విజయనగర చరిత్ర

Wikibooks నుండి

ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం డొమింగో పేస్ మరియు నూనిజ్ రచించిన విజయనగర దర్శనం గురించిన విశేషాలకు ఎల్లంకి భాస్కరనాయుడు గారి స్వేచ్ఛా తెలుగు అనువాదం.

ఉపోద్ఘాతం[మార్చు]

డొమింగో పీస్ మరియు నికొలీ కోంటి అనె ఇద్దరు విదేశీ యాత్రికులు 16 వ శతాబ్దంలో మొదటి భాగంలో విజయనగరాని కొచ్చి ఇక్కడి సామాజిక పరిస్థితులను, రాజ్య పాలనను, ఇక్కడి వింతలు విశేషములను స్వయంగా చూసి గ్రంథస్తం చేసి తమ దేశంలోని తమ రాజుగారికి సమర్పించారు. దాన్ని ఆంగ్లీకరించి ఏషియన్ ఎడుకేషనల్ సర్వీసెస్, న్యూ డిల్లీ వారు ప్రచురించారు అందులోని కొన్ని భాగాలను తెలుగీకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయా గ్రంధాలలోని విషయాలను యధా తదంగా వున్నదున్నట్టు వ్రాయడం జరిగింది. ఇందులో నా స్వంత వివరణ ఎంత మాత్రము లేదు. ప్రతి విషయానికి అసలు గ్రంధంలోని పుట సంఖ్యను కూడ ఇవ్వడం జరిగింది. సరి చూసు కోడానికి అలా పుటల సంఖ్యలను ఇవ్వడం జరిగింది.

                                             {{మాయమైన    మహా నగరం}}   

సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం ఇంచుమించు దక్షిణ భారత దేశమంతా వ్యాపించి సర్వతొ ముఖాభివృద్ది చెందింది విజయనగర సామ్రాజ్యం. కొన్ని శతాబ్దాల పాటు అఖండ వైభోగంతో విలసిల్లింది. ఈ సామ్రాజ్య ఘన చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ సామ్రాజ్యాన్ని అనేక మంది విదేశాల రాయబారులు, యాత్రికులు శతాబ్దాల క్రితమే ఈ విజయ నగరానికి స్వయంగా వచ్చి ఇక్కడి విశేషాలను చూసి వారి అనుభవాలను గ్రందస్తం చేసారు. వారు చెప్పిన ఈ విజయనగర విశేషాలు వారి మాటల్లోనే టూకీగా:---౧)

నికోలో కొంటి యను ఇటలీ దేశస్తుడు 1420 లో విజయ నగరానికొచ్చి లాటిన్ భాషలో ఇలా రాసుకున్నాడు. "విజయ నగరము పర్వతముల సమీపమున కట్ట బడినది. చుట్టుకొలత 20 మైళ్లు. కొండలమద్య పల్లపు ప్రదేశములలో జన నివాసము లుండెను. ఉద్యాన వనములు, ఫల వృక్షములు, పంట కాలవలు మిక్కిలిగా కలవు. అచ్చటచ్చట ప్రసిద్ద దేవాలయములు కలవు."

1.క్రీ.శ. 1443 ఏప్రిల్ మాసంలో అబ్దుల్ రజాక్ తన గ్రంధంలో ఇల వ్రాసు కున్నారు/

ఈ నగరానికొచ్చి తన గ్రంధంలొ ఇలా వ్రాసుకున్నాడు.

"విజయనగరము వంటి మహానగరమును మేమెన్నడు చూసి వుండలేదు. అటువంటి నగరము ప్రపంచమున మరి యొకటి వున్నట్లు కూడా విని యుండ లేదు. ఇది ఏడు ప్రకారముల మహా నగరము. మొదటి మూడు ప్రాకారములలో పంట పొలములు, గృహములు, ఉద్యాన వనములతో నిండి యుండెను. ఇందు బజారులు విశాలముగా వున్నవి. అందు ముత్యములు, కెంపులు, నీలములు, వజ్రములు మొదలగునవి బహిరంగముగా విక్రయించు చుండిరి."

వీరిద్దరు 15 వ శతాబ్దం లొ విజయనగరాన్ని సందర్సించారు. వీరి తర్వాత 16 వ శతాబ్దంలో ఈ మహా నగరం అత్త్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సందర్శించి తన బావాలకు అక్షర రూపమిచ్చిన వారిలో ఒకడు "డొమింగో ఫీస్. ఇతడు 1520 లో శ్రీక్రిష్ణ దేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యాన్ని సందర్సించాడు. ఇతని తర్వాత "నూనిజ్" ఆనే అతడు 1535-- 1537 ప్రాంతంలో ఈ విజయ నగరాన్ని అచ్యుత రాయల కాలంలో ఈ విజయనగరాన్ని సందర్శించాడు. వీరిద్దరు తాము చూసిన విజయనగర విషేషాలను రాసి తమ దేశం లోని రాజులకు పంపించారు. వారు వ్రాసి గ్రందస్తం చేసిన విషయాలను క్లుప్తంగా వారి మాటలోనే తెలుగు రాశాను. ఆ విషేషాలను చదవండి. పాఠకులకు అనుకూలంగా వుంటుందని అసలు ప్రతిలోని పుట సంఖ్యను కూడ సందర్బాను సారంగా ఇచ్చాను.

....................... ఎల్లంకి భాస్కర నాయుడు.

  1. ===డొమింగో పీస్ వివరణ===

"అలా ’మొదటగా డొమింగో’ పీస్ వ్రాసినది.... ఇతడు ఫోర్చ్ గీజు రాజు గారి అనుమతి మేరకు విజయ నగర సామ్రాజ్యానికి వచ్చి, ఇక్కడి విసేషాలను కూలంషంగా వివరించి తమ దేశంలోని రాజుగారికి ఒక నివేదికను రాసి పంపించాడు. ఆ విషయాన్ని యదాతదంగా.... చదవండి. (ఒకటవ భాగం.)

`1. విజయనగర భౌగోళిక పరిస్తితి గురించి. (పుట..237) గోవా నుండి విజయనగరానికి బయలు దేరిన మాకు సముద్రంతీరం వెంబడి విస్తరించిన కొండల వరుసలు కనుపించాయి. ఆ కొండల వరుసలే విజయనగర సామ్రాజ్యానికి సరిహద్దు. ఆ కొండల మద్యలో నుండే ఆ రాజ్యం లోనికి వెళ్లడానికి దారులున్నాయి. లోన కెళ్లగానె పెద్ద బండరాళ్లతో ఆవహించిన దట్టమైన అటవీ ప్రాంతం. ఈతీర ప్రాంతం వెంబడే విజయనగర సాంరాజ్యానికి చెందిన చాల ప్రాంతాలు కలవు. అవి బటేకల్లు, మంగళూరు, బికనీరు మొదలగునవి. వీటిలో కొన్ని రేవు పట్టణాలు. అక్కడ కర్మాగారాలున్నాయి. ఈ కొండల వరుసలు దాటగానె అక్కడక్కడా కొన్ని కొండలు తప్ప మిగతా అంతా సమతల ప్రదేశమే. అది మనదేశం లోని "సాంతారెం" లాగ వున్నది. 'బలెచలా' టౌను నుండి జంబుజ అనే ఊరు వరకు కొన్ని కొండలు, అటవీ ప్రాంతం వున్నది. అయినా ఆదారి సమతలంగానె వున్నది. ఈ రెండు చిన్న పట్టణాల మద్య సుమారు 40 లీగుల దూరం వున్నది. ఈ దారి వెంబడి అనేక వంకలు, వాగులు, సెలయేళ్లు, నీటితోనిండి వున్నాయి. ఆ కారణంగా ఆదారెంబడి ప్రతి సంవత్సరం అనేక ఎడ్లబండ్లు వివిద సరుకులను తీసుకెళ్లుతుంటాయి. ఈ దేశంలో (విజయనగర సామ్రాజ్యం) చిట్టడవు లెక్కువ. మిగిలిన ప్రాంతం రాళ్ళు గుట్టల మయం. కొన్ని ప్రాంతాల్లో బారులు తీరిన వృక్షాలున్నాయి. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో జామ, మామిడి తోటలెక్కువ. మరియు చింత చెట్లెక్కువ. ఇంకో రకమైన మహా వృక్షాలు కూడా వున్నాయి. ఈ వృక్షాలు ఆ దారెంబడి వెళ్ళే వర్తకులకు నీడ నిస్తున్నాయి. ఒక పట్టణ సమీపాన ఇటువంటి మహా వృక్షం క్రింద తమ తమ సామానులతో కొందరు వర్తుకులు సేద తీరుతున్నారు. వీరి 320 గుర్రాలు.. వారి గుర్రపు శాలలో వరుసగా నిలబడినట్లు.. ఆ చెట్టు క్రింద విశ్రమించడం నేను చూశాను. ఇటువంటి మహావృక్షాలు చిన్నవి, పెద్దవి ఈ దేశమంతటా వున్నాయి. (ఇవి మర్రి చెట్లు.) ఈ దేశంలోని భూములు సారవంతమై, వ్యవసాయ యోగ్యమైనవి. ఇక్కడి ప్రజలకు పశు సంపద ఎక్కువ. ఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు, మొదలైన వాటిని ఇళ్ళ మద్యలోను, అడవుల్లోను పెంచుతున్నారు. ఇవి మన పోర్చు గ్రీసు దేశంలో కన్నా ఇక్కడెక్కువ. ఇక్కడ భూములలో వరి ఎక్కువగా పండిస్తున్నారు మరియు మనదేశంలో లేని జొన్న, బీన్సు, ప్రత్తి వంటివి కూడా పండుతున్నాయి. దాన్యాన్ని ప్రజల అవస రాలకే గాక గుర్రాలకు, కూడా పెడుతున్నారు. ఎందుకంటే మనదేశం లో లాగ ఇక్కడ బార్లీ దాన్యం లేదు. ఇక్కడ గోదుమ పంట కూడా ఎక్కువే. ఈ దేశంలోని పల్లెల్లో పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడి రాజు తమ పల్లె వాసులను వారి ఇళ్ళ చుట్టు మట్టితో మాత్రమే గోడ కట్టు కొనుటకు అనుమతిస్తాడు. ఏందుకంటే వారు తన కంటే బలవంతు లౌతారని భయం. కానీ దేశ సరిహద్దు సమీపాన గల పట్టణ వాసులకు మాత్రం తమ ఇళ్ళ చుట్టు రాతి గోడలను కట్టుకొనుటకు రాజు అనుమతిస్తాడు. కాని పల్లె వాసులకు ఆ అవకాశం లేదు.

(పుట 238) మన ఫొర్చుగీసు దేశం కన్నా ఈ దేశం చదునుగా నున్నందున గాలి వేగం ఎక్కువ. ఇక్కడి ప్రజలు తాము పండించిన నూనె గింజల నుండి తామె తయారు చేసుకున్న యంత్రాల తోనె నూనెను తీస్తారు. (ఇవి నూనె గానుగలు) ఈ దేశంలో నీటి కొరత వుంది. ఎందుకంటే.. విశాలమైన దేశంలో... నదులు తక్కువ. అందుచేత ఇక్కడి ప్రజలు చెరువులను త్రవ్వి వర్షాకాలంలొ వచ్చే వాన నీటితో వాటిని నింపి తమ అవసరాలకు వాడు కుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి వూటలపై ఆదార పడి వున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో భూములు పూర్తిగా మెట్ట భూములు. వీరు ఇటువంటి భూములలో పంటలు పండించ డానికి వర్షాలపైనే ఆదార పడి వున్నారు. కొంత మంది ప్రజలు తమ పొలాలలొ గోతులు త్రవ్వి అందులో లబించిన నీటితో తమ అవసరాలను తీర్చు కుంటున్నారు.(ఇవి దిగుడు బావులు.) వీరికి వర్షాబావ మెందుకంటే. మన దేశంలో లాగా వీరికి చలి కాలంలేదు. కాని ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తుపాను లొస్తుంటాయి. ఇక్కడి చెరువుల్లో నీరు మురుకిగా వుంటాయి. ఎందుకంటే దుమ్ము దూళి తో కూడిన బలమైన గాలులు నీటిని శుబ్రంగా వుండనీయవు.. అంతేగాక వీరి పశువులు, గొర్రెలు, బర్రెలు వంటి ఇతర జంతువులు కూడా ఈ నీటినే తాగుతుంటాయి.

ముఖ్యమైన విషయ మేమంటే.. ఈ దేశ వాసులు ఆవులను, ఎద్దులను చంపరు. ఎద్దులు వీరి సామనులను మోస్తాయి. (ఎద్దుల బండి గురించి ) అంతేగాక వీరు ఎద్దులను, ఆవులను పూజిస్తారు. దేవాలయాల్లో వీటి శిలా విగ్రహాలు కూడా వున్నాయి. (దేవాలయాల్లో వున్న నంది విగ్రహాల గురించి) వీరు కొన్ని ఎద్దులను దేవాలయాలకు అంకితమిస్తారు. అటువంటి ఎద్దులు ఎక్కడ తిరిగిన ఎవరూ వీటికి ఎటువంటి హాని చేయరు. (గతంలో ప్రతి వూరికి ఒక ”దేవరెద్దు వుండేది”. ఎవరూ దానికి ఎటువంటి హాని చేయక పోగా అది ఎవరింటి కొచ్చినా దానికి మంచి ఆహారమిచ్చి బొట్టుపెట్టి నమస్కరిస్తారు. ఇది ఆచారం) ఈ దేశంలో గాడిదలు కూడా వున్నాయి కాని వీటిని చిన్న చిన్న పనులకే వుపయోగిస్తారు. ముఖ్యంగా వుతికే బట్టలను తీసు కెళ్ళడానికి గాడిదలను ఉపయోగిస్తారు.

ఈ విజయనగర సామ్రాజ్యానికి 300 క్రోసుల సముద్రతీర ప్రాంతమున్నది. పాల ఘాట్ నుండి చోళ మండలం వరకు ఇదంతా ఈ రాజ్యము లోని భాగమె. దీని వెడల్పు 164 క్రోసులుంటుంది. ఆ విధంగా ఈ రాజ్యం తూర్పున ఒరియా వరకూ ఉత్తరాన దక్కన్ వరకూ వ్వాపించి వున్నది. ఇదిమన రాజ్యానికి కన్న పెద్దది. ఇక్కడి ప్రజలు రంగు తక్కువైనా శారీరిక దారుడ్యం కలవారు. వీరి రాజుకు అత్యంత ధన సంపద వున్నది. సైనిక భలం కూడ ఎక్కువె. వీరి రాజు కంటే భలవంతుడు వేరొకడు లేరని అంటారు. కాని ఈ రాజుకు మన దేవునిపై నమ్మకంలేదు.

పుట.240...విజయనగర సామ్రాజ్యం లోని నగరాలు, పట్టణాలు, పల్లెలు గురించి వివరించాలంటే చాలా అవుతుంది "దార్వార్" అనే నగరాన్ని గురించి మాత్రం వివరిస్తాను.

==2.ధర్వార్ నగరం గురించి== (ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలో వున్నది)

దార్వార్ నగరంలో అతి ఆరుదైన, అతి ముఖ్యమైన కట్టడం ఒకటుంది. ఈ నగరం చుట్టూ కోట వున్నా..... అది నేను పైన చెప్పిన కారణాల వల్ల రాతి కట్టడం కాదు. దీనికి పచ్చిమ దిశగా అందమైన నది వుండగా మిగతా దిక్కులందు మైదాన మున్నందున కోట గోడ ..దానికి అగడ్త వున్నాయి. ఈ నగరంలో వున్న ఆ అందమైన కట్టడం ఒక దేవాలయం. ఇది చాల అందమైనది. ఇటువంటిది ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు లేదు. ఇది ఏక శిలతో నిర్మితమై, వృత్తాకారం కలిగి అత్యంత కళాత్మక మైన శిల్ప కళ కలిగి వుంది. అందు లోని శిల్పాలు రాయి నుండి ఒక మూర ముందుకు వున్నందున ఆ ప్రతిమను అన్ని వైపుల నుండి చూడగలము. అవి ఎంత అందంగా వున్నాయంటే.... వాటిని అంతకంటే అందంగా చెక్కలేరు. రాతి స్థంబాలతో నిర్మితమైన ద్వారంలో దాని(పుట..241) పైనున్న శిల్ప కళను బట్టి ఇది ఇటలీలొ తయారయిన దేమోననిపిస్తుంది. దీనికున్న అడ్డ పట్టీలు, దూలాలు, అన్ని శిలా నిర్మితాలే. పలకలు గాని కర్రలు గానీ వాడలేదు. ఆవిదంగా లోపల గాని బయటగాని, అదే శిలలతో నిర్మితమైనది. ఈ కట్టడం మొత్తం బలిష్ట మైన ప్రహరీ గోడచే పరివేష్టింప బడియున్నది. ఇది పూర్తిగా రాతి మయం. ఈ దేవాలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి చాల పెద్దవే గాక చాల అందంగా కూడా వున్నాయి. తూర్పు వైపున నున్న ద్వారానికి చిన్న వరండాలు వంటివి వున్నాయి. అందులో "జోగినులు" కూర్చొని వున్నారు. ఈ ఆవరణం లో ఎర్రటి చిన్న దేవాలయా లున్నాయి. అందులో ఓడ స్తంబం లాంటి రాతి స్తంబం వుంది. అది మొదట నాలుగు పలకలుగా వుండి తర్వాత ఎనిమిది పలకలుగా అకాశం వైపు నిలబడి వుంది. ఇలాంటి దాన్ని నేను ఇటలీలోని రోమ్ లో చూసి వున్నందున ఇది నాకు అంత ఆచ్చ్యర్యాన్ని కలిగించ లేదు.(ఇది ద్వజ స్థంబం .) ఈ దేవాలయాల్లో వున్న విగ్రహాలు కొన్ని ఆడ, మగ రూపంలో వుండగా ఇంకొన్ని ఎద్దు రూపంలోను,. కోతి రూపంలోను వున్నాయి. మరి కొన్నింటిలొ ఒక గుండ్రటి రాయి మాత్రమే వుంటుంది. వీటినే ఈ ప్రజలు పూజిస్తారు.(ఇక్కడ చెప్పిన విగ్రహాలు... దేవతా మూర్తులు, ఎద్దు రూపం లోనిది.......నందీశ్వరుడు, కోతి రూపం లోనిది .......ఆంజనేయ స్వామి, గుండ్రటి రాయి....... శివ లింగం.)

ఈ దర్వార్ నగరంలో వున్న దేవాలాయం లోని విగ్రహం... శరీరం అంతా మాన వాకారం లో వుండి ముఖం మాత్రం ఏనుగు ముఖం కలిగి వున్నది. దంతాలు కూడా వున్నాయి. (ఈ విగ్రహం వినాయకుడిదే) ఈ విగ్రహానికి చేతులు మాత్రం మూడు + మూడు = ఆరు చేతులున్నాయి. ఇక్కడి ప్రజలు చెప్పేదాన్ని బట్టి ఆరు చేతులున్న ఈ విగ్రహానికి ఇప్పటికే నాలుగు చేతులు పడి పోయాయట. ఇక మిగిలిన చేతులు పడిపోతే అప్పుడు ఈ ప్రపంచం అంతా మునిగి పోతుందట. దీన్ని దైవ నిర్ణయంగా బావించి దీనిపై వీరందరికి మంచి నమ్మకం. వీరు ఈ విగ్రహానికి ప్రతి రోజు ఆహారం పెట్టి , అది తిటుందని నమ్మతారు. భోజన సమయంలో ఈ దేవాలయానికి సంబందించిన స్త్రీలు నాట్యం ఆడతారు. ఈ స్త్రీలకు జన్మించిన ఆడపిల్ల లందరూ ఈ దేవాలయానికే చెందుతారు. వీరందరూ గుణ హీనులు. కానీ వీరు గౌరవ ప్రదమైన వీదుల లోనే మంచి గృహాలలోనే నివసిస్తారు. వీరికి సంఘంలో మంచి గౌరవం వుంది. వీరిలో కొందరు సేనా నాయకుల భార్యలు కూడా వున్నారు. అదే విదంగా గౌరవ ప్రద వ్యక్తులు కూడా నిస్సంకోశంగా ఈ స్త్రీల ఇంటికి వెళ్ళి వస్తారు. రాజు తన రాణుల తో వున్న సమయంలో కూడా తమలపాకులు నమలుతూ ఈ స్త్రీలు వెళ్ళి రావడానికి అనుమతి వుంది. ఇటు వంటి అవకాశం సంఘంలో ఎంతటి పరపతి వున్న వ్యక్తి కైనా వీలు కాదు.

==౩. విజయనగర కోటలు ప్రాకారాల వివరణ.== (పుట..242)

ధార్వార్ నగరం నుండి విజయనగరం 15 లీగుల దూరంలో వుంది. అదే ఈ దేశపు రాజదాని. రాజైన శ్రీక్రిష్ణ దేవ రాయులు ఈ నగరం లోనే నివసిస్తాడు. విజయనగరం ఇంకా రెండు లీగుల దూరం వుందనగా, ఎత్తైన కొండ చరియల మద్య నుండి విజయ నగరానికి ప్రవేశ ద్వారం వుంది. ఇటువంటి ప్రవేశ ద్వారాల ద్వారా మాత్రమే ఈ నగరం లో ప్రవేశించ గలము. వేరు మార్గం లేదు. ఇటువంటి పర్వత శ్రేణులు నగరం చుట్టు 24 లీగుల పర్యంతం వుండగా, దీనిలోపల వృత్తకారంలో మరి కొన్ని పర్వత శ్రేణులున్నాయి. ఈ పర్వత శ్రేణుల వరుస ఎక్కడైనా లేనిచో అక్కడ బలమైన గోడతో పూరించి నందున అంతా కొండలతోనే చుట్టబడి వున్నట్లు కనిపిస్తుంది. ప్రవేశ ద్వారాలు తప్ప మిగాతా అంతా ఈ విదంగానే వుంటుంది. ఇటువంటి ప్రవేశ ద్వారాలను కొంత మంది కాపలా కాస్తుంటారు. ఇటువంటి రక్షణ వ్యవస్త అన్ని ప్రాకారాలకు వుంది. ఇటువంటి పర్వత శ్రేణుల ప్రాకారాల మద్య లోయలలో, మైదానాలలో వరి, మామిడి తోటలున్నాయి. ఈ కొండల మద్యలలో చెరువులుండి నీటి పారుదల కుపయోగ పడుతున్నాయి. ఈ కొడలలో ఎటువంటి చెట్లు గాని పచ్చదనం గాని లేదు. తెల్లటి పెద్ద బండ రాళ్ళు ఒక దాని పై ఒకటి, ఏ ఆదారారం లేకుండా ఆకాశంలో అలా నిలబడి యున్నాయా అని అనిపిస్తున్నాయి. ఇటువంటి కొండల మద్యలోనే విజయనగరం వుంది.

విఠలాలయం ప్రక్కన ఏకశిలారథం

(పుట..244)మొదటి ప్రాకారాని కున్న పశ్చిమ ద్వారం ప్రదానమైనది. గోవా నుండి వచ్చే వారికి ఇదే ప్రవేశ ద్వారం. ఈ ద్వారం వద్ద ఈ దేశపు రాజు బలిస్ష్ట మైన గోడలతో, ఎతైన గోపురాలతో, చక్కటి వీదులతో ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు. ఈనగరంలో అనేక మంది వ్యాపారస్తులు, గొప్ప వ్యక్తులు నివసించడానికి రాజు ప్రోత్సహించాడు. అందు చేత ఈ నగరంలో జనసంఖ్య చాల ఎక్కువగా వుంది. (పుట. 245) నీటి అవసరాలకు ఈ దేశపు రాజు అతి పెద్ద చెరువును త్రవ్వు చున్నప్పుడు నేను చూసాను. సుమారు 15--20 వేల మంది పనిలో నిమగ్నమై వున్నారు. వీరు చీమల్లాగా కనిపిస్తు వున్నారు. వారి కింద వున్న భూమి కనిపించ నంతగా వున్నారు. కూలీలను మూడు విభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కో సేనాపతికి అప్ప జెప్పి పని పూర్తి చేయించాడు రాజు. ఈ చెరువు రెండు మూడు సార్లు తెగిపోయింది. రాజు తన పురోహితులను పిలిపించి దీనికి కారణం కనుక్కోమన్నాడు. దానికి ఆ బ్రాంహణులు ఆలయం లోని మూల విగ్రహం స్తాన బ్రంశమైందని దేవుడు బలి కోరుచున్నాడని అందుకు, మనుషులను, దున్న పోతులను, గుర్రాలను దేవునికి బలి ఇవ్వాలని సలహా ఇచ్చారు. రాజుగారి అనుమతి మేరకు ఆలయం ముందు 60 మంది మనుషులను మరణ శిక్షకు సిద్దంగా వున్న ఖైదీలను, కొన్ని గుర్రాలను, అలాగే దున్న పోతులను బలి ఇచ్చారు.

(పుట 245) ఈ బ్రాంహణులు తమకు తాము అతి పవిత్రులమని భావిస్తారు. ఈ రాజ్యంలో ఇతర బ్రాంహణులున్నా వారు రాజు వద్ద, వివిద హోదాలలో అధికారులు గాను కొందరు వ్యాపారస్తులు గాను, ఇంకొందరు వ్యవసాయ దారులు గాను జీవిస్తున్నారు. ఈ పౌరోహిత్యం వహిస్తున్న వారు మాత్రం తమకు తాము అత్త్యున్నతులుగా భావిస్తారు. వీరు మాంసం, చేపలు వంటి మాంసాహారము తినరు. ఈ దేశంలో బ్రాంహణులు మని చెప్పుకునే వారు చాల మంది వున్నారు. కాని వారి జీవన విధానం కొంత ప్రత్యేకంగావుంటుంది. కాని వారు రాజునుండి ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతున్నారు.

==4.శ్రీ క్రిష్ణ దేవరాయలు తన భార్య పేరన కొత్తగా నిర్మించిన నగరం నాగలాపురం గురించి== (పుట246)

కొత్తగా నిర్మించిన ఈ నగరానికి రాజు తన భార్య మీదున్న ప్రేమకు చిహ్నంగా ఆమె పేరు పెట్టాడు. ఈ నగరంలో రాజు ఒక అందమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఈదేవాలయంలో అనేకమైన విగ్రహాలున్నాయి. ఆలయంలో వారి పద్దతి ప్రకారం నిర్మించుకున్న బావులున్నాయి. ఈ నగరంలోని ఇళ్ళు ఒకే అంతస్తు కలిగి వున్నాయి. మనదేశంలో లాగ అంతస్తులు కలిగి లేవు. పై కప్పు చదునుగా మన ప్రాంతంలో వున్నవాటికన్నా భిన్నంగా వున్నాయి. ఆ భవనాలకు స్థంబాలతో వరండాలున్నాయి. చూడ్డానికి రాజ భవనాల లాగ వున్నాయి. రాజు నివసించే అంత:పురం చుట్టు ప్రహరి గోడవుండి లోపల ఆనేక వరుసల ఇళ్ళు వున్నాయి. ఈ అంత:పురానికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి ప్రవేశ ద్వారము విశాల ఆవరణము తో వరండాలతో, అవరండాలలో రాజుగారి పిలుపు కోసం నిరీక్షించే ప్రముఖులతో నిండి వున్నది. ద్వారాల ముందు అనేక మంది కాపలా దారులున్నారు. (కొత్తగా రాజు నిర్మించిన ఈ నగరాని నాగాలపురమని పేరు. ప్రస్తుతము దాని పేరు హోస్పేట..పైన చెప్పిన అందమైన ఆలయం.... ప్రస్తుతమున్న. అనంత శయన ఆలయం. ఈ ఒక్క ఆలయమే కనబడుతున్నది. మిగతా భవనాలు గాని, రాజాంత:పురంగాని కనీసం వాటి పునాదులు కూడ ఇక్కడ కనబడవు. )

(పుట..247) 5. శ్రీక్రిష్ణదేవరాయలు ఎలా వున్నాడు ?[మార్చు]

రాజు సాధారణ ఎత్తు కలిగి అంత సన్నగాను కాక లావు గాను కాక మద్యస్తంగా వున్నాడు. ఇతను ఇతర దేశస్తులను చాల మర్యాదగా గౌరవిస్తాడు. ఇతను ధర్మ బద్దుడైన గొప్ప పాలకుడు. ఇతనికి రారాజని, చక్రవర్తి అని, లార్డ్ ఆఫ్ సెవెన్ సీస్ అండ్ ల్యాండ్ అని. బిరుదులు గలవు. అతనికున్న రాజ్య విస్తరణాన్ని బట్టి, అతనికున్న సైనిక భలగాన్ని బట్టి అతన్ని మహా వీరుడని అంటారు. అతనికున్న శక్తి సామర్ద్యాలను బట్టి ఇతను ఒరియా రాజుతో సదా యుద్దాలు చేసే వాడు. ఆ రాజ్యంలోని చాల నగరాలను వశపరుచు కున్నాడు. ఆ దేశపు రాజ కుమారులను బందీగా పట్టుకొని విజయనగరంలో చాల కాలం బందీగా వుంచగా అక్కడే అతను మరణించాడు. ఆతర్వాత సంధి ఒడంబిడకలో ఒరియా రాజు తన కుమార్తెను రాజుగారికిచ్చి వివాహం చేశాడు. ఇతని పేరు "శ్రీ క్రిష్ణ దేవరాయలు "ఇతనికి పన్నెండు మంది భార్యలున్నా వారిలో ముగ్గురే మహారాణులు. ఈ మహారాణుల కొడుకులకే రాజ్యాధికారం వుంటుంది. మిగతా భార్యలలో ఎవరికైనా ఒకే కొడుకున్నచో అతనిక్కూడ రాజ్యాధి కారం వుంటుంది. ఈ మహా రాణులలో ఒకరు ఒరియా రాజ కుమార్తె, ఇంకొకరు శ్రీరంగ పట్నం రాజ కుమార్తె. మూడో మహారాణి, రాజు తన యుక్త వయస్సులో ప్రేమించిన అమ్మాయి. శ్రీ క్రిష్ణ దేవరాయలు తాను రాజైనప్పుడు ఈమెను పెళ్ళాడి మహారాణిని చేస్తానని మాట ఇచ్చి నందున ఆమె కోరికను నెరవేర్చాడు. ఆమెమీదున్న ప్రేమకు చిహ్నంగా రాజుగారు కొత్త నగరాన్ని నిర్మించాడు.

(పుట..248) రాజుగారి భార్యలు అందరికి ప్రత్యేకంగా భవనములు, స్త్రీజన పరివారము, సేవకులు (స్త్రీలె) వారికి కావలసిన ఆవాసములు అన్ని వున్నాయి. పురుషు లెవ్వరు అందు ప్రవేశించరు. వీరు కూడ బయటకు వెళ్ళరు. తప్పని సరియై వెళ్ళ వలసి వస్తే మూసి వున్న పల్లకిలో వెళ్తారు. ప్రజలు కూడ వీరికి దూరంగా వుంటారు., చాల మంది నపుంసకులు వీరికి రక్షణ గా వుంటారు.

నేను విన్నదాని ప్రకారం ఈ అంత:పుర స్త్రీలు అత్యంత ధన వంతులు. వీరి వద్ద ధనమే కాకుండ. బంగారు ఆబరణాలు, వజ్రాలు, ముత్యాలు వంటి జాతి రత్న సంపద అధిక మొత్తం లో వున్నది. ఒక వుత్సవ సందర్బంలో వారి అబరణాల అలంకారం చూసి నిస్చేష్టుడ నయ్యాను. ఆ సందర్బాన్ని తర్వాత వివరిస్తాను. ఈ స్త్రీజన పరివారంలో పన్నెండొందల మంది వున్నారని విన్నాను. వీరిలో కత్తి డాలు పట్టగలిగిన వీర వనితలు, కుస్తీ పట్టగల వారూ, పాడగలవారు, నాట్య గత్తెలూ ఉన్నారు. వీరు వాడె సంగీత వాద్య పరికరాలు మనదేశంలో వాడె వాటికన్నా భిన్నంగా వున్నాయి. ఈ ముగ్గురు మహారాణులుకు ఒకె విదంగా వుండే భవనాలు విడి విడిగా వున్నాయి. వీరు తమ మద్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా స్నేహ శీలురుగా మెలుగుచున్నారు. ఈముగ్గురు రాణులు, వారి పరిచారికలు వారి రక్షక భటులు, కాపలా దారులు, ఇతర పనివారు వీరందరు నివసించ డానికి భవనాలు, ఇతర నివాసాలు, ఎన్ని వుండాలి, ఎన్ని వీదులలో అవి వుండాలో వూహించుకోవలసినదే.

(పుట..249)రాజు మాత్రం తన అంత:పురంలో నివసిస్తుంటాడు. ఏ రాణితో నైనా కలవాలనుకుంటే ఒక నపుంసకున్ని పంపుతాడు. ఇతను కూడ రాణి అంత:పురం లోనికి ప్రవేశించ కూడదు. అక్కడున్న స్త్రీ పరిచారికకు విషయం చెఫ్తాడు. అప్పుడా రాణి గారి పరిచారిక బయటకు వస్తుంది. విషయం తెలుసుకుని రాణి గారికి తెలియజేస్తుంది. అప్పుడు రాణి, రాజు చెప్పిన చోటుకు వెల్లడమో లేక తన వద్దకు రాజుని రప్పించు కోవడమో చేస్తుంది. ఈ వ్యవహారం ఇంకొక రాణికి తెలియదు. ఇదంతా ఈ నపుంసకుల ద్వారా జరుగుతుంది. ఈ నపుంసకులు రాజు గారికి అత్యంత విశ్వాస పాత్రులై వుంటారు., వీరి జీత బత్యములు కూడా ఎక్కువ గానే వుంటాయి.

6.ప్రభాత కాలాన రాజుగారి దిన చర్య...[మార్చు]

(పుట..౨౪౯) ప్రతి రోజు సూర్వోదయానికి ముందే రాజు నిద్ర లేచి ఒక చిన్న గ్లాసుడు మంచి నూనె తాగి, నడుంకు మాత్రం ఒక చిన్న గుడ్డను కట్టుకొని, శరీరమంతా నువ్వుల నూనెను మర్దనా చేయించుకొని రెండు చేతులతో మట్టితో చేసిన బరువులను ఎత్తుతాడు. ఆ తర్వాత కత్తి తీసుకుని చెమట పట్టునంత వరకు వ్యాయామం చేస్తాడు. అప్పటికి మర్దానా చేసిన నూనె అంతా చెమటతో బయటకు వస్తుంది. ఆ తర్వాత తన కుస్తీ వీరులలోని ఒకనితో కుస్తీ పట్టుతాడు. ఈ శ్రమ అయిన తర్వాత తన గుర్రమెక్కి మైదానంలో అటు ఇటు స్వారి చేస్తాడు. ఈ కార్య క్రమమంతా సూర్యో దాయనికి ముందే పూర్తవు తుంది. అప్పుడు ఒక బ్రాంహణుడు వచ్చి మంత్రోత్సారణ తో రాజు గారికి స్నానం చేయిస్తాడు. తర్వాత తన అంత:పురంలో నున్న ఒక ఆలయం లోనికి వెళ్ళి ప్రార్దన ఇతర పూజ కార్య క్రమాలు పద్దతి ప్రకారం చేస్తాడు. రాజు గారికి స్నానం చేయించే బ్రాంహణుడు చాలా ధన వంతుడు, ఇతనికి జీతం కూడా ఎక్కువే. ఇతన్ని రాజుగారు చాల పవిత్రునిగా జూస్తాడు. అక్కడనుండి రాజు గారు ఇంకొక భవనం లోనికి వెళ్ళతాడు. ఆ భవనం... గోడలు లేకుండా అనేక స్తంబాలతో వున్నది. ఆ స్తంబాలకొక అందమైన, గుడ్డ పైనుంచి క్రింది వరకు చుట్టబడివుంది. దాని పై అందమైన చిత్రములు అద్దబడి వున్నాయి. రెండు స్త్రీ చిత్రములు అందంగా తీర్చ బడి వున్నాయి. ఈ భవనంలో పరిపాలన సంబందమైన అధికారులుంటారు. రాజు గారికి అత్యంత ప్రముఖుడైన "తిమ్మరుస" అనే వృద్దుడు వుంటాడు. ఇతను అంత:పురంలోని అందరిని శాసించ గల్గి వుంటాడు. పరిపాలనా సంబందమైన విషయాలు మాట్లాడిన తర్వాత, ఆ ప్రముఖులు శలవు తీసు కుంటారు. అప్పటి వరకు రాజు గారిదర్శనార్థం బయట వేసివున్న సామంతులు, సేనా నాయకులు, ఇతర ప్రముఖులు ప్రవేసిస్తారు. వారు రాజుగార్కి నమస్కరించి గోడ వెంబడి నిలబడతారు. వారు తమ చేతులను జేబులో పెట్టుకుని నేల చూపులు చూస్తూ మౌనంగా రాజు గారికి దూరంగా వుంటారు. వారెవరూ తమలపాకులు నములుతూ వుండరు. రాజుగారు వారిలో ఎవరితో నైనా మాట్లాడా లనుకుంటే తన బటుడు అతనికి తెలియ జేస్తాడు. అపుడా వ్యక్తి తల పైకెత్తి అడిగిన దానికి సమాదానం చెప్పి తిరిగి తన యదా స్తితికి వస్తాడు. రాజు గారు వారందరికి శలవిప్పించు నంతవరకు వారు అలాగే వుంటారు. ఆ తర్వాత వారు రాజు గార్కి నమస్కరించి నిష్క్రమిస్తారు. ఈ నమస్కార విదానం ప్రత్యేకంగా వుంటుంది. రెండు చేతులు పైకెత్తి రెండు అరచేతులు కలుపుతారు వీరందరు ప్రతిరోజు ఈ నమస్కార కార్యక్రమం ఉదయం చేస్తారు.

==(పుట.251) 7. శ్రీ క్రిష్ణ దేవారాయలు వారి మన్నన మర్యాద గురించి==.

మేము ఈ రాజ్యానికి వచ్చినప్పుడు రాజు గారు తన కొత్త నగరంలో వున్నారు. మేము మాతో కూడా వున్నా వారందరం మానాయకునితో కలిసి రాజు గారి దర్శనార్దం అక్కడికి వెళ్ళాం. మేమంతా మా పద్దతి ప్రకారం చాల ఆడంబరంగా దుస్తులు దరించి వెళ్ళాము. రాజు గారు మమ్ములను చాల మర్యాద పూర్వాకంగా ఆహ్వానించారు. మాపై అతను చాల దయ, కరుణ చూపించారు. ముఖ్యంగా మానాయకుడిని రాజు గారు చాల గౌరవంగా తన స్వంత మనిషిలాగ చూశారు. మానాయకుడు మీరిచ్చిన లేఖను, ఇతర బహుమతులను రాజుగారికిచ్చాడు. మేము రాజు గారికి చాల దగ్గరగా వున్నాము.

(పుట...252) రాజు గారు దవళ వస్త్రాలలో వున్నారు. ఆ వస్త్రాలు బంగారు దారంతో గులాబి పూలు ఎంబ్రాడిరి చేసి వున్నాయి. మెడలో వజ్రాల హారం అత్యంత విలువైనది ఉంది. తలమీద పట్టు బట్టతొ చేసిన, బంగారు జరీ పట్టితో వున్న కిరీటం వుంది. కాళ్ళకు చెప్పులు లేవు. రాజుగారి కాళ్ళకు చెప్పులు వుంటే ఎవరూ లోపలికి రారు. ఈ దేశంలో చాల వరకు ప్రజలు కూడ చెప్పులు దరించరు. రాజు గారు దరించే చెప్పులు రెండు రకాలు. ఒకటి... ముందు మొనదేలి వుంటాయి. రెండో రకం .. దీని పాద బాగం తప్ప ఇంకేమి ఉండదు. ముందు భాగంలో ఒక చిన్న బుడిపి లాంటిది వుండి వేళ్ళ ఆదారంతో అది కాలికి వుంటుంది. ఇవి రోమనులు కొందరు వాడే వారని తెలుస్తున్నది. రాజు గారు మా అందరికీ ఒక్కొక్క నూతన వస్త్రాన్ని ఇచ్చారు. దాని మీద అందమైన బొమ్మలు కుట్టివున్నాయి. ఇది ఇక్కడి అచారమట. స్నేహానికి గుర్తుగా ఇస్తారట. రాజుగారి అనుమతి ప్రకారం మమ్ములను ఒక అందమైన భవనంలో విడిది ఏర్పాటు చేయించారు. అక్కడ మా నాయకుడు చాల మంది సేనాధిపతులను, ఇతర పుర ప్రముఖులను కలిశారు. అంతే గాక రాజు గారు మానాయకునికి కొన్ని కోళ్లను, పొట్టేళ్లను కొన్ని పాత్రల నిండా పెరుగు, తేనె, నెయ్యి మొదలగు వాటిని తినటానికి పంపించారు. కాని మా నాయకుడు వాటిని అక్కడున్న సైనికులకు ఆ వస్తువులను తెచ్చిన వారికి పంచి పెట్టారు. ఇంకా రాజుగారు మీ క్షేమ సమాచాలను విచారించారు. మీగురించి మానాయకుడు చెప్పిన మాటలను విన్న రాజు గారు చాల సంతోషించారు.

(పుట 252)మేము శలవు తీసుకొని విజయనగరాని కొచ్చాం. ఈ రెండు నగరాల మద్య దూరం ఒక లీగ్ వుంటుంది.ఈ దారంతా ఇటువంటి వరుస ఇండ్లతొ విశాలంగా వుంది. అంగళ్ళ లో అన్ని రకాల వస్తువులు అమ్ము చున్నారు. ఈ దారెంబడి రాజుగారి అనుమతితో చెట్లునాటించ బడ్డాయి. ఇవి అటు వచ్చి పోయే వ్యాపారస్తులకు నీడ నిస్తున్నాయి. ఈ దారి లోనె రాజు గారు రాతి తో అందంగా నిర్మింప జేసిన పెద్ద ఆలయం వుంది. (ఇది ప్రస్తుతం వున్న అనంతశయన ఆలయము.) విజయనగరానికి ముందు ఒక కోట ద్వారం వుంది. ఈ కోట గోడ ఈ నగరం చుట్టు వ్వాపించి వున్నది. ఈ గోడ మిక్కిలి బలిష్టంగానె కాక మంచి శిల్ప కళను కూడ కలిగి వున్నది. ప్రస్తుతం ఇది అక్కడక్కడ కొంత శిధిలమై వున్నది. ఇదే విజయనగరంలోనికి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం. అదె విదంగా ఇక్కడ ఇతర ప్రముఖులు నిర్మించిన ఆనేక దేవాలయాలు వున్నాయి.

(పుట..253) 8. విజయనగర కోటల, భవనాల గురించి వర్ణన[మార్చు]

దసరా దిబ్బ ముందునుండి.

గోడలపై బురుజు లున్నాయి. మైదాన ప్రాంతంలో నున్న ప్రహరి గోడకు నీటితో నిండిన అగడ్త వుంది. అంతేగాక గోడ వెంబడి సమాన దూరంలో మొన దేలిన ఎత్తైన రాతి బండలు సమాన దూరంలో పాతిపెట్ట బడి వున్నాయి. పల్లపు ప్రాంతంలో ప్రహరి గోడ కొండ బాగం వరకు వుంది. ఈ మొదటి ప్రకారం దాటగానె చాల దూరం వరకు వ్యవసాయ భూములు, వరి పంటలు, పండ్ల తోటలున్నాయి. సంవృద్దిగా నీరున్నది. ఈ నీరు చెరువుల నుండి మొదటి ప్రాకారం ద్వారా వస్తుంది.

(పుట...258) తర్వాత ఇంకో ప్రహరి గోడ వస్తుంది. ఇది కూడా రాతి కట్టడంతో బలిష్టంగా వుంది. ఈ ప్రవేశ ద్వారానికి రెండు బురుజులున్నాయి. ఇది బలంగాను అందంగాను వున్నాయి. లోపలికి ప్రవేశించగానే రెండు ఆలయాలున్నాయి. ఒకటి చుట్టూ గోడ-- లోపల చెట్లుండగా, రెండో దానిలో భవనా లున్నాయి. ఇంకొచెం ముందు కెళితే ఇంకో ప్రవేశ ద్వారం., ఇంకో ప్రహరి గోడ వస్తుంది. ఈ ప్రకారం, మొదటి ప్రకారం లోపలున్న నగరం చుట్టూ వున్నది.ఈ ప్రకారంలోనే రాజాంత:పురం, ఇతర సేనా నాయకుల నివాసాలు, వున్నాయి. ఈ ఇళ్ళు వరుసలుగా వుండి, ముఖ్య వీది అందంగా శిల్ప కళతో మనోహరంగా వుంది. ఈ ఇళ్ళవరసలు దాటిన తర్వాత ఒక విశాలమైన మైదానం వస్తుంది. అందులో అనేక బండ్లు, వాటిలో అనేకరకాల సామానులు వున్నాయి. ఇది రాజాంత:పురానికి ఎదురుగా వుంది. ఈ మైదానం నగరానికి మద్యలో వున్నది. రాజు గారి ప్యాలెస్ బలిస్టమైన ప్రహారి గోడ గలిగి, ఫొర్చగీసు లోని కోటల కన్నా లోపల విశాల ప్రదేశమున్నది. దీన్ని దాటి ఇంకొంచెం ముందుకెళితే అక్కడ రెండు దేవాలయా లున్నాయి. అందులో ఒక దేవాలయం ముందు ప్రతిరోజు ఆనేక గొర్రెలను బలి ఇస్తారు. ఇక్కడ తప్ప ఈ నగరంలో ఇంకెక్కడా గొర్రెలను గాని, మేకలను గాని చంపరు. వీటి రక్తంతో ఆ గుడిలోని దేవునికి ఆభిషేకం చేస్తారు. ఈ జంతువుల తలలను పూజారికి వదిలేస్తారు. [[Image:Vitthala temple DK.jpg|250px|thumb|right|హంపీలోని విఠలాలయం (పుట 255) ఆ పూజారికి ఒక్కో తలకు ఒక నాణెం కూడా ఇస్తారు.(సాకో) ప్రతి జంతువుని బలి ఇచ్చింతర్వాత పూజారి తన బూరను (జొగి) వూదుతాడు దానర్థం దేవుడు ఈ బలిని స్వీకరించాడని.. ఈ పూజారులను గురించి తర్వాత చెప్తాను. (రచయిత వీరిని గురించి తర్వాత చెప్తానన్నాడు గాని ఆ విషయం మరిచాడు) ఈ ఆలయానికి దగ్గర్లోనె అందంగా అనేక బొమ్మలతో చెక్కబడిన ఒక రధం వుంది. ఉత్సవ రోజుల్లో దీన్ని ప్రదాన వీదులలో త్రిప్పుతారు. ఇది చాల పెద్దదైనందున చిన్న వీదుల్లో తిరగదు. ఇంకొంచెం ముందుకెళితే అందమైన వరుసలుగా ఇళ్ళున్న వీది కనిపిస్తుంది. ఇందులోని ఇళ్ళు ఎలా వున్నాయంటే... అందులో చాల ధనికులు మాత్రామే నివసించ గలరు. ఈ వీదిలో ఆనేక మంది వర్తకులు కూడ నివసిస్తున్నారు. అక్కడ వజ్రాలు, వైడుర్యాలు, ముత్యాలు ఇంకా అనేకమైన ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులు కొనవచ్చు. ఈ మైదానంలో సాయంత్రం వేళ అనేక మైన సాదారణ వస్తువులను కూడ అమ్ముతారు. చిన్న గుర్రాలు, అనేకరకాల పండ్లు, (నిమ్మ, ఆరంజి, ద్రాక్ష) కర్ర వస్తువులు, వంటివి అన్ని ఇక్కడ దొరుకు తాయి. ఈ మైదానం చివరన ఇంకో ద్వారం వుంది. ఇది రెండో ప్రహరిగోడ ప్రవేశ ద్వారంతో కలుస్తుంది. ఈ విదంగా ఈ విజయనగరం, మూడు కోట గోడలతో లోపల అంత:పుర ప్రహరి గోడలను కలిగి వుంది.

విఠలాలయం ముందున్న హంపి బజారు లాంటి వీధి

(పుట..256)ఈ ద్వారం దాటగానే ఇంకో వీది వుంది. అందులో అనేక వృత్తి పనివారు నివసిస్తున్నారు. వారు అనేకస్తువులను అమ్ముతున్నారు. ఈ వీదిలోనె అనేక దేవాలయా లున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి వీదిలోను దేవాలయా లున్నాయి. ఇవి అక్కడి వ్యపారస్తులకు వృత్తిపని వారికి సమావేశ మందిరాల వలె కూడ ఉపయోగ పడు తుంటాయి. కాని ప్రముఖ మైన దేవాలయాలు నగరానికి వెలుపలే వున్నాయి. ఈ వీదిలోనే మా నాయకుడికి విడిది ఏర్పాటు చేసారు. ప్రతి శుక్ర వారం ఇక్కడ సంత జరుగుతుంది. అందులో సముద్రపు ఉప్పుచేపలు, పందులు, అనేక రకాల పక్షులు, ఇంకా ఆనేక రకాల అస్తువులు ఈ దేశంలో తయారయినవి అమ్ముతున్నారు. వీటిలోని చాల వస్తువులు పేర్లు నాకు తెలియదు. ఇదే విదంగా ఈ నగరంలో వివిద ప్రాంతాల్లో ఒక్కో రోజు సంత జరుగుతుంది. ఈ వీది చివరన ఆరబ్బు దేశస్తుల ఇళ్ళున్నాయి. వీరిలో చాలమంది ఈ దేశ పౌరులే. వీరు కాపలా దారులుగా రాజు గారి నుండి వేతనం పొందుతారు. ఈ నగరంలో వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన వాటి వ్యాపారం జరుగు చున్నందున అనేక ఇతర దేశ వాసులు కూడ కన్పిస్తున్నారు. ఈ నగర వైశాల్యం గురించి నేను చెప్పను. ఎందుకంటే ఏ ఒక్క ప్రదేశంనుండి ఈ నగరాన్నంతటిని చూడ వీలు కాదు. అందు చేత నేను ఒక కొండ నెక్కాను. అక్కడి నుండి చాల వరకు నగరం కన్పించింది. ఈ ప్రాంతమంతా కొండలమయమై నందున నగరమంతా కనబడలేదు. అయినా నాకు కనుపించి నంత నగర భాగమే "రోమ్" నగరమంత వుంది. చూడడానికి చాల అందంగాను వుంది. అనేక పండ్ల తోటలతో, మద్యలో నీరు ప్రవాహిస్తున్న పంట కాలువలతో,అక్కడక్కడా చెరువులతోను, రాజాంత:పుర సమీపంలో తాటి తోపులు మరియు ముఖ్యమైన పండ్ల తోటలు కలిగి వున్నాయి. ఆరబ్బుల కాలని ప్రక్కన ఒక చిన్న నది వున్నది. దాని ప్రక్కన అనేక పండ్ల తోటలున్నాయి. ఎక్కువగా మామిడి, వక్క చెట్లు, జామ, నిమ్మ, ఆరంజి వంటి తోటలు ఒక్క దాని ప్రక్కన ఒక్కటి వున్నందున అదంతా కలిసి ఒక దట్టమైన అరణ్యంలాగ కనిపిస్తున్నది.

(పుట..257) ఇందులో తెల్ల ద్రాక్ష కూడ వున్నది. వీటి కంతటికి నీరు...., నేనిదివరకు చెప్పిన మొదటి ప్రహరి గోడకు ఆవల నున్న రెండు చెరువుల నుండి వస్తుంది. ఈనగర జనాబాను లెక్కించడం సాద్యం కాదు. జనాబా గురించి రాస్తే ఇదేదో కట్టు కధ లాగ అన్పిస్తుంది., కాన దీన్ని గురించి రాయలేను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. వీదుల్లో నడుస్తున్న ప్రజలు, వారి ఏనుగులను తప్పించుకొని ముందుకు పోవడానికి సైనిక పటాలానికి గాని గుర్రపు దళానికి గాని అంత సులబం గాదు. అంటే అంత ఒత్తుగా జనం వీదుల్లో వున్నా రన్నమాట. ఈ నగరం ప్రపంచంలోనే మిక్కిలి స్వయం సంవృద్ది గలిగిన నగరం. ఇక్కడ ఆహార దాన్యాలు, వరి, గోదుమ, జొన్న, పెసలు, ఉలవులు, పప్పు దాన్యాలు అధిక మొత్తంలో నిల్వలున్నాయి. వీటిని నిల్వ చేయడానికి విస్తారమైన ఆవాసాలున్నాయి. వీటి ధరలు కూడ తక్కువె... ఇక్కడ గోదుమలు తక్కువ. ఆరబ్బులు తప్ప ఇతరులు దీన్ని తినరు. వీదుల్లో వచ్చిపోయే ఎద్దుల బండ్లు, వరసలు ఎక్కువగా వున్నాయి. వ్యాపార స్తలాలకు వెళ్ళే ఈ బండ్ల వరసలను దాటడానికి చాల సేపు ఆగవలసి వస్తుంది. లేకుంటే వేరే దారి గుండా వెళ్ళ వలసి వస్తుంది. కోళ్ళు కూడ ఎక్కువగా వున్నాయి. ఈ నగరంలో ఒక "పావో" కు ౩ కోళ్ళు. నగరం బయట ఐతే నాలుగు కోళ్ళు వస్తాయి.

దస్త్రం:Hampi. dandayaka fort. masid.JPG
దండనాయకుని కోట ప్రాంగణం లో వున్న మసీదు

(పుట...258) ఇదే వీదిలో అనేక రకాల సాధారణ పక్షులు, అడవి పక్షులు, ఇతర నీటి పక్షులు అమ్ముతున్నారు. వీటన్నింటిని వీరు బ్రతికిన వాటినే అమ్ముతున్నారు. ఇవి చాల తక్కువ ధరకే దొరుకు తాయి. ఇక్కడున్న పావురాలు రెండు రకాలు. ఒక రకం మన ఫోర్చగీసు దేశంలొ వున్న వాటి మాదిరిగా వున్నాయి. అవి ఒక పావోకు 12 నుండి 14 వరకు ఇస్తారు. పొట్టేళ్లను ఎక్కువగా కోస్తున్నారు. వాటి మాంసం అమ్మే వారు అధికంగా వున్నారు. ఆ మాంసం చాల శుబ్రంగా వున్నది. ఇంతకన్నా మంచి మాంసం మరెక్కడా దొరకదు. ఇక్కడ ఒక పంది వెల నాలుగైదు ఫణాలు మాత్రమె. ప్రతి రోజు బండ్ల కొద్ది నిమ్మ కాయలు అరెంజీలు, వంకాయలు, ఇతర కాయలు వస్తుంటాయి. ఇతర నగరాల వలె కాకుండా ఇక్కడ ఈ సరుకులు చాల ఎక్కువ. (పే.259) అంతే గాక పాలు, పెరుగు వెన్న, నెయ్యి కూడ నూనె కూడ ఎక్కువే. దానిమ్మ కాయలైతె ఒక "ఫణాకు " పది దానిమ్మకాయలు ఒక పణాకు మూడు ద్రాక్ష గుత్తులు వస్తాయి. ఇక్కడికి ఉత్తర వైపున పెద్ద నది వున్నది. ఇందులో మత్స్య సంపద ఎక్కువ. "ఆనెగొంది" అనె నగరం ఈ నది ఒడ్డున వున్నది. వీరు చెప్పే దాన్ని బట్టి ఈ నగరం చాల పురాతన మైనది. గతంలో ఈ నగరమే ఈ రాజ్యానికి రాజదానిగా వుండేదట. కాని ఇప్పుడు ఇందులో కొద్ది మంది ప్రజలే వున్నారు. ఇప్పటికీ ఈ నగరంలో కోట గోడలు బలిష్టమైన రెండు కొండల మద్య వున్నవి. దీనికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇందులో రాజు తరుపున ఒక సేనాదిపతి ఇందులో నివసిస్తున్నాడు. నదిని దాటి ఈ నగరానికి రావడానికి ప్రజలు బుట్ట పడవలను వాడుతున్నారు. ఇది కర్రలతో చేసిన పెద్ద గుండ్రని బుట్ట. క్రింద చర్మం వేయబడివుండి. ఈ పడవలు సుమారు15--20 మందిని తీసుక పోగలవు. అవసరాన్ని బట్టి గుర్రాలు, ఎద్దులను కూడ వీటి ద్వారా నదిని దాటిస్తారు. కాని ఎక్కువగా అవి నీటిలో ఈదుకుంటా ఇవతల గట్టుకు వస్తాయి. ఈ పడవలను ఒకడు తెడ్డుతో నడిపిస్తాడు. ఇవి తిరుగుతూ వెళ్ళతాయి. ఈ దేశంలో ఇటువంటి పడవలే ఎక్కువ.

(ప్రస్తుతం కూడ తుంగ భద్రా నదిని దాటడానికి ఆనె గొంది వద్ద 500 సంవత్సరాల క్రితం డొమింగో పీసు చెప్పిన ఆ బుట్ట పడవలనే నదిని దాటడానికి వాడు తున్నారు. డొమింగో పీస్ చెప్పినట్లు ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి గుర్రాలను, ఎద్దులను కూడ ఆ బుట్ట పడవల ద్వార నదిని దాటించే వారని అన్నాడు. కాని ఇప్పుడు అవసర నిమిత్తం మోటరు సైకిళ్లను, స్కూటర్లను ఈ బుట్టపడవల ద్వారా నదిని దాటిస్తున్నారు. ఆ బుట్ట పడవలను "పుట్టి" అంటారు. ఇక్కడ చెప్పిన నది తుంగభద్రా నది.)

విరూపాక్షాలయ రాజగోపురము

9.హంపి లోని విరూపాక్షాలయం గురించి...(పుట260)[మార్చు]

ఈ నగర ప్రహారీ గోడకు అవతల ఉత్తర దిక్కున మూడు అందమైన దేవాలయా లున్నాయి. ఒకటి విఠలాలయం. ఇది ఆనెగొంది కెదురుగా వుంది. రెండోది ..... ఇది చాలా పురాతన మైనందున దీన్ని వీరు చాల పవిత్రంగా వావించి యాత్రికు లెక్కువగా వస్తుంటారు. ఈ ఆలయ ముఖద్వారాని కెదురుకా తూర్పు వైపుకు అత్యంత అందమైన ఇళ్ళతోను, వరండాలతోను అలరారుచున్న వీది ఉన్నది. ఇందులో ఇక్కడికి వచ్చే యాత్రికులకు వసతి కల్పించ బడుచున్నది. ధనవంతులుకు కూడ వసతి గృహములున్నవి. రాజు గారికి బసకు కూడ ఇక్కడ ఈ వీదిలోనే ఒక పేలస్ కలదు. ఈఆలయ ప్రదాన గోపురం చాల ఎత్తైనది. దానిపై అందమైన చెట్టు... చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో వున్నది. అందులో మనుషులు, ఆడ, మగ, వేట చిత్రాలు వున్నాయి. ఈ గొపురం క్రింద నుండి పైకి పోను పొను సన్నంగా వున్నది. లోపలి కెళ్ళగానే విశాల మైన ఆవరణం అందులో ఇంకో ప్రవేశద్వారం వుంది. ఇది కూడ మొడటి దాని లాగే వుంది. కాని చిన్నది. లోపలికెళ్ళ గానే మరొ ఆవరణం. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టు స్తంబాలతో వుంది.

(పుట 261) దీనికి మద్యలో గర్బగుడి వుంది. ఈ గర్బ గుడి ముందు నాలుగు స్తంబాలున్నాయి. అందులో రెండు బంగారు పూత తోను, మరో రెండు రాగి రేకు తాపడం తోను వున్నాయి. ఈ గుడి చాల పురాతనమై నందున, స్తంబాలపై నున్న బంగారు పూత కొంత భాగం పోయి లోపలున్న రాగి రేకు కన్పిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంబాలు రాగి వేనన్న మాట. డెవుడి కెదురుగా నున్న స్తంబాలు ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు ఇచ్చాడు. మిగాతావి అతని పూర్వీకు లిచ్చారు. ద్వారానికి ముందు పై కప్పు వరకు రాగి తో తాపడంచేయ బడి వుంది. పై కప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు చిత్రించ బడి వున్నాయి. విగ్రహం ముందున్న స్తంబాలలో అక్కడక్కడా రంద్రాలున్నాయి. వాటిలో నూనెదీపాలు రాత్రులందు పెడ్తారని వీరు చెప్పారు. ఆ విదంగా రెండు మూడు వేల దీపాలు పెడ్తారట. (పైన ఉదహరించిన ఆలయం హంపి లోని విరూపాక్షాలయం. పైన చెప్పిన ఆలయ వివరాలు నాలుగు వందల సంవత్సరా క్రితం పరిస్తిత) దీని తర్వాత ఒక చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. దీనికి రెండు తలుపులున్నాయి.. అందులొక విగ్రహం నిలబడివుంది. దీనికన్నా ముందు మూడు తలుపులున్నాయి. ఇది అంతా చీకటిగా వుంది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూ వుంటుంది. మొదటి ద్వారం వద్ద వున్న ద్వార పాలకులు పూజారిని తప్ప ఎవ్వరిని లోపలికి పోనివ్వరు. నేను వారికి కొంత ధనం ఇచ్చి నందున నన్ను లోనికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మద్య చిన్న విగ్రహా లున్నాయి. ఇందులోని ప్రదాన విగ్రహం ఏ ఆకారము లేని గుండ్రటి రాయి మాత్రమే (౧*). దీనికి వీరు చాల భక్తితో పూజ చేస్తారు. (౧* ఇది శివ లింగం) ఈ ఆలయం వెలుపల భాగ మంతా రాగితో తాపడం చేయబడి వుంది. గుడి వెనుక వైపున వరండాకు దగ్గరగా తెల్లని చలవరాతి విగ్రహం వుంది. దానికి ఆరు చేతులున్నాయి. ఒకచేతిలో...ఇంకో చేతిలో కత్తి, ....... ......... ......... (పుట...262) మిగతా చేతులలో ఎవో పవిత్రమైన వస్తువు లున్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకో జంతువు వున్నాయి. ఈ జంతువు బర్రెను చంపడానికి సాహాయం చేస్తున్నట్టుంది. (ఇది మహిషాసుర మర్దిని విగ్రహం. ఇది విరూపాక్షాలయం గర్బ గుడికి ఎడమ వైపున వున్న పెద్ద గాలి గోపురం బయట వున్నది. ఇక్కడే చిన్న చిన్న ఆలయాలు కొన్ని వున్నాయి. వీటికెదురుగా లోతైన కోనేరు కలదు. దాని పేరు "లోకపావని" డొమింగో ఫీస్ ఈ కోనేరు గురించి వ్రాయలేదు. ఇక్కడికి అతి సమీపంలో తుంగభద్రానది ప్రవహిస్తున్నది ) ఈగుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగు తుంటాయి. ఈ చుట్టు పక్కల ఇతర ఆలయా లున్నాయి. ఇవి కూడా అన్ని దేవాలయాల లాగే వున్నాయి. కాని ఇది ప్రదాన మైనది... మరియు పురాతన మైనది.

(పుట 262...) ఈ ఆలయాలకు చాల భవనాలు, భూములు, తోటలు, వున్నాయి. వాటిలొ బ్రాంహాణులు, తాము తినడానికి కూరగాయలు ఇతర పంటలు పండించు కుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్బంలో చక్రాలున్న రధాన్ని లాగుతారు. ఆ సందర్బంలో నాట్యగత్తెలు నాట్యమాడగా, వాద్యకారులు వాద్యాలను మ్రోగించగా అత్యంత వైభవంగా ఈ రధాన్ని గుడి ముందున్న వీదిలో వూరేగిస్తారు. ఇటువంటి ఉత్సవ సందర్బం నేను ఈ నగరంలొ వుండగా రాలేదు కాబట్టి నేను చూడ లేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాలా ఆలయాలున్నాయి. వాటి నన్నింటిని గురించి వ్రాయాలంటె చాల ఎక్కువ అవుతుంది. మన దేవుని నమ్మని వీరు మన లాగే కొన్ని దినాలలో విందులు చేసుకుంటారు. అలాగే కొన్ని రోజులు ఉపవాస ముంటారు. ఆ దినాలలో పగలంతా ఏమితినకుండా ఆర్ద రాత్రి పూట మాత్రమే తింటారు. ముఖ్యమైన ఉత్సవం రోజున రాజు గారు తన కొత్త నగరం నుండి విజయనగరాని కొచ్చి, ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక ఆచారం. ఈ సందర్బంలో ఈ దేశంలో నాట్యగత్తె లందరు, ఇక్కడికి రావలి. అదే విదంగా, సైన్యాది పతులు సామంత రాజులు ఇతర ప్రముఖులు వారి సిబ్బందితొ సహా రావలసి వుంటుంది. కాని యుద్ద ప్రాంతంలో వున్న వారికి , సుదూర ప్రాంతంలో వున్నవారికి యుద్ద భయం వున్న ప్రాంతాల వారికి రాకుండుటకు మినాహాయింపు వుంది. ఈ వుత్సావాలు సెప్టెంబరు 12 తారీఖున ప్రారంబమై, రాజాంత:పురంలొ తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. (ఇవి దశరా ఉత్సవాలు.)

పుట 263..) 10. రాజాంత:పురంలో దసరా ఉత్సవాల వర్ణన[మార్చు]

రాణీవాసపు ప్రాంతములో పద్మ మహలు

అంత:పుర ముఖ ద్వారం -- నేనిదివరకు చెప్పిన మైదాననానికి ఎదురుగా రాజాంత:పురమున్నది. ఆ ముఖ ద్వారంపై చిన్న గోపురముంది. ఈ ద్వారం నుండే ప్రారంబ మయిన ప్రహరిగోడ అంత:పుర ప్రాంగణమంతా చుట్టి వున్నది. ఈ ద్వారం వద్ద చాల మంది కాపలా దారలున్నారు. వారు తమ చేతుల్లో కర్రలు, కొరడాలు, పట్టుకొని వున్నారు. వీరు తమ అధికారి చెప్పిన వారిని, ప్రముఖులను తప్ప మరెవ్వరిని లోనికి వంపరు. ఈ ద్వారం దాటి లోపలికెళితే ఒక మైదానం ఉంది. ఇక్కడ కూడా ద్వార పాలకులున్నారు. లోపలికెళ్ళగానే మారొమైదాన ముండి దీని చుట్టు వున్న వరండాలలో ఉత్సవాలను చూడ డానికి వచ్చినవారు, సేనాది పతులు ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ మైదానానికి ఉత్తరం ఎడం వైపున ఒక అంతస్తు కలిగిన ఒక పెద్ద భవనం కలదు. మిగతావి కూడా అదేవిదంగా వున్నాయి. ఏనుగు ఆకారం లో చెక్కిన శిలా స్తంబాలు ఇంకా ఇతర శిల్పాలతో నిండిన స్తంబాలాపై ఈ భవనం వుంది. ముందు భాగామంతా ఖాళీగా వుంది. అక్కడికెళ్ళ డానికి రాతి మెట్ల దారి వుంది. దీని చుట్టు వరండాలున్నాయి. ఇక్కడ కూడా ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారున్నారు. దీనిని "హౌస్ ఆఫ్ విక్టరి" అని పిలుస్తారు. ఈ రాజు గారు ఒరిస్సాను జయంచి తిరిగి వచ్చిన తర్వాత దీన్ని నిర్మించాడు. (దీన్నే ఇప్పుడు "దసరా దిబ్బ" అని అంటున్నారు.) ఈ మైదానానికి కుడి ప్రక్కనున్న స్తలంలో కర్రలతో ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికలున్నాయి. ఇవి ఎంత ఎత్తున్నాయంటే... ఇవి బయటి నుండి కూడా ప్రహారి గోడ పైన అవి కన్పిస్తుంటాయి.

(పుట 264)వీటిని ఈ దసరా వుత్సవానికి మాత్రమే ఏర్పాటు చేసారు. వీటి చుట్టు అందమైన ఎర్రటి, ఆకు పచ్చని రంగుల పట్టు బట్ట క్రింద నుండి పైదాక కప్ప బడి వుంది. ఇటువంటి కర్ర వేదికలు పదకొండున్నాయి. ఈ గేటు కెదురగా రెండు వృత్తాకార వేదికలున్నాయి. అత్యంత ఆడంబరంగా ముస్తాబైన, రత్న ఖచిత మైన ఆభరణాలు ధరించిన నాట్య గత్తెలు ఆ వేదికల మీదున్నారు. ఈ గేటు కెదురుగానే తూర్పు దిక్కున మద్యలో హౌస్ ఆఫ్ విక్టరి లాంటి వేదికలు రెండున్నాయి. వీటి పై కెక్కడానికి అందంగా చెక్క బడిన రాతి మెట్లున్నాయి. ఒకటి మద్యలో వుండగా రెండోది ఆ చివరనున్నది. దీనికి అన్నివైపుల, క్రింద, పైనా, అ స్తంబాలతో సహా అందమైన కుట్టుపని వున్న బట్టతొ కప్పబడి వుంది. ఈ రెండు భవనాల పై రెండు వేదికలు ఒకదాని పై ఒకటి కట్టబడి వున్నాయి. ఇవి కూడా అందమైన శిల్పకళతో వున్నాయి. ఈ వేదికలు రాజు గారి పుత్రులకు, వారి అంతరంగికులకు, కొన్ని సందర్బాలలో నపుంసకులకు ఉపాయోగిస్తారు. రాజుగారి అనుమతి ప్రకారం ఉత్సవం బాగా కనుపించే విదంగా రాజుగారికి దగ్గరగా, పైనున్న వేదిక మీద మాకొరకు స్థానం ప్రత్యేకించారు. నేనిదివరకే చెప్పినట్లు రాజుగారి అంత: పురంలో రాజు గారు, వారి రాణులు, వారి బటులు, పరిచారికలు సిబ్బంది అందరూ కలిసి పన్నెండు వేల మంది వుంటారు. వారు లోనికి వెళ్ళడానికి దారి వున్నది. (పుట..265) రాజాంత:పురానికి, "హౌస్ ఆఫ్ విక్టరి" వేదికకు మద్య ఒక దారి వుంది. దీని ద్వారా అంతఃపుర ప్రాంగణంలోనికి వెళ్ళవచ్చు. లోపల 34 వీదులున్నాయి. ఈ దశరా వేదిక పై రాజుగారి కొక ప్రత్యేక మయిన గది వుంది. అది బట్టతో కప్పబడి వుండి తలుపులు కలిగి వుంది. అందులో దేవి విగ్రహం వుంది. వేదిక మద్యలో మెట్లకెదురగా చిన్న వేదికపై ఈ రాజ్యం యొక్క సింహాసనం వుంచబడి వుంది. నాలుగు అంచులు కలిగి మద్యలో గుండ్రంగా వుండి, ఇది అత్యంత నేర్పు గలిగిన చక్క పని తనంతొ వుండి పట్టుబట్ట కప్ప బడివుంది. చుట్టు బంగారపు సింహము బొమ్మలున్నాయి. బట్టల మద్య ఖాళిలలో ముత్యాలు, పరచి... వాటిపై నున్న బంగారు పళ్లేలలో రత్నాలు, వజ్రాలు వంటి విలువైనవి పోసి వున్నాయి. చుట్టూ ప్రముఖ వ్యక్తుల బంగారు విగ్రహాలున్నాయి. ఈ ఆసనంపై పూలతో అలంకరించ బడిన బంగారు విగ్రహం వుంచబడి వున్నది. ఈ ఆసనం ప్రక్కన వేదికపై కిరీటం లాంటిది నిలబెట్ట బడివుంది. ఇది కూడ ముత్యాలు, వజ్రాలు, వైడుర్యాలు వంటివి పొదగబడి వున్నాయి. దీని మందం రెండు... మూడు అంగుళాలున్నది. దీని ముందు రెండు మూడు దిండ్లు వున్నాయి. రాజుగారు ఉత్సవ సందర్బంలో ఇక్కడ కూర్చుంటారు. రాజు గారు కూర్చోగానె అంతవరకు బయట వేచి వున్న సేనాధిపతులు ఒక్కొక్కరుగా వారుసగా లోనికి ప్రవేసించి రాజు గారికి నమస్కరించి వారి వారి స్థానాలలో కూర్చుంటారు. తర్వాత సైనిక దళాధిపతులు వారి వారి హోదాకు సంబందించిన గుర్తులతో ఆ వేధిక చుట్టు ఏనుగుల ముందు బారులు దీరి రాజుగారికి రక్షణ కవచంగా ఏర్పడతారు. ఆ లోపలికి ఎవరు ఆయుదాలు ధరించి రాకూడదు. ఆ తర్వాత అనాట్య గత్తెలు నాట్యం ప్రారంబిస్తారు. కొంత మంది స్త్రీలు ప్రవేశ ద్వారం ప్రక్కన వృతాకారంలో దీనికొరకు ఏర్పాటు చేసిన వేధికలపై నాట్యమాడుతారు. వారు చాల ధన వంతులు. రత్నాలు, మణులు మొదలగు విలువైన రాళ్లు పొదిగిన చేతి కడియాలు, కంకణాలు, కాళ్ల కడియాలు ధరించి వున్నారు. వారిలో కొందరు రాజు గారి నుండి మడులు, మాన్యాలు పొందిన వారూ వున్నారు. ఈ నగరంలో ఇటు వంటి ఒక స్త్రీ లక్షలాది బంగారు నాణేలు కలిగి విన్నదని విన్నాను గాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.

(పుట 266) 11. ఉత్సవాలు ఎలా ప్రారంబమవుతాయంటే?[మార్చు]

రాజుగారు ఊదయాన్నే ఈ వేదికపైకొచ్చి దేవి విగ్రహం వున్న గదిలోనికి తన పూజారులతో వెళ్లి పూజాదికాలు నిర్వహిస్తాడు. బయట అంతరంగికులు, ప్రముఖులుంటారు. ఎదురగా నాట్య గత్తెలు నాట్యంచేస్తుంటారు. వరండాలలో ఉత్సావాన్ని చూడడాని కొచ్చిన సేనాదిపతులు ఇతర ప్రముఖులు వుంటారు. వేదిక ముందు అత్యంత ఆడంబరంగా అలంకరించ బడిన పదకొండు గుర్రాలు, వాటి వెనుక నాలుగు ఏనుగు లున్నాయి. దేవి గదిలో నుండి రాజుగారు బయటకు రాగానే వెంట వున్న పుజారి తన చేతిలో వున్న బట్టలోని తెల్లని గులాబి పూలతో వస్తాడు. రాజు గారు మూడు పిడికిళ్ల పూలు తీసుకుని గుర్రాలపై చల్లుతాడు. ఆదే విదంగా ఏనుగులపై కూడ చల్లుతాడు. ఆ తర్వాత పూజారిగారు క్రిందకి దిగి మిగతా గుర్రాలపై కూడ మిగిలిన పూలు చల్లుతాడు. తర్వాత రాజు గారు దేవి విగ్రహం వున్న గదిలోని కెళ్లగానే దాని కున్న పరదాలను తొలిగిస్తారు. రాజు ఆసీనులు కగానే రాజుగారు చూస్తుండగానె 24 ఎనుబోతులను, 150 పొట్టేళ్లను విగ్రహానికి బలి ఇస్తారు. తలారి ఆ జంతువుల తలలను ఒకే దెబ్బకు నరుకు తాడు. ఏ ఒక్క సారి కూడ అతని గురి తప్పదు.

(పుట 267..) ఈ కార్యక్రమం పూర్తి కాగానె రాజు గారు ఇతర వేదికల పై అటు ఇటు తిరిగి వెళ్తాడు. మెట్లెక్కే టప్పుడు పైన ఉన్న ఆ బ్రాంహణులు రాజు గారి మీద పూలు చల్లుతారు. అక్కడ రాజుగారు తన కిరీటం తీసి క్రింద పెట్టి తిరిగి దేవి విగ్రహం వున్న గదికి వస్తాడు. ఆక్కడ దేవికి నమస్కరించి ఇంకో ఆలయంలోని కెళ్తాడు. అక్కడున్న అగ్ని గుండంలో ఒక విదమైన పొడి చల్లుతాడు. (ఇది విభూతి/లేదా సాంబ్రాణి) ఆ పొడి ముత్యాలు, రత్నాలు ఇతర సుగంద ద్రవ్వాలతో చేసినది. ఈ కార్యక్రమం తర్వాత రాజుగారు మరొక్క ఆలయంలోనికి ప్రవేశించి అక్కడ కొంతసేపు వుండి తన వారితో కలిసి దేవికి నమస్కరించి తిరిగి ఇదివరకు గుర్రాల పై పూలు చల్లిన ప్రదేశానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న సేనధిపతులు, ఇతర ప్రముఖులు, సామంత రాజులు సమర్పించిన బహుమతులను, వారి నమస్కారలను స్వీకరించి నేనిది వరకు చెప్పిన రెండు భవనాల మద్యనున్న ద్వారంగుండా తన అంతఃపురం లోనికి వెళ్లిపోతాడు. ఈ విదంగా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు జరుగుతుంది.

(పుట 268) సాయంత్రం 3 గంటలకు అందరు అంత:పురం ముందు హాజరవుతారు. మమ్ములను కూడ ఆ ముదున్న మైదానంలోనికి పంపించారు. లోనికి కుస్తీ యోధులు, నాట్యగత్తెలు, అలంకరించ బడ్డ ఏనుగులు వాటిపై సాయుధులైన మావటీలు వెళతారు. ఈ మైదానంలో కొంత ప్రాంతం నాట్యానికి, కుస్తీలకు ఏర్పాటు చేశారు. ఆ భవనానికి ఎదురుగా ప్రవేశ ద్వారం వద్ద బ్రాహాణులు రాజుగారి బందు వర్గము, రాజ ప్రముఖులు మొదలగువారున్నారు. వారు వారి హోదాను బట్టి ఎవరికి కేటాయించిన స్థానలలో వారు ఆసీనులౌతారు. ఆ విధంగా వివిద వేదికలు ప్రత్యేకంగా వున్నాయి. ప్రతి దానికి ద్వారాలున్నందున ఆహ్వానితులు కాని వారు లోనికెళ్లరు. అంత:పురంలో ప్రముఖ వ్వక్తి అయిన తిమ్మరుసు (తిమ్మరుస ) ఆ భవనంలోనికి ప్రవేసించి ఇక్కడి నుండే కార్యక్రమాలను పర్వవేక్షిస్తాడు. ఈ తిమ్మరుసే ప్రస్తుతమున్న రాజుగారిని పెంచి పోషించి రాజ్యాభిషిక్తుడిని చేశాడు. కాని రాజుగారు అతణ్ని పిలిచినపుడు తిమ్మరుసు "మహారాజా" అని సంభోదిస్తుంటాడు. ఇతర ప్రముఖులు అందరు తిమ్మరుసుకు అతి వినయంగా నమస్కరిస్తారు. ఇతను ఒక ద్వారం వద్ద నిలబడి ఈ ఉత్సవాలకు తగు సలహాలు, ఆదేశాల నిస్తుంటాడు. అక్కడ ఆ మైదానంలో కూర్చున్న కుస్తీ వీరులు తమలపాకులు నములుతూ వుంటారు. రాజుగారి ముందు అలా తమలపాకులు నమలడము ఈ రాజ్యంలో ఎంత పరపతి వున్న వ్వక్తికి కూడ అనుమతి వుండదు ఒక్క కుస్తీ వీరులు, నాట్యగత్తెలకు తప్ప. రాజుగారు అలా కూర్చొని తన తోటి రాజులను కూడ కూర్చోమంటారు. వారు మహారాణుల తండ్రులు. స్వయాన రాజులు. అందులో ఒకరు శ్రీరంగ పట్నం రాజు కుమార రాజ., (రాజ కుమారుడు) మిగిలినవారు రాజుగారి వెనుక కూర్చున్నారు. అప్పుడు రాజు గారు గులాబి పూలు కుట్టిన తెల్లటి వస్త్రాలలో అనేక ఆభరణాలతో వున్నారు. అతని చుట్టు.... అతని భటులు కత్తులు ధరించి నిలబడి వున్నారు. చాల మంది బ్రాహణులు సింహాసనం మీద వున్న దేవి విగ్రహానికి వింజామరలతో వీస్తున్నారు. ఆ వింజామరలు గుర్రపు వెంట్రుకలతో చేసినవి. (పుట 270) ఇటువంటి వింజామరలను ఎవరికైనా బహుమానంగా ఇస్తే అది ఈ రాజ్యలో అత్యధికమైన గౌరవంగా భావిస్తారు. అటు వంటి వింజామరలతోనె రాజుగారికి కూడ వీస్తున్నారు.

12. దసరా సందర్బం గా జరుగు వినోద కార్యక్రమాల[మార్చు]

సాయంత్రం మూడు గంటలకు అందరూ ఈ మైదానంలో సమావేశ మవుతారు. ముఖ్యంగా సేనాదిపతులు, యువ రాజులు, పుర ప్రముఖులు, సామంతులు ఇలా అందరూ వారికి నిర్దేశించిన స్తలాలలో ఆశీనులై వుంటారు. స్త్రీలు, అనేక రకాలా వజ్రాబరణాలు, ముత్యాలు, బంగారు కడియాలు దరించి వచ్చారు. ఒక పైపు నాట్య గత్తెలు నాట్యం చేస్తుంటే మరో వైపు కుస్తీ పోటీలు జరుగుచున్నాయి. కుస్తీ పోటీలు చాల క్రూరంగా వుంటాయి. ఈ పోటీలలో పండ్లు రాలిపొవడం రక్తం కారడం, స్పృహ కోల్పోవడం వంటివి కూడా జరుగు చుంటాయి. సైనికులు వారి వారి ఆయుదాలతో విన్యాసాలు చేస్తుంటారు. కీలు గుర్రం లాంటివి కూడ వున్నాయి. చీకటి పడగానే అనేక రంగు రంగుల దీపాల అలంకరణలతో ఆ మైదానమంతా పట్ట పగలుగా తోస్తిన్నది. వినోద కార్యక్రమాలు పూర్తవగానే బాణా సంచా సామాగ్రిని కాల్చడం ప్రారంబ మవుతుంది. అనేక రాకెట్లు, బాంబులు పేల్చారు. ఇది పూర్తయిన తర్వాత సైన్యాది పతులకు సంబందించిన అలంకరించిన రధాలు ప్రవేశిస్తాయి. కొన్ని రధాలు రెండు మూడు అంతస్తులు కలిగి వున్నాయి. వీటిలో నాట్యాలు వంటి వివిద విన్యాసాలు జరుగుతున్నాయి. ముందుగా రాజుగారి గుర్తుగా రెండు గొడుగులు వున్న గుర్రం వస్తుంది. తర్వాత ఇతర గుర్రాలు వస్తాయి. వాటి విన్యాసాలు అయిన తర్వాత గుర్రాలన్ని ఆరు వరుసలుగా రాజు గారి ముందు నిలబడతాయి. అన్నింటికన్నా ముందు రాజు గారి గుర్రం వుంటుంది. అప్పుడు లోపలనుండి ఒక బ్రాంహణుడు ఒక పళ్లెంలో, కొబ్బరి కాయలు, బియ్యం, పూలు ఇంకా కొన్ని వస్తువులు ఒక కుండలో నీళ్లతో వచ్చి గుర్రాల చుట్టు తిరిగి ఏదో కార్యక్రమం చేసి లోనికి వెళ్లిపోతాడు. ఇప్పుడు అనేక మంది స్త్రీలు, అనేక రక రకాల వాద్యాలతో ప్రవేసిస్తారు.(ఈస్త్రీలు దరించిన వివిద రకాల వస్త్రాలు, ఆబరణాలు వివరణ చాల వుంది. నాట్యం తర్వాత సైన్యం ప్రవేసిస్తుంది. సైన్యం వేష ధారణ గురించి చాల వివరణలున్నాయి)

(పుటలు 270..272 ....

(పుట 273.) 13. ఈ దసరా సందర్బంగా అంతఃపుర స్త్రీలు బంగారు, వజ్రాబరణాలను ప్రదర్శించే తీరు [మార్చు]

ఇరవై ముప్పై మంది స్త్రీలు చేతిలో బెత్తాలతో బుజాన కొరడాలతో లోపలి నుండి వస్తారు. వారి వెంబడి కొందరు నపుంసకులు కూడా వస్తారు. వీరందరు అనేక రకాల వాయిద్యాలను వాయిస్తుండగా వారి వెనక కొంత మంది స్త్రీలు ప్రత్యేకంగా అలంక రించుకుని వస్తారు. వారి అలంకరణ ఈ విదంగా వుంది..... వారు ధరించిన పట్టుబట్టలు చాల ఖరీదైనవి. తలకు పొడవాటి టోపి ధరించారు. (ఇవి కిరీటాలు .) ఈ టోపిలపై పెద్ద పెద్ద ముత్యాలతో చేసిన పుష్పాలు అమర్చబడి వున్నాయి. వారి బుజాలపై మరియు మెడకు వేసుకున్న అబరణాలు బంగారంతో చేసిన వజ్రాలు, వైడుర్యాలు, ముత్యాల వంటి విలువైన రాళ్లను పొదగబడి వున్నాయి. అంతే గాక వీరు బుజకీర్తులకు ముత్యాల హారాలు వేసుకున్నారు. ముంజేతులకు కంకణాలు కూడా వజ్రాలు వంటివాటితో తాపడం చేయబడి వున్నాయి. మోచేతి నుండి పైభాగం కొంత ఖాళీగా వున్నా..... క్రింద చేతికి వేసుకున్న కంకణాలు కూడ వివిద రకాల వజ్రాలతొ వున్నాయి. వారు వేసుకున్న కాళ్ల కడియాలు.. వాటికి పొదగబడిన పజ్రాలు మిగతా వాటికన్నా విలువైనవిగా వున్నాయి. వారు తమ చేతులతో బంగారు బిందెలను ఎత్తుకున్నారు. వాటికి ముత్యాలను లక్కతో తాపడం చేసి అందులో ఒక దీపం పెట్ట బడి వుంది. వీరందరు పదహారు---ఇరవై సంవత్సరాల మద్య వయస్సున్నవారు.

(పుట...274..) వీరు ధరించిన ఆ బంగారు ఆబరణాల బరువుతో వారు సరిగా నడవ లేక పోతున్నారు. అందు చేత వారి పక్కనున్న ఇతర స్త్రీలు వారి చేతులను పై కెత్తి నడవ డానికి సహాయ పడు తున్నారు. ఈ విదంగా వీరందరు ఆ గుర్రాల చుట్టూ మూడు సార్లు తిరిగి అంతఃపురం లోనికి వెళ్లిపోతారు. ఈ స్త్రీలందరు అంతఃపుర మహారాణుల చెలి కత్తెలు సహచరులు మాత్రమె. ఈ తొమ్మిది రోజుల ఉత్సవం లో ప్రతి మాహారాణి తనకు కేటాయించిన రోజున తన పరిజనాన్ని ఈ విదంగా ప్రదర్శనకు పంపుతుంది. ఈ విదంగా ఈ మహారాణులు ఆయా రోజుల్లో ఆబరణాలతో అలంకరించిన తమ చెలికత్తెలను పంపి తమకున్న ఆబరణాల, గొప్ప తనాన్ని ప్రదర్శించు కుంటారు. వీరందరు లోపలి కెళ్లగానె గుర్రాలు కూడ వెళ్లి పోతాయి. తర్వాత ఏనుగులు వచ్చి వందనం చేసి వెళ్లిపోతాయి. రాజు గారు కూడా వెళ్లి పోతాడు. తర్వాత పూజారులు వచ్చి దేవి విగ్రహాన్ని తీసుకుని దశరా వేదికపై నున్న గదిలో పెడతారు. అప్పుడు రాజు గారు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అపుడు ప్రతి రోజు లాగానె కొన్ని ఎను బోతులను, పొట్టేళ్లను అక్కడ బలి ఇస్తారు. బలి కార్య క్రమం జరుగు తున్నప్పుడు ఆ తర్వాత కూడ చాల సేపటి వరకు నాట్యగత్తెలు నాట్యం చేస్తూనే వుంటారు. ఈ తొమ్మిది రోజుల్లొ ఎవరూ పగటి పూట భొజనం చేయరు. ఉపవాస ముంటారు. రాజుగారి తో సహా అందరి భొజన సమయం ఈ కార్య క్రమాలన్ని అయిన తర్వాత ఆర్ద రాత్రి మాత్రమె. ఈ విదంగా ఈదసరా ఉత్సవాలు జరుగుగా తొమ్మిదో రోజు 250 దున్న పొతులను, 4500 గొర్రెలను బలి ఇస్తారు.

(పుట 275.)14 .దసరా ఉత్సవాల ముగింపు సందర్బంగా జరిగే సైనిక బలగాల సమీక్ష.[మార్చు]

దసరా ఉత్సవాలు ముగియగానే రాజు గారు తన సైనిక బలగాలను సమీక్షీస్తాడు. ఇందుకోసం నగరానికి పది మైళ్ల దూరంలొ ఒక గుడారం ఏర్పాటుచేసి అందులో, ఇన్ని రోజులు పూజ లందుకున్న దేవివిగ్రహాన్ని వుంచుతారు. ఈ గుడారం నుండి అంతఃపురం వరకు సేనా పతులు, ఇతర సైనికాధికారులు తమ తమ సేనలతో వారి వారి హోదా ప్రకారం బారులు తీరుతారు. ఆ ప్రదేశం లో చెరువులుంటే దాని చుట్టు... దారి వుంటె దాని వెంబడి, కొండల వాలులందు, అన్నింటా సైనిక దాళాలే. ఆ ప్రాంతం లో సైన్యం ఆక్రమించని ప్రాంతమే కనబదు. కాల్బలం సైనికులు ముందు వరుసలో వుండగా, వారి వెనక, గుర్రాలు, వారి వెనుక ఏనుగులు ఇలా వరుసలుగా నిలబడతారు. వారందారూ తమ తమ ఆయుదాల తోనూ, తమ హోదాను తెలిపేపట్టీల తోను అందమైన దుస్తుల తో వున్నారు. ఆగుర్రాలను అందంగా అలంకరించి వాటి ముఖాల ఒక ఫలకాన్ని దరింప జేసి వున్నారు. వాటి కళ్ళేలను అనేక రంగుల సిల్కు దారాలతో చేసి వున్నారు.

(ఫుట..276...) గుర్రాల తలమీద పాము పడగలు, పెద్ద జంతువుల చిత్రాలు అలంకరించ బడివున్నాయి. సైనికులు ధరించిన శిరస్రాణాలు వారి ముఖానికి, మెడకు కూడా కప్పబడి చూడ చక్కగా నున్నారు. గుర్రాలను కూడ రంగు రంగుల పట్టు బట్టలతో అలంకరించి వున్నారు. సైనికుల నడుముకు కత్తి, యుద్దాలలొ వుపయోగించే చిన్న గొడ్డలి వున్నాయి. చేతులలో పొడవాటి ఈటెలు వుండగా వాటికొనలు బంగారు, వెండి తో చేయ బడ్డాయి. రాజు హోదా తెలిపే గొడుగులు అనేక రంగుల పట్టు బట్టతో చేసి వున్నాయి. ఏనుగులను కూడా ఇదే విదంగా అలంకరించి మెడలో గంటలతో తలమీద రంగు, రంగు బొమ్మల గీసి వున్నాయి.

(పుట 277..) విలుకాండ్రు ధరించిన ధనస్సులకు బంగారు పూత పూయ బడి వుంది. తుపాకి ధరించిన సైనికులు ముదురు రంగు దుస్తులు ధరించి వున్నారు. ఈ సమీక్షలో వాడిన ఈటెలు, డాలు, విల్లులు, బాంబులు, ఇటువంటి ఆయుదాలను ఎలా తయారు చేసారా యని, మరి వాటిని వాడే విదానం చూసి నాకు చాల ఆచ్చ్యర్య మేసింది. సైనికులే ఇంతటి విలువైన దుస్తులు ధరిస్తుంటే ఇక రాజు గారు ఎలాంటి దుస్తులు ధరించే వారో ఊహించవచ్చు. రాజుగారు వెళుతుంటే పైన చెప్పిన విదంగా అలంకరించ బడ్డ కొన్ని ఏనుగులు, అదేవిదంగా ఇరవై గుర్రాలు వెంబడి వెళతాయి. గుర్రాల కళ్లాలు ఇతర అలంకరణలలో బంగారు, మరియు ఇతర విలువైన రాళ్లు పొదగబడి వున్నాయి. రాజుగారి దగ్గరగా ఒక పెద్ద పల్లకి వుంది అది రాగితోగాని, వెండితో గాని చేయ బడి వుంది. దానిని పదహారు మంది మోస్తుంటే ఇంకో పదాహారు మంది బరువు మార్చుకోడానికి సిద్దంగావున్నారు. అందులో ఇంతవరకు పూజలందు కున్న దేవి విగ్రహం వుంది. ఆ విదంగా రాజుగారు వెళుతుంటే సైనికు లందరూ తమ తమ ఆయుదాలను భూమికి తాకించి శబ్దం చేసారు. గట్టిగా నినాదం చేశారు. గుర్రాలు గట్టిగా సకిలించాయి. ఏనుగులు ఘీంకరించాయి.. బాంబులు పేలాయి. తుపాకులు ఘర్జించాయి. ఈ శబ్దానికి నగరం అంతా తలకిందులై పోతుందా..? అని నాకు అనిపించింది. ప్రపంచం అంతా ఇక్కడే గుముగూడి వుందా? అని కూడ అనిపించింది. ఈ విదంగా రాజుగారు అమ్మ వారిగుడిలోని కెళ్లునంత వరకూ వుంది. రాజు గారు అలా లోపలి కెళ్లగానే సైనికులందరూ వెళ్లి పోతా రనుకున్నాను. కాని దానికి విరుద్దంగా.. అందరూ కదలకుండా రాతి బొమ్మల్లాగా నిలబడి పోయారు. గుడి లోపల రాజుగారు తన పూజా కార్యక్రమం పూర్తి గావించుకుని బయటకు వచ్చు నంతవరకు వారు అలాగే నిలబడి వున్నారు. పూజానంతరం రాజుగారు బయటకు వచ్చి తన గుర్రమెక్కి వచ్చిన దారి వెంబడే నగరాని బయలు దేరగానే సైనికు లందరూ తమ ఆయుదాలతో శబ్దం చేస్తూ కొడలలో, గుట్టలలో వున్నవారు క్రిందికి దిగుతున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే నాకు "నేను కల గంటున్నానేమో" ననిపించింది. నేను అలా తలతిప్పి అటుఇటు చూస్తుంటే నేను నడుపుతున్న గుర్రం వెనకబడి పోయింది. సైనికాధికారు లందరూ నగరం వరకు రాజు గారి వెంబడి వెళ్లి తర్వాత విశ్రాంతికై వెళ్లి పోయారు. మిగతా సైనికులు తమ తమ గుడారాల వైపు వెళ్ళారు.

15. డొమింగో ఫీస్ చూసిన శ్రీ కృష్ణ దేవరాయల రాజాంతపురం.[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు క్రొత్త నగరంలో వున్నారని తెలిసి మేము మా గవర్నరుతో కలిసి రాజు గారి కొత్త నగరానికెళ్ళి విజయనగర రాజాంతపురాన్ని సందర్శించడానికి అనుమతి కోరాము. రాజుగారు సంతోషించి దయతో అంగీక రించారు. మేము తిరిగి విజయనగరానికి రాగానే అంతపురానికి చెందిన అధికారి మాకు అంతపురాన్ని చూపించాడు.

ప్రధాన ద్వారంవద్ద మమ్ములను నిల్పి మేము ఎంతమందిమి వున్నామో లెక్కబెట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని లోనికనుమతించారు. అది ఒక గుడి. లోపల నేల అంతా నున్నగా గచ్చు వేయ బడి వున్నది. గోడలు తెల్లగా వున్నాయి. ఆ ఎదురుగా నున్నది రాజుగారి నివాసము. దీని ప్రవేశద్వారం కిరువైపులా రెండు చిత్ర పటాలు చిత్రిచబడి వున్నాయి. కుడి చేతి వైపునున్నది ప్రస్తుతమున్న రాజు గారి తండ్రిది. రెండోది ప్రస్తుత రాజు గారిది. ఈ గది నుండి బయటకు రాగానే తిరిగి మమ్ముల్ని లెక్క బెట్టుకున్నారు,. ఆ తర్వాత ఇంకో చిన్న కట్టడం లోనికెళ్ళాము. ఇందులోనికి రాగానే ఎడం వైపు రెండు గదులు ఒకదాని మీద ఒకటి వున్నాయి,. క్రిందున్న గది భూమట్టానికి కొంచెం దిగువున వున్నది. రెండు మెట్లు దిగాలి. ఈ మెట్లు రాగితో తాపడం చేయ బడి వున్నాయి,. అక్కడి నుండి పైదాక అంతా బంగారంతో పూత పూయ బడి వుంది. బయట ఇది గుమ్మటంలాక వున్నది. (ఔట్ సైడ్ ఈస్ డోమ్ డు షేప్) దీనికున్న నాలుగువైపుల తలుపులకు వజ్రాలు, రత్నాలు మాణిక్యాలు తాపడం చేయబడి వున్నాయి. పైన బంగారం తో చేయబడిన రెండు దీపస్థంబాలు వేలాడుతున్నాయి. వీటికి కూడ వజ్రాలు వంటివి పొదగబడి వున్నవి. ఈ గదిలో ఒక మంచం వున్నది. దాని కాళ్ళు కూడ గది తలుపులు లాగే వున్నాయి,. దాని పట్టీలకు బంగారు తాపడం చేయ బడి వుంది. దానీ మీదున్న దుప్పటికి చుట్టు ముత్యాల వరుసలు కుట్టబడి వున్నాయి., దీనిపైనున్న గదిలో ఏముందో నే ను చూడలేదు. ఈ భవనంలోనె ఇంకో గది వుంది. ఇది అందసంగా చెక్కబడిన రాతి స్థంబాలు కలిగి వుంది. ఈ గదికి క్రిందా - పైనా స్థంబాలకు కూడ, గులాబి, తామర పువ్వులు చెక్కబడిన దంతముచే కప్పబడివుంది. ఇంతటి అందమైన గది మరొకటి నాకెక్కడా కనబడలేదు. ఇందులో రెండు సింహాసనాలున్నాయి. అవి బంగారంతో చేయబడినవి. ఇంకో మంచం వెండి తో చేయబడినది. ఇందులోనె ఒక చిన్న పలకం చూశాను. అది నీళాల తో చేయబడినది. దాని క్రింద కొన్ని అర్చీలున్నాయి. ఇది అంతపుర ద్వారానికి ప్రక్కనే వుంది. దీని తలుపులు పెద్ద బీగాలతో మూయ బడి వుంది. లోపల వెనకాటి తరాల రాజుల ఖజానా దాచ బడినదట.

ఆ తర్వాత మేమొక పెద్ద హాలు లోనికి ప్రవేశిచాము. ఇదంతా అందంగా అగచ్చు చేయడి ఉవుంది. మద్యలో కర్ర స్థంబాలున్నాయి. వాటిపై భాగమంతా రాగితో తాపడం చేయబడివుంది. వీటి మద్యలో నాలుగు వెండి గొలుసులు .... వాటి కొక్కేలు స్థంబాల పైబాగానికి తగిలించి వున్నాయి. ఇది రాజుగారు తన రాణులతో ఉయ్యాల లూగటానికి చేసిన ఏర్పాటు. ఈ హాలు ప్రవేశ ద్వారానికి కుడిప్రక్కనున్న నాలుగైదు మెట్లెక్కి ఇంకో అందమైన భవనం లోనికి ప్రవేసించాము. వీరి ఇళ్ళన్ని ఒకే అంతస్తు కలిగి వైకప్పు చదునుగా వుంటుంది. అక్కడున్న మరో భవనం రాతి స్థంబాలతో పైకప్పు మాత్రం చెక్కతో చేయబడి వుంది. స్థంబాలు రాగి తో పూత పూయ బడి వున్నవి. ఈ భవన ప్రవేశద్వారమందు నాలుగు ష్తంభాల మంటపం వున్నది. స్థంభాలపై నాట్య కారుల - ఇతర చిత్రాలు మలచబడి వున్నాయి. ఈ చిత్రలన్ని ఎర్రటి రంగులో పూత పూయబడి వుంది. ఈ భవనం దేవి విగ్రహాన్ని వుంచడానికి మాత్రమే వాడుతున్నారు. ఇందులో చివరగా మూయబడిన గదిలో దేవి విగ్రహం వున్నది. ఉత్సస్వాల సందర్బంలో ఈ దేవి విగ్రహాన్ని బంగారు సింహాసనంలో తీసుకెళ్ళతారు.

ఈభవనం నుండి బయటకు వచ్చి ఎడంచేతి వైపు నడవగా ఒక వసారా లోనికి వ్రవేశించాము. ఈ వసారా............ భవనమంత పొడుగున్నది. ప్రవేశద్వారం వద్దనే ఒక బంగారు మంచం వెండి గొలుసులచే వేశాడదీయ బడి వుంది. దీనికి వజ్ర వైడుర్యాలు తాపడం చేయ బడి వున్నాయి. ఈ భవనం పై మరో అంతస్తున్నది. దీని తర్వాత కొంచెం ప్రక్కగా పెద్ద గంగాళాలున్నాయి ఇవి బంగారంతో చేయుబడినవి. ఇవి ఎంత పెద్దవంటే ఒకో దాంట్లో రెండు పొట్టేళ్ళను వందవచ్చు. (సొ లర్జ్ దట్ ఇన్ ఈచ్ దె కుడ్ కుక్ హాఫ్ ఎ కౌ) వీటితో బాటు పెద్ద పెద్ద వెండి పాత్రలు, ఇంకా చిన్న బంగారు పాత్రలున్నాయి. ఆ తర్వాత మేము చిన్న మెట్ల వరుస ద్వారా ఇంకో భవనం లోని కెళ్ళాము. ఇది అంతపుర స్త్రీలకు నాట్యం నేర్పే హాలు. ఇది అందమైన శిల్పాలు చెక్కిన స్థంబాలాతో నిర్మించ బడినది. పైకప్పుకు ఏనుగులు, ఇతర వింత జంతువుల చిత్రాలు వేయబడి వున్నవి. స్థంబాల మద్య ఆర్చి కలిగి స్థంబాలపై వివిద రకాల శిల్పాలు చెక్కబడి వున్నాయి. నాట్య కారుల శిల్పాల చేతిలో మద్దెల లాంటి ఒక వాయిద్యమున్నది. ఈ నాట్య శిల్పాలెలా వున్నాయంటే నాట్యం చేస్తూ చివరగా ఏ భంగమలో నాట్యం నిలుపు చేస్తారో ఆ బంగిమలో ఆ శిల్పం వుంది. నాట్య పాఠాలు నేర్చుకునే టప్పుడు నిన్న ఏ బంగిమలో నాట్యం ముగించారో ఈ శిల్పాన్ని చూసుకుని అక్కడినుండి నాట్య ప్రారంబించడానికి ఈ ఏర్పాటు చేయబడినది. ఈ భవనం చివర ఎడం ప్రక్కన స్త్రీల చిత్ర పటాలున్నాయి. నాట్యము నేర్చుకునే ముందు వారి శరీరం నాట్యానికనువుగా మలుచుకొనుటకు వ్యాయామం చేస్తున్న స్త్రీల చిత్రాలున్నాయి. దీని కెదురుగా ఒక ఆసనమున్నది. రాజుగారు ఇక్కడ కూర్చొని నాట్యాన్ని తిలకించేవారు. ఇక్కడి నేల -- గోడలకు బంగారు పూత పూయ బడి వుంది. ఈ మద్యలో ఒక నాట్యకత్తె నాట్యం చివర చూపె బంగిమలో వున్నట్లు బంగారు విగ్రహంమున్నది. ఇది పన్నెండు సంవత్సరాల వయస్సున్న అమ్మయంత వున్నది.

ఇంత కన్న వారు మాకు ఎక్కువగా చూపలేదు. రాణి వాస మందిరాల్లోనికి నపుంసకులు తప్ప ఎవ్వరికి అనుమతి లేదు. ఇక్కడి నుండి మేము లోని కెళ్ళిన ద్వారం ప్రక్కనున్న రెండో ద్వారంగుండా బయటకు వచ్చాం అప్పుడు మేమెంత మందిమి లోనికెళ్ళామో .... మమ్ముల్ని తిరిగి లెక్కించుకున్నారు.


(పుట. 279)16. విజయనాగర సామ్రాజ్యం యొక్క సైనిక బలమెంత?[మార్చు]

రాజు గారి అధీనంలో ఒక మిలియన్ సైన్యం వుంది. అందులో ౩౫,౦౦౦ మంది సైనికులు ఏ క్షణం లోనైన పంపడానికి సిద్దంగా వున్న వారిని తన ఆధీనంలో వుంచుకుంటాడు. నేను ఈ నగరంలో వుండగా ఒక సందర్బంలో సముద్ర తీరంలో యుద్దం చేయడానికి ౫౦ మంది సైన్యాదిపతుల్ని,1,50,,౦౦౦ సైనికుల్ని రాజు గారు పంపారు, సరిహద్దులో ఉన్న ముగ్గురు సామంత రాజులకు, తమ సైనిక శక్తిని ప్రదర్శించా లనుకుంటే రెండు మిలియన్ల సైనికుల్ని యుద్ద భూమికి తరలించ గలరట. అందుచేత ఈ రాజుకు శత్రు భయంక రుడని బిరుదు గలదు. ఇంత సైన్యాన్ని పోషించ డానికి రాజుగారికి ధనం ఎక్కడనుండి వస్తుందని ఎవరికైన సందేహం కలుగుతుంది. ఈ రాజ్యంలో అనేక మంది కోటీశ్వరు లున్నారు. ధనవంతులు, సైన్యాదిపతుల ఆధీనంలొ నగారాలు పల్లెలు వుంటాయి. ఎంతెంత సైన్యాన్ని వారు పోషించ వలసి వుంటుందో రాజు గారు నిర్ణయిస్తాడు. ఈ విదంగ సైన్యాన్ని ఇటువంటి ధనవంతులు, జమీందార్లు రాజుగారి తరుపున పోషిస్తుంటారు. రాజు గారి అవసరార్దం సైన్యం ఎప్పుడూ సిద్దంగా వుంటుంది. అదె విదంగా, రాజుగారు తన ఖజానా నుండి జీతం ఇచ్చే సైనికులు కూడా వుంటారు. ఆ విదంగా రాజుగారి వద్ద 8౦౦ ఏనుగులు, 5౦౦ గుర్రాలు ఎల్లప్పుడు సిద్దంగా వుంటాయి. సామంత రాజులు, జమీందార్లు ప్రతి సంవత్సరం కట్టే కప్పం బహుమతులు చాలా వుంటాయి. అదేవిదంగా దసరా సందర్బంగా కూడ ధనవంతులు రాజు గారికి అధిక మొత్తంలో బహుమతు లిస్తుంటారు. ఈ రాజ్యంలో ఒక పద్దతి ఉంది. ప్రతి రాజు తన ఏలుబడిలో వున్నప్పుడు ఒక పెద్ద ధన రాసిని కూడబెట్టి దాన్ని దాచి పెడ్తాడు. తన తర్వాత రాజ్యాని కొచ్చిన రాజు దాన్ని వాడడు. కనీసం అందులో ఎంత వుందో కూడ చూడడు. అత్యవసర మైతే తప్ప దాన్ని వాడడు. ఆ విదంగా తరతరాలుగా బద్ర పరచిన ధనాగారం చాల వుంది.

(ప్రస్తుతం ఇప్పుడున్న శిదిల హంపి విజయనగర విషేశాలను "హంపి విజయనగర పర్యటన" లొ చూడండి.)

ఇంత వరకు ఫోర్చ గీసు దేశస్తు డయిన "డోమింగో పీస్" అనే యాత్రికుడు సుమారు 1520--1522 ఎ.డి. మద్యలో శ్రీ క్రిష్ణ దేవరాయలు పరిపాలించె కాలంలో విజయ నగరాకి వచ్చి విజయనగర సామ్రాజ్యం అత్త్యున్నత స్థితిలొ ఉన్నప్పుడు ఈ నగరాన్ని ప్రత్యక్ష్యంగా చూసి ఇక్కడి వైభోగానికి ఆచ్యర్యపడి వ్రాసుకున్న విషేషాలను వ్రాసి ఒక నివేదికను వారి రాజుగారికి పంపించాడు. ఆవివరాలను అతని మాటల్లోనె విన్నారు.

  1. ===నూనిజ్ వివరణ===
రెండో భాగము

ఫెర్నావో నూనిజ్" ఇతను 1535--37 ఎ.డి.లో విజయనగారాన్ని సందర్సించాడు. ఆ సమయంలో విజయానగరాన్ని అచ్యుత రాయలు పరిపాలిస్తున్నాడు. నూనిజ్ అనే అతను విజయ నగరాన్ని గురించి రాసిన దాంట్లొ ఎక్కువగా చారిత్రక అంశాలున్నాయి. మనకు కావలసినది అలనాటి ప్రజల జీవన విధానాము, పరిపాలన విధానము కనుక ఆ విషయాలను మాత్రమే తీసుకున్నాను. ఇతను డొమింగో ఫీస్ వ్రాసిన విషయాలను కూడా వ్రాసాడు. వాటిని కొన్నింటిని వదిలి కొన్నింటిని తీసుకున్నాను. విషయం మాత్రం యదాతదంగా వ్రాసాను.

(పుట ౩61...౩62...) విజయనగరంలో శ్రీ క్రిష్ణ దేవరాయలు వయస్సులో వున్నప్పుడు చిన్నా దేవి అనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఆమెతో సరదాకు "నేను రాజు నయ్యాక నిన్ను పేడ్లిచేసుకుని మాహా రాణిని చేస్తాను" అని అన్నాడు. నిజంగానే రాజు అయ్యాడు. కాని అతను తన మాటను మర్చిపోలేదు. ఆమెను పెళ్లాడి మహారాణిని చేసాడు. ఆమెపై తనకున్న ప్రేమకు గుర్తుగా "నాగలాపురము" అనే పట్టణాన్ని కట్టించాడు. అందులో పెద్ద పెద్ద వీదులతో అందమైన భవనాలను నిర్మించాడు. అంతేగాక ప్రముఖులను ఇక్కడ భవనాలను నిర్మించమని ఆదేశించాడు. (ఈ నగరమే నేటి హోస్పేట. ఈ విషయం డొమింగో ఫీస్ చెప్పిన దానికి సరిపోయింది.)

పుట 369.. ఆచ్యుత రాయలు కాలంలో రాజు ఉపయోగించే వస్తువులన్నీ బంగారు, వెండి తో చేసినవే. బేసిన్లు, గిన్నెలు, స్టూళ్లు, జగ్గులు వంటి పాత్రలన్ని బంగారు, వెండి తో చేసినవె. అతని భార్యలు పడుకునే పడకలు వెండి పలకలతొ కప్పబడి వున్నవి. అలాగే రాజు గారి మంచం కాళ్లు బంగారుపువి. మంచం మీద పట్టు బట్ట పైన నాలుగు తలగడలు, అదే విదంగా కాళ్లవద్ద నాలుగు దిండ్లు, అన్ని పట్టు బట్టతొ చేసినవి. ఇతనికి ఐదు వందలమంది భార్యలు. ఇతని మరణా నంతరము వీరందరూ అగ్ని ప్రవేశం చేయవలసిందే. ఇతను ఎప్పుడైనా ప్రయాణమైతే ఇతని వెంబడి సుమారు 25 ----30 మంది భార్యలు వెంబడిస్తారు. అందరికి తలా ఒక పల్లకి వుంది. మహా రాణి పల్లకి మాత్రం పట్టు బట్ట, దాని లో ముత్యాలు కుట్టబడి వున్నాయి. పల్లకి కర్ర బంగారం తో కప్ప బడి ఉంటుంది. రాజు గారు వుండే పల్లకి కుడివైపు వెళ్లుతుంది ఇది బంగారం తో అలంకరించబడి వున్నది.

పుట..371..... రాజు గారి అంతఃపురంలో స్త్రీలు, సేవకులు, నపుంసకులు అందరూ కలిసి సుమారు 5౦౦ మంది వుంటారు. ఇతని భార్యలకు కూడ ఇదే విదంగా సేవకులుంటారు కాని వారందరు ఆడవారే.(పుట 372.) రాజు గారికి నమస్కరించే విదానము. రాజు గారు ప్రతి రోజు ఉదయం పది.... పదకొండు గంటలకు బయటకు వచ్చి తన ఆసనంలో కూర్చోగానే, రాజ ప్రముఖులు, ఇతర అదికారులు ఒక్కొక్కరుగా వచ్చి రాజు గారి ముందు తలవంచి చేతులు జోడించి నమస్కారం చేస్తారు. అప్పుడు వారు ఇలా చెప్తారు... "పలనా పేరుగల నేను... పలనా అధికారి యైన నేను ప్రభువులకు నమస్కారం చేస్తున్నాను". ప్రస్తుతం అచ్యుతరాయలు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. ఇతని గుర్రపు శాలలో ఏడు వందల గుర్రాలున్నాయి. అలాగే నాలుగు వందల ఏనుగులున్నాయి..

(పుట 375..) రాజుగారు బయట ప్రదేశానికి ప్రయాణమైతే తన వెంట కొంత మంది అంతరంగికులని తీసుకెళ్తాడు.. రాజు గారు ఎవ్వరితొ ఏమి మాట్లాడినా ఎవరికి ఏమి హామీ ఇచ్చినా, ఇంకా ఎటువంటి వాగ్దానాలు చేసినా వీరు అన్నింటినీ ఒక పుస్తకంలో రాస్తుంటారు. వీరి మాటలకు చాల గౌరవం ఉంటుంది. కనుక రాజు గారిచ్చిన ఆదేశాలకు ఎటువంటి లిఖిత పూర్వకమైనది వుండదు. వీరు రాసిన పుస్తకం లో చూసుకుని గుర్తుంచు కుంటారు. కాని కొన్ని సందర్బాల్లో లిఖిత పూర్వక మైనది ఇవ్వాల్సివస్తే దాని మీద రాజుగారి ఉంగరం ముద్ర లక్క మీద వేస్తాడు.దాంతో ఆ పత్రానికి హాక్కు లబిస్తుంది. (పుట 375) విజయనగర రాజులు అన్ని రకాల మాంసం, చేపలు, పక్షులను తింటారు. కాని ఆవులను ఎద్దులను వీరు చంపరు, తినరు. వీటిని పూజిస్తారు. మాంసం కొరకు జంతువులను పక్షులను బ్రతి కుండగానె అమ్ముతారు. ఇక్కడ అనేక రకాల పండ్లు, కూడ చాల తక్కువ ధరకే దొరుకును. మార్కెట్టు లో ఒక "ఫర్దావ్" కు పన్నెండు గొర్రెలు కొనవచ్చు. అవే పల్లెలలో పదునాలుగు పదునైదు వస్తాయి. రాజు గారు తాను తాగే నీరు ఒక ప్రత్యేకమైన బావి నుండి తెప్పిస్తారు. ఆ నీటిని ఒక పాత్రలో పోసి మూత పెట్టి దానికి "సీలు" వేసి ఒక నమ్మకస్తు డైన వాని ఆదీనంలో వుంచుతారు.

17. ప్రముకులను గౌరవించే విదానమ[మార్చు]

రాజుగారు ఎవరిపై నన్న ప్రత్యేక గౌరవం చూపాలంటే అతనికి బంగారు పిడి కలిగి.. దానికి వజ్రాల వంటివిలువైన రాళ్లు పొదిగిన తెల్లటి వింజామరను బహూకరిస్తాడు. ఇది అత్త్యున్నత మైన గౌరవం. విజయనగర రాజులు దశరా వుత్సవాల సందర్బంగా దేవి పూజానంతరం పవిత్రమైన రత్న ఖచిత సింహాసనం మీద కూర్చుంటాడు ధర్మ పారాయణుడై ఎల్లప్పుడు సత్యమునే పలుకు రాజులు మాత్రమే ఈ సింహాసానాన్ని అదిష్టించడానికి అర్హులు. అంచేత ప్రస్తుతం రాజ్యం చేస్తున్న రాజు గారు అచ్చ్యుత రాయలవారు అంత ధర్మ బద్దుడు కాదు గనుక సింహాసనం మీద కూర్చొన లేదు. ( శ్రీక్రిష్ణ దేవరాయులు సింహాసనం మీద కూర్చున్నాడని డొమింగో ఫీస్ రాశాడు.)

పుట 379.ఈ దేశ ప్రజలు ప్రతి శని వారము ఉపవాసముంటారు. పగలు గాని రాత్రి గాని ఏమి తినరు. నీళ్లు కూడ త్రాగరు. రెండు లవంగాలు మాత్రం నములుతారు. ఈ రాజ్యంలోని అధికారులు వారు నడుస్తున్నప్పుడు వారి హోదాను బట్టి నాలుగు నుండి పన్నెండు కాగడాలు వారి వెంట తీసుకెళ్లు తారు. రాజు గారి వెంబడి100---150 కాగడాలు వెళ్తాయి. ఎవరికైనా ఏదేని కష్టం కలిగినా వారు దాన్ని రాజు గారికి విన్నవించు కో దలిస్తే వారు నేలపై బోర్లా పడుకొని ఏమికావాలో నని అడుగు నంతవరకు అలా వుండాలి. గుర్రం మీద వెళ్లుతున్నవారు తన రాజు గారికి తన కష్టాన్ని నివేదించాలనుకుంటే... పొడవాటి కర్రకు చెట్టు కొమ్మను కట్టుకొని అరుస్తూ వెళితే అతనికి రాజు గారి దర్శనం లభిస్తుంది. అప్పుడు రాజు గారు తన అధికారి నొకరిని అతని వెంబడి పంపి అతని కోరికను నెరవేర్చమని ఆదేశిస్తాడు. ఒక వేళ ఆ వచ్చిన వ్యక్తి తాను దొంగలచే దోచుకోబడ్డానని చెప్పితె ఆ దొంగతనం ఏ ప్రదేశంలో జరిందో తెలుసుకుని ఆ ప్రదేశపు అధికారి ద్వారా వెంటనే అదొంగను పట్టి దొంగలించ బడిన వాటిని సొంత దారునికి ఇప్పిస్తారు. ఒక వేళా దొంగ దొరకక పోతే ఆ అధికారి స్యంతంగా దొంగలించ బడిన వస్తువుల విలువను తిరిగి అతనికి ఇస్తాడు.

పుట(381.)18. దొంగ తనాల నివారణ ఎలా జరిగేది.[మార్చు]

నగరంలో జరిగిన దొంగ తనాలగురించి.. కొన్ని వివరాలు, అనగా దొంగిలించ బడిన సరకు వివారాలు, దొంగ యొక్క ఆనవాలు చెప్ప గలిగితే వెంటనే మంత్ర గాళ్లను పిలిపించి దొంగ ఆచూకి కనుగొంటారు. ఇటు వంటి మంత్ర గాళ్లు ఈ దేశంలో చాల మంది వున్నారు. అందు చేత ఈ దేశంలో దొంగలు తక్కువ.

==(పుట 382.)..19. అంతఃపుర పరివారము==. రాజుగారి అంతః పురంలో సుమారు 400 మంది స్త్రీ జన సేవికలుంటారు. వీరిలొ సేవకులు సహాయకులు, ద్వార పాలకులు, వంటవారు, నాట్యగత్తెలు, శోది చెప్పెవారు ఇలాంటి వారుంటారు. అంతే గాక రాజుగారికి స్వంతంగా వంట చేయడానికి పది మంది వంటవారు వున్నారు. వంట గది ద్వారం వద్ద నపుంసకులు కాపలా వుంటారు. వీరు ఎవ్వరిని లోనికి అనుమతించరు. రాజుగారి భొజన సమయంలో కొంత మంది స్త్రీలు వచ్చి మూడు కాళ్ల గుండ్రని బల్ల మీద అన్ని సిద్దంచేస్తారు. అది బంగారం తో చేయ బడింది. వంట పాత్రలు కూడ బంగారంతొ చేయ బడినవి. ఈ రాజు ఒకసారి తొడిగిన బట్టలను టోపీలను మరొక్క సారి ధరించడు. ఇవి పట్టు బట్టతో చేసినవై అందులో బంగారు పనితనం కూడ వుంటుంది. విడిచిన బట్టలను ఇంకొకరికి ఇవ్వరు.

20. ఈ రాజ్యంలొ శిక్షలు ఎలా వూండేవి?....[మార్చు]

ఈ రాజ్యంలొ శిక్షలు ఈ విదంగా వుంటాయి. దొంగకి కాలు ... చెయ్యి తీసెయ్యడం. దొంగతనం పెద్దదయితే ..లేక .. మానబంగం వంటి నేరాలకు మరణ శిక్ష. నమ్మక ద్రోహులకు బతికుండగానే కడుపులో ఒక కర్ర గుచ్చి నాలుగు వీదుల కూడలిలో నిలబెడతారు. ఇంకొన్ని శిక్షలు ఈ విదంగా వుంటాయి. ఎనుగులచే తొక్కించడము, వీపుమీద ఒక బండ రాయిని పెట్టి వీదులలొ నిలబెట్టడం వంటివి. నీచ కులస్తు లెవరైనా ఎటువంటి నేరాలు చేసినా నడివీదిలో వారి తల నరకడమే శిక్ష.

21. విజయనగర సామ్రాజ్యం లో సతీ సహగమనము జరుగు విదాన మెట్టిదనగా..(పూట 391.) [మార్చు]

ఈ రాజ్యంలోని ప్రజలందరూ విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తలతో బాటు చితిలో దూకి మరణించుటం వీరి అచారం దీన్ని వీరు గౌరవ ప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త మరణించి నపుడు భార్య బందు వర్గంతో కలిసి రోదిస్తుంది. కానీ ఆ రోధన ఒక అ నిర్నీత స్థాయిని మించితే .. ఆ స్త్రీ తన భర్తతో బాటు సహాగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే అమెను సహగమనానికి పురిగొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి/ సంప్రదాయానికి బంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత మరణించిన వ్యక్తిని చెట్టు కొమ్మలతో చేసిన వేదికపై (ఇది వెదురు కర్రల తో చేసిన పాడె అయివుండును.) పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక గుర్రంపై కూర్చో బెట్ట శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న అన్ని ఆభరణాలు ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి వుంటుంది. చేతిలో అద్దంకూడ వుంటుంది. వెంబడి ఆనేక సంగీత వాయద్యాలు, బాజ బజంత్రీలు రాగా వెనుక బందుజన సముదాయం నడుస్తుంటుంది. వీ రందరూ చాల సంతోషంగా వుంటారు. ఒక వ్యక్తి ఒక వాయద్యాన్ని వాయుస్తూ ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. "నీవు నీ భర్తను చేరడానికి వెళ్లుతున్నావు...." అని..... ఆ స్త్రీ దానికి సమాదానంగా "అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను.." అని పాట ద్వారా తెలుపుతుంది.

(పుట...393...) శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వేదిక (చితి) పై పెడ్తారు. మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తలమీద ఒక నీటితో నిండిన కుండను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక (చితి) చుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంద్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి .. అ కాగడాను శవాన్ని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతొ కలిసి అక్కడ కొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబందించిన కార్య క్రమాలు చేస్తారు. ఆప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆబరాణాలను తీసి తన బందువులైన స్త్రీలకు పంచి ఇస్తుంది. ఆమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖ్యమైన బందువులకు అప్పచెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక ఆమెకు ఒక సాదారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలొ ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టూ తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన, అద్దం, తమలపాకులు, వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్ని తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకిని...నెత్తిన నూనె తో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగా మండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేసిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్త పరుస్తారు. ఈ విదానము చాల ధైర్యంతో కూడుకున్నదే గాక నాకుచాల ఆచ్యర్యాన్ని కలిగించింది. ఈ పద్దతి ఇక్కడి అధికారులకే గాక రాజుకు కూడ వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాలా మంది భార్యలు వుంటే అతని మరణాంతరం వారందరిలా అగ్ని ప్రవేశం చేయవలసిందే. తెలుగు వారికి మాత్రం ఈ ఆచారం లో కొంత మార్పు వుంది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడాతారు గనుక...భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనే భార్య కొరకు ఇంకో స్తానం సిద్ద చేస్తారు. భర్త శవానికి ప్రక్కన భార్య ను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు. అప్పుడు భార్య కూడా మర్తణిస్తుంది.

(పుట 393) 22. బ్రాంహణులు వారి మరణా నంతరం చేసె కార్యక్రామాలు:----[మార్చు]

ఒక బ్రాంహాణుడు రోగ పీడితుడై చావుకు దగ్గరా నున్నప్పుడు అతని గురించి కొన్ని పూజా కార్యాక్రమాలు చేసి దేవున్ని ప్రార్దిస్తారు. అతనికి దాన ధర్మాలు చేయమని భోదిస్తారు. ఈ పూజానంతరం అతనికి శిరోముండనం చేసి వారి పద్దతి ప్రకారం స్నానం చేయిస్తారు. అప్పుడు ఒక ఆవు-- దూడను తీసుకొస్తారు. అక్కడ కొద్ది మంది బ్రాంహణులు మాత్రమే వుంటారు. వారు చాల బీద వారు ---పూట గడవని అతి బీద వారు. ఆవు మెడకు ఒక తలాపాగాను కట్టి ఇంకో కొసను ఆ బ్రాంహణుని చేతికిచ్చి దానిని అనగా ఆవు -- దూడను ఆ పూజా కార్య క్రమాలాను నిర్వ హించిన అ పూజారులకు దానమిప్పిస్తారు. ఆ సందర్బంగా ఆ బ్రంహణుడు తన శక్తి కొలది ఇతర బ్రాంహణులకు దాన ధర్మాలు చేస్తాడు. ఆ తర్వాత ఇందు కొరకు పిలిపించిన ఇతర బ్రంహణులకు అన్నదానం చేస్తాడు. ఈ కార్యక్రమం వలన ఆ రోగపీడితునికి ఆయుష్షు ఉంటే రోగం నయమయి సుఖంగా జీవిస్తాడు, లేనిచో త్వరలోనె మరణిస్తాడు, అని వారి నమ్మకం. ఒక వేళ ఆ బ్రాంహణుడు మరణిస్తే ఆతను మరణించిన ప్రదేశమంతా ఆవు పేడతో అలికి దాని మీద ఆతని శవాన్ని పడుకో బెడతారు. మరణించిన వారు భూమి మీద గాక మంచం మీదనో మారేదాని మీదనో తుదిశ్వాస విడిస్తే ఆతను చాల పాప కర్మలు చేసుంటాడని భావిస్తారు. ఆ మరణించిన వ్యక్తి శవాన్ని అత్తి చెట్టు కర్రలతో చేసిన వేదికపై పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. తర్వాత కొన్ని సుగంద ద్రవ్యాలను చల్లి ఒక కొత్త బట్టను కప్పి పాడె మీద పెడ్తారు. మరణించిన వ్యక్తి దగ్గరి బందువు మొదటగా ఆ పాడిని ఒక ప్రక్కనుండి పైకెత్త తాడు., అప్పుడు మరో ముగ్గురు అతనికి సహాయంగా వచ్చి పాడిని ఎత్తి మోసుకుంటూ శ్మశానానికి వెళతారు. శవం ముందు బ్రాంహణులందరూ పాటలు పాడుతు ముందుకు సాగుతారు. ఆందరి కంటే ముందు మరణించిన బ్రాంహణుడి కొడుకు గాని కొడుకు లేకుంటే తమ్ముడుగాని లేదా దగ్గరి బందువు --- చేతిలో నిప్పుల కుండను తీసుకుని నడుస్తాడు. శ్మశానాని కొచ్చిన వెంటనే-- అతని శక్తానుసారం డబ్బును వెద అల్లుతారు. శవం పూర్తిగా కాలి నంతవరకు వుండి తర్వాత అందరూ దగ్గరలోని చెరువు కెళ్ళి స్తానం చేస్తారు. తల కొరివి పెట్టిన వ్యక్తి తొమ్మిది రాత్రుల పాటు ఏ ప్రదేశంలో ఆ వ్తక్తి మరణించాడో ఆ స్తానంలో నిద్రించాలి. మరణాంతరము తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతా కొందరు పూజారులు వచ్చి... తలకొరివి పెట్టిన వ్యక్తికి శిరో ముండనం చేయిస్తారు. ఈ తొమ్మిది రోజులు బీదసాదలకు అన్న దానం చేసి మరణించిన వ్యక్తికి సంబందించిన బట్టలు, మంచం, ఇతర వస్తువులను కొంత ధనంతో కలిపి బీదలకు దానం చేస్తారు. మరణించిన వ్యక్తి ధనవంతు డైనచో అతని స్తాయిని బట్టి పంట పొలాలు, తోటలు కూడా దానం చేస్తారు. పదో రోజున మరణించిన వ్యక్తిని కాల్చిన చితి ప్రదేశానికి వెళ్లి తలకొరివి పెట్టిన వ్యక్తితో అక్కడున్న చితా బస్మం పై కొన్ని పూజా కార్యక్రమాలు చేయిస్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని ఒక పాత్రలో సేకరించి అక్కడే ఒక గొయ్యి త్రవ్వి అక్కడె పూడ్చి పెడ్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని...ఇక్కడికి చాలా దూరంలోవున్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయడానికి దాన్ని జాగ్రత్తగా కాపాడుతారు. చాల దూరంలోవున్న ఆ పవిత్రనదీ ప్రాంతంలో అతి పెద్ద ఆలయం వుంది. అక్కడికొచ్చే భక్తులు...అక్కడే మరణిస్తే వారు నేరుగా స్వర్గానికి వెళతారని వీరి నమ్మకం. అలాగె మరణించిన వ్యక్తి చితా భస్మాన్ని ఈ పవిత్ర నదిలో కలిపితే అమరణించిన వ్యక్తి కూడ పుణ్య లోకాలకు వెళతాడని కూడ వీరి నమ్మకం. అయినా అక్కడికెళ్లే వారి సంఖ్య చాల తక్కువ. ఎందు కంటే ఆ ప్రదేశం ఇక్కడికి చాలా దూరంలో వుంది. (ఇది కాశి ...... గంగా నది.) మరణించిన వ్యక్తికి సంబందించిన వారసులు పదకొండు రోజులపాటు ఇరవై ఏడు మంది బ్రాంహణులకు, ఇరవై ఒక్క రోజులపాటు ముగ్గురు ఇతరులకు, పన్నెండు రోజుల పాటు ఏడుగురి బ్రాంహణులకు, ఇక ఇరవై ఏడు రోజులపాటు ముగ్గురి బ్రాంహణులకు నెలలో చివరి మూడు రోజులు ముగ్గురు ఇతరులకు అన్న దానం చేయడం వీరి అచారం. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు నెలకొకసారి ముగ్గురి బ్రాంహణులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత నెలకొక సారి తప్ప అన్నదానాలుండవు, కానీ ప్రతి సంవత్స రానికి ఒకసారి మాత్రం అన్నదానం వుంటుంది. మరణించిన సంవత్సరాని కొక సారి ప్రతి యేడు ఆరుగురికి ఆన్నదానం చేయడం వీరి పద్దతి. ఆ ఆరుగురిలో ముగ్గురు దేవతలు, మిగతా ముగ్గురిలో ఒకరు తనతండ్రి, ఒకరు తన తాత మరియు ఇంకొకరు తన ముత్తాత గా వీరు బావిస్తారు. ఒక వేళ ఈ అన్న దానాలు కార్య క్రమం చేయ డానికి శక్తి లేకుంటే ఇతర బ్రంహణులను బిక్షం కోరుతారు. ఈ ఆరుగురికి భోజనానికి ముందు వీరి కాళ్లు కడిగి పూజారులు చెప్పిన ఇతర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

  1. ===అబ్దుర్ రజాక్ ఇవరణ===

యిమ్మడి దేవరాయలనాడు విజయనగరమును పాలించు కాలమున అబ్దుర్ రజాక్ అను పారశీక రాయబారి 1441 - 1444. ప్రాంతములో విజయ నగరమును సందర్శించెను. (మూలం) https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D


విజయనగర రాజవీధులను అబ్దుల్‌రజాక్ ఇట్లు వర్ణించుచున్నాడు.[మార్చు]

"రాజవీథులందిరుప్రక్కలను పుష్పలావికలు పరిమళము గ్రమ్ముకొను నానావిధపుష్పములను విక్రయించు చుందురు. అంగళ్ళవాండ్రు తమ యంగళ్ళముంగిట అందమైన మంచెలు గట్టుకొని అందు తమసరకుల నమ్ముకొను చుందురు. ఇట్లిరు ప్రక్కలను అంగళ్ళు, పుష్పలావికలు స్థలమాక్రమించు కొనినను, ఆశ్వికులు, కాలినడక వారు, యేనుగులు రథములు, శకటములు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచు బోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా నీరాజవీథులున్నవి. ఈవీధులు చాలపొడుగై కనుచూపుమేఱకు వ్యాపించియుండి నేడు మనోజ్ఞమయిన దృశ్యము నొసంగుచున్నవి. ఎచ్చట చూచినను పరిమళ భరతములయిన వివిధజాతుల దివ్య కుసుమములే కానవచ్చు చుండును. అన్ని పుష్పములలో నీదేశీయులకు గులాబి (గొజ్జంగి) పూవులన్న మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరకును. ఇచ్చటి ప్రజలకు పువ్వులనిన బ్రాణము. ఆహారమెంత యావశ్యకమో పూవులంతావశ్యకము. భోజనమైన లేకుండ బోవుదురుగాని స్త్రీపురు షులు పూవులు ముడువకుండ, ధరింపకుండ, నెక్కడకు బోలేరు. ఒక్కొక్క విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక వాడవర్తకులు ఒక్కొకచోట గుమిగూడి జుట్టుగా వ్యాపారము చేసికొందురు, ఏసరకుల వాడ యాసరకులదేగాని యింకొక సరకావాడలో దొరకదు. ఇచ్చటి రత్నవర్తకులు నిర్భయముగా తమసరకులను ఎంతవిలువగల వాటినైనను తమవజ్రవైడూర్య మాణిక్యములను, పచ్చలను, నీలములను, పద్మరాగములను, రత్నములను, మంచి ముత్యములను, పగడములను విచ్చలవిడిగా రాసులక్రింద బోసి నడివీథులందు విక్రయించుకొను చుందురు.

"అత్యంత రామణీయకమై మనోజ్ఞమైన యచ్చోట నగరివాకిట కెదురుగా నున్న నాలుగువీథులందును చక్కని నునుపైన ఱాతికాలువగుండ పరిశుద్ధజలము నగరులోనికి పట్టణము లోనికి నెడతెఱిపిలేక పాఱుచుండును. ఈఱాతికాలువలు పట్టణమునం దంతటను గానుపించును. రాయల సౌధమునకు కుడివైపున మంత్రి శేఖరుని సభాగారమంటపముకలదు.

ఇమ్మడి దేవరాయల పరిపాలన[మార్చు]

ఇమ్మడి దేవరాయల పరిపాలనము శాంతిప్రదమై, యుండినట్లును, ప్రజలు యుద్ధముల వలనగాని, దండయాత్రల వలనగాని, యేయొత్తిడిలేక సుఖముగా నుండిరనియు విశ్వసించుటకు ప్రబల కారణముల నేకములు గన్పట్టుచున్నవి. అన్నిటికంటె పారశీక దేశమునుండి సుల్తానుషారుఖ్ ప్రౌడదేవరాయల కడకు రాయబారిగా, అబ్దుల్‌రజాక్‌ను బంపుట, ప్రధానమైనది. రాయలకీర్తి, దిగంత విశ్రాంతయైన దనుటకును, ఆతడు, మహా పరాక్రమశాలి యనుటకు నాతని తోడి నెయ్యము, దేశాంతరముల నుండురాజన్యు లపేక్షించిరనుటకు నింతకంటె వేఱె కారణమేమి గావలయును? అబ్దుర్ రజాక్ విజయనగరమును సందర్శించుటకు బూర్వము నికోలో కోంటి యని ఇటాలియా వాస్తవ్యుడొకడు, వచ్చియుండెను. ఆతడు ప్రౌడదేవరాయల గూర్చి "యాతడు హిందూదేశములోని నృపాలురందరి కంటెను ఎక్కు బలపరాక్రమ సమనిర్వతుడు" అనివ్రాసి యున్నాడు. నికోలో చేసిన విజయనగర వర్ణనము, మన రజాక్ చేసిన వర్ణనలను ఇంచుమించుగా బోలియుండెను. రాజ్యమంతయు శాంతి ప్రదమై, రాజ్యకాలమంతయు సౌఖ్యావహమై యుండుటచేతనే ప్రజలకు విద్యాగోష్ఠియుండుటకును, సాంఘికా చారములందు సంస్కరణములు చేసుకొనుటకు నవకాశము కలిగినది. ఈతని కాలమున, వడైవీడుసీమ బ్రాహ్మణలు - కర్ణాటాంధ్ర ద్రావిడ లాట దేశీదేశీయులు - నప్పటినుండియు, (క్రీ.శ. 1425) వివాహములందు, కన్యాశుల్కమును దీసుకొను నాచారము మానితిమనియు, వివాహములు, కన్యాదానములుగావున కన్యావిక్రయములుగా జరుగరాదనియు, నొడంబడిక జేసుకొనిరి. ఆకట్టడియందు, కులపెద్దలు వ్రాళ్ళుచేసియుండిరి. ఇమ్మడి దేవరాయల కాలమున, విదేశ వాణిజ్యము చక్కగా సాగుచుండెను. రాయలకు మూడువందల రేవులున్నవని రజాక్ వ్రాసినాడు. కాని అది అతిశయోక్తిగా గన్పట్టుచున్నది. ఆంధ్రదేశమున మోటు పల్లి మొదలుకొని తూర్పుతీరమున కన్యాకుమారి వరకును అచ్చటనుండి, పశ్చమతీరమున గోవ వఱకునుగల సముద్రపుటొడ్డు పట్టణములన్నియు రేవులేయని యెంచుకొన్నచో మున్నూరు రేవు లండుటలో నాశ్చర్యకరమైన దేమియు లేదు. విదేశ వాణిజ్యము విరివిగా సాగుటకై రాయల మంచి కట్టడులు చేసినట్లు గాన వచ్చుచున్నది. దేవరాయల కాలమున, రేవుపట్టణములకు అభయశాసనము వీయబడి, ఎగుమతి దిగుమతి సరకులపై సుంకములు, పూర్వ మర్యాదల ననుసరించి కట్టడలు చేయబడెను. ఆంధ్రదేశమున మోటుపల్లి రేవునందున్న దేవరాయల శాసనమందు, దిగుమతి, యెగుమతి సరకులపై సుంకాలు వివరింపబడి యున్నవి. ఇట్టి శాసనము లింకను ఇతర తావులం దెన్నిగలవో!

రాయలు, ఏనుగుల వేటయందు ఎక్కువ ప్రీతిగలవాడని అబ్దుర్‌రజాక్ చెప్పనమాటలు విశ్వసనీయములుగా గన్పట్టుచున్నవి. రాయలకు, తగినంత శాంతియుండిన గాని, ఏనుగులవేట యొకటి యాచారము చేసుకొనుటకవకాశ ముండదుగదా! అతడు ఏనుగుల వేటాడుట మొదట నెలకొల్పిన కారణమున గాబోలు తన నాణెములపై రాయ గజగండ భేరుండయనియు, గజబేటకారయనియు, బిరుదులు వ్రాయుంచు కొన్నాడు. దేవరాయలు, మహాసామ్రాజ్యమునుని నిర్మింప గలుగుటయేగాక దానికి సుస్థిరత్వమును సమకూర్చినగాని, గజకీట విలాసార్థముగా జేయుచుండుటకు తగిన యవకాశముండదు.

ఇమ్మడి దేవరాయలు కవితాప్రియుడు. రసజ్ఞుడు. విశేషించి కవియు గూడనై యుండి, తనయాస్థానమున బెక్కుమంది కవులను పండితులను ఆశ్రయమిచ్చెను. శ్రీనాధుడతని ముత్యాలశాలయందే క్రియాశక్తి ఒడయల సమక్షమున, గౌడడిండిమభట్ట కవి సార్వభౌముని యోడించి, యాతని కంచుడక్కను బగులగొట్టించి, కనకాభిషేకమును బడసినాడు. ఈతనికాలపు పరిస్థితులు శ్రీనాధుని చాటువుల కలసి తెలియ వచ్చుచున్నవి. దేవరాయలు సంస్కృత భాషయందు, కవియైయుండి, "మహానాటక సుధానిధి" యనునొక చంపూ కావ్యమును రచించి, అందు శ్రీరాముని చరిత్రము వర్ణించినాడు.

రాయలసోదరు డొకడు, రాయలపై కుట్రలుబన్ని, కౄరముగ వధింపనెంచినటుల, అబ్దుర్‌రజాక్ వ్రాసిన వ్రాతలు నిజము గావచ్చును. ఆదారుణకృత్యమును దలపెట్టిగ సోదరుడెవడో యింతవఱకు దెలియరాదు. ఆకుట్రలో, తగిలిన గాయములవలన రాయలు, వ్రణపీడితుడై యారుమాసములైన గతించక ముందె (1445 నందు) మరణించెను. ఈతని మరణమునకు బూర్వమె మన రాయబారి విజయనగరము నుండి, స్వదేశమునకు బయలుదేరినట్లు యాతడు వ్రాసిన వానినిబట్టి తెలియుచున్నది.

దేవరాయలు తన్ను జంపుటకు జరిగిన యాప్రయత్నమునందు బాల్గొన్నవారందఱిని చిత్రవధపాలుచేసెను. విజయనగరమిట్టి దురవస్థలో నుండగా భామినీసుల్తానగు రెండవఅల్లా యుద్దీను డీసమాచారము నంతయుగూడ చారులవలన నాకర్ణించి, ధూరుడై యేడులక్షల దీనారములు కప్పము బంపవలసినదనియు, లేకున్న రాజ్యముపై దండెత్తి రాగలననియు వర్తమానమంపెను. రాయలా బెదరింపులకు జంకక, సైన్యమును గూర్చుకుని భామినీ రాజ్యముపై దండెత్తిబోయి మద్దకల్లు కోటనుగొట్టి రాచూరు, వెంగాపురపుకోటలను సాధించి, సాగరు బిజాపురము వఱకును గల తురుష్క రాజ్యమును గొల్లవెట్టుచు దేశమునల్లకల్లోలము చేసివైచెను. ఆయుద్ధములో మహమ్మదీయులకు విశేషముగా బ్రాణనష్టము సంభవించెననియు తుదకొండొరులకు హానికలుగజేసుకొనకుండ సంధిచేసుకొని యెవరిరాజ్యములకువారు వెడలిపోయిరని ఫెరిష్ టావ్రాయుచున్నాడు; గాని యది నిజమని విశ్వసింపజాలము. అబ్దుర్ రజాక్, ఆసమయమున, దేవరాయల యాస్థానమునందుండిన వాడగుటచే, నతడు దేవరాయల బ్రాహ్మణ మహాప్రధాని కలబరిగె రాజ్యముపై దండెత్తి, తురుష్కసేనలను జయించి విజయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చుచు, కొందఱి దురదృష్టవంతులగు వీరులను వెంటబెట్టుకొని వచ్చినాడని వ్రాసినది, యదార్థమని యొప్పుకొనక తప్పదు.

దేవరాయని సమకాలీనులలో, రాజమహేంద్రవరము రాజధానిగా, పూర్వాంధ్రదేశమును చిల్కసముద్రము పత్యంతమునేలిన అల్లాడ వీరారెడ్డి, వేమారెడ్లు, మిక్కిలి ప్రఖ్యాంతిగాంచినవారు. వారి యాస్థానమునందే, కవిసార్వభౌముడగు శ్రీనాథుడు తనకౌమార దశనంతయు, గడపి యుండెను. ఈ రెడ్లకును, భామినీ సుల్తానులకును గల స్నేహమువలన, కర్ణాట భూపాలునకు వీరు ప్రబలుశత్రువులుగావలసివచ్చెను.

మన అబ్దుర్ రజాక్, నికోలోకొంటి, విజయనగరమును సందర్శించి పోయిన ఇరువది సంవత్సరములకు పారశీక రాయబారిగా నేతెంచి యుండెను. ఆతడు రాయబారమునకై క్రీ.శ. 1442 వ సంవత్సరము జనవరి 13 వ తేదిని బయలుదేరి ఎట్లో, పడరాని పాట్లుపడి ఆసంవత్సరము నవంబరు మాసాదిని కళ్ళికోట రేవును, జేరగల్గెను. కాని కళ్ళికోటలో నాతడు 1443 వ సంవత్సరము ఏప్రిల్ మాసాదివఱకుండి పోవలసివచ్చెను. అంతట రాయలచే నాహ్వానింపబడి, కళ్ళికోటనుండి బయలుదేరి ఏప్రిల్ మాసాంతమున కచ్చటికిజేరి యది మొదలుకొని డిశెంబరు 5 వ తేది వఱకును విజయనగరము నందుండెను. ఈతడు మహర్నవమి యుత్సవములని, వర్ణించినాడుగాని యాతని వర్ణనలుబట్టి ఆతడు జూచినది, వర్ణించినది, నవరాత్రియుత్సవము లగునోకాదో యని సందియము గలు గుచున్నది. ఆతడు త్రిరాత్రయుత్సవములనే వర్ణించి మహర్నవమి యుత్సవములని జెప్పినాడు. ఆతడు పొరబడి యుండవచ్చును లేదా యీతడు వ్రాసిన చరిత్రలో కొంతభాగము శిధిలముకాగా శేషించిన దానిని సంస్కరించి పూరించినవారు పొరబడియుందురు. అబ్దుర్ రజాక్ రాయల పరిపాలనావసానదశయందుండి, విజయనగర వైభవమునుకన్నులార గాంచి, వర్ణించిన యదృష్టవంతుడు. మన కందువలన చిరస్మరణీయుడు.

వేశ్య వాటికలు[మార్చు]

"టంకసాల కెదురుగా, కటక పాలుని, కచ్చేరి యున్నది. ఆతని క్రింద ఆనగరక్షణమునకై పండ్రెండు వేలమంది పడికావలి వాండ్రు గలరు. వారికి జీతము క్రింద ప్రతిదినమును మనిషి కొకపణము చొప్పున వేశ్య వాటికల వలన పండ్రెండు వేల పణముల సుంకము వసూలు చేయ బడుచుండును. వేశ్యవాటిక యందలి, వెలయాండ్ర హర్మ్య, సౌధముల విభ్రమ వైభవ సంపదలు, అవ్వీటి విలాసనీతతుల సౌందర్యము మొల్కలేనగవుతో ముద్దుగురియు చున్నవారి నెమ్మోములు, వారి యొయ్యారపు నడకలు, తళుకులు ఎంతటివానినైన వలపించువారి నేర్పరితనపు మినుకులు, మోహనాస్పదములయిన వారి చూపులు ఆహా! హా! వర్ణింపనాకు శక్యముగాదు. వర్ణింప మొదలు వెట్టిన నాకుకూడ మనసు చలించును గావున నింతటితో వారవనితుల విలాసములు వర్ణింప విరమింతును.

"వేశ్యవాటికనుగూర్చి యొకమాట మాత్రము చెప్పక తప్పదు. టంకసాల వెనుక నించుమించుగా నిరువదిగజముల వెడల్పును మూడువందల గజముల పొడవును గల యొక వీధిగలదు. ఆవీథి కిరుప్రక్కలను చక్కని పూబొదరిండ్లతో నిండిన ముంగిట వాకిళ్ళుగల శోభనగృహములు బారులు తీర్చి యున్నవి. ఆ ప్రాంగణములందు చంద్రకాంతశిలానిర్చితములయిన వేదికలు వరుసగా గలవు. ఆ వేదికలకువెనుక, మేడ గోడలపై సింహములు, పులులు, చిరుతపులులు, ఏనుగులు మున్నగు వన్యమృగము లనేకములు జీవము లుట్టిపనినట్టు చిత్రింపబడియున్నవి. అపరాహ్ణమున, ఎండవేడిమి యించుక తగ్గుచుండువేళ నీవారవిలాసినులు చక్కగా నలంకరింపబడిన తమయిండ్ల ప్రాంగణములందున్న చంద్రకాంతశిలావేదికలపై తివాసులమీదను, సోఫాలమీదను, విలాసముగ, హొయలు మీఱి చేటీజనముతో సుఖొపవిష్టులయి, యుందురు. ప్రతి వెలపడుచును ఒడలంతయు, నవరత్నఖచిత మూల్యాభరణములతో, మంచిముత్తెముల హారములతో కన్నులకు మిఱుమిట్లుగొల్పు చక్కదనముతో రంగురంగుల చీరెలుకట్టి యలకరించుకొని, చూచువారల హృదయములను జూఱగొను చుండును. అచ్చటివారందఱు, పదియాఱ్వన్నె కుందనపు శలాకలవలెనుండు నెఱజవ్వనపు సొగసుకత్తెలే! ఒక్కొక్క పడుపుటింటికి ఇద్దరు ముగ్గురు దాసీలుందురు. వారు తమ యజమాను రాండ్రకడ నిలువబడి, మార్గమున బోవువిట కాండ్రను తమనేర్పఱితన ముట్టిపడునట్లు, వెల్లాటకత్తెల సౌందర్య సముద్రములో ముంచివేయ బ్రయత్నించు చుందురు. ఆవీథిని మన్మధుడు తన చెఱకువింటిని, సంధించి, శరంపరలు గ్రుమ్మరించుచు రేబవలు సంచరించుచు యప్సరసలను బోలిన ఆకాంతల వలలోవిరహులగు వారిని బడద్రోయుచుండును. వెల యాండ్ర పొత్తుగూడి సుఖింపగోరువా డీవీధినిబోయి, తన యిచ్చవచ్చిన తరుణిని గోరుకొని బడయవచ్చును. వేశ్యాగృహములందు పరిచారికలు, దాసీలు, మిక్కిలి జాగరూకులయి యుందురు. పడపుటిల్లాండ్రకై వచ్చిన విటులసొ త్తేదయిన నొకగ్రుడ్డిగవ్వైన పోయినను పరిచారికల ప్రాణము మీదికి వచ్చును. వేంటనే వారు గృహమునుండి వెడలగొట్టబడుదురు. ఈనగరపు ఏడుప్రహరీల నడుమ లెక్కకుమించిన వేశ్యాగృహములున్నవి. ఈ వేశ్యలవలన రాబట్టబడిన పండ్రెండువేల పణము లనుదినమును నగరు కావలివాండ్ర జీతబత్తెములకై వినియోగింపబడును Aandhra deishamu videisha yaatrikulu.pdf


  1. ===పుట 402) 23. 14 వ శతాబ్దంలో ధక్కన్ సామ్రాజ్యలలో వుండిన సంపద ఎంత?===

నాల్గవ భాగము

క్రీ.శ. 1310 వ సంవత్సరంలో ఢిల్లీలో అల్లాయుద్దిన్ ఖిల్జీ పరిపాలన కాలంలో మాలిక్ కాఫర్ ధక్కన్, మలబార్ తీర ప్రాంతం, మైసూర్ సామ్రాజ్యాల మీది దోపిడి యాత్రలు జరిపి.... అనేక హిందూ దేవాలయాలను కొల్లగొట్టి, అత్యధిక ధనకనక రాసులను ఢిల్లీకి తీసుక వచ్చాడని చెప్పబడింది. ఫిరిష్టా అనే చారిత్రిక కారుడు చెప్పినదాని ప్రకారము.... హిందు దేవాలయాలలోని బంగారు విగ్రహాలు, రత్న ఖతిచమైన అనేక బంగారు వస్తువులను కొల్లగొట్టి ఆధన ,కనక వస్తు సంపదను 312 ఏనుగులు, 20 వేల గుర్రాలపై అనేక పెట్టలలో 96 వేల మణుగుల బంగారాన్ని ఢిల్లీకి త్రలించాడు. ఆ సంపదను లెక్కించాలని చూడగా... చాల కష్టమైంది. ఎందుకంటే భారత దేశంలో అనేక రాజ్యాలలో మణుగు అనే దానికి వివిద రకాల పద్దతులున్నాయి. తిరువాన్కూరు లో ఒక మణుగు కు 10 పౌండ్లు, అహమద్ నగర్ లో ఒక మణుగుకు 163 1/4 పౌండ్లు, మద్రాసులో ఒక మణుగుకు 25 పౌండ్లు, బొంబాయిలో ఒక మణుగుకు 28 పౌండ్లు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్దతి వున్నది. హాకిన్సు అనే అతను క్రీ.శ. 1610 వ సంవత్సరంలో 55 పౌండ్లు ఒక మణుగు అన్నాడు. మిడిల్టన్ అనే అతను క్రీ.శ. 1611వ సంవత్సరంలో 33 పౌండ్లు అని అన్నాడు. పరిస్టా అనే అతని లెక్క ప్రకారం తీసుకున్నా..... మాలిక్ కాఫర్ కొల్లగొట్టిన హిందూ దేవాలయాలోని సంపద 96,000 మణుగులు..... అనగా 1,56,72,000 పౌండ్లగా తేలుతుంది. ఇదంతా తిరువాన్కూరు మణుగును లెక్కలోకి తీసుకుంటే బంగారం బరువు 2,400,000 పౌండ్లు అవుతుంది.

దీన్ని మనం లెక్కలోకి తీసుకున్నా .... తీసుకోక పోయినా ఒక్కటి మాత్రం నిజం. హిందు దేవాలయాలు అత్యధిక ధన సంపదతో తుల తూగాయనె నిజం తెలుస్తున్నది. హిందూ రాజులు తమ ధన రాసులన్ని ఏ ఏటికాఏడు పెంపొందించు కుంటూనె వుండేవారు. ఆలయ పూజారులు, బహుమానాలు, తమ వేతనాలను ప్రజల నుండే పొందేవారు. రాజులు, పెద్ద వ్వపార వేత్తలు, భూస్వాములు, మొదలగు ఉన్నత వర్గంవారు పోటా పోటీగా తాము నమ్ముకున్న దేవాలయాలకు అధిక మొత్తంలో ధన రాసులను సమర్పించుకునే వారు. ఇది తర తరలుగా జరుగుతున్న పద్దతే..... అలాంటప్పుడు దేవాలయాలు అధిక సంపదతో తుల గూఉతున్నాయని చెప్పడంలో ఆచ్చర్య మేమున్నది. కొలినెల్ డౌ అనే చారిత్రిక కారుడు పిరిస్తా' రచనలను అనువదిస్తూ....... మాలిక్ కాపర్ కొల్లగొట్టిన ధన సంపద ఇంగ్లీషు డబ్బు ప్రకారం వంద మిలియన్ల స్టెర్లింగులుంటుందన్నాడు. ఇది ఆగ్రందంలోని విషయం క్లుప్తంగా....

                                             000---000

అంతే గాక......... ఏ రకంగా చూసినా మాలిక్ కాఫర్ హిందు దేవాలయాలలోకొల్లగొట్టిన ధన కనక సంపద ఎంతో వూహిచడానికి కూడ అంతు పట్టదు. ఆయా ఆలయాలలో తర తరాలుగా దాచి పెట్టిన సంపద 'ఇంత' అని దాచి పెట్టిన వారికే తెలియదు. అలా చూసుకోక పోవడము వారి సంప్రాదాయం. డొమింగో ఫీస్... విజయనగర రాజాంత:పురాన్ని చూస్తూ ఇలా అన్నాడు.... అదొక పెద్ద గది. దానికి తాళం వేసున్నది. వీరు చెప్పిందాని ప్రకారం .. ఆ గదిలో జారుగారు పూర్వీకుల నుండి అందులో సంపదను దాచి పెడుతారు. అత్యవసర పరిషితిలో తప్ప దాన్ని బయటకు తీయరు. కనీసం అందులో ఎంత సంపద వున్నదో నని కూడ చూడరు అని అన్నాడు. అదే పద్దతి అలయాల్లోను రాజ మందిరాల్లోను కొన సాగి వుంటుందనె దాంట్లో అనుమానం అక్కర్లేదు.

అదియునుగాక నిన్న మొన్న మన కళ్లముందు కనిపించిన తిరువాన్కూరు లో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ఆరు గదులలో బయట పడిన అత్యధిక ధన సంపద చూసి యావత్ ప్రపంచమే దిగ్బ్రాంతి చెందింది. అతి ముఖ్యమైన పెద్దదైన మరొక గదిని తెరవకుండానె అప్పటికే బయటపడిన ధన కనక సంపద ప్రపంచంలోనే అత్యధిక మొత్తమని తేల్చి చెప్పేశారు. వాటి సాధారణ విలువ లక్షకోట్లకు పైమాటే నని చెప్పారు. మరి ఇంకో అతి ముఖ్యమైన గది తెరవాల్సి వున్నది. మరి ఆగదిలోని సంపద కూడ కలుపు కుంటే....... అక్కడ లబించిన వింత వింత బంగారు వస్తువులు చూసిన వారు ఆచ్యర్యపోయారు. బంగారు విగ్రహాలు, బంగారు కొబ్బరి కాయలు, అనేక వింత వింత బంగారు వస్తువులు..... ఇలాఎన్నో.... నెపోలియన్ కాలం నాటి నాణేలు కూడ వున్నాయంటే వారెంత కాలంనుండి ఆ ధన సంపదను కూడ బెడుతున్నారో అర్థం అవుతుంది. తర తరాలుగా కూడ బెడుతున్న ఆ ధన సంపదను ఎవరూ లెక్కించిన పాపన పోలేదు. అలా కూడ బెట్టిన వారికి కూడ అక్కడ ఎంత ధన సంపద వున్నదో తెలియదు అనడంలో వింతేమున్నది. ఆయా రాజులు తమ అరాజ మందిరాలలో దాచిన తమ స్వంత సంపదను కూడ ఎంత వుందో కూడ చూసు కోరంటే..... ఇక దేవాలయాలలో దాచిన సంపద దేవుని సంపద గాన దాన్ని లెక్కించాలనె పాపపు పనికి ఒడిగట్టతారా?. కొలెనల్ డౌ చెప్పినదానికి అనగా మాలిక్ కాఫర్ 96,000 మణుగుల బంగారాన్ని డిల్లీకి తరలించాడు అని అన్నమాట చాల తక్కువ అని అనిపించక పోదు.