ఉబుంటు/రంగస్థలం
ఉబుంటు రంగస్థలం యూనిటీ రెండు రూపాలలో లభిస్తుంది. పాత తరం కంప్యూటర్లలో 2D ప్రతిమల రూపంలో, మరియు కొత్తతరం కంప్యూటర్లలో 3D ప్రతిమలుమరియు సచేతనం (యానిమేషన్) ప్రభావాలతో కనిపిస్తుంది.
ప్రవేశం (లాగిన్)
[మార్చు]మీరు కంప్యూటర్ ప్రారంభించినపుడు, మీ కంప్యూటర్ పై ఉబుంటు మాత్రమే స్థాపించబడివుంచే ప్రవేశ తెర కనబడుతుంది. లేక ఇతర వ్యవస్థలు కూడా వుంటే వాటి ఎంపిక తెర (GRUB) కనబడుతుంది. దానిలో ఉబుంటు ఎంపిక చేసినపుడు, మీకు ప్రవేశ తెర కనబడుతుంది. గ్రబ్ తెర లో క్రింది విభాగంలో వివరణ తెలుగులో వున్నా కూడా సులభంగా చదవటానికి ఇబ్బంది. ఎందుకంటే గ్రబ్ లో అంతర్జాతీయ భాష ల తోడ్పాటు భాగంలో తెలుగు కి పూర్తిగా సరిగా లేదు. కాని ఇదేమీ గాభరాపడే విషయం కాదు. తెలుగు అక్షరాలు గుణింతాలు వత్తులు విడివిడిగా వస్తాయి కాస్త శ్రద్ధపెడితే అర్థమువుతంది. ఆ వివరం ఇంతకీ ఏమిటంటే బాణంగుర్తులు వాడి మీకు కావలసిన నిర్వహణ వ్యవస్థ ని వుద్దీపనం చేసి దాఖలు (ENTER) చెయ్యమనటమే. రద్దు చేయటానికి C నొక్కాలి. ప్రవేశ తెర దగ్గరనుండి గ్రాఫికల్ వాడుకరి అంతర్వర్తి లో తెలుగు చక్కగా కనిపిస్తుంది.
ప్రవేశ తెర
[మార్చు]దీనిలో మీరు వాడుకరి పేరు ని ఎంచుకొని ఆ తరువాత మీకు కావలసిన స్థానికత (తెలుగు లేక ఇంగ్లీషు), కీ బోర్డునమూనా ఎంచుకొని దాఖలు (ENTER) చెయ్యవచ్చు, అదే కాక కంప్యూటర్ ని అనుకూలపరచుకోవచ్చు. తెలుగు కీ బోర్డు ఇక్కడి నుండే అందుబాటులో వుంటుంది. ఎడమవైపు పైఅక్షరాలమీట(Left Shift) మరియు ఆల్ట్ (Alt) మీట కలిపి నొక్కితే మీ కీ బోర్డు USA మరియు భారతదేశము(తెలుగు) అనగా ఇన్స్క్రిప్ట్ మధ్య మారుతుంది. అయితే మీ వాడుకరి పేరు, సంకేతపదం కొరకు ఇంగ్లీషు లోనే వాడుకోవటం మంచిది. టర్మినల్ అనువర్తనం లో తెలుగు మద్ధతు గ్రబ్ కన్నా మెరుగుగావున్న పూర్తి స్థాయిలో లేదు కనుక ఈ సూచన చేయడమైనది. మీరు తెలుగు ఎంపిక చేసినపుడు మీ కీ బోర్డులో మూడవ బల్బు (పెద్దబడి తాళం మరియు అంకెల తాళం బల్బు కాక చివరిది) వెలుగుతుంది. తెరపై కనబడే కీ బోర్డు ఎంపిక తో పాటు ఇది మీ కీ బోర్డు స్థితిని తెలుసుకొని వాడుటలో సహాయం పడుతుంది.
2D రూపం
[మార్చు]పాత తరపు కంప్యూటర్లలో గ్రాఫిక్స్ ప్రభావాలు తక్కువ. అనువర్తనాల ప్రతిమలు సమతల చిత్రాలు రూపంలో వుంటాయి. కావలసిన అనువర్తనము నడపటానికి లేక ఆదేశం ఎంపికకు పాఠ్య మెనూ వాడుతారు.
వ్యవస్థ అమర్పులు మార్చటం
[మార్చు]మెనూలో సిస్టమ్ ఎంచుకుంటే మీకు సహాయక అనువర్తనాలు కనబడతాయి. వాటిని వుపయోగించి వ్యవస్థని మీకు తగినట్లుగా మలచుకోవచ్చు,
అనువర్తనాల తో పనులు
[మార్చు]మీ కంప్యూటర్ చేసే పనిని బట్టి అప్రమేయ అనువర్తనాలు స్వయం చాలకంగా చేతనం అవుతాయి. ఒకవేళ మీరు మానవీయంగా అనువర్తనం ప్రారంభించాలనుకుంటే, మీరు వాడే ఫైల్ లేక పరికరము పై మోస్ నిలిపి కుడి మీట నొక్కితే తెరుచు అన్న మెనూ కనబడుతుంది. దానితో మీకు కావలసిన అనువర్తనం ఎంపికచేసి ప్రారంభించుకోవచ్చు. ఇక మీరు కొత్త అనువర్తనం స్థాపించుకోవాలంటే సినాప్టిక్ పేకేజి నిర్వాహికి ని ప్రారంభించి దానిలో మీకు కావలసిన పేకేజి పేరుతో వెతకవచ్చు. లేకపోతే ఉబుంటుసాఫ్ట్వేర్ కేంద్రము లో వర్గాల వారీగా వున్న అనువర్తనాల నుండి మీకు కావలసిన దానిని స్థాపించుకోవచ్చు. దీనికొరకు పాకేజి పేరు తెలియాల్సిన పనిలేదు.
ఫైళ్లతో పనులు
[మార్చు]మీరు అనువర్తనాలు వాడినపుడు కొత్త ఫైళ్లు సృష్టించటమో మార్చటమో చేస్తారు. ఇటీవలే వాడిన పత్రాలు అనువర్తనాల లోపటి మెనూద్వారా తిరిగి వాడవచ్చు. భద్రపరచేటప్పుడు లేక ఇతరత్రా వాడాలనుకున్నప్పుడు, మెనూలో స్థలాలలో నివాసం ఎంపికచేసుకొని మీకు కావలసిన ఫైల్ కోసం వెతకవచ్చు. మీరు తొలగించే ఫైళ్లు చెత్తబుట్టలో చేర్చబడతాయి. అవసరమైనపుడు చెత్తబుట్టనుండి తిరిగి తెచ్చుకొనవచ్చు.
3D రూపం
[మార్చు]దీనిలో మీకు లోతుతో కూడిన బొమ్మలు, పారదర్శకమైన పొరలు కనబడతాయి. ఇంతకు ముందల రూపంతో గల లక్షణాల కంటే ఇది విలక్షణంగా వుంటుంది. తెర అంతా బొమ్మలు ప్రధానంగా వుంటాయి. మౌస్ వాటిపై కదిల్చినపుడు మాత్రమే వాటి పేరు కనబడుతుంది. వాటిపై నొక్కినపుడు, బొమ్మ నేపథ్యం వెలిగిఆరుతూ జరుగుతున్న పనిని సూచిస్తుంది. అనువర్తనం ప్రారంభమైనపుడు బొమ్మల లాంచర్ మెనూ ఎడమవైపుకు దాగుతుంది.
గత దశాబ్దకాలంలో కంప్యూటర్ వెబ్ వినియోగదారులకు వెతకటం అనే ప్రక్రియ సాధారణమయ్యింది. ఇదే పద్ధతిలో అనువర్తనాలకోసం లేక పత్రాలకోసం వెతకటం ఉబుంటులో సాధారణమవుతుంది. లాంచర్ మెనూలో అడుగున భూతద్దం (+) గుర్తుతో కనిపించేదానిమీద నొక్కితే మీకు వెతుకు తెర కనపడుతుంది. వెతుకు పెట్టె స్వయంచాలకంగా చేతనం అవుతుంది. అందుకని టైపు చేయగానే ఆ పెట్టెలో అక్షరాలు కనపడతాయి. ఆ పెట్టెలో ప్రత్యేకంగా మౌస్ తో నొక్కి ఆ తరువాత టైపు చేయవలసినపనిలేదు. లాంచర్ లో వున్న వాటిని కీ బోర్డు తో నే వాడుకోటానికి దగ్గరిదారులు వున్నాయి. దీనికొరకు నిర్వహణ వ్యవస్థ మీట (సాధారణ కీ బోర్డులలో విండోస్ ప్రతిమ వున్న మీట దీనినే సూపర్ అంటారు) మరియు ఇంకొక మీట (పనిని బట్టి) తో త్వరగా పని చేయెచ్చు.
సిస్టమ్ లక్షణాలు పవర్ బటన్ ను మౌస్ తో కుడి క్లిక్ చేసినపుడు చివరి మెనూ అంశంగాకనబడుతుంది. దీనిలో సిస్టమ్ లక్షణాల అనువర్తనాలను ఎంపికచేసుకొని నడపవచ్చు.
వ్యవస్థ అమర్పులు మార్చటం
[మార్చు]కుడిపై మూలలో వున్న కంప్యూటర్ పవర్ ప్రతిమ పై నొక్కితే మీకు మెనూ కనబడుతుంది. దానిలో వ్యవస్థ అమరికలు(System Settings)వ్యవస్థని మీకు తగినట్లుగా మలచుకోవచ్చు. మీరు దీనిని వాడేటప్పుడు వెతకటానికి తెలుగు పేర్లు వాడవచ్చని గమనించండి.
అనువర్తనాల తో పనులు
[మార్చు]మీ కంప్యూటర్ చేసే పనిని బట్టి అప్రమేయ అనువర్తనాలు స్వయం చాలకంగా చేతనం అవుతాయి. ఒకవేళ మీరు మానవీయంగా అనువర్తనం ప్రారంభించాలనుకుంటే, మీరు వాడే ఫైల్ లేక పరికరము పై మోస్ నిలిపి కుడి మీట నొక్కితే తెరుచు అన్న మెనూ కనబడుతుంది. దానితో మీకు కావలసిన అనువర్తనం ఎంపికచేసి ప్రారంభించుకోవచ్చు. ఇక మీరు కొత్త అనువర్తనం స్థాపించుకోవాలంటే వ్యవస్థ అమరికలు లో సినాప్టిక్ పేకేజి నిర్వాహికి ని ప్రారంభించి దానిలో మీకు కావలసిన పేకేజి పేరుతో వెతకవచ్చు. లేకపోతే కుడి వైపు డాక్ నుండి అనువర్తనాల వెతుకు ప్రతిమనొక్కి ఉబుంటుసాఫ్ట్వేర్ కేంద్రము లో వర్గాల వారీగా వున్న అనువర్తనాల నుండి మీకు కావలసిన దానిని స్థాపించుకోవచ్చు. దీని కొరకు పాకేజి పేరు తెలియాల్సిన పనిలేదు. ఇక్కడ వెతికేటప్పుడు ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే పనిచేస్తాయి
ఫైళ్లతో పనులు
[మార్చు]మీరు అనువర్తనాలు వాడినపుడు కొత్త ఫైళ్లు సృష్టించటమో మార్చటమో చేస్తారు. ఇటీవలే వాడిన పత్రాలు అనువర్తనాల మెనూద్వారా తిరిగి వాడవచ్చు. భద్రపరచేటప్పుడు లేక ఇతరత్రా వాడాలనుకున్నప్పుడు, మెనూలో నివాస సంచయం ఎంపికచేసుకొని మీకు కావలసిన ఫైల్ కోసం వెతకవచ్చు. మీరు తొలగించే ఫైళ్లు చెత్తబుట్టలో చేర్చబడతాయి. అవసరమైనపుడు చెత్తబుట్టనుండి తిరిగి తెచ్చుకొనవచ్చు. ఎడమవైపు డాక్ నుండి ఫైళ్లు వెతుకుటకు ప్రతిమ నొక్కి వెతకవచ్చుకూడా.
కంప్యూటర్ పని ముగింపు
[మార్చు]మీ డాష్ బోర్డు కుడి పై మూలలో కంప్యూటర్ శక్తి గుర్తు వృత్తంలో ఒక గీత గుర్తు పై నొక్కండి. దానిలో మూసివేయు ఎంపికతో మీ వ్యవస్థ ముగించవచ్చు. ఈ ఎంపికతో ఇటీవలి కంప్యూటర్లకు స్వయంచాలకంగా విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేయటం జరుగుతుంది. లేకపోతే ముగింపు పూర్తి అయిందనేసందేశం తరువాత మానవీయంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ఇతరులు వాడాలంటే వారికి వేరేగా ఖాతాలు ఏర్పాటు చేస్తే మీరు లాగౌట్ చేసినప్పుడు కంప్యూటర్ వారు వాడటానికి సిద్దం అవుతుంది.