Jump to content

క్యారెట్ పచ్చడి

Wikibooks నుండి

క్యారెట్ పచ్చడి

కావలసిన పదార్థములు : 1. పావు కేజీ క్యారెట్

                  2. 2 రామములగ కాయలు (టమాటాలు)
                  3. పచ్చి మిరపకాయలు 
                  4. పుదీనా ఆకులు 
                  5. చింతపండు


                  6. వెల్లుల్లి రెమ్మలు
                  7. జీలకర్ర 


తయారుచేయు పద్ధతి : ముందుగా క్యారెట్, టమాటా, పుదీనా ఆకులు, పచ్చి మిరపకాయలు శుభ్రంగా కడగాలి. క్యారెట్ ను తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోయాలి. టమాటాలు కూడా ముక్కలుగా కోయాలి.

                 ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో క్యారెట్, టమాటా  ముక్కలు, పుదీనా ఆకులు కావలసిన పచ్చి మిరపకాయలు వేసి తగినంత నూనె వేసి ముక్కలు మాడకుండా తిప్పుతూ 
                 వేయించాలి. కొంచెంసేపు చల్లారిన తరువాత రోటి లో గాని మిక్సీలో గాని వేసి తగినంత చింతపండు, ఉప్పు, వెల్లుల్లిరెమ్మలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత గిన్నెలోకి
                 తీసుకుని కొత్తిమీర వెయ్యాలి.
                 ఈ పచ్చడి అన్నంలో గాని దోసెలలో గాని లేదా ఇడ్లీలలో గాని తింటే బాగుంటుంది.