Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.2

Wikibooks నుండి

11వ శ్లోకం నుంచి 20వరకు

[మార్చు]

 
11

షాడ్జికామధ్యమాభ్యాంతుజాయతేషడ్జమధ్యమా
గాంధారీపంచమాభ్యాంతుజాతాగాంధారపంచమీ

షడ్జము+ మధ్యమము = షడ్జమధ్యమ
గాంధారము + పంచమి = గాంధారపంచమి

12-13

గాంధార్యాబర్షభిభ్యాంజాతిరాంధ్రీప్రజాయతే
షాడ్జీగాంధారికాతద్వధ్ధైవతీమిలితాస్త్విమాః

షడ్జోదీచ్యవతీంజాతింకుర్యుఃకార్మారవంపునః
ఉత్పాదయంతినైషాదీపంచమ్యార్షభికాయుతాః

గాంధారి + ఆర్షభి = ఆంధ్రి
షాడ్జి + గాంధారి + ధైవతి = షడ్జోదీచ్యవతి
నైషాది + పంచమి + ఆర్షభి = కార్మారవి

14

నందయంతీంతుగాంధారీపంచమమ్యార్షభికాయుతాః
గాంధారీధైవతీషాడ్జీమధ్యమేతియుతాస్త్విమాః

గాంధారి + పంచమి + ఆర్షభి = నందయంతి
గాంధారి + ధైవతి + షాడ్జి + మధ్యమ = గాంధారోదీచ్యవ

15

గాంధారోదీచ్యవాంకుర్వుర్మధ్యమోదీచ్యవాంపునః
ఏతాఏవవినాషాడ్జ్యాపంచమ్యాసహకుర్వతే

ఇవే స్వరములు షడ్జమును విడిచి పంచమముతో కలిపి పాడినప్పుడు మధ్యమోదీచ్యవ
జాతియగును.

16

కుర్యుస్తారక్తగాంధారీంనైషాదీచనధైవతీ
ఆర్షభీంధైవతీంత్యక్త్వాపంచభ్యః కైశికీభవేత్

ఆర్షభి, దైవతి విడిచి మిగిలిన 5 స్వరములు కలిపి కైశికి.
గాంధారి + నైషాది + మధ్యమ + పంచమి = రక్తగాంధారి
షాడ్జి + గాంధారి + మధ్యమ + పంచమి + నైషాది = కైశికి

17

చతుస్రః షడ్జశబ్దిన్యోనైషాదీధైవతీతథా
ఆర్షభీచేతిసప్తైతాః షడ్జగ్రామస్యజాతయః

షడ్జ స్వరములు 4 ( స1 , స2 , స3 , స4 ) రి , ద ని ఈ 7 స్వరములు కలిపి
షడ్జగ్రామ జాతులు.

18-20

శేషాస్స్యుర్మధ్యమగ్రామేపూర్ణత్వాద్వధునోచ్యతే
కార్మారవ్యథగాంధారపంచమీషడ్జకైశికీ

మధ్యమోదీచ్యవేత్యేతానిత్యపూర్ణాః ప్రకీర్తితాః
షాడ్జీచనందయంత్యాంధ్రీగాంధారోదీచ్యవేత్యమూః

సంపూర్ణషాడవాఃప్రాహచతస్రః కాశ్యపోమునిః
దశావశిష్టాః సంపూర్ణషాడవౌడువితామతాః

మిగిలిన జాతులన్నీ మధ్యమ గ్రామములు.
పూర్ణములనగా 7 స్వరములు పూర్తిగా ఉచ్చరింపబడునవి. ( స రి గ మ ప ద ని )
కార్మారవి,గాంధారపంచమి,షడ్జకైశికి,మధ్యమోదీచ్యవ అను జాతులు నిత్యపూర్ణములు . అనగా
ఎల్లప్పుడు 7 స్వరములతో పాడవలసినవి.
షాడ్జి,నందయంతి,ఆంధ్రి,గాంధారోదీచ్యవ అను 4 సంపూర్ణషాడవములు. అనగా ఆరోహణమున సంపూర్ణము( సరిగమపదని ) అవరోహణము అసంపూర్ణముగా 6 స్వరములు మాత్రమే పాడవలెను. ఈ విభజన కాశ్యప ముని చేత చేయబడింది.
ఇక మిగిలిన 10 జాతులు షాడవములు ( 6 స్వరములతో పాడునవి ) ఔడువములు ( 5 స్వరములతో పాడునవి) .

              తరువాతి పేజీ 7.3