్తిరించే పద్ధతి; see also censure;
 • censoriousness, n, రంధ్రాన్వేషణ; పనికట్టుకుని తప్పులు పట్టడం;
 • censure, n. నింద; మందలింపు; అభిశంసనం; ఆక్షేపణ; ఆరడి;
 • censure, v. t. దూషించు; నిందించు; మందలించు; అభిశంసించు;
 • census, n. జనాభా లెక్క; జనపరిగణన; జనగణనం; జనసంఖ్య;
 • cent, n. డాలరు వగైరా నాణేలలో నూరవ భాగం; పైస;
 • centaur, n. (1) నరతురంగం; గ్రీకు పురాణాలలో అగుపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ; (2) కింపురుషులు; హిందూ పురాణాలలో కనపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ; see also satyr;
 • centenarian, n. నూరేళ్ళు బతికిన వ్యక్తి;
 • centenary, n. శతవార్షికోత్సవం;
  • birth centenary, ph. శతవార్షిక జయంతి;
  • death centenary, ph. శతవార్షిక వర్ధంతి;
 • center, centre (Br.), n. కేంద్రం; నాభి;
  • center of gravity, ph. గరిమనాభి; గురుత్వ కేంద్రం; Centre of gravity is the point at which the distribution of weight is equal in all directions, and does depend on gravitational field;
  • center of mass, ph. గరిమనాభి; ద్రవ్యనాభి; Centre of mass is the point at which the distribution of mass is equal in all directions, and does not depend on gravitational field; On Earth, both the center of gravity and the center of mass are almost at the same point;
  • center of inertia, ph. జడనాభి;
 • centigrade, adj. శతపద; వంద భాగాలుగా చేసిన;
  • centigrade thermometer, ph. శతపద ఉష్ణమాపకం; సెంటీగ్రేడ్‍ ఉష్ణమాపకం; వేడిని కొలవడానికి సున్న నుండి వంద డిగ్రీల వరకు ఉన్న మేరని వంద భాగాలుగా విభజించబడ్డ పరికరం;
 • centimeter, centimetre (Br.), n. సెంటీమీటరు; మీటరులో నూరవ వంతు;
 • centipede, n. జెర్రి; శతపాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి; (lit.) నూరు పాదములు కలది; నిజానికి శతపాదికి 32-40 కాళ్లే ఉంటాయి;
 • central, adj. కేంద్రీయ; కేంద్ర; మధ్య;
  • central government, ph. కేంద్ర ప్రభుత్వం;
  • central nervous system, ph. కేంద్ర నాడీమండలం;
 • centralization, n. కేంద్రీకరణం; కేంద్రీకృతం;
 • centrifugal, adj. అపకేంద్ర; కేంద్రం నుండి బయటకు పోయే ;మధ్యత్యాగి; మధ్యస్థలాపకర్షిత;
 • centripetal, adj. కేంద్రాభిముఖ; వృత్తంలో పరిధి నుండి కేంద్రం వైపు సూచించే దిశ; మధ్యాకర్షిత; మధ్యాభిగామి;
 • century, n. శతాబ్దం; శతాబ్ది; నూరేళ్లు;
 • cephalic, adj. కాపాలిక; కపాలానికి సంబంధించిన;
 • Cepheid Variables, n. (సిఫియడ్) cepheid variable stars; Named after delta-Cephei, Cepheid Variables are the most important type of variable stars because it has been discovered that their periods of variability are related to their absolute luminosity. This makes them invaluable in measuring astronomical distances;
 • ceramic, adj. పక్వమృత్త; కాలి గట్టి పడిన;
 • ceramic, n. పింగాణీ; మృణ్మయం; మృత్తిక; మర్తబాన్;
 • cereals, n. తృణధాన్యాలు;
 • cerebellum, n. చిన్నమెదడు; అనుమస్తిష్కం;
 • cerebral, adj. మస్తిష్క; మూర్ధన్య; మెదడుకి కాని బురక్రి కాని సంబంధించిన;
  • cerebral hemispheres, ph. మస్తిష్క గోళార్ధాలు; మెదడులో కనిపించే రెండు అర్ధ భాగాలు;
 • cerebrals, n. [ling.] మూర్ధన్యములు; గొంతుక వెనక భాగం నుండి ఉచ్చరింపబడే హల్లులు;
 • cerebrospinal, adj. మస్తిష్కమేరు; మస్తిష్కసుషుమ్న;
  • cerebrospinal fluid, ph. మస్తిష్కమేరు ఐర; మస్తిష్కమేరు జలం;
 • cerebrum; n. పెద్దమెదడు; బృహన్మస్తిష్కం;
 • ceremony, n. (1) క్రతువు; (2) ప్రత్యేకమైన పండుగ; (3) ఆబ్దికం;
  • funeral ceremony, ph. దినవారాలు;
 • certain, n. తధ్యం; తప్పనిది; ఖాయం;
 • certainty, n. తధ్యం; ఖాయం;
 • certainly, interj. అవశ్యం; తప్పకుండా;
 • certificate, n, నిర్ణయపత్రం; యోగ్యతాపత్రం; ధ్రువపత్రం; ప్రమాణపత్రం; మహాజరునామా; ఒరపురేకు;
  • birth certificate, ph. జన్మ పత్రం, జన్మ నిర్ణయ పత్రం
  • death certificate, ph. మరణ పత్రం, మరణ నిర్ణయ పత్రం;
 • cervical, adj. గ్రీవ;
 • Cesium, n. ఆకాశనీలం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 55, సంక్షిప్త నామం, Cs); [Lat. caesius = sky blue];
 • cess, n. పన్ను; same as tax, still used in British colonial countries;
 • cesspool, n. గంధకుండం; పీతిరి గుంట; మురికి కుండీ; కూపం;
 • cetacean, n. తిమింగలం;
 • chaff, n. (1) పొట్టు; పొల్లు; పప్పుల మీద ఉండే తొక్క; (2) ఊక; వరి మొదలైన ధాన్యాల మీద ఉండే తొక్క;
 • chagrin, n. మనస్థాపం; విసుగు; వేసట;
 • chain, adj. గొలుసు; శృంఖల;
  • chain isomerism, ph. శృంఖల సాదృశం;
  • chain reaction, ph. శృంఖల చర్య; గొలుసుకట్టు చర్య;
  • chain rule, ph. శృంఖల సూత్రం; పరంపర ప్రమాణం; గొలుసుకట్టు సూత్రం;
 • chain, n. (1) గొలుసు; చయనిక; శృంఖలం; (2) నాను; హారము; పేరు; సరం; (3) దామము; దండ; మాలిక; (4) వరుస; పరంపర;
  • side chain, ph. పక్కగొలుసు;
 • chair, n. కుర్చీ; కుర్చీపీట; పీఠం;
  • easy chair, ph. పడక కుర్చీ; ఆసందీ;
  • lounging chair, ph. పడక కుర్చీ; ఆసందీ;
 • chairman, n. సభాపతి; అధ్యక్షుడు; పీఠాధిపతి;
 • chalcedony, n. పుష్యరాగం; కురువిందం; కురింజి;
 • chalice, n, పంచపాత్ర; కలశం; చర్చిలో మధుపానం కొరకు వాడే పాత్ర;
 • chalk, n. సుద్ద; పాలమన్ను; ధవళ మృత్తిక; calcium carbonate;
  • piece of chalk, ph. సుద్ద ముక్క;
  • red chalk, ph. శిలాజిత్తు; గైరికం; అరదళం;
 • challenge, n. సవాలు;
గరుడ ఫలం
 • chalmogra, n, గరుడఫలం; ఈ ఫలం రసంతో లేపనం చేస్తే బొల్లి మచ్చలు పోతాయంటారు; [bot.] Hydnocarpus wightiana;
 • chalmogroil, n, గరుడతైలం; గరుడఫల తైలం;
 • chamber, n. (1) వేశ్మము; గది; కోష్ఠం; కోష్ఠిక; పేటిక; (2) మండలం;
  • cloud chamber, ph. జీమూత కోష్ఠిక;
  • cumbustion chamber, ph. దహన కోష్ఠిక;
  • small chamber, ph. కోష్ఠిక; పేటిక;
  • chamber of commerce, ph. వాణిజ్య మండలం;
 • chameleon, n. (కమీలియాన్) ఊసరవెల్లి; మూడు వన్నెల తొండ; any of a group of primarily arboreal (tree-dwelling) Old World lizards best known for their ability to change body color; [bio.] Chamaeleo zeylanicus of the Chamaeleonidae family;
 • chamois, n. (షామీ) కొండజింక; మేకని పోలిన ఒక రకం కొండ లేడి; [bio.] Rupicapra rupicapra;
  • chamois leather, ph. కొండజింక తోలు; జింక తోలు; జింక చర్మం;
 • chamomile, n. (కేమోమిల్) సీమ చేమంతి; కేమోమిల్లా; [bot.] Marticaria Chamomilla;
 • champion, n. జెట్టి; వస్తాదు;
  • world champion, ph. జగజ్జెట్టి;
 • chance, n. అవకాశం; తరుణం; అదను; తరి; సమయం;

'---Usage Note: chance, opportunity

 • ---Use these words to talk about something you are able to do because of luck. Chance also means possibility.
 • chandelier, n. దీపవిన్యాసం; కందీలు; (ety.) candle lights;
 • change, n. (1) మార్పు; ఫిరాయింపు; (2) పరిణామం; వికారం; (3) చిల్లర డబ్బు;
  • gradual change, ph. క్రమ పరిణామం;
  • phonetic change, ph. ధ్వని పరిణామం;
  • semantic change, ph. అర్థ విపరిణామం;
 • change, v. i. మారు; ఫిరాయింపు;
 • change, v. t. మార్చు; ఫిరాయించు;
 • channel, n . (1) మార్గం; దారి; పరీవాహం; (2) సహజమైన జలమార్గం; జలసంధి; see also canal; (3) ఛానల్;
 • chapel, n. చర్చి భవనంలో ఒక మూల ఉండే గది; చర్చిలో చిన్న ప్రార్ధన మందిరం;
 • chaos, n. (కేయాస్) కల్లోలం; అస్తవ్యస్తత; అవ్యక్త స్థితి; అయోమయం; గందరగోళం; గజిబిజి; అరాజకత్వం;
 • chapbook, n. గుజిలీ ప్రతి; a small booklet on a specific topic, typically saddle stitched;
 • chaperon, n. f. పెద్దదిక్కు; రక్షకురాలు;
 • chaplain, n. గురువు; ఆచారి; పురోహితుడు;
 • chappals, n. pl. [Ind. Engl.] చెప్పులు; (rel.) sandals; flip-flops; slip-on shoes;
 • chapped, adj. పగుళ్లు వేసిన; బీటలు వేసిన;
 • chapter, n. అధ్యాయం; ప్రకరణం; ఆశ్వాసం; సర్గం; కాండం; పర్వం; స్కంధం; పరిచ్ఛేదం; వల్లి;
 • character, n. (1) శీలం; నడవడి; నడవడిక; (2) స్వభావం; లక్షణం; తత్వం; గుణం; శీలత; (3) మూర్తి; శాల్తీ; ఆసామీ; పాత్ర; శీలత; (4) వర్ణం; అక్షరాంకం;
  • alphabetical character, ph. అక్షరమూర్తి;
  • alphanumeric character, ph. అక్షరాంకికమూర్తి;
  • person of good character, ph. గుణవంతుడు; గుణవంతురాలు;
  • character actor, ph. గుణచిత్ర నటుడు; గుణచిత్ర నటి; ప్రధాన పాత్రలు కాకుండా ఇతర ముఖ్య పాత్రలు పోషించగలిగే నటుడు;
  • character set, ph. వర్ణ సంచయం;
 • characteristic, adj. లాక్షణిక; స్వాభావిక; విశిష్ట;
 • characteristic, n. స్వభావం; ముఖ్య లక్షణం; తత్వం; గుణం; విశిష్టత; కారకత్వం;
 • characteristic equation, n. లాక్షణిక సమీకరణం;
 • characteristics, n. pl. లక్షణాలు; గుణగణాలు;
 • characterize, v. t. ఉపలక్షకరించు; వర్ణించు; చిత్రించు;
 • charcoal, n. బొగ్గు; అంగారం;
  • animal charcoal, ph. శల్యాంగారం; జంతుబొగ్గు;
  • wood charcoal, ph. కర్రబొగ్గు; ద్రుమాంగారం; దార్వాంగారం;
  • charcoal grill, ph. కుంపటి; అంగారిణి; అంగారధానిక; బొగ్గుల కుంపటి;
 • charge, n. (1) ఘాతం; ఆవేశం; భాండం; విద్యుత్‍వంతం; తటిత్వంతం; తటి; ఛార్జి; (2) అప్పగింత; హవాలా; (3) ఫిర్యాదు; (4) దాడి;
  • electrical charge, ph. విద్యుదావేశం; విద్యుత్‍వంతం; తటి;
  • false charge, ph. అభాండం;
 • charge, v. t. ఆరోపించు; నిందమోపు; మీదకి దూకు; మీద పడు; (2) ఖాతాలో వేయు; (3) అప్పగించు; భారం వేయు;
  • charge sheet, ph. (1) ఆరోపణ పత్రం; నేరారోపణ పత్రం; (2) అప్పగింత పత్రం;
 • charged, adj. ఆవేశిత; విద్యుదావేశిత;
  • charged particle, ph. ఆవేశిత కణం;
 • charisma, n. సమ్మోహన శక్తి; జనాకర్షక శక్తి;
 • charitable, adj. దాతృత్వ; ధర్మ;
  • charitable organization, ph. దాతృత్వ సంస్థ;
  • charitable trust, ph. దాతృత్వ నిధి; ధర్మనిధి; ధర్మసంస్థ;
 • charitableness, n. దాతృత్వశీలత; త్యాగశీలత;
 • charity, n. ఉదాత్తత; దాతృత్వం; ఈగి; తిరిపెం;
 • charlatan, n. అల్పజ్ఞుడు; పండితమ్మన్యుడు; కుహనా మేధావి; దుర్విదగ్ధుడు; లోతైన జ్ణానము లేని వ్యక్తి;
 • charm, n. రక్తి; మనోజ్ఞత; కమ్రం;
 • charming, adj. రమణీయ; మనోహర; కమ్రమైన;
 • chart, n, పటం; బొమ్మ; చక్రం;
  • natal chart, ph. జన్మ చక్రం; జాతక చక్రం;
 • chartered, adj. శాసనపూర్వకముగా పొందిన;
 • chase, v. t. తరుము; వెంటాడు;
 • chasm, n. (కేజం) అగాధం; పెద్ద బీట; లోతైన గొయ్యి;
 • chassis, n. (ఛాసీ) చట్రం; బండి చట్రం; కారు చట్రం;
 • chaste, adj. (ఛేస్ట్) శీలవతి అయిన; నిర్దోషి అయిన;
 • chastise, v. t. (ఛేస్టయిజ్) దండించు; తిట్టు; కొట్టు;
 • chastity belt, n. ఇనప కచ్చడం;
 • chat, v. t. ముచ్చటించు; కబుర్లు చెప్పు;
 • chatterbox, n. డబ్బా; వసపిట్ట; వాగుడునోరు; వదరుబోతు;
 • chauffeur, n. (షోఫర్) కారు నడిపే వ్యక్తి; డ్రైవరు;
 • chauvinism, n. డంబాచారం; దురతిశయం;
  • cultural chauvinism, ph. సాంస్కృతిక దురతిశయం;
  • male chauvinism, ph. పురుష డంబాచారం; పురుషాధిక్యత;
 • chayote squash, n. బెంగుళూరు వంకాయ;
బెంగుళూరు వంకాయ
 • cheap, n. (1) చవుక; అగ్గువ; (2) చవుకబారు; (3) లేకి;
 • cheat, v. t. మోసగించు; వంచించు; మస్కా కొట్టు;
 • cheater, n. m. మోసగాడు; వంచకుడు; తక్కిడి; బకవేషి; అటమటీడు; f. మోసకత్తె; వంచకురాలు;
 • check, n. (1) చెక్కు; బరాతం; బ్యాంకు హుండీ; (Br.) cheque; (2) తనిఖీ; పరీక్ష;
 • checkers, n. చదరంగం బల్ల వంటి బల్ల మీద ఆడే ఒక ఆట;
 • check up, n. తనిఖీ; పరీక్ష;
 • cheek, n. చెంప; చెక్కిలి; బుగ్గ; లెంప; కపోలపాలిక; కపోలం;
 • cheekiness, n. చిలిపితనం;
 • cheese, n. కిలాటం; దధికం; మరిని;
 • cheetah, n. చీతా; [bio.] Acinonyx jubatus; ఇది ఎక్కువగా ఆఫ్రికాలో నివసించే జంతువు; లేత పసుపుపచ్చ చర్మం మీద నల్లటి మచ్చలు ఉంటాయి; చిన్న గుండ్రటి తలకాయ, రెండు కళ్ళ నుండి కన్నీటి ధారల నల్లటి గీతలు ఉంటాయి; ఇది భారతదేశంలో కనిపించే leopard (చిరుతపులి) జాతిది కాదు; చీటా అన్నది ఉత్తరాది భాషల్లో చీతా, సంస్కృతం చిత్రా నుంచి వచ్చింది. దాన్ని మనం చీటా అనడం కంటే చీతా అనటం మంచిది;
చీటా (Cheetah_female).jpg
 • chef, n. వంటరి; వంటమనిషి; సూనరి; m. వంటవాఁడు; సూదుఁడు; పాకశాసనుఁడు; f. వంటలక్క; వంటగత్తె; సూదురాలు;
 • chemical, n. రసాయనం; రసాయన పదార్థం;
 • chemical, adj. రసాయన; రసాయనిక;
  • chemical affinity, ph. రసాయన అనురాగం;
  • chemical analysis, ph. రసాయన విశ్లేషణ;
  • chemical change, ph. రసాయన మార్పు;
  • chemical combination, ph. రసాయన సంయోగం;
  • chemical compound, ph. రసాయన మిశ్రమం;
  • chemical decomposition, ph. రసాయన వియోగం;
  • chemical element, ph. రసాయన మూలకం; రసాయన ధాతువు;
  • chemical equation, ph. రసాయన సమీకరం;
  • chemical process, ph. రసాయన ప్రక్రియ;
  • chemical science, ph. రసాయన శాస్త్రం;
  • chemical substance, ph. రసాయన పదార్థం;
  • chemical synthesis, ph. రసాయన సంశ్లేషణ;
  • chemical warfare, ph. రసాయన యుద్ధం;
 • chemicals, n. రసాయనాలు; రసాయన పదార్థాలు; రసాయన ద్రవ్యాలు;
 • chemist, n. రసాయనుడు; రసాయన శావేత్త;
 • chemistry, n. రసాయనం; రసాయన శాస్త్రం;
  • biochemistry, n. జీవ రసాయనం;
  • food chemistry, ph. ఆహార రసాయనం;
  • industrial chemistry, ph. పారిశ్రామిక రసాయనం;
  • inorganic chemistry, ph. వికర్బన రసాయనం; అనాంగిక రసాయనం; మూలక రసాయనం;
  • organic chemistry, ph. కర్బన రసాయనం; సేంద్రియ రసాయనం; ఆంగిక రసాయనం; భూత రసాయనం;
  • photochemistry, n. తేజో రసాయనం;
  • physical chemistry, ph. భౌతిక రసాయనం;
  • synthetic chemistry, ph. పౌరుష రసాయనం; సంధాన రసాయనం;
 • chemotherapy, n. రసాయన చికిత్స; కేన్సరుకి వాడే మందులు;
 • cherimoya, n. సీతాఫలం; custard apple;
 • cherry tomatoes, n. చిట్టి టొమేటోలు; పింపినెల్లా (సోంఫు) ఆకులని పోలిన ఆకులు కలది; [bot.] Lycopersicon pimpinellifollium;
 • chess, n. చతురంగం; చదరంగం;
 • chest, n. (1) రొమ్ము; ఛాతీ; అక్కు; బోర; ఎద; వక్షస్థలం; హృదయఫలకం; భుజాంతరం; (2) పెట్టె; బీరువా; మందసం;
  • medicine chest, ph. మందుల బీరువా;
 • chest of drawers, ph. సొరుగుల బల్ల;
 • chew, v. t. నములు; చర్వణం చేయు;
 • chew the cud, v. t. నెమరువేయు;
 • chewed, adj. నమిలిన; చర్విత;
 • chewing, n. నమలడం; చర్వణం;
 • chiaroscuro, adj. వెలుగు-నీడల శైలి;
  • chiaroscuro effect, ph. ఛాయాచిత్రాలు తీసేటప్పుడు వెలుగు-నీడల ని కళాత్మకంగా ఉపయోగించుకోవడం;
 • chickadee, n. చుంచుపిచ్చుక; also called as Titmice and Tit bird
 • chickpeas, n. pl. శనగలు; see also garbanzos;
 • chickweed, n. దొగ్గలి కూర;
 • chicken, n. కోడిపిల్ల;
 • chicken pox, n. ఆటలమ్మ; తడపర; చిన్నమ్మవారు; పొంగు; వేపపువ్వు; ఒక వైరస్‍ వల్ల వచ్చే జబ్బు; varicella;
 • chide, v. t. మందలించు;
 • chief, adj. ముఖ్య; ప్రధాన;
 • chief justice, ph. ముఖ్య న్యాయాధిపతి; ప్రధాన న్యాయమూర్తి;
 • chief minister, ph. ముఖ్యమంత్రి;
 • chief, n. అధిపతి;
 • chicory, n. చికోరీ; కొందరు చికోరీ వేరుని పొడి చేసి కాఫీలో కలుపుతారు; [bot.] Cichorium intybus
 • chilblains, n. ఒరుపులు; చలికి చేతి వేళ్లల్లోను, కాలి వేళ్లల్లోను రక్త నాళాలు సంకోచించటం వల్ల రక్త ప్రవాహం తగ్గి, ఆయా భాగాలు ఎర్రగా కంది, నొప్పితో బాధ పెట్టే వ్యాధి;
 • child, n. బిడ్డ; పాప; శిశువు; కందు; కూన; బుడుత; బాల; పట్టి; బొట్టె; m. పిల్లడు; బిడ్డడు; డింభకుడు; బాలుడు; గుంటడు; f. పిల్ల; బాలిక; గుంట; శాబకం; మాటలు మాట్లాడడం వచ్చిన తరువాత దశ;
 • child, adj. బాల; శిశు;
 • childcare, ph. శిశు సంరక్షణ;
 • child welfare, ph. శిశు సంక్షేమం; శిశు సంరక్షణ;
 • childhood, n. బాల్యం; బాల్యావస్థ; చిన్నతనం; పసితనం; చిన్నప్పుడు; శైశవం; కైశోరం; చిరుత ప్రాయం;
 • childish, adj. కైశోరక; కురత్రనపు; కుర్ర తరహా;
 • childishness, n. చంటితనం; పసితనం; కుర్రతనం;
 • childless, n. నిస్సంతు;
  • childless woman, ph. గొడ్రాలు;
 • children, n. పిల్లలు;
  • one's children, ph. బిడ్డలు; పిల్లలు;

---Usage Note: children

 • ---Baby and infant mean very small child, but infant is more formal. A child who is under 3 and who can walk is a toddler. Children aged 13 to 19 are teenagers. Use kids in informal situations for all these categories.
 • Chile saltpeter, n. సురేకారం; యవక్షారం; ఒక రకమైన, తినడానికి వీలు కాని, ఉప్పు; potassium nitrate; sodium nitrate;
 • chillies, n. మిరపకాయలు;
  • Bird eye chillies, ph. కొండ మిరప;
 • chill, n. (1) చల్లదనం; చలి; (2) ఒణుకు; (3) భయం;
 • chill, v. t. చల్లార్చు; చల్లబరచు;
 • chilly, n. చలి; చలిగానుండు; చలివేయు;
 • chimera, n. (కిమేరా) (1) వింతజంతువు; సింహం తల, మనిషి శరీరం లేక మనిషి తల, చేప శరీరం మొదలయిన రెండు విభిన్న జంతువుల శరీరాలను కలపగా వచ్చిన కొత్త జంతువు; In mythology, the Chimera was a magnificent monster. It was an unusual mélange of animals, with a lion's head and feet, a goat's head sprouting off its back, and a serpentine tail.(2) కంచర జీవి; ఒకే శరీరంలో రెండు విభిన్న జాతుల జీవకణాలు ఉన్న జీవి; A chimera is essentially a single organism that's made up of cells from two or more "individuals" — that is, it contains two sets of DNA, with the code to make two separate organisms;
 • chimney, n. పొగగొట్టం; పొగగూడు; చిమ్నీ;
 • chimpanzee, n. చింపంజీ; ఆఫ్రికా అడవులలో నివసించే, మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని జంతువు; [biol.] Pan troglodytes of the Pongidae family;
 • chin, n. గడ్డం; చుబుకం;
 • China-rose, n. మందారం; జపపూవు;
 • chink, n. బీట; పగులు; చిరుగు;
 • chip, n. (1) బిళ్ళ; తునక; ముక్క; (2) అవకర్త; అతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరాలు చెయ్యడానికి వాడే సిలికాన్ బిళ్ళ;
  • chip off the old block, ph. [idiom.] పుణికి పుచ్చుకుని పుట్టిన వ్యక్తి;
  • chip on the shoulder, ph. [idiom] ముక్కుమీది కోపం;
 • chirality, n. [chem.] (కీరాలిటీ) కరత్వం; చేతివాటం; handedness;
 • chirping, n, పక్షులు చేసే కిచకిచ ధ్వని;
 • chisel, n. ఉలి; చీరణం;
 • chit, n. చీటీ; కాగితపు ముక్క; ఉల్లాకి;
 • chital deer, n, జింక; దక్షిణ ఆసియాలో కనబడే ఒక జాతి చుక్కల లేడి;
 • chitchat, n. బాతాఖానీ; లోకాభిరామాయణం; చొల్లు కబుర్లు;
 • chives, n. pl. కింజిల్కం; కేసరం; ఉల్లికాడల జాతికి చెందిన పత్రి; [bot.] Allium schoenoprasum;
 • chloral, n. హరితాల్; నిద్ర మందుగా వాడబడే ఒక రకమైన కర్బన రసాయనం; C13CCHO;
 • chores, n. pl. పనులు; చిల్లర మల్లర పనులు;
  • domestic chores, ph. ఇంటి పనులు;
  • office chores, ph. కచేరీ పనులు;
 • chloride, n. హరిదం;
 • chloride of zinc, ph. యశద హరిదం;
 • chlorine, n. హరితం; హరిత వాయువు; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 17, సంక్షిప్త నామం, Cl);
 • chloroform, n. త్రిహరితపాడేను; క్లోరోఫారం; ఒక మత్తు మందు; CHCl3;
 • chlorophyll, n. పత్రహరితం; పైరుపచ్చ; వృక్షజాతికి ఆకుపచ్చ రంగునిచ్చే పదార్థం;
 • chloroplast, n. హరితపత్రం; (lit.) green leaf;
 • choice, n. ఎంపిక;
 • choir, n. (క్వాయర్) మేళపాటగాళ్లు;
 • choke, n. ఊపిరి తిరగకుండా చేయు; ఉక్కిరిబిక్కిరి చేయు;
 • choker, n. కుత్తిగంటె; మెడకు బిగుతుగా పట్టే ఆభరణం;
 • cholagogue, adj. పిత్తహరి; పిత్తాన్ని హరించేది;
 • cholera, n. వాంతిభేది; విషూచి; మహామారి; మరిడివ్యాధి; కలరా; ఒక రకమైన సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధి;
 • cholesterol, n. పిత్తఘృతాల్; కొలెస్టరోల్; జంతువుల కొవ్వులో ఉండే ఒక ఘృతామ్లం;
 • cholum, n. జొన్నలు;
 • choose, v. t. ఎంపిక చేయు;
 • chop, v. t. ముక్కలుగా కోయు; తరుగు;
 • chord, n. (1) జ్యా, జీవ; జీవన రేఖ; వృత్తపు పరిధి మీద రెండు బిందువులని కలిపే సరళ రేఖ; (2) వాద్యసాధనం యొక్క తీగ;
 • chordates, n. [biol.] మేరోమంతములు; తాత్కాలికంగాకాని; శాశ్వతంగాకాని వెన్నెముక ఉన్న జంతుజాతి;
 • chordophones, n. pl. తంతు వాద్యములు; చేతి గోళ్లతో మీటి వాయించే వాద్యములు; ఉ. తంబురా; వీణ; సితార్;
 • chores, n. pl. చిల్లరమల్లర పనులు; జీవితంలో దైనందినం చేసుకునే పనులు;
 • choreography, n. నాట్యలేఖనం; నాట్యం ఎప్పుడు ఎలా చెయ్యాలో రాసుకోవడం;
 • chorus, n. వంతపాట;
 • chough, n. లోహతుండకాకోలం; సువర్ణతుండ కాకువు; శీతల ప్రాంతాలలో కనిపించే ఒక రకం కాకి;
 • choultry, n. [Ind. Engl.] సత్రవ; ధర్మశాల; a place where free accommodation and sometimes free meals are provided for travelers and pilgrims;
 • chowry, n. చామరం; ఒక రకం విసనకర్ర;
 • Christian, adj. క్రైస్తవ; క్రీస్తవ; కిరస్థానీ;
 • Christian, n. m. క్రైస్తవుడు; క్రీస్తవుడు; కిరస్థానీవాడు;
 • Chromium, n. వర్ణం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 24, సంక్షిప్త నామం, Cr); [Lat. chroma = color];
 • chromoplasts, n. వర్ణకణములు;
 • chromosome, n. వారసవాహిక; వంశబీజం; జీవకణాలలో దారాల రూపంలో ఉండే జన్యు పదార్థం; డి.ఎన్.ఏ. అన్నా ఇదే;
 • chromosphere, n. వర్ణావరణం;
 • chromatograph, n. వర్ణలేఖిని; వర్ణపాత లేఖిని;
 • chromatography, n. వర్ణలేఖనం; వర్ణపాత లేఖనం;
 • chronic, adj. దీర్ఘ; విలంబిత; జీర్ణించుకుపోయిన; జీర్ణ; సదా; పురాణ; జగమొండి;
 • chronic disease, ph. దీర్ఘవ్యాధి; విలంబిత వ్యాధి; సదారోగం; జీర్ణించిన వ్యాధి; జగమొండి రోగం; ఏళ్ళ తరబడిగా ఉన్న జబ్బు; బాగా ముదిరిన వ్యాధి;
 • chronicle, n. చరిత్ర; కవిలె; వృత్తాంతం;
 • chronicler, n. చరిత్రకారుడు;
 • chronological, adj. తిథివారీ; చారిత్రక క్రమవారీ; అనుపూర్విక;
 • chronology, n. చారిత్రక క్రమం; తైధిక క్రమం; కాలక్రమం; అనుపూర్వికం; భూతకథానుక్రమణిక; కాలవృత్తాంతం;
 • chronometer, n. కాలమాపకం; శ్రేష్ఠమైన గడియారం;
 • chronotope, n. స్థలకాలజ్ఞత; how configurations of time and space are represented in language and discourse. The term was taken up by Russian literary scholar M.M. Bakhtin who used it as a central element in his theory of meaning in language and literature;
 • chrysalis, n. పురుగుగూడు; పిసినికాయ; గొంగళీ; పట్టుపురుగు మొ. కట్టుకునే గూడు;
 • chrysanthemum, n. చామంతి;
 • chuckle, v. i. ముసిముసి నవ్వు; చిన్నగా నవ్వు; ఇకిలించు; సకిలించు;
 • chum, n. దగ్గర స్నేహితుడు; ఆప్తుడు; దగ్గర స్నేహితురాలు; ఆప్తురాలు;
 • church, n. (1) క్రైస్తవుల సత్సంగం; క్రైస్తవుల సమావేశం; (2) క్రైస్తవుల ప్రార్ధన మందిరం; (3) క్రైస్తవ మత వ్యవస్థ యొక్క అధిష్టాన వర్గం;

---Usage Note: church, cathedral, abbey, chapel, basilica

 • ---A church is any building used exclusively to worship God in the Christian (or related) traditions. A cathedral is a church where a bishop has his seat and is the official church of his diocese. Size has nothing to do with being a cathedral. An abbey is a building that houses a monastic community of either monks or nuns. Most large monasteries have an abbey. An exception is Westminster Abbey in London, which bears the name but no longer functions as an abbey. A chapel is a smaller area in a large church that can be used for liturgical ceremonies. The best-known example is the Sistene Chapel, which houses the famous Michelangelo ceiling and the altar painting of the Last Judgment. This room is used for the election of the Pope as well as Masses and is attached to St. Peter’s Basilica. A basilica is a large building used for public gatherings.
 • churlish, adj. అమర్యాదకరమైన; మోటు;
 • churn, v. t. మథించు; చిలుకు; త్రచ్చు; కవ్వించు;
 • churner, n. కవ్వం;
 • churning, n. మథనం; చిలకడం; త్రచ్చుట; త్రచ్చడం; తిప్పడం;
  • churning rod, ph. చల్లగుంజ; కవ్వం; చిలికే కర్ర;
 • chutney, n. పచ్చడి; తొక్కు; చట్నీ;
 • chutzpah, n. (హూట్స్‌పా), మొండి ధైర్యం; తెగువ; సాహసం; చొరవ; audacity;
 • cicada, n. ఇలకోడి; చిమ్మట; ఈలపురుగు; grey cricket;
 • cide, suff. హత్య; హారి; సంహారి; ఆరి;
  • homicide, n. హత్య; మానవహత్య;
  • infanticide, n. శిశుహత్య; శిశుమేధం;
  • insecticide, n. కీటకారి;
  • matricide, n. మాతృహత్య;
  • patricide, n. పితృహత్య;
  • suicide, n. ఆత్మహత్య;
 • cider, n. కొద్దిగా పులియబెట్టిన పళ్ళరసం; ముఖ్యంగా ఏపిల్ పళ్ళ రసం;
 • cigar, n. చుట్ట; పొగచుట్ట;
 • cigarette, n. సిగరెట్టు;
 • cilantro, n. కొత్తిమిర; ధనియాల మొక్క; [bot.] Coriandrum sativum;
  • Chinese cilantro, [bot.] Allium tuberosum;
 • cilia, n. నూగు;
 • cinchona, n. సింకోనా; మలేరియాకి వాడే ఒక ఔషధం; హోమియోపతీ మందులలో వాడే ఛైనా ఈ సింకోనా నుండే చేస్తారు; [bot.] China officinalis;
 • cinder, n. దాలి; మావి పట్టిన నిప్పులు;
 • cinder pit, ph. దాలి గుంట;
 • cine, adj. చలనచిత్రాలకి సంబంధించిన; సినిమా;
 • cinema, n. చలనచిత్రం; చిత్రకథ; సినిమా; తెరాట;
  • cinema hall, ph. చిత్ర ప్రదర్శనశాల; సినిమా హాలు;
 • cinnabar, n. ఇంగిలీకం; హింగుళం; రససింధూరం; HgS;
 • cinnamon, n. దాల్చినచెక్క; లవంగపట్ట;
  • Ceylon cinnamon, ph. [bot.] Cinnamomum zeylanicum;
  • Saigon cinnamon, ph. [bot.] Cinnamomum loureirii;
  • cinnamon bark, ph. దాల్చినచెక్క;
 • cipher, n. (1) శూన్యం; సున్న; హళ్ళి; హుళక్కి; పూజ్యం; గగనం; (2) రహస్యలిపి;
  • big cipher, ph. గుండుసున్న; బండిసున్న;
 • circa, adv. సుమారుగా; ఆ రోజులలో;
A మూస:Colorboxమూస:Nbsptriangle with మూస:Colorboxమూస:Nbspincircle, incenter (I), మూస:Colorboxమూస:Nbspexcircles, excenters (JA, JB, JC).
 • circadian, adj. దైనిక; (ety.) circa + dies = సుమారుగా + రోజూ;
  • circadian rhythm, ph. దైనిక లయ; అహోరాత్ర లయ; A term derived from the Latin phrase “circa diem,” meaning “about a day”; refers to biological variations or rhythms with a cycle of approximately 24 hours;
 • circle, n. వృత్తం; వర్తులం; వలయం; చక్రం; మండలం; అల్లి; హళ్ళి;
  • circumscribed circle, ph. పరివృత్తం; బహిర్‌ వృత్తం; ఒక బహుభుజి బయట అన్ని శీర్షాలనీ స్పర్శిస్తూ ఉండగలిగే వృత్తం; An inscribed polygon is a polygon in which all vertices lie on a circle. The polygon is inscribed in the circle and the circle is circumscribed about the polygon. A circumscribed polygon is a polygon in which each side is a tangent to a circle;
  • excircle, ph. బహిర్‌ వృత్తం; ఒక త్రిభుజం బయట ఒక భుజాన్నీ, మిగిలిన రెండు భుజాల పొడుగింపులనీ స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • Great Circle, ph. [astronomy] మహావృత్తం;
  • Great Circle arc, ph. [astronomy] మహావృత్తపు చాపము;
  • incircle, ph. అంతర్‌ వృత్తం; ఒక త్రిభుజం లోపల మూడు భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • inner circle, ph. (1) అపసిద్ధ బిందువు; అంతర్‌లిఖిత వృత్తం; (2) ఆంతరంగికులు;
  • inscribed circle, ph. అంతర్‌ వృత్తం; ఒక బహుభుజి లోపల అన్ని భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • nine-point circle, ph. నవబిందు వృత్తం;
  • vicious circle, ph. విష వలయం;
 • circuit, n. (1) మండలం; పరిధి; ప్రదక్షిణం; (2) ఆవృత్తం; పరీవాహం; పరిపథం; జాలం; వలయం; see also network;
  • electrical circuit, ph. విద్యుత్ పరీవాహం; విద్యుత్ వలయం;
 • circuitous, adj. డొంకతిరుగుడు; చుట్టుతిరుగుడు;
 • circular, adj. (సర్క్యులార్) గుండ్రని; వృత్తాకారమైన; వర్తులాకారమైన; చక్రీయ; వట్రువ; బటువు;
 • circular, n. (సర్క్యులర్) కరపత్రం; తాకీదు; వర్తులం; వర్తుల లేఖ;
 • circulate, v. t. తిప్పు; నలుగురికీ చూపించు; చేతులు మార్చు;
 • circulating, adj. వ్యావర్తక;
 • circulation, n. (1) ప్రసరణ; (2) చలామణి; చెల్లుబడి;
  • blood circulation, ph. రక్త ప్రసరణ;
  • in widespread circulation, ph. బాగా చలామణీలో ఉంది;
 • circulator, n. పంకా; విసనకర్ర; సురటి;
 • circum, pref. ప్ర; పరి;
 • circumambulation, n. ప్రదక్షిణం; చుట్టూ తిరగడం;
 • circumcised, n. సున్నతుడు;
 • circumcision, n. సున్నతి; సుంతీ; (ant,) uncircumcised = అసున్నతులు;
 • circumference, n. పరిధి; చుట్టుకొలత; కైవారం;
 • circumpolar, adj. ప్రరిధ్రువ;
 • circumpolar stars, ph. ప్రరిధ్రువ తారలు; ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణం చేసే తారలు;
 • circumradius, n. బాహ్య వ్యాసార్ధం; the radius of a circle (sphere) drawn outside a polygon (polyhedron) while touching all the vertices;
 • circumspection, n. జాగరూకత; అప్రమత్తత;
 • circumstance, n. పరిస్థితి; స్థితిగతి;
 • circumstantial, adj. స్థితిగత్యానుసార; అప్రత్యక్ష; పరిస్థితిసంబంధ; సంభవాత్మక; ప్రాసంగిక;
 • circumstantial evidence, ph. స్థితిగత్యానుసార ప్రమాణం; ఉత్తరోత్తర ఆధారాలు; సంభవాత్మక ప్రమాణం; ప్రాసంగిక ప్రమాణం;
 • circumterestrial, adj. పరిభౌమిక; భూమి చుట్టూ;
 • circumvent, v. t. దాటిపోవు; దాటు;
 • cirrhosis, n. అవయవములు గట్టిపడి పరిమాణం తగ్గుట;
  • cirrhosis of the liver, ph. కాలేయం గట్టిపడడమనే ఒక వ్యాధి; జలోదరం;
 • cis, adj. pref. [chem.] గ్రహణ; పక్కగా; see also trans;
 • cis fat, ph. [chem.] ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఒక పక్కనే గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు వంకరగాఉంటుంది;
 • cistern, n. కుండీ; గోలెం; తొట్టి; బాన;
నల్లేరు
 • cissus, n. నల్లేరు; [bot.] Cissus quadrangularis;
 • citadel, n. దుర్గం; కోట;
 • citation, n. (1) చేసిన తప్పుని చూపి జరిమానా వెయ్యడం; (2) ఉపప్రమాణం; ఒకరు చేసిన మంచి పనులని ఎత్తి చూపి సత్కరించడం; (3) ఒకరి రచనలని ఎత్తి చూపి ఉదహరించడం;
 • cite, v. t. ఉదహరించు; చూపించు; ఎత్తి చూపు;
 • citron, n. మాదీఫలం; దబ్బపండు;
 • citizen, n. m. పౌరుడు;
 • citizenship, n. పౌరసత్వం;
 • citric acid, n. పండ్లలో ఉండే ఒక ఆమ్లం; తెల్లటి, పుల్లటి చూర్ణం; C6H8O7:H2O;
 • citrus, adj. నిమ్మ;
 • citrus canker, ph. నిమ్మగజ్జి తెగులు;
 • city, n. నగరం; పట్టణం; పురం; ప్రోలు; మహానగరం; బస్తీ; పెద్ద ఊరు;
 • civet, n. జవాది; జవాది పిల్లి మర్మస్థానాల నుండి స్రవించే తేనె వంటి పదార్థం; దీన్ని సెంట్లు, అత్తరులలో వాడతారు;
 • civet cat, n. జవాది పిల్లి; పునుగు పిల్లి; పునుగు; బూతపిల్లి; కమ్మపిల్లి; గంధ మృగం; గంధ మార్జాలం; మార్జారిక; ఆఫ్రికా, ఇండియా, మలేసియా దేశాలలో నివసించే ఒక మాంసాహారి;
civitone=జవాది నిర్మాణ క్రమం
 • civetone, n. జవాది; జవ్వాది; సంకు; పునుగు పిల్లుల శరీరం నుండి స్రవించే కొవ్వు వంటి మదజలం [see also musk];
 • civic, adj. విద్యుక్త; పురజన; పౌర;
  • civic duty, ph. విద్యుక్త ధర్మం;
  • civic reception, ph. పౌరసన్మానం;
  • civic responsibility, ph. విద్యుక్త ధర్మం;
  • civic sense, ph. పౌరకర్తవ్య భావన;
  • civic society, ph. పుర సంఘం; పౌర సంఘం;
 • civil, adj. (1) నాగరిక; సభ్య; (2) పౌర; షవన; (3) దివానీ; సర్కారీ; ధనోద్భవ; (ant.) criminal; military; religious;
  • civil code, ph. పౌర స్మృతి;
  • civil engineering, ph. సర్కారీ స్థాపత్యశాస్త్రం; పౌర స్థాపత్యశాస్త్రం;
  • uniform civil code, ph. ఉమ్మడి పౌర స్మృతి;
  • civil court, ph. దివానీ అదాలతు;
  • civil day, ph. షవన దినం;
  • civil supplies, ph. పౌర సరఫరాలు; సర్కారీ సరఫరాలు;
  • civil war, ph. అంతర్ కలహం; అంతర్ యుద్ధం;
  • civil disobedience, ph. సత్యాగ్రహం; శాసనోల్లంఘనం;
 • civilian, adj. లౌక్య;
  • civilian dress, ph. లౌక్య వేషం;
 • civility, n. నాగరికత; సభ్యత; మర్యాద;
 • civilization, civilisation (Br.), n. నాగరికత; సభ్యత;
 • clad, adj. ధరించిన; తొడుక్కున్న; పరివేష్టితమైన;
 • claim, n. హక్కు; అర్హత; స్వత్వం; విల్లంగం;
 • claim, v. i. తనకు రావలసినదాని కొరకు పోరాడు; దావా వేయు;
 • clairvoyance, n. దివ్యదృష్టి; యోగదృష్టి; కంటికి ఎదురుగా కనిపించని వస్తువులని చూడగలిగే దివ్య శక్తి;
 • clamor, n. సద్దు; సందడి;
 • clamp, n. బందు; బిగించు సాధనం;
 • clan, n. కులం; జాతి; వర్గం;
 • clandestine, adj. లోపాయకారీ; రహస్యమయిన;
 • clarification, n. విశదీకరణ; స్పష్టీకరణ; వివరణ;
 • clarify, v. t. విశదీకరించు; స్పష్టం చేయు; స్పష్టపరచు; వివరించు;
 • clarity, n. స్పష్టత; సుబోధకత; తెరిపి; వ్యక్తత;
 • clarified, adj. తేటపరచిన; శుద్ధి అయిన;
  • clarified butter, ph. నెయ్యి; ఘృతం; ఆజ్యం; హవిస్; శుద్ధి చెయ్యబడ్డ వెన్న;
 • clash, v. i. డీకొట్టుకొను; వికటించు;
 • class, n. (1) తరగతి; (2) వర్ణం; (3) వర్గం; తెగ; కులం; జాతి; తరం; see also caste; (4) తరగతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు మూడవ వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom, phylum, class, order, family, genus, and species;
  • labor class, ph. శ్రామిక వర్గం;
  • ruled class, ph. పాలిత వర్గం;
  • ruling class, ph. పాలక వర్గం;
  • class conflict, ph. వర్గ వైరం;
  • class struggle, ph. వర్గ సంఘర్షణ;
 • classical, adj. శాస్త్రీయ; సనాతన; సంప్రదాయిక; (ety.) belonging to the upper and ruling classes;
  • classical literature, ph. సంప్రదాయిక సాహిత్యం; ప్రాచీన సాహిత్యం; (ant.) modern literature;
  • classical mechanics, ph. సంప్రదాయిక యంత్రశాస్త్రం; (rel.) quantum mechanics;
  • classical music, ph. శాస్త్రీయ సంగీతం; (ant.) light music;
 • classics, n. pl. సనాతన గ్రంథాలు; ప్రామాణిక గ్రంథాలు; గణనీయ గ్రంథాలు; శ్రేష్ఠసాహిత్యం;
 • classification, n. వర్గీకరణం; తరీకరణం;
  • natural classification, ph. స్వాభావిక వర్గీకరణం;
 • classified, adj. (1) తరంవారీ; వర్గీకృత; తరగతులుగా విడగొట్టబడిన; (2) రహస్యంగా ఉంచవలసిన; బహిరంగపరచకుండా ఉంచవలసిన;
  • classified advertisements, ph. తరంవారీ ప్రకటనలు; వర్గీకృత ప్రకటనలు;
  • classified research, ph. వర్గీకృత పరిశోధన; రహస్యంగా ఉంచవలసిన శాస్త్రీయ పరిశోధన;
 • classifier, n. తరందారు; తరగతులుగా విడగొట్టునది;
 • classify, n. వర్గీకరించు; తరగతులుగా విభజించు;
 • clause, n. ఉపవాక్యం;
  • main clause, ph. ప్రధాన ఉపవాక్యం;
 • clavicle, n. జత్రువు; కంటియెముక; మెడయెముక; collar bone;
 • claw, n. (1) పక్షిగోరు, పులిగోరు, పిల్లిగోరు; పంజా; (2) డెక్క; గిట్ట; (3) పట్టుకొమ్ము; సుత్తిలో మేకులని ఊడబెరికే కొస;
 • clay, n. బంకమన్ను; బంకమట్టి; రేగడిమన్ను; మృత్తిక;
  • white clay, ph. పాలమన్ను; సుద్ద; నాము; ధవళ మృత్తిక;
 • clear, adj. (1) స్పష్టమైన; స్ఫుటమైన; విశదమైన; స్వచ్ఛమైన; (2) తెరిపి; మబ్బు లేకుండా; నిర్మల; స్వచ్ఛ;
 • clear, n. కళంకం లేని స్థితి; స్పుటం;
 • clear, v. t. ఖాళీ చేయు;
 • clearly, adv. విదితముగా; విశదంగా; స్పష్టంగా;
 • clean, adj. (1) శుభ్రమైన; శుచియైన; మృష్ట; (2) నున్ననైన; బోడి;
 • clean, v. t. (1) శుభ్రం చేయు; శుభ్రపరచు; (2) నున్నగా చేయు;
 • clean, n. శుభ్రం; నిర్మలం;
  • cleaning paste, ph. ధావన ఖమీరం;
  • cleaning powder, ph. ధావన చూర్ణం;
 • cleanliness, n. శుచి; శుభ్రం; శౌచం; శుభ్రత; నైర్మల్యం; నిర్మలత;
 • clean-shaven head, n. బోడిగుండు;
 • cleansing, n. ప్రక్షాళన;
 • clear, v. t. శుభ్రం చేయు; తుడిచి వేయు; చెరుపు; చెరిపివేయు;
 • clear, adj. తేరిన; తేట తేరిన; నిర్మలమైన;
  • clear fluid, n. తేట; తేట తేరిన ద్రవం;
 • clearing nut, n. ఇండుప గింజ; చిల్ల గింజ; అందుగు గింజ;
 • cleavage, n. (1) చీలిక; (2) ఆడదాని చన్నుల మధ్యనున్న చీలిక వంటి స్థలం;
 • cleave, v. t. పగలదీయు; విడదీయు;
 • cleft lip, ph. గ్రహణపు మొర్రి; తొర్రి;
  • cleft palate, ph. అంగుట్లో ఉన్న మొర్రి;
 • clemency, n. దయాభిక్ష; కనికరించి క్షమించడం;
 • clepsydra, n. నీటిగడియారం;
 • clergyman, n. క్రైస్తవుల చర్చిలో పురోహితుని వంటి మతాధికారి;
 • clerical error, ph. హస్తదోషం; చేతప్పు; రాతలో జరిగిన తప్పు;
 • clerk, n. గుమస్తా; ముసద్దీ; రాసేవాడు; లేఖరి;
 • clerkship, n. రాయసం; రాతకోతలు నేర్చుకునే దశ;
 • cleverness, n. వైదగ్ధ్యం; విదగ్ధత; నేర్పరితనం; నేర్పు; చాతుర్యం;
 • client, n. కాతాదారు; కక్షదారు;
 • climate, n. (1) సదావరణం; ఒక ప్రదేశంలో దీర్ఘకాల సగటు పరిస్థితులు – అంటే దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఉండే పరిస్థితులని వర్ణించడానికి వాడతారు. “దీర్ఘకాలం” అంటే కనీసం 30 సంవత్సరాలు ఉండాలని ఒక ఒప్పందం ఉంది; (2) వాతావరణం; (3) శీతోష్ణస్థితి; ఇది వాతావరణం యొక్క పరిస్థితిని (state of the atmosphere) వర్ణించే మాట. తరుణకాల శీతోష్ణస్థితి అంటే వెదర్, దీర్ఘకాల శీతోష్ణస్థితి అంటే క్లయిమేట్ అని వివరణ చెప్పవచ్చు; (rel.) weather;
  • desert climate, ph. ఎడారి వాతావరణం; ఎడారి సదావరణం;
  • Mediterranean climate, ph. మధ్యధరా వాతావరణం; మధ్యధరా సదావరణం;
  • political climate, ph. రాజకీయ వాతావరణం;
 • climax, n. పరాకాష్ఠ; పతాక సన్నివేశం; బిగి; రసకందాయం;
 • climb, v. i. ఎక్కు; అధిరోహించు; ఆరోహించు;
 • clinch, v. t. తేల్చు;
 • cling, v. i. పట్టుకుని వేలాడు; కరచి పట్టుకొను;
 • clinic, n. (1) ఆరోగ్యశాల; వైద్యశాల; వైద్యాలయం; భేషజ శాల; ప్రజలకి వైద్య సహాయం దొరికే స్థలం; ఆసుపత్రి అంటే ఉపతాపిని 24 గంటలు పర్యవేక్షణలో ఉంచి చూడడానికి అనువైన స్థలం;(2) ఒక నిర్ధిష్టమైన పనిని సమర్ధవంతంగా చెయ్యడానికి కొంతమంది ఉమ్మడిగా సమావేశమయే ప్రదేశం; ఉ. టెన్నిస్ క్లినిక్ అంటే టెన్నిస్ ఆడడంలో చేసే తప్పులని సవరించుకోడానికి సమావేశమయే ఆట స్థలం;
 • clip, v. t. కత్తిరించు;
 • clip, n. కత్తిరించిన భాగం;
  • clip art, ph. అతకడానికి వీలైన చిన్న చిన్న బొమ్మలు;
 • clique, n. సన్నిహితుల గుంపు; ఇతరులని చేరనీయని సన్నిహితుల గుంపు;
 • clitoris, n. భగలింగం;
 • cloak, n. కండువా వంటి బట్ట; మెడ దగ్గర ముడికట్టి వెనకకి జారవిడచే వం;
 • clock, n. గడియారం; గంటల గడియారం; పెద్ద గడియారం; ఘడి; ఘటీకారం;
 • clockwise, adj. అనుఘడి; దక్షిణావర్త; ప్రదక్షిణ; అవిలోమ;
  • clockwise direction, ph. అనుఘడి దిశ; దక్షిణావర్త; దిశ; సవ్య దిశ; ప్రదక్షిణ దిశ; (ant.) anticlockwise;
 • clockwork, n. ఘటీయంత్రాంగం; ఘటీయంత్రం;
 • clod, n. గర; గడ్డ;
 • close, adj. దగ్గర; సన్నిహిత; సమీప;
  • close relative, ph. దగ్గర బంధువు; సన్నిహిత బంధువు;
 • close, v. t. మూతవేయు; మూయు; మూసివేయు; మోడ్చు; ముకుళించు; నిమీలించు;
 • closed, adj. మూతవేసిన; మూసిన; మూతపడ్డ; మూయబడ్డ; మోడ్చిన; ముకుళించిన; సంవృత; ఆవృత; నిమీలిత;
  • closed system, ph. సంవృత వ్యవస్థ;
  • half closed, ph. అరమోడ్చిన; అర్ధ నిమీలిత; అర్ధ సంవృత;
 • closet, n. చిన్న గది; కొట్టు; కొట్టుగది; అర;
 • closure, n. సమాపకం; సంవృతం; వివారం; సమాప్తి; మూసివేత;
 • clot, n. గడ్డ; దొబ్బ;
  • blood clot, ph. రక్తపు కదుం; గడ్డకట్టిన రక్తం; దొబ్బ;
 • clot, v. i. పేరుకొను; గడ్డకట్టు; గరకట్టు;
 • clotting, n. పేరుకొనుట; గడ్డకట్టుట; గడ్డకట్టడం;
 • cloth, n. (క్లాత్) బట్ట; గుడ్డ; వలువ; చేలం; వస్త్రం;
  • muslin cloth, ph. ఉలిపిరి బట్ట;
 • cloths, n. pl. (క్లాత్స్) గుడ్డ ముక్కలు;

---Usage Note: cloth, fabric

 • ---Use cloth as an uncountable noun to talk about the cotton, wool, etc. that is used to make clothes. Fabric can be countable or uncountable, and can be used about things other than clothes.
 • clothe, v. t. (క్లోద్) దుస్తులు తొడుగు; బట్టలు వేయు;
 • clothed, adj. సచేల; దుస్తులతో ఉన్న; బట్టలు కట్టుకున్న;
 • clothes, n. pl. దుస్తులు; కుట్టిన బట్టలు;
 • clothesline, n. దండెం; బట్టలు ఆరవేసుకొనే తాడు;
cumulus clouds=పుంజ మేఘములు
 • cloud, n. మేఘం; మబ్బు; మొగులు; మొయిలు; ఖచరం; అభ్రం; పయోధరం; ఘనం; జీమూతం; జలధరం; అంబుడము;
  • altostratus cloud, ph. మధ్యమ స్తార మేఘం;
  • altocumulus cloud, ph. మధ్యమ పుంజ మేఘం;
  • cirrocumulus cloud, ph. అలకా పుంజ మేఘం;
  • cirrus cloud, ph. అలకా మేఘం;
  • cumulus cloud, ph. పుంజ మేఘం; సమాచి మేఘం;
  • cumulonimbus cloud, ph. పుంజ వృష్టిక మేఘం;
  • dark cloud, ph. కారుమేఘం;
  • nimbus cloud, ph. వృష్టిక మేఘం;
  • stratocumulus cloud, ph. స్తారపుంజ మేఘం;
  • stratus cloud, ph. స్తార మేఘం;
  • thunder cloud, ph. పర్జన్యం;
  • rain cloud, ph. అభ్రం;
  • cloud chamber, ph. [phy.] జీమూత కోష్ఠిక; భౌతిక శాస్త్ర పరిశోధనలో వాడే ఒక ఉపకరణం;
 • cloudy, adv. మబ్బుగా; మసకగా; మెయిలుగా; ముసాబుగా; మొగులుగా;
 • clove, n. పాయ; చీలిక; తొన; తునక;
 • clover, n. గడ్డి మైదానాలలో పెరిగే ఒక జాతి కలుపు మొక్క;
 • cloves, n. pl. లవంగాలు; లవంగపు చెట్టు యొక్క ఎండిన మొగ్గలు; దేవకుసుమం; కరంబువు; [bot.] Eugenia caryophyllata;
 • clown, n. m. విదూషకుడు; కోణంగి; గంథోళిగాడు; హాస్యగాడు;
 • clue, n. ఆధారం; ఆచూకీ; ఆరా; జాడ; పత్తా; కిటుకు; సవ్వడి;
 • clownish, adj. వెకిలి;
 • club, n. (1) కర్ర; దుడ్డు కర్ర; (2) సంఘం; జట్టు;
 • club, v. t (1) కర్రతో కొట్టు; బాధు; (2) జోడించు;
 • clubs, n. కళావరు; (ety.) clover shaped;
 • clumsy, adj. వికృత; వికార; నేర్పులేని;
 • cluster, n. (1) గుంపు; గుచ్ఛం; రాశి; వితతి; గమి; (2) సంయుక్తాక్షరం; (3) గెల; అత్తం; గుత్తి; చీపు;
  • cluster beans, n. గోరుచిక్కుడు;
 • clutch, n. (1) పట్టెడు; (2) పట్టు;
  • a clutch of mosquito eggs, ph. ఒక పట్టెడు దోమ గుడ్లు;
 • clutch, v. t. పట్టుకొను;

Part 3: cm-cz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • co-, pref. తోటి; జంట; యుగళ;
 • co-ordinates, n. తోటి అక్షములు; నిరూపకములు;
 • coach, n. (1) బండి; శకటం; (2) శిక్షకుడు; తరిఫీదు ఇచ్చే మనిషి;
 • coagulate, v. i. పేరుకొను; గడ్డకట్టు; గట్టిపడు; చిక్కపడు;
 • coagulation, n. స్కందనము; గడ్డకట్టుట;
 • coal, n. రాక్షసిబొగ్గు; నేలబొగ్గు; రాతిబొగ్గు; గనిబొగ్గు; శిలాంగారం; రాక్షసాంగారం;
  • coal gas, ph. అంగార వాయువు;
  • coal tar, ph. తారు; వాడకీలు;
 • Coal Sacs, n. [astro.] శ్యామ సీమలు; మిల్కీవే గేలక్సీలో నల్లటి భాగాలు;
 • coarse, adj. స్థూలమైన; ముతక; ముదుక; కోరా; అనణువైన; మోటు; మడ్డి; గరుకు; బరక;
  • coarse language, ph. మోటు భాష;
  • coarse paper, ph. ముతక కాగితం; మడ్డి కాగితం; గరుకు కాగితం;
  • coarse silver, ph. మట్ట వెండి;
  • coarse sugar, ph. బెల్లం;
 • coast, n. కోస్తా; సముద్రతీరం; కరసీమ;
 • coastal, adj. కోస్తా; సాగర; వేలా; కరసీమ;
  • coastal country, ph. సాగర సీమ; కరసీమ;
  • coastal dialect, ph. కరసీమ మాండలికం;
  • coastal districts, ph. కోస్తా జిల్లాలు;
 • coat, n. (1) కోటు; (2) కళాయి; పూత; పొర;
  • long coat, ph. అంగరకా;
 • coating, n. పూత; గార; కళాయి; పోసనం; పోష్;
  • gold coating, ph. జల పోసనం; జర పోసనం; బంగారు పూత;
 • coax, v. t. లాలించు; బెల్లించు; ఒప్పించు; పుసలాయించు;
 • coaxial, adj. ఏకాక్షక; సమాక్షక; సహాక్షక;
 • Cobalt, n. మణిశిల; నల్లకావి రాయి; గనిజం; కోబాల్టు; ఒక రసాయన (అణుసంఖ్య 27, సంక్షిప్త నామం, Co.); మూలకం; [Gr. cobalo = mine];
 • cobbler, n. మాదిగ; చెప్పులు కుట్టేవాడు;
 • cobra, n. నాగుపాము; తాచు పాము;
  • king cobra, ph. రాజనాగు; కాళనాగు;
 • cobweb, n. సాలెపట్టు; సాలెగూడు; దూగరం; ధుంధుమారం;
కోకా మొక్క
 • coca, n. కోకా; ఈ తుప్ప ఆకులలో 14 రకాలైన ఔషధాలు ఉన్నాయి; ఈ ఔషధాలలో ముఖ్యమైనది కోకెయిన్; దక్షిణ అమెరికాలోని ఇండియన్లు ఈ ఆకులని తమలపాకులలా వాడతారు. ఈ ఆకులకి సున్నం రాసుకుని తింటే కొద్దిగా నిషా ఎక్కుతుంది; సా. శ. 1885 లగాయతు 1905 వరకు కోకా-కోలా కంపెనీ ఈ ఆకులనుండి కొన్ని రసాయనాలని సంగ్రహించి వారి పానీయాలలో వాడేవారు;
 • cocaine, n. కొకెయిన్; (1) స్థానికంగా నొప్పి తెలియకుండా చెయ్యడానికి వాడే ఒక మందు; (2) తెల్లటి గుండ రూపంలో దొరికే ఈ మందుని దురలవాటుగా, ముక్కుపొడుంలా వాడి, దుర్వినియోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది;
 • coccyx, n. ముడ్డిపూస; అనుత్రికం; త్రోటిక; గుదాస్థి;
 • cock, n. m. కోడిపుంజు; కుక్కుటం; f. hen;
  • cock and bull stories, ph. బూటకపు కథలు; కల్లబొల్లి మాటలు;
 • cockatoo, n. కాకతువ్వ; చిలకని పోలిన దక్షిణ అమెరికా పక్షి;
 • cockroach, n. బొద్దింక;
 • coconut, adj. కొబ్బరి; నారికేళ;
  • coconut fiber, ph. కొబ్బరి పీచు;
  • coconut fiber rope, ph. నులక; చాంతాడు; కొబ్బరి తాడు;
  • coconut fruit, ph. కొబ్బరి కాయ;
  • coconut gratings, ph. కొబ్బరి కోరు;
  • coconut juice, ph. కొబ్బరి పాలు; కొబ్బరి ముక్కలని పిండగా వచ్చే తెల్లటి పాలు;
  • coconut meat, ph. కొబ్బరి;
  • coconut milk, ph. కొబ్బరి నీళ్లు; కొబ్బరి కాయలో ఉండే నీళ్ళు;
  • coconut palm, ph. కొబ్బరి చెట్టు;
  • coconut tree, ph. కొబ్బరి చెట్టు;
 • coconut, n. కొబ్బరికాయ; టెంకాయ; నారికేళం;
  • grated coconut, ph. కోరిన కొబ్బరి; కొబ్బరి కోరు;
 • cod, n. గండుమీను;
 • code, n. (1) ధర్మశాస్త్రం; స్మృతి; సంహిత; (2) ఏర్పాటు; నియమం; నియమావళి; (3) రహస్యలిపి; గుర్తు; సంక్షిప్తం; కోడు; (4) కంప్యూటరులో వాడే క్రమణిక లేక ప్రోగ్రాము;
  • code of conduct, ph. ధర్మ సంహితం; ప్రవర్తన నియమావళి;
  • code of justice, ph. ధర్మ శాస్త్రం;
  • code name, ph. రహస్య నామం;
 • codicil, n. వీలునామాకి అనుబంధించిన తాజా కలం;
 • codify, v. t. సూత్రీకరించు;
 • coding, v. t. (1) రహస్యలిపిలో రాయడం; సంక్షిప్తంగా రాయడం; (2) కంప్యూటరు ప్రోగ్రాము రాయడం;
 • co-eds, n.pl. f. సహపాఠులు; తరగతిలో ఉండే అమ్మాయిలు;
 • coefficient, n. [math.] గుణకం; ఒక గణిత సమీకరణంలో చలన రాసులని గుణించే ఒక గుణకం; ఉదాహరణకి అనే సమీకరణంలో 7 నీ, -3 నీ గుణకాలు అంటారు, 1.5 ని స్థిరాంకం అంటారు; కాని అనే సమీకరణంలో "a," "b," "c" లని పరామీటర్లు (parameters) అంటారు;
  • coefficient of absorption, ph. శోషణ గుణకం;
  • coefficient of diffusion, ph. విసరణ గుణకం; ఒక నిర్దిష్ట కాల పరిమితి (ఉ. సెకండు) లో ఒక పదార్థం ఎంత ప్రాంతం లోకి వ్యాప్తి చెందుతుందో చెప్పే సంఖ్య;
  • coefficient of viscosity, ph. స్నిగ్ధతా గుణకం; చిక్కదనాన్ని తెలిపే గుణకం; నీటి చిక్కదనం 1 అనుకుంటే ఆముదం చిక్కదనం 1 కంటె ఎక్కువ ఉంటుంది, తేనె చిక్కదనం ఇంకా ఎక్కువ ఉంటుంది;
 • coerce, v. t. జులుం చేయు; బలవంతం చేయు; మొహమాటం పెట్టు;
 • coercion, n. జులుం; బలవంతం; బలాత్కారం; మొహమాటం;
 • coffee, n. కాఫీ;
  • coffee beans, ph. కాఫీ గింజలు;
  • coffee powder, ph. కాఫీ గుండ; కాఫీ పొడి;
 • coffin, n. శవపేటిక;
 • cog, n. పళ్ళ చక్రంలో పన్ను;
 • cogitations, n. ఆలోచనలు; దీర్ఘాలోచనలు;
 • cognac, n. (కోన్యాక్‍), ప్రాంసు దేశంలో, కోన్యాక్‍ అనే ప్రాంతంలో తయారయే బ్రాందీ;
 • cognate, adj. [ling.] సజాతీయ; జ్ఞాతి; సవర్ణ; సహజాత; సోదర;
 • cognitive, adj. ఎరుక; అభిజ్ఞ
  • cognitive cataclysm, ph. అభిజ్ఞాత ఉత్పాతం; ఎరుకలో ఉత్పాతం; ఎరుకలో ప్రళయం;
  • cognitive disorder, ph. ఎరుక లేమి;
 • cognizable, adj. [legal] న్యాయస్థానంలో హాజరు పరచగలిగేటటువంటి అనే జ్ఞానం కల; నేరముగా గుర్తించబడ్డ;
  • cognizable offense, ph. [legal] న్యాయస్థానంలో హాజరు కావలసినటువంటి నేరం; నేరముగా గుర్తించబడ్డది; cognizable offence అంటే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, పోలీసులు సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించాలి.
 • cognizance, n. ఎరుక; తెలుసుకోవడం; జ్ఞానం:
 • cohabitation, n. సహవాసం; సహనివాసం;
 • coherent, adj. సంబద్ధం; సంగతం; పొంత; పొందిక; పొత్తు; సామరస్యం;
  • coherent light, ph. పొంత కాంతి;
 • cohesive, adj. సంలగ్న;
 • coiffure, n. కొప్పు; కొప్పు ముడి; కేశాలంకారం; ముడి; మూల; ధమ్మిల్లం;
 • coil, n. కుండలి; చుట్ట; తీగ చుట్ట;
  • coil of wire, ph. తీగ చుట్ట;
 • coil, v. t. చుట్టు;
 • coin, n. నాణెం; బిళ్ల; రూప్యం;
  • gold coin, ph. గద్యాణం; మాడ;
  • minted coin, ph. రూప్యం;
  • rupee coin, ph. రూపాయి; రూపాయి కాసు; రూపాయి బిళ్ల;
  • silver coin, ph. రూక;
 • coin, v. t. తయారుచేయు; ప్రయోగించు;
 • coincidence, n. కాకతాళీయం; యాదృచ్ఛికం; అవితర్కిత సంభవం; సంపాతం;
 • coitus, n. రతి; సంభోగం; స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంయోగం;
 • colander, n. చాలని; కర్కరి; సిబ్బితట్ట; వంటకాలలోని నీటిని బయట పారబోయడానికి వాడే చిల్లుల పాత్ర;
 • cold, adj. (1) చల్లనైన; శీతల; (2) కఠినమైన;
  • cold-blooded, ph. (1) అతి ఘోరమైన; అమానుషమైన; (2) శీతల రక్తపు;
  • cold-blooded animals, ph. బయట ఉండే శీతోష్ణతలతో శరీరం ఉష్ణోగ్రత మారే జంతుజాలం;
  • cold-eyed, ph. శీత కన్ను; unfriendly or not showing emotion; ex: she gave him a cold-eyed stare;
  • cold-pressed oil, ph. గానుగలో ఆడించిన నూనె;
  • cold shoulder, ph. అనాదరణ;
 • cold, n. (1) చలి; శీతలం; (ant.) warmth; (2) జలుబు; పడిశం; రొంప; పీనసం; (3) శీతం; (ant.) heat;
 • colic, n. శూల; కడుపులో తీవ్రంగా వచ్చే నొప్పి; (note) పసిపిల్లలు పాలు తాగిన తరువాత త్రేనుపు చెయ్యకపోతే పాలతో మింగిన గాలి కడుపులో చిక్కుపడి ఈ రకం నొప్పిని కలుగజేస్తుంది;
 • collaborate, v. i. సహకరించు; కలసి పనిచేయు;
 • collaboration, n. సహకారం;
 • collaborator, n. సహకారి;
 • collapse, v. i. కూలు; కుదేలు అగు; (ety.) In playing card games, Indians use a term called కుందేలు, which is a step below బేస్తు; because బేస్తు means a marginal win, కుదేలు, probably a distortion of కుందేలు, means total loss or collapse of the bet;
  • collapsed star, ph. కూలిన తార; నల్ల నక్షత్రం; కాల రంధ్రం;
 • collar, n. కంటె; పొన్ను; నేమి;
  • metal collar, ph. పొన్ను;
  • collar around the circumference of a wheel, ph. నేమి;
  • collar bone, ph. కంటె ఎముక;
 • collate, v. i. పుటల వారీగా పత్రాలని అమర్చడం;
 • collateral, adj. అనుషంగిక; పక్కగా జరిగిన;
  • collateral agreement, ph. అనుషంగిక ఒడంబడిక;
  • collateral damage, ph. అనుషంగిక నష్టం; అనుషంగిక హాని; అనుకున్నదానికే కాకుండా చుట్టుప్రక్కల వాటికి దెబ్బతగలడం;
  • collateral evidence, ph. అనుషంగిక సాక్ష్యం;
 • collateral, n. తాకట్టు పెట్టిన వస్తువ;
 • colleagues, n. pl. సహోద్యోగులు; ఒకే చోట పనిచేసే వ్యక్తులు;
 • collect, v. t. దండు; పోగుచేయు; కూడబెట్టు; వసూలుచేయు; సేకరించు; సమాహరించు;
 • collection, n. (1) పోగయినది; వసూళ్లు; వసూలు చేసినది; సేకరించినది; జమా; (2) సంహితం; సమాహారం; (3) సమితి; సముదాయం; పటలం; పటలి; ఝాటం; వారం; తతి; కురుంబం; కూటమి; కూటువ;
 • collection box, ph. హుండీ;
 • collections, n. pl. వసూళ్ళు; పోగయిన మొత్తం; వసూలు చేసినది; సేకరించినది;
 • collective, adj. సామూహిక; సమూహ; సమష్టి; సాముదాయిక; మూకుమ్మడి; బహుగత;
 • collectively, adv. సామూహికంగా; సమష్టిగా; సాముదాయికంగా;
 • collector, n. దండుదారు; సేకర్త; కలెక్టరు;
 • college, n. కళాశాల; కాలేజీ;
 • collide, v. i. ఢీకొను; గుద్దుకొను; సంఘర్షించు;
 • collision, n. అభిఘాతం; సంఘర్షణ; సంఘాతం; గుద్దుకోవడం; ఢీకొనడం;
  • elastic collision, ph. స్థితిస్థాపక సంఘాతం; ఈ రకం సంఘాతంలో పతన పదార్థాల (incident objects) మొత్తం గతిజ శక్తి క్షీణించకుండా పరావర్తన పదార్థాల మొత్తం గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An elastic collision is a collision in which there is no net loss in kinetic energy in the system as a result of the collision. Both momentum and kinetic energy are conserved quantities in elastic collisions. Suppose two similar trolleys are traveling toward each other with equal speed. They collide, bouncing off each other with no loss in speed. This collision is perfectly elastic because no energy has been lost.
  • inelastic collision, ph. ఘన సంఘాతం; కేరం బల్ల మీద పిక్కలు గుద్దుకున్నప్పుడు ఈ రకం సంఘాతం; జరుగుతుంది; ఈ రకం సంఘాతంలో పతన పదార్థాల మొత్తం గతిజ శక్తిలో సింహ భాగం క్షీణించి, మిగిలినది పరావర్తన పదార్థాల గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An inelastic collision is a collision in which there is a loss of kinetic energy. While momentum of the system is conserved in an inelastic collision, kinetic energy is not. This is because some kinetic energy had been transferred to something else. Thermal energy, sound energy, and material deformation are likely culprits. Suppose two similar trolleys are traveling towards each other. They collide, but because the trolleys are equipped with magnetic couplers they join together in the collision and become one connected mass. This type of collision is perfectly inelastic because the maximum possible kinetic energy has been lost. This doesn't mean that the final kinetic energy is necessarily zero; momentum must still be conserved.
 • colloid, n. జిగార్ధం; జిగురువంటి పదార్థం; శ్లేషాభం; కాంజికాభం; see also gel;
 • colloidal, adj. జిగార్ధ; బంధక; కాంజికాభ;
  • colloidal clay, ph. జిగార్ధ మృత్తికం; బంధక మృత్తికం;
 • colloquial, adj. వ్యావహారిక; ప్రచలిత; సంభాషణలో వాడే;
 • collusion, n. లాలూచీ; గూడుపుఠానీ; కుట్ర; లోపాయకారీ; రహశ్య ఒప్పందం; కుమ్మక్కు;
 • collyrium, n. సురుమా; కాటుక రూపంలో కళ్లకి పెట్టుకునే మందు;
 • colon, n. (1) పెద్దపేగు; బృహదాంత్రం; (2) అటకా; న్యూన బిందువు; వాక్యంలో విరామ చిహ్నం;
 • colonel, n. (కర్నెల్), సైన్యంలో లుటునెంట్ (లెఫ్టినెంట్) పై అధికారి;
 • colony, n. (1) సహనివేశం; (2) వలస రాజ్యం;
  • ant colony, ph. చీమల సహనివేశం;
 • colophon, n. గద్య; శతకం చివర కాని, ఒక అధ్యాయం చివర కాని గ్రంథకర్త తన గురించి తెలిపే వాక్య సముదాయం; గ్రంథం చివరిలో ఉపసంహారము, మలిపలుకు, చివరిమాట, భరతవాక్యం, epilogue, colophon, వీటిని ఉత్తర పీఠిక అంటారు;
 • color, colour (Br.), n. రంగు; వర్ణం; రాగం; కాంతి కిరణం యొక్క పౌనఃపున్యం;
  • fast color, ph. పక్కా రంగు;
  • fugitive color, ph. కచ్చా రంగు;
  • light color, ph. లేత రంగు;
  • magenta color, ph. బచ్చలిపండు రంగు;
  • mordant color, ph. కసటు రంగు;
  • saffron color, ph. చెంగావి;
  • multi-colored, ph. బహురంగి; రంగురంగుల;
  • two-colored, ph. దోరంగి;
  • color blindness, ph. వర్ణాంధత్వం; రంగులలో భేదం కంటికి కనిపించకపోవడం;
  • color code, ph. కంప్యూటర్ రంగంలో బొమ్మల రంగులని నిర్దిష్టంగా నిర్దేశించడానికి వాడే అక్షరాంకిక సంక్షిప్తం; ఉదాహరణకి: Hex color code, RGB color code, CMYK color code; ముదురు నీలం (Navy Blue) అని చెప్పడానికి #000080 అనే సంక్షిప్తం వాడతారు; లేత ఎరుపు అని చెప్పడానికి #ffcccb అనే సంక్షిప్తం వాడతారు; చామన ఛాయ (swarthy complexion) ని సూచించడానికి #e5c298 అనే సంక్షిప్తం వాడతారు;
 • colorless, adj. నిరంజన; వివర్ణ; రంగు లేని;
 • color scheme, ph. వర్ణకల్పన;
 • colostrum, n. జున్నుపాలు; పశువులు ఈనిన తరువాత మొదటి రెండు, మూడు రోజులూ ఇచ్చే పాలు; ఈ పాలు చూడడానికి తెల్లగా ఉండవు; నీళ్లల్లా ఉంటాయి;
 • colt, n. మగ గుర్రప్పిల్ల;
 • column, n. (1) స్తంభం; కంబం; (2) దొంతి; కుందం; వరుస; నిలువు వరుస; నిరుస; మొగరం; స్థూపం; ధారణి; ఓజ;
  • column of liquid, ph. ద్రవస్తంభం; ద్రవకంబం;
  • vertical column, ph. ధారణి; నిలువు వరుస; నిరుస; ఓజ;
 • coma, n. అపస్మారకం; కుంభనిద్ర; స్థిరనిద్ర; చిరనిద్ర; స్మృతిరహిత నిద్ర; స్మృతివిహీనత; ఒంటి మీద తెలివిలేని స్థితి; కోమా;
 • comatose, adj. అపస్మారక స్థితిలో ఉన్న; కుంభనిద్రలో ఉన్న;స్మృతిరహితనిద్రలో ఉన్న; స్మృతివిహీన;
 • comb, n. దువ్వెన; పన్ని; చిక్కట్ట; కంకతము;
 • comb, v. t. (1) దువ్వు; (2) వెతుకు; గాలించు;
 • combination, n. మేళనం; సంయోగం; సంమ్మిశ్రమం; సంచయము;
  • chemical combination, ph. రసాయన సంయోగం;
  • permutation and combination, ph. క్రమచయసంచయము; క్రమవర్తనం, క్రమసంచయం; క్రమవర్తన క్రమసంచయాలు;
 • combine, v. t. మేళవించు; సంయోగించు; సంయోగపరచు; కలుపు; కలబోయు; జమిలించు; జమాయించు;
 • combining, n. సంయోజనం;
 • combined, adj. సంయుక్త; సమయోజిత; సమైక్య; కలసిన; కలసిపోయిన; %check this సమయోజిత
 • combined state, ph. సమైక్య రాష్ట్రం; సమైక్య స్థితి;
 • combustible, adj. దాహక; కాలే గుణం గల; మండగల;
 • combustibility, n. దహ్యత;
 • combustion, n. దహనం; నిర్ధహనం; నిర్ధగ్ధం; జ్వలనం; ప్లోషం; మంట; జ్వాల;
  • heat of combustion, ph. దహనోష్ణత;
  • internal combustion, ph. అంతర్ దహనం;
  • supporter of combustion, ph. దహనాధారం;
  • combustion boat, ph. దహన తరణి;
  • combustion temperature, ph. జ్వలన ఉష్ణోగ్రత;
  • combustion tube, ph. దహన నాళం;
 • come, inter. రా; రాండి;
 • come, v. i. వచ్చు; అరుదెంచు; వేంచేయు; విచ్చేయు; ఏగుదెంచు; ఏతెంచు; అరుదెంచు;
 • comedian, n. m. హాస్యగాడు; విదూషకుడు; ప్రహసనకుడు;
 • comedienne, n. f. హాస్యగత్తె; విదూషకి;
 • comedy, n. (1) ప్రహసనం; హాస్యరస ప్రధానమయిన నాటకం; (2) సుఖాంతమైన నాటకం;
 • comet, n. తోకచుక్క; ధూమకేతువు;
 • come-upper, n. [idiom] అగస్త్యభ్రాత; అతి తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి;
 • comfort, n. సౌకర్యం; సుఖస్థితి; నెమ్మి;
 • comfort, v. t. ఊరడించు;
 • comic, adj. హాస్యరస ప్రధానమయిన; హాస్య; హాస్య స్పోరక; నవ్వు పుట్టించే;
 • comical, adj. హాస్యమయ;
 • coming, adj. రాబోయే; వచ్చే; రాబోతూన్న;
 • comma, n. కొరాటిక; కామా; వాక్యాన్ని ఆపుదల చెయ్యడం కోసం వాడే సంజ్ఞ;
 • command, n. అనుశాసనం; ఉత్తరువు; ఉత్తర్వు; ఆదేశం; నిర్దేశం; ఆనతి; ఆన; ముదల;
  • peremptory command, ph. వశిష్ట వాక్యం;
  • command line, ph. [comp.] ఆదేశ పంక్తి; ఆదేశ వాక్యం;
 • commander, n. దళవాయి; దళపతి; దండనాయకుఁడు; సేనాధిపతి; నిర్దేష్ట; వాహినీపతి; అవవాదుఁడు;
 • commander-in-chief, n. సర్వసేనాధిపతి;
 • commandments, n. ఆదేశాలు; అనుశాసనాలు;
 • commence, v. i. మొదలుపెట్టు; చేపట్టు; ఆరంభించు; ఉపక్రమించు;
 • commendable, adj. ముదావహమైన;
 • commendable, n. ముదావహం; ప్రశంసనీయం;
 • commensurable, adj. (1) సమానభాజకముగల, having a common measure; divisible without remainder by a common unit; (2) పరిగణనీయ; సాపవర్తకమైన; అపవర్తనముగల;
 • comment, n. వ్యాఖ్య; వ్యాఖ్యానం;
  • no comment, ph. నిర్వాఖ్య;
 • commentator, n. భాష్య కారుడు; వ్యాఖ్యాత;
 • commentary, n. టీక; టిప్పణం; వ్యాఖ్యానం; వ్యాఖ్య; భాష్యం;
  • brief commentary, ph. టిప్పణం;
  • commentary on commentary, ph. టీకకు టీక;
 • commerce, n. వ్యాపారం; వాణిజ్యం; వర్తకం;
 • commission, n. అడితి; కాయిదా; అడిసాటా;
  • commission business, ph. అడితి వ్యాపారం; కాయిదా వ్యాపారం;
  • commission business shop, ph. కాయిదా కొట్టు;
  • commission merchant, ph. అడితిదారుడు,
 • commitment, n. నిబద్ధత; సంకల్పం; అంకితభావం; అభినివేశం; నిరతి; శ్రద్ధాభక్తులు; ప్రతిశబ్దత;
  • commitment to service, ph. సేవానిరతి;
 • committee, n. బృందం; మండలి; కమిటీ;
 • commodity, n. సరకు;
 • common, adj. (1) సామాన్య; లోక; సమాహారక; ఏకోను; (2) ఉమ్మడి; ఉభయ;
  • common factor, ph. సామాన్య భాజకం; ఉమ్మడి భాజకం;
  • common practice, ph. పరిపాటి; రివాజు;
  • common property, ph. ఉమ్మడి ఆస్తి;
  • common sense, ph. లోకజ్ఞానం; వ్యవహారజ్ఞానం;
  • common term, ph. సమాహారక పదం; ఉమ్మడి పదం;
 • commotion, n. అలజడి; అలబలం; కలకలం; సంచలనం; గొడవ; గందరగోళం;
 • communal, adj. సాముదాయిక; సంఘానికి సంబంధించిన;
 • communalism, n. కులతత్త్వం; సామాజికవర్గ తత్త్వం;
 • communicable, adj. సంక్రామిక;
  • communicable disease, ph. సంక్రామిక వ్యాధి, సంక్రామిక రోగం; అంటురోగం;
 • communication, n. వార్త; విశేషం; సందేశం;
 • communications, n. pl. వార్తాసౌకర్యాలు;
 • communion, n. సత్సంగం; [సత్ = God, సంగం = union];
 • communique, n. ప్రసారమాధ్యమాలకి అందించే అధికార ప్రకటన;
 • communism, n. సామ్యవాదం;
 • community, n. సమాజం;
  • community development center, ph. సమాజ వికాస కేంద్రం;
 • commute, v. t. (1) తగ్గించు; (2) ఇంటి నుండి ఉద్యోగ స్థలానికి రోజువారీ ప్రయాణం చేయు; పాయకరీ;
 • commuter, n. పాయకారీ; ఇటూ అటూ తిరిగేది;
 • compact, adj. మట్టసమైన; చిన్నదైన; కుదిమట్టమైన; కురుచైన; సాంద్ర; (ant.) diffuse;
 • compact, n. ఒడంబడిక; ఒప్పందం;
 • compact, v. t. కుదించు;
 • compactor, n. దిమ్మిస;
  • rolling compactor, ph. దిమ్మిస రోలు;
 • companion, n. సహవాసి; తోడు;
 • companionship, n. సహచర్యం;
 • company, n. (1) తోడు; సహవాసం; సావాసం; (2) నిగమ్; కంపెనీ; వ్యాపార బృందం;
 • comparative, adj. తులనాత్మక; సామ్య; పోల్చదగిన;
  • comparative grammar, ph. తులనాత్మక వ్యాకరణం;
  • comparative philology, ph. తులనాత్మక భాషా చరిత్ర;
 • compare, v. t. పోల్చు; సరిపోల్చు; సరిచూచు; ఉపమించు; బేరీజు వేయు; తైపారు వేయు;
 • comparison, n. పోలిక; సామ్యం;
 • compartment, n. గది; అర; రైలు పెట్టెలో ఒక గది; see also bogie;
 • compass, n. దిక్‌సూచి;
 • compassion, n. కరుణ; దయ; జాలి; అనుకంపం; దాక్షిణ్యం; సంయమనం;
  • compassion for living creatures, ph. భూతదయ; జీవకారుణ్యం;
 • compassionate, adj. కరుణామయ; దయగల; జాలిగల; అనుకంప;
 • compatible, adj. అవిరుద్ధ;
 • compatibility, n. పొంత; పొందిక; పొత్తు; అవిరుద్ధత; క్షమత;
 • compatriot, n. స్వదేశీయుడు;
 • compendium, n. సంకలనం;
 • compensation, n. (1) పరిహారం; నష్ట పరిహారం; (2) జీతం;
 • competence, n. ప్రయోజకత్వం; సామర్ధ్యం; దక్షత;
 • competition, n. పోటీ; దంటీ;
 • competitor, n. పోటీదారు; ప్రతియోగి; స్పర్ధాళువు; దంట;
 • compilation, n. కూర్పు; సంహితం;
 • compile, v. t. కూర్చు; సేకరించు;
 • compiled, n. కూర్పబడినది; ప్రోతం; గ్రథితం;
 • compiler, n. (1) కూర్పరి; సంకలన కర్త; (2) ఒక ఉన్నత భాష నుండి మరొక నిమ్న భాషకి తర్జుమా చెయ్యటానికి కంప్యూటరు వాడే క్రమణిక;
 • complainant, n. ఫిర్యాది; ఫిర్యాదు చేసే వ్యక్తి;
 • complaint, n. చాడీ; అభియోగం; ఫిర్యాదు; (ety.) [Hin.] ఫిర్ యాద్ means "remind again;
 • complement, n. [math.] పూరకం; ఉదాహరణకి దశాంశ పద్ధతిలో y యొక్క దశాంశ పూరకం (ten’s complement) అంటారు. అలాగే y యొక్క నవాంశ పూరకం (nine’s complement of y). ద్వియాంశ పద్ధతిలో y అనే ద్వియాంశ సంఖ్య యొక్క "ఒకట్ల" పూరకం (one’s complement of y).
  • binary complement, ph. ద్వియాంశ పూరకం;
  • decimal complement, ph. దశాంశ పూరకం;
  • complement addition, ph. పూరక సంకలనం; కంప్యూటర్లలలో సంకలన వ్యవకలనాలు చెయ్యడానికి అనువైన పద్ధతి;
  • complement subtraction, ph. పూరక వ్యవకలనం;
 • complementary, adj. ఉల్టా; పూరక; పరస్పర పరిపూరక;
  • complementary event, ph. ఉల్టా సంఘటన; పూరక సంఘటన;
 • complete, v. t. (1) పూర్తిచేయు; పూరించు; (2) నింపు; (3) భర్తీచేయు;
 • complete, adj. అంతా; పూర్తిగా; యావత్తు; నిండుగా; సాంగంగా; పరిపూర్ణంగా; సంపూర్ణంగా;
 • complex, n. క్లిష్ట మానసిక స్థితి; జటిల మానసిక స్థితి; సంశ్లిష్ట మానసిక స్థితి;
 • complex, adj. సంకీర్ణ; మిశ్రమ; క్లిష్ట; జటిల; సంశ్లిష్ట; జిలుగు;
  • complex issue, ph. క్లిష్ట సమస్య; జటిలమయిన సమస్య;
  • complex number, ph. సంకీర్ణ సంఖ్య; సమ్మిశ్ర సంఖ్య; క్లిష్ట సంఖ్య;
  • complex sentence, ph. సంశ్లిష్ట వాక్యం;
  • diana complex, ph. మగ పోకడలకి పోవాలనే ఆడదాని కోరిక; మాటలలోను, చేతలలోను పురుషుడిలా ఉండాలనే కోరిక;
  • electra complex, ph. తండ్రితో కామ సంబంధాలు నెరపాలని కూతురు అంతరాంతరాలలో వాంఛించడం;
  • inferiority complex, ph. ఆత్మన్యూనతా భావం;
  • superiority complex, ph. అధిక్యతా భావం;
 • complexion, n. ఛాయ; వర్చస్సు; వర్ణం; రంగు; శరీరపు రంగు;
  • swarthy complexion, ph. చామనఛాయ;
 • complexity, n. క్లిష్టత; సంక్లిష్టత;
 • compliance, n. ఆచరణ; అనుసరణ; పాటింపు; కట్టుబడి;
 • complement, n. పొగడ్త; మెచ్చికోలు; అభినందన; ప్రశంస; శుభాకాంక్ష;
 • complimentary, adj. గౌరవార్ధక;
 • comply, v. t. పాటించు; ఆచరించు; అనుసరించు; అనువర్తించు; అనుష్టించు; అమలు చేయు;
 • component, n. అంశీభూతం; అంశం; భాగం; అనుఘటకం;
 • compose, v. t. (1) రచించు; అల్లు; (2) పేర్చు; కూర్చు;
  • composing stick, ph. మరబందు; అచ్చొత్తేముందు అక్షరాలని కూర్చడానికి వాడే పనిముట్టు;
 • composite, adj. సంయుక్త;
 • composition, n. (1) రచన; అల్లిక; (2) పేర్పు; కూర్పు;
 • compositor, n. అక్షరసంధాత; అక్షరకూర్పరి;
 • compost, n. (కాంపోస్ట్) ఆకుపెంట; పెంట; చీకుడు ఎరువు;
  • compost pile, ph. పెంటపోగు;
 • composure, n. నిబ్బరం;
 • compound, adj. మిశ్రమ; సంయుక్త; సమ్మిశ్ర; ద్వంద్వ;
  • compound eye, ph. సంయుక్తాక్షము; సంయుక్తాక్ష;
  • compound sentence, ph. ద్వంద్వ వాక్యం;
  • compound interest, ph. చక్రవడ్డీ; ఇబ్బడి వడ్డీ;
  • compound fraction, ph. మిశ్రమ భిన్నం;
  • compound number, ph. సంయుక్త సంఖ్య;
  • compound word, ph. సమాసం;
  • compound wall, ph. ప్రహరి గోడ; ప్రాకారం; ప్రాంగణ ప్రాకారం;
 • compound, n. (1) మిశ్రమ ధాతువు; (2) ప్రాంగణం; లోగిలి;
 • compoundable, adj. [legal] రాజీ కుదుర్చుకోకూడనిది లేదా రాజీ కుదుర్చుకోడానికి వీలు కాని నేరం;
 • comprehend, v. t. గ్రహించు; అర్ధం చేసుకొను;
 • comprehensible, n. సుబోధకం; అర్థం అయేవిధంగా ఉన్నది;
 • comprehension, n. గ్రహింపు; గ్రహణం; ఆకళింపు; ఆకలనం; అవగాహన; అవగతం;
 • comprehensive, adj. సమగ్ర; సర్వతోముఖ;
 • comprehensively, adv. సమగ్రంగా; సర్వతోముఖంగా; సాంగోపాంగంగా; సాకల్యంగా;
 • compress, v. t. కుదించు; దట్టించు;
 • compression, n. సంపీడనం; సంఘాతం;
 • compressor, n. సంపీడకి; సంపీడకం;
  • compressor oil, ph. సంపీడన కుండలి; సంపీడక కుండలి;
 • compromise, n. రాజీ;
 • compromise, v. i. రాజీపడు;
 • compulsion, n. నిర్బంధం; ప్రసభం;
 • compulsory, adj. విధిగా; విధాయకంగా; వెట్టి; నిర్బంధ; అనివార్య; ఆవశ్యక; తప్పనిసరి;
  • compulsory education, ph. నిర్బంధ విద్యావిధానం;
  • compulsory labor, ph. వెట్టి చాకిరీ; బేగారి చాకిరీ;
 • computation, n. గణన; లెక్కింపు;
 • computational, adj. లెక్కింపు పద్ధతులకి సంబంధించిన; గణన పద్ధతులకి సంబంధించిన;
  • computational methods, ph. లెక్కింపు పద్ధతులు; గణన పద్ధతులు;
 • compute, v. t. సంగణీకరించు;
 • computer, n. (1) గణకుడు; గణకి; లెక్కలు చూసే వ్యక్తి; (2) కలనయంత్రం; గణాంకయంత్రం; గణిత యంత్రం; సంగణకం; కంప్యూటరు;
  • analog computer, ph. సారూప్య కలనయంత్రం;
  • digital computer, ph. అంక కలనయంత్రం;
  • hybrid computer, ph. సంకర కలనయంత్రం;
 • concatenate, v. t. జతపరచు; జోడించు; తగిలించు; కలుపు;
 • concave, adj. పుటాకారమైన, నతోదర; ఉత్తాన;
 • concave lens, ph. నతోదర కటకం; పుట కటకం; పుటాకార కటకం;
 • concede, v. i. ఒప్పేసుకొను; ఓటమిని అంగీకరించు;
 • conceit, n. అతిశయం; టెక్కు; డాంబికం; అహమహమిక;
 • conceited, adj. అతిశయంతో కూడిన; టెక్కుతో; ఆడంబరపు;
 • conceive, v. i. (1) గర్భం ధరించు; కడుపుతోనుండు; (2) ఊహించు; భావించు; అనుకొను;
 • concentrate, v. i. లగ్నముచేయు; ధారణ చేయు; కేంద్రీకరించు;
 • concentrate, v. t. గాఢతని పెంచు; నిర్జలీకరించు;
 • concentrate, n. (1) లగ్నం; ధరణి; (2) నిర్జలి;
 • concentrated, adj. గాఢ; నిర్జల; సాంద్రీకృత; see also anhydrous;
 • concentration, n. (1) అవధానం; ఏకాగ్రత; ధారణ; ధ్యానం; నిధిధ్యాసము; తితీక్ష; (2) గాఢత; సాంద్రీకరణం; (3) నిర్జలత;
  • power of concentration, ph. ధారణశక్తి;
 • concentration, v. t. నిర్జలీకరణ;
 • concentric, adj. ఏకకేంద్రక; కేంద్రకయుత;
  • concentric circles, ph. ఏకకేంద్రక వృత్తములు;
  • concentric spheres, ph. ఏకకేంద్రక గోళములు;
 • concept, n. భావం; భావన; పరిభావన; మనోగతి; ఊహ; ఊహనం; అధ్యాహారం; గ్రాహ్యం; సవీతటం; పోహ (అపోహ కానిది); ప్ర + ఊహ(ప్రశస్తమైన అంటే మంచి ఊహ) = ప్రోహ = పోహ;
  • concept formation, ph. భావ సంకల్పన; పరిభావ సంకల్పన;
 • conception, n. ఆవయం; శిశుసంకల్పన;
 • conceptual, adj. అధ్యాహారిక; ఊహాత్మక; పోహిక; పౌహిక;
 • conceptually, adv. భావనాత్మకంగా;
 • concern, n. బెంగ; తాపత్రయం; ధ్యాస;
 • concert, n. కచేరీ; పాటకచేరీ;
  • musical concert, ph. గాన కచేరీ; పాట కచేరీ;
 • concerto, n. (కంచెర్టో) సంగీత స్వర కల్పన; a musical composition;
 • concerted, adj. సమైక్య; కూడబలుక్కొన్న;
 • concession, n. రాయితీ;
 • concessional, adj. రాయితీ;
  • concession stand, ph. రాయితీ బడ్డీ; క్రీడా స్థలాల వంటి బహిరంగ ప్రదేశాలలో కిరాయికి కుదుర్చుకున్న కిరాణా దుకాణాల వంటి బడ్డీలు;
 • conch, n. శంఖం;
  • conch shell, ph. శంఖం; చిందం;
 • conciliation, n. రాజీ; ఒప్పందం; అంగీకారం;
 • concise, adj. సంక్షిప్త; క్లుప్త;
 • conclave, n. సమాలోచన సభ; కొద్దిమంది ముఖస్థంగా మాట్లాడుకుందికి సమావేశమయే గది;
 • conclude, v. t. ముగించు; ఉపసంహరించు; పూర్తిచేయు; విరమించు; నిష్కర్షించు; సమాప్తం చేయు; కడతేర్చు;
 • conclusion, n. ముగింపు; పర్యవసానం; ముక్తాయింపు; ఉపసంహారం; ఉద్యాపన; సమాప్తి; నిష్కర్ష; విరమింపు; అవసానం; పిండితార్ధం: (ant.) beginning; takeoff;
  • truthful conclusion, ph. తథ్యం; అనుభవ ఆధారితమైన ఒక పిండితార్థము;
 • concoct, v. i. కిట్టించు; అల్లు;
 • concomitant, adj. అనుషంగిక; ప్రధానం కాని; ముఖ్యం కాని;
 • concord, n. సామరస్యం;
 • concrete, adj. సంయుక్త; మూర్త; యదార్థ; వాస్తవిక; నిర్ధిష్ట; (ant.) abstract;
  • concrete objects, ph. మూర్త పదార్థాలు;
 • concrete, n. (1) కాంక్రీటు; (2) యదార్థం; వాస్తవం;
  • not cast in concrete, ph. [idiom] రాతి మీద గీత కాదు;
 • concreteness, n. మూర్తత;
 • concubine, n. ఉంపుడుకత్తె; ఉపపత్ని; చేరుగొండి; ముండ;
 • concur, v. i. ఏకీభవించు;
 • concurrent, adj. అనుషక్త; జమిలి;
 • condemn, v. i. ఖండించు; దుయ్యబట్టు; నిందించు; గర్హించు;
 • condemnable, n. గర్హనీయం; అభ్యంతరం చెప్పదగ్గ; నిందింప దగిన;
 • condemnatory, adj. నిందాత్మక మయిన; నిందించేటట్టి; గర్హనీయ;
 • condensation, n. (1) కుదింపు; సంగ్రహణ; సంధానం; బణుసంధానం; రెండు అణువులని జతపరచుట; (2) ద్రవీభవనం; సంఘననం; సంక్షేపణం; (rel.) liquifaction;
 • condense, v. t. (1) కుదించు; సంగ్రహించు; (2) గడ్డ కట్టించు; సంధించు;
 • condensed, adj. గడ్డకట్టబడిన; సంఘటిత; సాంద్రీకృత; సాంద్రీకృత;
  • condensed book, ph. సంఘటిత పుస్తకం;
  • condensed milk, ph. గడ్డ పాలు;
 • condiments, n. సంభారములు; సంబరువులు; పరివ్యయములు; వంటలలో వాడే సుగంధ ద్రవ్యములు;
 • condition, n. (1) నిబంధన; నియమం; షరతు; (2) పరిస్థితి; స్థితి; అవస్థ;
  • initial condition, ph. ప్రారంభ పరిస్థితి;
 • conditional, adj. నైబంధిక; నియమ; షారత;
  • conditional lease, ph. నైబంధిక కౌలు; మద్దతు కౌలు;
  • conditional probability, ph. నైబంధిక సంభావ్యత;
  • conditional sale, ph. నైబంధిక క్రయం; షారత క్రయం; మద్దతు అమ్మకం;
 • conditioning, n. నియంత్రీకరణ;
  • air conditioning, ph. వాత నియంత్రీకరణ;
 • condole, v. t. పరామర్శించు; పరామర్శ చేయు;
 • condolence, n. సానుభూతి; సంతాపం; పరామర్శ;
 • condom, n. తొడుగు; లింగతొడుగు; పిల్లలు పుట్టకుండాను, సుఖరోగాలు రాకుండాను తప్పించుకుందికి రతి సమయంలో లింగానికి తొడిగే రబ్బరు తొడుగు;
 • condominium, n. ఉమ్మడి పరిపాలన; ఉమ్మడి వాటాదారులుగా ఉన్న ఇల్లు; (rel.) flat; apartment;
 • condone, v. t. క్షమించు;
 • condor, n. గూళి; సాళువ డేగ;
 • conduce, v. i. దోహదం చేయు;
 • conduct, n. (కాండక్ట్) ప్రవర్తన; శీలం; నడవడిక; నడత;
 • conduct, n. (కండక్ట్) జరిపించు; నడిపించు; నిర్వహించు; నెరపు; కానిచ్చు;
 • conduction, n. వహనం;
 • conductivity, n. వాహకత్వం;
 • conductor, n. (1) వాహకి; వాహకం; (2) యాజి; నిరవాకి; ప్రవర్తకుడు; వ్యవహర్త; కండక్టరు;
  • semiconductor, n. అర్ధవాహకి; అర్ధవాహకం;
  • tour conductor, ph. యాత్రిక యాజి;
 • conduit, v. t. (కాండూట్) కాలువ; తూము; గొట్టం; మార్గం;
 • cone, n. శంఖం; శంఖు;
 • conical, adj. .శంఖాకార;
 • confection, n. మోదకం; చాకలేట్లు, బిళ్ళలు, మొ. తీపి సరుకులు;
 • confederation, n. సమాఖ్య;
 • conference, n. సభ; సమావేశం; సదస్సు; సమ్మేళనం;
  • summit conference, ph. శిఖరాగ్ర సమావేశం;
  • video conference, ph. దృశ్య సమావేశం;
  • conference hall, ph. సభాస్థలి;
 • confess, v. i. ఒప్పేసుకొను;
 • confidants, n. pl. (కాన్ఫిడాంట్‌‌స్) ఆంతరంగికులు; సన్నిహితులు;
 • confidence, n. ధీమా; నమ్మకం; విశ్వాసం; దీలాసా; భరవసం; ధిషణ;
  • self-confidence, ph. ఆత్మవిశ్వాసం;
 • confidential, adj. గుప్త; రహస్య; ఆంతరంగిక;
  • confidential communication, ph. గుప్త నివేదన;
  • confidential secretary, ph. ఆంతరంగిక సచివుడు;
 • confidential, n. గుప్తం; రహస్యం; ఆంతరంగికం;
  • highly confidential, ph. దేవ రహస్యం;
 • confidentiality, n. ఆంతరంగికత; రహస్యం;
 • configuration, n. అమరిక; సమగ్రాకృతి;
 • confine, v. t. బంధించు; నిర్బంధించు;
 • confinement, n. బంధిఖానా; నిర్బంధం;
 • confirm, v. t. ఖాయపరచు; ధ్రువపరచు; ధ్రువీకరించు; రూఢిపరచు; రూఢిచేయు;
 • confirmation, n. ధ్రువీకరణ; దృఢీకరణ;
 • confiscation, n. జప్తు;
 • conflagration, n. దహనకాండ; మంటలు;
 • conflict, n. ఘర్షణ; సంఘర్షణ; లడాయి; విప్రతిపత్తి;
  • armed conflict, ph. సాయుధ సంఘర్షణ;
  • class conflict, ph. వర్గ సంఘర్షణ;
  • mental conflict, ph. భావ సంఘర్షణ;
  • conflict of interest, ph. విప్రతిపత్తి;
 • conflicting, adj. పరస్పర విరుద్ధ; పొందిక లేని; పొందు పొసగని; విప్రతిపన్న;
  • conflicting objectives, ph. విరుద్ధ ప్రయోజనాలు;
 • confluence, n. నదీ సంగమం; సంగమం; కూడలి; సమూహం;
 • conform, v. i. బద్ధమగు;
  • conform to contemporary trends, ph. సమయ బద్ధమగు;
 • conformal, adj. అనురూప;
 • conformational, adj. అనురూపాత్మక;
  • conformational analysis, ph. అనురూపాత్మక విశ్లేషణ;
  • conformational isomerism, ph. అనురూపాత్మక సాదృశం;
 • conformist, n. సాంప్రదాయదాసుడు; అనుసారి;
 • confounded, n. కారాకూరం; %check this
 • confront, v. i. ఎదుర్కొను;
 • confuse, v. i. కంగారుపడు;
 • confuse, v. t. కంగారుపెట్టు;
 • confusion, n. కంగారు; గందరగోళం; తికమక; తొట్రుపాటు; కలత; ఆకులపాటు; గాసటబీసట; గజిబిజి; కకపిక;
  • confusion of mind, ph. ఆకులపాటు;
 • congeal, v. i. ముద్దకట్టు; గడ్డకట్టు; పేరుకొను;
 • congenial, adj. ఒకే స్వభావంగల; కలుపుగోలు;
 • congenital, adj. జాయమాన; ఆగర్భ; ఆజన్మ; జన్మజ; పుట్టు; పుట్టుకతో వచ్చిన; జనుష; వంశ పారంపర్యంగా ఉన్నది కాదు;
  • congenital blindness, ph. పుట్టుగుడ్డితనం; జనుషాంధత్వం;
  • congenital disease, ph. జాయమాన వ్యాధి; పుట్టుకతో ఉన్న రోగం; ఆగర్భ రోగం;
 • congestion, n. ఇరుకు; ఇరకాటం; రద్దీ;
 • conglomerate, v. i. గుమిగూడు;
 • congratulation, n. అభినందన;
 • congregation, n. సమావేశం; సమాజం;
 • congress, n. సమావేశం; ప్రతినిధుల సభ;
 • congruence, n. ఆనురూపత;
 • congruent, adj. ఆనురూప; సమాన; సర్వసమాన; సమశేష; తాదాత్మ్య;
 • congruent class, ph. [math.] సమశేష వర్గం;
 • conifer, n. పైను, ఫర్‍ జాతి శంఖాకారపు చెట్టు; కోను కాయలను కాసే చెట్టు;
 • conjecture, n. ఊహ; ప్రతిపాదన;
 • conjoined, adj. సంయోజిత;
 • conjoint, adj. కూడిన; చేరిన; కలసి ఉన్న; కలసి ఒకటిగా ఉన్న;
  • conjoined twins, ph. కలసి ఒకటిగా ఉన్న కవలలు; అతుక్కుపోయిన కవలలు;
 • conjugacy, adj. సంయుగ్మత;
 • conjugal, adj. జంటకి సంబంధించిన; వైవాహిక జీవితానికి సంబంధించిన; దాంపత్య;
  • conjugal life, ph. కాపరం; దాంపత్య జీవితం;
  • conjugal rights, ph. దాంపత్య హక్కులు;
 • conjugated, adj. సంయుగ్మ; సంయుక్త; సంబద్ధ; అనుబద్ధ; సంయోగ; జంటకి సంబంధించిన;
  • conjugated double bond, ph. సంయోగ జంట బంధం;
 • conjugation, n. సంయోగం; సంయుగ్మం;
 • conjunctivitis, n. నేత్రాభిష్యందం; కండ్లకలక;
  • gonorrheal conjunctivitis, ph. ప్రమేహ నేత్రాభిష్యందం;
 • conjunction, n. యుతి; మిళితం; కలయిక; సంయోగం; (వ్యాకరణంలో) సముచ్ఛయం; పొంతనం;
  • conjunction of planets, ph. గ్రహ పొంతనం; గ్రహాల యుతి; conjunction occurs when any two astronomical objects (such as asteroids, moons, planets, and stars) appear to be close together in the sky, as observed from Earth; (rel.) Opposition is when a planet is opposite the Earth from the Sun. This is when we are able to observe it best, as it is normally the nearest to Earth at this point. Opposition is typically used to describe a superior planet’s position;
 • conjurer, n. మాయావి; మాయలమారి; మాంత్రికుడు;
 • connect, v. t. అతుకు; కలుపు; తగిలించు; సంధించు; అనుసంధించు; అనుబంధించు;
 • connected, adj. శ్లిష్ట; అనుసంధాన;
 • connecting rod, n. లంకె ఊస; సంసక్త ఊస; ఇంజనుని చక్రాలకి తగిలించే ఊస;
 • connection, n. అతుకు; సంధి; సంబంధం; అనుసంధానం; స్పృక్కు; కైకట్టు; electrical connection;
 • connective, adj. అతికే; సంధాయక;
  • connective tissue, ph. సంధాయక కణజాలం;
 • connoisseur, n. (కానసూర్) m. రసికుడు; రసజ్ఞుడు; f. రసికురాలు;
 • connotation, n. సందర్భార్ధం; సందర్భానికి సరిపోయే అర్ధం; see also denotation;
 • conquer, v. i. జయించు;
 • conqueror, n. జేత; విజేత; జైత్రుడు;
 • consanguine, n. m. సగోత్రీకుడు; రక్తసంబంధి;
 • consanguinity, n. (1) సగోత్రీయత; రక్తసంబంధం; వావి; వావి-వరస; (2) మేనరికం; రక్త సంబంధం ఉన్న వారితో వివాహం;
 • conscience, n. (కాన్‌షన్స్) అంతర్వాణి; అంతరాత్మ; మనస్సాక్షి;
 • conscientious, adj. (కాన్‌షియన్‌షస్) మనస్ఫూర్తి అయిన శ్రద్ధ; మనస్సాక్షికి లోబడిన;
 • conscious, adj. (కాన్‌షస్) వ్యక్తమైన; స్పృహతో; మెలుకువతో; [psych.] వైఖరి; చేతన; జ్ఞాత;
  • subconscious, adj. వ్యక్తావ్యక్తమైన; [psych.] ఉపచేతన; ఉపజ్ఞాత; ఇగో;
  • unconscious, adj. అవ్యక్తమైన; [psych.] సుప్తచేతన; సుప్తజ్ఞాత; అవ్యక్తచేతన; పర; ఇడ్;
  • conscious age, ph. బుద్ధి ఎరిగిన వయస్సు; వ్యక్త వయస్సు;
  • conscious state, ph. జాగ్రదావస్థ;
  • super conscious state, ph. నిర్వికల్పసమాధి;
 • consciously, adv. సస్పృహముగా;
 • consciousness, n. తురీయం; చతుర్థం; చేతస్సు; చైతన్యం; చేతన; చిత్; వ్యక్తచేతనం; చిత్తాకాశం; పరిజ్ఞానం; ప్రజ్ఞానం; జ్ఞాతం; స్పృహ; స్మృతి; స్మారకం; మనస్సు; సైకీ; లిబిడో;
  • primary consciousness, ph. అగ్రిమం; అగ్రిమ చేతస్సు;
  • . pure consciousness, ph. తురీయ స్థితి; In Advaita philosophy this is the the forth state of awareness that is beyond the wakeful, dreaming and deep sleep states in which one is conscious of the falsehood of the above three states;
  • secondary consciousness, ph. అనగ్రిమం; అనగ్రిమ చేతస్సు;
  • self consciousness, ph. ఆత్మజ్ఞానం;
  • social consciousness, ph. సామాజిక స్పృహ;
  • sub-consciousness, n. అంతర్ చేతన;
  • un-consciousness, n. అవ్యక్తచేతన;
  • stream of consciousness, ph. చైతన్య స్రవంతి;
  • Universal consciousness, ph. బ్రహ్మజ్ఞానం;
 • consecrate, v. t. పవిత్రం చేయు; పవిత్ర పరచు;
 • consecration, n. అభిషేకం; పవిత్రం చేసే తంతు;
 • consecutive, adj. నిరత; సతత; క్రమానుగత; పుంఖానుపుంఖంగా; ఒకదాని తర్వాత మరొకటి;
  • consecutive numbers, ph. క్రమానుగత సంఖ్యలు;
 • consensus, n. అభిప్రాయసామ్యం; ఏకాభిప్రాయం;
 • consent, n. అంగీకారం; మేకోలు; ఈకోలు;
 • consent, v. i. ఒప్పుకొను; అంగీకరించు; ఎవరైనా ప్రతిపాదించిన దానిని గాని అడిగినదానిని కాని చెయ్యడానికి ఒప్పుకొనడం; అనుమతించు; see also assent, agree, concur, accede and acquiesce;
 • consequence, n. పర్యవసానం; పరిణామం;
  • negative consequence, ph. దుష్‌పరిణామం; రుణపరిణామం;
 • consequently, adv. తత్ఫలితంగా; దరిమిలా;
 • conservation, n. పరిరక్షణ;
  • conservation laws, ph. విహిత నియమాలు; నిక్షేప నియమాలు;
  • law of conservation of energy, ph. శక్తి నిత్యత్వ నియమం;
 • conserve, n. నిల్వ పెట్టడానికి వీలుగా చేసిన సరుకు; ఊరగాయలు; అప్పడాలు; వడియాలు వంటి ఎండబెట్టిన సరుకులు; మురబ్బాలు;
 • conserve, v. t. నిక్షేపించు;
 • consider, v. i., v.t. పరిగణించు; ఆలోచించు; లెక్కలోనికి తీసికొను; చిత్తగించు; యోచించు; మానసించు;
 • consideration, n. పరిగణన; యోచన; పర్యాలోచన;
 • consign, v. i. కేటాయించు;
 • consignment, n. (1) కేటాయింపు; (2)) రవాణాసరుకు;
 • consistent, adj. అనుగుణ్యత; అవిరుద్ధ; అవిరోధత; సంగతత్వ; నియతి; నిలకడ; స్థిరత్వ;
 • consistency, n. స్థిరత్వం; సంగతత్వం;
 • consistently, adv. నియతంగా; నియతికాలికంగా; నియమాను సారంగా; క్రమం తప్పకుండా; సంగతంగా;
 • consolation, n. ఊరడింపు; ఓదార్పు; సాకతం; సాంత్వనం; సముదాయింపు; పరామర్శ;
  • consolation prize, ph. సాకత బహుమానం; సాంత్వన బహుమానం; ప్రోత్సాహక బహుమానం;
 • console, n. (కాన్‌సోల్) సాలారం;
  • computer console, ph. కలనయంత్ర సాలారం; సంగణక సాలారం;
 • console, v. t. (కన్‌సోల్) ఓదార్చు; సముదాయించు; ఊరడించు; పరామర్శించు;
 • consolidate, v. t. క్రోడీకరించు;
 • consolidated, adj. ఏకం చెయ్యబడ్డ; ఏకీకృత; సంఘటిత; సుసంఘటిత;
 • consolidation, n. క్రోడీకరించడం; ఒక చోటకి చేర్చడం;
  • consolidation loan, ph. రుణార్ణం;
 • consonants, n. హల్లులు; వ్యంజనములు;
  • aspirated consonants, ph. ఒత్తు అక్షరములు;
  • double consonants, ph. జడక్షరములు;
  • conjunct consonants, ph. జంట అక్షరములు; సంయుక్తాక్షరాలు;
  • contact consonants, ph. స్పర్శములు;
  • fixed consonants, ph. స్థిరములు;
  • hard consonants, ph. పరుషములు; క, చ, ట, త, ప;
  • intermediate consonants, ph. అంతస్థములు;
  • pure consonants, ph. పొల్లు హల్లు;
  • soft consonants, ph. సరళములు; గ, జ, డ, ద, బ;
  • unaspirated consonants, ph. ఒత్తులు లేని అక్షరములు;
  • voiced consonants, ph. పరుషములు; క, చ, ట, త, ప;
  • voiceless consonants, ph. సరళములు; గ, జ, డ, ద, బ;
 • conspicuous, adj. స్పష్టముగా; కొట్టొచ్చినట్లు; స్పుటంగా;
 • conspiracy, n. కుట్ర; కుట్టరము; పన్నాగం; గూడుపుఠాణి;
 • conspirator, n. కుట్టరి;
 • conspire, v. t. కుట్రపన్ను;
 • constancy, n. స్థిరత్వం;
 • constant, adj. స్థిరమయిన; మారని; మార్పులేని;
 • constant, n. స్థిరాంకం; స్థిరరాసి; స్థిరం;
  • gas constant, ph. వాయు స్థిరాంకం; The ideal gas law is: pV = nRT, where n is the number of moles, and R is the universal gas constant. The value of R depends on the units involved but is usually stated with S.I. units as R = 8.314 J/mol·K
  • proportionality constant, ph. అనుపాత స్థిరాంకం;
  • universal constant, ph. సార్వత్రిక స్థిరాంకం;
 • constellation, n. రాశి; రాసి; రిక్క; తారావళి; నక్షత్ర సముదాయం; నక్షత్రమండలం; చూసే వాళ్ల సదుపాయం కొరకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కొన్ని గుంపులుగా విడగొట్టేరు; ఈ గుంపులే రాశులు; ఇటువంటి రాశులు 88 ఉన్నాయి; సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పయనించే నభోపథంలో ఉన్న నక్షత్రాలకి ఒక ప్రత్యేక స్థానం ఉండబట్టి వీటికి పెట్టిన పేర్లు అందరికీ బాగా పరిచయం; అవే మేష, వృషభాది ద్వాదశ రాశులు; ఈ పథంలో ఉన్న 27 నక్షత్ర సమూహాలే అశ్వని, భరణి, మొదలయిన నక్షత్ర రాసులు; see also asterism;
 • consternation, n. దిగ్‍భ్రాంతి; దిగ్‍భ్రమ; నివ్వెరపాటు;
 • constipation, n. మలబద్ధకం; (rel.) indigestion;
 • constituency, n. నియోజకవర్గం; ఎన్నికల సదుపాయానికిగా దేశాన్ని విడగొట్టిన పరిపాలనా భాగం;
 • constituent, n. అంగం; అంగరూపం; భాగం;
 • constitution, n. (1) రాజ్యాంగం; సంవిధానం; body of fundamental principles or established precedents according to which a state or other organization is acknowledged to be governed;(2) శరీర తత్వం; నిర్మాణం; కట్టుబాటు; దేహపాకం;
  • written constitution, ph. లిఖిత రాజ్యాంగం;
 • constitutional, n. (1) రాజ్యాంగ బద్ధం; (2) తత్వ బద్ధం;
 • constitutionalist, n. రాజ్యాంగవాది;
 • constraint, n. ఆంక్ష; నిబంధన; కట్టుబాటు; నియమం; నిరోధం; సంయమనం; షరతు; ఆసేధం;
  • space constraint, ph. స్థానాసేధం;
  • time constraint, ph. కాలాసేధం;
 • construction, n. (1) నిర్మాణం; కట్టడం; (2) ప్రయోగం;
  • building construction, ph. భవన నిర్మాణం; గృహనిర్మాణం;
  • passive construction, ph. కర్మణి ప్రయోగం;
 • constructive, adj. నిర్మాణాత్మక;
 • consult, v. t. సంప్రదించు; సలహా తీసుకొను;
 • consultant, n. సలహాదారు; మంతవ్యుడు;
 • consultation, n. సంప్రదింపు; సమాలోచన;
 • consume, v. i. (1) తిను; భుజించు; ఆరగించు; (2) వాడు; ఖర్చుచేయు; వినియోగించు వినియోగపరచు; (3) దహించు;
 • consumers, n. భోక్తలు; ఉపయోక్తలు; వినియోగదారులు; వినిమయదారులు; అనుభోక్తలు;
 • consumerism, n. భోక్తత్వం;
 • consumption, n. (1) వాడకం; వినియోగం; వినిమయం; (2) క్షయ; బేక్టీరియా వల్ల కలిగే ఊపిరితిత్తులని తినేసే ఒక రోగం;
 • contact, n. సన్నికర్షం; స్పర్శ; సంసర్గం; ఒరపు;
  • contact lens, ph. కంటి కటకం; స్పర్శ కటకం; సన్నికర్ష కటకం;
  • electrical contact, ph. విద్యుత్‌ సన్నికర్షం;
 • contagious, adj. అంటు; సోకుడు; సాంక్రామిక; సంక్రామిక; సంకలిత;
  • contagious disease, ph. అంటురోగం; సోకుడు రోగం; సంక్రామిక వ్యాధి;
 • container, n. పాత్ర; ఘటం;
 • contaminate, v. t. కలుషిత పరచు; పంకిలపరచు; మురికి చేయు; పాడు చేయు;
 • contemplation, n. ధ్యానం; దీర్ఘాలోచన; ధీయాలంబం;
 • contemporary, adj. సమకాలీన; సమకాలిక;
 • contemporary, n. సమకాలికుడు; సమకాలిక వ్యక్తి;
 • contempt, n. ధిక్కారం; తృణీకారం; ఏవగింపు; ఏహ్యం; అవజ్ఞ;
  • contemptuous silence, ph. తూష్ణీం భావం;
 • content, adj. సంతృప్తి;
 • content, n. విషయం; సారం; సరుకు;
 • contention, n. పరిస్పర్ధ;
 • contentious, adj. స్పర్ధాత్మక;
  • contentious person, ph. స్పర్ధాళువు; పరిస్పర్ధాళువు;
 • contentment, n. పరితుష్టి; పరితృప్తి;
 • contest, n. పోటీ;
  • beauty contest, ph. అందాల పోటీ; సుందరాంగుల పోటీ;
 • context, n. సందర్భం; ఘట్టము; తరి; పూర్వాపర సంబంధం;
 • contextual, adj. ప్రాసంగిక;
 • contiguous, adj. ఉపస్థిత; పక్కపక్కనే;
 • continence, n. బ్రహ్మచర్యం; నిగ్రహం; ఆత్మనిగ్రహం;
 • continent, n. ఖండం;
 • continual, adj. అనుశృత; అదేపనిగా;

---Usage Note: continual, continuous

 • ---Use continual when something happens repeatedly often over a long time. Use continuous when something continues without stopping.
 • continuation, n. కొనసాగింపు;
 • continue, v. i. కొనసాగించు; కానిచ్చు;
 • continuing, adj. అవినాభావ;
 • continuity, n. అవిరళత; నిరంతరత; అవిచ్ఛిన్నత;
 • continuous, adj. నిత్య; నిరంతర; నితాంత; అవిచ్ఛిన్న; అనవరత; అనునిత్య; అఖండిత; అవిరళ; అవిరత; అవ్యాహత; అనుశ్రుత; ధారాళమైన; నిరత; అవిరామ; జడి;
  • continuous flow, ph. ధారాళమైన ప్రవాహం; అవిచ్ఛిన్న ప్రవాహం;
  • continuous fraction, ph. అవిచ్ఛిన్న భిన్నం;
  • continuous function, ph. [math.] జడి ప్రమేయం; అవిరామ ప్రమేయం;
  • continuous spectrum, ph. అవిచ్ఛిన్న వర్ణమాల;
 • continuously, adv. నిత్యం; సదా; ఎల్లప్పుడు; నితాంతంగా; నిరంతరాయంగా; అవిచ్ఛిన్నంగా; ఏకటాకీగా, ఏకథాటిగా; నిరాఘాటంగా;
 • continuum, n. [phy.] సమవాయం; ఒకే స్థలానికి పరిమితం కాకుండా అవిచ్ఛిన్నంగా ఉన్న ప్రదేశం;
 • contour, n. ఈనెగట్టు; ఆకార రేఖ; రూపురేఖ;
  • contour lines, ph. ఈనెగట్టు గీతలు;
 • contraband, adj. నిషేధించబడ్డ; నిషిద్ధ;
 • contract, n. గుత్త; ఒడంబడిక; ఒప్పందం; ఏర్పాటు; కరారునామా; ముస్తాజరీ;
  • contract labor, ph. గుత్త కూలి;
 • contract, v. i. సంకోచించు;
 • contraction, n. సంకోచం;
 • contractor, n. గుత్తదారుడు; గుత్తేదారు; ముస్తాజరు; కంట్రాక్టరు; ఇంత అని ముందు ఒప్పుకొని పని సాంతం జరిపించే వ్యక్తి;
 • contradict, v. t. ఖండించు; వ్యతిరేకించు; నిరాకరించు;
 • contradiction, n. విరుద్ధం; విరుద్ధోక్తి; వ్యాఘాతం; వ్యత్యాస్తం; వ్యతిక్రమం; వ్యాఘాతం; ఏడాకోడం; ఖండన;
  • proof by contradiction, ph. ఖండన ఉపపత్తి;
  • self contradiction, ph. స్వవచో వ్యాఘాతం;
 • contraindication, n. [med.] కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కలిగే ప్రమాదం;
 • contraption, n. కందువ;
 • contrarily, adv. వ్యత్యాస్తంగా; విరుద్ధంగా; వ్యతిక్రమంగా;
 • contrary, adj. విరుద్ధమయిన; వ్యతిరేకమైన;
 • contrast, n. వైషమ్యం; భేదం;
 • contribute, v. t. దోహదం చేయు;
 • contribution, n. (1) చందా; (2) దోహదం;
 • contributor, n. (1) దాత; (2) దోహదకారి;
 • contributory, adj. దోహదప్రాయమైన;
 • contrivance, n. ఉపాయం; ప్రకల్పితం;
 • contrite, adj. పశ్చాత్తాపముతో నిండిన; అనుతాపముతో;
 • contrive, v. t. ప్రకల్పించు; రూపొందించు;
 • contrived, n. ప్రకల్పితం; రూపొందించబడినది;
 • control, n. ఆధిపత్యం; అధీనత; అదుపు; నియంత్రణ; ఖాయిదా; ఏలుబడి; నియతి; నియామకం;
  • birth control, ph. కుటుంబ నియంత్రణ;
 • control, v. i. నిగ్రహించుకొను; తమాయించుకొను;
 • control, v. t. నియంత్రించు; అదుపుచేయు; తమాయించు; చేవలించు; చెప్పుచేతలలో ఉంచుకొను;
 • controllability, n. దమనీయత; నియంత్రీయత; వశ్యత;
 • controller, n. యంత; నియంత; నియంత్రకి; నిర్వాహకుడు; చేవలి; నిర్వాహకి; నేత; నిరోధకి; దమనకి; అధిపతి; ఈశ్వరుడు; వశ్యకి;
 • controversial, adj. వివాదాస్పద మైన;
 • controversy, n. వివాదం; వాదప్రతివాదం;
 • contusion, n. బొప్పి; బొప్పికట్టిన దెబ్బ; కదుం; కమిలిన చర్మం;
 • conundrum, n. పొడుపుకథ; ప్రహేళిక; కుమ్ముసుద్దు; కైపదం; పజిలు; పజిల్; తలబీకనకాయ; బురక్రి పని చెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య;
 • convection, n. సంవహనం; స్థితిభ్రంశవ్యాప్తి; పారప్రేషణం;
 • convene, v. t. సమావేశపరచు;
 • convener, n. m. సంచాలకుడు; సంధాత; సంధాయకుడు;
 • convenience, n. సదుపాయం; హంగు; సౌలభ్యం; వీలు; అనువు; అనుకూలం; వసతి; సానుకూలం; సుకరం:
 • convenient, adj. అనుకూలమైన; అనువయిన; హంగులతో కూడిన; వీలయిన; సుకరమైన;
 • convention, n. (1) సభ; సమావేశం; (2) ఆచారం; లోకసమ్మతి; లోకమర్యాద;
 • conventional, adj. ఆనువాయి;
 • conventions, n. ఆచారములు; ఆనవాయితీలు; మరియాదలు; లోకమర్యాదలు;
 • converge, v. i. కూడు; గుమిగూడు; చేరు; కలియు; అభిసరించు;
 • convergence, n. కూడిక; చేరిక; కలయిక; సంగమం; పరిచ్ఛిన్నం; అభిసరణం; కేంద్రాభిసరణం;
 • convergent, adj. అభిసార; ఆసన్నమాన; అభిసరణ;
 • conversant, adj. తెలిసిన; నైపుణ్యం ఉన్న;
 • conversation, n. సంభాషణ; సల్లాపం; గోష్ఠి; మాటలు; సంకథ;
  • friendly conversation, ph. బాతాకానీ; పిచ్చాపాటీ; ఇష్టాగోష్ఠి; సరస సల్లాపం;
 • converse, adj. (కాన్‌వర్స్) విపర్య;
 • converse, v. i. (కన్‌వర్స్) మాట్లాడు; సంభాషించు;
 • converse, n. (కాన్‌వర్స్) విపర్యం; వ్యత్యాస్తం;
 • conversely, adv. వ్యత్యాస్తంగా; విపర్యంగా;
 • conversion, n. (1) మార్పు; పరివర్తన; సంయోజకం; (2) మార్పిడి; (3) మతం మార్పిడి;
 • convert, n. (కాన్‌వర్ట్) మారిన మనిషి; మతం మారిన వ్యక్తి;
 • convert, v. t. (కన్‌వర్ట్) మార్చు; పరివర్తించు;
 • converter, n. మార్పరి; పరివర్తరి; సంయోజకి;
 • convex, adj. కుంభాకారమైన; ఉబ్బెత్తు; ఉన్నతోదర;
  • convex lens, ph. కుంభాకార కటకం; కుంభ కటకం;
  • convex mirror, ph. ఉన్నతోదర దర్పణం; కుంభాకార దర్పణం;
  • convex polygon, ph. ఉన్నతోదర బహుభుజి; కుంభ బహుభుజి;
  • convex region, ph. ఉన్నతోదర ప్రదేశం; కుంభాకార ప్రదేశం;
 • convexity, adj. కుంభాకారత్వం; ఉబ్బెత్తుతనం; ఉన్నతోదరత్వం;
 • conveyance, n. యానం; ప్రయాణం చెయ్యడానికి అనుకూలమైన బండి;
 • convict, n. (కాన్విక్ట్) దోషి; అపరాధి; శిక్షితుడు; నిర్వాది;
 • convict, v. t. (కన్విక్ట్) దోషి అని నిర్ధారణ చేయు;
  • convicted criminal, ph. శిక్షింపబడిన నేరస్థుడు;
 • conviction, n. నమ్మిక; నిర్వాదం; అధ్యవసానం; అధ్యవసాయం;
 • convocation, n. పట్టప్రదానోత్సవం;
 • convulsion, n.ఈడ్పు; కంపము; వంపులు తిరగడం;
 • cook, n. వంటరి; వంటమనిషి; వల్లవ; m. వంటవాడు; శూదుడు; f. వంటలక్క; వంటకత్తె; అడబాల; పాచకురాలు;
 • cook, v. t. వండు; పచనముచేయు; ఉడికించు;
 • cooked, adj. వండిన; పచనమైన; ఉడికించిన; పక్వ;
  • cooked in ghee, ph. ఘృతపక్వ;
  • cooked rice, ph. అన్నం; ఉడికించిన బియ్యం;
 • cooker, n. (1) వంటపాత్ర; (2) వంటపొయ్యి;
 • cooking, adj. వంట; వంటకి సంబంధించిన;
  • cooking gas, ph. వంటవాయువు;
  • cooking ladle, ph. వంటగరిటె; తెడ్డు; కరండి;
  • cooking oil, ph. వంటనూనె; మంచినూనె;
 • cooking, v. t. వండడం; వండటం;
 • cool, adj. (1) చల్లని; (2) నిదానమైన;
 • cool, v. i. చల్లారు; చల్లబడు;
 • cool, v. t. చల్లార్చు; చల్లబరచు; చల్లారబెట్టు;
 • co-operate, v. t. సహకరించు;
 • co-operation, n. సహకారం; కూడుదల;
  • non co-operation, ph. సహాయ నిరాకరణం;
 • co-operative, adj. సహకార;
  • co-operative society, ph. సహకార సంఘం;
 • co-ordinate, n. [math.] అక్షం; కోభుజం; నిరూపకం;
  • coordinate system, ph. అక్ష వ్యవస్థ; నిరూపక వ్యవస్థ;
 • co-ordinate, v. t. సానుకూలపరచు; సంధాన పరచు; అనుసంధించు;
 • co-ordinator, n. సంధాత; అనుసంధాత;
 • co-ownership, n. ఉమ్మడి హక్కు;
 • cop, n. పోలీసు;
 • coplanar, adj. ఏకతల; ఒకే సమతలంలో ఉన్న;
 • Copper, n. రాగి; తామ్రం; ఉదుంబలం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 29, సంక్షిప్త నామం, Cu);
  • Copper foil, ph. రాగి రేకు; రాగి తగడు;
  • Copper oxide, ph. తామ్ర భస్మం; చిలుం;
  • Copper sulfate, ph. మయిలుతుత్తం; మైలతుత్తం; ఇంగిలీకం; మయూరకం; కాసీసం; చికీగ్రీవం; తామ్ర గంధకితం; CuSO4;
 • copra, n. కొబ్బరి; కొబ్బరి కురిడీ; కొబ్బరికాయలోని తెల్లటి చెక్క;
 • coprolite, n. శిలాజంగా మారిన మలాన్ని కాప్రలైట్ అంటారు;
 • coprophagic, adj. మలభోజిక; మలభుక్కు; పీతిరి; పీతి;
  • coprophagic dog, ph. పీతి కుక్క; అశుద్ధం తినే కుక్క;
 • copulation, n. మైథునం; రతిక్రీడ;
 • copy, n. (1) నకలు; ప్రతికృతి; ప్రతిలేఖ;(2) ప్రతి;
  • another copy, ph. ప్రత్యంతరం; వేరొక ప్రతి;
  • fair copy, ph. సాపు ప్రతి; సాపు నకలు;
  • hard copy, ph. పటు ప్రతి; కఠిన నకలు;
  • rough copy, ph. చిత్తు ప్రతి; చిత్తు నకలు;
  • soft copy, ph. మృదు ప్రతి; కోమల నకలు;
 • copy, v. i. నకలు తీయు; చూసి రాయు; అచ్చుదించు;
 • copying, n. నకలు తీయడం; ప్రతిలేఖనం;
 • copyright, n. ప్రచురణ హక్కు; గ్రంథప్రచురణ హక్కు; గ్రంథస్వామ్యం; సర్వాధికారం;
 • coquetry, n. టెక్కు; బోగం టక్కులు; వగలమారితనం; లిటీలిట విభ్రమం;
 • coquette, n. వయ్యారి; వయ్యారిభామ;
 • coral, n. పగడం; ప్రవాళం; విద్రుమం; సముద్రంలో నివసించే ఒక రకం జీవియొక్క శరీర అవశేషాలు; the stony skeletons of corals or marine anthozoa;
  • red coral, ph. ఎర్ర పగడం; నవ రత్నాలలో నొకటి;
  • coral atoll, ph. పగడపు దీవి;
  • coral island, ph. పగడపు దీవి;
  • coral polyp, ph. పగడపు జీవి;
  • coral reef, ph. పగడపు దిబ్బ;
  • coral rock, ph. పగడపు శిల;
 • cord, n. (1) తాడు; పాశం; సూత్రం; పగ్గం; దారం కంటె ముతకగా ఉండేది, మోకు కంటె సన్నంగా ఉండేది; (2) తీగ; తంత్రి; (3) 128 ఘనపుటడుగుల పరిమాణం గల వంటచెరకు;
  • telephone cord, ph. టెలిఫోను తాడు;
  • umbilical cord, ph. బొడ్డుతాడు;
  • spinal cord, ph. వెన్నుపాము;
  • vocal cord, ph. నాదతంత్రి; స్వరతంతువు;
 • cordial, adj. సౌమనస్య;
 • cordiality, n. సౌమనస్యత;
 • core, n. మూలాంశం;
  • Earth's inner core, ph. అంతర కేంద్ర మండలం;
  • Earth's outer core, ph. బాహ్య కేంద్ర మండలం;
 • corer, n. కోరాము;
 • coriander seed, n. ధనియాలు;
 • coriander leaf, n. కొత్తిమీర;
 • cork, n. (1) బెరడు; బెండు; త్వచము; (2) బెండుబిరడా; బెండుతో చేసిన బిరడా;
  • pith cork, ph. జీలుగు బెండు;
 • corm, n. [bot.] దుంప; కంద, చేమ వంటి దుంప;
 • cormels, n. pl. [bot.] పిల్లదుంపలు; కంద, చేమ వంటి దుంపలు; దుంప పిలకలు;
 • cormorant, n. నీటికాకి;
 • corn, n. (1) మొక్కజొన్న; (2) ఆనికాయ; కదర; అరికాలిలో వేసే ఒకరకమయిన పుండు;
  • ear of corn, ph. మొక్కజొన్న కంకి; మొక్కజొన్న పొత్తు;
  • pop corn, ph. మొక్కజొన్న పేలాలు; పేలాల మొక్కజొన్న;
  • corn on the cob, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న పొత్తు; పొత్తు;
  • corn field, ph. మొక్కజొన్న చేను; జొన్న చేను;
  • corn flakes, ph. మొక్కజొన్న రేకులు; జొన్న రేకులు;
  • corn meal, ph. మొక్కజొన్న పిండి; జొన్న పిండి;
  • corn oil, ph. మొక్కజొన్న నూనె; జొన్న నూనె;
 • cornea, n. కంటిపాప మీద ఉండే పారదర్శకమైన పొర; see also eye ball;
 • cormorant, n. నీటికాకి;
 • corner, n. మూల; కోణం; చెరగు;
 • corolla, n. [bot.] ఆకర్షక పత్రావళి;
 • corollary, n. [math.] ఉపసిద్ధాంతం; అర్ధాపత్తి; ఫలితం;
 • Coromandel, adj. చోళమండలం కి సంబంధించిన;
  • Coromandel Coast, ph. భారతదేశంలో ఉత్తరాన్న ఉత్కల్ మైదానాలనుండి, దక్షిణాన్న కావేరీ సంగమస్థానం వరకు ఉన్న తూర్పు తీరపు ప్రాంతాన్ని చోళమండలం అనేవారు. ఇదే ఇంగ్లీషు ఉచ్చారణలో కోరమాండల్ కోస్ట్ అయింది; The Coromandel Coast is the southeastern coastal region of the Indian subcontinent, bounded by the Utkal Plains to the north, the Bay of Bengal to the east, the Kaveri Delta to the south, and the Eastern Ghats to the west, extending over an area of about 22,800 square kilometers;
 • corona, n. కిరీటిక; కాంతికిరీటం; కాంతివలయం; ఉపసూర్యకం;
 • coronary, adj. [med.] (1) గుండెకు సంబంధించిన; (2) సీసక; మకుట; కిరీట; కిరీటపు ఆకారంలో ఉన్న;
  • coronary artery, ph. కిరీట ధమని; హృదయ ధమని; సీసక ధమని; మకుట ధమని;
 • coronation, n. పట్టాభిషేకం;
 • coroner, n. మరణ విచారణాధికారి; రాజవైద్యుడు; మకుట వైద్యుడు;
 • corporal, adj. శారీరక; శారీరకమైన; శరీర సంబంధమైన;
  • corporal punishment, ph. బెత్తంతో కొట్టడం, శొంటిపిక్క పెట్టడం వంటి శారీరకమైన శిక్ష;
 • corporate, adj. సభ్యులతో కూడిన; ప్రాతినిధ్య;
 • corporation, n. ప్రతినిధి వర్గం; మండలి; సంస్థ; వాటాదారులు ఉన్న వ్యాపార సంస్థ;
  • municipal corporation, ph. పురపాలక సంఘం;
 • corporeal, adj. పాంచభౌతికమైన; శారీరక; పార్ధివ;
 • corps, n. (కోర్) దండు; సైన్యం; పటాలం;
  • volunteer corps, ph. ఉమేదువారీ పటాలం;
 • corpse, n. (కార్‌ప్స్) శవం; మానవ కళేబరం; పీనుగు; బొంద; కుణపం; (rel.) carcass; carrion;
 • corpuscle, n. రక్తకణం; The key difference between cell and corpuscles is that cell is the basic unit of life while corpuscles are the cells that are free-floating in the blood (erythrocytes and leukocytes);
  • red corpuscle, ph. ఎర్ర కణం; erythrocyte;
  • white corpuscle, ph. తెల్ల కణం;
 • correct, adj. సరి అయిన; ఉచితమయిన;
 • correct, v. t. తప్పులు దిద్దు; సవరించు; సరిదిద్దు;
 • correction, n. సవరణ; సంశోధనం; దిద్దుబాటు;
 • corrected, adj.సంశోధిత; దిద్దిన;
 • correlate, v. t. సహసంబంధించు; సహసమన్వయించు;
 • correlation, n. సహసంబంధం; సహసమన్వయం;
 • correspondence, n. (1) అనురూపత; (2) ఉత్తరప్రత్యుత్త రాలు;
 • corresponding, adj. అనురూప;
 • corridor, n. నడవ; వసారా; వరండా;
 • corrigendum, n. తప్పొప్పుల పట్టిక; అచ్చయిపోయిన పుస్తకంలో దొర్లిన తప్పులని సవరించిన పట్టిక;
 • corolla, n. [bot.] ఆకర్షక పత్రావళి; the petals of a flower, typically forming a whorl within the sepals and enclosing the reproductive organs;
 • corrugated, adj. ముడతలు పెట్టబడ్డ; ముడతలు పడ్డ;
 • corrosive sublimate, n. రసకర్పూరం; భాండవకర్పూరం; Mercuric chloride; HgCl2;
 • corruption, n. (1) వికృతి; (2) లంచగొండితనం;
 • cortex, n. పట్ట; బెరడు; వల్కలం; దేహాంగాలని సంరక్షించే పొర;
  • adrenal cortex, ph. [med.] వృకోపర వల్కలం;
  • lower cortex, ph. [med.] అధో వల్కలం;
 • cortical, adj. [med.] వల్కిక;
 • corundum, n. కురువిందం; కురింజిరాయి;
 • Corvus, n. హస్త; ఈ రాసిలో ఉన్న 5 ప్రకాశవంతమైన నక్షత్రాల సమూహమే హస్తా నక్షత్రం;
 • coryza, n. [med.] పడిశం; జలుబు;
 • cosmetic, adj. (1) సౌగంధిక; (2) పై మెరుగుకి సంబంధించిన;
 • cosmetician, n. సౌగంధికుడు;
 • cosmetics, n. సుగంధ ద్రవ్యాలు; సౌగంధికాలు; మైపూతలు; అంగరాగాలు; సురభిళ విలేపనాలు; అలంకరణ సామగ్రి;
 • cosmic, adj. రోదసీ; రోదసికి సంబంధించిన; విశ్వ; కాస్మిక్‍;
  • cosmic dust, ph. విశ్వ పరాగం; విశ్వధూళి; కాస్మిక్ పరాగం; విశ్వ దూసరం
  • cosmic rays, ph. విశ్వకిరణాలు; కాస్మిక్ కిరణాలు;
 • cosmogony, n. విశ్వోత్పత్తి; విశ్వసృష్టి శాస్త్రం; విశ్వనిర్మాణ శాస్త్రం; ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగిందో అధ్యయనం చేసే శాస్త్రం;
 • cosmology, n. విశ్వశాస్త్రం; విశ్వోద్భవ శాస్త్రం; రోదసీ శాస్త్రం; విశ్వాంతరాళాన్ని అధ్యయనం చేసే శాస్త్రం;
 • cosmonaut, n. వ్యోమగామి; జ్యోతిర్గామి;
 • cosmopolitan, adj. సార్వజనిక;
 • cosmos, n. విశ్వం; రోదసి; deep space;
 • cost, n. ఖరీదు; ఖర్చు; ధర; మూల్యం; దారణ; ఒక వస్తువుని కొనడానికి అయే డబ్బు;
 • cost of labor, ph. చేతకూలి; మజూరీ;
 • costume, n. వేషం; ఒక కాలానికి కాని, వ్యాపారానికి కాని సంబంధించిన దుస్తులు;
 • costs, n. ఖర్చులు; తగులుబడి; తగులుబాటు;

---Usage Note: cost, price, value

 • ---Use cost to talk about how much you have to pay for something. Use price only to talk about the amount of money you have to pay to buy something. Use charge while talking about the amount of money someone makes you pay. Use value to talk about how much something is worth. Use expense while talking about large sums of money.
 • cot, n. మంచం; పర్యంకం;
  • camp cot, ph. మకాం మంచం;
  • folding cot, ph. మడత మంచం;
 • coterie, n. జట్టు; ముఠా; మూక; బృందం; ఒకే విధంగా ఆలోచించే సన్నిహిత బృందం;
 • cottage, n. కుటీరం; పాక; పర్ణశాల;
 • cottage industry, n. కుటీర పరిశ్రమ; గృహ పరిశ్రమ;
 • cotter pin, ph. తమిరె;
 • cotton, adj. ప్రత్తి; దూది; తూలిక;
  • cotton candy, ph. పీచుమిఠాయి;
  • cotton fiber, ph. నూలుపోగు;
  • cotton swab, ph. తూలినాళిక; చిన్నపుల్ల చివర దూదిని తగిలించగా వచ్చిన సాధకం; చెవులను శుభ్రపరచుకొనుటకు ఉపయోగించబడేది;
 • cotton, n. ప్రత్తి; దూది; తూలిక;
  • ginned cotton, ph. దూది; పిక్క తీసిన ప్రత్తి; పిక్క తీసి ఏకిన ప్రత్తి;
  • raw cotton, ph. ముడి ప్రత్తి;
 • cotyledon, n. నూగాకు; విత్తు మొలకెత్తేటప్పుడు మొదట వచ్చే ఆకు; (ant.) కోటాకు;
 • couch, n. శయ్య; పడక; పల్యంకం; (rel.) Sofa;
  • couch potato, ph. [idiom.] శయ్యాళువు;
 • cougar, n. బూదిపిల్లి; కొండ సింహం; అమెరికా కొండలలో తిరుగాడే, బూడిద రంగు చర్మం గల ఒక రకం చిన్న పులి; mountain lion; puma; [bio.] Puma concolor; Cougar is closer to a domestic cat than to a ion or tiger;
 • cough, n. దగ్గు; కాసం; కాస;
  • dry cough, ph. పొడి దగ్గు; శుష్క కాస;
  • phlegmatic cough, ph. తడి దగ్గు; కఫ కాస;
 • cough drop, ph. దగ్గు బిళ్ల; కాస బిళ్ల;
 • council, n. సభ; సంఘం; సమితి; పరిషత్తు; మంత్రాంగ సభ;
  • privy council, ph. మంత్రి పరిషత్తు; అత్యున్నత న్యాయసభ;
  • village council, ph. పంచాయతీ;
 • counsel, n. (1) వకీలు; వకీళ్ల బృందం; (2) సలహా;
 • counselor, n. (1) సలహాదారుడు; (2) వకీలు;
 • count, n. లెక్క; లెక్కింపు; పరిగణన;
 • count, v. i. లెక్కించు; లెక్కపెట్టు; పరిగణించు;
 • countable, adj. గణనీయం; గణీయ; సంఖ్యేయ; గణ్య;
  • countable infinity, ph. గణనీయ అనంతం; సంఖ్యేయ అనంతం; A set is countably infinite if its elements can be put in one-to-one correspondence with the set of natural numbers. In other words, one can count off all elements in the set in such a way that, even though the counting will take forever, you will get to any particular element in a finite amount of time;
 • countenance, n. వదనం; ముఖం; ఆననం;
 • counter, n. (1) లెక్కిణి; లెక్కపెట్టే పరికరం; (2) మెత్తపలక; సొమ్ము లెక్కపెట్టుకుందికి వాడే బల్ల; (3) పని చేసుకుందికి వీలుగా, చదునుగా ఉన్న తీనె; (4) వ్యాపార స్థలాలలో డబ్బు చెల్లించే కిటికీ;
 • counter, adj. pref. ప్రతి; ప్రతికూల; ఎదురు;
  • counter-argument, ph. ప్రతివాదన;
  • counterclockwise, ph. ప్రతిఘడి; వామావర్త; అప్రదక్షిణ;
  • counter-example, ph. ప్రత్యుదాహరణ;
  • counterproductive, ph. ప్రతికూల ఫలసిద్ధి;
  • countersuit, ph. అడ్డుదావా;
 • counterfeit, adj. నకిలీ; దొంగ నకలు; మోసపుచ్చడానికి తయరు చేసిన నకలు;
 • counterpart, n. (1) ఉల్టాభాగం; (2) ప్రత్యర్థి; (3) సహస్థానీయుడు;
 • countless, adj. అసంఖ్యాకములయిన;
 • country, adj. దేశీ; నాటు; పల్లెటూరి;
  • country bumpkin, ph. బైతు; పల్లెటూరి గబ్బిలాయి;
  • country fig, ph. అత్తి;
  • country made goods, ph. నాటు సరుకు; దేశవాళీ వస్తుసముదాయం;
  • senna, ph. తంగేడు మొక్క;
 • country, n. దేశం; పల్లెటూరు; వర్షం; సీమ;
  • developing country, ph. వర్ధమాన దేశం; ‘వెనుకబడ్డ’ అనడానికి బదులు ‘వర్ధమాన’ అంటే బాగుంటుంది;
  • foreign country, ph. విదేశం; పరదేశం; సీమ;
 • countryside, n. పల్లెపట్టు; గ్రామీణ ప్రాంతం; జనపదం;
 • coupe, n. (కూపె) కూపం; చిన్న గది, వాహనాలలో ఇద్దరు ప్రయాణీకుకి సరిపడే చిన్న గది; (rel.) bogie and compartment;
 • couple, n. (1) జంట; జోడీ; జత; యుగళం; యుగ్మము; ద్వయం; ద్వయి; దంట; (2) ఆలుమగలు; మిథునం; దంపతి; దంపతులు; (note) couple అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా తెలుగులో దానికి అనువాదమయిన దంపతులు అనే మాట బహువచనం అన్నది గమనార్హం.
 • couple, v. t. జోడించు; జతచేయు; జంటపరచు;

---Usage Note: couple, pair

 • ---Use couple to talk about any two things of the same kind: There are a couple of cars. Use pair to talk about something that has two main parts that are joined together: a pair of pants; a pair of scissors. Pair is also used to talk about things that are used together: a pair of shoes.
 • couplet, n. (1) ద్విపద; రెండు పాదాలు ఉన్న పద్యం; (2) ద్వికం;
 • coupling, n. జోడించేది; జంటపరచేది; జంటకి; ద్వికి;
 • courage, n. ధైర్యం; సాహసం; నిర్భయం; నిబ్బరం; చేవ; కలేజా; దిలాసా;
 • courier, n. m. జాంఘికుడు; వార్తాహరుడు; వార్తావాహకం;
 • course, n. (1) గతి; కదలికకి అనుకూలమైన బాట; (2) పాఠావళి; విషయం; మందలం; విద్య నేర్చుకోడానికి కావలసిన పాఠ్యాంశాల సంపుటి; (3) భోజనపు వడ్డనలో ఒక భాగం;
 • course, v. i. ప్రవహించు; ప్రయాణం చేయు;
 • court, n. (1) కచేరీ; దర్బారు; దివాణం; మొగసాల; (2) న్యాయస్థానం; ధర్మాసనం; ధర్మదర్భారు; కోర్టు; (3) ఆటస్థలం;
  • appeals court, ph. ఉత్తర దర్బారు; అప్పీలు కోర్టు;
  • high court, ph. ఉన్నత న్యాయస్థానం;
  • king's court, ph. రాజ్యసభ; రాజ్యాంగనం;
 • courtesy, n. (1) మర్యాద; (2) సౌజన్యం;
 • courtiers, n. సభాసదులు;
 • courtesan, n. m. అజ్జుకుఁడు; f. అజ్జుక;
 • courtship, n. ఉపసర్పణం;
 • courtyard, n. నాలుగిళ్ల వాకిలి; ముంగిలి; చావడి; ప్రాంగణం; మండువా; చతుశ్శాలిక; అంకణం; అంగణం; హజారం;
 • cousin, n. జ్ఞాతి; దాయ; సజన్ముడు; మాతృష్యస్రీ; పితృష్యస్రీ;
  • cross cousins, ph.
  • matrilateral cross cousins, ph. తల్లి అన్నదమ్ముల పిల్లలు; తెలుగు దేశంలో వరసకి మేనబావలు, మేనవదినలు, మేనమరదళ్ళు అవతారు;
  • patrilateral cross cousins, ph. తండ్రి అప్పచెల్లెళ్ళ పిల్లలు;
  • parallel cousin
  • matrilateral parallel cousins, ph. తల్లి అప్పచెల్లెళ్ళ పిల్లలు; తెలుగు దేశంలో వరసకి అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అవతారు;
  • patrilateral parallel cousins, ph. తండ్రి అన్నదమ్ముల పిల్లలు; తెలుగు దేశంలో వరసకి అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అవతారు;
  • paternal cousin, ph. దాయ;
 • covalent, adj. సహసంయోజక;
  • covalent bond, ph. సహసంయోజక బంధం;
 • cover, n. (1) మూత; కప్పు; ఉపదేహం; (2) మూకుడు (మూయు + కుడుక); (3) కవరు;
 • covered, adj. కప్పబడ్డ; పిహిత; అవగుంఠిత;
 • covering, n. ఆచ్ఛాదనం; ఆస్తరణం; తొడుగు; గుంఠనం;
  • gold covering, ph. జల పోసనము;
  • table covering, ph. మేజా పోసనము;
  • wall covering, ph. కుడ్య పోసనము;
  • well covering, ph. వాపీ పోసనము; బావితొడుగు; బావిమూఁత; వీనాహువు;
 • covering, v. t. కప్పడం;
 • covert, adj. రహస్య; ప్రచ్ఛన్న;
 • covert war, ph. ప్రచ్ఛన్న యుద్ధం;
 • cow, n. ఆవు; గోవు; గిడ్డి; ధేనువు; మొదవు; అనడుహి;
  • black cow, ph. కర్రావు;
  • brown cow, ph. పుల్లావు;
  • white cow, ph. వెలిమొదవు;
  • cow dung, ph. ఆవుపేడ;
 • cowhitch, n. దూలగొండి; దురదగొండి;
 • cow-pen, n. పశువుల సాల; గోష్ఠము;
 • cowage, n. దూలగొండి; దురదగొండి;
 • coward, n. పిరికి పంద; పారుబోతు; భీరువు; భీరుడు; m. పిరికివాడు; f. పిరికిది;
 • cowardice, n. పిరికితనం;
 • cow-pox, n. గోస్తనవ్యాధి; గోసూచికం;
 • cowrie, n. గవ్వ; కపర్ది;
 • cows, n. pl. ఆవులు; ఆలు; గోవులు; ధేనువులు;
 • coxalgia, n. తుంటి కీలులో నొప్పి;
 • coyote, n. (ఖయోటీ లేదా ఖయోడీ) గుంటతోడేలు; ఉత్తర అమెరికాలో తిరిగే చిన్న తోడేలు వంటి జంతువు;
 • crab, n. పీత; ఎండ్రకాయ; కులీరం; కర్కటం; కర్కాటకం;
  • hermit crab, ph. ముని పీత;
 • crack, n. (1) పగులు; బీట; నెరద; నెరియ; సరియ; ఓడు; (2) పిచ్చి మనిషి;
 • crack, v. i. పగులు; చిట్లు; బీట వేయు; నెరద; ఓడు;
  • crackling sound, ph. చిటపట; చిటచిట చప్పుడు;
 • cradle, n. తొట్టి; డోల; ఊయల; ఉయ్యాల; లాలి; జంపాల; పిల్లలని పడుకోబెట్టే ఊయల;
 • craft, n. చేతిపని; నైపుణ్యంతో చేసే పని; వృత్తి;
 • craftsman, n. చేతిపనిలో నైపుణ్యం గల వ్యక్తి;
 • craftsmanship, n. పనితనం;
 • cramps, n. pl. కండరములు బిగుసుకొని కొంకర్లు పోవడం;
  • leg cramps, ph. కాలు పిక్కలలోని కండరాలు బిగుసుకుని ముడి పెట్టినట్లు అయిపోయి నొప్పి పుట్టడం;
 • crane, n. (1) కొంగ; బకం; కొక్కెర; కొక్కిరాయి; (rel.) heron; stork; (2) బరువులనెత్తు యంత్రం;
 • crank, n. (1) ముసలకం యొక్క ముందు, వెనక కదలికని చక్రాలని గిర్రున తిప్పడానికి వీలు చేసే పరికరం; (2) తిక్కశంకరయ్య;
 • cranky, adj. సులభంగా చిరాకు పడే స్థితి;
 • cranium, n. కపాలం; పుర్రె;
 • crap, n. చెత్త; వ్యర్థం; బాగులేని పనితనం;
  • that movie is a crap, ph. ఆ సినిమా చెత్తగా ఉంది;
 • crash, n. టోత్కారం; కూలుడు;
 • crate, n, పెట్టె; కట్టె పెట్టె; సరకుల రవాణా కొరకు కర్రతో కాని, అట్టతో కాని, ప్లేస్టిక్‍తో కాని చేసిన పెట్టె;
 • crater, n. జంగిడి; ఉల్కాపాతం వల్ల ఒక గ్రహం మీద ఏర్పడిన గొయ్యి; a shallow hole formed on the surface of a planet due to the impact of a meteorite;
 • crawl, v.i. (1) ప్రాకు; పాకాడు; దోగాడు; జరుగు; (2) పాకురు; నేలకి మోకాళ్ళని, చేతులని ఆనించి నాలుగు కాళ్ళ మీద నడిచినట్లు ముందుకు కదలడం; (3) అతి నెమ్మదిగా కదులు;
 • crayons, n. pl. మైనపు బలపాలు; బొమ్మలకి రంగులు వెయ్యడానికి వాడే సుద్ధ బలపాలు;
 • craze, n. వేలంవెర్రి; కొత్త వస్తువుల మీద అలవాట్లమీద విపరీతమైన మోజు;
 • crazy, n. వెర్రి అభిమానం;
 • craziness, n. ఉన్మత్తత; పిచ్చి; వెర్రి;
 • creak, v. i. కిర్రుమను; కిర్రుమని చప్పుడు చేయు;
 • cream, n. (1) మీగడ; మస్తు; కోవా; (2) బాగా చిక్కబరచబడ్డ పాలు; (3) నూక; రవ్వ; (4) సారం; సారాంశం;
 • cream, v. t. చితక్కొట్టు; బాధు;
 • cream of wheat, ph. గోధుమ నూక; గోధుమ రవ్వ;
 • crease, n. (1) మడత; బట్టలో మడత; (2) ముడత; చర్మంలో మడత;
 • creation, n. సృష్టి; సృజనం; నిర్మాణం; ఏర్పాటు; అభిసర్గం;
  • creation theory of life, ph. జీవసృష్టి వాదం;
 • creative, adj. సృజనాత్మక;
 • creativity, n. సృజనాత్మకత; స్రష్టత్వం; సర్జనశక్తి; కల్పనాశక్తి;
 • creator, n. సృష్టికర్త; స్రష్ట; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త;
 • creature, n. జన్మి; ప్రాణి; జీవి;
 • credence, n. నమ్మిక; విశ్వాసం;
 • credible, adj, నమ్మదగ్గ; విశ్వసనీయ;
 • credibility, n. విశ్వసనీయత; అర్థగౌరవం;
 • credit, n. (1) పరపతి; ప్రతిష్ఠ; (2) అరువు; అప్పు; ఉత్తమర్ణం;(3) జమ; (4) నమ్మకం;
  • credit transaction, ph. అరువు బేరం;
 • credit, v. t. జమకట్టు;
 • creditor, n. అప్పిచ్చువాడు; అప్పులవాడు; రుణదాత; జమాజవాను; ఉత్తమర్ణుడు; (ety.) ఉత్తమర్ణ = ఉత్తమ+ఋణ(గుణసంధి);
  • credits and debits, ph. జమాఖర్చులు;
 • creditworthy, adj. పరపతి;
 • creditworthiness, n. నమ్మదగిన; పరపతి ఉన్న;
 • creed, n. నమ్మకాలు; నమ్మకం;
 • creep, v. i. డేకురు; నేలకి కడుపుని కాని, ముడ్డిని కాని ఆనించి ముందుకు జారడం;
 • creeper, n. లత; పాదు; తీగ; అలము; వల్లి;
 • cremation, n. దహనం; దహన సంస్కారం;
  • cremation grounds, ph. శ్మశానం; శ్మశాన వాటిక; దహనవాటిక; పురాంతక భూములు; రుద్ర భూములు;
 • crepe, n. (1) పల్చటి అట్టు; ఫ్రాన్స్ దేశపు అట్టు; కాగితం దోసె; (2) ఒక రకమైన పల్చటి గుడ్డ;
 • crescendo, n. పరాకాష్ఠ; ఉత్కర్ష;
 • crescent moon, ph. నెలవంక; చంద్రవంక; చంద్రరేఖ;
 • crest, n. శిఖ; తలాటం; ఉత్తంసం;
  • crest and trough, ph. శిఖ, గర్త;
 • crestfallen, adj. విషాధపూరిత; ఉత్సాహరహిత;
 • crew, n. సిబ్బంది; సరంగులు; కర్మచారులు;
 • crib, n. పసిపిల్లలు పడుక్కోడానికి కటకటాలు ఉన్న తొట్టి మంచం;
 • cricket, n. (1) కీచురాయి; చీరండ; ఇలకోడి; శలభం; కుమ్మరిపురుగు; (2) క్రికెట్ అనే ఒక ఆట;
 • crime, n. అపరాధం; బృహన్నేరం; నేరం; కంటకం; ఏనస్సు; సమాజంపై చేసిన అపరాధం; offence against society;
 • criminal, n. నేరస్థుడు;
 • criminal, adj. అపరాధ; హింశోధ్భవ; క్రిమినలు;
  • criminal code, ph. దండవిధి; దండన వ్యవహార సంహితం; శిక్షా స్మృతి;
  • criminal procedure code, ph. దండవిధి; దండన వ్యవహార సంహితం; శిక్షా స్మృతి;
 • criminology, n. నేరవిచారణ శాస్త్రం;
 • crimson, n. రక్తిమ; అరుణిమ; అరుణ వర్ణం; ఎరుపు; ఎరట్రి రక్తపు రంగు; కెంపు రంగు;
 • cripple, n. అవిటి వ్యక్తి;
 • crippled, adj. అవిటి;
 • crisp, adj. (1) కరకరలాడే; సరికొత్త; (2) బిగువైన;
 • crisp style, ph. బిగువైన శైలి; చురుకైన శైలి;
 • crisis, n. విషమ పరిస్థితి; చిక్కు; సంక్షోభం; సంకటకాలం;
 • criterion, n. ప్రమాణం; కొలబద్ధ; గీటురాయి;
 • critic, n. (క్రిటిక్) విమర్శకుడు; విమర్శకురాలు; బెన్‌జాన్సన్.. ‘విమర్శకుడు దోషాల్ని చెప్పడమే కాకుండా, దోష రహితంగా ఎలా ఉండాలో’ చెప్పాలన్నారు.
 • critical, adj. కీలక;
 • critical, n. కీలకం;
 • criticism, n. (1) విమర్శ; (2) ఆక్షేపణ; హడ్సన్ విమర్శ విధులను వివరిస్తూ...'Criticism may be regarded as having two different functions that of interpretation and that of Judgement' అని అన్నారు.
  • destructive criticism, ph. వితండవాదం;
  • literary criticism, ph. సాహిత్య విమర్శ; ఒక గ్రంథంలోని లోపాలోపాలను, ఔచిత్య, అనౌచిత్యాలను, భావ గంభీరతను అలంకార రచనా పాటవాన్ని, ధ్వని విశేషాల్ని, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తు నిర్మాణ సౌష్టవాన్ని, పాత్ర పోషణ, రస పోషణ, సన్నివేశ కల్పనలను, ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి సాహిత్యంలో ఆ గ్రంథానికి ఉన్న స్థానాన్ని నిర్ణయించడాన్ని సాహిత్య విమర్శగా పేర్కొనవచ్చు;
 • criticize, v. t. (1) విమర్శించు; (2) ఆక్షేపించు;
 • critique, n. (క్రిటీక్) విమర్శ; వివేచన; 'మృశ్’ అనే ధాతువుకు ‘వి’ అనే ఉపసర్గ చేరి ‘విమర్శ’ అనే పదం ఏర్పడింది. విమర్శ అనే పదానికి పరిశీలించడం, పరీక్షించడం, పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే అర్థాలున్నాయి. ఒకరు చేసిన పనిలో బాగోగులను ఇంకొకరు వివేచించి తెలపడాన్ని ‘విమర్శ’ అంటారు;
 • critter, n. జంతువు; పురుగు; పురుగు, పుట్ర;
 • Cro Magnon, n. (క్రో మేన్యన్) ఐరోపా‌లో నియాన్‌డ్రథాల్ తర్వాత ప్రభవించిన ఒక జాతి మానవుల వంటి తెగ; ఈ జాతి ఇప్పుడు నశించిపోయింది;
  • croaking of frogs, ph. కప్ప అరుపు; బెకబెక మను; టర్టరాయణం;
 • crocodile, n. మొసలి; మకరం; నక్రం; కుంభీరం;
  • crocodile tears, ph. మొసలి కన్నీరు; మకరాశ్రువులు; [idiom.] కడుపులో దుఃఖం లేకపోయినా కళ్ళ వెంబడి వచ్చే నీళ్ళు;
 • crook, n. కుటిలుడు;
 • crooked, adj. కుటిల; వంకర టింకర; అడ్డదిడ్డం; అష్టావక్ర;
 • crooked, n. (క్రుకెడ్) అష్టావక్రం;
 • crop, n. (1) పంట; ఫలసాయం; సస్యం; (2) కత్తిరించి తీర్చి దిద్దడం;
  • cash crop, ph. వర్తకపు పంట;
  • first crop, ph. సారువా పంట;
  • second crop, ph. దాళవా పంట;
  • summer crop, ph. పునాస పంట;
  • third crop, ph. పునాస పంట;
  • crop pest, n. పంట తెగులు; తెగులు;
 • Cross, n. శిలువ; క్రైస్తవ మతానికి గుర్తు;
 • cross, adj. (1) పర; (2) వజ్ర; అడ్డ;
  • cross multiplication, ph. వజ్ర గుణకారం; అడ్డ గుణకారం; ఒక భిన్న సమీకరణంలో ఒక పక్కనున్న లవాన్ని రెండవ పక్క ఉన్న హారంతో గుణించడం;
  • cross pollination, ph. పర పరాగ సంపర్కం;
  • cross ratio, ph. వజ్ర నిష్పత్తి;
  • cross section, ph. అవచ్ఛేదం; అడ్డుకోత;
 • cross, v. t. (1) పరాగ సంపర్కం చేయు; రెండు మొక్కల జన్యుపదార్థాలని కలపడం; (2) పొర్లించు; రెండు జంతువుల జన్యుపదార్థాలని కలపడం;
 • crossing, n. (1) దాటడం; (2) తరణం; (3) సంధి స్థలం;
  • crossing out, ph. కొట్టివేత;
 • crossover, v. t. దాటు; తరించు;
 • crossroads, n. కూడలి; చౌరస్తా; శృంగాటకం; చతుష్పథం; నాలుగు రోడ్ల కూడలి;
 • crossword, n. పదవిన్యాసం; గళ్లనుడికట్టు; పదకేళి; పలుకుల పందిరి; జల్లికట్టు;
 • crotch, n. కచ్చ; కిస్తా; తొడలు, కటి ప్రదేశం కలిసే స్థానం;
 • croton, n. భూతాంకుశం; క్రోటను;
 • crow, n. కాకి; కాకం; భస్మచ్ఛవి కాకం; వాయసం; కరటకం; ఐంద్రి; బలిభుక్కు; బలిపుష్ఠం; అరిష్టం; కారవం; పికవర్ధనం; ధ్వాంసవర్ధనం; శీతర్తుబలీయం; చిరప్రాణం; పరభ్రుత్‍; ఆత్మఘోషం; ఏకాక్షి; సకృత్‍ప్రజా; (rel.) raven;
 • crow pheasant, n. జెముడుకాకి;
 • crowbar, n. గునపం; గడ్డపార; పలుగు; కుద్దాలం;
 • crowd, v. i. ముసురు; మూగు; గుమిగూడు;
 • crowd, n. గుంపు; మూక; జనసమ్మర్దం; గుమి; సంకులం;
 • crowded, adj. సంకులమైన;
 • crown, n. శిఖ; కిరీటం; కోటీరం; మకుటం; బొమిడికం;
 • crucial, n. కీలకం;
 • crucible, n. మూస; ద్రోణి; దొన్నె; పుటం; ప్రమిద; దొప్ప;
  • crucible tongs, ph. పటకారు;
 • crucifix, n. కొరత; శిలువ;
 • crucify, v. t. (1) కొరత వేయు; (2) [idiom] గట్టిగా చివాట్లు పెట్టు;
 • crude, adj. ముతక; ముడి; ఆమమైన; నాటు; కచ్చా; మోటు; చిత్తు;
  • crude oil, ph. ముతక నూనె; ముడి నూనె; మట్టినూనె; శిలతైలం; ఆమనూనె;
 • cruel, adj. క్రూరమైన; దారుణమైన;
  • cruel murder, ph. దారుణమైన కూనీ; చిత్రవధ;
  • cruel violence, ph. చిత్రహింస;
 • cruelty, n. క్రూరత్వం; దౌష్ట్యం; దుష్టత్వం;
 • cruise, n. (క్రూజ్) నౌకాయానం; షికారా; పడవ ప్రయాణం;
 • crumb, n. (1) చిన్న ముక్క; తిండి పదార్థాలని చిదిపినప్పుడు రాలే ముక్క; (2) [idiom] పిసరు;
 • crusade, n. ఉద్యమం;
 • crush, v. t. (1) పిండు; నలుపు; (2) అణగదొక్కు; చిత్తుచేయు;
 • crush, n. పిండగా వచ్చిన రసం;
 • crusher, n. పేషకి; పేషకం; పేషణ యంత్రం;
 • crust, n. పటలం; పెచ్చు; ఉల్లె; అప్పం;
  • Earth's crust, ph. భూ పటలం;
 • crutch, n. (1) ఊతకోల; ఆనుకర్ర; (2) ఊత; ఆను;
 • crux, n. కీలకం; ఆయువుపట్టు; మర్మం;
 • Crux Australis, n. త్రిశంకుడు; దక్షిణార్ధగోళంలోని ఆకాశంలో, శిలువ ఆకారంలో, స్పుటంగా కనిపించే నక్షత్ర మండలం;
 • cry, n. ఏడ్పు; రోదన; అరుపు; బొబ్బ; కూత;
 • cry, v. i. ఏడ్చు; రోదించు; అరచు; వాపోవు; అలమటించు;
 • cryptic, adj. అంతర్నిహితమైన; నర్మగర్భమైన;
 • cryptogram, n. అంతర్లాపి; నర్మగర్భలేఖ;
 • cryptography, n. ఆరండకము; నర్మగర్భలేఖనం; గూఢలేఖనశాస్త్రం;
 • crystal, n. స్ఫటికం; పలుగు;
 • crystalline, adj. స్ఫటికపు; స్ఫటికముతో చేయబడిన; స్ఫటికాకారముతో;
 • crystallization, n. స్ఫటికీకరణం;
 • crystallography, n. స్ఫటికలేఖనం;
 • crystalloid, n. స్ఫటికార్థం; (ety.) స్ఫటికం వంటి పదార్థం;
 • crystals, n. స్ఫటికములు; స్ఫటికాదులు;
 • cub, n. పులి పిల్ల; సింహపు పిల్ల; పాండా పిల్ల; మొదలైనవి;
 • cube, n. (1) ఘనం; ఘనచతురస్రం; సమఘనం; షణ్ముఖి; ఆరు ముఖాలు కలది; ఉదాహరణకి ఒక షణ్ముఖి(cube) తీసుకుంటే, దాని ప్రతి ముఖం చతురస్రాకారంలో ఉంటుంది. ప్రతి అంచు దగ్గరా రెండు ముఖాలు కలుస్తాయి. ప్రతి శీర్షం దగ్గరా మూడు ముఖాలు కలుస్తాయి; (2) ముక్క;
 • cube-root, n. ఘనమూలం;
 • cubebs, n. pl. చలవ మిరియాలు; తోక మిరియాలు;
 • cubit, n. మూర; మూరెడు;
 • cuboid, n. (1) దీర్ఘఘనం; ఆరు ముఖాలు, ప్రతి ముఖము దీర్ఘ చతురస్రాకారం అయిన ఒక ఘన రూపము; (2) పాదములో ఉన్న ఒక ఎముక పేరు;
 • cuckoo, n. కోకిల; కోయిల;
 • cucumber, n. దోసకాయ; కీరా;
 • cudgel, n. దుడ్డు; దుడ్డు కర్ర; లక్కక;
 • cufflinks, n. బేడీ బొత్తాలు; అరదండాలు;
 • cuffs, n. (1) బేడీలు; అరదండాలు; నిగడాలు; (2) పొడుగు చేతుల చొక్కాలకి పెట్టుకునే ఒక రకం బొత్తాములు;
 • cuisine, n. (క్విజీన్) వంట; వండే పద్ధతి; కుశిని;
 • cul-de-sac, n, (1) ఒక పక్కనే తెరచి ఉన్న సంచి వంటి శరీర కట్టడం; (2) సంచీ సందు; ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న వీధి;
 • culinary, adj. పాకశాస్త్ర;
 • culpable, adj. నింద్యమయిన; దోషయుక్త;
  • culpable homicide, ph. నిందార్హమైన నరవధ; దోషయుక్తమయిన హత్య;
  • culpable negligence, ph. దోషయుక్తమైన ఉపేక్ష;
 • culprit, n. నేరస్థుడు; అపరాధి; నేరము చేసిన వ్యక్తి;
 • cultivable, adj. సేద్యయోగ్య;
 • cultivar, n. సాగురకం; సాగుమొక్క; (ety.) cultivated + variety; సాగు చేసేందుకు, వన్య ప్రజాతిని(wild plant) సిద్ధ పరచిన వంగడం (for cultivation) అని అనవచ్చు;
 • cultivation, n. సాగు; సేద్యం; వ్యవసాయం; జిరాయితీ;
  • contour cultivation, ph. ఈనెగట్టు సేద్యం;
  • shift cultivation, ph. పోడు వ్యవసాయం;
  • wet cultivation, ph. దంపసాగు; దంపసేద్యం;
 • cultivator, n. రైతు;
 • culture, n. (1) సంస్కృతి; (2) తోడు; పాలని తోడు పెట్టడానికి వేసే మజ్జిగ; (3) సూక్ష్మజీవులని ప్రయోగశాలలో పెంచే పద్ధతికి అనుకూలపడే మధ్యమం; (4) పెంపకం; (5) వ్యవసాయం;
 • culture, suff. సాయం; పెంపకం;
  • agriculture, n. వ్యవసాయం;
  • arboriculture, n. చెట్ల పెంపకం; తరుకృషి; తరుసాయం;
  • monoculture, n. ఏకసాయం; ఒకే రకం పంటని పదేపదే పండించడం;
  • pisciculture, n. చేపల పెంపకం; మత్స్యసాయం; మత్స్యపరిశ్రమ;
  • polyculture, n. బహుసాయం; ఒకే పొలంలో ఒకదాని తర్వాత మరొకటి చొప్పున, పంటలని మార్చి పండించడం;
  • viticulture, n. ద్రాక్ష పెంపకం;
 • culvert, n. తూము; మదుం; కలుజు; కానాగట్టు, kAnAgaTTu
 • cumbersome, n. యాతన; భారం; ప్రతిబంధకం;
 • cumin seed, n. జీలకర్ర;
 • cummerbund, n. కటివం; దట్టి; కమ్మరబొందు;
 • cumulative, adj. సంచాయిత;
 • cuneiform writing, ph. శరాకార లిపి;
 • cunning, n. కపటత; టక్కు;
 • cunnilingus, n. యోని ద్వారాన్ని నోటితో ఉత్తేజ పరచడం;
 • cup, n. దొప్ప; దొన్నె; పిడత; చషకం; చమసం; చిట్టి; చిప్ప; మరిగ; కప్పు;
  • cup made of stone, ph. రాతిచిప్ప; రాచ్చిప్ప; మరిగ;
 • cupboard, n. అలమారు; చిట్టటక; కప్పులు పెట్టుకొనే బీరువా;
 • cupful, n. చిట్టెడు; కప్పుడు; కప్పు;
 • curated, adj. వడపోసిన; సంస్కరించిన; మరమ్మత్తు చేసిన;
 • curator, n. భాండాగారి;
 • curb, kerb (Br.), n. చపటా, వీధి చపటా,
 • curd, n. (1) పెరుగు; దధి; కలుఁపు; ఆమిక్ష; (2) కోలకం; గడ్డగా గట్టిగా ఉండేది;
 • curdle, n. గర; గడ్డ; విరుగుడు;
 • curdle, v. t. గరకట్టు; విరుగు; గడ్డకట్టు; పేరుకొను;
 • cure, n. (1) వైద్యం; మందు; నివారణ; (2) స్వస్థత;
  • nature cure, ph. ప్రకృతి వైద్యం;
 • cure, v.t. (1) నయము చేయు; కుదుర్చు; మానిపించు; స్వస్థపరచు; (2) నిల్వ చేయు;
 • cured, adj. (1) నిల్వ చేసిన; (2) రోగం నయం చేయబడ్డ;
  • cured meat, ph. నిల్వ చేసిన మాంసం;
 • curiosity, n. ఉత్సుకత; ఆసక్తి; బుభుత్స; వ్యాసక్తత;
 • curlew, n. క్రౌంచపక్షి; కంకపక్షి
 • curls, n. కురులు; ఉంగరాల జుత్తు; నొక్కుల జుత్తు; వక్ర కేశములు; కుటిల కుంతలములు;
 • curly, adj. కుటిల; ఉంగరాల;
  • curly hair, ph. కుటిల కుంతలాలు; ఉంగరాల జుత్తు;
 • currency, adj. వాడుకలోనున్న; చెల్లుబడి అయే; చలామణిలో ఉన్న;
 • currency, n. వాడుకలోనున్న డబ్బు; చెల్లుబడి అయే డబ్బు;
 • current, adj. ప్రస్తుత; వర్తమాన; సమకాలీన; చాలూ; అర్జు;
  • current account, ph. చాలూ ఖాతా; అర్జు ఖాతా;
  • current affairs, ph. వర్తమాన వ్యవహారాలు;
  • current phase, ph. వర్తమాన దశ;
 • current, n. (1) ప్రవాహం; విద్యుత్ ప్రవాహం; ఆపూరం; విద్యుత్తు; కరెంటు; (2) సమకాలీనం; ప్రస్తుతం;
  • alternating current, ph. ప్రత్యావర్తక ప్రవాహం; ఏకాంతర ప్రవాహం; ఏకాంతార విద్యుత్తు;
  • direct current, ph. అజస్ర ప్రవాహం; అభిద్య ప్రవాహం; ఏకముఖ ప్రవాహం;
  • electric current, ph. విద్యుత్ ప్రవాహం;
  • induced current, ph. ప్రేరిత ప్రవాహం;
  • photoelectric current, ph. తేజోవిద్యుత్ ప్రవాహం;
 • curriculum vitae, ph. జీవిత సంగ్రహం; (lit.) the course of one's life;
 • curry, n. (1) కూర; వండిన కూర; (2) కూరలో వేసే మసాలా;
  • curry favor, ph. కాకా పట్టు; తైరు కొట్టు; ingratiate oneself with someone through obsequious behavior;
  • curry powder, ph. కూరలో వేసే మసాలా పొడి; this is not powdered curry leaves;
 • curry-leaf, n. కరివేపాకు;
 • cursive, adj. జిలుగు; గొలుసుకట్టు;
  • cursive writing, ph. జిలుగు రాత; గొలుసుకట్టు రాత;
 • cursor, n. [comp.] తెరసూచి; సారకం; తెర మీద బొమ్మలని చూపించే గుర్తు; An on-screen blinking character that shows where the next character will appear;
 • cursory, adj. పైపైన; నామకః;
 • curtain, n. తెర; యవనిక; కనాతి; కండవడము; (rel.) screen;
 • curvature, n. వక్రత; వట్రువు; వంపు; వంకర; వంకీ; వంకరతనం;
 • curve, n. వంపుగీత; వక్రరేఖ;
 • curved, adj. వట్ర; వక్ర; వరాళ;
  • curved surface, ph. వట్రతలం; వక్రతలం;
 • cushion, n. తలాపి; దిండు; కశిపు; మెత్త; గాది; ఉపధానం;
 • cuss-cuss, n. వట్టివేరు; కురువేరు; అవురుగంట వేరు; ఉసీరం; లఘులయము; అవదాహం; [bot.] straw of Andropogon muriaticum;
 • custard, n. గుడ్లు, పాలు, చక్కెర, కలిపి చేసే మెత్తటి, జున్ను వంటి వంటకం;
 • custard apple, n. సీతాఫలం; cherimoya;
 • custody, n. (1) స్వాధీనత; స్వాధీనం; (2) నిర్బంధం;
 • custom, n. ఆచారం; అలవాటు; వాడుక; రివాజు; సంప్రదాయం; ఆనవాయితీ; మామూలు; వ్యవహారం;
  • ancient custom, ph. వృద్ధాచారం; పాత అలవాటు;
  • daily custom, ph. నిత్యవ్యవహారం;
 • customary, adj. మామూలు; రివాజు; వ్యావహారికం; యౌగికం;
 • customer, n. ఖాతాదారు; రివాజురాజు; వినియోగదారు; ఒక దుకాణంలో సరుకులు కొనే వ్యక్తి కాని, సేవలు అందుకొనే వ్యక్తి కాని;

---Usage Note: customer, client

 • ---When you go out to buy things, you are a shopper. When you go out to buy things from a particular store, then you are that store's customer. If you are paying someone such as lawyer for professional services, then you are a client. If you are seeing a doctor, you are a patient. If you are staying at a hotel, you are a guest.
 • customs, n. (1) ఆచారాలు; (2) దిగుమతి సుంకములు;
 • cut, n. (1) కత్తిరింపు; కోత; గాటు; గంటు; కచ్చు; పరిఖ; (2) దెబ్బ; గాయం;
 • cut, v. i. తెగు;
 • cut, v. t. కత్తిరించు; ఉత్తరించు; కోయు; నరుకు; తరుగు; తెంచు; కొట్టు; ఛేధించు;
  • cut the cloth, ph. గుడ్డని కత్తిరించు;
  • cut the tree, ph. చెట్టుని కొట్టు;
  • cut the vegetable, ph. కూరగాయలని తరుగు;
 • cutting, n. (1) కత్తిరింపు; ఖండం; (2) కత్తిరించిన ముక్క; ఖండిక;
 • cyan, n. పాలపిట్ట రంగు;
 • cyanosis, n. శరీరం నీలివర్ణం పొందడం; (ety.) సయనైడు వల్ల మరణించిన వారి శరీరం ఇలా నీలంగా మారుతుంది కనుక ఈ పేరు వచ్చింది;
 • cyber, adj. సమాచార సాంకేతిక రంగానికి సంబంధించిన;
  • cyber security, ph. Cyber security refers to the body of technologies, processes, and practices designed to protect computer networks, devices, programs, and data from attack, damage, or unauthorized access. Cyber security may also be referred to as information technology security;
 • cyberspace, n. జాలావరణం; అంతర్జాలావరణం; (note) cyberspace is a poorly coined word; it is better to use Internet space, instead;
 • cycle, n. (1) చక్రం; ఆవృత్తం; ఆవర్తం; (2) సైకిలు; తొక్కుడుబండి; రెండు చక్రాల వాహనం;
  • hydrological cycle, ph. జల చక్రం;
  • seasonal cycle, ph. రుతు చక్రం; ఋతు చక్రం;
  • cycle of time, ph. కాలచక్రం;
 • cyclic, adj. చక్రీయ; వృత్తస్థిత;
  • cyclic substances, ph. చక్రీయ పదార్థాలు;
  • cyclic symmetry, ph. చక్రీయ సౌష్ఠవం; చక్రీయ సౌష్ఠత, cakrIya saushThata;
 • cyclo, pref. చక్రీయ;
 • cyclohexane, n. [chem.] చక్రీయ షడ్జేను, cakrIya shadjEnu
 • cyclone, n. తుఫాను; గాలివాన; దూదర; (rel: tornado =చక్రవాతం; storm = గాలివాన)
  • tropical cyclone, ph. ఉష్ణమండలంలో వచ్చే తుపాను;
 • cyclopropane, n. [chem.] చక్రీయత్రయేను; చక్రీయప్రోపేను;
 • cylinder, n. (1) స్థూపకం; వర్తులస్తంభం; (2) సిలిండరు;
 • cylindrical, adj. స్థూపాకార; స్తంభాకార;
 • cymbal, n. చేతాళము; కాంస్యతలం; వాయించెడు తాళము;
 • cyst, n. తిత్తి; కోష్ఠము;
 • cytology, n. కణ శాస్త్రం;
 • cytoplasm, n. కణసారం; జీవరసం; కణద్రవం; కోశరసం; ప్రోటోప్లాసమ్‌లో కణికని మినహాయించగా మిగిలినది;
 • czar, n. (1) పూర్వపు రష్యా దేశపు చక్రవర్తి; ; (2) ప్రభుత్వంలో సర్వాధికారాలు గల వ్యక్తి;

మూలం

 • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2

వర్గం