Jump to content

ఉబుంటు/ఉబుంటు చరిత్ర

Wikibooks నుండి
(ఉబుంటు చరిత్ర నుండి మళ్ళించబడింది)

ఉబుంటు [1]ఒక లినక్సు పంపకం. ఇది డెబియన్ జి.యన్.యు/లినక్సు మీద నిర్మించబడింది. దీని పంపంకందారు మార్క్ షటిల్వర్త్ స్థాపించిన కనోనికల్ లిమిటెడ్. ఈ పంపకం పేరు దక్షిణ ఆఫ్రికా లోని బంటు భాషలో ఉబుంటు అనగాఇతరుల పట్ల మానవత్వం నుండి వచ్చింది. అనగా కంప్యూటర్ ని ప్రతివారికి సులభం చేయటం మరియు అందరు కలిసి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం అనేవి దీని ముఖ్య లక్షణాలు. ప్రతి 6 నెలలకు ఒక కొత్త రూపాంతరము(వెర్షన్) విడుదల చేయబడుతుంది. ఉబుంటు లినక్స్ ను స్వేచ్ఛగా, ఉచితముగా వాడుకొనవచ్చును, మరియు కాపీలను సంకోచము లేకుండ ఇతరులకు యియ్యవచ్చును. పాఠశాలల కొరకు ప్రత్యేక ఎడ్యుబుంటు అను అవతారము , ఇంకా కుబుంటు, క్జుబుంటు మరియు ఇతర అవతారములు గలవు.

లక్షణాలు

[మార్చు]

సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు వేరొక వ్యవస్థ నిర్వహణాధికారి అవసరంలేకుండా సాధారణ వాడుకరే సుడో (sudo) అన్న ఉపకరణాన్ని నిర్వహణ ఆదేశాల ముందు చేర్చి వాడుకోవచ్చు. స్థాపన మాధ్యమం నుండి హార్డ డిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరం లేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలనుండి అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనులకొరకు అనువర్తనం లిబ్రెఆఫీసు , అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనము జింప్ , రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ రక్షణ పెరుగుతుంది.

11.04 తాజా విశేషాలు

[మార్చు]

11.04 విడుదల లో గ్నోమ్ 2. 32.1కలిగివుంది. గ్నోమ్ షెల్ కు బదులుగా యూనిటీ అనే సరికొత్త అంతర్వర్తి (interface) రూపం లభిస్తోంది. ఇది పాత తరం కంప్యూటర్లలో 2D మరియు కొత్త తరం కంప్యూటర్లలో 3D రూపాలలో వుంటుంది.

రంగస్థలం

[మార్చు]
యూనిటీ 2d అంతర్వర్తి

ఉబుంటు తెలుగురూపంలో కూడా అందుబాటులో వుంది. దీనికొరకు స్థాపన సమయంలోనే తెలుగు ఎంచుకోవచ్చు లేక ఇంగ్లీషులో స్థాపన పూర్తయిన తర్వాత System->Administration->Language support లో Install/Remove Languages లో తెలుగు ని ఎంపికచేసుకొని స్థాపించుకోవాలి.

ఉబుంటు ఒన్ (క్లౌడ్ నిల్వ స్థలము)

[మార్చు]

క్లౌడ్ నిల్వ స్థలము ద్వారా డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోటానికి, భద్రం చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే ఉబుంటు ఒన్[2]. దీంట్లో ఉచితంగా ఖాతా సృష్టించుకొని ముఖ్యమైన దస్త్రాలను భద్రం చేయవచ్చు. దీంతో అంతర్జాల సంపర్కముతో ఎక్కడనుండైనా డేటాని పొందవచ్చు. ఇష్టాంశాలు, సంపర్కాలు, సంగీతం, ఫైళ్లు, బొమ్మలు దీంట్లోకి భద్రం చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్ నిల్వ స్థలము (క్లౌడ్‌ స్టోరేజీ స్పేస్‌)ను ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను భద్రం చేసుకోవచ్చు.

బయటిలింకులు

[మార్చు]
  1. ఉబుంటు
  2. ఉబుంటు ఒన్