కాకరకాయ పులుసు
Appearance
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ పులుసు. అది తయారుచేయు విధానం తెలుసుకుందాం. వీటిలో రకరకాల పులుసులను చేస్తారు. ఉదాహరణకు "కాకరకాయ పులుసు" , "కాకరకాయ నువ్వుల పులుసు"
కారకరాయ పులుసు
[మార్చు]కావలసిన పదార్థాలు
[మార్చు]- కాకరకాయలు---4
- ఆవాలు---1/4 స్పూన్
- ఇంగువ---చిటికెడు
- కరివేపాకు---2 రెమ్మలు
- శనగ పప్పు---3 స్పూన్స్
- నువ్వులు---3 స్పూన్స్
- పచ్చి మిరపకాయలు---2
- చింతపండు---నిమ్మకాయంత
- ఉద్దిపప్పు--3 స్పూన్స్
- కారం---1/2 స్పూన్
- వేరుశనగ విత్తనాలు--3 స్పూన్స్
- పసుపు--చిటికెడు
- ఉప్పు---తగినంత
తయారు చేయు విధానం
[మార్చు]- చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు గుజ్జు/పులుసు తీసి పెట్టుకోవాలి.
- ఉద్దిపప్పు,శెనగపప్పు,వేరుశనగ విత్తనాలు, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
- కాకరయాలు పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- పచ్చి మిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- బానలి పెట్టి3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక,1/4 స్పూన్ ఆవాలు వేసి చిట చిట అన్నాకా, ఇంగువ పసుపు వేయాలి.
- తరువాత పొడవుగా కట్ చేసిన కాకరకాయలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
- తరువాత మూత తీసి, ముక్కలు బాగా వేగినాక, చింతపండు పులుసు వేయాలి.
- తరువాత చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి, కారం వేయాలి.
- తరువాత గుజ్జు గట్టి పడుతుంది.(చాల గట్టిగా ఉంటే కొద్దిగా నీరు వేసుకోవచ్చు)
- తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- చివరి లో కరివేపాకు వేసుకోవాలి.
- ఎంతో రుచిగా ఉండే కాకరకాయ గుజ్జు/కాకరకాయ పులుసు రెడి. ఇది అన్నంలో కి బాగుంటుంది.
కాకరకాయ నువ్వుల పులుసు
[మార్చు]కావలసిన పదార్థాలు
[మార్చు]- కాకరకాయలు - 5
- బెల్లం - 2 స్పూన్స్
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 3
- పసుపు - 1/4 స్పూన్
- నూనె - 5 స్పూన్స్
- నువ్వుల పొడి - 4 స్పూన్స్
- ఉప్పు, కారం - సరిపడ
- ధనియాల పొడి - 1 స్పూన్
- చింతపండు - కొద్దిగా
- పోపు గింజలు - 1 స్పూన్
తయారు చేయు విధానం
[మార్చు]- ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి.
- అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి.
- తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
- ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు, నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి.
- అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు తయార్.
వర్గం: వంటలు