సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.2
శ్లోకం 21 నుండి30 వరకు
21
స్వరద్వయంసముచ్చార్యపూర్వంపూర్వయుతంపరమ్
యదాందోలితమారోహేత్ప్రేంఖితోఅసౌక్రమోధవా
పూర్వస్వరము పరస్వరము రెండు మొదట పాడి పరస్వరము నుండి మరల ఎత్తుకొని దానిని
పూర్వస్వరముగా ఆందోళితముగా ( ఊయలలాగా ) పాడినపుడు అది ప్రేంఖితము.
సరి. రిగ గమ మప పద దని
22
ఏకాంతరంస్వరయుగంతాదృక్ పూర్వయుతంపరమ్
క్రమాదారోహతియదాతదాఆక్షిప్తంప్రచక్షతే
1 , 3 స్వరములు పాడి 3 వ స్వరమును పూర్వస్వరముగా తీసుకొని పరస్వరముగా 5 వ స్వరమును పాడినపుడు అది ఆక్షిప్తము.
సగ గప పని
23
త్రిస్వరాఆద్యాకలాఅన్యేచపూర్వపూర్వాంతిమాదిమే
కలేస్తస్త్రిన్వరేయత్రసంధిప్రచ్ఛాదనస్తుసః
మొదట 3 స్వరములు పాడి అంతమందున్న 3 వ స్వరమును తిరిగి ఎత్తుకొని ఆరోహణము పాడినపుడు అది సంధిప్రఛ్చాదనమని చెప్పబడును.
సరిగ గమప పదని
24
యదాఆద్యాద్యస్త్రిరావృత్తఃకలయోస్త్రిస్వరాత్మనో
తదోద్గీతోమధ్యమేనతాదృశోద్వాహితోమతః
3 స్వరములు వరుసగా పాడినపుడు మొదటి స్వరమును 3 సార్లు ఉచ్చరించిన అప్పుడది ఉద్గీతమగును.
సససరిగ మమమపదత్రిస్వరములలో మధ్య స్వరము 3 సార్లు ఆవృతమైన అది ఉద్వాహితమను అలంకారమగును.
సరిరిరిగ , మపపపద
25
అంత్యస్యతుత్రిరావృత్తౌత్రివర్ణంవర్ణయంత్యముం
త్రయాణాంతుత్రిరావృత్తౌపృధగ్వేణిరుదీరతః
త్రిస్వరమందు చివరి స్వరము 3 సార్లు ఆవృత్తమైనపుడు అది త్రివర్ణాలంకారము.
సరిగగగ , మపదదద
త్రిస్వరములందు 3 స్వరములు 3 సార్లు ఆవృతమైనప్పుడు పృథగ్వేణి అలంకారమగును.
ససస , రిరిరి , గగగ , మమమ , పపప , దదద , నినిని
ఇంతవరకు చెప్పినవి ఆరోహాలంకారములు .
26
అవరోహక్రమాదేతేద్వాదశాద్యవరోహిణీ
మంద్రాదిర్మంద్రమధ్యశ్చమంద్రౌతస్స్యాదతఃపరమ్
ఇవే అలంకారములు అవరోహక్రమమున పాడినపుడు మంద్రాది , మంద్రమధ్యము , మంద్రాంతములై 12 అవరోహ్యలంకారములుగా చెప్పబడును.
27-29
ప్రస్తారశ్చప్రసాదోఅధవ్యావృత్తస్ఖలితావపి
పరివర్తాక్షేపబిందూద్వాహితోర్మిసమాస్తథా
ప్రేంఖనిష్కూజితశ్యేనక్రమోద్వాహితరంజితా
సంనివృత్తప్రవృత్తోఅధవేణుశ్చలలితస్వరః
హుంకారోహ్రాదమానశ్చతతస్స్యాదవలోకితః
స్యుఃసంచారిణ్యలంకారాఃపంచవింశతిరిత్యమీ
సంచారి అలంకారములు 25 . వాటి పేర్లు 1 ప్రస్తారము 2 ప్రసాదము 3 వ్యావృత్తము
4 స్ఖలితము 5 పరివర్తము 6 ఆక్షేపము 7 బిందువు 8 ఉద్వాహితము 9 ఊర్మి
10 సమము 11 ప్రేంఖము 12 నిష్కూజితము 13 శ్యేనము 14 క్రమము 15 ఉద్ఘట్టితము
16 రంజితము 17 సన్నివృత్తము 18 ప్రవృత్తము 19 వేణువు 20 లలిత 21 స్వరము
22 హుంకారము 23 హ్రదము 24 మానము 25 అవలోకితము.
30
త్రిస్వరాఆద్యాకలైకైకమంద్రత్యాగేనచాపరాః
త్రిస్వరాశ్చేత్ కలామంద్రాద్యామంద్రాదిస్తదాభవేత్
3 స్వరములు కల కళలయందు అన్యస్వరములు 3 స్వరములుగా ఏర్పడినప్పుడు అది మంద్రాది
అలంకారమగును.
సగరిరిమగగమప మదపపదని
తరువాతి పేజీ 6.3