Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.6

Wikibooks నుండి

51వ శ్లోకం నుంచి 60వరకు

[మార్చు]

51
ఈషత్స్పర్శోలంఘనంస్యాత్ప్రాయస్తల్లోప్యగోచరమ్
ఉశంతితదనంశేఅపిక్వచిద్గీతతిశారదాః

ఒకే స్వరమును 2 సార్లు ఉచ్చరింంచుట జంట స్వరమని చెప్పబడును. అంధులో మొదటి స్వరము నొక్కి పలికి రెండవస్వరాన్ని తేల్చి పలుకుతారు. లంఘనము లేదా దాటు స్వరము కూడా ఇలాటిదే.రెంఢు విడివిడి స్వరములు దగ్గరగా పలికినపుడు ఒకదానిని నొక్కి పలికి రెంఢవ స్వరాన్ని తేల్చి పలుకుతారు.

52-53
న్యాయాదిస్థానమజ్ఘిత్వామధ్యేమధ్యేఅల్పతాయుజామ్ స్వరాణాంయావిచిత్రత్వకారిణ్యంశాదిసంగతాః అనభ్యాసైఃక్వచిత్క్వాపిలంఘనైరేవకేవరైః కృతాసాంతరమార్గస్యాత్ప్రాయోవికృతజాతిషు

శుధ్ధజాతులందు స్వములు లోపించుట ,అన్య స్వరములు చేరుట జరుగదు. వికృత జాతులైన ఔఢవ షాడవములందు భాషాంగ రాగములంధు మాత్రమే ఈ ప్రయేగములు కన్పట్టును.

54
షడవంతిప్రయోగాయేస్వరాస్తేషాడవామతాః
షట్స్వరంతేషుజాతత్వాద్గీతంషాడవముచ్యతే

శుధ్ధస్వరములైనా, వికృతి స్వరములైనా ఒక రాగము లేదా జాతికి సంబంధించిన స్వరములు 6 ప్రయోగించినపుడు అది షాడవ రాగమగును. 6 స్వరముల కలయికచే పుట్టినది కనుక గీతము కూడ షాడవమను పేరుతో పిలువబడును.

55-56
వాంతియాంత్యుడవోఅత్రేతివ్యోమోక్తముడవంబుధైః
పంచమంతచ్చభూతేషుపంచసంఖ్యాతదుద్భవా

ఔడువీసాఅస్తియేషాంచస్వరాస్తేత్వౌడువామతాః
తేసంజాతాయత్రగీతేతదౌడువితయేచ్యతే

నక్షత్రములు ఉడువములు. అందువలన ఉడువము అనగా తారలు ఉండు చోటు(ఆకాశము).పంచభూతములలో 5 వది ఆకాశము కావున 5 సంఖ్య ఔడువమని చెప్పబడినది.(వేదగణితము).సప్త స్వరములలో 2 లోపించి 5 స్వరములతో పాడు రాగములు లేదా జాతులు ఔడవములని చెప్పబడినవి.

57-59
తత్సంబంధాదౌడువంచపసచస్వరమిదంవిదుః
క్రమాదల్పాల్పతరతేషాడవౌడువమారిణోః

సంపూర్ణత్వదయాంస్తఃపంచమ్యాంతువిపర్యయః
వచనంవిధిరప్రాప్తౌఇహాల్పత్వబహుత్వయోః

పరిసంఖ్యాద్వయోఃప్రాప్తౌఏకస్యాతిశయాయయత్
అథప్రత్యేకమేతాసాంజాతీనాంలక్ష్మకథ్యతే

సంపూర్ణములనగా సప్తస్వరములు ఆరోహణము,అవోహణము రెంటి యందు కలవి. షాడవములు 6 స్వరములు కలవి.ఔడవములు 5 స్వరములు కలవి.జాతి లేదా రాగ లక్షణములతో గీతమును పాడునపుడు రాగములలో భేదములు తెలియుటకు స్వరములకుఅల్పత్వము,లోపము,అల్పతరత్వము,బహుత్వము,అప్రాప్తి, అతిశయము మున్నగు భేదములు విన్యాసమున వైవిధ్యమను తెచ్చును.ఇప్పుడివి గమకములని చెప్పబడుచున్నవి.అనంతరము క్రమముగా రాగములందు వీని ప్రయోగములు చెప్పబడను.

60
షాడ్జ్యామంశాఃస్వరాఃపంచనిషాదర్షభవర్జితాః
నీలోపాత్ షాడవంసోఅత్రపూర్ణత్వేకాకలీక్వచిత్

షడ్జ గ్రామము షాడ్జి. అందు నిషాదము,రిషభము విడిచి మిగిలిన స్వరములైన షడ్జగాంధారము,మధ్యమము,పంచమము,దైవతము అను 5 స్వరములుండును.నిషాదము(ని) వదలి పాడుటవలన షాడవమును(స) 6 వ స్వరముగా ప్రయోగింపవచ్చును. ఒక్కొక్కప్పుడు కాకలి నిషాదమును(ని3) పూర్ణత్వమునకై ప్రయోగింపవచ్చును.