ఉసిరి సాంబార్
Appearance
ఉసిరి సాంబార్ ఒక శాకాహార వంటకము. ఉసిరి కాయలు ఎక్కువగా దొరికే సీజన్ లో దీనిని తయారుచేస్తుంటారు.
కావలసిన పదార్థాలు
[మార్చు]- ఉసిరికాయలు - వందగ్రాములు,
- కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు,
- సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు,
- పసుపు - చిటికెడు,
- పచ్చిమిర్చి - రెండు,
- కరివేపాకులు - కొన్ని,
- ఆవాలు - ఒక టీస్పూన్,
- ఇంగువ - చిటికెడు,
- ఉప్పు, నూనె - సరిపడా.
తయారీ
[మార్చు]- ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలు కోయాలి.
- పచ్చిమిర్చిని నిలువుగా చీల్చాలి.
- గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఉసిరి ముక్కల్ని ఉడికించాలి. తరువాత సాంబార్ పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి.
- ఉసిరి ముక్కలు ఉడకగానే వాటిని మెత్తగా మెదపాలి. తరువాత ఉడికించిన కందిపప్పు వేసి మళ్లీ ఉడికించాలి.
- అన్ని పదార్ధాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి.
- తాలింపుకు నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేయాలి.
- ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో ఆ తాలింపు వేస్తే ఉసిరి సాంబారు తయారు.