Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.7

Wikibooks నుండి

అధి క్రమాదస్తిలోష్టః స్వరస్తావతిథోభవేత్ క్రమాంతిమత్సరాత్పూర్వోలబ్దత్యాగాదిపూర్వవత్

చివరి స్వరము కంటె ముందు స్వరము అనునాదమున ధ్వనించును. తరువాతి స్వరము ధ్వని లబ్ధత్యాగమగును. ( వినిపించదు )

71

తానస్వరమితోర్ధ్వాధః పంక్తిగాంత్యాంకమిశ్రణాత్ ఏకస్వరాదితానానాంసంఖ్యాసంజాయతేక్రమాత్

తానస్వర పరిమితములైన పైన కింద పంక్తులను పొందిన తరువాత చివరి అంకెల కలయిక వలన అనేక స్వరాదితానముల సంఖ్య క్రమముగా ఏర్పడును

72-75

అథాత్రశుధ్ధతానానాం నామానివ్యాహరామహే అగ్నిష్టోమోఅత్యగ్నిష్టోమోవాజపేయశ్చషోడశీ వుండరీకోఅశ్వమేధశ్చరాజసూయస్తతః పరః ఇతిస్యుః షడ్జహీనానాం సప్తనామాన్యనుక్రమాత్ స్విష్టక్రుధ్ధహుసౌవర్ణో గోసవశ్చమహావ్రతః విశ్వజిహ్రబ్రహ్మయజ్ఞశ్చ ప్రజాపత్యస్తుసప్తమః క్రమాదృషభహీనానాంతానానామభిధాఇమాః అశ్వక్రాంతోరధక్రాంతోవిష్ణుక్రాంతస్తతఃపరమ్

76

సూర్యక్రాంతో గజక్రాంతో వలభిన్నాగపక్షకః ఇతిపంచమహీనానాంసజ్ఞాః సప్తక్రమాన్మతః

తరువాత శుధ్ధతానముల పేర్లు చెప్పబడినవి.షడ్జము ( స స్వరము ) లేకుండా పాడే తానములు అగ్నిష్టోమము , అత్యగ్నిష్టోమము, షోడశీ, పుండరీకము ,అశ్వమేధము , వాజపేయము, రాజసూయము అని 7 . రిషభ హీనములు ( రి స్వరము లేనివి ) స్విష్టకృత్, బహుసౌవర్ణము , గోసవము , మహావ్రతము , విశ్వజిత్తు , బ్రహ్మయజ్ఞము , ప్రజాపత్యము . ప అక్షరము లేనివి అశ్వక్రాంతము , రధక్రాంతము , విష్ణుక్రాంతము , సూర్యక్రాంతము , గజక్రాంతము , వలభిత్తు , నాగపక్షకము.

77

చాతుర్మాస్యోఅథ సంస్థా ఆఖ్యః శస్త్రశ్చోకథశ్చతుర్థకః

సౌత్రామణీతథాచిత్రాసప్తమస్తూద్భిద్వాయః

చాతుర్మాస్యము , సంస్థ శస్త్రము , ఉక్దము సౌత్రామణి చిత్ర ఉద్భిత్తు అను 7 నిషాదహీనములైన తానముల పేర్లు.

ఇవి షడ్జగ్రామ తానములు 28

78-79

సంజ్ఞానిషాదహీనానాం షాడవానామిమాః క్రమాన్ని సావిత్రీ చార్ధసావిత్రీసర్వతోభద్ర సంజ్ఞగః ఆదిత్యానామయనశ్చ గవామయననామకః సర్పాణామనయః షడ్జః సప్తమః కౌణపాయనః నామానిషడ్జహీనానాం తానానామితిమేనిరే

సావిత్రి,అర్ధసావిత్రి,సర్వతోభద్రము,ఆదిత్యాయనము,గోఅయనము,సర్పాయనము,కౌకాసాయనము అను 7 షడ్జహీనములైన తానముల పేర్లని బుధులు తలచిరి.