సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.6
61వ శ్లోకం నుండి 64 వరకు
61-62
యదాతదాసంప్రదానమలంకారంవిదుర్బుధాః
యుగ్మమేకాంతరితయోఃత్యక్తాదప్యేవమేవచేత్
ద్విర్ద్విః ప్రయుజ్యేతతదావిధూతోబుధసమ్మతః
కలాయామాద్యయోర్యుగ్మంచేత్తృతీయద్వితీయోః
ద్విర్ద్విః ప్రయోజ్యతేతజ్ఞైరుపలోలస్తదోచ్యతే
ద్విర్గీత్వాద్యంతృతీయంచప్రథమంచతృతీయకమ్
సకృద్గాయేద్యత్కలాయాంతముల్లాసితమాచిరే
ఇతి సప్తాలంకారాః
1 3 స్వరములు రెండు సార్లు పాడి తిరిగి 2 4 స్వరములు రెండు సార్లు పాడవలెను.
4 స్వరములు కలిగిన ఈ అలంకారము విధూతము.
సగ సగ , రిమ రిమ , గప గప , మద మద , పని పని
1 2 1 2 3 2 3 2 ఇది ఉపలోలితము.
సరి సరి గరి గరి , రిగ రిగ మగ మగ , గమ గమ పమ పమ , మప మప దప దప
పద పద నిద నిద
1 వ స్వరము రెండు సార్లు 3 వ స్వరము మరల 1 వ స్వరము మరల 3 ఈ విధముగ
గానము చేయుట ఉల్లాసితము.
ససగసగ , రిరిమరిమ , గగపగప , మమదమద , పపనిపని
ఇవి 7 అలంకారములు.
63
ఇతిప్రసిధ్ధాలంకారాస్త్రిషష్టిరుదితామయా
ఇట్లు నాచేత 63 ప్రసిధ్ధ అలంకారములు చెప్పబడినవి.
64
అనంతత్వాత్తుతేశాస్త్రేనసామస్త్యేనకీర్తితాః
రక్తిలాభస్స్వరజాఞానమ్ వర్ణాంగానాంవిచిత్రతా
ఇతిప్రయోజనాన్యాహురలంకారనిరూపణే
ఈ అలంకారములు అనంతములు. శాస్త్రమున ప్రయోగములన్నియు చెప్పబడవు. అలంకారములు నిరూపించుటకు , సృష్టించుటకు రంజకత్వ విషయ జ్ఞానము , స్వర విషయక జ్ఞానము , స్థాయి మున్నగు వర్ణ విశేషముల వైచిత్ర్యము ప్రయోజనములు.
ఇది సంగీతరత్నాకరమున స్వరగతాధ్యాయమున వర్ణాలంకార ప్రకరణము.
*****************
తరువాత జాతి ప్రకరణము