సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.5
తరువాతి స్వరరచన గాంధారం లేదా గ స్వరం ప్రధాన స్వరంగా స్వరపరచబడింది
శ్లోకం: ఏతంరజనివధూముఖవిభ్రమదంనిశామయవరోరు
తవముఖవిలాసవపుశ్చారుమమలమృదుకిరణమమృతభవం
రజితగిరిశిఖరమణిశకలశంఖవరయువతిదంతపంక్తినిభం
ప్రణమామిప్రణయరతికేళికలహరవనుదంశశినమ్
చీకటి అనే వధువు ముఖంలో విరిసిన వెలుగు రేఖఅయిన, తన విలాసంతో ఆ యువతిని అమృతమయంగా చేయగల , వెండికొండ పై చంద్రకాంతమణిని ధరించిన యువతి పలువరుసలా వెలిగే ప్రణయరతిలో కలహాన్ని కలిగించగల చంద్రునికి నమస్కరిస్తున్నాను.
అథగాంధారీ
67
పంచాంశారిధవర్జ్యాఃస్యుర్గాంధార్యాంసంగతిఃపునః
న్యాసాంశాభ్యాంతదన్వేషాందైవతాదృషభంవ్రజేత్
68
రిలోపరిధలోయభ్యాంషాడవోడువితేక్రమాత్
పంచమఃషాడవద్వేషీనిసమధ్యమపంచమాః
69
అంశాద్విష్యంతౌడువితంకలాఃషోడశకీర్తితాః
మూర్ఛనాదైవతాదిఃస్యాత్తాలశ్చంచత్పుటోమతః
70
వినియోగోధ్రువాగానేతృతీయప్రేక్షణేభవేత్
అస్యాంగాంధార్యాంగాంధారోన్యాసః
షడ్జపంచమావపన్యాసౌగాంధారపంచమ
దేశావల్యోదృశ్యంతేఅస్యాఃప్రస్తారః
గాంధారి లక్షణము చెప్పబడుచున్నది. గాంధారికి ఋషభ దైవతములు వర్జితములు.
షడ్జ గాంధార మధ్యమ నిషాదములు అంశములు. గ్రహములు. అంశము ప్రధాన స్వరము.
గ్రహము ఎత్తుగడ లేదా ప్రారంభ స్వరము. న్యాసాంశస్వరములతో అన్యములకు సంగతి కలదు.
ఆరోహణమున దైవతము రిషభము నుండి పలుకును. ఋషభ లోపము వలన షాడవ రాగమగును. దైవతము కూడ లోపించిన ఔడవమగును. ( 5 స్వరములు కలిగిన రాగములు ఔడవములు) . ఇటువంటి కళలు 16 చెప్పబడినవి. గాంధారము న్యాసము. షడ్జము , పంచమము అపన్యాసములు. గాంధారపంచమి ( గ3 ) దేశి రాగములందు ప్రసిధ్ధము.
16 కళలు స్వరరచన
1 గా గా సా నీ సా గా గా గా
ఏ తం.
2 గా గ మ పా పా దప మా నది నిస
ర జ ని. వ ధూ. ము. ఖ
3 నిద పని. మా. మపరి. గా గా గా గా
వి. భ్ర. మ దం
4 గా గమ పా. పా. దప మా నిద నిస
ని. శా. మ య వ రో. రు
5 నిద పని. మా. మపరీ. మా. గా. మా. పా
త వ ము. ఖ వి. లా. స
6 గా. పా. గా. గా. గా. గమ గా. గా.
వ పు. శ్చా. రు. మ మ ల
7 గా. గమ ద పా. దప మా. నిపా. నిస
మృ. దు. కి. ర ణ
8 నిద పని. మా. మసరి. గా. గా. గా. గా
మ మృ. త భ వం
9 రీ. గా. మా. దద రీ. గా. సా. సా.
ర జ త గి. రి. శి. ఖ ర
10 నీ. నీ. నీ. నీ. నీ. నీ. నీ. నీ.
మ ణి. శ క ల శం. ఖ
11 గా. గమ పా. పా. స ద మా. నిద నిప
వ ర యు. వ తి. దం. త
12 నిద పని. మా. మపరి. గా. గా. గా. గా
పం. క్తి. ని. భం
13 నీ. నీ. పా. నీ. గా. మా. గా. సా
ప్ర. ణ మా. మి. ప్ర. ణ య
14 గా. గాసా. గా. గా. గా. మ గా. గా
ర తి. క ల హ ర వ ను
15 గా. పా. మా. మా. నిద నిస నిద పని
దం. - - - - - - -
16 మా. పరిగ గా. గా. గా. గా. గా. గా
శ శి. న. మ్. - - - - -
తరువాతి పేజీ 8.6