సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5.3
30-31
షడ్జగ్రామేపృథక్తానా ఏకవింశతిరౌడువాః
రిధాభ్యాం ద్విశ్రుతిభ్యాంద మధ్యమగ్రామస్తుతే
హీనాశ్చతుర్దశైవస్యుః పంచత్రింశత్తుతేయుతాః
[1]సర్వేచతురశీతిః స్యుర్మిలితాః షాడవౌడువాః
ఒక మూర్ఛనకు 7 స్వరములు . షాడవములు ( ఒక స్వరము వదిలి పాడిన తానములు ) . 7 . రెండు శ్రుతులు గాంధార నిషాదములు ( గ , ని ) వదిలేసి పాడినపుడు సప్తతానములు అంటే 7 తానములు
రిషభ పంచమ హీనములైనపుడు ( రి , ప స్వరములు వదిలేసి పాడినపుడు 7 తానములు మొత్తము కలిపి
షడ్జ గ్రామమున తానములు 21 . మధ్యమ గ్రామంలో 7 మూర్ఛనలు . రిషభ దైవత హీనములైనపుడు ( రి గ శ్రుతులను వదిలి పాడినపుడు ఔడవములై ( 5 స్వరములు కలవై ) 7 తానములగును. గాంధార నిషాదములు వర్జించినపుడు 7 తానములు , కలిసి ఔడవ తానములు అనగా 5 స్వరములు కలిగిన తానములు 7 కలిసి మొత్తము ఔడవతానములు 14 . మొత్తముగా ఔడవతానములు 35 . షాడవ ఔడవ తానములు కలిసి 84 తానములు.
32 అసంపూర్ణాశ్చసంపూర్ణా వ్యుత్క్రమోచ్చారితస్వరాః మూర్ఛనాః కూటతానాః స్యుస్తత్సంఖ్యామభిధ్మహే
అసంపూర్ణములు ( 7 స్వరములు పూర్తిగా లేనివి ) సంపూర్ణములు ( ఆరోహణ , అవరోహణలలో 7 స్వరములు కలిగినవి ) అయిన మూర్ఛనలు వ్యుత్క్రమముచేత reverse తిరగవేసి వుచ్చరించి పాడినపుడు కూటతానములగును.
33 పూర్ణాః పంచసహస్రాణిచత్వారిం శద్యుతానితు ఏకైకస్యాం మూర్ఛనాయాం కూటతానాః సహక్రమైః
ఒక్కొక్క మూర్ఛనయందు పూర్ణములు , అసంపూర్ణములైన కూటతానములు కలిసి మొత్తము 5040 అవుతాయి.
34 షట్పంచాశన్మూర్ఛనాస్థాః పూర్ణాః కూటాస్తుయోజితాః లక్షద్వయం సహస్రాణిద్వ్యాశీతిర్ద్వేశతేతథా 56మూర్ఛనలయందున్న కూటతానములను కలిసి కూటతానములు మొత్తము 282240 అగును. 35-36 చత్వారింశచ్చసంఖ్యాతా అథాపూర్ణాన్ ప్రచక్ష్మహే ఏకైకాంత్యాంత్యవిరహాద్భేదాః షట్ షట్స్వరాదయః ఏకస్వరోఅత్ర నిర్భేదోఅప్యుక్తోనష్టాదిసిధ్ధయే క్రమా అకూటతానత్వేఅప్యుక్తాస్తేషూపయోగినః
తరువాత అసంపూర్ణములైన కూటతానములు చెప్పబడును. సరిగమపదని లో కడపటి లేదా చివరి స్వరమును వదిలిన సరిగమపద అగును . అట్టి ఎడబాటుతో అవి ఆరు భేదములు . సరిగమప , సరిగమ , సరిగ , సరి , స . ఇవి వ్యుత్క్రమమున 6 అగును. స , సని , సనిద , సనిదప , సనిదపమ , సనిదపమగ , సనిదపమగరి . చివరి రిషభము వర్జితమగును. ఇవి పూర్తి కూటతానములు కావు . కాని కూటతానములందు వుపయోగింపబడునవి కాన చెప్పబడినవి.
37
స్యుఃషాడవానాంవింశత్యాసహసప్తసతానితు
ఔడువానాంతు వింశత్యాసహితంశతమిష్యతే
షాడవములైన క్రమముల సంఖ్య 720 . ఔడువములైన క్రమముల సంఖ్య 120.
38-39
చతుః స్వరాణాంకూటానాం చతుర్వింశతిరీరితాః
త్రిస్వరాః షడ్ ద్వి స్వరౌ ద్వావేకస్త్వేకస్వరోమతః
ఆర్చికోగాథికశ్చాదసామికో అథ స్వరాంతరః
ఏకస్వరాదితానానాం చతుర్ణామభిధాఇమాః
చతుస్వరములైన కూటతానముల సంఖ్య 24 . త్రిస్వరముల ప్రస్తారమున 6 భేదములు , ద్వి స్వర ప్రస్తారమున 2 భేదములు , ఏక స్వరముల 1 తానములు నాలుగు ఆర్చికము , గాధికము , సామికము , స్వరాంతరము అను పేర్లతో పిలువబడును.