తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీబుక్స్

వికీబుక్స్ అనేది వికీమీడియా ప్రాజెక్ట్, అంటే స్వేచ్ఛా నకలు హక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాలస్థలి. వికీబుక్స్ 10 జూలై 2003న ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. వికీబుక్స్ ప్రాజెక్ట్ లో పుస్తకాలను స్వేచ్ఛగా, సమిష్టిగా, సహకారంతో రాయడం జరుగుతుంది. ఎవరైనా ప్రతి వికీబుక్ పేజీకి ఎగువన కనిపించే సవరణ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా సవరించవచ్చు.
ఆంగ్లం, తెలుగుతో సహా ప్రస్తుతం 83 భాషలలో ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది. తెలుగు వికీబుక్స్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 191 వ్యాసములు ఉన్నాయి.
పరిచయం
[మార్చు]వికీబుక్స్, జూలై 10, 2003న ప్రారంభించబడింది. వికీజూనియర్‌కు ఆధారం వికీబుక్స్. వికీజూనియర్ నవంబర్ 7, 2004న ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ పిల్లల కోసం ఉచిత పుస్తకాల సమాహారం, ఇది వికీబుక్స్ ప్రాజెక్టులలో అనేక భాషలలో వ్రాయబడుతోంది. ఇది ఒక సహకార ప్రాజెక్ట్ . ఇది వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్ట్. దీనిని మొదట్లో Wikimedia Free Textbook Project అని Wikimedia-Textbooks అని పిలిచేవారు. ఈ ప్రాజెక్ట్ ఉచిత పాఠ్యపుస్తకాలు, కరదీపికల సమాహారం.
మానవాళికి విద్యను ఉచితంగా తీసుకురావడానికి , అత్యున్నత-నాణ్యత అభ్యాస సామగ్రికి ఖర్చులు, ఇతర పరిమితులను తగ్గించడానికి సేంద్రియ రసాయన శాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ) , భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) వంటి వంటి వైజ్ఞానిక విభాగాలలో స్వేచ్ఛగా లభించే విషయంతో (ఓపెన్ కంటెంట్) పాఠ్యపుస్తకాలను నిర్మించడం కోసం 'కార్ల్ విక్ ' చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఈ ప్రాజెక్ట్ జూలై 10, 2003న ప్రారంభించబడింది. వీటి అభివృద్ధి ఆధారంగా, వికీబుక్స్ జూలై 21, 2004న అనేక భాషా-నిర్దిష్ట సబ్‌డొమైన్‌లుగా విభజించబడింది. అంటే భాషకు ప్రత్యేకమైన వెబ్సైట్ ఏర్పడింది. ఇవి కంటెంట్ క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ 4.0 లైసెన్స్ ను అనుసరించి ఉంటాయి. మొదటలో కొన్ని అసలైన పుస్తకాలు, మరికొన్ని ఇంటర్నెట్‌లో కనిపించే ఇతర పాఠ్యపుస్తకాల వనరుల నుండి కాపీ చేయబడి వచనంగా ప్రారంభమయ్యాయి.
అవగాహనా కొరకు ఆంగ్ల వికీబుక్స్ లో పూర్తి అయిన వికీబుక్స్ కొన్ని ఉదాహరణలు
- Anatomy and Physiology of Animals
- ICT in Education
- Social and Cultural Foundations of American Education
తెలుగు వికీబుక్స్ వెబ్సైటు మొదటి పేజీ - https://w.wiki/CYjW
సాధారణ సమాచారం
[మార్చు]- వికీబుక్ యేవిషయానికి సంబంధించినది అయినా ఉండవచ్చు
- వికీమీడియన్ల కోసం వికీబుక్స్, కరదీపికలు, వికీమీడియా ప్రాజెక్ట్‌ల కు మార్గదర్శకాలు.
- వికీ సముదాయం అవసరాన్ని, పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేసినవి విధానాలు, మార్గదర్శకాలు.
- తరగతి ప్రాజెక్ట్‌ల కోసం మార్గదర్శకాలు - విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాల నిర్మాణాత్మక ఉత్పత్తిని రూపొందించడానికి, ప్రయోగశాల కరదీపికలు, నమూనా ప్రశ్నల పత్రాలు
- స్వంత రచనలు , రచనలకు అనుసరణలు, వివరణలు మొదలైనవి
- ఉపయోగపడేవి, విస్తృతంగా వ్యాప్తిలో లేనివి, అత్యంత ఖరీదు అయిన అధ్యయన సామగ్రి (Study material) పరిశీలించవచ్చు
హక్కులు, అనుమతులు
[మార్చు]వికీబుక్స్ ప్రాజెక్టులో రచనలు వాటి సృష్టికర్తలకు హక్కుగా గుర్తింపుగా నే ఉంటాయి, అయితే కాపీలెఫ్ట్ లైసెన్సింగ్ ప్రకారం కంటెంట్ ఎల్లప్పుడూ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని, పునరుత్పత్తి చేయబడుతుందని అర్ధం చేసుకోవాలి . అయితే రచయతలకు వారి రచనకు సంబంధించిన కాపీరైట్ హక్కులు, గుర్తింపులు ఉంటాయి. అయితే ఆ రచనలను క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ లైసెన్స్ (Creative Commons Attribution-ShareAlike 4.0), GNU ఉచిత డాక్యుమెంటేషన్ లైసెన్స్‌లతో సమర్పించుతారు, సంస్కరించుతారు, సవరణలు చేస్తారు. ఈ లైసెన్సుల ఫలితంగా ఆయా రచనలు, వాటి ఉత్పన్న రచనలు ఎల్లప్పుడూ ఉచితంగా పంపిణీ చేయదగినవి, పునరుద్ధరణ, చేయగలవని నిర్ధారించవచ్చు.
ఈ వికీబుక్స్ ని నిరభ్యంతరంగా ఎవరైనా PDF రూపంలో గాని ఇతర ప్రింటబుల్ రూపములో దింపుకోవచ్చు (డౌన్లోడ్ చేసికోవచ్చు)
సూచన:
అయితే కాపీరైట్ హక్కుదారుని అనుమతి లేకుండా ఎవరైనా ఈ పని సమర్పించడం, పునఃపంపిణీ చేయగల ఉచిత వనరును నిర్మించడం కూడా కొన్నిసార్లు చట్టపరమైన చర్యలకు కూడా దారితీయవచ్చు. అందువలన రచయితలు హక్కులు, అనుమతులు పూర్తిగా అవగాహన చేసికొని రచనకు ఉపక్రమించాలి.
తెలుగులో వికీబుక్స్ (నిర్మాణం)
[మార్చు]పూర్తి అయిన ఆంగ్ల వికీబుక్స్ ఆధారంగా వికీబుక్స్ నిర్మాణం సూచించడమైనది. రచయితలు తమ రచన అవసరాలననుసరించి క్రింది సూచనల సహాయంతో పుస్తకాన్ని రూపొందించవచ్చు
ప్రధాన పేజీ లేదా శీర్షిక పేజీ
- శీర్షిక, ఉప శీర్షిక
- పుస్తకం గురించి పరిచయం
- అధ్యాయాల పరిచయం
- పుస్తకం బొమ్మ
- విషయసూచిక
ఉపపేజీలు లేదా అధ్యయాలు
- అధ్యాయాల జాబితా
- అధ్యాయాలకు ఉపపేజీలకు లంకెలు
సంప్రదించిన వనరులు (మూలాలు )
- వికీ అంతర్గత వనరులు
- బయట వనరులు , లింకులు
ఇతర పేజీలు
- రచయిత సమాచారం
- ముందుమాట
- కృతజ్ఞతలు
- పూర్తి వివరాలతో కూడిన విషయసూచిక
తెలుగులో వికీబుక్స్ సృష్టించడం
[మార్చు]- శీర్షిక నిర్ణయించాలి.
- అధ్యాయాలు నిర్ణయించుకోవాలి.
- శీర్షికతో శోధన యంత్రం (సెర్చ్ ఇంజిన్) ద్వారా వెతికి పుస్తకం లేకపోతే సృష్టించాలి
- మొదట ప్రధాన పేజీ సృష్టించాలి
- అధ్యాయాల ప్రకారం ప్రధాన పేజీనుంచి ఉపపేజీలు సృష్టించాలి
- విషయసూచికలో అధ్యాయాలకు ఉపపేజీల లింకులు ఇవ్వాలి
- ప్రతి పేజీ నుంచి విషయసూచికకు, తరువాత పేజీకి , అధ్యాయానికి లేదా అధ్యాయాలకు లింకులు ఇవ్వాలి అంటే ఒక పేజీ నుంచి వేరొక పేజీకు విహరించడానికి వెసులుబాటు ఉండాలి.
- అవసరమైన ప్రదేశంలో బొమ్మలు, పట్టికలు, పటాలు మొదలైనవి ఇవ్వవచ్చు.
- పుస్తకానికి అవసరమైన దృశ్య, శ్రవణ (ఆడియో విజుయల్) వనరులను కామన్స్ (లోకి మొదట అప్లోడ్ చేసి) నుండి చొప్పించవచ్చు.
- వర్గాలు ఇవ్వాలి.
వనరులు
[మార్చు]- Wikibooks:Welcome
- Wikibooks:Copyrights
- https://www.wikibooks.org/
- https://en.wikibooks.org/wiki/Help:Navigating#Searching
- స్వేచ్ఛా_పాఠ్యపుస్తకాలు
సహాయం
[మార్చు]- తెలుగులో వికీబుక్స్ సృష్టించే ప్రక్రియను ఉదాహరణ తో అనుసరించాలని అనుకుంటే ఈ పేజీ క్లిక్ చేయండి .
- వికీబుక్స్ కు సోర్స్ కోడ్ లో సహాయం