Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.3

Wikibooks నుండి

వర్ణాలంకార ప్రకరణము

[మార్చు]

శ్లోకం 31 నుండి 40 వరకు

31

తాఃకలామంద్రమధ్యాంతాః. క్రమాఛ్చేదపరౌతదా

త్యక్తాంతరంస్వరయుగంత్యక్తాదారభ్యతేపునః

ఆ కళలే క్రమముగా మంద్రమధ్యములు , మంద్రాంతములు అగును.

గసరి మరిగ పగమ దమప నిపద

32-33

యుగంతాదృక్సమారోహేత్తదాప్రస్తారఉచ్యతే

పూర్వఃపూర్వః పరస్యోర్థ్వధోవర్తీక్రియతేస్వరః

యదాతదాప్రసాదంతమాహశ్రీకరణేశ్వరః

చతుస్స్వరాకలాతత్రాద్యాత్తృతీయంద్వితీయకాత్

మంద్రాంతము : రిగస గమరి మపగ పదమ దనిస

మధ్య స్వరమును విడిచిపెట్టి 1 3 స్వరములతో ఆరోహణము పాడి మరల మధ్య స్వరమును పాడినప్పుడు అది ప్రస్తారము.

సగ , రిమ , గప , మద , పని

రెండు సార్లు పూర్వస్వరము , మధ్యలో పరస్వరము పాడినపుడు ప్రసాదాలంకారము. ఈ అలంకారము శ్రీకరణేశ్వరునిచే చెప్పబడెను.

సరిస , రిగరి , గమగ , మపమ , పదప , దనిద

34

తుర్యంగత్వాఆదిమంగఛ్చేదేవమేకైకహానతః

చతుస్స్వరాఃపరాయత్రసవ్యావృత్తోస్మృతోబుధైః

నాలుగు స్వరములు కలవి. 1 3 స్వరములు పాడి , తరువాత 2 4 స్వరములు తరువాత మరల

1 వ స్వరము ఈ విధముగ పాడినపుడు వ్యావృత్తమని బుధులచే చెప్పబడెను.

సగరిమస , రిమగపరి , గపమదగ , మపదనిమ

35

కలాంప్రయుజ్యమంద్రాదేర్ద్విరుక్తోర్ధ్వస్వరాన్వితాం

అవరుహ్యేతచేదేషస్ఖలితాఖ్యస్తదాభవేత్

మంద్రాది అలంకారము వలెనే 1 3 2 స్వరములు పాడి 4 వ స్వరమును 2 సార్లు పాడి అవరోహణమున పాడినపుడు అది స్ఖలితమను అలంకారమగును.

సగరిమమరిగస , రిమగపపగమరి , గపమదదమపగ , మదపనినిపదమ

36

స్వరంద్వితీయముజ్జిత్వాత్రిస్వరాద్యాకలాయది

త్యక్తాదారభ్యతాదృశ్యోఅన్యాస్తదాపరివర్తకాః

2 వ స్వరమును విడిచి 1 3 4 స్వరములు పాడి తిరిగి విడిచిన 2 వ స్వరమును పాడిన అది పరివర్తకమను అలంకారమగును.

సగమ రిపమ గపద మదని

37

త్రిస్వరాశ్చేత్కలాఃపూర్వపూర్వత్యాగోర్ధ్వసంక్రమైః

తదాఆక్షేపః

అథబిందుఃసయత్రప్లుతమధస్వరమ్

కృత్వాఅగ్నివత్పరంసృష్ట్వాఅధఃస్పర్శేనాఖిలాఃస్వరాః

మూడు స్వరములతో ఏర్పడిన కళలో పూర్వ స్వరమును విడిచి పరస్వరమును కలుపుకుంటూ

పాడినపుడు అది ఆక్షేపమను అలంకారమగును.

సరిగ , రిగమ , గమప , మపద , పదని

పూర్వ స్వరమును ప్లుతముగా 3 సార్లు పలికి పర స్వరమును సకృత్తుగా స్పృశించి వదిలినపుడు

5 స్వరములు కలుగును. అది బిందువను అలంకారమగును.

స3 రిస , రి3గరి , గ3మగ , మ3పమ , ప3దప , ద3నిద

38

కలాయాంత్రీన్స్వరాన్ గీత్వాఅవరుహ్యైకంపరాఃకలాః

యత్రైకోజ్ఘితాగీతాస్తద్వదుద్వాహితస్తుసః

కళయందు 3 స్వరములు గానము చేసి ఒక స్వరము అవరోహణము చేసిన అది ఉద్వాహితమను అలంకారమగును.

సరిగరి , రిగమగ , గమపమ , మపదప , పదనిద

39

మూర్ఛనాదేః స్వరాత్తుర్యంప్లుతీకృత్యాద్యమేత్యచ

తుర్యగానేకలైకైకహానాద్యత్రాపరాస్తథా

1 తరువాత 4 వ స్వరము ప్లుతముగా పాడి మరల 1 4 స్వరములు పాడిన అది

ఊర్మి అను అలంకారమగును.

సమ3సమ , రిప3 రిప , గద 3 గద , మని 3 మని

40

సఊర్మిఃస్యాత్

సతుసమఃకలాయత్రచతుస్స్వరాః

ఏ కళలో 4 స్వరములు క్రమముగా ఆరోహణము తరువాత అవరోహణము వచ్చునట్లు పాడినపుడు అది సమ అలంకారమగును.

సరిగమ మగరిస , రిగమప పమగరి , గమపద దపమగ , మపదని నిదపమ

                  రువాతి పేజీ 6.4