Jump to content

దమ్ కీ బిర్యాని

Wikibooks నుండి

దమ్‌కా బిర్యాని కావలసిన పదార్థాలు:

[మార్చు]
  1. చికెన్‌ - ఒక కిలో
  2. బాస్మతి బియ్యం - ఒక కిలో
  3. గరం మసాల - రెండు టీ స్పూన్లు
  4. అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
  5. పెరుగు - ఒక కప్పు
  6. ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
  7. పచ్చి మిరపకాయలు - ఐదు
  8. ఎండు మిరపకాయలు - ఆరు
  9. పసుపు - చిటికెడు
  10. కొత్తిమీర - ఒక కట్ట
  11. ఉప్పు - తగినంత
  12. నూనె - సరిపడా

తయారు చేసే విధానం:

[మార్చు]

ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టు కోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద రైస్ సగం మాత్రమే ఉడికించాలి. పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్రలో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి. పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్‌ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్‌ చేసుకోవచ్చు.