మోతీచూర్ లడ్డు
స్వరూపం
కావలసిన పదార్థాలు
[మార్చు]- సెనగపిండి: రెండున్నర కప్పులు
- పాలు: అరలీటరు
- యాలకులపొడి: అరటీస్పూను
- నెయ్యి: మూడు కప్పులు
పాకం కోసం
[మార్చు]- పంచదార: రెండున్నర కప్పులు,
- మంచినీళ్లు: మూడున్నర కప్పులు
- పాలు: 2 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం
[మార్చు]- ముందుగా మందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు, పాలు పోసి మరిగించాలి.
- ఓ పొంగు వచ్చిన తరువాత వడబోసి మళ్లీ స్టవ్‌మీద పెట్టి మరో ఐదారునిమిషాలు మరిగించాలి.
- ఇప్పుడు రంగు కూడా కలిపి కాస్త చిక్కబడేవరకూ మరిగించాలి. కానీ తీగపాకం మాత్రం రాకుండా దించి పక్కన ఉంచాలి.
బూందీ తయారీ
[మార్చు]- పిండిలో పాలు, యాలకులపొడి వేసి జారుగా కలపాలి.
- బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి మరిగిన తరువాత చిల్లుల గరిటెమీద పిండిని వేసి బూందీ తీయాలి.
- బూందీ వేగిన తరువాత తీసి పాకంలో వేసి కలపాలి. ఇలాగే వెుత్తం వేసి బూందీపాకాన్ని నెయ్యిరాసిన వెడల్పాటి పళ్ళెంలో పోయాలి.
- తరువాత కాస్త గోరువెచ్చని నీళ్లు చల్లి మూతపెట్టి ఐదునిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చేతులకు తడి అద్దుకుంటూ ఉండలు చుట్టాలి.