Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.6

Wikibooks నుండి

60-61

నవత్రింశద్యుయనీతి జ్ఞానోపాయోఅత్రకధ్యతే

అంకానేకాదిసప్తంతానూర్ధ్వమూర్ధ్వంలిఖేత్క్రమాత్

హతేపూర్వేణపూర్వేణ తేషుచాంకేపరేపరే

ఏకస్వరాదిసంఖ్యాస్యాత్క్రమేణ ప్రతిమూర్ఛనమ్

ఇట పరిజ్ఞానోపాయము చెప్పబడినది. ( కీ సొల్యూషన్ ) వివరణా సూత్రం. 1 నుంచి 7 వరకు

అంకెలను క్రమంగా రాయాలి. వాటిలో పూర్వపూర్వము ( ఒక దాని కంటె ముందు సంఖ్య ) అంకెతో పరపరము ( తరువాత తరువాతి సంఖ్య ) గుణింపబడగా ప్రతి మూర్ఛన యందు ఏక స్వర , ద్విస్వరములైన మూర్ఛనల సంఖ్య వచ్చును.1 చే 2 గుణింపగా 2 మాత్రమే. 2 చే 3 గుణించిన 6 .6 చే 4 గుణింపగా 24 అగును. 24 ను 5 చే గుణించగా 120 . 6 చే 120 ని గుణించగా 720 అగును. 7 చే 720 గుణించిన 5040 అగును.

62-64

క్రమంన్యస్యస్వరః స్థాప్యః పూర్వః పూర్వః పరాదధః

సచేదుపరితత్పూర్వః పురస్తూపరివర్తనః

మూలక్రమక్రమాత్పుష్ఠేశేషాః ప్రస్తారఈదృశః

సప్తాద్యేకాంతకోష్ఠానామధోఅధః సప్తపంక్తయః

తాస్వాధ్యాయామాద్యకోష్ఠేలిఖేదేకం పరేసుఖమ్

వేద్యతానస్వరమితాన్న్యస్యేత్తేష్వేదలోష్టకాన్

స్వరముల వరుసక్రమాన్ని రాసుకొని పూర్వ పూర్వ స్వరము కింద పరస్వరమును రాసి స్థాపింపవలెను. ఆ పూర్వస్వరము పైస్వరమును చేరినయెడల అప్పుడు దాని పూర్వ స్వరమును రాయదగును. ఇట్లు నిషాదము ప్రారంభించి షడ్జ పర్యంతము పాడవలెను. మిగిలిన స్వరములు కూడ ఈ విధముగానే. మూలక్రమమును బట్టి పూర్వస్థానములయందు ఉంచదగును. 7 స్వరములు మొదట రాసి అది 1 స్వరముగా వచ్చువరకు రాయవలెను. పై పంక్తులు శూన్యమైనపుడు సున్న రాయవలెను. తాన స్వరముల పరిమితి వరకు మనము దీనిని సాధన చేయవచ్చును.

65

ప్రాక్పంత్యంత్యాంక సంయోగమూర్థ్వాధః స్థితపంక్తిషు

శూన్యాదధోలిఖేదేకం నించాధోఅధః స్వ కోష్ఠకాన్

మొదటి పంక్తి యందలి అంకెల కూడికను పైన కింద వున్న పంక్తుల యందు రాయవలెను.

0 కింద పంక్తిలో 1 వేయవలెను. 6 కోశములు గల పంక్తిలో చివరి అంకెగా 1 వేయవలెను. 2 వ పంక్తి 1 వ కోశమందు 1 వ పంక్తి చివరి సంఖ్యలు (1+1) 2 వేయవలెను. దాని కింద కోశమున (బ్రాకెట్ )2 అంకెకు రెట్టింపు చేసి 4 వేయవలెను. 3 వ కోశంలో 1 పంక్తి కి చివరి అంకెల కూడిక

6 ను వేయవలెను. దాని కింద పంక్తిలో 6 ను రెట్టించి 12 అంకె వేయవలెను. దాని కింద 18.2 వ పంక్తి 4 వ కోశంలో మొదటి 3 పంక్తుల చివరి అంకెలు ( 1+1+1+4+18) కలిపి 24 వేయవలెను.

దాని కింద 2 వ కోశము పై అంకెకు రెట్టింపు 48 వేయవలెను. దానికింద 3 వ కోశమున దానికి మూడు రెట్ల సంఖ్య 72 . దాని కింద 96 . 2 వ పంక్తి 5 వ కోశం మొదటి పంక్తులు 5 . చివరి అంకెలు ( 1+1+4+96) 120 .

ఇవి భౌతిక శాస్త్ర గణితంలో శబ్ద పౌనఃపున్యానికి సంబంధించిన లెక్కలు . ఈ లెక్కలన్నీ మనం అంకెల రూపంలో గణితంలోనూ ఆంగ్ల మాధ్యమంలో భౌతిక శాస్త్రంలోనూ ఇప్పటి కాలంలో నేర్చుకుంటున్నాము. 14 వ శతాబ్దంలో సంగీత శాస్త్రాన్ని అవుపోసన పట్టి సంస్కృత భాషలో ప్రామాణిక గ్రంథాన్ని రాయగలిగిన కవిపండితుడు రాసిన గ్రంధమిది. ఆ కాలంలో వారి విజ్ఞానానికి , సముపార్జించిన జ్ఞానాన్ని ప్రామాణిక పధ్ధతులలో వివరణకూ దృష్టాంతమిది.

రి ని
1 0 0 0 0 0 0
1 2 6 24 120 720
4 12 48 240 1440
18 72 360 2160
96 480 2880
600 4520

ఇది సంగీత స్వరరచనా పధ్ధతి . ఈ పధ్ధతిలో అంకెలకు బదులుగా స్వరాలను స్వరస్థానాలను నిలిపి పాడినపుడు మనమా స్వరరచనా పధ్ధతిని అర్ధం. చేసుకుని కొత్త పాటను సృష్టించడం వీలవుతుంది.

66-67

కోసష్టంఖ్యాగుణం న్యస్యేత్ఖండమేరురయంమతః స్వరాన్మూలక్రమస్యాంత్యాత్పూర్వం యావతిథః స్వరః ఉద్దిష్టాంత్యస్తావతిథేకోష్టేఅధౌలోష్టకంక్షిపేత్ లోష్టచాలనమంత్యాత్స్యాత్త్యక్త్వాలబ్ధంక్రమౌభవేత్

కింద స్వరములుగా అవరోహణ స్వరములను కోశములందలి అంకెలను కోశములతో గుణించి ఆ సంఖ్యను ఒక పక్కకు వుంచవలెను.ఇది ఖండమేరువని ఎంచబడినది. ( వీణ తీగలు బిగించబడిన మెటేలభాగము) . కోశమునకు చివరి సంఖ్యను ఈ సంఖ్యతో గుణింపగా వచ్చిన సంఖ్యను కింది కోపపు స్ంఖ్యగా భావించవలెను.

68

లోష్టాక్రాంతాంకసంయోగాదుద్దిష్ట్యస్యమితిరభవేత్ యైరవైర్నష్టసంఖ్యాస్యాన్మౌలైకాంకసమన్వితైః

అంత్యము నుండి స్వరము ముందు స్వరస్థానమునకు ఊపబడును. ఈ ఊపు గమకమై స్వరస్థానముల ధ్వనిని మార్చును. లబ్దమును విడిచి క్రమముండును. ఊపు ఎన్ని స్వరములను ఆక్రమించునో ఆ అంకెల కలయిక వలన మిగిలిన స్వరముల సంఖ్య ఏర్పడును. మూలసంఖ్యతో కూడిన ఏక సంఖ్యలేర్పడినపుడు నష్టసంఖ్యకు లోష్టమును వుంచవలెను.

69

తేషులోష్టంక్షిపేన్మూలే లోష్టస్థానమితంభవేత్ నష్టతానస్వరస్థానం తతోయావతిథేపదే

మూలమున నష్టతాన స్వరస్థానము లోష్టస్థాన పరిమితమగును. మేరువు మెట్లలో స్వరస్థానముల సంఖ్యను వేరొక స్వరస్థానము ధ్వని వినబడునట్లుగా ఊపినపుడు కోశము లోపలి స్వరస్థానముల అనునాదము మాత్రమే ధ్వనించును. అనంతరము ఎంత సంఖ్య కల కోశమున కింద క్రమములో సంఖ్య వుండునో స్వరము ఆ సంఖ్య కలది అగును.

70

అధి క్రమాదస్తిలోష్టః స్వరస్తావతిథోభవేత్ క్రమాంతిమత్సరాత్పూర్వోలబ్దత్యాగాదిపూర్వవత్

చివరి స్వరము కంటె ముందు స్వరము అనునాదమున ధ్వనించును. తరువాతి స్వరము ధ్వని లబ్ధత్యాగమగును. ( వినిపించదు )