సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.7
61వ శ్లోకం నుంచి 64వరకు
[మార్చు]
61
సగయోఃసధయోశ్చాత్రసంగతిర్బహులస్తృగః
గాంధారాంశేననేర్లోపోమూర్ఛనాధైవతాదికా
స,గ స్వరములు,స,ద స్వరములు కలిసి ప్రయోగింపబడును.గాంధారము అనగా గ స్వరము బహుళముగా ప్రయోగింపబడును.గాంధారమునకు నిషాదలోపము లేదు.అంటే గ స్వరము ని స్వరము కలిసి ప్రయోగింపబడతాయి.మూర్ఛన ధైవతము(ద) మొదట వచ్చును.
62
త్రిధాతాలఃపంచపాణిరత్రచైకకలాధికః
క్రమాన్ మార్గాశ్చిత్తవృత్తిదీక్షిణాగీతయఃపునః
తాలము 3 విధములు.ఏకకాలము,ద్వికాలము,చతుష్కలము.ఇధి దెబ్బ,ఉసి,5 వేళ్లు సంకేతములు కలది.
63
మాగధీసంభావితాచపృధువేతిక్రమాదిమాః
నైష్కామికధ్రువాయాంచప్రధమేప్రేక్షణేస్మృతః
క్రమముగా ఏకకాలమందు చిత్రము,మార్గము,మాగధి గీతి, ద్వికాలమందు వార్తికము,మార్గము,సంభావిత గీతి,చతుష్కలమున దక్షిణము,మార్గము,పృధుల గీతి. ఇవి నాటక ప్రధమాంకమున వినియోగింపబడునవి.
64
వినియోగోద్వాదశాత్రకలాఅష్టలఘఃకలా
ఆర్షభ్యాంత్రయోఅంశాఃస్యుర్నిషాదర్షభధైవతాః
షడ్జగ్రామమున కలలు 12.అష్టలఘువులు అనగా 8 హ్రస్వాక్షరములు కలది కల.లఘువునకు 5 హ్రస్వాక్షరముల ఉచ్చాారణా కాలము పరిమితము.
65
అస్యాంషాడ్జ్యాంషడ్జోన్యాసఃగాంధారపంచమా
వపన్యాసౌవరాటీదృశ్యతేఅస్యాఃప్రస్తారః
షడ్జము(స) న్యాసము అనగా ప్రధాన స్వరమైనపుడు గాంధారము(గ),పంచమము(ప)అపన్యాసములు అనగా వ్యతిరేక శబ్దమును కలిగించునవి.వికృత శబ్దము తోచునపుడు అపశబ్దమగును.
ప్రస్తారము - స్వర సన్నివేశము ( స్వరరచన ) స్వరమును బొమ్మ కట్టించుట.