తెవికీ ఉపకరణాలు/అనువాద పరికరం
ఇతర భారతీయ భాషలు, విదేశీ భాషలలో ఉన్న ఉపయోగకరమైన వ్యాసాలు తెలుగు భాషలో (లేదా తమ తమ మాతృభాషలో)కి తర్జుమా చేయడానికి మీడియావికి ఒక అనువాద పరికరాన్ని రూపొందించింది. గూగుల్ వంటి అనువాద యంత్రాలు బయట అందుబాటులో ఉన్నప్పటికీ యాంత్రికానువాద సౌకర్యంతో పాటు ఇతర భాషా వ్యాసం (ఉదా. ఆంగ్లం) లోని వికీపీడియా విశిష్టతలను, హంగులను కూడా అనువాద వ్యాసం లోకి చేరవేస్తుంది. వికీపీడియాకు కొత్త వారు కూడా ఈ పరికరాన్ని వాడొచ్చు. కనీస అనుభవం అంటూ పరిమితి ఏమీ లేదు. అయితే వికీ పద్ధతులు, వ్యాసానికి కావలసిన హంగులు తెలుసుకునేందుకు కొన్నాళ్ళు నేరుగా వ్యాసంలో దిద్దుబాట్లు చేస్తే మంచిది.
వ్యాసాల ఎంపిక
[మార్చు]తెవికీ చదువరులకు ఆసక్తిగల వ్యాసాలలో ఎంపిక చేయండి. ఎక్కువ వీక్షణలున్న తెలుగు వికీ వ్యాసాలలో ఎర్ర లింకులతో వున్నవి, లేక, గూగుల్ శోధన ట్రెండ్స్ లో అధిక ర్యాంకులలో వుండేవాటిని అనువదిస్తే మీ అనువాదం మరింత ఉపయోగంగా వుంటుంది. అలాగే శాస్త్ర, సాంకేతిక విషయాలను తెలుగులో వ్యక్తీకరించడంపై కొంత అనుభవం వుంటేనే (నేరుగా వికీలోగాని ఇతర మాధ్యమాలలో కొన్ని వ్యాసాలు వ్రాసివుంటేనే) ఆ విషయాలను అనువదించే ప్రయత్నం చెయ్యవచ్చు. మూలంగా ఏ వికీనైనా (భారతీయ భాషలతో సహా) ఎంచుకోవచ్చు. ఆంగ్లమైతే సాధారణ ఇంగ్లీషు(en.wikipedia.org), సులభమైన ఇంగ్లీషు( simple.wikipedia.org) లో ఏదైనా వాడవచ్చు. అనువాదానికి సులభమైన ఇంగ్లీషు(సింపుల్ ఇంగ్లీషు) వికీవ్యాసం మెరుగుగావుండవచ్చు. యంత్ర అనువాదం కూడా మెరుగుగా వుండవచ్చు.
అనువాద యంత్రం
[మార్చు]వికీపీడీయాలో యాంత్రికానువాద సౌకర్యంతో అంతర్గతంగా నిర్మితమైన అనువాద పరికరం ఇది. విషయ అనువాద ఉపకరణం (Content Translation tool) 2014 జనవరి లో ప్రారంభమైంది. మెరుగైన ఉపకరణం 2018 లో విడుదలైంది. ఈ పరికరం మాతృభాషలో వ్యాసరచన పనిని కొంత సులభతరం చేస్తుంది. అనువాద పరికరం వాడితే, మరింత వేగంగా అనువాదాలు చెయ్యవచ్చు. దాని వలన కింది ఉపయోగాలున్నాయి.
దీంట్లో గూగుల్, యాండెక్స్, మింట్ అను మూడు అనువాద యంత్రాలున్నాయి. వాటిలో ఏ యంత్రాన్నైనా వాడి అనువాదం చెయ్యవచ్చు. వ్యాసంలో ఒక్కొక్క పేరాకు ఒక్కో యంత్రాన్ని ఎంపిక చేయవచ్చు. లేదా అప్రమేయం (డిఫాల్ట్) గా ఒక యంత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఈ ఉపకరణం విజువల్ ఎడిటర్ పై ఆధారపడి పనిచేస్తుంది. పరికరంలో మూల వ్యాసం ఎడమ వైపు అనువాదం (లోడ్) ఏర్పడుతుంటుంది, ఈ యాంత్రిక అనువాదమును సహజముగా మార్చి సవరించాలి. ఈ సవరణలు ఆటోమేటిక్ గా బధ్రపరచబడుతాయి. యాంత్రిక అనువాద శాతాన్ని ఎప్పటికప్పుడు పరికరం తెలియచేస్తుంది. 75% శాతం వరకు యాంత్రిక అనువాదాన్ని అనుమతిస్తుంది. పాఠ్యము తృప్తిగా అనిపించిన తరువాత ప్రచురించవచ్చు.
- ఆ పేజీలో "కొత్త అనువాదం" అనే లింకు నొక్కండి.
- అప్పుడు వచ్చే పేజీలో మూలం భాషను ఎంచుకుని అనువదించలచిన పేజీ పేరును ఇవ్వండి
- అనువాదం ఏ భాష లోకి చెయ్యబోతున్నారో దాన్ని (తెలుగును) ఎంచుకోండి.
ఇక "అనువాదం మొదలుపెట్టండి" అను బొత్తాన్ని నొక్కండి. అప్పుడు అనువాదం పేజీ తెరుచుకుంటుంది.
- అనువాదం ప్యానెల్‌లో ఎడమ సగంలో మూలం పేజీ లోని పెరాగ్రాఫులన్నిటినీ ఒకదాని కింద ఒకటి చూపిస్తుంది. కుడి సగం, అనువాదం చెయ్యడానికి సిద్ధంగా ఖాళీగా ఉంటుంది. మీరు ఏ పేరానైనా అనువాదం చెయ్యవచ్చు. ఎన్ని పేరాలనైనా అనువదించవచ్చు. అన్నీ చెయ్యాలనే నిబంధనేమీ లేదు.
- ఏ పేరాను అనువదించదలచారో ఆ పేరుకు ఎదురుగా కుడివైపున ఉన్న ఖాళీలో క్లిక్కు చెయ్యండి. వెంటనే యాంత్రిక అనువాదం ఆ ఖాళీలో ప్రత్యక్షమౌతుంది. ఈ అనువాదాన్ని మీరు సరిదిద్దవచ్చు.
- ఆ అనువాదాన్ని సరిదిద్ది సహజంగా ఉండేలా తీర్చిదిద్దండి.
- అయ్యాక, ఇంకో పేరాను ఎంచుకోండి. దాన్ని కూడా అలాగే సరిదిద్దండి. అలా మీరు చెయ్యదలచిన పేరాలను అనువదించండి
- మీరు అనువాదం చేస్తూ ఉంటే పరికరం ఎప్పటికప్పుడు దాన్ని భద్రపరుస్తూ ఉంటుంది.
- ఇక ప్రచురించవచ్చు అని మీరు భావించినపుడు అనువాదం పేజీలో పైన ఉన్న "ప్రచురించు" బొత్తాన్ని నొక్కండి.
అనువాద ప్రక్రియ
[మార్చు]- తెలుగు వికీపీడియాలో ప్రతి పేజీలోను పైన కుడి మూలన ఉండే వాడుకరి లింకుల్లో "అనువాదాలు" అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కండి. అప్పుడు అనువాద పరికరం డ్యాష్‌బోర్డుకు వెళ్తారు
- ఆ పేజీలో "కొత్త అనువాదం" అనే లింకు నొక్కండి.
- అప్పుడు వచ్చే పేజీలో మూలం భాషను ఎంచుకుని అనువదించలచిన పేజీ పేరును ఇవ్వండి
- అనువాదం ఏ భాష లోకి చెయ్యబోతున్నారో దాన్ని (తెలుగును) ఎంచుకోండి.
- ఇక "అనువాదం మొదలుపెట్టండి" బొత్తాన్ని నొక్కండి. అప్పుడు అనువాదం పేజీ తెరుచుకుంటుంది.
- అనువాదం ప్యానెల్‌లో ఎడమ సగంలో మూలం పేజీ లోని పెరాగ్రాఫులన్నిటినీ ఒకదాని కింద ఒకటి చూపిస్తుంది. కుడి సగం, అనువాదం చెయ్యడానికి సిద్ధంగా ఖాళీగా ఉంటుంది. మీరు ఏ పేరానైనా అనువాదం చెయ్యవచ్చు. ఎన్ని పేరాలనైనా అనువదించవచ్చు. అన్నీ చెయ్యాలనే నిబంధనేమీ లేదు.
- ఏ పేరాను అనువదించదలచారో ఆ పేరుకు ఎదురుగా కుడివైపున ఉన్న ఖాళీలో క్లిక్కు చెయ్యండి. వెంటనే యాంత్రిక అనువాదం ఆ ఖాళీలో ప్రత్యక్షమౌతుంది. ఈ అనువాదాన్ని మీరు సరిదిద్దవచ్చు.
- ఆ అనువాదాన్ని సరిదిద్ది సహజంగా ఉండేలా తీర్చిదిద్దండి.
- అయ్యాక, ఇంకో పేరాను ఎంచుకోండి. దాన్ని కూడా అలాగే సరిదిద్దండి. అలా మీరు చెయ్యదలచిన పేరాలను అనువదించండి
- మీరు అనువాదం చేస్తూ ఉంటే పరికరం ఎప్పటికప్పుడు దాన్ని భద్రపరుస్తూ ఉంటుంది.
- ఇక ప్రచురించవచ్చు అని మీరు భావించినపుడు అనువాదం పేజీలో పైన ఉన్న "ప్రచురించు" బొత్తాన్ని నొక్కండి.
ప్రచురణ
[మార్చు]తెవికీలో యాంత్రిక అనువాద పరిమితి 75% కన్నా తక్కువ వుండాలి అనే నిబంధన అమలులో వున్నది. కావున మీరు ప్రచురించు అని నొక్కినపుడు, మీ వ్యాసం ప్రచురించకుండా నిరోధించబడవచ్చు. అప్పుడు పేరా వారీగా మీ అనువాదాన్ని పరిశీలించి ఏమైనా మెరుగుచేయగలిగితే చేయండి. ఇంకా సమస్య తీరకపోతే ఈ క్రింది సూచనలు ఆపద్ధర్మంగా పాటించవచ్చు
- ప్రచురించు అనే బటన్ ముందుగల గేర్ బొమ్మ పై నొక్కి మీ వాడుకరి పేరుబరిని లక్ష్యంగా ఎంపికచేయండి. ఇలా చేయటం ఇప్పటికే వున్న వ్యాసాన్ని అనువాదం ద్వారా విస్తరించాలన్నా, లేక మీ అనువాదాన్ని ఇతరుల సహాయంతో మెరుగుపరచిన తర్వాత ప్రధాన పేరుబరిలో చేర్చాలన్నా ఉపయోగం.
- అనువాదం లో చివరికి వెళ్లి, కొత్త పేరా చేర్చండి. Some text (to be deleted after publishing) అని టైప్ చేసి ఒక ఐదు-పది పేరాల తెలుగు పాఠ్యం ఇతర వ్యాసాలనుండి నకలు చేసి అతికించండి. (సాధారణంగా గ్రామాల వ్యాసాలలో సులభంగా పది పేరాలు ఎంపిక చేసుకోవడం సులభం). ఇప్పుడు ప్రచురించు నొక్కండి. ఇంకనూ ప్రచురించటానికి అనుమతించకపోతే మరల నకలు చేసినదాన్ని ఇంకొకసారి అతికించండి. ఇలా మీరు సులభంగా ప్రచురించవచ్చు. తరువాత ప్రచురించిన వాడుకరిపేరుబరిలోని వ్యాసంలో చివరంగా అదనంగా చేర్చిన సమాచారం తొలగించండి.
- ఆ వ్యాసాన్ని మరొకసారి పరిశీలించి అనువాదాన్ని మెరుగుపరచండి.
- మీరు అనువాద నాణ్యతను మెరుగుపరచడానికి ఇతరుల సహాయం తీసుకోదలిస్తే, చర్చాపేజీలో {{సహాయం కావాలి}} చేర్చి వ్యాఖ్య వ్రాయండి. ఇతరులు మీ అనువాదాన్ని అనువాద సమస్యల పరిశీలన ఉపకరణంతో పరిశీలించి సహాయం చేస్తారు.
- వీలైతే తెలుగు మూలాలలో వున్న సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి.
ఉపయోగాలు
[మార్చు]- వికీ అనువాద యంత్రం చాలా వేగంగా (దాదాపు వెంటనే) అనువదిస్తుంది.
- మూలం పేజీకి సంబంధించిన పేజీ తెలుగులో ఈసరికే ఉంటే, పరికరం అది చూపిస్తుంది. లేకపోతే తెలుగులో లేదు అని చూపిస్తుంది.
- మూలం లోని వికీలింకులు, మూసలు, చిత్రాలు, బొమ్మలు, పట్టికలు, సమాచార పట్టిక, మూలాలు, వర్గాలు, ఇతర భాషలలో ఇదే వ్యాస లింకులు (ఇంటర్ లాంగ్వేజ్ లింక్స్) అనువాదంలోకి కూడా వస్తాయి. పట్టిక లోని సమాచారం అనువాదమౌతుంది.
- ఉపకరణం కుడివైపు విభాగంలో అనువాద సమస్యల పెట్టెలో సమస్యలను చూపిస్తుంది. ఉదాహరణకు పేరాలో యాంత్రిక అనువాదం పరిమితికి మించి ఉంటే లేక అలానే వుంచితే హెచ్చరిస్తుంది. అలాగే మూలలలో సమస్యలున్నా తెలుపుతుంది. వాటిని పరిశీలించి అనువాదం మెరుగుపరచవచ్చు.
- ఈ సౌకర్యాలు నేరుగా (విడిగా) అనువాద యంత్రాలు ఉపయోగిస్తే సమకూడవు.
సూచనలు
[మార్చు]- యాంత్రికానువాదం అసహజంగా ఉంటుంది. అసహజమైన భాషతో, పాటు కర్మణి వాక్యాలను విరివిగా రాస్తుంది. and కి ‘మరియు’ అని, of కి ‘యొక్క’ లాంటి పదాలు తెవికీలో ఉపయోగించకూడనివి విరివిగా జారీ చేస్తుంది. కొన్ని పదాలకు సరియైన భాషా పదాలు అనువాదంలో రావు. అర్ధం సరిగా ఏర్పడదు. ఆంగ్లంలోని వాక్యనిర్మాణానికి తెలుగుకు ఉన్న వ్యత్యాసం అనుసరించి అనువాద వాక్యం అర్ధవంతంగా ఉండకపోవచ్చు. తెలుగులో లేని సాంకేతిక పదాలు నేరుగా ఆంగ్లంలో లేదా తెలుగులిపిలో కనపడుతాయి (ఇది ఎక్కువ సమస్య కాదు). కాబట్టి భాష సహజంగా ఉండేలా అర్ధవంతమయేలా చూసుకోవాలి.
- మూలంలోని వికీలింకులు, సమాచార పట్టిక, మూలాలు, వర్గాలు తెలుగు వికీపీడియా లక్ష్యం పేజీలో లేకపోతే అనువాదంలో ఎర్ర లింకులు ఏర్పడుతాయి.
- ఇతర భాషలలో ఇదే వ్యాసం లేకపోతే లింకులు (ఇంటర్ లాంగ్వేజ్ లింక్స్) కనపడవు
- మూసలు తెవికి లో లేకపోతే ఆంగ్లం నుండి దిగుమతి (import) చేసుకోవాలి లేదా తెలుగులో మూసలతో అనుసంధానించాలి.
- తమ భాషావికీ కోసం మాత్రమే ఎక్కించిన దస్తాలను (fairuse) తెవికీలోకి అనువాద పరికరం ద్వారా కూడా రావు. అప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేక అనుమతులతో తెవికీలో ఎక్కించడమో లేదా ప్రత్యేక ప్రక్రియలలో వేరొక భాషనుంచి మన భాషలోకి తెచ్చుకోవడమో చేయవలసి ఉంటుంది.
- అనువాద పరికరం తెవికీలో వ్యాసం లేకపోతే చూపిస్తుంది. అయితే ఇదే వ్యాసం ఇదే శీర్షిక లేదా వేరే శీర్షికతో ఉండవచ్చు. వికీడేటాలో ఈశీర్షిక సమాచారం లేకపోవచ్చు. ఇతర భాషల లింకులు లేకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అనువాదం చేయబోయే ముందు తెవికీలో శోధించి ఈ వ్యాసం లేదని ధృవీకరించుకోవాలి. అనువాదపరికరం తెవికీలో లేదన్న సూచన మీద మాత్రమే ఆధారపడి అనువాద రచన కొనసాగించ కూడదు.
- పెద్ద వ్యాసాలు అనువదించేటప్పుడు అన్ని పేరాలు ఒకేసారి అనువాదంకొరకు క్లిక్ చేయకూడదు. అనువాదం సరిగ్గా జరుగక పోవచ్చు. పట్టికలలో అచ్చు తప్పులు స్థలం మార్పులు ఉండవచ్చు.
- పెద్ద వ్యాసం అనువదించేటప్పుడు ఎక్కువ రోజులు తీసుకుంటే, మూల వ్యాసం మరిన్ని తాజాకరణలు, మార్పులకు లోనయే సంభావ్యత ఉంటుంది. అప్పుడు పరికరం తాజాగా అనువాదం మొదలు పెట్టమని సూచనలు చేస్తుంటుంది. సాధారణముగా అనువాదాన్ని తిరిగి మొదలు పెట్టవలసి వస్తుంది.
ఆధారాలు
[మార్చు]- ఈ వర్గంలో వ్యాసాలు - https://te.wikipedia.org/wiki/వర్గం:అనువాద_పరికరం
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెలుగు_వికీపీడియా_కరదీపిక/అనువాద_పరికరం