సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.8
అథ దైవతీ : దైవతము ( ద ) స్వరము ప్రధాన స్వరముగా స్వరరచన.
75
స్తోదైవత్యాంరిధావంశౌలంఘ్యావారోహిణేసపౌ
పలోపాత్షాడవంపరిప్రోక్తమౌడువంసపలోపతః
76
ఋషభాదిర్మూర్ఛనాస్యాత్తాలోమార్గశ్చగీతయః
వినియోగశ్చషాడ్జీవత్కలాద్వాదశకీర్తితాః
ద స్వరము ప్రధాన స్వరముగా స్వరరచనలో రి ద లు అంశ స్వరములు.ఆరోహణమునందు స ప స్వరములను కొంచెము స్పృశించి దాటు స్వరము వేయవలెను.ప లోపించినపుడు 6 స్వరములు
( సరిగమదని ) స ప లోపముతో 5 స్వరములు ( రిగమదని ) పలుకును.రి ప్రారంభస్వరము. రి మ ద లు వ్యతిరేక ధ్వనులు కూడ ఇచ్చును.
ప్రస్తారము :
శ్లోకము : తరుణామలేందుమణిభూషితామలశిరోజం
భుజగాధిపైకకుండలవిలాసకృతశోభమ్
నగసూనులక్ష్మీదేహార్ధమిశ్రితశరీరం
ప్రణమామిభూతగీతోపహారపరితుష్టమ్
12 వరుసలు
1 దా దా నిద పద మా. మా. మా. మా
త రు. ణా. మ లే. - ం దు
దా. దా. నిద నిస సా. సా. సా. సా
మ ణి. భూ. షి. తా. - - మ
సద దా. పా. మద దా. నిద దని. దా
ల శి. రో. - - జం. - -
సా సా రిగ రిగ సా. రిగ. సా. సా.
భు. జ గా. ధి. పై. - - క
దా. దా. నీ. పా. దా. పా. మా. మా.
కుం. డ ల - వి. లా. - స
దా. దా. పా. మద దా. నిద దని. దా
కృ. త శో. - - - భం. -
దా. దా. నిస నిస నిద పా. పా. పా.
న గ సూ. - ను. ల క్ష్మీ. -
రిగ సా. సా. సా. నీ. నీ. నీ. నీ.
దే. - హా. - ర్ధ. మి. శ్ర. -
సా. రిగ రిగ సా. నీ. సా. దా. దా.
త శ రీ. - - రం. - -
రీ. గరి. మగ మా. మా. మా. మా.
ప్ర. ణ మా. - మి. భూ. త
నీ. నీ. దా. దా. పా. రిగ సా. రిగ
గీ. - తో. - ప హా. - ర
పా. దా. సా. మా. దా. నీ. దా. దా.
ప రి. తు. ష్ట. - మ్. - -
తరువాతి పేజీ 8.9