సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/7.1
జాతి ప్రకరణము- ఉపశీర్షిక
1వ శ్లోకం నుండి 10వరకు
[మార్చు]
1-3
శుధ్ధాస్స్యుర్జాతయస్సప్తతాః షడ్జాదిస్వరాభిదాః
షాడ్జ్యర్షభీచగాంధారీమధ్యమాపంచమీతధా
దైవతచాధనైషాదీశుధ్ధతాలక్ష్యకధ్యతే
యాసాంనామస్వరోన్యాసోఅపన్యాసోఅశోగ్రహస్తథా
తారన్యాసవిహీనాస్తాః పూర్ణాః శుధ్ధాభిధామతాః
వికృతాన్యాసవర్జైతల్లక్ష్మహీనాభవంత్యమూః
శుధ్ధస్వరములు అని చెప్పబడునవి 7 స్వరములు. వాటి పేర్లు 1 షాడ్జి 2 ఆర్షభి 3 గాంధారి 4 మధ్యమ 5 పంచమి 6 ధైవతి 7 నిషాది. వీటినే సంగీతమున సప్తస్వరములని చెపుతారు.
ఈ స్వరములే సంజ్ఞలతో స రి గ మ ప ద ని అని చెప్పబడతాయి. వాటి శుధ్ధత్వము , లక్షణములు ఈ ప్రకరణమున చెప్పబడును.
శుధ్ధస్వరములకు లక్షణములు 4. అవి 1 న్యాసము 2 అపన్యాసము 3 అంశము 4 గ్రహము
ఈ శుధ్ధస్వరములు సంపూర్ణములు. అనగా ఆరోహణము,అవరోహణము రెంటి యందు 7 స్వరములు పూర్తిగా పాడవలసినవి. ఈ లక్షణములు లేనివి వికృతులని, జాతులని చెప్పబడును.
4
సంపూర్ణత్వగ్రహాంశాపన్యాసేష్వేకైకవర్జనాత్
భవంతిభావాశ్చత్వారోద్యయోస్త్వాగేతుషణ్మతాః
శుధ్ధములకున్న 4 లక్షణములలో ఒక్కొక్కదానిని విడిచినపుడు ఇవి 4 భేదములగును.
సంపూర్ణత్వము + గ్రహము
సంపూర్ణత్వము + అంశము
సంపూర్ణత్వము + అపన్యాసము
గ్రహము + అంశము
గ్రహము + అపన్యాసము
అంశము + అపన్యాసము
ఒక్కొక్క లక్షణమును విడుచుట వలన వికృతులు 6 భేదములు అవుతున్నాయి.
5
త్యాగేత్రయాణాంచత్వారోఏకస్త్యక్తేచతుష్టయే
భేదాఃపంచదశైవైతేషాడ్జాః సద్భిర్నిరూపితాః
3 లక్షణములను విడిచిన వికృతులు 4 . నాలుగు లక్షణములు విడిచినది 1 .
మొత్తము 15 జాతులగును.
7 శుధ్ధములు + 6 ఒక లక్షణము విడిచినవి + 4 మూడు లక్షణములను విడిచినవి.
నాలుగిటిని విడిచింది 1
6
తత్రాష్ణౌపూర్ణతాహీనాః సప్తత్వితరవర్జితాః
ద్విధాస్యుః పూర్ణతాహీనాః షాడవౌడువభేదతః
8 భేదములు పూర్తి 7 స్వరములు పాడకుండా అసంపూర్ణములైనవి. అవి షాడవములు ( 6 స్వరములు కలవి ), ఔడవములు ( 5 స్వరములు కలవి ) అని 2 రకములు.
7
అతోఅష్టావధికాఆర్షభ్యాదిషుఔడువజాతిషు
అతస్త్రయోవింశతిధాషట్సు ప్రత్యేకమీరితాః
రిషభము అనగా 2 వ స్వరమునుండి ఔడువ జాతులందు ( 5 స్వరములు కల ) 8 భేదములు కలుగును. 6 జాతులకు కలిపి 23 వికృత భేదములు.
8-10
వికృతానాంతుసంసర్గాజ్జాతాఏకాదశస్మృతాః
స్యాత్షడ్జకైశికీషడ్జోదచ్యవాషడ్జమధ్యమా
గాంధారోదచ్యవారక్తగాంధారీకైశికీతధా
మధ్యమోదీచ్యవాకార్మరదీగాంధారపంచమీ
తదాంధ్రీనందయంతీతితధ్ధేతూనధునాబ్రువే
షాడ్జీగాంధారికాయోగాత్జాయతేషడ్జకైశికీ
పైన చెప్పిన వికృత భేదములు ఒకదానితో ఒకటి కలిసి మొత్తము 11 జాతులగును. వాటి పేర్లు
1 షడ్జకైశికి 2 షడ్జోదచ్యవ 3 షడ్జమధ్యమ 4 గాంధారోదీచ్యవ 5 రక్తగాంధారి 6 కైశికి మధ్యమోదీచ్యవ 8 కార్మారవి 9 గాంధారపంచమి 10 ఆంధ్రి 11 నందయంతి
షడ్జము + గాంధారము = షడ్జకైశికి
తరువాతి పేజీ 7.2