Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.2

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

గీత స్వరగతాధ్యాయము- గీత ప్రకరణము

[మార్చు]

ఇక్కడ మనం గమనించవలసిన విషయం అర్థం లేదా భావ ప్రధానంగా సాహిత్యాన్ని పాడాలి.

స్వరాలు పాడేటప్పుడు ఇంపైన ధ్వని ప్రధానంగా రాగలక్షణాలు లేదా రాగం విరుపులు ప్రధానంగా వినిపించాలి. తాళం లేదా లయ రెంటికీ సమానంగా వర్తిస్తుంది.

సాహిత్యాన్ని పాడేటప్పుడు మనం ఉచ్చారణను స్పష్టంగా , ప్రతి అక్షరం అర్థమయ్యేటట్టుగా ఉచ్చరించాలి. లఘువులు, గురువులు ,దీర్ఘములు హ్రస్వములు వత్తులు , సంయుక్తాక్షరములు వేటికవి వినిపిస్తూ ఆ యా పదాల అర్థాలను మనంపాడే తీరులోనే తెలియజేయాలి.

అక్షరమాలలోని హల్లులు వాటి వర్గాలు ఇక్కడ వివరింపబడ్డాయి.

క వర్గము : క ఖ గ ఘ జ్ఞ (ఇందులో మొదటి వర్గము దంత్యములు. దంతాలతో పలికేవి. దవడలతో పలికేవి.)
చ వర్గము : చ ఛ జ ఝ ఞ (రెండవదైన చ వర్గము తాలవ్యములు.)
ట వర్గము : ట ఠ డ ఢ ణ (ట వర్గము కంఠ్యములు. శబ్దం కంఠం లోపలినుంచి పుడుతుంది.)
త వర్గము : త థ ద ధ న ( త వర్గములో అక్షరములు మూర్థన్యములు. అంగిలి లోపలినుంచి పలికేవి.)
ప వర్గము : ప ఫ బ భ మ (ప వర్గము పెదవులు రెండిటిని కలిపి పలుకవలసినవి.)
య ర ల వ శ ష స హ ళ ఱ (యరలవలు అంతస్థములు. లోపలి కొండనాలుకతో పలికేవి. శషసహలు ఊష్మములు. ఊది పలికేవి).

ఈ రకమైన విభజన అడ్డంగా చదివినపుడు తెలుస్తుంది.

నిలువుగా చదివినపుడు 5 వర్గాలు.

వర్గ ప్రథమాక్షరాలు క చ ట త ప లు పరుషములు. నొక్కి పలుకవలసినవి.
వర్గ తృతీయములు అంటే గ జ డ ద బ లు సరళములు. తేల్చి తేలికగా పలికేవి.
వర్గ పంచమాక్షరములు జ్ఞఞణనమలు అనునాసికములు. ముక్కుతో పలుకవలసినవి.

వర్గంలోని 2, 4 వరుసల అక్షరాలు మహా ప్రాణములు. సంస్కృత భాషాక్షరాలు. వాటిని ఆ భాషా మర్యాదను అనుసరించి పలుకవలసి వుంటుంది. అర్థ భేదము రాకుండా సాహిత్యం పాడటానికి ఈ ఉచ్చారణ పద్ధతులు క్షుణ్ణంగా పాడే విద్యార్ధులందరూ నేర్చుకోవలసివుంటుంది.

స్వరరచనను వివరించునపుడు వీణ తీగ ఆధారముగా 22 శృతులను వివరించుట తేలిక.

ఈ పుస్తకంలో వీటికి వేరే పేర్లు, ఆ స్వరాలకు స్వరస్థానాలు శృతులుగా పేర్కొనబడ్డాయి. అప్పటి పాడే పధ్ధతి ప్రకారం ఒక్కొక్క శృతికి ఒక తీగ బిగించి వేరు వేరు శృతులను పలికించేవారు. తరువాత మారిన పధ్ధతిలో వీణలో ఒకే తీగపై పొడవు మార్చి కంపింపజేయడం వలన పౌనఃపున్యాన్ని (frequency) మార్చి పలికిస్తున్నారు.

వీణలో 22 శృతులు వున్నాయి. ——————————————————————————————————-
కాని స్వర స్థానములు 16 మాత్రమే. * * * * * * * * * * * * * * * * * * * * * * *

22 శృతులు ఎక్కడెక్కడ పలుకుతాయో చెప్పడానికి ఒక పథకముంది. స ప స అని శృతి నిలపడం నేర్చుకొని గాత్ర సంగీతంలోను, శృతి పెట్టె లేదా శృతి హార్మనీ ద్వారా వాద్యాలలోనూ ఈ స్వరస్థానాలను నిలపడం విద్యార్థులు నేర్చుకుంటారు.

తరువాత పేజీ 8.3