సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.5
41వ శ్లోకం 50వరకు
[మార్చు]
41
అపన్యాసస్వరఃసస్యాద్యోవిదారీనమాపకః
కర్మారవ్యాంచనైషాద్యామాంధ్రీమధ్యమయోస్తధా
న్యాసమనగా శుధ్ధ స్వరము. లేదా ప్రకృతి స్వరమని చెప్పబడును.(స ప )వీనికి వ్యతిరేక ధ్వనిని అనగా అనునాదమును కలిగించక కలవని ధ్వని అపన్యాసమగును.
42
ఆర్షభ్యాంచస్వరాయేఅంశాస్తే అపన్యాసాః ప్రకీర్తితాః
ఉదీచ్యవానాంత్రితయేఅపన్యాసా షడ్జధైవతౌ
గీతము కలవక ఏ స్వరము విడిగా వేరే ధ్వనిగా వినిపించునో అది అపన్యాసము.రాగమందు ఆ రాగమునకు పలుకు స్వరములు( రాగఛ్చాయాస్వరములు ) కాక విడిగా పలుకు స్వరములు అపన్యాసములగును.షడ్జదైవతమునకు అపన్యాస స్వరము ఉదీచ్యవాత్రయము.కార్మారవికి, నైషాదికి అంశ స్వరములు అపన్యాసములు.
43
మధ్యమోరక్తగాంధార్యాంగాంధార్యాంషడ్జదైవతౌ
సనిపాఃపంచకైశిక్యాంపంచమ్యాంనిరపాస్మృతాః
రక్తగాంధారికి మధ్యమము అపన్యాసము అనగా వ్యతిరేకమగును.గాంధారియందు షడ్జపంచమములు అపన్యాసములు.షడ్జకైశికికి షడ్జనిషాద పంచమములు అపన్యాసములు.
పంచమికి నిషాదము(ని)ఆర్షభి(రి)పంచమము(ప) అపన్యాసములు.
44
రిపౌగాంధారపంచమ్యాంషాడ్జ్యాంగాంధారపంచమౌ
ధైవత్యాంరిమధాఃప్రోక్తానందయంత్యాంమపౌమతౌ
గాంధార పంచమికి రిషభము( రి ) పంచమము (ప ) అపన్యాసములు.
షాడ్జికి గాంధారము ( గ ) పంచమము ప అపన్యాసములు. నందయంతికి మధ్యమము
( మ ) పంచమము అపన్యాసములు.
45
రివర్జ్యాషడ్జకైశిక్యాంసప్తాపీత్యూచిరేఫరీ
సప్తస్వరాపన్యాసాంతు భాషంతే షడ్జమధ్యమా
కైశికికి రిషభము ( రి ) తప్ప మిగిలిన 6 స్వరములు అపన్యాసములు.
షడ్జ మధ్యమములకు 7 స్వరములు అపన్యాసములు.
46-47
అత్రయేఅన్యాఅపన్యాసాస్తేస్యురేకోనవింశతిః
సప్తత్రింశతృరేతేచషడ్జంచాశత్తుసంయుతాః
కైశిక్యాంసప్తపక్షేతాన్సప్తపంచాశతంవిదుః
అంశావివాదీగీతస్యాధ్యవిదారీసమాప్తీకృత్
అంశములు 19 అపన్యాసములు. ఇతర అపన్యాసములు 37. అన్నీ కలిపి 56. ప్రయోగమందు న్యాస స్వరములకు విరోధ శబ్దము లేకుండ అనునాద స్వరములతో ముగించుట సన్యాసమని చెప్పబడును.
48
సన్యాసోఅంశవివాద్యేవవిన్యాసస్సతుకథ్యతే
యోవిదారీభాగరూపపదప్రాంతేఅవతిష్ఠతే
అంశస్వరములకు వివాది లేదా వివరణ అయి వివాది స్వరములచే పెంచుటకు వీలైన
స్వరముల ప్రయోగము విన్యాసమనబడును.
49
అలంఘనాత్తథాఅభ్యాసాద్బహుత్వంద్వివిధంమతమ్
పర్యాయాంశేస్థితంతచ్చవాదిసంవాదినోరపి
అలంఘనము అనగా సున్నితమైన స్పర్శ. పదే పదే ఉచ్చరించుట అభ్యాసము.
బహుత్వమనగా వివిధ స్వరముల ప్రయోగము. వాది,సంవాది స్వరములను విన్యాసముతో
బహత్వమున అలంఘనము, అభ్యాసములతో ప్రయోగించుట స్వరవిన్యాసము. ( స్వరకల్పన)
50
అల్పత్వంచద్విధాప్రోక్తమనభ్యాసాచ్చలంఘనాత్
అనభ్యాసస్త్వనంశేషుప్రాయోలోపేప్యపీష్యతే
అనభ్యాసము( వదిలివేయట), లంఘత్వము ( దాటుట ) వలన అల్పత్వము లేదా స్వరలోపమేర్పడును. అన్యస్వరములు వాడు భాషాంగ రాగములలోను,షాడవ ఔడవములలోను స్వరలోపము ఏర్పడును.
తరువాతి పేజీ 7.6