సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/8.1
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
గీత స్వరగతాధ్యాయము- గీత ప్రకరణము
[మార్చు]ఇది స్వర ప్రస్తారము
[మార్చు]ప్రస్తారమనగా కళలయందు స్వరసన్నివేశము చేయుట. శుధ్ధ స్వరముల సమ్మేళనము కళ యని చెప్పబడును. శుధ్ధ స్వరములు లేదా శబ్దములను ఒక క్రమంలో మిళితం చేసి రంజక స్వర ప్రయోగములుగా చేయడం కళ. ఆ కళలలోనికి శబ్దోచ్చారణకు అనుగుణమైన అర్థవంతమైన పదప్రయోగాలను కూర్చి పాటగా తయారు చేయడమే ప్రస్తారమవుతుంది.ఈ రకమైన ప్రయోగాలు స రి గ మ ప ద ని సప్త స్వరాలకు ఉదాహరణలతో ఇవ్వబడ్డాయి. మొదటి రకం ప్రకారం ఒక సంస్కృతశ్లోకం చెప్పి దానికి స్వరరచనను చెప్పారు.
కలలయందు స్వరసన్నివేశము చేయబడుట.
శ్లోకం:
తంభవలలాటనయనాంబుజాధికం
నగసూనుప్రణయకేళీసముద్భవమ్
సరసకృతతిలకపంకానులేపనమ్
ప్రణమామికామదేహేంధనానలమ్
అర్థం: లలాటమున అనగా నుదుటిపై అధికముగా (ఎక్కువగా ) కన్ను కలిగిన, నగసూను అనగా పర్వతరాజపుత్రి, కొండ పుత్రిక ప్రేమలో మునిగియున్న కారణంగా శరీరంపై ఘర్మజలాన్ని పూతగా కలిగిన దేహాగ్ని కలిగినవారికి (శివపార్వతులకు) నమస్కరిస్తున్నాను.
స ఇది షడ్జగ్రామము. అనగా స స్వరముతో ప్రారంభమగునది. సప్తస్వరములు గనుక
- ఆరోహణము : స రి గ మ ప ద ని స
- అవరోహణము : స ని ద ప మ గ రి స
మొదట శుధ్ధ స్వరములతో ప్రారంభించవలెను. స ప లు శుధ్ధ స్వరములు.
- 1 సా సా సా సా పా ని ద పా ద ని రీ గమ గా గా సా రిగ దన దా రిగ సా రీ గా
- 2 దా దా నీ నిస నిద పా సా సా నీ దా పా దని రీ గా సా గా సా దా దని పా సా
- 3 సా సా గా సా మా పా మా మా సా గా మా దని నిద పా గా రిగ గా గా సా సా
- 4 దా సా రీ గరి సా మా మా మా దా నీ సా దని రీ గారీసా రిగ సా రీ గా సా సా
మొదటగా చెప్పిన సంస్కృత శ్లోకాన్ని సాహిత్యమనీ లేదా మాతువనీ చెపుతారు.
అవే ధ్వనులు లేదా శబ్దాలు ఉచ్చారణ పరంగా స్వరరచనగా (notation) గా చెప్పినప్పుడు పైన చెప్పిన 4 వాక్యాలలా వుంటాయి. దీనిని మరింత స్పష్టంగా వివరించడం ప్రయోగపరంగా మాత్రమే సాధ్యపడుతుంది.
| తరువాత పేజీ 8.2 |
|---|