సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.5
51వ శ్లోకం నుండి 59 వరకు
51
స్వరైరేకోత్తరంవృధ్ధైః నహుంకారోనిగద్యతే
హ్రాదమానేప్రసన్నాంతామంద్రాదేస్తుకలామతాః
షడ్జము ద్విస్వరముగా ఆరోహణావరోహణములలో పలికినపుడు అది హుంకారమను అలంకారమగును.
సరిస , సరిగరిస , సరిగమగరిస , సరిగమపమగరిస , సరిగమపమగరిస , సరిగమపదపమగరిస , సరిగమపదనిదపమగరిస
1 3 2 స్వరములు మంద్రాది కి ప్రసన్నాంతములు అనగా షడ్జము అంతమందు కలవిగా పాడినపుడు అది హ్రాదమను అలంకారమగును.
సగరిస , రిమగరి , గపమగ , మదపమ , పనిదప
52
యదాఆరోహేఅవరోహేచస్వద్వితీయంపరిత్యజేత్
చతుఃస్వరాసమకలాతదాస్యాదవలోకితః
1 2 3 4 స్వరములు ఆరోహణము అవరోహణము పాడుట సమాలంకారము. అందు ఒక
స్వరము విడిచి పాడినపుడది అవలోకితమను అలంకారమగును.
సగమమరిస , రిమపపమరి , గపదదపగ , మదనినిదమ
53
ఏవంసంచార్యలంకారాఆరోహేణప్రదర్శితాః
ఏతానేవావరోహేణప్రాహశ్రీకరణాగ్రణీః
ఇతిసంచార్యలంకారాః
ఈ ప్రకరణంలో అన్నీ ఆరోహణమందే అలంకారములు చెప్పబడినవి. అవరోహణము కూడ ఈ విధముగనే యుండునని శార్జ్ఞదేవుడు చెప్పెను.ఇంత వరకు చెప్పినవి సంచార్యలంకారములు.
54-55
అన్యేఅపిసప్తాలంకారాగీతజ్ఞైరుపదర్శితాః
తారమంద్రప్రసన్నశ్చమంద్రతారప్రసన్నకః
ఆవర్తకస్సంప్రదానోవిధూతోఅప్యుపలోలకః
ఉల్లాసితశ్చేతితేషామదునాలక్ష్మకధ్యతే
గీతజ్ఞులు ( వాగ్గేయకారులు, లేదా సంగీతజ్ఞులు ) 7 అలంకారములను గురించి చెప్పారు.
అవి 1 తారమంద్రప్రసన్నము 2 మంద్రతారప్రసన్నము 3 ఆవర్తకము 4 సంప్రదానము 5 విధూతము. 6 ఉపలోలకము 7 ఉల్లాసితము
56
కలాస్తేషాంద్వితీయాద్యాఃపూర్వైకైకప్రహాణకః
అష్టమస్వరపర్యంతమారుహ్యాద్యవ్రజేద్యది
1 నుండి 8 వరకు స్వరములు ఆరోహణము చేసి పిమ్మట 1 వ స్వరము పాడిన అది తారమంద్రప్రసన్నము.
సరిగమపదనిస సా
57
తారమంద్రప్రసన్నోఅయమలంకారస్తదోచ్యతే
మంద్రాదష్టమముత్ల్పుత్యసప్తకస్యావరోహణే
మంద్రమైన స నుండి 8 స్వరములు అవరోహణము చేసి పిమ్మట తారము పాడిన అది
మంద్రతారప్రసన్నము.
సా సనిదపమగరిస
58
మంద్రతారప్రసన్నాఖ్యమాహమాహేశ్వరోత్తమః
ఆద్యంద్వితీయమాద్యంచద్విర్ద్విర్గీత్వాద్వితీయకమ్
1 2 స్వరములు రెండు సార్లు పలికి తరువాత 2 1 స్వరములు పాడిన ఆవర్తకమను అలంకారమగును.
ససరిరిససరిస , రిరిగగరిరిగరి , గగమమగగమగ , మమపపమమపమ, పపదదపపదప
దదనినిదదనిద
59
సకృదాద్యంయత్కలాయాంగాయేదావర్తకస్తుసః
ఏతస్యైవకలాంత్యౌదౌస్వరౌసంత్యజ్యగీయతే
ఆవర్తక అలంకారము నందు చివరి రెండు స్వరములు విడిచి గానము చేసినపుడు అది సంప్రదానమను అలంకారమగును.
ససరిరిసస , రిరగగరిరి , గగమమగగ , మమపపమమ , పపదదపప , దదనినిదద
తరువాతి పేజీ 6.6