ఉబుంటు/ఆర్థిక మరియు ఇతర లెక్కలు
స్వరూపం
< ఉబుంటు

ఆర్థిక మరియు ఇతర లెక్కలు చూసుకొనటానికి మరియ మన దత్తాంశాన్ని చిత్రాల రూపంలో మార్చుటకు సరియైన అనువర్తనం లిబ్రెఆఫీస్ కేల్క్. ఈ విభాగంలో దీనిని ఎలా వాడుకోవచ్చో పరిశీలిద్దాం.
ఉదాహరణ
[మార్చు]తెలుగు కళాజ్యోతి, చిక్కడపల్లి సంస్థ 2010-11 వార్షిక ఆదాయ వ్యయాల చిట్టా వివరాలు ఇలా వున్నాయి.
- ఆదాయం
| వివరణ | మొత్తం |
|---|---|
| సభ్యత్వ రుసుం | 30000 |
| ఆంతర్జాల తెలుగు సంస్థ విరాళం | 70000 |
| బ్యాంకు వడ్డీ | 5053 |
- వ్యయం
| వివరణ | మొత్తం |
|---|---|
| ప్రకటన ఖర్చులు | 10000 |
| కళాకారుల ఫీజు | 75000 |
| వేదిక ఫీజు | 20000 |
ఈ వివరాన్ని కేల్క్ లో ప్రక్కన బొమ్మలో చూపినట్లుగా ప్రవేశపెట్టండి. మొత్తం కనుక్కోటానికి B9 లో =SUM(B5:B7) అనే సూత్రాన్ని ప్రవేశ పెట్టండి. మిగులు కనుక్కోటానికి D8 లో సూత్రం =D9-SUM(D5:D7) వాడండి. ఆ తరువాత అదాయం పట్టిక లో ని దత్తాంశాన్ని ఎంచుకొని చిత్రం తయారు చేయండి.