Jump to content

ఉబుంటు/ స్థాపన

Wikibooks నుండి

సిఫారస్ చేయబడిన హార్డ్వేర్ లక్షణాలు

[మార్చు]
  • 1 GHZ ప్రాసెసర్ (ఇంటెల్ /ఎఎమ్‍డి(AMD )
  • 1 GB రేమ్
  • 15 GB హార్డ్ డిస్క్ ఖాళీస్థలం
  • గ్రాఫిక్స్ కార్డ్ మరియు మానిటర్ విభాజకత 1024x768
  • సిడి/డివిడి డ్రైవ్ లేక/మరియు యుఎస్బి (USB) పోర్ట్
  • అంతర్జాల(ఇంటర్నెట్) సంపర్కం (వుంటే మంచిది)

సాధారణంగా విండోస్ XP ఆ పైన నిర్వహణ వ్యవస్థలు నడిచే ఏ కంప్యూటర్ ఐనా సరిపోతుంది. వాటికంటే వేగంగా పనిచేస్తుంది. అంతే కాకుండా మీ కంప్యూటర్ కి ఏ హానీ జరగకుండా ప్రత్యక్ష బూట్ సిడి/డివిడి తో పరీక్షించి ఆ తరువాత స్థాపించుకోవచ్చు.

డివిడి పొందుట

[మార్చు]

386 డివిడి ఇమేజ్ (3.9GB)ఇంటెల్ లేక ఎఎమ్‍డి(AMD) ప్రాసెసర్ కు సరిపోతుంది.[1]. దీనిలో నేటీ లేక తరువాత విడదలలు ఎంచుకోండి. "...dvd-i386.iso.torrent " ఫైల్ ని ట్రాన్స్మిషన్ లాంటి టారెంట్ ఫైల్ పొందు అనువర్తనాలలో తెచ్చుకుంటే త్వరగా మీరు పొందగలుగుతారు. కంప్యూటర్ కు ఏదైనా అంతరాయం కలిగినా ఫైల్ పొందటం కొనసాగుతూ వుంటుంది. నెట్ లో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ 512 Kbps అనుసంధానం ద్వారా పొందటానికి దాదాపు 22 గంటలు పట్టవచ్చు. ఆ తరువాత దానిని డివిడి పై రాయండి(బర్న్). నేరుగా డివిడి నుండి స్థాపన లేక ప్రత్యక్ష అనుభవం ఎంచుకొని మొత్త సిద్ధం అయినతరువాత స్థాపన ప్రయత్నించవచ్చు. స్థాపన మీ కంప్యూటర్ సామర్ధ్యాన్ని బట్టి గంట నుండి నాలుగు గంటల పట్టవచ్చు కాబట్టి, ప్రత్యక్ష అనుభవం ఎంచుకొంటే స్థాపన జరిగేటప్పుడు మీ వెబ్ వీక్షణ పనిని కొనసాగించుకోవచ్చు. స్థాపనకు ఆన్లైన్ సంపర్కము వుంటే మంచిది. అవసరమైతే తెలుగుకి కావలసిన పాకేజీలు లేక వాటి నవీకరణలో స్థాపనలో భాగంగా తెచ్చుకొని స్థాపించుతుంది.

ఒక వేళ మీకు వేగవంతమైన ఇంటర్నెట్ సంపర్కం లేకపోతే, కంప్యూటర్ పత్రికలతో పాటు అందచేసే ఉబుంటు డివిడిలు లేక కంప్యూటర్ దుకాణాలు ఇతర కంప్యూటర్ వాడే మిత్రుల నుండి పొందవచ్చు.

స్థాపన

[మార్చు]

మీ డివిడి డ్రైవ్లో ఉబుంటు డివిడి అమర్చి లేక యుఎస్‍బి లో ఉబుంటు స్టిక్ చేర్చి, బయోస్ (‌BIOS) సెట్ అప్ లో వాటిని బూట్ కి చేతనం చేసి కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయండి.

భాషా ఎంపిక

[మార్చు]
ప్రత్యక్షDVDనుండి బూట్ చేసినపుడు తెలుగు ఎంపిక

ఆ తరువాత కనబడే తెరలో బూట్ స్క్రీన్ లో భాష ఎంపిక కనపడుతుంది. తెలుగు ఎంచుకోండి. త ె లుగు అని కనబడినా గాభరాపడవద్దు. టర్మినల్ లో తెలుగు లాంటి భాషలకు పూర్తి తోడ్పాటు రాలేదు. సాధారణ వాడుకరులు గ్రాఫికల్ అంతర్వర్తి వాడతారు (స్థాపనలో ఆ తరువాత వచ్చే తెరనుండి) కాబట్టి వాటిలో లోపాలు లేని తెలుగు కనబడుతుంది.

బూట్ విధానం ఎంపిక

[మార్చు]
ప్రత్యక్షDVDనుండి బూట్ ఎంపికలు

బూట్ మొదటి తెర బూట్ వ్యవస్థ వాడు విధం. దీనిలో మొదటి వరుస ప్రత్యక్ష అనుభవం (Try Ubuntu without Installing). ఇతర ఎంపికలు నేరుగా స్థాపన, పాఠం విధానంలో స్థాపన, డిస్క్ లో దోషాల తనిఖీ, మెమరీ పరీక్ష, మొదటి హార్డ్ డిస్క్ నుండి బూట్, పనిచేయని వ్యవస్థను బాగుచేయు అనే ఇతర ఎంపికలు వుంటాయి. వాటిని కీ బోర్డుతో (బాణంగుర్తులుగల కీలువాడి)ఎంచుకోవచ్చు. ప్రత్యక్ష అనుభవం ఉద్దీపనం చేసి దాఖలు (ENTER) చేయండి ఎంచుకోండి. ఒక వేళ భాష ఎంపిక చేయుట మొదటి సారి తెర కనిపించిన 30 సెకండ్లలో చేయలేక పోయినట్లైతే F2 కీ వాడి భాష ఎంపిక చేయవచ్చు.

ప్రత్యక్ష అనుభవం డాష్ బోర్డ్

[మార్చు]
ప్రత్యక్ష అనుభవం డాష్ బోర్డ్

దీనిని వాడుకొని మీ వ్యవస్థ పరికరాలు, అనువర్తనాలు పనిచేస్తున్నదీ లేనిది పరిశీలించండి. మీ అనుభవంతో తృప్తిపడితే ఈ డాష్ బోర్డ్ లో స్థాపించు ఉబుంటు 11.04 (Install Ubuntu 11.04) అన్న ప్రతిమను నడపవచ్చు. అప్పుడు మరల భాష ఎంపిక ఇతర ఎంపికలు చేయవలసివుంటుంది.

స్థాపన తెలుగు ఎంపిక

విభజన ఎంపిక

[మార్చు]

మీ హార్డ్‍డ్రైవ్ లో ఇప్పటికేవున్న నిర్వహణ వ్యవస్థల వివరాలు తెలిపి ఉబుంటుకోసం వాడవలసిన హార్డ్‍డిస్క్ విభజన(పార్టిషన్)ఎంపిక చేయటమే ఈ దశ ముఖ్యోద్దేశం. ఖాళీ వుంటే ఆ ఖాళీ స్థలము వాడుకొనేటట్లు చేయవచ్చు. లేకపోతే ప్రస్తుతమున్న విభజనలను కుదించి ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసే ఎంపిక చేయవచ్చు. కాని ఇలా చేసేటప్పుడు ముందుగా మీ డాటాని భద్రపరచుకోండి.

ఇప్పటికే వాడుతున్న కంప్యూటర్ పై స్థాపించేటప్పుడు, సాధారణంగా ఉబుంటు మీ నిర్వహణ వ్యవస్థలను అలానే వుంచి కొత్త ఉబుంటు ని స్థాపించమనే ఎంపిక మొదటిదిగా చూపెడుతుంది. దీనిని మీరు ఎంచుకుంటే సులభంగా వుంటుంది. దీనికి కేటాయించిన నిల్వ మొత్తం ఒకే వేరుగల ఫైల్ వ్యవస్థగా వాడుతుంది. ఇలాగా చేస్తే ముందు ముందు కొత్త ఉబుంటు వ్యవస్థలకు మారటానికి మీరు నివాస సంచయాన్ని భద్రపరచుకోవాలి. అలా కాకుండా మానవీయంగా ఈ క్రింది వేరులకు మీ నిల్వను కేటాయిస్తే ముందు ముందు తాజాకరణలు మీ నివాస సంచయం అలాగే వుంచుకొని చేసుకోవచ్చు. సిఫారస్ చేయబడిన వేరులు మరియు వాటికి నిల్వలు క్రింది పట్టికలో ఉదాహరణగా ఇవ్వబడినవి.

వేరు కనీస నిల్వ గురించి సూచనలు
/boot కనీసం 250 MB
swap మీ రేమ్ మెమరీకి రెట్టింపు. ఉదాహరణకి మీ మెమరీ 1 GB ఐతే మీరు దీనికి 2 GB కేటాయించాలి
/home మీ వ్యవస్థని వాడే వారికి ఒక్కొక్కరికి అవసరమైనది లెక్కించి కావలసిన నిల్వ నిర్ణయించవచ్చు. ఫొటోలు, సంగీతం, సినిమాలు వాడేవారికి చాలా ఎక్కువ నిల్వ అవసరము. సాధారణ వాడుకరికి 10 GB సరిపోతుంది. కాని మీ డిస్క్ నిల్వని బట్టి ఎక్కువ ఇచ్చుకోవచ్చు.
/ దీనిలో మిగతా ఫైల్ వ్యవస్థ వుంటుంది. కనీస ఉబుంటు దాదాపు 2.5 GB సరిపోతుంది. అయితే స్థాపించటానికి కావలసిన కనీస నిల్వ దీనికన్నా ఎక్కువ.

వాడుకరి వివరాలు చేర్చుట

[మార్చు]
వాడుకరి వివరాలు చేర్చు తెర

ఈ తెరలో మీ పూర్తి పేరు, వాడుకరి పేరు, సంకేత పదం (రెండు సార్లు) ప్రవేశ పెట్టవచ్చు. ప్రక్కన ఇచ్చిన ఫొటోలో అర్జున అన్న వాడుకరి పేరు ప్రవేశపెట్టటం చూడవచ్చు. మొదటి వరుసలో కావాలంటే తెలుగులో మీ పేరు రాసుకోవచ్చు. చాలా అరుదుగా వాడబడే టర్మినల్ లో తెలుగు తోడ్పాటు పూర్తిస్థాయిలో లేనందున మీ వాడుకరి పేరు ఇంగ్లీషులోనే వుంచుకోవటం మంచిది. సంకేత పదంలో అక్షరాలు, అంకెలు వుండేటట్లుచూసుకుంటే మంచిది.

ప్రయత్నించబడిన హార్డ్వేర్

[మార్చు]
  • డెల్ ఇన్స్పిరాన్ 600M లాప్టాప్, పెంటియమ్ మొబైల్ ప్రాసెసర్@1.6GHz, 1 GB రేమ్, 80 GB హార్డ్ డిస్క్ (మార్కెట్ ప్రవేశం 2003).
  • డెస్క్‍టాప్ i945 చిప్ సెట్ ఇంటెల్ కోర్ 2 డ్యుయో సిపియు CPU E7200 @ 2.53GHz (మార్కెట్ లోకి వచ్చిన సంవత్సరం 2008), దీనిలో ధ్వని కొరకు ALC883 వాడారు. మరియు 2GB రేమ్, 160 GB హార్డ్ డిస్క్, ఏసర్ డివిడి రైటర్, సోనీ డివిడి రామ్, శామ్సంగ్ శామ్ట్రాన్ 55V 1024x768 విభాజకత CRT మానిటర్, శామ్సంగ్ scx-3201 బహుళ కార్య లేజర్ ప్రింటర్(మార్కెట్లో లభ్యత 2010), లాజిటెక్ వెబ్ కేమ్ ( ID 046d:08af లాజిటెక్ ఇంక్. క్విక్ కేమ్ ఈజీ/కూల్).

వనరులు

[మార్చు]
  1. ఉబుంటు దొరుకు వెబ్సైట్