యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/తులసీదళం

Wikibooks నుండి

తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష కట్టిన కొందరి కుతంత్రం వల్ల ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తి ప్రయోగం చేస్తారు. కాద్రా అనే మాంత్రికుడు ఇందుకు కారణం. ఈ ప్రయోగంతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆ పాప రోజురోజుకూ మరణానికి దగ్గరవుతుంది. ఆ బిడ్డను రక్షించుకొనే క్రమంలో నలుగురు మనుషుల ప్రయత్నం ఇందులో ప్రధాన కథ. ఇస్మాయిల్ అనే సాధకుడు చేతబడికి విరుగుబడి చేయిస్తాడు. ఆధునిక ధృక్పథం కల తులసి తండ్రి చేతబడిని నమ్మి అందుకు విరుగుడు చేయించడానికి తంటాలు పడుతాడు. వారి శ్రేయోభిలాషి అబ్రకదబ్ర (అబ్బూరి కేదారేశ్వరరావు) అతనికి సాయపడతాడు. సంప్రదాయాలను నమ్మే తులసి తల్లి, క్రమంగా వైజ్ఞానిక ధృక్పథంలో ఆలోచిస్తుంది.