Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/6.1-1

Wikibooks నుండి

'''11వ శ్లోకం నుండి 20 వరకు'' ' 11

ఆద్యంతయోర్మూర్ఛనాదిశ్చేత్స్వరోఅన్తర్ద్వితీయకః

సైకాకలాథచేన్మధ్యేస్తస్తృతీయచతురథకౌ

మూర్ఛనా ప్రథమ స్వరము ఆద్యంతముల అనగా మొదట చివర వుండి మధ్య ద్వితీయ స్వరము రి మధ్య స్వరముగా నున్న అది ఏక కల.

స రి స

మధ్య భాగమున 2 3 స్వరములను పాడిన అది ద్వితీయ కల .

స రి గ స

12

సాద్వితీయాపంచమాద్యాస్త్రయోఅన్తశ్చేత్కలాపరా

ఏవంకలాత్రయేణోక్తోఅలంకారఃక్రమరేచితః

ఆద్యంతముల షడ్జమముతో మధ్యభాగమున 5 6 స్వరములతో పాడినపుడు అది తృతీయ కల .

ఉదా: స రి స , స గ మ స , స ప ద ని స .

13

దీప్తాంతశ్చేత్ప్రతికలంప్రస్తారస్సోఅభిధీయతే

తారమంద్రవిపర్యాసాత్తంప్రసాదంప్రచక్షతే

ఇతిస్థాయిగతాలంకారాః

ఇదే క్రమరేచిత అలంకారమునకు చివర దీప్తమున్నప్పుడు ప్రస్తారమను అలంకారమగును.

మంద్రస్థాయి షడ్జమునకు బదులు తారస్థాయి షడ్జముతో ఇవే స్వరములు పాడినపుడు అది

ప్రస్తారము.

తారము మంద్రము రెండు స్వరములు కలిపి పాడినపుడు అది ప్రసాదాలంకారమగును.

ఇవి స్థాయి వర్ణమునకు చెందిన అలంకారములు.

14-15

స్యాతాంవిస్తీర్ణనిష్కర్షౌబిందురభ్యుచ్చయఃపరః

హసితప్రేంఖితేక్షిప్తసంధిప్రఛ్ఛాదనాస్తథా

ఉద్గీతోద్వాహితౌతద్వత్త్రివర్ణౌవేణిరిత్యమీ

ద్వాదశారోహివర్ణస్థాలంకారాఃపరికీర్తితాః

ఆరోహి వర్ణగతాలంకారములు 12. వాటి పేర్లు 1 విస్తీర్ణము 2 నిష్కర్ష 3 బిందువు 4 అభ్యుచ్చయము 5 హసితము 6 ప్రేంఖితము 7 ఆక్షిప్తము 8 సంధి ప్రఛ్ఛాదనము9 ఉద్గీతము

10 ఉద్వాహితము 11 త్రివర్ణము 12 వేణి.

16

స్థిత్వాస్థిత్వాస్వరైర్దీర్ఘైఃసవిస్తీర్ణోఅభిధీయతే

మూర్ఛనాఆదేఃస్వరాద్యత్రక్రమేణారోహణంభవేత్

మూర్ఛనాప్రధమస్వరమునుండి ( స నుండి ) దీర్ఘ స్వరములు పాడుతూ క్రమముగా

ఆరోహణ చివరి వరకు పాడిన అది విస్తీర్ణ అలంకారము.

సా రీ గా మా పా దా నీ సా

17

హ్రస్వైఃస్వరైః సనిష్కర్షోద్విర్ద్విరుక్తైర్నిరంతరైః

త్రిశ్చతుర్వాస్వరోచ్చారేగాత్రవర్ణమిమంవిదుః

ఎడము లేకుండా రెండు రెండు హ్రస్వ స్వరములు పాడినపుడు ( జంటలుగా )నిష్కర్షాలంకారము.

సస రిరి గగ మమ పప దద నిని

3 సార్లు 4 సార్లు పాడినపుడు కూడా నిష్కర్ష అలంకారమనే చెప్పుదురు.

ససస రిరిరి గగగ మమమ పపప దదద నినిని

సససస రిరిరిరి గగగగ మమమమ పపపప దదదద నినినిని

18

నిష్కర్షస్త్యైవభేదౌద్వౌకేచిదేతౌబభాషిరే

ప్లుతం హ్రస్వం ప్లుతం హ్రస్వంప్లుతం హ్రస్వం ప్లుతస్వరమ్

షడ్జము 3 సార్లు రిషభము 1 సారి గాంధారము 3 సార్లు మధ్యమము 1 సారి

పంచమము 3 సార్లు దైవతము 1 సారి నిషాదము 3 సార్లు . ఈ విధముగా ఆరోహణ పాడిన

అది బిందువు అను అలంకారము.

సససరి గగగమ పపపద నినిని

19

కుర్వన్ క్రమాద్యదాఆరోహేత్తదాబిందురయంమతః

ఏకాంతరస్వరారోహమాహురభ్యుచ్చయంబుధాః

ఒకటి తప్పించి ఒకటిగా స్వరములను ఆరోహణములో పాడినపుడు అది అభ్యుచ్చయమను అలంకారమని పండితులు చెప్పిరి.

స గ ప ని.

20

యత్రైకోత్తరవృధ్ధాభిరావృత్తిభిరుదాహృతా

ఆరుహ్యంతేస్వరాఃప్రాహహసితంతంశివప్రియః

మొదటి స్వరము 1 సారి రెండవ స్వరము 2 సార్లు మూడవ స్వరము 3 సార్లు నాలుగవ స్వరము 4 సార్లు అయిదవ స్వరము 5 సార్లు ఆరవ స్వరము 6 సార్లు ఏడవ స్వరము 7 సార్లు ఈ విధముగా ఆరోహించిన అది హసితము అను అలంకారమని శివప్రియుడు చెప్పెను.

స రిరి. గగగ మమమమ పపపపప దదదదదద నినినినినినిని

                      తరువాతి పేజీ 6.2