ఆలూ పన్నీర్ చాట్

Wikibooks నుండి

ఆలూ పన్నీర్ చాట్ తయారు చేయు విధానము

కావలసిన పదార్థాలు :[మార్చు]

  1. పన్నీర్ ముక్కలు - 2 కప్పులు
  2. నూనె - టేబుల్ స్పూన్
  3. కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
  4. నిమ్మరసం - టీస్పూన్
  5. బేబీ పొటాటోలు - పది (ఉడికించి పొట్టు తీయాలి)
  6. ఉడికించిన బఠానీలు - కప్పు
  7. అల్లం తురుము - టీస్పూన్
  8. పచ్చిమిర్చి తురుము - టీస్పూన్
  9. మిరియాల పొడి - అరటీస్పూన్
  10. ఉప్పు - రుచికి తగినంత
  11. కారప్పూస - సరిపడా
  12. ఆమ్ చూర్ - 2 టీస్పూన్లు

తయారుచేసే పద్ధతి :[మార్చు]

బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసి మరో నిమిషం వేయించాలి. ఇప్పుడు ఆమ్ చూర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కాస్త కారప్పూస చల్లి వడ్డించ వచ్చు.