సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.6
స్వరూపం
గీత స్వరగతాధ్యాయము- గీత ప్రకరణము
[మార్చు]అథ మధ్యమా: మ స్వరం ప్రధానంగా స్వరరచన
శ్లోకాలు 70 - 72
- పంచాంశామధ్యమాయాంస్యురగాంధారనిషాదకాః
- షడ్జమధ్యమబాహుల్యంగాంధారోల్పోత్రషాడవం
- గలోపీన్నిగలోపేనత్వౌడువంస్యాత్కలాష్టకం
- ఋషభాదిర్మూర్ఛనాస్యాత్తాలశ్చంచత్పుటోమతః
- వినియోగోధ్రువాగానేద్వితీయప్రేక్షణేభవేత్
మధ్యమ గ్రామ లక్షణము: మ ప్రధాన స్వరమైనపుడు గ, ని రెండు స్వరములు పలకవు. వర్జితములవుతాయి.స, మ లు బహుళంగా ప్రయోగింపబడతాయి. గ స్వరం విడిచి పాడిన రాగాలు షాడవములు. గ ని విడిచి పాడిన రాగములు ఔడవములు. 8 కళలు. తాలము చంచత్పుటము. వైదిక గానమున రెండవదిగా ప్రయోగింపబడును.
- అస్యాంమధ్యమాయాంమధ్యమోన్యాసఃఅంశాయయేవపన్యాసః
- చోక్షషాడవదేశ్యాంధాల్యోదృశ్యంతేఅస్యాంప్రస్తారః
ఉదా శ్లోకం:
- పాతుభవమూర్ధజాననకిరీటమణిదర్పణం
- గౌరీకరపల్లవాంగులిసుతేజితంసుకిరణమ్
భావం: శివునితలపైని మణికిరీటం దర్పణంలా ప్రకాశిస్తున్నది.ఆ అద్దంలో పార్వతీదేవి చేయి చిగురాకులా కనిపిస్తూ మెరుస్తున్నది.
స్వరరచన:
- మా మా మా మా పా దని నీ దప
- పా. - - తు భ. వ. మూ ర్ధ
- మా పమ మా పా సా. గా గా రీ రీ
- జా. - - న. న. మ్ - -
- పా మా. రిమ. గమ. మా మా మా మా
- కి. రీ. - ట. మ. - ణి. -
- మా. నిద. నిస. పమ. పద. మా. మా
- ద - ర్ప. - ణ. ం.
- నీ. నీ. రీ. రీ. నీ. రీ. రీ. పా
- గౌ. రీ. క. ర. ప. ల్ల. వ.
- నీ. మప. మా. మా. సా. సా. సా. సా
- అ. మ్. గు. లీ. - క. - -
- గా. నీ. సా. గా. దప. మా. దని. సా.
- సు. తే. జి. త. మ్. - - -
- పా. సా. పా. నిదప. మా. మా. మా. మా.
- సు. కి. ర. ణం. - - - -
| తరువాత పేజీ 8.7 |
|---|