సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.4
31వ శ్లోకం నుంచి 40వరకు
[మార్చు]31
గీతాదినిహితస్తత్రస్వరోగ్రహఇతీరితః
తత్రాంశగ్రహయోరన్యతరోక్తాఉభయగ్రహః
గీతమున జాతి రాగలక్షణములను ప్రయోగించునపుడు ఉపయోగించు స్వరము గ్రహమని
చెప్పబడును. ( ఎత్తుగడ స్వరము - గానకళాబోధిని) . అంశ గ్రహములలో ఏ ఒక దానిని చెప్పినను రెంటిని గ్రహించగలము. ( రాగఛాయాస్వరములు )
32-34
యోరక్తివ్యంజకోగేయోయత్సంవాద్యసువాదినౌ
విదార్యౌబహులౌయస్మాత్తారమంద్రవ్యవస్థితిః
యః స్వయంయస్యసంవాదీచానువాదీస్వరోపరః
న్యాసాపన్యాసవిన్యాససన్యాసగ్రహతాంగతః
ప్రయోగేబహులఃసస్యాద్వాద్యంశోయోగ్యతావశాత్
బహులత్వంప్రయోగేషువ్యాపకంత్వంశలక్షణం
ఏ స్వరము పాటకు రంజకత్వము లేదా ఇంపు కలిగించునో ఆ స్వరమునకు సంబంధించిన
సంవాది అనగా రాగమునకు ప్రధాన స్వరములు , అనువాది అనగా అనుకూల స్వరములు
వివాది యనగా వ్యతిరేక స్వరములు. ప్రయోగించినపుడు రాగమునకు , ఆలపించుటకు వీలు,
ప్రయోగ బాహుళ్యము ఇవే అంశ లక్షణములు.
35-36
మధ్యమేసప్తకాంశఃస్యాత్తస్మాత్తారస్థితాత్పరాన్
స్వరాంశ్చతురఆరోహేదేషతారావథిఃపరః
అర్వాక్తుకామచారస్యాత్తారేలుప్తేఅపిగణ్యతే
ఆతారషడ్జమారోహోనందయత్వాంప్రకీర్తితః
షడ్జము మొదలు సప్తస్వరములలో ఏదైన స్వరము అంశమగును. తారస్థాయి షడ్జము నుండి కాని మధ్యమము నుండి కాని తరువాతి 4 స్వరములు ఆరోహణముగా పైకి పాడవలెను. మధ్యమ గ్రామమైనచో మధ్యమము నుండి ( మపదనిసరిగ )షడ్జగ్రామమున స తరువాతి స్వరమునుండి ( రిగమపదనిసరి )సంవాది స్వరములను స్వేఛ్ఛాప్రవృత్తిని ( మనోధర్మము )
పాడుకొనవచ్చును. స్వరముల సంవాది వివాది అనువాదాల విషయమున లోపించిన
స్వరముల నాదము కూడ ( అనునాదము ) గణింపబడును.
నందయంతి యందు మాత్రము తారస్థాయి షడ్జము నుండి అవరోహణము క్రింది స్థాయికి
స్వరములను పాడవలెను.
37
మధ్యస్ధానస్థితాదంశాదామంద్రాస్థాంశమావ్రజేత్
ఆమంద్రస్యమధవాతదధస్ధ్సరిధావపి
మధ్యనున్న స్వరమునుండి మంద్రస్థాయి షడ్జము వరకు కాని రిషభము (రి) దైవతము(ద) వరకు కాని ఆరోహణము చేయవలెను.
38
ఏషామంద్రగతేః సీమాతతోఆర్వాక్కామచారితా
గీతేసమాప్తికృన్న్యాస ఏకవింశతిధాచసః
ఇది మంద్రగతి కి లక్షణము. తరువాతి ప్రయోగములన్ని స్వేఛ్ఛాయుతము. గీతమును పాడి
ముగించు విధము కూడ 21 విధములు.
39
షాడ్జాతీనాంతుసప్తానాంన్యాస్స్యాన్నామకృత్స్వరః
ద్వౌనామకారిణౌషడ్జమధ్యమాయాంతుతౌమతౌ
షడ్జము ( స )తో మొదలై 7 స్వరములు పాడి ( సరిగమపదని ) తరువాత వరుసగా 7 స్వరములతో మొదలుపెట్టి పాడుట న్యాసమనబడును.
సరిగమపదని, రిగమపదనిస,గమపదనిసరి,మపదనిసరిగ,పదనిసరిగమ,దనిసరిగమప, నిసరిగమపద
ఇవే మధ్యమ గ్రామమున మ తో మొదలై 7 స్వరములు పాడినపుడు మధ్యమ గ్రామ న్యాసములగును.
40
ఉదీచ్యవాత్రయంమాంతంనిపగాంతాతుకైశికీ
కార్మారవీపంచమాంతాగాంతాః పంచాపరాః స్మృతాః
షడ్జోదీచ్యవ,గాంధారోదీచ్యవ,మధ్యమోదీచ్యవ ఈ మూడిటికి మధ్యమము (మ )న్యాసస్వరము.
కైశికికి నిషాదము (ని) పంచమము(ప)గాంధారము(గ)న్యాసములు. కార్మారవికి పంచమము(ప)
న్యాసము.షడ్జకైశికి,రక్తగాంధారి,గాంధారపంచమి,ఆంధ్రి,నందయంతి 5 జాతులకు గాంధారము(గ) న్యాసము.
తరువాతి పేజీ 7.5