మీల్ మేకర్ మంచూరియా
మీల్ మేకర్ మంచూరియా తయారు చేయు విధానము
తయారికి కావలసిన పదార్థాలు
[మార్చు]మీల్‌మేకర్ - 200 గ్రాములు, ఉల్లిపాయలు - 10(గా, క్యారెట్ -10(గా, బఠాణీలు - 10(గా, అల్లం వెల్లుల్లి - 10(గా, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు-10, కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు, అజినోమోటో - ఒక స్పూను, సోయా సాస్ - నాలుగు స్పూన్లు, వెనిగర్ - నాలుగు స్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు -రుచికి సరిపడా, మైదా - రెండు స్పూన్లు, రెడ్ కలర్ - ఒక స్పూన్
తయారు చేసేవిధానం
[మార్చు]ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేసి వేయించుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా తయారు.
వనరులు
[మార్చు]http://telugutaruni.weebly.com/15/category/aaedba652c/1.html