ఉబుంటు/ఫోటోలు
స్వరూపం
< ఉబుంటు
ఫొటోలు కంప్యూటర్లో ప్రవేశపెట్టటానికి మీ డిజిటల్ కెమేరా కాని అనుసంధానించిన స్కానర్ వాడి చేయవచ్చు. ఉబుంటులో ఫోటోలని చక్కదిద్దటానికి షాట్వెల్ ఫొటో నిర్వాహకి వాడుతారు. మరిన్ని సౌలభ్యాలకి గింప్ (GIMP) వాడవచ్చు.
కెమేరా
[మార్చు]మీరు కెమేరా అనుసంధానించినపుడు, అనువర్తనం ఎంపికకోసం పాప్ అప్ విండో కనబడుతుంది. ఆ తరువాత మీ కెమేరాలోని ఫొటోలు వీడియోలు చూపెడుతుంది. వాటిని ఎంపిక చేసుకొని మీ కంప్యూటర్ సంచయంలో పెట్టుకోవచ్చు. ఆ తరువాత వాటి ని చక్కదిద్దటం (ఉదా: రెడ్ ఐ సరిదిద్దు, పరిమాణం మార్చు లాంటివి) చేయవచ్చు.
స్కానర్
[మార్చు]ఉబుంటులో సింపుల్ స్కాన్ అనే అనువర్తనంతో మీ దగ్గరవున్న స్కానర్ నుండి భౌతిక ఫొటో లేక పత్రాన్ని డిజిటల్ రూపంలో మార్చుకోవచ్చు.