Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.4

Wikibooks నుండి

41వ శ్లోకం నుండి 50 వరకు

41

తుల్యారోహావరోహైకైకహానాదపరాస్తథా

కలాగతాగతవతీద్విస్వరైకైకహానతః

రెండు స్వరముల ఆరోహణ అవరోహణములలో పూర్వస్వరమును తగ్గించుట వలన కలిగినది

ప్రేంఖమను అలంకారము.

సరిరిస , రిగగరి , గమమగ , మపపమ , పదదప , దనినిద

42

యత్రాస్యస్తాదృశః సస్యాత్పేంఖఃనిష్కూజితః పునః

ప్రసాదస్యకలాంగీత్వాతత్కలాదేస్తృతీయకమ్

ప్రసాదాలంకారము ( సరిస ) మొదట పాడి తరువాత మరల 1 3 స్వరములు పాడిన

అది నిష్కూజితమను అలంకారము.

సరిసగస , రిగరిమరి , గమగపగ , మపమదమ , పదపనిప

43

గత్వాఆద్యగానాద్భవతి

శ్యేనఃసంవాదయుగ్మకైః

షడ్జపంచమములు, ఋషభదైవతములు, గాంధారనిషాదములు , మధ్యమషడ్జములు

ఈ విధముగ సంవాదియుగ్మములు ( దాటు స్వరములు ) గానము చేసినపుడు శ్యేనమను

అలంకారమగును.

స ప , రి ద , గ ని , మ స

44 - 45

క్రమాత్సరిగమాద్యైఃస్యాత్కలాద్విత్రిచతుస్శ్వరాః

ఆద్యస్వరాద్యాస్తిస్రః స్యుర్ది్వతీయాద్యాదయస్తథా

యత్రాసౌక్రమఇత్యుక్తఃసతూద్ఘట్టితఉచ్యతే

యత్రస్వరద్వయంగీత్వాపంచమాచ్చతురస్స్వరాత్

1 2 , 123 , 1234 స్వరములు ఆరోహణము అవరోహణములలో గానము చేసిన అది

క్రమాలంకారమని చెప్పబడును.

సరి , సరిగ , సరిగమ , రిగ , రిగమ , రిగమప , గమ , గమప , గమపద , మప , మపద , మపదని

1 2 స్వరములు ఆరోహణమున పాడి 5 వ స్వరమునుండి 4 స్వరములు అవరోహణమున పాడినపుడు అది ఉద్ఘట్టితము.

సరిపమగరి , రిగదపమగ , గమనిదపమ

46

అవరోహత్కలాగాయేత్తదైకైకోజ్ఘనాత్పర్యాః

ద్విరుక్తాయదిమంద్రాంతామంద్రాదేః స్యుః కలాస్తథారంజితః

1 3 2 స్వరములు రెండు సార్లు పాడి చివర తిరిగి మంద్రము పాడిన అది రంజితము.

సగరిసగరిస , రిమగరిమగరి , గపమగపమగ , మదపమదపమ, పనిదపనిదప

47-49

అధభవేదేషసన్నివృత్తప్రవృత్తకః

యత్రాద్యపంచమౌగీత్వాతుర్యాత్త్రీనవరోహతి

క్రమాత్కలాసాయత్రాన్యాస్తద్వదేకైకహానతః

యత్రాద్యఃస్యాద్ ద్విర్దితీయచతుర్థకతృతీయకాః

సకృత్కలాఆన్యాశై క్చైకహానాద్వేణురసౌమతః

గీత్వాఆద్యౌద్వౌచతుర్థంచయస్యాంతావవరోహతి

1 , 5 స్వరములు పాడి 4 వ స్వరము నుండి అవరోహణము చేసినపుడు అది సన్నివృత్త

ప్రవృత్తకమను అలంకారమగును.

సపమగరి, రిదపమగ , గనిదపమ

1 వ స్వరమును రెండు సార్లు పలికి 2 4 3 స్వరములు పాడిన అది వేణువను అలంకారము.

ససరిమగ , రిరిగపమ , గగమదప , మమపనిద

50

సాకలాఆన్యాశ్చతాదృశ్యోయత్రాఅసౌలలితస్వరః

ఆదిమేనకలాయత్రద్విస్వరాద్యాగతాగతైః

1 2 స్వరములు పాడి పిమ్మట 4 వ స్వరము మరల 1 2 స్వరములు అవరోహణమున పాడినపుడు అది లలితస్వరమను అలంకారము.

సరిమరిస , రిగపగరి , గమదమగ , మపనిపమ

             తరువాతి పేజీ 6.5