సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.3
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
గీత స్వరగతాధ్యాయము- గీత ప్రకరణము
[మార్చు]- షడ్జమము - స
- శుధ్ధ రిషభము - రి1
- చతుశృతి రిషభము - రి2
- షట్శృతి రిషభము - రి3
- శుధ్ధ గాంధారము - గ1
- సాధారణ గాంధారము - గ2
- అంతర గాంధారము - గ3
- శుధ్ధ మధ్యమము - మ1
- ప్రతిమధ్యమము - మ2
- పంచమము - ప
- శుధ్ధ దైవతము - ద1
- చతుశృతి దైవతము - ద2
- షట్శృతి దైవతము - ద3
- శుధ్ధ నిషాదము - ని1
- కైశికి నిషాదము - ని2
- కాకలి నిషాదము - ని3
ఇవి వీణలో తెల్లటి గుర్తుల ద్వారా సూచింపబడతాయి. ఈ శృతి భేదాలలో ఉచ్చారణకు దగ్గరగా వున్న శృతులను ఉదాత్త, అనుదాత్త స్వరభేదాలతో పలుకుతూ ఒకటి రెండు స్వరాలు ప్రధానంగా పాడేది వైదిక గానం. ఇప్పటికీ వేదాలను 2 లేదా 3 స్వరాలతో మాత్రమే పాడతారు.
ముందు చెప్పిన శ్లోకం (8.1) వైదిక మార్గంలోనిది కనుక స ప స లైన శుధ్ధ స్వరాలు ప్రధానంగా రి గ మ ద ని స్వరాలు అంశ స్వరాలుగా స్వరపరచబడింది.
ప్రధానమైన శృతులు 22. కాని ప్రస్తుతం వీణలో మనం ఉపయోగిస్తున్న ప్రధానమైన శృతులు మాత్రమే. ఆ శృతులను, స్వరస్థానాలకు ఇమిడ్చే పథకం 72 మేళకర్తల పథకం. ఈ పథకంలో 12 చక్రాలున్నాయి. ఒక్కొక్క చక్రంలో 6 రాగాలున్నాయి.
64 శ్లోకం
- ఆర్షభ్యాంతుడ్రయోఅంశాస్స్యుఃనిషాదర్షభదైవతైః
65 శ్లోకం
- ద్విశ్రుత్యోః సంగతిః శేషైర్లంఘనం పంచమస్యచ
- షాడవంషడ్జలోపేనసపలోపాదియౌడువమ్
66 శ్లోకం
- మూర్ఛనాపంచమాదిశ్చ తాలశ్చత్పులోరుతః
- అష్టౌకలాభవంతీహవినియోగస్తు పూర్వతత్
ఈ శ్లోకాలలో అప్పటి పధ్ధతి ప్రకారం ఒకే తీగను రకరకాలుగా కంపింప జేసి వేరువేరు ధ్వనులను పలికింపజేసే పధ్ధతి తెలియజేయబడింది. దీనినే తరువాత 'గమకవరీక' పధ్ధతిగా అభివృద్ధి పరచారు. స్వరాన్ని రంజింపజేసే పధ్దతిలో తీగను మీటే పధ్ధతిలో రకరకాల భేదాలని దశవిధగమకములు అంటారు. ఈ 10 రకాలైన గమకాలు, వాటి పేర్లను, పధ్ధతులు ఈ క్రింద ప్రస్తావించాను. అవి - 1) కంపితము, 2) లీనము, 3) ఆందోలితము, 4) ప్లావితము, 5) స్ఫురితము, 6) తిరుపము, 7) ఆహతము, 8) వళి లేదా సుడి, 9) ఉల్లసితము, 10) గుంఫితము[1]
మూలాలు
[మార్చు]- ↑ సుబ్బరామ దీక్షితులు, సంకలనం. సంగీత సంప్రదాయ ప్రదర్శిని. పు. 72, 73.
| తరువాత పేజీ 8.4 |
|---|