కాలిప్లవర్ పరాట

Wikibooks నుండి

కాలిప్లవర్ పరాట[మార్చు]

దస్త్రం:Cali flower.JPG
కాలి ప్లవర్

తయారు చేయడానికి కావలసిన పదార్థములు[మార్చు]

  • గోదుమ పిండి - నాలుగు కప్పులు.
  • కాలిప్లవర్ తురుము - 2 కప్పులు,
  • కొత్తిమిరి - ఒక కట్ట,
  • పచ్చిమిర్చి - రెండు,
  • ఉల్లిపాయ - ఒకటి
  • అల్లము - కొంచెం.,
  • ఉప్పు - సరిపడినంత.
  • కారం - సరిపడినంత.
  • నూనె - కొంచెం

తయారు చేయువిధానము[మార్చు]

  • ముందుగా గోదుమపిండిని చపాతి పిండిలా ముద్దగా కలపి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మిర్చి, కొత్తమీర, అల్లం, ఒక వుల్లిపాయ లను సన్నగా తరిగి, దీనిని, తగినంత కారం, ఉప్పు, గరంమసాల లను సిద్ధం చేసుకున్న కాలిప్లవర్ తురుముతో కలపాలి.
  • పెనంలో కొంచెం నూనె వేసి పై మిశ్రమాన్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని గోదుమ పిండితో రెండు చపాతిలు చేయాలి.
  • ఒక చపాతి పైన కాలిప్లవర్ మిశ్రమాన్ని కొంత పలచగా చపాతి మధ్యలో పరిచి దానిపై రెండో చపాతిని పెట్టి చపాతి కర్రతో సున్నితంగా ఒత్తి ఒక గుండ్రని మూతి గల గిన్నెను (చపాతి సైజు) దానిపై బోర్లించి గట్టిగా అదిమితే రెండు చపాతిలు అంచుల వద్ద అతుక్కొని ఒక పరాటలాగ వుంటుంది.
  • దానిని చపాతి కాల్చే పెనంపై కొంత నూనె రాసి చపాతిలాగ సన్నని సెగపై కాల్చుకోవాలి.
  • తయారైన కాలిప్లవర్ పరోటాలు వేడివేడిగా తినడానికి ఇవి చాల రుచిగా వుంటాయి. వీటికి వేరే కూర అవసరం లేదు.