పాలకూర పకోడీ
స్వరూపం
పాలకూర పకోడీ ఒక రకమైన పకోడీ.
కావలసిన పదార్థాలు
[మార్చు]- పాలకూర తరిగినది - మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
- శెనగ పిండి - ఒకటిన్నర కప్పు
- బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
- కారం పొడి - ఒక టీస్పూన్
- జీలకర్ర పొడి - అరటీస్పూన్
- అల్లం - అరటీస్పూన్
- పుదీనా - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా కట్ చేసుకోవాలి)
- కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
- నూనె - వేయించుకోవడానికి సరిపడా
- ఉప్పు - తగినంత
- వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి
[మార్చు]- ఒక గిన్నెలో శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
- తరువాత అందులో తరిగిన పాల కూర ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టు కోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ తయారైనట్టే.
- దీనిని వేడి వేడిగా తింటే చాల రుచిగా వుంటుండి.
- నిలువ వుంచు కోవడానికి, గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి
.
వనరులు
[మార్చు]http://telugutaruni.weebly.com/15/category/c6c48cc72b/1.html[permanent dead link]