Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.3

Wikibooks నుండి

21వ శ్లోకం నుంచి 30వరకు

[మార్చు]

 
21

పశ్చిమీమధ్యమాషడ్జమధ్యమాఆభ్యాసుజాతిషు
స్వరసాధారణంప్రోక్తంమునిభిభ్రరతాదిభిః

పంచమి, మధ్యమ,షడ్జమధ్యమ అను పేర్లు గల జాతులందు స్వరసాధారణము ( గాంధార సహితము ) ప్రయోగింపబడును. ఇది భరతముని చెప్పినది.

22

అంశేషుసమపేష్వేతద్యధాస్వనియమాద్భవేత్
ఏతదల్పనిగాస్వాహుః కంబలాశ్వతరాదయః

షడ్జమధ్యము,పంచమాంశములందు నియమమును అతిక్రమించకుండా స్వరసాధారణమును ప్రయోగించవచ్చును. కంబలుడు, అశ్వతరుడు అల్పనిషాదము ( ని1) గాంధారాఖ్య ( గ1 ) జాతులందు కూడ స్వరసాధారణమును సమ్మతించారు. ( వారా స్వరాలను ప్రయోగించారు. )

23

అల్పద్విశ్రుతికేరాగభాషాఆదావపితన్మతమ్
నిగయోరంశయోః షడ్జమధ్యమాయాంనతర్భవేత్

తక్కువ శ్రుతిలోగల రాగమును ప్రయోగించునపుడు స్వరసాధారణము సమ్మతము. షడ్జము( స)
మధ్యమము ( మ ) లతో గాంధారము తక్కవ శ్రుతిలో ప్రయోగించవలసినపుడు ( గ2) సాధారణ గాంధారము ప్రయోగము అంగీకారము.

24

వికృతాఏవతత్రాపిస్వరసాధారణాశ్రయాః
ఏకాంశానందయంతీచమధ్యమోదీచ్యవాతధా

స్వరభేదములు (వికృతస్వరములు) మాత్రమే స్వరసాధారణమునకు ఆశ్రయము. నందయంతి,మధ్యమోదీచ్యవ,గాంధారపంచమి స్వరములకు వికృతులు లేవు.
ఏకాంశము గలవి.

25

గాంధారపంచమీత్యేతాస్తిస్రోద్వ్యంశాస్తుధైవతీ
గాంధారోదీచ్యవాచాఅథపంచమీత్యుదితాఇమాః

దైవతి, గాంధారోదీచ్యవి,పంచమి మూడు రెండు భేదములు కలవి.

26

నైషాదార్షభికాషడ్జకైశిక్యస్త్రంశకామతాః
ఆంధ్రీకార్మారవీషడ్జోదీచ్యవాశ్చతురంశకాః

నైషది,ఆర్షభి,షడ్జకైశికి మూడు 3 భేదములు కలిగినవి. ఆంధ్రి,కార్మారవి,షడ్జోదీచ్యవ 4 శ్రుతి భేదములు కలిగినవి.

27-28

పంచాంశారక్తగాంధారీగాంధారీమధ్యమాతథా
షాడ్జీత్యేతాశ్చరస్రః స్యుః షడంశైవకైశికీ

సప్తాంశాసూరిభిః షడ్జమధ్యమాపరికీర్తితా
ఇతిత్రిషష్టిరంశాః స్యుర్జాతి ష్వష్టాదశస్విమే

రక్తగాంధారి,గాంధారి,మధ్యమ,షాడ్జి 4 స్వరములు 5 శ్రుతి భేదములు కలిగినవి.
కైశికి స్వరమొక్కదానికి 6 భేదములు కలవు. షడ్జమధ్యమకు 7 భేదములు కలవని
పండితులచే చెప్పబడినది. ఈ విధముగా 19 జాతులకు కలిపి 23 శ్రుతి భేదములు కలవు.
(ప్రస్తుత కాలమున 22 శ్రుతులుగా చెప్పబడుతున్నాయి.)

29-30

గ్రహాంశతారమంద్రాశ్చన్యాసాపన్యాసకౌతథా
అపిసన్న్యాసవిన్యాసౌబహుత్వంచాల్పతామతా

ఏతాన్యంతరమార్గేణసహలక్షమాణిజాతిషు
షాడవౌడువివేక్వాపీత్యేవమాహుస్త్రయోదశః

జాతి లక్షణములు 13. అవి 1 గ్రహము2 అంశము 3 తారము4 మంద్రము5 న్యాసము
6 అపన్యాసము7సనయాసము8విన్యాసము9బహుత10అల్పత11అంతరమార్గము12
నిత్యపూర్ణము 13 షాడవౌడువము.

               తరువాతి పేజీ 7.4