సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.10
ఈ స్వరగతాధ్యాయంలో కేవలం స్వరాలు వాటి కూర్పు గురించి మాత్రమే చెప్పబడింది. స్వరాలు రాగాలుగా ఎలా మారతాయో రాగాన్ని ఎలా పెంచాలో రాగ విభజన ఎలా చేయాలో అనే విషయాలను రెండవదైన రాగవివేకాధ్యాయంలో చెప్పారు గ్రంథకర్త. ఇంతవరకు చెప్పింది స్వరాలను గూర్చిన శాస్త్రం. దీనిని ప్రయోగవేళ ఎలా పొందుపరచాలో నేర్పేదే గీత ప్రకరణం.ఇందులో ఇక్కడివరకు గ్రంథకర్త ఇచ్చిన ఉదాహరణలను, శ్లోకాలను మాత్రమే రాసాను.ఈ పధ్ధతి స్వర సంప్రదాయ పధ్ధతి. దీని ఆధారంగానే శృతులు అనబడే వేదాలు చెప్పబడేవి.లేదా పాడబడేవి.ఏ స్వరానికి ఆ స్వరం,ఏ శృతి ఏ స్వరంతో కలిస్తే వినసొంపైన శబ్దం వినిపిస్తుందిఇలాటి విషయాలు ఇంతవరకు శాస్త్రబధ్ధంగా వివరింపబడ్డాయి.ఈ పద్ధతిలోనే ఇప్పటి కాలంలో వాడుకలో ప్రయోగింపబడుతున్న ఒక శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇస్తున్నాను.
శ్లోకం : శ్రీరామచంద్ర శ్రితపారిజాత
సమస్తకళ్యాణగుణాభిరామ
సీతాముఖాంభోరుహచంచరీకః
నిరంతరంమంగళమాతనోతు.
ఇది ఒక సంస్కృత శ్లోకం. పూర్వులు దీనిని స్వరపరచి గీతంగా మార్చారు.
స్వర స్థానాలు
ఆ : స రి2 గ2 మ1 ప ద1 ని2 స
అ : స ని2 ద1 ప మ1 గ2 రి2 స
ఈ స్వర స్థానాల్లోకి శ్లోకం అక్షరాలను పొదిగి స్వర ధ్వనులకు లేదా శృతులకు అనుగుణంగా
స్వరాన్ని పలికిస్తూ శ్లోకాన్ని పాడటమే ( స్వరరచన చేయడమే ) గీతమని చెప్పబడుతుంది.
తాళాంగములు అంటే తాళము వేయడానికి అవసరమైన పధ్ధతులు. లేదా ప్రక్రియలు. తాళము scale అనేది సంగీతధ్వనులను కొలిచే కొలతబద్ద. మనం అక్షరకాలాన్ని గురించి చెప్పుకున్నాం. లఘువు హ్రస్వాక్షరం. దీర్ఘాక్షరానికి అంతకు రెట్టింపు కాలం పడుతుంది. సంయుక్తాక్షరానికి 1 1/2,
లేదా 2 అక్షరాలకాలం పడుతుంది. ఎలాగంటే శ్ + రీ = శ్రీ అవుతుంది. 1 లఘువు ఒక దీర్ఘము
పలుకుతాయి. దీనికి 1 1/2 అక్షరకాలం. చంచరీకః అనే దాన్లో విసర్గం పలకాలి. క + ః దీనికి
1 1/2 పలుకుతుంది. అలా ఉచ్చారణను బట్టి మనం అర్థం చేసుకుంటూ అర్థవంతంగా గీతంగా దీనిని పలికించాలి.
పూర్వులు దీనిని 14 అక్షరాల కాలంగా నిర్ణయించి స్వరపరిచారు.
దానిని మనం ఈ రకంగా నేర్చుకుంటాము.
స రి గ మ గ రి స రి గ రి స రి గ మ = 14
శ్లోకం స్వర సహితంగా :
గ రి గ మ పా - మ గ రి గ మ ప మా - = 14
శ్రీ. - రా - మా - చం - ద్రా- - శ్రి. త పా
ప ద ని ని ద ప మ ని ద ప మ గ రి స = 14
- రి. జా - త - స మ స్త. - - - -
స రి స ప మ ప గ రి గ మ గ గ రి స = 14
క ల్యా - - ణ గు.- ణా - భి రా - - మ -
రి రి గ గ మ మ గ గ రి గ మ ప మ మ = 14
సీ - తా - ము ఖా - - అం భో - రు హ
ప ద ద ని ని స ప ద ని స రి గ రి స = 14
చం - - చ రీ. - - - - క - - - - - ః
ని రి స గ రి స ని ని ద మ ప ద ని స = 14
ని. రం. - - త - రం - మం - గ - - ళ -
ప ద ప స ని స ప ద మ ప మ గ రి స = 14
మా - - త - - నో - - తు - - - - - - -
ఆరోహణ సరిగమపదనిస అవరోహణ సనిదపమగరిస అనే 8 అక్షరాలే కాని
ఇందులో స ప స లు ప్రకృతి స్వరాలు. వాటికి స్వరభేదాలు లేవు. మిగిలిన రిగమదని
లకు స్వరాలను , శృతులను మార్చి వేరే రాగంలో పాడవచ్చు.