మినపపిండి వడియాలు
Appearance
మినప ఒడియాలు
[మార్చు]- కావలసిన పదార్థాలు
- మినపగుళ్ళు - 1 కేజీ
- పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ
- ఉప్పు - తగినంత
- ఇంగువ - 1 స్పూన్
- ఇంగువ : కొద్దిగా
- తయారీ విధానం
- ముందురోజు రాత్రి మినపగుళ్ళను నీళ్ళలో నానపెట్టుకోవాలి.
- మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
- మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
- మిరపకాయల పేస్టుని, ఇంగువను మినపపిండిలో వేసి బాగా కలుపుకొవాలి.
- ఒక తడిపిన పాత చీర మీద కానీ, ప్లాస్టిక్ పేపరు మీద కాని చిన్న చిన్నవి గా ఒడియాలు పెట్టుకొని 2 రోజులు ఎండలో ఉంచితే మినప ఒడియాలు తయారవుతాయి..
మినప పిండి వడియాలు 1
[మార్చు]- కావలసినవి:
- మినప్పప్పు - 250 గ్రా;
- పచ్చిమిర్చి - 10;
- అల్లం - చిన్నముక్క;
- జీలకర్ర - టేబుల్‌స్పూన్;
- ఉప్పు,
- ఇంగువ - తగినంత
- తయారుచేసే విధానం:
- మినప్పప్పును ముందురోజు నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే గ్రైండర్‌లోవేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- పచ్చిమిర్చి, జీలకర్ర అల్లం, ఉప్పు, మూడిటినీ మిక్సీలో వేసి పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోమారు తిప్పాలి.
- ప్లాస్టిక్ పేపర్ మీద కాని, పల్చటి తడి వస్త్రం మీద కానీ ఈ పిండిని చిన్నచిన్న వడియాలుగా పెట్టాలి.
- ఎండలో నాలుగు రోజులు ఎండాక తీసేయాలి