యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/అంతర్ముఖం

Wikibooks నుండి

మంచానపడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి మనోభావాల్ని బయటకు తెలియజేస్తూ కథ ప్రారంభమౌతుంది. కొద్దిసేపటికి చనిపోయి స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ దేవుడితో వాదించి అసలు మరణమే లేకుండా వరం కోరుకుంటాడు. కానీ తన పొరపాటు వల్ల బ్రతికినంత కాలం అలా మంచాన పడిపోవాల్సి వస్తుంది. తను ఎంతో ప్రేమించిన కుటుంబ సభ్యులు రానూ తన గురించి పట్టించుకోవడం మానేస్తారు. ముందుగా సెంటిమెంట్లంటే పడని కథానాయకుడిని ప్రేమకు బానిసను చేసిన కథను గుర్తు చేసుకుంటాడు. తన మీద ప్రేమతో జీవితాన్నే త్యాగం చేసిన ప్రణవి గుర్తుకు వస్తుంది. అంతవరకూ తను చనిపోతానని ఎదురు చూసిన కుటుంబ సభ్యులు చివరకి అతన్ని ఓ ప్రభుత్వాసుపత్రిలో పడేస్తారు. అక్కడి నుంచి అతన్ని బయటికి లాగేస్తారు. దీనాతి దీనమైన పరిస్థితుల మధ్య దేవుణ్ణి తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకుని మరణాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటాడు.