యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/చీకట్లో సూర్యుడు

Wikibooks నుండి

ఇది యండమూరి రాసిన మొదటి వైజ్ఞానిక కల్పనా (సైన్స్ ఫిక్షన్) నవల.

భూమికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గెలాక్సీలోని ఒక గ్రహం వారు తమ ఇంధన కొరతను తీర్చడానికి సరైన నక్షత్రం కోసం వేటాడుతుంటారు. వారికి మన విశ్వంలో ఉన్న సూర్యుడు తారసపడతాడు. దాన్ని వాళ్ళ అద్భుత సాంకేతిక పటిమతో సరాసరి గ్రహానికి చేరువగా తీసుకెళ్ళాలనుకుంటారు. ఈ పరిస్థితిని ఊహించి భూమ్మీద నుంచి కొంతమంది శాస్త్రవేత్తలను రాయబారం పంపుతారు. వారి వ్యోమ నౌక కాంతి వేగంతో ప్రయాణించి సుదూరంలో ఉన్న గ్రహాన్ని చేరుకుని కార్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి కాంతివేగం కంటే ఎక్కువ వేగంతో తిరిగి భూమిని చేరుతుంది. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఓ ప్రేమకథ అంతర్లీనంగా సాగుతుంటుంది.