backup, n. (1) దన్ను; (2) నిల్వ చేసిన నకలు; ప్రతిలిఖితం;
backward, adj. బడుగు; వెనకబడ్డ; తిరోగమన; నిమ్న;
backwardness, n. తిరోగామిత్వం; మాంద్యం; వెనకబడినతనం;
backwaters, n. కయ్య; ఉప్పుటేరు; ఉప్పుకయ్య; సముద్రపు ఆటుపోట్ల ప్రభావం వల్ల నదిలో కాని, కాలువలో కాని ప్రవాహం స్థంభించిపోయిన ప్రదేశం;
backyard, n. దొడ్డి; పెరడు;
bacon, n. పంది కడుపు ప్రదేశంలో ఉండే మాంసంతో తయారు చెయ్యబడ్డ ఆహార పదార్థం; ఈ మాంసాన్ని ఉప్పులో ఊరవేసి, పొగ పట్టించి, సన్నటి ముక్కలుగా కోసి, ఆవంలో ఉడకబెట్టి, అమ్ముతారు; ఒక్కొక్క చోటునుండి వచ్చే మాంసానికి ఒక్కొక్క పేరు ఉంటుంది; పంది శరీరంలో వెనక కాళ్ల నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి తయారు చేసిన పదార్థాన్ని "హేమ్" (ham) అంటారు;
bacteria, n. pl. బేక్టీరియా; బేక్టీరియంలు; కంటికి కనబడనంత చిన్న జీవులలో ఒక రకం;
bacteriology, n. బేక్టీరియం అనబడే సూక్ష్మజీవులని అధ్యయనం చేసే శాస్త్రం;
bacteriophage, n. బేక్టీరియాభక్షిణి; బేక్టీరియాలని తినే వైరసు అనబడే విషాణువు;
bacterium, n. s. బేక్టీరియం; కంటికి కనబడనంత చిన్న జీవి;
Bactria, n. బాహ్లీక దేశం; ప్రస్తుత మధ్యాసియాలోని చారిత్రాత్మక ప్రదేశం, నేటి ఆఫ్ఘనిస్థాన్-తజికిస్థాన్-ఉజ్బెకిస్థాన్ సమాహారం;
Bactrian, n. రెండు మూపురాలు ఉన్న ఒంటె; see also Dromedery;
bad, adj. చెడ్డ; బంజరు; చెడు; దుర్; పనికిమాలిన;
bad company, ph. చెడు సహవాసం; చెడు సావాసం;
bad habits, ph. దురలవాట్లు;
bad luck, ph. దురదృష్టం; కలిసిరాకపోవడం; ఎగ్గు;
bad, n. చెడు; ఓగు;
badge, n. డవాలు; గుర్తు; చిహ్నం;
badge of honor, ph. గౌరవ చిహ్నం;
badger, n. బొరియలలో నివసించే ఒక చిన్న జంతువు;
badger, adj. గూఠించు; సాధించు; నసపెట్టు;
badlands, n. బంజరు భూములు;
bag, n. (1) సంచి; ఖల్ల; (2) ఆశయం;
gunny bag, ph. గోనె సంచి; గోతాం;
bag and baggage, ph. పెట్టె, బేడా;
bagasse, n. చెరకు పిప్పి;
baggage, n. (1) సామాను; సామానుతో నింపిన సంచులు; (rel.) luggage; (2) [idiom] పూర్వాశ్రమంలో చేసిన పనులు ప్రస్తుతం మోయరాని బరువై కూర్చోవడం;
bail, n. జామీను; హామీ; హాజరు జామీను; ఒకరి కొరకు ఇంకొకరు పూచీ పడుట;
bail bond, ph. జామీను పత్రం; హామీ పత్రం; పూచీకత్తు;
balance, n. (1) త్రాసు; తక్కెడ; తూనిక; కాటా; తుల; తరాసు; నారాచి; ఏషణిక; (2) తుల్యత; సమత్వం; an even distribution of weight enabling someone or something to remain upright and steady; (3) బాకీ; మిగిలినది; కురదా; అవశిష్టం; శేషం; (4) a condition in which different elements are equal or in the correct proportions;
arm of a balance, ph. తూనిక కోల;
precision balance, ph. సున్నితపు త్రాసు;
spring balance, ph. తీగ త్రాసు;
balance mechanism, ph. సంతులన యంత్రాంగం;
balance of trade, ph. వ్యాపార శేషం; రెండు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నారో తెలియజేసే సంఖ్య;
ballistic missile, ph. ప్రాక్షేపిక క్షిపణి; ఈ రకం క్షిపణికి మొదట్లో కొద్దిగా తోపు ఇచ్చి ఒదిలెస్తారు; అటుపైన రాయి ప్రయాణం చేసినట్లే క్షిపణి నూటన్ సిద్ధాంతానికి తల ఒగ్గి ప్రయాణం చేస్తుంది;
ballistics, n. రివ్వున విసరిన వస్తువుల స్థితిగతులని అధ్యయనం చేసే శాస్త్రం; ప్రాక్షేపిక శాస్త్రం;
balloon, n. బుంగ; గుమ్మటం; గాలి గుమ్మటం; పొగ గుమ్మటం; బెలూను;
ballot, n. ఓటు; ఓటు కాగితం; సమ్మతి పత్రం; ఎన్నికలలో అభిప్రాయ సేకరణకి వాడే సాధనం;
ballpark, n. (1) బంతులబీడు; బంతాట ఆడే స్థలం; (2) ఉరమర లెక్క;
in the ballpark, ph. [idiom] ఉరమరగా చెప్పినది; సుమారుగా చెప్పినది;
balm, n. విలేపం; పరిమళ ద్రవ్యం; ఉపశమనానికి శరీరంపై పూసుకునేది;
balsam, n. (1) కాశీ తుమ్మ; నీలిగోరింట; (2) సాంబ్రాణి;
oil of balsam, ph. సాంబ్రాణి తైలం;
bamboo, n. వెదురు; తృణధ్వజం;
bamboo stalk, ph. వెదురు గడ; వెదురు బొంగు;
bamboo worker, ph. మేదరి;
ban, n. వెలి; వెలి వేయడం; బహిష్కరణ; బహిష్కరణాజ్ఞ; నిషేధ ప్రకటన;
banana, n. అరటిపండు; పండు జాతి అరటి; కదళీ ఫలం; (rel.) plantain;
conduction band, ph. [phys.] వాహక పట్టీ; వహనపు పట్టీ; a band of energy partly filled with electrons in a crystalline solid. These electrons have great mobility and are responsible for electrical conductivity;
valence band, ph. [phys.] బాలపు పట్టీ; the band of electron orbitals that electrons can jump out of, moving into the conduction band when excited;
bandage, n. కట్టు; గాయానికీ కట్టే కట్టు;
bandicoot, n. పందికొక్కు; దిబ్బకొక్కు;
bandit, n. బందిపోటు దొంగ; పట్టపగటి దొంగ; సాయుధుడయిన దొంగ; పశ్యతోహరుడు;
bandwidth, n. వాహికావ్యాసం; వాహినీవిస్తారం; పట్టీ పన్నా; పట్టీ యొక్క వెడల్పు; విద్యుత్ వలయాలని అధ్యయనం చేసే సందర్భంలో పుట్టిన మాట ఇది. ఒక తీగ గుండా విద్యుత్ వాకేతాలు పంపినప్పుడు ఆ వాకేతాలలోని కొన్ని తరంగాలు చెక్కు చెదరకుండా ఇద్దరి నుండి అద్దరి చేరుకుంటాయి. అలా చేరుకున్న తరంగాల గరిష్ఠ తరచుదనం నుండి కనిష్ఠ తరచుదనాన్ని తీసివేస్తే వచ్చే "తరచుదనపు పట్టీ" యొక్క పన్నా; కలన యంతలు వచ్చిన తరువాత విద్యుత్ వాకేతాలని సున్నలతోటీ, ఒకట్ల తోటీ సూచించడం వాడుకలోకి వచ్చింది. పైన చెప్పిన తరచుదనం పట్టీ యొక్క పన్నా పెరిగే కొద్దీ ఆ రహదారి మీద క్షణంలో ఎక్కువ సున్నలని, ఒకట్లని పంపగలిగే సామర్ధ్యం పెరుగుతుంది. కనుక ఆ సామర్ధ్యానికి వాడే కొలమానాన్ని కూడా "పట్టీ పన్నా" అనే అంటారు;
bandy, n. బండి;
bane, n. చేటు; చెరుపు; శాపం;
bang, v. t. (1) బాదు; మోటుగా కొట్టు; (2) గట్టిగా చివాట్లు పెట్టు;
bangle, n. గాజు; ముంజేతికి వేసుకునే కడియం వంటి ఆభరణం;
bangs, n. pl. ముంగురులు; కుంతలాలు; చూర్ణకుంతలములు; నుదురు మీద పడే జుత్తు;
banians, n. (1) [Ind. Eng.] వైశ్యులు; కోమట్లు; వర్తకులు; మర్రి చెట్టు కింద కూర్చుని వ్యాపారం చేసేవారు; (2) [Ind. Eng.] బనీనులు; లోపల వేసుకొనే పొట్టి చేతుల జుబ్బాలు; tee shirts; under vests;
banish, v. t. వెడలగొట్టు; తరుము; తగిలివేయు; దేశము నుండి వెళ్ళగొట్టు; బహిష్కరించు;
banisters, n. కటకటాలు;
bank, n. (1) తీరము; నది ఒడ్డు; గట్టు; తటి; దరి; కరకట్ట; కూలం; (rel.) shore; (2) బ్యాంకు; కోఠీ; ధనాగారము; పేఠీ; ఆర్ధిక సంస్థ; (3) వరస;
blood bank, ph. రక్తపు కోఠీ; రక్తపు పేఠీ; రక్తపు బ్యాంకు;
flood bank, ph. వరదల కరకట్ట;
that bank, ph. అద్దరి; ఆ తటి;
this bank, ph. ఇద్దరి; ఈ తటి;
bank check, n. హుండీ; చెక్కు;
bank draft, n. హుండీ; డ్రాఫ్‌టు;
bank note, n. హుండీ; నోటు;
bank, v. i. కైవాలు; పక్షులు, విమానాలు, కార్లు, మొదలయిన వాహనాలు మలుపు తిరిగేటప్పుడు పక్కకి ఒరుగుట;
bank, v. t. (1) బ్యాంకు వ్యవహారములు చూసుకొను; (2) ఆధారపడు;
ban kapas, n. అడవి బెండ; అడవి ప్రత్తి; [see also] Common Mallow; [bot.] Malva neglecta;
bankruptcy, n. దివాలా; దివాలా ఎత్తడం; దివాలా తియ్యడం;
banner, n. జెండా; పతాకం; ధ్వజం; బావుటా; పడిగె;
banner headline, ph. పతాక శీర్షిక;
banter, n. పిచ్చాపాటీ; బాతాకానీ; లోకాభిరామాయణం;
banquet, n. విందు; అట్టహాసమైన విందు; ఆమిత; ఆవెత;
banyan tree, n. మర్రి చెట్టు; వట వృక్షం; న్యగ్రోధం; [bot.] Ficus Benghalensis; (ety.) బనియాలు ఈ చెట్ల క్రింద కూర్చుని వ్యాపారం చేసేవారు కనుక పాశ్చాత్యులు ఈ పేరు పెట్టేరు;
baptism, n. జ్ఞానస్నానం; క్రైస్తవ మతంలో "బారసాల" వంటి కార్యక్రమం;
bar, n. (1) కమ్మీ; కడ్డీ; కంబీ; దండం; పట్టీ; శలాకం; (2) పానశాల; గంజిక; మద్యశాల; ఆసవ గోష్ఠిక;
menu bar, ph. ఎంపిక జాబితా; ఎంపిక పట్టీ;
bar graph, ph. శలాకా చిత్రం; శలాకా గ్రాఫు;
bar magnet, ph. అయస్కాంతపు కడ్డీ; దండాయస్కాంతం; శలాక అయస్కాంతం;
bar, v. t. అడ్డగించు; నిరోధించు; నిషేధించు;
barb, n. ముల్లు; ముళ్ల కర్ర; చిల్లకోల; కంటకం;
barbarian, n. (1) అనాగరిక వ్యక్తి; మోటు మనిషి; (2) మ్లేచ్ఛుడు;
barber, n. మంగలి; దివాకీర్తి; అంతావశాయి; క్షురకర్మ చేసే వ్యక్తి; m. క్షురకుడు; అంబష్ఠుడు;
bare-handed, adj. ఉత్త చేతులతో; ఖాళీ చేతులతో; రిక్త హస్తాలతో;
barely, adv. చాలీచాలని;
bare-waisted, adj. దిసమొల;
bargain, n. బేరం;
good bargain, ph. మంచి బేరం; లాభసాటి బేరం;
bargain, v. t. బేరమాడు; బేరం చేయు;
barge, n. బల్లకట్టు; సరుకులు మోసే పడవ;
baritone, n. బొంగురు గొంతుక; మగ గొంతుక; గంభీర నాదం; మందర స్వరం;
Barium, n. బేరియం; భారం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 56, సంక్షిప్త నామం, Ba); [Gr. barys = heavy];
bark, n. (1) బెరడు; పట్ట; తొంట; వల్కలం; కృత్తి; (2) కుక్క అరుపు; (3) కొన్ని జంతువుల అరుపు;
bark, v. i. మొరుగు; అరుచు;
Barleria cristata, n. డిసెంబరం పూవు; సైరీయ పూవు;
barley, n. యవలు; అశ్వప్రియ; బార్లీ; ఒక జాతి ధాన్యం; [bot.] Hordeum vulgare;
barn, n. సాల; శాల; పశువుల సాల; పొలంలో పాక; కొట్టాం;
barnacle, n. నత్త వంటి గుల్ల గల సముద్రజీవి; ఇవి పడవల అడుగు భాగాలకి అంటుకుని కనిపిస్తాయి;
barnstorming, n. ఎన్నికల ప్రచారం కొరకు సుడిగాలిలా దేశం నాలుగు చెరగులా తిరగడం;
barograph, n. భారలేఖిని; వాతావరణ పీడనంలోని మార్పులని కలంతో కాగితంమీద నమోదు చేసే పనిముట్టు;
barometer, n. భారమితి; భారమాపకం; వాతావరణ పీడనాన్ని కొలిచే పనిముట్టు;
baron, n. జమీందారు; చిన్న సామంత ప్రభువు;
baroness, n. f. జమీందారు భార్య; జమీందారిణి;
baroscope, n. భారదర్శిని; వాతావరణ పీడనాన్ని దృశ్యమానంగా చూపే పనిముట్టు;
barracks, n. బారకాసులు; వసారా ఇళ్ళు; సైనికులు నివసించే వసారా ఇళ్ళు;
barrage, n. (1) బేరేజి; తలుపులు ఉన్న అడ్డుగోడ; తలుపులు ఉన్న ఆనకట్ట; A barrage is a weir that has adjustable gates installed over top of it, to allow different water surface heights at different times; The water level is adjusted by operating the adjustable gates; a barrage usually has a road over it. [see also] dam and weir; (2) పుంఖానుపుంఖంగా వదిలే తూటాలు; మాటలు, చివాట్లు, వగైరా;
barrage of questions, ph. పుంఖానుపుంఖంగా వచ్చే ప్రశ్నలు; ప్రశ్నా పరంపర; ప్రశ్నల వర్షం;
barrier, n. ఆటంకం; అగడ్త; అవరోధం; అడ్డు; అడ్డంకి; హద్దు;
barrel, n. (1) పీపా; (2) గొట్టం; తుపాకి గొట్టం;
barren, adj. గొడ్డు; బంజరు; ఫలించని;
barren lands, ph. గొడ్డుభూములు; బంజరు భూములు;
barren woman, ph. గొడ్డురాలు; గొడ్రాలు;
barricade, n. తాత్కాలికంగా కట్టిన అడ్డంకి; పోలీసులు, రహదారి పనివారు జన వాహన సందోహాలని అదుపులో పెట్టడానికి ఇటువంటి అడ్డంకులు కడుతూ ఉంటారు;
barrister, n. any person who received a law degree from the United Kingdom can be called a barrister; they often practice law as a group and represent corporations;
barrow, n. (1) ఒంటి చక్రపు తోపుడు బండి; (also) wheelbarrow,
bartender, n. కబ్బలి కబ్బలికాడు; ధ్వజుడు; పానుడు; పానశాలలో మద్యపానాలు కలిపి అమ్మేవాడు;
barter, n. సాటా; సాటాబేరం; సాటాకోటి; మారుగడ; పరీవర్తకం; వస్తువినిమయం; అపమిత్యకం; నగదు ప్రసక్తి లేని వర్తకం; traders exchanging goods with no money as a medium of transaction;
bartizan, n. బురుజు; కోట బురుజు; కోట గోడకి బయట వేల్లాడే బురుజు;
basement, n. నేలమాళిగ; భూగృహం; భూమట్టానికి దిగువున ఉండే గది;
bashful, adj. సిగ్గు; లజ్జ;
bashful person, ph. లజ్జాళువు; మొహమాటస్తుడు;
bashfulness, n. లజ్జ; సిగ్గు;
basic, adj. (1) క్షారాత్మక; భాస్మిక; (2) మౌలిక; ప్రాథమిక; మూలమైన; ముఖ్యమైన; (3) కనీసపు; see also basal;
basic education, ph. కనీసపు విద్య; మౌలిక విద్య; ప్రాథమిక విద్య;
basic needs, ph. కనీస అవసరాలు; మౌలిక అవసరాలు;
basic principle, ph. మూల సూత్రం;
basic qualification, ph. ప్రాథమిక అర్హత;
basil, n. (1) రుద్రజడ; సీమతులసి; సీమ తులసి; (2) రాజ తులసి; [bot.] Osimum basilicum;
holy basil, ph. తులసి;
basin, n. (1) పళ్లెం; కొప్పెర; హరివాణం; కరోటి; వెడల్పు మూతి ఉన్న పాత్ర; (2) ఆయకట్టు; ఆరగాణి; (3) ఆవాపం; కుదురు;
basin around the foot of a plant, ph. ఆవాపం; ఆవాలం; కుదురు;
basis, n. (1) ప్రాతిపదిక; ఆధారం; పునాది; ఆకరం; ఆస్కారం; అస్తిభారం; ఆస్పదం; (2) [math.] a set of linearly independent elements of a given vector space having the property that every element of the space can be written as a linear combination of the elements of the set;
bask, v. i. (1) చలికాచుకొను; వెచ్చగా ఉండు (2) ఆనందించు; (note) చలి దేశాలలో ఉన్న వారికి వెచ్చగా ఉండగలగడమే ఆనందదాయకం;
basket, n. గంప; బుట్ట; తట్ట; జల్ల; కరండం;
big basket, ph. గంప;
deep basket, ph. బుట్ట;
wickerwork basket, ph. జల్ల;
wide and shallow basket, ph. తట్ట;
basket with a handle, ph. సజ్జ;
basketful, adj. గంపెడు; బుట్టెడు; తట్టెడు;
Basmati, n. a breed of rice grown in the Himalayan foothills;
bass, n. (1) [music] (బేస్) మంద్రస్వరం; (2) (బాస్) ఒక జాతి చేప;
bass relief, ph. శిలాఫలకం; ఉబ్బెత్తు చిత్రం;
bassinet, n. తొట్టి; పసి పిల్లలని పడుక్కోబెట్టే తొట్టి;
butcher bird, n. దూదేకుల పిట్ట;
bastard, n. లంజాకొడుకు; కాణేలిమాతృఁడు; కంతిరీ కొడుకు; పెళ్ళి కానివారికి పుట్టిన బిడ్డ; సర్వసాధారణమైన పరిస్థితులలో తిట్టుగా ఉపయోగించబడినా, అప్పుడప్పుడు ముద్దుగా వాడడం కూడా కద్దు;
bastard saffron, ph. కుసుంబా కుంకుమపూవు;
bastard teak, ph. మోదుగ;
bast, n. నార; fiber obtained from phloem;
bast sago palm, ph. కిత్తనార;
baste, v. t. (1) తడిపిపెట్టు; తడుపు; పిండిని కాని, మరేదయినా తినే పదార్థాన్ని కాని, నీళ్లతో కాని, నూనె నెయ్యిలతో కాని తడిపి నానబెట్టడం; (2) పోగు వేయు; బట్టలని మిషను మీద కుట్టే ముందు పోగు వేయు;
bastion, n. బురుజు; కోట బురుజు; కొత్తళం;
bat, n. (1) గబ్బిలం; ఋషిపక్షి; (2) గోటీ; బేటు;
bat and pellet, ph. గోటీబిళ్ల; బిళ్ళం గోడు; పిల్లలు ఆడుకునే ఒక ఆట;
batch, n. (1) వాయి; వంట, వార్పులలో ఒక తూరి వండిన వంటకం; (2) జట్టు; కొంతమంది మనుష్యులని కాని, వస్తువులని కాని ఒక తూరి తీసుకొనడం;
bathe, v. t. (బేద్) స్నానం చేయించు; నీళ్లు పోయు; ద్రవంలో ముంచు;
bathos, n. ఉదాత్తమైన స్థితి నుండి సామాన్యమైన స్థితికి దిగజారిపోవడం;
bathroom, n. స్నానాలగది; స్నానాగారం;
baton, n. (బటాన్) దండం; కోల; చిన్న కర్ర; లాఠీ; లోడీ;
batta, n. [Ind. Eng.] బత్తెం; రోజు ఖర్చులు;
battalion, n. పటాలం; దండు; సిపాయిల దండు; సైన్యంలో కొన్ని దళముల సమూహం;
batter, n. (1) సంకటి; జావ; చిక్కటి అంబలి; (2) జారుగా తడిపిన లేక రుబ్బిన పిండి; ఇడ్లీ పిండి, దోసెల పిండి, వగయిరాలలా కలిపిన పిండి; see also dough; (3) చోవి; బూర్లు; బొబ్బట్లు మొదలయిన వంటకాలలో పూర్ణంపైన పెట్టే ఆచ్చాదనం; (3) ఆటలలో గోటీతో బంతిని కొట్టే ఆటగాడు;
battery, n. (1) మాల; ఘటమాల; విద్యుత్తును పుట్టించే సాధనం; (2) ఆహతం; చట్ట విరుద్ధంగా మరొక వ్యక్తిని చేత్తోకాని, మరేదయినా ఆయుధంతో కాని కొట్టడం, గుద్దడం, బాదడం;
assault and battery, ph. మీద పడి కొట్టడం;
battle, n. రణం; సమరం; పోరాటం; పోరు; సంగ్రామం; సంకం; కదనం; కలహం; యుద్ధం; ఒక ప్రదేశంలో సాయుధులైన యుద్ధబలాల మధ్య జరిగే పెద్ద పోరు; (rel.) engagement; campaign; encounter; skirmish; combat;
arrayed in battle, ph. మోహరించు, వ్యూహంలో అమర్చు;
battlefield, n. రణ రంగం; రణస్థలం; కదన రంగం; యుద్ధభూమి;
bauhinia, n. బోదంత చెట్టు;
bay, n. (1) అఖాతం; ఉపసాగరం; సముద్రోపకంఠం; భూభాగం లోనికి చొచ్చుకొని వచ్చిన సముద్రం; (2) గది; కొట్టు;
cargo bay, ph. సామానుల గది;
Bay berry, n. కతిఫలం; కాఫలం; [bot.] Myrica nagi; According to the Mādhavacikitsā (7th-century Ayurvedic work), this plant (kaṭphala) is mentioned as a medicine used for the treatment of all major fevers, as described in the Jvaracikitsā chapter.
bay leaves, n. ఆకుపత్రి; బిరియానీ వంటలో వాడే ఒక సుగుంధ ద్రవ్యం;
Bay of Bengal, ph. బంగాళాఖాతం; ప్రాచ్యోదధి;
bayou, n. చిల్ల మొక్కలతోటీ, బురద తోటీ నిండిన కయ్య అనే అర్థంలో అమెరికాలో వాడుక ఎక్కువ;
Bayur tree, n. కర్ణికార వృక్షం; కనకసంపంగి చెట్టు;
bdellium, n. గుగ్గిలం; గుగ్గులు; పలంకష; [bot.] Borassus flabelliforumis చెట్టు నుండి కారే జిగురు;
Part 2: be-bi
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
beach, n. చెలియలికట్ట; సైకతస్థలి; సాగరతీరం; సముద్రపుటొడ్డు; బీచి;
beacon, n. ఆకాశదీపం;
bead, n. పూస; గుటిక; గోళీ;
bead of butter, ph. వెన్నపూస;
bead, v. i. పూసకట్టు;
beak, n. పక్షి ముక్కు; చంచువు; త్రోటి;
beaker, n. ముక్కుపాత్ర; గాజు కలశం; ప్రయోగశాలలో వాడే ముక్కు ఉన్న గాజు కలశం; ఒంపడానికి వీలుగా జారీ ఉన్న పాత్ర; జారీ చెంబు; గిండీ చెంబు; గరిగె;
beam of light, ph. కిరణ వారం; కాంతి పుంజం; తేజఃపుంజం; కిరణజాలం;
beam of sunlight, ph. తరణి కిరణ వారం; సూర్యకాంతి పుంజం;
beam, v. i. తల పంకించు; చిరునవ్వుతో తల ఆడించు;
bean, n. చిక్కుడు; చిక్కుడు కాయ; చిక్కుడు గింజ;
beanstalk, n. చిక్కుడు పాదు;
bear, n. ఎలుగుబంటి; ఎలుగుగొడ్డు; ఎలుగు; భల్లూకం; రుక్షం;
bear, v. i. (1) భరించు; తాళు; తాల్చు; సహించు; ఓర్చు; వహించు; నిభాయించుకొను; (2) మోయు; ధరించు; (3) కను; (4) ఈను; (5) కాయు;
---Usage Note: bear, stand, tolerate, put up with
---Use these words to talk about accepting or dealing with a bad situation. Bear is more formal and stand is usually used with the phrase, "can't stand. Tolerate is even more formal.
bear market, ph. the term 'bear market' describes a 20% decline, in the value of stocks or other securities, from the most recent highs; see also bull market;
bearable, adj. ఓర్వదగిన; సహించగల; సహ్య;
beard, n. గడ్డం; see also goatee;
bearer, n. (1) మోసే వ్యక్తి; మోసేవాడు; వాహకుడు; (2) బేంకు చెక్కు పట్టుకొచ్చినవాడు; పత్రదారు; (3) see also waiter; attender; server;
bearing, n. (1) దిశ; దిక్కు; (2) చెట్టు కాపు; (3) ఉత్తరాసి; ఉతక; కూసము; గుంజ; చక్రం యొక్క ఇరుసు సులభంగా తిరగడానికి కావలసిన అమరిక; (exp.) ఉత్తరాసి, ఉతక are respectively the names of the upper and lower hinges of a door; see also socket;
beast, n. గొడ్డు; మృగం; జంతువు; పశువు;
beat, n. తాళం; లయ; దెబ్బ; స్పందన; విస్పందనం;
heart beat, ph. హృదయ స్పందన;
beat, v. t. (1) కొట్టు; తాటించు; వాయించు; ఉతుకు; (2) చితగ్గొట్టు; చావగొట్టు; (3) గిలక్కొట్టు; (4) రెక్కలు ఆడించు; (5) ఉతుకు; బాదు; ఏకు;
beat around the bush, ph. డొంకతిరుగుడుగా చెప్పు;
beat, v. i. (1) కొట్టు; (2) స్పందించు;
beaten, adj. అరిగిన; నలిగిన;
beaten path, ph. నలిగిన దారి; [idiom] పాత చింతకాయ పచ్చడి; చర్వితచర్వణం;
beatitude, n. ముక్తి; మోక్షం;
beau, n. m. (1) చెలికాడు; మగ స్నేహితుడు; (2) ధనవంతుడైన సొగసుగాడు;
---Use these words to say something attractive. Beautiful is a strong word meaning 'extremely attractive.' The other words are a notch below beautiful and are more often used to describe attractive people. Pretty is used to describe younger women and girls. Use handsome to describe men. Good-looking can be used for both men and women. Cute is used to describe babies.
beaver, n. నీరుడుత; నీటి ఉడుత; ఒక రకమైన కృంతకం(Rodent);
because, conj. ఎందుచేతననగా;
beckon, v. t. చేతితో కాని, తలతో కాని, కంటితో కాని రమ్మని సంజ్ఞ చెయ్యడం;
become, v. i. అవండి; అవు; అగు; కా; కండి;
become subscribers, ph. చందాదారులు కండి;
bed, n. (1) పరుపు, పక్క; పానుపు, శయ్య; మంచం మీద పరచిన పరుపు; తల్పం; సెజ్జ; (2) మంచం; పడక; బిచానా; (3) భూతలం; సంస్తరం;
bedbug, n. నల్లి; మత్కుణం;
bedding, n. పరుపుచుట్ట; బేడా;
bedlam, n. (1) గోల; గందరగోళం; చేపల బజారు; (2) పిచ్చాసుపత్రి;
bedrock, n. శిలా సంస్తరం; శయనశిల;
bedroll, n. పరుపుచుట్ట; బేడా;
bedroom, n. పడక గది; శయనాగారం;
bedsore, n. పక్కపుండు; పడక పుండు;
bedstead, n. మంచం;
bee, n. తేనెటీగ; మధుమక్షికం; భ్రమరం; తుమ్మెద; పెరీగ; అలి;
Bumble bee, ph. భ్రమరం; తుమ్మెద; Bumblebees are robust, large in girth, have more hairs on their body, and are colored with yellow, orange and black. Their wings can be easily seen since they are dark in color. The tip of their abdomen is rounded;
honey bee, ph. తేనెటీగ; జుంటీగ; పెరీగ; Honeybees are more slender in body appearance, have fewer body hairs and wings that are more translucent. The tip of their abdomen is more pointed;
beech, n. కానుగ; కానుగ చెట్టు; కరంజం;
beef, n. గొడ్డుమాంసం; ఆవుమాంసం; పెద్దపొల;
behind, adj. వెనుక;
beehive, n. తేనెపట్టు; తేనెగూడు; పెర; అలిల్లు; అలికులం;
bee's wax, n. మైనం; సిక్థం; మధూచ్ఛిష్టం; అలిమైనం;
bee-stings, n. జన్నుపాలు; ముర్రుపాలు; ఆవు ఈనిన కొత్తలో వచ్చే పాల రసాయన సమ్మిశ్రమం తర్వాత వచ్చే పాలలా ఉండదు;
beetle, n. కుమ్మరి పురుగు; పేడ పురుగు; Beetles are insects that form the order Coleoptera, in the superorder Endopterygota. Their front pair of wings are hardened into wing cases, elytra, distinguishing them from most other insects;
green beetle, ph. జీరంగి;
beetroot, n. బీటుదుంప;
beet sugar, ph. బీటుచక్కెర;
befall, adv. కలుగు; సంభవించు;
before, adv. మునుపు; ఇంతకు ముందు; పూర్వం; గతంలో;
beforehand, adv. ముందుగా; జరగబోయేముందు;
beg, v. i. బతిమాలు; వేడుకొను; ప్రార్థించు; తిరిపమెత్తుకొను;
beg, v. t. ముష్టియెత్తు; బిచ్చమెత్తు;
beget, v. t. కను; పుట్టించు;
beggar, n. f. ముష్టిది; ముష్టి పిల్ల; బిచ్చగత్తె; యాచకి;
beggar, n. m. ముష్టివాడు; బిచ్చగాడు; యాచకుడు; బికారి;
begin, v. t. ఆరంభించు; ప్రారంభించు; మొదలు పెట్టు; ఉపక్రమించు; అంకురార్పణ చేయు;
on one's behalf, ph. ఒకని తరఫున; ఒకరి పక్షం మీద; ఒకని కొరకు;
behave, v. i. మెలుగు; ప్రవర్తించు;
behavior, behavoiur (Br.), n. ప్రవర్తన; పోకడ; నడవడిక; నడత;
bad behavior, ph. చెడ్డ ప్రవర్తన; అసభ్యత;
good behavior, ph. మంచి ప్రవర్తన; సభ్యత;
beheading, n. శిరచ్ఛేదనం; తల నరికేయడం;
behest, n. (1) ఆజ్ఞ; ఉత్తరువు; (2) ప్రోద్బలం;
at the behest of, ph. ఆజ్ఞానుసారం; ఉత్తరువు ప్రకారం;
behold, inter. అదిగో; అల్లదిగో; చూడు;
being, n. అస్తిత్వం; ఉండడం; బతకడం; జీవించడం;
belch, n. త్రేనుపు; త్రేపు;
sour belch, ph. పులి త్రేనుపు;
belief, n. నమ్మకం; గురి; విశ్వాసం;
belief system, ph. నమ్మక సమాహారం;
---Usage Note: Faith = ( Belief + Action + Confidence ) Faith includes our beliefs, but it is bigger than that. Faith requires action. If it doesn’t move us to do something or say something – actually take some kind of action – it’s not really faith at all. Confidence is trust that is based on knowledge or past experience.
believe, v. i. విశ్వసించు; నమ్ము;
bell, n. గంట;
belladonna, n. ఉమ్మెత్త;
Bellatrix, n. పరివృత్త నక్షత్రం; మృగశిర (ఒరాయన్) రాశిలో ప్రకాశవంతమైన తారలలో మూడవ స్థానంలో ఉన్న నక్షత్రం;
bell peppers, n. బుట్టమిరపకాయలు; సిమ్లా మిరపకాయ; కారం లేని మిరపకాయలు; కేప్సికం: అనేక రకాల మిరపకాయలు ఉండటం వల్ల వీటికి ప్రతి దేశంలోను వేర్వేరు పేర్లు ఉన్నాయి;
bellow, n. రంకె; ఎద్దు వేసే రంకె;
bellows, n. కొలిమితిత్తి; భస్తిక;
belly, n. బొజ్జ; పొట్ట; కడుపు; ఉదరం;
belly button, n. బొడ్డు; నాభి;
belong, v. i. చెందు; సంబంధించు;
belongings, n. pl. తట్టుముట్లు; పెట్టె-బేడా; ఒక వ్యక్తికి చెందిన వస్తుజాలం;
bemoan, v. t. విచారించు; ఏడ్చు; సంతాప పడు; దుఃఖించు;
Benetnash, n. మరీచి నక్షత్రం; గరిట ఆకారంలో ఉన్న సప్తర్షి మండలంలో కాడకి తూర్పు దిక్కుగా ఉన్న తార; also called Alkaid;
bench, n. (1) బల్ల; కవాచీబల్ల; బెంచీ; బెంచీబల్ల; (2) న్యాయస్థానం; ధర్మాసనం; న్యాయాసనం; Judiciary ని collective గా బెంచ్ అంటారు. అలాగే న్యాయవాదులు ను collective గా Bar అంటారు; బెంచ్ అంటే కొంత మంది న్యాయ మూర్తులు కలిసి ఒక కేసును విచారణ చేసి తీర్పు ఇవ్వడం. హై కోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యను బట్టి అది డివిజన్ బెంచ్, ఫుల్ బెంచ్ అని చెప్తారు;
bench in a waiting room, ph. కవాచీబల్ల;
High court bench, ph. హై కోర్టు న్యాయాధీశులు కొంతమంది కలిసి కేసులు విచారణ చేయడం. మరి ఒక అర్థం హై కోర్టు పెర్మనెంట్ సీట్ స్థానంలో కాకుండా రాష్ట్రంలో మరి కొన్ని స్థలాలలో Hearing/ విచారణ చేయడం;
berth, n. (1) మెత్త; పడక; (2) ఇరవు; స్థానం; ఆగే చోటు;
beryl, n. వైడూర్యం; మరకతం;
beryllium, n. విదురం; ఒక రసాయన మూలకం;
beseech, v. t. వేడుకొను; బతిమాలుకొను;
beset, v. i. ఆవరించు;
besiege, v. t. ముట్టడించు; ముట్టడి చేయు; చుట్టూ గుమిగూడు;
besides, prep. & adv. పైపెచ్చు; అంతే కాకుండా;
---Usage Note: besides, except
---Use besides to mean 'in addition to someone or something.' Except means that someone or something is not included.
best, adj. శ్రేష్టమయిన; అత్యుత్తమ;
best, n. శ్రేష్టం;
bestow, v. t. ఇచ్చు;
bet, n. పందెం; పణం;
bet, v. i. పందెం కాయు; పణం ఒడ్డు;
beta, n. (1) గ్రీకు వర్ణమాలలో రెండవ అక్షరం; (2) మొలక స్థాయి; క్షుణ్ణంగా పరీక్షలు అన్నీ పూర్తి చెయ్యకుండానే ప్రజాదరణ ఎలా ఉండో చూద్దామనే ఉద్దేశంతో విపణి వీఢిలో విక్రయానికి పెట్టిన వస్తువు;
betel creeper, n. నాగవల్లి; తమలపాకు తీగ;
betel leaf, n. నాగవల్లీదళం; తమలపాకు; [Bot.] Piper betel;
betel nut, n. వక్క; పోకచెక్క; కేరళ వక్క; పూగీఫలం; [bot.] Areca catechu;
Betelgeuse, n. (బీటెల్‌జూస్) ఆర్ధ్రా నక్షత్రం; దీని మరొక పేరు Alpha Orionis అనగా ఒరాయన్ (మృగవ్యాధుడు) రాసిలో అత్యధిక తేజస్సుతో ప్రకాశించే తార; ఇది మనకి 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది; రాబోయే మిలియను సంవత్సరాల కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ తార పేలిపోయి బృహన్నవ్య తార (supernova) గా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా;
betrayal, n. ద్రోహం; నమ్మకద్రోహం;
betrayer, n. ద్రోహి; కావైరి; కాపురుషుడు;
better, adj. మరియొకదాని కంటే మేలైన; పూర్వపు స్థితి కంటే మెరుగైన;
between, prep. మధ్య; నడుమ;
---Usage Note: between, among
---Use between to talk about being in the middle of two people, things, times, etc. Use among to talk about being in the middle of three or more people, things, etc.
bewail, v. i. వాపోవు;
beverage, n. పానీయం; పానం; సాధారణంగా మద్యం కలవని పానీయం అని అర్థం;
beware, v. i. జాగ్రత్తగానుండు; అప్రమత్తతతోనుండు;
bewilderment, n. దిగ్భ్రమ; దిగ్భ్రాంతి; కలవరపాటు; గాభరా; కర్తవ్యం తోచని పరిస్థితి; వ్యగ్రత;
beyond, adv. ఆవల; అవతల; అవ్వల; అటు మించి; పైగా;
bezoar, n. గోరోచనం; నెమరు వేసే జంతువుల ఆహారనాళంలో జుత్తు వంటి పదార్థంతో చిక్కులు పడి ఉండలు కట్టిన గట్టి రాయి వంటి పదార్థం; పురాతన భారతదేశం లోనూ, చైనా లోనూ గోరోచనాన్ని మందుల తయారీలో వాడేవారు;
bhang, n. [Ind. Engl.] గంజాయి; dried leaves and flowering shoots of the marijuana plant;
bias, n. (1) పక్షపాతం; Bias is a disproportionate weight in favor of or against an idea or thing, usually in a way that is inaccurate, closed-minded, prejudicial, or unfair; (2) [math.] అభినతి; a systematic distortion of a statistical result due to a factor not allowed for in its derivation;
biased, adj. పక్షపాతమైన; ఒక వైపు మొగ్గు చూపించే;
biased opinion, ph. పక్షపాతమైన అభిప్రాయం;
bib, n. బిడ్డల చొల్లు గుడ్డ; తినే ఆహారం బట్టల మీద పడకుండా మెడకి కట్టుకునే గుడ్డ;
bibliography, n. ఉపప్రమాణాలు; ఉపయోగపడ్డ గ్రంథమాల; సంప్రదించిన మూల పత్రాలు;
bicentennial, n. ద్విశతజయంతి; రెండు వందల సంవత్సరాల జన్మదినోత్సవం;
biceps, n. ద్విశిరం; ద్విశిర కండరం; జబ్బలో ఉండే కండరాలలో ఒకటి;
bicuspid, adj. ద్విపత్ర;
bicuspid valve, ph. ద్విపత్ర కవాటం; గుండెలో ఎడమ కర్ణికకి, ఎడమ జఠరికకి మధ్య ఇటువంటి కవాటం ఉంటుంది; దీనినే mitral valve అని కూడా అంటారు;
bicycle, n. సైకిలు; రెండు చక్రాల సైకిలు;
bid, n. కొనడానికి ఒప్పుకున్న ధర; ఏలం పాటలో పాడిన ధర;
bier, n. పాడె; శవాన్ని శ్మశానానికి తీసికెళ్లే వాహనం;
bifacial, adj. ద్విముఖ; రెండు ముఖములుగల;
bifid, adj. ద్విశాఖీయ; రెండు కొమ్మలుగల;
bifoliate, adj. ద్విపర్ణిక; ద్విపర్ణి; రెండు ఆకులుగల;
bifurcate, v. t. రెండుగా చీల్చు;
big, adj. పెద్ద; గంపెడు; లావు;
big, pref. గండ; గండ్ర; గజ; కుంభ; బృహత్;
--Usage Note: big, large
---Use big and large with countable nouns to describe size. Use large to describe amounts.
Big Bang, n. మహా విస్పోటం; పెనుపేలుడు; బృహత్ విస్పోటం; బృహత్ విస్తరణ (Big Bang), సృష్టి కార్యం మొదలయినప్పుడు విశ్వవ్యాప్తంగా జరిగిన పేలుడు వంటి విస్తరణ;
Big Bang Theory, ph. బృహత్ విస్తరణ వాదం; బృహత్ విస్ఫోట వాదం; బ్రహ్మాండ విచ్ఛిన్నవాదం; హఠాత్ పరిణామ వాదం; విశ్వ పరిణామవాదం; మొదట్లో బిందు ప్రమాణంలో ఉన్న విశ్వం ఎలా విస్తరించి ప్రస్తుత పరిస్థితిలోకి ఎలా పరిణతి చెందిందో చెప్పే వాదాలలో ప్రస్తుతానికి బాగా చలామణీలో ఉన్న వాదం;
Big Dipper, n. సప్తర్షి మండలం; బృహదృక్షంలో ఒక నక్షత్ర మండలం పేరు; Big Dipper is an asterism in the constellation Ursa Major;
bigot, n. అసహని; తన జాతి మీద కాని, కులం మీద కాని దురభిమానం చూపుతూ మిగిలిన వర్గాలని ద్వేషించే వ్యక్తి;
bilabial, adj. [ling.] ఉభయోష్ఠ్య; రెండు పెదవులకి సంబంధించిన;
bilabial stop, ph. ఉభయోష్ఠ్య స్పర్శ్య;
bilabials, n. [ling.] ఉభయోష్ఠ్యములు; రెండు పెదవులతోటీ ఉచ్చరించేవి; ఉదా, ప, బ, మ;
bilabiate, adj. ద్వియోష్ఠ;
bilateral, adj. ద్విపార్శ్వ; ద్విపక్ష; ఉభయ పక్ష;
bile, n. పిత్తం; పైత్యరసం; కాలేయం చేత స్రవించబడే పసుపు పచ్చని జీర్ణరసం;
bile duct, ph. పిత్తనాళం;
bile pigment, ph. పిత్త రంజనం;
bilingual, adj. ద్విభాషిత; రెండు భాషలలో;
bilingualism, n. ద్విభాషితం; రెండు భాషలలో ప్రావీణ్యత;
bilious, adj. పైత్యోద్రేక;
bill, n. (1) పత్రం; ఇవ్వవలసిన సొమ్ము చూపే చీటీ; హుండీ; బరాతం; (rel.) receipt; (2) చిత్తు చట్టం; (3) పక్షియొక్క ముక్కు;
bill of credit, ph. బరాతం;
bill of exchange, ph. బదలాయింపు హుండీ; మారకపు పత్రం;
billion, n. శతకోటి; వెయ్యి మిలియనులు; అమెరికాలో ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య; బ్రిటన్‌లో ఒకటి తర్వాత పన్నెండు సున్నలు చుడితే వచ్చే సంఖ్య;
bind, v. t. కట్టు; నిర్బంధించు; జతపరచు; జిల్లుకట్టు;
binding, v. t. జిల్లుకట్టడం; జతపరచడం;
binocular, adj. ద్వినేత్ర; ద్వినేత్రీయ;
binoculars, n. జంట దుర్భిణి;
binomial, adj. ద్విపాద; ద్వంద; ద్వి; ద్వినామీ; రెండు పేర్లుగల;
binomial equation, ph. ద్విపాద సమీకరణం;
binomial nomenclature, ph. ద్విపాద నామకరణం; ద్వినామీ నామకరణం; మొక్కలకి, జంతువు లకి, అనుమానానికి ఆస్కారం లేకుండా, శాస్త్రీయమైన పద్ధతిలో పేర్లు పెట్టే పద్ధతి; ఈ పద్ధతి ప్రకారం ప్రతి జీవికి రెండు నామాలు ఉంటాయి. మొదటిది ప్రజాతి (genus), రెండోది జాతి (species); ఉదా. Anannas sativum;
biochemistry, n. జీవరసాయనం; జీవరసాయన శాస్త్రం; ప్రాణి శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం;
biodiversity, n. జీవవైవిధ్యం; ఈ ప్రపంచంలో ఉండే ప్రాణికోటిలో కనిపించే భిన్నత్వం;
biography, n. జీవితచరిత్ర;
biological, adj. జీవ; శారీరక; జైవిక;
biology, n. జీవశాస్త్రం;
cell biology, ph. కణ జీవశాస్త్రం; జీవకణాలలో ఉండే భాగాలని అధ్యయనం చేసే జీవశాస్త్రం;
molecular biology, ph. బణు జీవశాస్త్రం; బణువుల స్థాయిలో అధ్యయనం చేసే జీవశాస్త్రం - అనగా, DNA ల స్థాయిలో;
biopic, n. సినిమాగా తీసిన జీవిత కథ; biography + picture
bio-species, n. జీవకోటి;
biosphere, n. జీవావరణం;
bipedal, adj. ద్విపాద; రెండు పాదాలు కల;
bipedal, n. ద్విపాది; రెండు పాదాలు కలది;
bipolar, adj. (1) ద్విధ్రువ; ఉత్తర, దక్షిణ ధ్రువాల మాదిరి కాని, ధన, రుణ తత్త్వాలు ఉన్న అంశాలు కాని; (2) ద్వైధీభావం; రెండు విభిన్న మానసిక ఉద్రేకాలు ఒకే సారి అలుముకున్న స్థితి;
bipolar disorder, ph. [med.] ద్విధ్రువ వ్యాధి; మనస్సు ఉల్లాసం, విచారము అనే రెండు ఉద్వేగాల మధ్య ఊగిసలాడే మనోవ్యాధి;
bipolar signal, ph. [elec.] ద్విధ్రువ వాకేతం; సున్నలని, ఒకట్లని సూచించడానికి వాడే రకరకాల చతురస్ర విద్యుత్ తరంగాలలో ఒక రకం;
birch tree, n. కొండరావి; భూర్జం; భుజపత్రి చెట్టు; బహుత్వచి;
bird, n. పక్షి; పిట్ట; ఖగం; ఖచరం; విహంగం; పతంగం;
hummingbird, n. తేనెపిట్ట;
tailor bird, ph. జీనువాయి;
bird flu, ph. ఒక రకం ఇన్‍ప్లుయెంజా పేరు; ఇది HPAIA (H5N1 )అనే పేరుగల విషాణువు వల్ల వచ్చే జబ్బు; ఇది 2003 లో మొదటిసారి ప్రజలలో కనిపించింది;
black body, ph. [phy.] కర్రికాయ; అసితాంగి; A black body or blackbody is an idealized physical body that absorbs all incident electromagnetic radiation, regardless of frequency or angle of incidence. The name "black body" is given because it absorbs all colors of light. A black body also emits black-body radiation;
black lamp, ph. కంటికి కనబడని అత్యూదకాంతిని వెదజల్లే దీపం; చీకటిలో ఈ రకం దీపం వేసి చూస్తే మామూలు కాంతిలో కనబడని బొల్లి మచ్చలు స్పుటంగా కనిపిస్తాయి;
blackberry, n. [bot.] కృష్ణాలం; నల్లనక్కెర;
blackboard, ph. నల్లబల్ల; నల్ల పలక;
black buffalo, ph. కర్రిపోతు; గౌడు గేదె;
black cotton soil, ph. నల్లరేగడి మట్టి; నల్ల రేగడి మన్ను; కృష్ణమృత్తిక;
black cow, ph. కర్రావు; కర్రి ఆవు;
black cumin, ph. నల్ల జీలకర్ర;
black gram, n. మినుగులు; ఉద్దులు;
black hole, ph. (1) [phy.] కాల రంధ్రం; కర్రి బిలం; కూలిన తార; కాల రంధ్రం; అగాధం; అదృశ్య అగాధం; నల్ల నక్షత్రం; ఈ గుండంలో ప్రవేశించిన కాంతి కిరణాలని తిరిగి చూసే ప్రసక్తే లేదు; A black hole is a region of spacetime where gravity is so strong that nothing—no particles or even electromagnetic radiation such as light—can escape from it. The theory of general relativity predicts that a sufficiently compact mass can deform spacetime to form a black hole; (2) చీకటి గది; కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళు వాడిన ఒక కారాగారం; ఈ జైలు ముఖం చూసిన వాళ్ళకి తిరిగి రావడమనే ప్రసక్తే లేదు;
black marketing, ph. దొంగ వ్యాపారం; ప్రచ్ఛన్న వంచకులు;
---In the U.S. using black as a noun when talking about someone's race is considered offensive. It is however acceptable while comparing racial groups. African or African-American is a better choice.
blank check, ph. (1) ఖాళీ బరాతం; (2) [idiom] సర్వాధికారాలు;
blank verse, ph. లఘువు, గురువు, ఐదు వరుసగా వచ్చి, అంత్యానుప్రాస లేని పాదాలతో కూడిన ఇంగ్లీషు పద్యం;
blank paper, ph. తెల్ల కాగితం; రాత లేని కాగితం;
blank slate; ph. ఖాళీ పలక; tabula rasa;
blank, n. (1) బోడి; ఖాళీ; (2) ఖాళీ కాగితం; (3) వాక్యంలో మాట రాయకుండా ఖాళీగా వదిలేసిన స్థలం;
blanket, n. (1) దుప్పటి; కంబళి; (2) దట్టంగా కప్పిపుచ్చినది;
blasphemy, n. దైవదూషణ; అనరాని మాట; చెయ్యరాని పని;
blast, n. పేలుడు;
blaze, n. మంట; పెద్ద మంట; తంపటి;
bleach, v. t. బట్టలు చలువచేయు; తెలుపుచేయు;
bleaching liquid, ph. నిరంజన జలం;
bleaching powder, ph. నిరంజన చూర్ణం; చలువ సున్నం; a white powder with the odor of chlorine, consisting of chlorinated calcium hydroxide with an approximate formula CaCl(OCl).4H2O;
bleb, n. పొక్కు; బొబ్బ;
bleed, v. i. రక్తం కారు; రక్తం ఓడు;
bleed, v. t. రక్తం తీయు; రక్తం ఓడ్చు;
bleeding edge technology, ph. ఉడుకుతూన్న సాంకేతిక విద్య; ఇంకా పరిపక్వం చెందని కొత్త విద్య;
blemish, n. డాగు; మరక; మచ్చ; లోపం; కళంకం;
blend, n. మిశ్రణం; మిశ్రము;
blend, v. i. కలిసిపోవు;
blend, v. t. కలుపు;
blessing, n. ఆశీర్వాదం; ఆశీస్సు; దీవెన; స్వస్తి;
blew, v. t. past tense of blow. ఊదెను;
blight, n. తెగులు; చీడ;
blind, adj. గుడ్డి; చీకు; అంధ;
blind from birth, ph. పుట్టుగుడ్డి;
blind person, ph. గుడ్డిది; గుడ్డివాడు; కబోది;
blindness, n. గుడ్డితనం; అంధత్వం;
night blindness, ph. రేచీకటి;
blinders, n. గంతలు; గుర్రాలకీ, గానుగెద్దులకీ కళ్ళకి కట్టే మూతలు;
blinds, n. pl. (1) కిటికీలకి వేసే ఒక రకం తెరలు; (2) కళ్లకి కనబడకుండా కట్టే గంతలు;
bliss, n. ఆనందం; మహదానందం; బ్రహ్మానందం; చిద్విలాసం;
blissfulness, n. చిద్విలాసం;
blister, n. బొబ్బ; పొక్కు; నీటితో నిండిన పొక్కు;
blister, v. i. బొబ్బ ఎక్కు; పొక్కు ఎక్కు;
blithely, adj. చిద్విలాసంగా; in a happy or carefree manner; in a way that shows a casual and cheerful indifference considered to be callous or improper;
blizzard, n. ధూమిక; మంచు తుఫాను;
bloated, adj. ఉబ్బిన; ఉబ్బరించిన; పొంగిన;
blob, n. ముద్ద;
block, n. దిమ్మ; దుంగ; మొద్దు;
block, v. t. అడ్డు; అడ్డగించు; అడ్డుపడు; అవరోధించు;
blockade, n. దిగ్బంధం; లోనికీ బయటకూ వెళ్ళకుండా అన్ని వైపులా బంధించడం;
blocked, adj. నిషిద్ధ; నిషేధ;
blockhead, n. శుంఠ; శుద్ధ మొద్దావతారం;
blog, n. అభివేదిక; వ్యక్తిగత అభిప్రాయ వేదిక; సంపాదకుని వంటి మరొక వ్యక్తి వడపోతకి, అనుమతికి సంబంధం లేకుండా ఎవరికి వారే వారి అభిప్రాయాలని అంతర్జాలం ద్వారా ప్రచురించుకోడానికి ఒక సాధనం;
blond, adj. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల;
blond, n. m. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల మగాడు;
blonde, n. f. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల ఆడది; (rel.) brunette; redhead;
blood corpuscle, n. రక్త కణం; ప్రవాహంలో తేలుతూ ప్రయాణం చెయ్యగలిగే కణం అయితే దానిని కార్పసుల్ అంటారు;
blood circulation, ph. రక్త ప్రసారం;
blood feud, n. పాలిపగ;
blood plasma, n. రసి; రక్తపు రసి; జీవద్రవ్యం;
blood pressure, n. నెత్తురు పోటు; రక్తపు పోటు; రక్తపు పీడనం;
blood serum, n. రక్తపు సీరం;
blood stain, n. రక్తపు మరక; రక్తపు డాగు;
blood stream, n. రక్త ప్రవాహం;
blood test, n. రక్తపు పరీక్ష;
blood type, n. రక్తపు జాతి; A, B, AB, O అనే నాలుగు రకాలలో ఒకటి;
blood vessel, n. రక్త నాళం; ధమని; సిర;
bloodhound, n. ఉడుపకుక్క; వేటకుక్క; వాసనని పట్టుకుని వేటాడే కుక్క;
bloodshed, n. రక్తపాతం;
bloodshot, adj. జేవురించిన;
bloodshot eyes, ph. జేవురించిన కళ్ళు;
bloodwort n. రాజ్మరీ; yarrow; [bot.] Achillea millefolium; is a flowering plant in the family Asteraceae. It has small white flowers, a tall stem with fernlike leaves, and a pungent odor;
bloom, v. i. వికసించు; విచ్చుకొను;
bloom, n. (1) తారుణ్యం; పూత; (2) ఇనప కడ్డీ; ఉక్కు కడ్డీ;
blooming mill, ph. ఇనప/ఉక్కు కడ్డీలని చేసే కర్మాగారం;
blooms, n. pl. పువ్వులు;
blossoms, n. pl. పువ్వులు;
blot, n. మరక; మచ్చ; కళంకం;
ink blot, ph. సిరా మరక;
blotting paper, ph. అద్దుడు కాగితం;
blotches, n. (1) పెద్ద మచ్చలు; మరకలు; (2) చెమట పొక్కులు; చీము పొక్కులు;
blouse, n. చేలం; చోలీ; చోళకం; రవిక; జాకెట్టు;
blouse piece, ph. జాకెట్టు గుడ్డ; రవికల గుడ్డ;
blow, n. దెబ్బ; గుద్దు;
heavy blow, ph. వీశ గుద్దు;
mortal blow, ph. చావు దెబ్బ;
blow, v. i. (1) చీదు; (esp.) blowing the nose; (2) ఊదు; నోటితో ఊదు;
blow, v. t. (1) వీచు; (2) విసురు;
blowpipe, n. (1) ఊదుడు గొట్టం; మంటని మండించడానికి వాడే గొట్టం; (2) తిమింగిలం గాలిని పీల్చడానికి వాడే నాళం;
bludgeon, v. t. బాదు;
blue, adj. నీలం; నీలి; నీల;
dark blue, ph. ముదురు నీలం; మేచకం;
blue moon, ph. [idiom] అరుదైన సంఘటన; దరిదాపు ఎనభై ఏళ్ళకి ఒకసారి ఒకే నెలలో రెండుసార్లు పూర్ణచంద్రుడు కనిపించే అవకాశం ఉంది. ఆ రెండవ పూర్ణచంద్రుడిని బ్లూ మూన్ అంటారు;
blueprint, n. పథకం; కాగితం మీద గీసిన పథకం;
blues, n. (1) విచారగ్రస్థమైన మనోస్థితి; (2) ఆఫ్రికా నుండి అమెరికాకి బానిసలుగా వచ్చినవారు పాడుకుంటూ, బాగా ప్రచారంలోకి తీసుకువచ్చిన, విచారగ్రస్థమైన సంగీతపు బాణీ;
blue vitriol, n. మైలతుత్తం; CuSO4;
bluff, v. t. బూకరించు; బుకాయించు;
bluish, adj. నీలపు;
bluish black, ph. నీలకృష్ణ;
bluish green, ph. నీలహరితం;
bluish grey, ph. నీలధూసరం;
bluish red, ph. నీలలోహితం;
blunder, n. పెద్ద తప్పు; పొరపాటు;
blunt, adj. మొద్దు; నిర్మొహమాటమైన; ఉన్నదున్నట్టు;
blurred, adj. అస్పష్ట; చెదిరిన; బూదర;
blush, v. i. బుగ్గలు ఎరబ్రారు; సిగ్గుపడు;
blush, n. ఎర్రదాళు; దాళువు;
blyxa octandra, n. శైవలం; ఒక రకమైన నీటిమొక్క;
boa constrictor, n. కొండచిలువ వంటి పెద్ద పాము;
boar, n. మగ పంది;
wild -, అడవి పంది; ఘార్జరం; కోరలు ఉన్న పంది;
board, n. (1) మండలి; వర్గం; (2) బల్ల; చెక్క; (3) వాహనం యొక్క తట్టు;
board of directors, ph. పరిపాలక మండలి; నిర్వాహక సంఘం;
board of governors, ph. పరిపాలక మండలి;
editorial board, ph. సంపాదక మండలి; సంపాదక వర్గం;
board game, n. పాళీ;
boarding, n. భోజన సదుపాయం;
boarding house, ph. భోజనాలయం;
boarding school, ph. భోజన సదుపాయంతో ఉన్న పాఠశాల;
boarding and lodging, ph. గ్రాస వాసాలు;
boast, v. t. ప్రగల్భాలు పలుకు; గొప్పలు చెప్పు; గప్పాలు కొట్టు;
boasting, n. స్వోత్కర్ష; గప్పాలు కొట్టడం;
boat, n. పడవ; ఓడ; దొప్ప; దొన్నె;
motor boat, ph. లాంచీ;
boatman, n. క్షపణికుఁడు; పడవరి; పడవవాఁడు;
bobbed, adj. కత్తిరించిన; కురచ చేసిన;
bobbed hair, ph. కత్తిరించిన జుత్తు; కురచ చేసిన జుత్తు;
bobtail, n. (1) కత్తిరించిన తోక; (2) మొండి తోక గల జంతువు;
bodice, n. రవిక; అంగిక;
bodice piece, ph. రవికల గుడ్డ;
bodily, adj. శారీరకమైన;
bodkin, n. దబ్బనం; దబ్బలం; కంఠాణి;
body, n. (1) శరీరం; ఒళ్లు; ఒడలు; కాయం; దేహం; క్షేత్రం; తనువు; మేను; మై; బొంది; గాత్రం; భౌతిక కాయం; భౌతిక దేహం; కళేబరం; (2) వస్తువు; ఘటం; (3) వర్గం; సంస్థ; మైతి (మై = body. దాని ఔపవిభక్తిక రూపం = మైతి. దాన్నే నామవాచకంగా తీసుకోవడమైనది);
antibody, ph. [bio.] ప్రతికాయం; రోగరక్షకి;
authoritative body, ph. అధికార వర్గం;
causal body, ph. కారణ శరీరం; In Yoga, Karana sarira or the causal body is merely the cause[1] or seed of the subtle body and the gross body
dead body, ph. మృతదేహం, శవం; పీనుగ;
governing body, ph. పాలక వర్గం; అధిష్ఠాన వర్గం;
gross body, ph. స్థూల శరీరం; 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు; In Yoga, Sthula sarira or the gross body is the material physical mortal body that eats, breathes and moves (acts);
injured body, ph. క్షతగాత్రం;
subtle body, ph. సూక్ష్మ కాయం; సూక్ష్మ శరీరం; మనస్సు, బుద్ధి; In Yoga, Sukshma sarira or the subtle body is the body of the mind and the vital energies, which keep the physical body alive;
body language, ph. హావభావాలు; మాటలతో కాకుండా, అప్రయత్నమైన చేష్టలతో మనోభావాన్ని వెలిబుచ్చడం;
body mass index, ph. స్థూలకాయపు సూచిక; పొడుగు, బరువు సమతూకంలో ఉన్నాయో లేదో చెప్పే సూచిక; ఈ సూచిక 30 దాటితే ఆ వ్యక్తి స్థూలకాయంతో ఉన్నట్లు లెక్క ; ఈ సూచికని లెక్క కట్టడానికి శరీరం యొక్క బరువుని పానులలో తూచి, దానిని 703 చేత గుణించాలి. అలా వచ్చిన లబ్దాన్ని అంగుళాలలో కొలిచిన వ్యక్తి పొడుగు చేత రెండు సార్లు భాగించాలి; ఉదాహరణకి బరువు = 120 పానులు, పొడుగు = 60 అంగుళాలు అయితే (703 x 120)/(60 x 60) = 23 (ఉరమరగా); కనుక ఈ వ్యక్తిది స్థూలకాయం కాదు;
---Usage Note: Bogie, coach, compartment
A bogie is a frame comprised of four wheels on two axels; A coach is a unit resting on two bogies; Inside a coach, there are several compartments;
BRITISH: an undercarriage with four or six wheels pivoted beneath the end of a railway carriage.
INDIAN: a railway carriage. In India, almost all long-distance trains have seventeen to twenty bogies
boom, n. (1) పెద్ద చప్పుడు; మోత; (2) ఎక్కువ పెరుగుదల; (ant.) bust; (3) విజృంభణ;
boom and bust, ph. [idiom] అతివృష్టి, అనావృష్టి;
boon, n. వరం;
boondocks, n. [idiom] శంకరగిరి మన్యాలు; మారుమూల ప్రదేశం;
boor, n. మోటు మనిషి; మర్యాద తెలియని వ్యక్తి;
boorish, adj. సారస్యం లేని; గౌరవం తెలియని;
boost, v. t. ఉగ్గడించు; ఎగదోయు;
boot, n. (1) బూటు; పాదాన్ని పూర్తిగా కప్పే చెప్పు; (2) డిక్కి; కార్లలో సామానులు పెట్టుకునే అర;
boot, v. t. ప్రాణం లేకుండా పడున్న కంప్యూటరుని లేవగొట్టడం; (ety.) abbreviation for bootstrap;
Bootes, n. భూతేశ మండలం; ఆకాశంలో కనిపించే ఒక నక్షత్ర సమూహం; ఈ మండలంలో బండి కట్టుటకు పనికి వచ్చే ముసలి ఎద్దు, స్వాతి నక్షత్రం, చుట్టూ వానరాకార తారాగణం, ఉత్తరాన శేషుని ఏడు శిరస్సులు ఉంటాయి;
bootstrap, n. చెప్పులని పాదాలకి బిగించి కట్టడానికి వాడే తాడు;
bootstrap, v. t. కాలికి ఉన్న చెప్పుల తాడు చేత్తో పట్టుకుని పైకి లేవడం; [idiom] మరొకరి సహాయం లేకుండా ఎవరికి వారే పైకి లేవడం;
bootlegged, adj. అక్రమ; చట్టవిరుద్ధ; దొంగ;
bootlegging, n. దొంగ సారా వ్యాపారం;
booth, n. బడ్డీ; కాయమానం; తాత్కాలికంగా నిలిపే అంగడి; దుకాణం;
booty, n. కొల్లగొట్టు; కొల్లగొట్టి సంపాదించిన సరుకులు; వేటకి వెళ్ళి పట్టుకొచ్చిన పంట;
bop, n. (1) జెల్ల; జెల్లకాయ; తలమీద సుతారంగా వేసిన దెబ్బ; (2) బొప్పి;
borax, n. టంకణం; వెలిగారం;
border, n. (1) సరిహద్దు; పొలిమేర; (2) అంచు; ఉపాంతం; (3) ఎల్ల;
borderline, n. సరిహద్దు రేఖ; పొలిమేర; ఉపాంతం; ఎల్లంచు;
borderline personality disorder, ph. ఒక రకం మానసిక వ్యాధి; ఎల్లంచు వ్యక్తిత్వ వికారం; ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిలకడ లేని ఉద్వేగత, ఇతరులతో నిలకడ లేని సంబంధ బాంధవ్యాలు ఈ వ్యాధి లక్షణాలు;
bouquet, n. (బొకే) గుచ్ఛం; గుత్తి; చెండు; స్తబకం; పుష్ప గుచ్ఛం;
bouquets and brickbats, ph. పొగడ్తలు, తెగడ్తలు; భూషణ దూషణములు; మెప్పులు, దెప్పులు;
bourbon, n. అమెరికాలో తయారయే ఒక జాతి విష్కీ, మొక్కజొన్నతో చేసిన బీరుని ధృతించి (బట్టీపట్టి) ఆల్కహోలు పాలు 51 శాతం వరకు పెంచినప్పుడు లభించే మాదక పానీయం;
bourgeois, n. s. (బూర్ ష్వా, బూర్జువా) మధ్యతరగతి వ్యక్తి; సామాన్యపు వ్యక్తి;
bourgeoisie, n. pl. (బూర్ ష్వాసీ) సామాన్యులు; మధ్యతరగతి జనులు;
boutique, n. (బోటీక్) మారుతూన్న కాలానికి తగిన ఖరీదైన వస్తువులని అమ్మే దుకాణం;
bovine, adj. (1) గోజాతీయ; ఆవుకి సంబంధించిన; (2) ఎద్దు వలె; బద్ధకిష్టిగా; దున్నపోతు వలె; Bovine comes from the Latin word for "cow", though the biological family called the Bovidae includes not only cows and oxen but also goats, sheep, bison, and buffalo;
bow, n. (బో) (1) ధనుస్సు; విల్లు; సారంగం; కమాను; సింగాణి; (2) పడవ ముందు భాగం;
bow, v. i. (బవ్); వంగు; వంగి నమస్కరించు; శిరస్సు వంచి నమస్కరించు;
bowstring, n. అల్లెతాడు; వింటినారి;
bow legs, n. దొడ్డికాళ్లు; see also knock knees;
bowel, n. s. పేగు;
bowel movement, ph. విరేచనం;
bowels, n. pl. ప్రేగులు; పెద్ద ప్రేగులు; ఆంత్రములు;
bower, n. లతాగృహం; పొదరిల్లు; ఛత్వరం;
bowstring, n. అల్లెత్రాడు; వింటి నారి; గొనయం;
bowl, n. (బోల్) గిన్నె; చిప్ప; కరోటి;
bowl, v. t. (బోల్) బంతిని విసరు; బంతిని దొర్లించు;
box, n. పెట్టె; పెట్టి; పేటిక; మందసం;
box office, ph. సినిమా, నాటకం, వగైరా ఆడే చోట టికెట్లు అమ్మే గది;
chatterbox, ph. వాగుడుకాయ; ముఖర;
boxing, n. ముష్టాముష్టి; ముష్టియుద్ధం;
boy, n. అబ్బాయి; కొడుకు; పిల్లడు; బుల్లోడు; కుర్రాడు; పాపడు;
boy friend, ph. (1) చెలికాడు; (2) ప్రియుడు;
boycott, n. సామూహిక బహిష్కారం; (ety.) Irish farmers used to avoid the British tax collectiong agent, Charles C. Boycott; కపితాన్ బోయ్‍కాట్ మీద ప్రజలు చేసిన బంద్ కారణంగా అతని పేరు వచ్చింది;
boyhood, n. కైశోరం; బాల్యావస్థ;
Part 4: bp-bz
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
brace, n. అడ్డుకట్టు; కట్టు; బంధనం:
bracelet, n. మురుగు; కంకణం; ముంజేతి గొలుసు; కేయూరం;
USAGE NOTE In technical writing, we distinguish between brackets and parentheses. Generally, 'parentheses' refers to round brackets ( ) and 'brackets' to square brackets [ ]. ... Usually we use square brackets - [ ] - for special purposes such as in technical manuals.
bracketing, v. t. కుండలీకరించు;
brackish, adj. ఉప్పని; కాసింత ఉప్పని; ఉప్పుటేరులో నీటి వంటి నీరు;
brachydactyly, n. హ్రస్వాంగుళ్యం; చేతి వేళ్లు అతి పొట్టిగా ఉండే ఒక జన్యులోపం;
bragging, n. గప్పాలు కొట్టడం; డంబాలు చెప్పుకొనడం; సొంతడబ్బా కొట్టుకొనడం; స్వోత్కర్ష; అహమహమిక;
Brahman, n. పరబ్రహ్మ; పరమాత్మ;
brahmin, n. m. బ్రాహ్మణుడు; f. బ్రాహ్మణి;
brahminism, n. వైదిక హిందూమతం;
braid, n. జడ; అల్లిన జుత్తు; పేటలు తీసి అల్లిన జుత్తు;
braiding, n. అల్లిక; అల్లుడు;
brain, n. మెదడు; మస్తిష్కం; మేధస్సు; గోదం;
brain fever, ph. మేధోసన్నిపాత జ్వరము; same as meningitis;
brain power, ph. మేధాశక్తి;
brainchild, n. ఊహ; బురల్రో పుట్టిన బుద్ధి; స్వకపోల కల్పితం;
brainstem, n. మేధా కాండం;
brainstorming, n. మేధామథనం; సంస్కృతంలో 'మేధస్' అంటే మెదడు (శరీరంలోని ఒక అవయవం/భాగం). 'మేధా' అంటే బుద్ధి, మెదడులో పుట్టిన ఆలోచనా జ్ఞానం. ఇక్కడ మనం మథిస్తున్నది బుద్ధినేగానీ మెదడును కాదు. కనుక మేధామథనం అన్నదే సరియైనది.
brainwashing, n. భ్రమర కీటక న్యాయం; బంధితుల మనోభావాలని బలాత్కారంగా మార్చడం;
brainwave, n. (1) మేధాలహరి; మెధాతరంగం; అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన; (2) నాడీ తరంగాలు; తలకి తీగలు తగిలించి మెదడులోని నాడీ తరంగాలని నమోదు చెయ్యగా వచ్చిన రేఖా చిత్రం;
brand, n. (1) వాత; శునకముద్ర; (2) వ్యాపారపు గుర్తు; వాణిజ్య చిహ్నం;
branded bull, n. అచ్చేసిన ఆంబోతు;
branding, v. t. వాత వేయు; ముద్ర వేయు; గుర్తు పెట్టు;
branding, n. వాత పెట్టడం;
branding iron, n. కరుగోల; వాత పెట్టడానికి వాడే ఇనప ఊచ;
brandy, n. బ్రాందీ; సారాని దిగమరిగించగా వచ్చిన మాదక పానీయం; ఆల్కహోలుని 80 శాతం గాఢత వచ్చే వరకు దిగమరిగించి, 40 శాతం గాఢత దగ్గర సీసాలలో పోసి అమ్ముతారు; (ety.) In Dutch, Brandewijn means "burnt wine";
brass, n. ఇత్తడి; పిత్తలం; రాగి, యశదం కలపగా వచ్చిన మిశ్రమ లోహం;
fresh breeze, ph. పైరగాలి; వేసవికాలములో ఆగ్నేయ దిశనుండి (సముద్రము నుండి భూమి మీఁదికి) వీచు చల్లగాలి.
gentle breeze, ph. మంద మారుతం; పిల్ల తెమ్మెర;
mountain breeze, ph. మలయ మారుతం; కమ్మగాడ్పు;
slight breeze, ph. చిరుగాలి;
breezeway, n. వాతాయనం; గాలి వీచే మార్గం;
brevity, n. లాఘవం;
brew, n. కషాయం; కాచగా వచ్చినది; సారా;
brew, v. t. కాచు; మరగించు; ఉడకబెట్టు;
brewery, n. సారాబట్టి; సారా కాచే భవనం;
bribe, n. లంచం; ఉపప్రదానం;
bribery, n. లంచగొండితనం;
brick, n. ఇటిక;
sun-dried brick, ph. పచ్చి ఇటిక;
brickbats, n. pl. ఇటిక ముక్కలు;
bride, n. పెళ్ళికూతురు; వధువు;
bride and groom, ph. వధూవరులు;
bridegroom, n. పెళ్ళికొడుకు; వరుడు;
bridle, n. జీను; see also rein;
bridge, n. (1) వంతెన; వారధి; నదికి ఇటువైపు నుండి అటువైపు దాటే మార్గం; (2) సేతువు (causeay); మదుం (culvert); (3) ఒక పేకాట పేరు; (4) ముక్కు దూలం; (5) సహజసిద్ధమైన పళ్లు ఇటూ, అటూ ఉండగా మధ్యలో ఉన్న కట్టుడు పళ్లు;
bright matter, ph. శుక్ల పదార్థం; నక్షత్రాల వంటి స్వయం ప్రకాశమానమైన పదార్థాలు;
brightness, n. ద్యుతి; దీప్తి; ఉద్భాసం; తారళ్యం; కకుప్పు; కకుభము;
brilliant, adj. ఉజ్వల; తెలివైన; సూక్ష్మబుద్ధి గల;
brilliance, n. (1) ద్యుతి; భాతి; భాసం; (2) తెలివి; సూక్ష్మబుద్ధి;
brilliantly, adv. జ్వాజ్వల్యమానంగా;
brim, n. అంచు; ఒడ్డు;
brimstone, n. గంధకశిల; గంధకాశ్మము; గడ్డకట్టిన గంధకం;
brine, n. కారుప్పు నీళ్లు; ఉప్పు నీళ్లు;
briny, adj. కారుప్పని;
bring, imp. పట్టుకొనిరా, పట్రా; తే;
bring, v. t. పట్టుకొనివచ్చు; తెచ్చు; తీసుకువచ్చు; కొనివచ్చు;
bring forth, ph. కను;
bring to pass, ph. జరిగేట్లు చేయు;
bring up, ph. పెంచు, పోషించు; విషయాన్ని తీసుకొని వచ్చు;
brinjal, n. [Ind. Eng.] వంకాయ; మెట్ట వంకాయ; నీటి వంకాయ; eggplant; aubergine;
green brinjal, ph. గుండ్రంగా, ఆకుపచ్చగా ఉండే మెట్ట వంకాయలు;
blue brinjal, ph. కోలగా, పొడుగ్గా, నీలంగా ఉండే నీటి వంకాయలు;
brink, n. ఒడ్డు; అంచు;
brinkmanship, n. కయ్యానికి కాలుదువ్వే తత్వం; యుద్ధం చేసేస్తానని కత్తిని ఝళిపించే తత్వం;
brisk, adj. చుఱుకైన; వడిగల;
Bristol stone, n. పుష్యరాగం;
brittle, adj. పెళుసు; పెళుసైన; భంగురమైన;
brittleness, n. పెళుసుతనం; భిదురత;
broach, v. t. ప్రస్తావించు; మాటల సందర్భంలో ప్రసక్తి తీసుకుని వచ్చు;
broad, adj. వెడల్పయిన; విశాలమైన;
broad axe, ph. గండ్రగొడ్డలి;
broadband, n. విస్తృత పట్టీ; డిజిటల్ ప్రసార మాధ్యమం (ఒక తీగ కాని, రేడియో మార్గం కాని, ....) యొక్క "దత్తాంశాలని పంపగలిగే స్థోమత"ని విస్తృత పరచాలంటే దత్తాంశాలు అనేక, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రసార మార్గాల గుండా ప్రయాణం చెయ్యగలిగే వెసులుబాటు ఉండాలి. ఆ రకం వెసులుబాటు ఉన్న మాధ్యమాన్ని "బ్రాడ్ బేండ్" అంటారు; ఈ రకం వెసులుబాటు లేకుండా ఒక తీగ మీద కాని, ఒక రేడియో మార్గం మీద కాని ఒకే ప్రసార మార్గం ఉంటే దానిని బేస్ బేండ్ అంటారు.
broadcast, n. (1) ప్రసారణ; పరిప్రేషణం; (2) ఆకాశవాణి ప్రసారం;
broadcast, v. t. ప్రసరించు; ప్రసారం చేయు; టముకు వేయు;
broadcaster, n. ప్రసారకుడు;
broadcasting station, ph. ప్రసారణ కేంద్రం;
broadly speaking, ph. స్థూలంగా చెప్పదలిస్తే;
broadside, n. ప్రక్క; పార్శ్వం;
brochure, n. (బ్రోషూర్) కరపత్రం; లఘుపొత్తం;
broken, adj. విరిగిన; భగ్న;
broker, n. దళారి; అడితిదారు; ఆరిందా; మధ్యవర్తి; శరాబు; తరగిరి;
Bromine, n. బ్రొమీను; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 35, సంక్షిప్త నామం, Br.); [Gr. bromos = stench];
bronchi, n. శ్వాసనాళపు కొమ్మల జత;
bronchiole, n. శ్వాసనాళం; శ్వాసనాళిక;
bronchitis, n. కొమ్మవాపు; శ్వాసనాళపు కొమ్మ వాచడం; ఊపిరితిత్తులకి గాలి తీసుకెళ్లే రెమ్మల వాపు;
bronze, adj. కాంస్య; కంచు;
bronze, n. కంచు; కాంస్యము; రాగి, తగరం కలపగా వచ్చిన మిశ్రమ లోహం;
Bronze Age, n. కంచు యుగం; కాంస్య యుగం;
bronze smith, n. కంచరి; కాంస్యకారి;
broil, v. t. కాల్చు; నిప్పులమీద వేసి కాల్చు;
broken, adj. విరిగిన; భగ్న; చెదిరిన;
broken cloud, ph. చెదిరిన మేఘం;
broken heart, ph. భగ్న హృదయం;
broken line, ph. చెదిరిన గీత;
broker, n. దళారి; అడితిదారు; షరాబు;
brokerage, n. దలారీ; అడితి; కాయిదా;
brooch, n. పైటపిన్ను; పయ్యెదకొక్కి; పమిటకొక్కి;
brood, n. పిల్లలు; సంతానం;
brood, v. i. మథనపడు;
brook, n. గడ్డ; వాగు; ఏఱు; సరా;
broom, n. చీపురు; చీపురుకట్ట; పొరక; పొరకట్ట;
coarse broom, ph. గొరక చీపురు;
soft broom, ph. చీపురు;
broth, n. చారు; రసకం; కట్టు;
brothel, n. వేశ్యాగృహం;
brother, n. అన్న; తమ్ముడు; అన్నదమ్ముడు; తోడబుట్టినవాడు; సోదరుడు; సహోదరుడు; భ్రాత; అనుజుడు;
brotherhood, n. (1) భ్రాత్రీయం; సౌదర్యం; భ్రాతృత్వం; (2) బరాదరి; జట్టు; తెగ;
brother-in-law, n. బావమరది; భార్య అన్నదమ్ముడు;
brouhaha, n. రాద్ధాంతం;
brow, n. కనుబొమ్మ; కనుబొమ; భృకుటి;
browbeat, v. t. బెదిరించు; దబాయించు;
brown, adj. గోధుమరంగు; పాలిత; బభ్రు; పింగళ; కపిల;
brown sugar, ph. కపిల చక్కెర; షాడబ చక్కెర; శుద్ధి చేసిన చక్కెర మీద షాడబం కొరకు కాసింత మొలేసస్ జల్లి, రంగు కలపగా వచ్చినది; ఇది బెల్లం కాదు; బెల్లంలో ఉన్నపాటి పోషక విలువలు ఇందులో లేవు;
brown, n. కపిలవర్ణం; పొగాకు రంగు;
brown, v. t. ఎఱ్ఱబడేవరకు కాల్చు;
brownish red, n. జేగురు రంగు;
browse, v. i. (1) విహరించు; వీక్షించు; (2) సావకాశంగా కొమ్మలని తినడం;
browser, n. అంతర్జాల దర్శని; విహారిణి; వీక్షణి; వీక్షకి; అంతర్జాలంలో విహరిస్తూ అక్కడ ఉన్న సమాచారాన్ని పరికించి చూడడానికి వాడే క్రమణిక;
bruise, n. (బ్రూజ్) అరవడి; కందిన చర్మం; కమిలిన గాయం; కదుము కట్టిన గాయం; చర్మం తెగకుండా తగిలిన దెబ్బ;
bruise, v. i. (బ్రూజ్) కందు; కములు; కదుము; చర్మం తెగకుండా దెబ్బ తగలడం;
brunch, n. breakfast +lunch;
brunette, n. నల్ల జుత్తు గల స్త్రీ; (rel.) blonde; redhead;
brutal, adj. (1) పశుప్రాయమైన; (2) చాల కష్టసాధ్యమైన;
brute, n. (1) పశువు; గొడ్డు; (2) క్రూరుడు;
brutality, n. దురంతం; పశుత్వం; క్రూరత్వం;
bruxism, n. పళ్లు కొరకడం;
bubble, n. బుడగ; నీటి బుగ్గ; నీటి బుడగ; బుద్బుదం; అచిరాంశువు;
water bubble, ph. నీటి బుడగ; బుద్బుదం;
bubble chamber, ph. [phy.] బుద్బుద కోష్ఠిక;
bubbling, n. బుద్బుదీకరణం; బుడగలు వచ్చేలా చేయడం;
buccal, adj. నోటికి సంబంధించిన;
buck, n. m. ఇర్రి; మగ జింక;
bucket, n. బాల్చీ; బొక్కెన; చేద; నేచని; బకిట్టు;
buckle, v. i. విరుగు; కూలు; కుప్పకూలు;
buckle, v. t. కట్టు; (note) ఇక్కడ బకుల్ అన్న మాటకి వ్యతిరేకార్థాలు గమనించునది.);
bud, n. మొగ్గ; ముకురం; అంకురం; కలిక; బొడిపె;
taste bud, ph. రుచి బొడిపె;
bud, v. i. మొగ్గతొడుగు; పొటమరించు;
buddy, n. నేస్తం; స్నేహితుడు; స్నేహితురాలు;
budget, n. ఆదాయవ్యయ పట్టిక; ఆదాయ వ్యయ పత్రం; యయవ్యం; ఆదాయాన్ని, ఖర్చుని సరితూగేటట్టు లెక్క వేసుకొనడం; బడ్జెట్;
buffalo, n. గేదె; బర్రె; ఎనుము; మహిషి; పడ్డ; దుంత; లులాపం;
he buffalo, ph. గేదె; ఎనుబోతు; దున్నపోతు; దుంత; మహిషం;
she buffalo, ph. గేదె; బర్రె; ఎనుపెంటి; ఎనుపసరం; మహిషి;
water buffalo, ph. గేదె; బర్రె; ఎనుము; ఎనుపెంటి; మహిషి;
wild buffalo, ph. గవరు;
buffer, n. మధ్యస్థి; నిథికం; నిథానకం; (1) [comp.] జోరుగా నడిచే కంప్యూటరుకీ నెమ్మదిగా పనిచేసే ఉపకరణాలకీ మధ్యవర్తిగా పనిచేసే దత్తాంశ నిలయం; A small portion of storage that is used to hold information temporarily; (2) రెండు అగ్రరాజ్యాల మధ్య ఇరుక్కున్న బడుగు రాజ్యం; (3) [chem.] ఒక ద్రావణం లోని సాపేక్ష ఆమ్లత, క్షారతల నిష్పత్తిని మార్చకుండా ఆ ద్రావణం లోని ఆమ్లాలనీ, క్షారాలనీ నాశనం చెయ్యగలిగే పద్ధతి;
buffet, n. (బుఫ్ఫే) ఎవరి భోజనాలు వారే వడ్డించుకుని తినే పద్ధతి;
bull market, ph. the term 'bull market' describes a 20% increase, in the value of stocks or other securities, from the most recent lows; see also bear market;
bullet, n. గుండు; సీసపుగుండు; పడిగల్లు; తూటాలో ఉండే లోహపుగుండు; (rel.) cartridge;
bullion, n. ముద్ద బంగారం; బంగారపు కడ్డీలు; ముద్ద వెండి; వెండి కడ్డీలు; బంగారము, వెండి 99.9% శుద్ధి చేయబడి పొడవైన ఆకృతిలో కానీ , కడ్డీ, నాణెము రూపము కలిగిన వాటిని బులియన్ అంటారు;
bullish, adj. భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండడం;
bullock, n. ఎద్దు; చిన్న ఎద్దు;
bull's eye, n. గురి కేంద్రం;
bully, n. కోరి జగడమాడి అల్లరి పెట్టు వ్యక్తి;
bulge, n. గుబ్బ; వాఁపు;
bulge, v. i. వాచు; ఉబ్బెత్తుగా అవు;
bulrush, n. తుంగ; ఒక రకం గడ్డి;
bum, n. గోచిపాతరాయుఁడు; పనికిరానివాఁడు;
bump, n. బొప్పి; బొడిపె;
bumper, n. (1) సమృద్ధి; (2) కారుకి దెబ్బ తగిలినప్పుడు కారుని లోపల ప్రయాణీకులకి దెబ్బలు తగలకుండా కాపు కాసే కడ్డీ;
bumpkin, n. మోటు వ్యక్తి; నాగరికత తెలియని వ్యక్తి; బైతు;
country bumpkin, ph. పల్లెటూరి బైతు;
bunch, n. (1) అత్తం; పెడ; చీపు; గెల; గెలలో చాలా పెడలు ఉంటాయి; (2) గుచ్ఛం;
bunch of flowers, ph. పూలగుచ్ఛం; మంజరి;
bunch of bananas, ph. అత్తం అరటి పళ్లు; పెడ అరటి పళ్లు;
bunch of plantains, ph. అత్తం అరటి కాయలు; పెడ అరటి కాయలు;
bund, n. [Ind. Engl.] గట్టు; dyke; embankment; levee;
bundle, n. మోపు; కట్ట; మూట; పుంజం; బంగీ;
bundle of cuteness, ph. ముద్దుల మూట;
bundle of firewood, ph. కరల్రమోపు; కట్టెల మోపు;
bundle of rays, ph. కిరణ పుంజం;
bungalow, n. బంగళా; వెడల్పయిన వరండాలతో ఉండే పాక లాంటి ఇల్లు;
bunk, n. బడ్డీ;
buoy, n. బోయా; బోయాగుండు; బోలు గుండు; బోయాకట్టె; ఈతకాయ; అలామతుకర్ర; ఉడుపు; ఉడుపం; తరండం; తేలుడు గుండు; రేవులలో మెరక ప్రదేశాలని సూచించడానికి వాడే తేలుడు గుండు; a float; a raft;
buoyancy, n. తేలే గుణం; ప్లవనం; ఉత్‌ప్లవనం; ఉల్బణం; ఉడుపం;
burden, n. బరువు; భారం; गुदिबंड; శ్రమ; ధుర; మోపుదల;
beast of burden, ph. ధురీణం; ధురంధరం;
bureau, n. (బ్యూరో) (1) సొరుగులు ఉన్న బల్ల; మేజా; (rel.) dresser; chest; almirah; (2) ఒక సంస్థలో ఒక శాఖ;
bureaucracy, n. (బ్యూరాక్రసీ) ఉద్యోగిస్వామ్యం; ఉద్యోగులచే పరిపాలన;
burette, n. బురెట్, కొలగీట్లు ఉన్నటువంటిన్నీ, అడుగున మూయడానికీ, తెరవడానికీ కుళాయి వంటి సదుపాయం ఉన్నటువంటిన్నీ, సన్నటి, పొడుగాటి గాజు గొట్టం;
burlesque, n. (1) వెటకారం చేస్తూ అసంభవమైన సంఘటనలతో కూడిన హాస్య నాటక ప్రదర్శన కానీ, గ్రంథ రచన కానీ; (2) నైట్ క్లబ్బులలో బట్టలు ఊడదీసుకుంటూ చేసే నగ్న నాటక ప్రదర్శన;
burn, v. t. కాల్చు; మండించు; మాడ్చు;
burn, v. i. కాలు; మండు;
burn and scorch, ph. దందహ్యమానం;
burn to ashes, ph. కాలిపోవు; భస్మమగు; దగ్ధమగు;
burner, n. జ్వాలకం; జ్వాలకి;
burning, adj. మండుతూన్న; ప్రజ్వలిత;
burning log, ph. కొరకంచు; కొరివి;
burning topic, ph. ప్రజ్వలిత అంశం;
burnish, v. t. మెరుగుపెట్టు; సానపట్టు;
burns, n. pl. కాలడం వల్ల కలిగిన పుండ్లు;
first-degree burns, ph. చర్మం పై పొర (epidermis) మాత్రమే వేడికి ఎర్రపడడం;
second-degree burns, ph. చర్మం లోపలి పొర (dermis) వరకు కాలడం వల్ల కలిగిన గాయం;
third-degree burns, ph. చర్మం లోపలి పొర (dermis) దాటి లోతుగా ఉన్న కణజాలం కాలడం వల్లకలిగిన గాయం;
burnout, n. విరామం లేకుండా విపరీతంగా పని చెయ్యడం వల్ల పని మీద వెగటు కలిగిన మనోస్థితి;
burnt, adj. కాలిన; మాడిన;
burp, n. తేనుపు; ఉద్గారం;
burr mallow, n. నల్లబెండ; [bot.] Urena Sinuata;
burrman's sandew, n. బురదబూచి; కవర మొగ్గ; [bot.] Drosera Burmannii;
burrow, n. బొరియ; బిలం; నేలకన్నం; భూరంధ్రం;
bursar, n. కళాశాలలో కోశాధిపతి;
bursary, n. విద్యార్థి సహాయక భృతి;
burst, v.i. పగులు; పేలు; పేలిపోవు;
bury, v. t. పాతిపెట్టు; కప్పెట్టు;
bus, n. (1) బస్సు; (2) తీగల మోపు; తీక్కట్ట; విద్యుత్ పరికరాలని సంధించడానికి వాడే తీగలు; sets of conductors (wires, PCB tracks or connections) connecting the various functional units in an electrical system;
bush, n. పొద; అడవి;
why beating around the bush?, ph. [idiom] చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు?;
bushel, n. ధాన్యాన్ని కొలవడానికి ఒక కొలమానం; ఉరమరగా ఎనిమిది కుంచాలకి సమానమైన కొలత;
business, n. వ్యాపారం; వ్యాపృతి;
bust, n. (1) బుర్ర నుండి భుజముల వరకు ఉన్న ప్రతిమ; (2) చనుకట్టు; చనుకట్టు చుట్టు కొలత; (3) పోలీసు దాడి;
businessman, n. వ్యాపారస్తుడు; వర్తకుడు; షావుకారు;
bustle, n. హడావిడి; సందడి; ఆర్భాటం; గాభరా; కంగారు; హంగామా;
busy, adj. పని ఒత్తిడితో ఉన్న; తీరిక లేని; ఊటగా ఉన్న;
busy, n. పని ఒత్తిడి; అవిది; ఊట; అతీరిక; నొక్కిడి; నెట్టడి; సమయభావం;
but, conj. అయినా, అయితే; కానీ; తప్ప; కాక;
butane, n. చతుర్ధేను; సంతృప్త ఉదకర్బనాలలో నాలుగు కర్బనపు అణువులు పది ఉదజని అణువులు ఉన్న ఒక రసాయనం; ఈ జాతి రసాయనాలన్నీ ఏను శబ్దంతో అంతం అవుతాయి; C4H10;
butcher, n. కసాయివాఁడు; సూనికుఁడు;
butchery, n. సూనికము; జంతుమాంసాన్ని అమ్మకానికి వీలుగా తరిగి తయారుచేయు విధానం;
butene, n. చతుర్ధీను; జంట బంధాలున్న ఉదకర్బనాలలో నాలుగు కర్బనపు అణువులు ఉన్న ఒక రసాయనం; C4H8;
butt, n. (1) మూలం; అడుగు భాగం; (2) పీక; సిగరెట్టు పీక; (3) మడమ; తుపాకి మడమ; (4) పిర్ర; పిరుదు;
butt, v. t. కుమ్ము; పొడుచు;
butter, n. వెన్న; నవనీతం;
butterfly, n. సీతాకోకచిలుక; చిత్రపతంగం; పింగాణి; Lepidoptera జాతికి చెందిన నిలువు రెక్కల పురుగు; see also moth;
butterfly tree, ph. see orchid tree and/or bauhinia
buttermilk, n. మజ్జిగ; చల్ల; తక్రం; కాలశేయం;
buttocks, n. pl. పిరుదులు; పిర్రలు; నితంబములు;
button, n. బొత్తాం; గుండీ; బొత్తాయి;
button hole, ph. కాజా;
buttonwood, n. [bot.] Conocarpus erectus; Buttonwood Mangrove, a dense multiple-trunked shrub; శంఖు రూపంలో (కోన్ ఆకారంలో) పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్’ చెట్లు రహదారుల వెంబడి ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఆదరించాయి. భారత్, పాకిస్తాన్, అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్, కమ్యునిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తోంది.
butyne, n. చతుర్దైను; త్రిపుట బంధాలున్న ఉదకర్బనాలలో నాలుగు కర్బనపు అణువులు ఉన్న ఒక రసాయనం; C4H6;
buy, v. t. కొను;
buyer, n. కొనుగోలుదారు; క్రీత; క్రేత; (ant.) విక్రేత;
buzz, n. కోలాహలం; కలకలం; బహుజనధ్వని;
buzzard, n. (1) డేగ లాంటి పక్షి; (2) [idiom] ఆశ పోతు; దురాశాపరుడు; మూఢుడు; జడుడు; శుంఠ;
by, prep. వలన; చేత; గుండా; ద్వారా; దగ్గర; వద్ద;
bylaws, n. నియమావళి; ఉపనియమావళి;
byproduct, n. ఉపఫలం; అనుజనితం; ఉపోత్పత్తి; అనుబంధ ఉత్పత్తి; ఉపలబ్ధి;
bystander, n. దారిన పోయే దానయ్య; తటస్థుడు;
byte, n. అష్టకం; వరుసగా వచ్చే ఎనిమిది ద్వియాంశ అంకముల సముదాయం; Eight contiguous bits;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2